కృష్ణచైతన్య దర్శకత్వంలో నారా రోహిత్
కృష్ణచైతన్య దర్శకత్వంలో నారా రోహిత్
Published Mon, Sep 2 2013 1:28 AM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM
నారా రోహిత్ హీరోగా మూవీ మిల్స్ అండ్ సినిమా 5 సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గీత రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణచైతన్య ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విశాఖాసింగ్, నందినీరాయ్ కథానాయికలు.
ఈ నెల 25న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సహనిర్మాత సందీప్ కొరిటాల మాట్లాడుతూ - ‘‘యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. అద్భుతమైన కథతో రూపొందిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది.
కథానుసారం భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం’’ అని చెప్పారు. నాజర్, బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అరవిందన్ పి.గాంధీ, సంగీతం: సన్నీ ఎమ్.ఆర్., ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్.
Advertisement
Advertisement