'ఎంఎస్తో అవే నా చివరి మాటలు' | LB Sriram reacts MS Narayana death news | Sakshi
Sakshi News home page

'ఎంఎస్తో అవే నా చివరి మాటలు'

Published Fri, Jan 23 2015 12:55 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

'ఎంఎస్తో అవే నా చివరి మాటలు'

'ఎంఎస్తో అవే నా చివరి మాటలు'

హైదరాబాద్ : ఎంఎస్ నారాయణ గురించి ఎంత చెప్పినా తనివి తీరదని హాస్యనటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్ అన్నారు. ఆయన శుక్రవారం కిమ్స్లో ఎంఎస్ నారాయణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ తామిద్దరం కలిసి అనేక సినిమాల్లో నటించామన్నారు. ఇటీవలే ఎంఎస్ నారాయణ తనకు ఫోన్ చేసి అరగంట మాట్లాడారన్నారు. ఆయన ఇటీవల తాను నటించిన ఓ సినిమాలో నటించికపోయినా...తన నటనను అభినందించారన్నారు.

తన సినిమా ఇంకా విడుదల కాలేదని, అయితే ప్రివ్యూ చూసిన ఎంఎస్ నారాయణ... ఉండబట్టలేక తనకు ఫోన్ చేశానని చెప్పారన్నారు. 'ఎల్బీగారు మీ సినిమా చూశాను. అద్భుతంగా నటించారు. మీరు ఏడ్వకుండా..చూసేవారిని ఏడ్పించారని' ఎంఎస్ తనతో అన్నారని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అదే ఆయనతో తాను చివరిగా మాట్లాడటం అని తెలిపారు. తెల్లారి లేస్తే ఎంతోమందిని నవ్వించే కమెడియన్లకు అదే టానిక్ అని... అందర్ని నవ్వేంచేవాళ్లు భౌతికంగా లేకున్నా వందేళ్లు బతకాలని ఎల్బీ శ్రీరామ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement