ఇక ఎంత దూరం తొక్కినా నొప్పి లేని సైక్లింగ్‌ | No More Pain, Free Cycling No Matter How Far You Ride | Sakshi
Sakshi News home page

ఇక ఎంత దూరం తొక్కినా నొప్పి లేని సైక్లింగ్‌

Published Wed, Jun 12 2024 10:30 AM | Last Updated on Wed, Jun 12 2024 12:04 PM

No more pain free cycling no matter how far you ride

‘వెబ్స్‌ రైడర్‌’.. ప్రపంచంలోని మొట్టమొదటి వర్చువల్ యాక్సిస్ సైకిల్ సీటు. ఇది మరింత సౌకర్యవంతమైన రైడ్ కోసం ఉపయోగపడుతుంది.  సైకిల్‌కు గల ఈ సీటుపై కూర్చుని పెడల్‌ తొక్కుతున్నప్పుడు శరీర బరువును ఇరువైపులా సమానంగా పంపిణీ చేసి, దానిని తొక్కుతున్న వ్యక్తి శరీరంలోని సీటు దగ్గర ఏమాత్రం నొప్పి  కలుగకుండా చూస్తుంది. 

ఆస్ట్రేలియన్ ఇంజనీర్ రాబిన్ మకాన్ మరింత సౌకర్యవంతమైన సైకిల్ సీటును రూపొందించేందుకు ప్రయత్నిస్తుండేవాడు. మానవ శరీరంలోని స్వాభావిక నొప్పి పాయింట్లను సైకిల్‌కు ఉన్న కుషనింగ్‌ సీటు భర్తీ చేయలేదనే విషయాన్ని గమనించిన ఆయన శరీర బరువును ఇరువైపులా సమానంగా పంపిణీ చేసే సైకిల్ సీటును రూపొందించే దిశగా ముందుకు సాగాడు.

తాను రూపొందించిన నమూనాను ‘ఇన్వెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనే సంస్థకు తెలియజేశాడు. ఇది నూతన ఆవిష్కర్తలకు మద్దతును అందించే స్వచ్ఛంద సంస్థ. అక్కడ రాబిన్ మకాన్ పారిశ్రామిక డిజైనర్ ఫిలిప్ గుయిచార్డ్‌ను కలుసుకున్నాడు. వీరిద్దరూ ఈ రెండేళ్ల పాటు కష్టపడి ఈ డిజైన్‌ను మరింతగా మెరుగుపరిచారు. ప్రముఖ ఇంజినీరింగ్‌ సంస్థ విజిల్‌ సహకారంతో వారు రూపొందించిన ‘వెబ్స్‌ రైడర్‌’ మార్కెట్‌లోకి తీసుకువచ్చారు.

ఈ వెబ్‌రైడర్‌ స్ప్లిట్‌ సైకిల్‌ సీటు వినియోగదారులకు అత్యంత సౌకర్యవంతమైన సైకిల్‌ రైడ్‌ అనుభవాన్ని అందిస్తుంది. ఈ సీటుపై కూర్చుని సైకిల్‌ తొక్కుతున్నప్పుడు రెండు కాళ్లు సమానంగా కలిలేందుకు వీలు కల్పిస్తుంది. సీటు ఎముకల నుండి తొడ ఎముకలకు ఒత్తిడిని బదిలీ చేసి, కాళ్లకు నొప్పి కలుగుకుండా చూస్తుందని రాబిన్ మకాన్ తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement