No more
-
ఎమ్మెల్యే గురుప్రీత్ గోగిని కాల్చి చంపిన దుండగులు
-
ఇక ఎంత దూరం తొక్కినా నొప్పి లేని సైక్లింగ్
‘వెబ్స్ రైడర్’.. ప్రపంచంలోని మొట్టమొదటి వర్చువల్ యాక్సిస్ సైకిల్ సీటు. ఇది మరింత సౌకర్యవంతమైన రైడ్ కోసం ఉపయోగపడుతుంది. సైకిల్‌కు గల ఈ సీటుపై కూర్చుని పెడల్ తొక్కుతున్నప్పుడు శరీర బరువును ఇరువైపులా సమానంగా పంపిణీ చేసి, దానిని తొక్కుతున్న వ్యక్తి శరీరంలోని సీటు దగ్గర ఏమాత్రం నొప్పి కలుగకుండా చూస్తుంది. ఆస్ట్రేలియన్ ఇంజనీర్ రాబిన్ మకాన్ మరింత సౌకర్యవంతమైన సైకిల్ సీటును రూపొందించేందుకు ప్రయత్నిస్తుండేవాడు. మానవ శరీరంలోని స్వాభావిక నొప్పి పాయింట్లను సైకిల్‌కు ఉన్న కుషనింగ్ సీటు భర్తీ చేయలేదనే విషయాన్ని గమనించిన ఆయన శరీర బరువును ఇరువైపులా సమానంగా పంపిణీ చేసే సైకిల్ సీటును రూపొందించే దిశగా ముందుకు సాగాడు.తాను రూపొందించిన నమూనాను ‘ఇన్వెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనే సంస్థకు తెలియజేశాడు. ఇది నూతన ఆవిష్కర్తలకు మద్దతును అందించే స్వచ్ఛంద సంస్థ. అక్కడ రాబిన్ మకాన్ పారిశ్రామిక డిజైనర్ ఫిలిప్ గుయిచార్డ్ను కలుసుకున్నాడు. వీరిద్దరూ ఈ రెండేళ్ల పాటు కష్టపడి ఈ డిజైన్‌ను మరింతగా మెరుగుపరిచారు. ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ విజిల్ సహకారంతో వారు రూపొందించిన ‘వెబ్స్ రైడర్’ మార్కెట్లోకి తీసుకువచ్చారు.ఈ వెబ్రైడర్ స్ప్లిట్ సైకిల్ సీటు వినియోగదారులకు అత్యంత సౌకర్యవంతమైన సైకిల్ రైడ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ సీటుపై కూర్చుని సైకిల్ తొక్కుతున్నప్పుడు రెండు కాళ్లు సమానంగా కలిలేందుకు వీలు కల్పిస్తుంది. సీటు ఎముకల నుండి తొడ ఎముకలకు ఒత్తిడిని బదిలీ చేసి, కాళ్లకు నొప్పి కలుగుకుండా చూస్తుందని రాబిన్ మకాన్ తెలిపారు. This revolutionaly bike seat design.[🎞️ AtaraxyBSC]pic.twitter.com/cLOV3MWmuw— Massimo (@Rainmaker1973) June 11, 2024 -
మనసున్న మాస్ హీరో
తమిళ ప్రేక్షకులకు విజయ్‌కాంత్ ఓ ‘పురట్చి కలైజ్ఞర్’ (విప్లవ కళాకారుడు)... నల్ల ఎంజీఆర్... అభిమానులకు మంచి మాస్ హీరో... కెప్టెన్ ... ఇవే కాదు.. ధైర్యం, తెగువకు చిరునామా అనే పేరు కూడా ఉంది.. మంచి మానవతావాది కూడా. ఇలా ఎన్నో రకాల రూపాల్లో నటుడిగా, వ్యక్తిగా తమిళ ప్రజల మనసుల్లో ‘మనసున్న మాస్ హీరో’గా చెరగని ముద్ర వేసుకున్న విజయ్‌కాంత్ ఇక లేరు. విజయ్‌కాంత్ తమిళంలో తప్ప ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. కానీ ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ‘ఛాలెంజ్ రౌడీ, రౌడీలకు రౌడీ, పోలీస్ అధికారం, కెప్టెన్, కెప్టెన్ ప్రభాకరన్, మా బావ బంగారం, నేటి రాక్షసులు, సింధూరపువ్వు, అమ్మను చూడాలి, బొబ్బిలి రాయుడు, మరణ మృదంగం’.. ఇలా ఆయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అను వాదమై, ఇక్కడి ప్రేక్షకులకు విజయ్‌కాంత్‌ని దగ్గర చేశాయి. తెలుగు హీరోలు పలువురు విజయ్‌కాంత్ తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్స్ కొట్టారు. చిరంజీవి కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఠాగూర్’ (2003) విజయ్‌కాంత్ హీరోగా వచ్చిన తమిళ సినిమా ‘రమణ’ (2002)కు రీమేక్. అలాగే విజయ్‌కాంత్ హీరోగా నటించిన ‘సట్టమ్ ఒరు ఇరుట్టరై’ (1981), ‘వెట్రి’ (1984), ‘అమ్మన్ కోయిల్ కిళక్కాలే’ (1986) సినిమాలు తెలుగులో ‘చట్టానికి కళ్ళు లేవు’ (1981) ‘దేవాంతకుడు’ (1984), ‘ఖైదీ నంబరు 786’ (1988)గా రీమేక్ కాగా, ఈ చిత్రాల్లో చిరంజీవి హీరోగా నటించారు. విజయ్‌కాంత్ ‘చిన్న గౌండర్’ (1992) తెలుగు రీమేక్ ‘చినరాయుడు’ (1992)లో వెంకటేశ్, ‘నానే రాజా నానే మంత్రి’ (1985) రీమేక్ ‘నేనే రాజు నేనే మంత్రి (1987)’, ‘ఎన్ పురుషన్దాన్ ఎనక్కు మట్టుమ్దాన్’ (1989) రీమేక్ ‘నా మొగుడు నాకే సొంతం’ (1989) చిత్రాల్లో మోహన్‌బాబు హీరోగా నటించారు. విజయ్‌కాంత్ ‘వానత్తై పోల’ (2000) సినిమాను తెలుగులో ‘మా అన్నయ్య’గా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు రాజశేఖర్. కాగా కొందరు తెలుగు హీరోల సినిమాల తమిళ రీమేక్‌లో నటించి హిట్స్ అందుకున్నారు విజయ్‌కాంత్. బాలకృష్ణ హీరోగా నటించిన ‘భానుమతిగారి మొగుడు’ (1987) సినిమా తమిళ రీమేక్ ‘తెర్కత్తి కళ్లన్’ (1988)లో, ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘సింహాద్రి’ (2003) రీమేక్ ‘గజేంద్ర’ (2004)లో విజయ్‌కాంత్ హీరోగా నటించి, బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. ఇలా ఆయన కెరీర్లో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. విజయ్‌కాంత్ అసలు పేరు నారాయణన్ విజయ్‌రాజ్ అళగర్సామి. కేఎన్ అళగర్సామి, ఆండాళ్ అళగర్సామి దంపతులకు 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారాయన. కాగా అళగర్సామి కుటుంబానికి తెలుగు మూలాలు ఉన్నాయి. పదో తరగతి వరకు చదివిన విజయ్‌రాజ్ తండ్రికి సహాయంగా రైస్ మిల్లు బాధ్యతలను చూసుకునేవాడు. అయితే చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో 1979లో చెన్నై చేరుకున్నాడు విజయ్‌రాజ్. సినీ అవకాశాల కోసం ప్రయత్నించిన ఆయనకు ఎంఏ రాజా దర్శకత్వం వహించిన ‘ఇనిక్కుమ్ ఇళమై’ (1979) చిత్రంలో ప్రతినాయకుడిగా తొలి అవకాశం వచ్చింది. ఆ చిత్ర దర్శక–నిర్మాత ఎంఏ కాజానే విజయ్‌రాజ్ పేరుని విజయ్‌కాంత్‌గా మార్చారు. ‘ఇనిక్కుమ్ ఇళమై’ తర్వాత ‘అగల్ విళక్కు, నీరోట్టం, చామంతి పూ’ తదితర చిత్రాల్లో ఆయన నటించినా ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. ఆ తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరత్తు ఇడి ముళక్కమ్’ (1980) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్‌కాంత్. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో నటించిన ద్వితీయ చిత్రం ‘చట్టం ఒరు ఇరుట్టరై’ (1981) సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు విజయ్‌కాంత్‌కు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. హీరోగా చాలా బిజీ అయిపోవడంతో రోజుకు మూడు షిఫ్టులుగా పని చేశారాయన. ఎంత బిజీ హీరో అంటే 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం. విజయ్‌కాంత్ సినిమాల్లో ఎక్కువగా సామాజిక నేపథ్యం ఉంటుంది. వీరోచితం, విప్లవ భావాలు, ప్రజలను ఉత్తేజపరచే అంశాలు ఉంటాయి. అలాగే ఆయన యాక్షన్ కు ప్రత్యేక అభిమానులున్నారు. ‘అమ్మన్ కోయిల్ కిళక్కాలే, వైదేహి కాత్తిరిందాళ్, చిన్న గౌండర్, వానతై ్త పోల’ వంటి పలు కుటుంబ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రాల్లోనూ తనదైన నటనతో అలరించారాయన. పోలీస్ పాత్రలకు వన్నె తెచ్చిన విజయ్‌కాంత్‌కు ‘కెప్టెన్ ప్రభాకరన్’ సంచలన హీరోగా పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత ఫ్యాన్స్ ఆయన్ను ‘కెప్టెన్’ అని ప్రేమగా పిల వడం మొదలు పెట్టారు. కొందరు ఫ్యాన్స్ విప్లవ కళా కారుడు అంటూ గౌరవంతో పిలుచుకుంటారు. అయితే విజయ్‌కాంత్ సినీ కెరీర్ అంత సాఫీగా సాగలేదు. ఆదిలో ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొన్నారు. విజయ్‌కాంత్ నలుపు రంగులో ఉండటంతో మొదట్లో పలువురు ప్రముఖ నటీమణులు ఆయన సరసన నటించడానికి నిరాకరించారట. అయినా తనను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌కాంత్. అటు సందేశాత్మక చిత్రాలు, ఇటు వాణిజ్య సినిమాలు ఏకకాలంలో చేశారాయన. సినిమా ప్రారంభంలో కాకుండా విడుదల ముందు పారితోషికాన్ని అందుకుని నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఒకవేళ ఆ సినిమా నిర్మాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకునేవారు కాదట. ఎంజీఆర్ అభిమాని అయిన విజయ్‌కాంత్.. తన అభిమాన హీరోలాగా ప్రజల ఆకలి తీర్చేవారు. ఆయన కార్యాలయంలో నిత్యాన్నదానం చేస్తూ.. కరుప్పు (నలుపు) ఎంజీఆర్‌గా కొనియాడబడ్డారు విజయ్‌కాంత్. ఆర్కే సెల్వమణి దర్శకత్వం వహించిన ‘కెప్టెన్ ప్రభాకరన్ ’ విజయ్‌కాంత్‌కు నూరవ చిత్రం. ఆయన కెరీర్లో 150కిపైగా సినిమాల్లో నటిస్తే.. అందులో 20కిపైగా పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సినిమాలే ఉండడం విశేషం. చివరగా తన కొడుకు షణ్ముగ పాండియన్ ను హీరోగా పరిచయం చేసిన ‘సహాబ్దం’ (1993) చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారాయన. ‘విరుదగిరి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు విజయ్‌కాంత్. బావ ఎల్.కె. సుధీశ్‌తో కలిసి మూడు సినిమాలు నిర్మించారు విజయ్‌కాంత్. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడిగానూ విశేష సేవలందించారాయన. సినీ పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న విజయ్‌కాంత్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కూడా ఆయనకు మృతి పట్ల విచారం వ్యక్తం చేశాయి. విజయ్కాంత్కుభార్య ప్రేమలత, కుమారులు విజయ ప్రభాకరన్, షణ్ముగ పాండియన్ ఉన్నారు. -
నిర్మాత సుధాకర్ కన్నుమూత
నిర్మాత, కెమెరామేన్ మన్నం సుధాకర్ (62) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. మూడు నెలల క్రితం చెన్నైలోని స్వగృహంలో బాత్రూంలో ప్రమాదవశాత్తు పడటంతో తలలో తీవ్ర రక్తస్రావమైంది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన ఆ తర్వాత ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి ఆయన స్వస్థలం. ప్రముఖ కెమెరామేన్ వీయస్ఆర్ స్వామి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన సుధాకర్ ‘సితార, వారాలబ్బాయి, పుట్టినిల్లా మెట్టినిల్లా’ వంటి పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. మహాగణపతి ఫిలింస్ బ్యానర్ స్థాపించి ‘తారకరాముడు, నా మనసిస్తారా, వాలి, సేవకుడు, ఆక్రోశం’ వంటి సినిమాలు నిర్మించారు సుధాకర్. టంగుటూరు ప్రాంతం నుంచి పలువురిని సినీ రంగానికి పరిచయం చేశారాయన. సుధాకర్‌కి భార్య దేవరపల్లి లక్ష్మమ్మ, కుమారులు మన్నం హరీష్ బాబు, మన్నం సతీష్ బాబు ఉన్నారు. కాగా ఆయన కుమార్తె మన్నం స్వాతి గతంలోనే చనిపోయారు. కారుమంచిలో మన్నం సుధాకర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
900కుపైగా సినిమాల్లో నటన.. తొలి చిత్రానికే నంది అవార్డు
సాక్షి, హైదరాబాద్: కథానాయకుడిగా, సహాయ నటుడిగా, హాస్యనటుడిగా, కొన్ని చిత్రాల్లో ప్రతినాయకుడిగానూ నటించిన ‘ఆల్ రౌండర్’ చంద్రమోహన్ (82) ఇక లేరు. కొన్నాళ్లుగా ఆయన గుండె, కిడ్నీ సంబంధిత, మధుమేహం వ్యాధులతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 9.45కు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. తర్వాత ఆయన భౌతికకాయాన్నిఫిలింనగర్‌లోని స్వగృహానికి తీసుకెళ్లారు. అక్కడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు చంద్రమోహన్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, కుమార్తెలు మధుర మీనాక్షి, మాధవి ఉన్నారు. జలంధర ప్రముఖ రచయిత్రికాగా.. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలో ఉన్న మధుర మీనాక్షి వచ్చాక సోమవారం మధ్యాహ్నం చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన మేనల్లుడు, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. ‘రంగుల రాట్నం’తో మొదలై.. ఏపీలోని కృష్ణా జిల్లా పమిడిముక్కలలో మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు 1942 మే 23న జన్మించారు చంద్రమోహన్. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్ తమకు దగ్గరి బంధువు కావడంతో.. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చెన్నై వెళ్లారు. బీఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘రంగుల రాట్నం’(1966) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. హీరోగా సుమారు 175కుపైగా సినిమాలు చేశారు. మొత్తంగా తన 55 ఏళ్ల సినీ కెరీర్లో కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా ఇలా దాదాపు 900కుపైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. తనదైన నటనతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. విభిన్న పాత్రలతో.. ఎన్నో అవార్డులతో.. ‘సుఖదుఃఖాలు, కాలం మారింది, ఓ సీత కథ, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, పదహారేళ్ల వయసు, శంకరా భరణం’ వంటి క్లాసిక్ చిత్రాల్లో మెప్పించారు చంద్రమోహన్. ‘గంగ మంగ’, ‘లక్ష్మణ రేఖ’వంటి చిత్రాల్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. శ్రీకాంత్ హీరోగా నటించిన ‘కోతలరాయుడు’ (2022) తెలుగులో చంద్రమోహన్ చివరి చిత్రం. తొలిచిత్రం ‘రంగుల రాట్నం’కు నంది అవార్డు అందుకున్నారు. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు, సిరిసిరిమువ్వ’ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. -
చెస్ ఆడుతూ సీనియర్ క్రీడాకారుడి మృతి
హైదరాబాద్: చెస్ ఆడుతూ సీనియర్ క్రీడాకారుడు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్ర, శని, ఆదివారాల్లో స్లాన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలకు దాదాపు 15 రాష్ట్రాలకు చెందిన 700 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. కాగా శనివారం మధ్యాహ్నం అంబర్‌పేట, 6వ నెంబర్ సర్కిల్ సాయిమిత్ర ఎస్టేట్స్‌లో నివాసం ఉంటున్న సీనియర్ చెస్ క్రీడాకారులు వి.ఎస్.టి.సాయి (72) కూడా క్రీడను కొనసాగిస్తున్నారు. ఐదవ రౌండ్లో ఉండగా ఒక్కసారిగా గుండెలో నొప్పి వచ్చి పడిపోయాడు. హుటాహుటిన స్లాన్ సంస్థ సిబ్బంది, ఆడిటోరియం సెక్యూనిటీ అంబులెన్స్‌ను పిలిపించి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాయి మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈయనకు భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. ఎల్ఐసీలో అధికారిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. చెస్ అంటే ప్రాణంగా భావించేవారు. ఎక్కడ టోరీ్నలు జరిగినా తప్పకుండా హాజరయ్యేవారని చెస్ క్రీడాకారులు తెలియజేశారు. నగరానికి చెందిన పలువురు సీనియర్ చెస్ ప్లేయర్లు ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. -
నిర్మాత కన్నుమూత
కన్నడ నిర్మాత, పంపిణీదారుడు కేసీఎన్ మోహన్(61) ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. మోహన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కన్నడంలో అనేక సినిమాలను నిర్మించటం ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. కాగా ఏడాది క్రితం సోదరుడు కేసీఎన్ చంద్రశేఖర్ మృతి చెందారు. ఆ దుఃఖం నుంచి కుటుంబ సభ్యులు కోలుకుంటున్నారు. ఇంతలోనే మోహన్ మృతి చెందడంతో ఈ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. -
ఇక నో మోర్ పర్మిషన్.. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనపై పోలీసుల నిర్ణయం
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన సందర్భంగా నిన్న(ఆదివారం) పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ నిరసనకారుల్ని బలవంతంగా అదుపులోకి తీసుకుని 12 మందిపై కేసులు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు షాక్ ఇచ్చారు. ఇక నుంచి జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతుల కోసం గనుక వాళ్లు దరఖాస్తు చేసుకుంటే.. జంతర్ మంతర్ కాకుండా వేరే ఎక్కడైనా అనుమతులు ఇస్తామంటూ న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది. ‘‘వాళ్లు(రెజ్లర్లు) పోలీసుల అభ్యర్థనను పట్టించుకోకుండా పార్లమెంట్ మార్చ్‌ను చేపట్టి.. చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. అందుకే జంతర్ మంతర్ వద్ద వాళ్లు చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది!. రెజ్లర్లు గనుక భవిష్యత్తులో మళ్లీ నిరసనకు దరఖాస్తు చేస్తే.. జంతర్ మంతర్ కాకుండా అనువైన ప్రదేశంలో వారి నిరసనకు అనుమతిస్తాం అని డీసీపీ ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.. कुश्ती पहलवानों का धरना और प्रदर्शन निर्बाध तरीक़े से जंतर मंतर की सूचित जगह पर चल रहा था। कल, प्रदर्शकारियों ने तमाम आग्रह और अनुरोध के बावजूद कानून का उन्मादी रूप से उल्लंघन करा। अतः चल रहे धरने को समाप्त कर दिया गया है। — DCP New Delhi (@DCPNewDelhi) May 29, 2023 ఇదిలా ఉంటే.. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా భగ్గుమంది. అయితే.. రెజ్లర్లు అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల ద్వారా తమ విధులను చేయకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా నిరసనలో పాల్గొన్న రెజ్లర్లందరినీ ఈ కేసులో ప్రస్తావించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఈ నిరసనలు కొనసాగాయి. మొత్తం 38 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన కొనసాగింది. భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేదించారని, అతన్ని అరెస్ట్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. కానీ, రెజ్లర్లు మాత్రం బ్రిజ్‌ను అరెస్ట్ చేసే దాకా నిరసనలు ఆపమని చెబుతున్నారు. VIDEO | Security heightened at Jantar Mantar in Delhi ahead of the 'Mahila Samman Mahapanchayat' called by protesting wrestlers today. pic.twitter.com/rP0EXvLuwg — Press Trust of India (@PTI_News) May 28, 2023 Video Source: PTI News అవి మార్ఫింగ్ ఫొటోలు ‘‘అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావడం లేదు. మాకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’’.. అరెస్టు తర్వాత వ్యానులో వినేష్, సంగీత ఫొగాట్‌లు నవ్వుతున్నట్లు ఉన్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై రెజ్లర్ సాక్షి మాలిక్ పై విధంగా స్పందించారు. ఇదీ చదవండి: రాజదండం ఎవరి కోసం? -
ముగిసిన శరత్ కాలం..
సాగర సంగమం సంపూర్ణమవ్వాలంటే బాలుకు ఓ రఘుపతి కావాలి. సీతాకోక చిలుక అందంగా ఎగరాలంటే ఆ కథకు డేవిడ్ ఉండి తీరాలి. అన్వేషణ అంతం కావాలంటే అడుగడుగునా జేమ్స్ కనిపించాలి. ఆపద్బాంధవుడిలా చిరంజీవి మారాలంటే శ్రీపతి లాంటి ఉత్తముడు రావాలి. అప్పలనరసయ్య సంసారాన్ని చదరంగంలా ఆడాలంటే ప్రకాష్ అనే పొగరుబోతు కొడుకు ఇంటిలో తిరగాలి. పనివాడు ముత్తు గొప్పవాడిగా మారాలంటే నిజం తెలుసుకునే జమీందార్ అతని కళ్ల ముందుండాలి. ఇన్ని గొప్ప కథలకు, ఇలాంటి కథకులకు వరంలా దొరికిన నటుడు శరత్‌బాబు. ఆమదాలవలసలో పుట్టి పెరిగిన ఈ అందగాడు తెలుగు, తమిళ సినిమాల్లో మర్చిపోలేని పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. వెండితెరపై అందంగా వికసించిన ఆయన నవ్వు ఇప్పుడు మాయమైపోయింది. అర్ధ శతాబ్దం పాటు అప్రతిహతంగా సాగిన నట ప్రస్థానం నేటికి కళామతల్లి పాదాల చెంతకు చేరుకుంది. వంశధార నుంచి మెరీనా తీరం వరకు ఆయన సాగించిన ప్రయాణం సిక్కోలు స్మరించుకుంటోంది. ఆమదాలవలస: వంశధార నదీ తీరాన సత్యనారాయణ దీక్షితులుగా ఆడిపాడిన శరత్‌బాబు వేలాది మంది సినిమా అభిమానులను శోకంలో ముంచుతూ శాశ్వత సెలవు తీసుకున్నారు. ఆమదాలవలసకు చెందిన ఆయన రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ముందు చెన్నైలోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడి నుంచి బెంగళూరు, మళ్లీ అక్కడి నుంచి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్స్ ఇష్యూతో ఆయన ఇబ్బంది పడుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. ఆమదాలవలసలోనే.. ► శరత్‌బాబు బాల్యం, యవ్వనం ఆమదాలవలసలో నే గడిచింది. ఆయన తండ్రి విజయ్‌శంకర్ దీక్షితులు ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి చేసుకుని ఆమదాలవలస వచ్చి స్థిరపడ్డారు. ► శరత్‌బాబు ఇక్కడే పుట్టారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. 13 మంది సంతానంలో శరత్‌బాబు ఒకరు. వీరికి ఆమదాలవలసలో రైల్వేస్టేషన్ ఎదురుగా గౌరీ శంకర్ విలాస్ అనే బ్రాహ్మణ భోజన హొటల్ ఉండేది. ► శరత్‌బాబు ఆమదాలవలసలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియెట్ చదివారు. డిగ్రీ శ్రీకాకుళంలో ఆర్ట్స్ కళాశాలలో చదివారు. ► తిత్లీ తుఫాన్ సమయంలో రెండు లక్షల రూపాయలు జిల్లాకు ఆర్థిక సాయం చేశారు. అలాగే ఆమదాలవలసలో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, సంగమేశ్వర దేవాలయాలకు ఒక్కో లక్ష చొప్పున విరాళాలు అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. దిగ్భ్రాంతికి గురయ్యా: స్పీకర్ ఆమదాలవలసకు మంచి పేరు తెచ్చిన నటుడు శరత్‌బాబు మృతి చెందడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఓ ప్రకటనలో తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గంలో, ఆమదాలవలస పట్టణానికి చెందిన సత్యనారాయణ దీక్షితులు అలియాస్ శరత్ బాబు మృతి చెందిన సమాచారం తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ చదువుకున్న రోజుల్లోనే నటనపై శరత్ బాబుకు మక్కువ ఉండేదన్నారు. అప్పట్లో ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవంలో ‘వాపస్’ నాటకంలో నిరుద్యోగ యువకుడిగా శరత్ బాబు వేసిన పాత్ర రక్తి కట్టించిందన్నారు. 44 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఆమదాలవలస పేరు ప్రఖ్యాతలు బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో శరత్ బాబు ఒకరిని కొనియాడారు. శరత్ బాబు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తీరని లోటు శరత్‌బాబు మృతి అటు సినీ పరిశ్రమకు, ఇటు ఆమదాలవలసకు తీరని లోటని ఆమదాలవలసకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు, రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్ జేజే మోహన్‌రావు అన్నారు. శరత్‌బాబుతో తమ కుటుంబానికి స్నేహ సంబంధాలు ఎక్కువగా ఉండేవని జ్ఞాపకం చేసుకున్నారు. చివరిసారిగా ఆమదాలవలసలో అయ్యçప్పస్వామి ఆలయ ప్రతిష్ట సమయంలో ఆయన వచ్చారని చెప్పారు. ఆమదాలవలస పట్టణంలోని గల ప్రధాన రహదారి సింగపూర్ రహదారిలా తీర్చిదిద్దుదామని శరత్‌బాబు అన్నారని తెలిపారు. శరత్‌బాబుకు ఆమదాలవలస లో ఎర్నాగుల ప్రభాకరరావు, పీరు యర్రయ్య, రవిబ్రహ్మం అనే స్నేహితులు ఉన్నారని, ప్రస్తుతం వారంతా ఉద్యోగరీత్యా వేరే చోట్ల నివసిస్తున్నారని తెలిపారు. సంగమయ్య ఆలయానికి విరాళం ఆమదాలవలస రూరల్: ఆమదాలవలస మండలంలోని సంగమేశ్వర కొండకు శరత్‌బాబు తన సొంత ఖర్చుతో ఐదేళ్ల కిందట టైల్స్ వేయించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలో మొట్టమొదటిగా నిర్వహించే జాతర సంగమేశ్వర జాతర. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందినవారు జనం వచ్చి సంగమయ్య కొండను, గుహలో ఉన్న సంగమయ్యను దర్శించుకుంటారు. అలాంటి సమయాల్లో గుహ లోపలకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు శరత్‌బాబు దృష్టికి తీసుకురావడంతో వెంటనే గుహ లోపల టైల్స్ వేయించాలని తన సోదరులకు తెలపడంతో వాటిని అమర్చారు. కలిసి చదువుకున్నాం శరత్ బాబు మృతి చెందారని తెలియగానే సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయాననే బాధ కలిగింది. నేను, శరత్ బాబు ఏడో తరగతి నుంచి కలిసి చ దువుకున్నాం. శ్రీకాకుళం డిగ్రీ ఆర్ట్స్ కళాశాలలో ఆయన ఎంపీసీ, నేను సీబీజెడ్లో చేరాం. మంచి తెలివైన విద్యారి్థ. క్రమశిక్షణకు మారుపేరు. శరత్ బాబు ఒరిజనల్ పేరు సత్యనారాయణ దీక్షితులు. ఆయన ముప్పైఏళ్లు వరుసగా అయ్యప్ప మా ల వేశారు. 2019 వరకూ ఎప్పటికప్పుడు మాట్లాడుకునేవాళ్లం. తర్వాత తగ్గింది. 1980 లో నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో టంకాల బాబ్జీ తదితరులు శరత్‌బాబును సత్కరించారు. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. – పీరు ఎర్రయ్య, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ -
వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మృతి
ప్రపంచంలోనే అందమైన నటిగా పేరుగాంచిన తార ఇకలేరు. ఇటాలియన్ వెండితెర రాణిగా వెలుగొందిన జినా లొల్లో బ్రిగిడా(95) ఇవాళ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఈ విషయాన్ని ఇటాలియన్ వార్తా సంస్థ అన్సా ధృవీకరించింది. దీంతో హాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. హాలీవుడ్లో 'బ్రెడ్, లవ్ అండ్ ఫాంటసీ' సినిమాలో తన పాత్రకు బాగా ప్రసిద్ది చెందింది. 1950వ దశకంలో మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ది వరల్డ్‌గా పేరు సంపాదించింది. ఫ్రాంక్ సినాట్రా, హంఫ్రీ బోగార్ట్, మార్సెల్లో మాస్ట్రోయాని లాంటి నటులతో 60కి పైగా చిత్రాలలో నటించింది. 1960 తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడంతో కెరీర్ నెమ్మదించింది. జినా ఇటలీలోని సుబియాకోలోని సంపన్న కుటుంబంలో 1927లో జన్మించింది. చదువు కోసం 20 సంవత్సరాల వయస్సులో రోమ్‌కి వెళ్లింది. ఆమె సినిమాల్లో నటనకు అనేక అవార్డులను గెలుచుకుంది. -
ప్రముఖ పాటల రచయిత కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ సినీ పాటల రచయిత నాసిర్ ఫరాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. గతంలో ఆయనకు ఏడేళ్ల క్రితం సర్జరీ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఛాతినొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సింగర్ ముజాబా అజీజ్ తెలిపారు. బాలీవుడ్ సినిమాలు కైట్స్, క్రిష్, బాజీరావ్ మస్తానీ, కాబిల్ వంటి సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. ఆయన మృతితో బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. -
అల్లపురెడ్డి జనార్థనరెడ్డి ఇక లేరు..
-
మూగబోయిన కందికొండ గుండె సవ్వడి
-
డిస్కో కింగ్ బప్పీ దా ..అల్విదా
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం ముంబై లోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ప్రముఖ గాయని లతామంగేష్కర్ ఇక లేరన్న వార్తను ఇంకా జీర్ణించుకోలోని సినీ సంగీత అభిమానులు బప్పీదా అస్తమయంతో విషాదంలో మునిగి పోయారు. డిస్కో కింగ్ ఆఫ్ బాలీవుడ్, గోల్డ్‌మ్యాన్ బప్పీదా మరణం తీరని లోటంటూ పలువురు సంతాపం ప్రకటించారు. బప్పీ లహరి అనగానే ప్రసిద్ధ డిస్కో-ఎలక్ట్రానిక్ సంగీతం, ఒంటినిండా బంగారు ఆభరణాలు, గొలుసులు, కంకణాలు, వెల్వెట్ కార్డిగాన్స్, సన్ గ్లాసెస్‌తో ఒక స్పెషల్ స్టైల్ గుర్తు వస్తుంది. 1952 నవంబరు 27న కోలకతాలో పుట్టారు బప్పీ లహరి, ఆయన అసలు పేరు అలోకేష్ లహరి. 3 సంవత్సరాల వయస్సులో తబలా వాయించడం ప్రారంభించి అటు బాలీవుడ్‌ను, ఇటు సౌత్‌లో ముఖ్యంగా తెలుగు తమిళం,కన్నడ పరిశ్రమలో లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. తన తుది శ్వాసవరకూ మ్యూజిక్ ప్రాణంగా బతికిన లెజెండ్ ఆయన. డిస్కో, ఎనర్జిటిక్ సాంగ్స్‌కు పెట్టింది పేరు బప్పీ లహరి. డిస్కో డాన్సర్, నమక్ హలాల్, హిమ్మత్ వాలా, షరాబీ, డర్టీ పిక్చర్ లాంటి అనేక మూవీల్లోని పాటలతో బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన బప్పీ దా సింహాసనం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. బప్పీదా అనగానే సింహాసనం సినిమాలో ఆకాశంలో ఒక తార పాట గుర్తొస్తుంది. అలాగే బాలకృష్ణ రౌడీ ఇన్పెక్టర్, నిప్పురవ్వ, చిరంజీవి గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, స్టేట్ రౌడీ మూవీల్లోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే మెహన్ బాబుకు రౌడీగారి పెళ్లాం, పుణ్యభూమి నా దేశం, బ్రహ్మ లాంటి సినిమాలకు ట్యూన్స్ అందించారు బప్పీ. బప్పీ మ్యూజిక్ అయినా, పాటలైనా ఎప్పటికీ ఎవర్ గ్రీనే. డిస్కో, ఫాస్ట్ బీట్స్, వెస్ట్రన్, క్లాసిక్ మిక్డ్స్ ట్యూన్స్‌తో ఆడియన్స్ మైమరిచిపోయారు. ముఖ్యంగా 70, 80 90వ దశకంలో తన సంగీతంతో సంచలనం సృష్టించారు. చివరగా 2020లో భాగి 3లోను, రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో టైటిల్ సాంగ్ పాడారు. ఆయన మ్యాజిక్కు ఎలాంటి వారైనా స్టెప్స్ వేయాల్సిందే. ఐయామ్ ఏ డిస్కో డ్యాన్సర్ అంటూ డిస్కో సాంగ్స్‌తో యూత్‌ను ఉర్రూత లూగించారు. 1973 లో బాలీవుడ్మూవీ నన్హా షికారి, 1974 తొలి చాన్స్ అందుకున్న బప్పీ లహరి తన కంపోజిషన్‌తో ఆకట్టుకున్నాడు. తరువాత 1975లో జఖ్మీ మూవీ కెరీర్‌కు మలుపు తిరిగింది, క్రమంగా ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1976 చల్తే చల్తే డూపర్ సూపర్ హిట్ అయింది. జాతీయ స్థాయిలో సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1986లో 33 సినిమాలకు 180కి పైగా పాటలను రికార్డ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. కేవలం ర్యాక్, డిస్కో సాంగ్స్ మాత్రమే కాదు ఆశా భోంస్లే ,లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ పాడిన ఎన్నో మధురమైన పాటలను కూడా ఆయన స్వరపరిచారు. 1983-1985 కాలంలో జితేంద్ర హీరోగా నటించిన 12 సూపర్-హిట్ సిల్వర్ జూబ్లీ సినిమాలకు కంపోజ్ చేసి రికార్డ్ సృష్టించారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఇక ఆయన స్పెషల్ అప్పిరియన్స్పై వివరణ ఇస్తూ బప్పిదా తొలి చిత్రం జఖ్మీ సక్సెస్ సందర్భంగా తన తల్లి హరే రామ హరే కృష్ణ లాకెట్ ఉన్న బంగారు గొలుసు గిప్ట్ ఇచ్చారనీ, ఇక తరువాత ప్రతీ పాట హిట్ అవుతూ వచ్చి, బంగారంతో అదృష్టం వచ్చిందని చెప్పారు. అంతే కాదు ఈ విషయంలో అమెరికన్ పాప్ స్టార్ ఎల్విస్ ప్రెస్లీ తనను ప్రభావితం చేశారనీ, తాను కూడా సెలెబ్రిటీగా మారాక బంగారు గొలుసులతో తనకంటూ ఒక స్టైల్‌తో పాపులర్ అయినట్టు ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రముఖ కార్టూనిస్ట్ కన్నుమూత, సీఎం సంతాపం
తిరువనంతపురం : ప్రముఖ కార్టూనిస్ట్, కేరళ కార్టూన్ అకాడమీ చైర్మన్ సీజే ఏసుదాసన్ (83) బుధవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ పోస్ట్ కరోనా సంబంధిత సమస్యల కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు రేపు జరగ నున్నాయని, ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని గురువారం ఉదయం కలమస్సేరి, మున్సిపల్ టౌన్ హాల్లో ఉంచుతామని తెలిపారు. ఏసుదాసన్ అకాలమరణంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. కార్టూన్ల రంగం ప్రతిభావంతుడైన ఆర్టిస్టును కోల్పోయిందంటూ నివాళులర్పించారు. ఏసుదాసన్ తన కార్టూన్ల ద్వారా, ఒక కాలంలోని రాజకీయ పరిణామాలను ప్రతిబింబించడమే కాకుండా, ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తం పరిచేవారని, ఆయన పనిని పరిశీలించే ఎవరైనా కేరళ రాజకీయ చరిత్రను చూడొచ్చని సీఎం అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, వీడీ సతీసన్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారన్నారు. ఇంకా సీనియర్ కార్టూనిస్టులు, పలువురు జర్నలిస్టులు కూడా ఏసుదాసన్ మృతికి సంతాపం తెలిపారు. కేరళ కార్టూన్ అకాడమీకి ఏసుదాసన్ తొలి చైర్మన్ మృతికి కొచ్చిలోని సీనియర్ జర్నలిస్ట్ యూనియన్ సంతాపం ప్రకటించింది. ఏసుదాసన్ ఎంతో సౌమ్యమైన వ్యక్తి అని, ప్రతి ఒక్కరిని గౌరవించేవారని ఢిల్లీలోని ప్రముఖ కార్టూనిస్ట్ సుధీర్‌నాథ్ పేర్కొన్నారు. కాగా రాజకీయ కార్టూన్లకు ప్రసిద్ధి చెందిన ఏసుదాసన్ అనేకసార్లు కేరళ ప్రభుత్వ ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డును అందుకున్నారు. స్వదేశాభిమాని అవార్డు, బీఎం గఫూర్ అవార్డు, వి సాంబశివన్ మెమోరియల్ అవార్డు, పీకే మంత్రి స్మారక పురస్కారం, ఎన్ వి పైలీ అవార్డులను స్వీకరించారు. 1938లో అలప్పు జిల్లాలోని భారైకావులో జన్మించిన ఏసుదాసన్ మలయాళ మనోరమకు కార్టూనిస్ట్‌గా సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. ఏసుదాసన్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు -
మాజీ మంత్రి బిజయ శ్రీ రౌత్రాయ్ కన్నుమూత
భువనేశ్వర్: రాష్ట్ర మాజీ మంత్రి బిజయ శ్రీ రౌత్రాయ్ (68) బుధవారం కన్ను మూశారు. కరోనా చికిత్స నుంచి కోలుకుని ఇతర దీర్ఘకాల రోగాలతో ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు పేర్కొన్నారు. మే నెల తొలి వారంలో ఆయన కోవిడ్ బారిన పడి చికిత్స పొందారు. మాజీ ముఖ్యమంత్రి నీలమణి రౌత్రాయ్ కుమారుడిగా రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తిగా ఆయన పేరొందారు. భద్రక్ జిల్లా బాసుదేవ్‌పూర్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసన సభకు వరుసగా 6 సార్లు ఎన్నికయ్యారు. అటవీ-పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు విష్ణువ్రత రౌత్రాయ్ ఈ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజల కోసం పోరాడిన నాయకుడు మాజీ మంత్రి బిజయ శ్రీ రౌత్రాయ్ మృతి పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. బిజయశ్రీ రౌత్రాయ్ నిస్వార్థంతో ప్రజల కోసం పోరాడిన నాయకుడని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సానుభూతి ప్రకటించారు. ఆయన సేవలు చిరస్మరణీయం మాజీ మంత్రి బిజయ శ్రీ రౌత్రాయ్ సేవలు చిరస్మరణీయమని గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ సంతాపం ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఒడిశా స్పీకర్ సూర్యనారాయణ పాత్రో, పలువురు మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తదితరులు బిజయ శ్రీ రౌత్రాయ్ మృతి ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో టిక్‌టాక్ స్టార్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ టిక్‌టాక్ స్టార్, సోషల్ మీడియా సెలబ్రిటీ ప్రతీక్ ఖత్రి మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించారు. టిక్‌టాక్‌తో పాటు పలు ఇతర సోషల్ మీడియా వేదికలపై ఆయన వీడియోలు వైరల్ కావడంతో ప్రతీక్ ప్రాచుర్యం పొందారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతీక్‌ను 43,200 మంది అనుసరిస్తున్నారు. కారులో వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురై ఆయన మరణించారని ప్రతీక్ స్నేహితులు ధ్రువీకరించారు. ఆషికా భాటియా, భవికా మోత్వానీ వంటి పలువురు స్నేహితులు, సోషల్‌మీడియా ప్రభావశీలురు ప్రతీక్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రతీక్‌తో కలిసిఉన్న ఫోటోలను వారు షేర్ చేశారు. చదవండి : టిక్‌టాక్ ప్రేమ -
స్వామి అగ్నివేశ్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్యసమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ (80) తుదిశ్వాస విడిచారు. కాలేయ సమస్యతో ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్)లో మంగళవారం నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. కీలక అవయవాల వైఫల్యంతో వెంటిలేటర్‌పై ఉన్న స్వామి అగ్నివేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు మరణించారని వైద్యులు తెలిపారు. అగ్నివేశ్ 1939, సెప్టెంబర్ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి లా, కామర్స్ డిగ్రీ పొందారు. స్వామి అగ్నివేశ్ గతంలో ఆర్యసభ పేరిట రాజకీయ పార్టీని స్ధాపించి హరియాణా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన ఆర్యసభ పార్టీని నడిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులతో జరిగిన చర్చలకు ఆయన మధ్యవర్తిత్వం వహించారు. భిన్న మతాల మధ్య పలు అంశాలపై ఆయన వారధిగా పనిచేశారు. అగ్నివేశ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
కేశవానంద భారతి కన్నుమూత..
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదంటూ సుప్రీం కోర్టు సంచలన తీర్పునివ్వడానికి కారణమైన స్వామి కేశవానంద భారతి (79) పరమపదించారు. దాదాపు గత ఐదు దశాబ్దాలుగా కేరళలోని ఎదనీరు మఠాధిపతిగా కేశవానంద భారతి శ్రీపాద గల్వరు ఉన్నారు. వృద్ధాప్య సమస్యలతో ఆదివారం తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. కేశవానంద భారతి మృతి పట్ల ఉప రాష్ట్రపతి, ప్రధాని తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
శాస్త్రీయ సంగీత దిగ్గజం కన్నుమూత
న్యూయార్క్ : ప్రముఖ శాస్త్రీయ సంగీత విధ్వాంసులు పండిట్ జస్రాజ్ (90) సోమవారం కన్నుమూశారు. వయోభారంతో అమెరికన్ నగరం న్యూయార్క్‌లో జస్రాజ్ తుదిశ్వాస విడిచారు. ఆయన తన సుదీర్ఘ కెరీర్లో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. జస్రాజ్ హర్యానాలోని హిస్సార్‌లో 1930 జనవరి 28న జన్మించారు. తన తండ్రి పండిట్ మోతీరామ్ తన తొలి గురువు కావడంతో జస్రాజ్ ఏటా ఆయన జ్ఞాపకార్ధం హైదరాబాద్‌లో గత 30 ఏళ్లుగా పండిట్ మోతీరామ్ సంగీత్ సమారోహ్ను నిర్వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ గాయని సాధనా సర్గమ్తో పాటు సంజీవ్ అభయంకర్, సుమన్ ఘోష్, తృప్తి ముఖర్జీ, కళా రామ్‌నాథ్‌ల వంటి ఎందరినో ఆయన గాయకులుగా తీర్చిదిద్దారు. భారత సంగీత దిగ్గజం ఇక లేరని ఆయన కుమార్తె దుర్గా జస్రాజ్ ప్రకటించారు. కాగా, పండిట్ జస్రాజ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చదవండి : ప్రముఖ సీనియర్ గాయని మృతి -
మహమ్మారి బారినపడి వైద్యుడి మృతి..
భోపాల్ : కరోనా వైరస్ బారినపడి మధ్యప్రదేశ్‌కు చెందిన 62 ఏళ్ల డాక్టర్ మరణించారు. జనరల్ ఫిజిషియన్ అయిన బాధిత వైద్యుడు ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం ఉదయం మరణించారని ఇండోర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ జదియా వెల్లడించారు. కరోనా వైరస్ రోగికి చికిత్స అందిస్తూ ఈ డాక్టర్ ఇన్ఫెక్షన్కు గురై ఉంటారని భావిస్తున్నామని చెప్పారు. ఇన్ఫెక్షన్ ఆయనకు ఎక్కడి నుంచి సోకిందనే దానిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లో కరోనా మహమ్మారితో ఓ వైద్యుడు మరణించిన తొలికేసు ఇదే కావడం గమనార్హం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎంజీఎం కాలేజీ బుధవారం రాత్రి విడుదల చేసిన కోవిడ్ రోగుల జాబితాలో వైద్యుడి పేరు ఉందని అధికారులు తెలిపారు. అయితే ఓ కోవిడ్-19 రోగికి ఆయన చికిత్స చేశారనేది ఇంకా గుర్తించలేదని చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా మహమ్మారి బారినపడిన కేసుల సంఖ్య ఇప్పటివరకూ 5734కు చేరుకోగా, 166 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నుంచి 473 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. చదవండి : సౌదీ రాజ కుటుంబంలో కరోనా కలకలం -
ప్రముఖ కళాకారుడు కన్నుమూత..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ కళాకారుడు, ఆర్కిటెక్ట్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత సతీష్ గుజ్రాల్ మరణించారు. సతీష్ గుజ్రాల్ మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు సోదరుడు. దేశ విభజనకు ముందు 1925, డిసెంబర్ 25న జన్మించిన సతీష్ గుజ్రాల్ లాహోర్, ముంబైల్లో విద్యాభ్యాసం సాగించారు. నటనతో పాటు ఆర్కిటెక్చర్‌లోనూ విశేష ప్రాచుర్యం పొందిన గుజ్రాల్ ఢిల్లీలో బెల్జియం రాయబార కార్యాలయ భవనం డిజైన్‌ను రూపొందించారు. గుజ్రాల్ విశేష ప్రతిభా పాటవాలు కలిగిన వారని, ఆయనలోని సృజనాత్మకత తనను ఆకట్టుకునేదని, గుజ్రాల్ మరణం విచారకరమని ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. నటుడు, ఆర్కిటెక్ట్ గుజ్రాల్ మరణం దేశానికి తీరని లోటని, ఆయన సేవలను దేశం ఎన్నడూ గుర్తుంచుకుంటుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి : ‘పద్మ’కు తాకిన కరోనా భయాలు! -
డ్యూటీ టెన్షన్‌తో అంగన్వాడీ కార్యకర్త మృతి
రాయదుర్గం: డ్యూటీ టెన్షన్ తట్టుకోలేక అనారోగ్యానికి గురైన అంగన్వాడీ టీచర్ చివరకు ప్రాణం కోల్పోయింది. తనిఖీల పేరుతో సీడీపీఓ చేసిన హడావుడి, వేధింపులే మృతికి కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి భర్త నాగరాజు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గం మండలం రాతిబావి వంక గ్రామానికి చెందిన హరిజన తిప్పక్క (32) గ్రామదట్ల ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ వర్కర్‌గా పనిచేస్తోంది. జూలై 18న సీడీపీఓ రాధిక గ్రామదట్ల ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ‘రికార్డులను చూస్తే కడుపు మండిపోతోంది. నిన్ను ఏమి చేసినా కోపం తీరదు. కొడితే బుద్ధి వస్తుంది’ అంటూ అంగన్వాడీ కార్యకర్త తిప్పక్కపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడీపీఓ మాటలకు కార్యకర్త భయంతో వణికిపోయింది. అంగన్వాడీ వివరాలను స్మార్ట్‌ఫోన్‌లో ఆన్లైన్ చేయడం కోసం సర్వర్ సమస్య వల్ల అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిద్ర మేల్కొనేది. రికార్డుల నిర్వహణకు సంబంధించి రాత్రి పది, పదకొండు గంటల సమయాల్లో కూడా సీడీపీఓ వాయిస్ మెయిల్ ఫోన్‌కు వచ్చేది. మానసిక ఆందోళనతో ఇబ్బందిపడుతున్న తిప్పక్కను భర్త నాగరాజు బళ్లారి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమె టెన్షన్‌తో ఇబ్బంది పడుతోందని వైద్యులు తేల్చారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ఆ మేరకు బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు. బీపీ, షుగర్ లెవెల్స్ పెరిగి గుండెపోటుకు గురవడంతో శుక్రవారం సాయంత్రం తిప్పక్క మృతి చెందింది. రికార్డుల నిర్వహణ పేరుతో ఐసీడీఎస్ అధికారులు పెట్టిన టెన్షన్ల వల్లే తిప్పక్క మృతి చెందిందని భర్త నాగరాజు, తండ్రి సిద్దప్ప ఆరోపించారు. అధికారిపై పీడీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయమై సీడీపీఓ రాధికను ఫోన్లో వివరణ కోరగా.. అంగన్వాడీ కార్యకర్త మృతి బాధాకరమన్నారు. అయితే తన టార్చర్ వల్ల మృతి చెందిందనడం అవాస్తవమన్నారు. అనారోగ్యం వల్ల ఆమె మృతి చెందిందని స్పష్టం చేశారు. -
షో మ్యాన్..మాస్ వివేకా
-
బుల్లితెర నటుడు ఆకస్మిక మృతి
బనశంకరి : కన్నడ బుల్లితెర నటుడు డైరెక్టర్ చిక్కసురేశ్ (52) అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి పదిరోజుల క్రితం చిక్కసురేశ్ గోవా వెళ్లారు. అక్కడ చిక్కసురేశ్ అనారోగ్యం బారిన పడటంతో కుటుంబ సభ్యులు బెంగళూరు తరలిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. మృతుడికి భార్య వీణా, ఇద్దరు కుమారులు ఉన్నారు. పార్దీవ దేహాన్ని హొసకెరెహళ్లిలోని ఆయన నివాసానికి తరలించారు. చిక్కసురేశ్కు ఇటీవల గుండెకు శస్త్రచికిత్స జరిగింది. పలువురు టీవీ కళాకారులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
దాసరి ఇక లేరు..
-
ఆరెస్సెస్ ప్రచారక్ రాంభావు హల్దేకర్ అస్తమయం
హైదరాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) జ్యేష్ఠ ప్రచారకులలో ఒకరైన రాంభావు హల్దేకర్ (87) గురువారం మధ్యాహ్నాం 12.15 గంటల సమయంలో బర్కత్‌పురలోని ఆరెస్సెస్ ప్రాంత కార్యాలయంలో తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా శ్వాసకోశ సంబంధ వ్యాధులకు గురై చికిత్స పొందారు. హల్దేకర్జీగా పరిచయమైన శ్రీరామచంద్ర సదాశివ హల్దేకర్ మహారాష్ట్రలోని శంభాజినగర్లోని హల్దా గ్రామంలో జన్మించారు. హైదరాబాద్‌లో బీఎస్సీ చదువుతున్నప్పుడే ఆరెస్సెస్ పట్ల ఆకర్షితుడై చదువును వదిలి ఆరెస్సెస్‌లో చేరారు భాగ్యనగర్ ప్రచారక్‌గా, హైదరాబాద్ విభాగ్ ప్రచారక్‌గా, వరంగల్ విభాగ్ ప్రచారక్‌గా, విజయవాడ విభాగ్ ప్రచారక్‌గా, ఆంధ్రప్రదేశ్ సహప్రాంత ప్రచారక్‌గా, ఆగ్నేయ క్షేత్రానికి క్షేత్ర ప్రచారక్‌గా పనిచేశారు. గో.నీ.దాండేకర్ మరాఠీలో నవల రూపంలో రాసిన సంఘ్ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ జీవిత చరిత్రను హల్దేకర్‌జీ ‘పెను తుఫానులో దీపస్తంభం’ పేరుతో తెలుగులోకి అనువందించారు. వీటితోపా టు ‘ఆంధ్రప్రదేశ్‌లో సంఘ్ ప్రగతిలో ఆత్మీయ జ్ఞాపకాలు’, ‘సద్గురు సమర్థ రామదాసు’ పుస్తకాలను తెలుగు వారికి అందించారు. నేత్రదానం చేయాలన్న హల్దేకర్‌జీ కోరిక మేరకు మరణానంతరం ఆయన కార్నియాలను ‘వాసన్ ఐ బ్యాంక్’ సేకరిం చింది. శుక్రవారం ఉదయం 10గంటలకు అంబ ర్‌పేటలోని హిందూ స్మశానవాటికలో హల్దేకర్‌జీ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయని ఆరెస్సెస్ ప్రతినిధులు తెలిపారు. బీజేపీ నేతల సంతాపం హల్దేకర్‌జీ మృతి పట్ల బీజేపీ నాయకులు డా.కె.లక్ష్మ ణ్, బండారు దత్తాత్రేయ, పి.మురళీధర్‌రావు, జి.కిషన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి సంతాపం తెలిపా రు. హల్దేకర్‌జీ మరణం సంఘ్ కార్యకర్తలకు తీరని లోటని సంతాప సందేశంలో పేర్కొన్నారు. హైదరా బాద్‌లో సంఘ్ విస్తరణకు హల్దేకర్‌జీ విశేషంగా కృషి చేశారన్నారు. వివిధ విభాగాల్లో ప్రచారక్‌గా హల్దేకర్‌జీ అందించిన సేవలను కొనియాడారు. -
ఇరిగినేని కన్నుమూత
కనిగిరి: పోరాటాల పురిటి గడ్డ పై మరో తార రాలింది. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి.. కమ్యునిస్టు భావాలతో విద్యార్థి దశలోనే రాజకీయ అరంగేట్రం చేసి సర్పంచ్‌గా, సమితి అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా అనేక పదవులు అలంకరించిన నేత ఇరిగినేని తిరుపతి నాయుడు అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున నెల్లూరులోని స్వగృహంలో కన్నుమూశారు. పామూరు మండలం మోపాడు ఇరిగినేని స్వగ్రామం. నర్సలనాయుడు, లక్షమ్మ దంపతులకు 1–07–1937లో ఇరిగినేని తిరుపతినాయుడు జన్మించారు. నాటి కమ్యునిస్టు ఉద్యమనేత గుజ్జుల యల్లమందారెడ్డికి ఇరిగినేని శిష్యుడు. ఇరిగినేని సతీమణి లక్ష్మమ్మ 1959లో మోపాడు సర్పంచ్‌గా గెలిచారు. ఆ తర్వాత కమ్యునిస్టు అభిమానిగానే 1964లో సర్పంచ్‌గా ఎన్నికై, 16 ఏళ్లకు పైగా సర్పంచ్‌గా పనిచేశారు. 1981లో సమితి ఎన్నికల్లో ఇరిగినేని మిత్రపక్షాల అభ్యర్థిగా నిలబడి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోళ్ల తిరుపతినాయుడుపై అత్యధిక మెజార్టీతో సమితి అధ్యక్షునిగా గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావంతో 1982లో ఇరిగినేని టీడీపీలో చేరి, జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 1983 అసెంబ్లీ ఎన్నికలకు ముక్కు కాశిరెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇరిగినేని ప్రతిపాదించి తన మద్దతునిచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బి.రామసుబ్బారెడ్డిపై కాశిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1985లో ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పడు ఇరిగినేని కూడా టీడీపీ ఎమ్మెల్యే టికెట్టును ఆశించారు. కానీ టీడీపీ అధిష్టానం కాశిరెడ్డికే టికెట్ ఇచ్చింది. దీంతో ఇరిగినేని టీడీపీకి రాజీనామా చేసి ఏనుగు గుర్తుపై స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 1,540 ఓట్లతో ఇరిగినేని పై కాశిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఇరిగినేని 1987లో కాంగ్రెస్‌పార్టీలో చేరి, ఆపార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమితులయ్యారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాశిరెడ్డిపై ఇరిగినేని గెలిచారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో ఇరిగినేనిపై కాశిరెడ్డి విజయం సాధించారు. తరువాత 1999, 2004 ఎన్నికల్లో రెండు దఫాలు వరుసగా ఇరిగినేని ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఉండి 2009లో ఉగ్ర నరసింహారెడ్డి గెలుపునకు కృషిచేశారు. మారిన రాజకీయ పరిణామాలతో 2014 ఎన్నికల్లో కదిరిబాబురావుకు తన మద్దతు పలికి గెలుపులో కీలక పాత్ర పోషించారు. నిరాడంబర జీవితమే ఇరిగినేని మార్క్ రాజకీయం : దాదాపు 40 ఏళ్లకుపైగా రాజకీయ జీవితం గడిపి సర్పంచ్‌గా, సమితి అధ్యక్షునిగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పదవులను అలంకరించినా.. నిరాడంబర జీవితంతో ఇరిగినేనిప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు. ఇరిగినేని అనగానే పాతపడిన అద్దె భవనం.. గదిలో నవారు మంచం.. దానిపై పాత దుప్పటి.. మూలన ఓ చిన్నపాటి కూలర్ ఇక్కడి ప్రజలకు గుర్తొస్తుంది. ఎమ్మెల్యే దర్పాన్ని ఎక్కడా ప్రదర్శించకుండా..ప్రత్యర్థి పార్టీ వాడై.. తనకు ఓటు వేయక పోయినా తన వద్దకు వచ్చి సమస్య తెలిపితే కాదనకుండా సాయం చేసే నైజం ఇరిగినేనిది. అందుకే ఆయనను ప్రతిపక్ష పార్టీల వారు సైతం కనిగిరి పెద్దాయనగా పిలుస్తారు. మాట ఇచ్చిన వారి కోసం ఎందాకైనా.. రాజకీయ, ఉద్యోగ మరే ఇతర విషయాల్లో నైనా సరే.. ఒక్కసారి ఇరిగినేనితో అభయం పొందితే వారి కోసం ఎంతవరకైనా పోరాడి సాధించే నైజం ఆయనది. అందుకే నేటికీ ఇరిగినేనికి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఓ వర్గం ఉంది. పలువురు ప్రముఖుల నివాళి ఇరిగినేని తిరుపతినాయుడు భౌతిక కాయాన్ని పలు వురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ బుర్రా మధుసూదన్ యాదవ్, కనిగిరి, కొండపి ఎమ్మెల్యేలు కదిరిబాబురావు, బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ బీద రవీచంద్రయాదవ్, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, దివి శివరాం, ఏఎంసీ చైర్మన్లు దారపనేని చంద్రశేఖర్, టి.వెంకటేశ్వర్లు, రామయ్య చౌదరి, జెడ్పీటీసీ సభ్యుడు దంతులూరి ప్రకాశం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వైఎం ప్రసాద్‌రెడ్డి, కేటీఆర్ విద్యా సంస్థల అధినేత కుందురు తిరుపతిరెడ్డి, కాంగ్రెస్‌పార్టీ జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు ఎస్కే గఫార్, కర్నాటి వెంకటరెడ్డి, కనిగిరి, పామూరు, సీఎస్‌పురం ఎంపీపీలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఇరిగినేని స్వగ్రామం మోపాడులో సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజానాయకుడు ఇరిగినేని ఒంగోలు అర్బన్: ప్రజా మన్ననలు పొందిన నాయకుడు ఇరిగినేని తిరుపతి నాయుడని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇరిగినేని మృతి పట్ల ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ శాసనసభ్యుడు ఇరిగినేని తిరుపతినాయుడు మృతి కనిగిరి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరిగినేనితో తమ కుటుంబానికి పాతిక సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. వైఎస్సార్ తో ఇరిగినేని అనుబంధం.. ఇరిగినేని తిరుపతినాయుడు ఆరంభం నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మనిషిగా గుర్తింపు పొందారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగినేని విన్నపం మేరకు 2008 ఆగస్టులో వైఎస్సార్ కనిగిరికి వచ్చి ప్రజలను ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పించేందుకు రూ.175 కోట్ల కనిగిరి రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. మొదటి విడత నిధులు రూ.91 కోట్లు మంజూరు చేశారు. తిరుపతినాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డితో కలిసి కనిగిరి మంచినీటి సమస్య పరిష్కారానికి, పేదలకు పక్కాగృహాల నిర్మాణానికి కృషి చేశారు. -
మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి కన్నుమూత
షాద్‌నగర్ రూరల్: షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే రాయి కల్ దామోదర్‌రెడ్డి (95) కన్నుమూశారు. అనారోగ్యంతో 4 రోజు లుగా హైదరాబాద్‌లోని బర్కత్‌పురలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస వదిలారు. షాద్ నగర్ నియోజకవర్గ రాజకీయాలలో దామో దర్‌రెడ్డి తనదైన ముద్ర వేశారు.1955 నుంచి 1958 వరకు కొందుర్గు పంచాయతీ సమితి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయాన్ని సాధించారు. అనంతరం 1970లో షాద్‌నగర్ పంచాయతీ సమితి అధ్యక్షులుగా పనిచేశారు. 1981 నుంచి పదేళ్లపాటు స్వగ్రామమైన రాయికల్ గ్రామ సర్పంచ్‌గా, తర్వాత షాద్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా విధులు నిర్వ హించారు. అటు రాజకీయా ల్లోనూ, ఇటు వ్యక్తిగతంగా సమర్థుడైన వ్యక్తిగా దామోదర్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారు. షాద్‌నగర్‌లో జరిగే ప్రతి ఎన్నికల్లో దామోదర్ రెడ్డి క్రియాశీలక పాత్రను పోషించేవారు. దామోదర్‌రెడ్డి మరణంతో స్వగ్రామమైన రాయికల్, షాద్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆస్పత్రికి వెళ్లి దామోదర్‌రెడ్డి భౌతికకాయం వద్ద నివాళు లర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. -
ఎంఎస్ నారాయణ సతీమణి కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు, దివంగత ఎంఎస్ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ (63) కన్నుమూశారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆమె గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా కళాప్రపూర్ణ గుండె సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. కాగా ఎంఎస్ నారాయణ 2015 జనవరి 23న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. భర్త ప్రథమ వర్థంతి జరిగిన రెండు రోజులకే కళాప్రపూర్ణ మృతి చెందారు. దీంతో ఏడాది వ్యవధిలోనే వారి ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. కాగా ఎంఎస్ నారాయణ భీమవరంలో మూర్తి రాజు కళాశాలలో భాషాప్రవీణ కోర్చు చదువుతున్నప్పుడు తోటి విద్యార్ధిని కళాప్రపూర్ణ ప్రేమలో పడ్డారు. ఇదే సమయంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. ఎమ్మెస్ ప్రేమ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కులాంతర వివాహానికి అడ్డు చెప్పారు. అవేవీ పట్టించుకోని ఎమ్మెస్ భాషా ప్రవీణ కోర్సు పూర్తి చేశాక లెక్చరర్ పరుచూరి గోపాల కృష్ణ సహకారంతో కృష్ణా జిల్లా చల్లపల్లిలో కళాప్రపూర్ణను 1972లో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఎమ్మెస్ మూర్తిరాజు హైస్కూల్లో, భార్య కళాప్రపూర్ణ జూపూడి కేశవరావు హైస్కూల్లో సెంకడరీ గ్రేడ్ తెలుగు పండిట్‌గా పనిచేశారు. -
బాలీవుడ్ దర్శకదిగ్గజం అనిల్ గంగూలీ కన్నుమూత
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, రచయిత అనిల్ గంగూలీ(82) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1970 , 90 వ దశకంలో హిందీ సినిమాను ప్రభావితం చేసిన ఆయన దర్శకుడిగా, తన ప్రత్యేకతను చాటుకున్నారు. మహిళా ప్రాధాన్యంగల చిత్రాలను ఎక్కువగా రూపొందించారు. ఆశాపూర్ణాదేవి, శరత్ చంద్ర ఛటోపాద్యాయ నవలలను సినిమాలుగా మలిచారు. ముఖ్యంగా జయబాదురి హీరోయిన్గా నటించిన కోరా కాగజ్, రాఖీ నటించిన తపస్య సినిమాలకు జాతీయ అవార్డులను గెల్చుకున్నారు. ఇంకా త్రిష, ఖాందాన్, ప్యార్ కే కాబిల్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలను ఆయన రూపొందించారు. కాగా అనిల్ గంగూలీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూతురు రూపాలీ గంగూలీ టీవీ, థియేటర్ ఆర్టిస్టుగా రాణిస్తుండగా, కొడుకు విజయ్ గంగూలీ కొరియోగ్రాఫర్ గా, దర్శకుడుగా సినీ రంగానికి సేవలందిస్తున్నారు. -
చీకటి వెలుగుల రంగేళి!
పీయూసీ కంప్లీటెడ్... రెండేళ్లు ఖాళీ. ఇంట్లోవాళ్లు పై చదువులు చదివించలేని పరిస్థితి. క్లోజ్ ఫ్రెండ్సంతా జాబుల్లో జాయినైపోయారు.అన్నేళ్లూ తోడూనీడగా ఉన్న బెస్ట్ ఫ్రెండ్ నందా కూడా ఎయిర్ఫోర్స్కెళ్లిపోయాడు. ఇక రంగనాథ్ తట్టుకోలేకపోయారు. అనాథ అయిన ఫీలింగ్. విపరీతమైన ఒంటరితనం... అంతా శూన్యం. ఇంకే ం చేయాలి? ఒకటే దారి.. ఆత్మహత్య. రైలు పట్టాల దగ్గరకెళ్లి కూర్చున్నారు రంగనాథ్. రైలు కోసం వెయిటింగ్. అది త్వరగా వచ్చేస్తే ఎంచక్కా పెకైళ్లి పోవచ్చు. ఇదీ రంగనాథ్ ప్లాన్. గుడ్‌లక్... ఆ రోజు ట్రె యిన్ బాగా లేట్. ఒక్క క్షణం చాలదూ... మనిషి నిర్ణయంలో ఛేంజ్ రావడానికి. రంగనాథ్‌ను ఆలోచనలు చుట్టుము ట్టాయి. ‘ఎందుకిలా పిచ్చి పని చేస్తున్నా! చచ్చి సాధించేదేముంది? అమ్మ కల నెరవేర్చడం కోసమైనా బతకాలి’ అని డిసైడైపోయారు రంగనాథ్. ఒక రైలు ఆలస్యం కాకపోతే రంగనాథ్ అనే మంచి నటుడు మనకుండేవారు కాదు. రంగనాథ్ ఫ్యామిలీలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఎక్కడకు ట్రాన్స్ఫరైతే, అక్కడకు వెళ్లిపోవడమే. దాంతో రంగనాథ్ వాళ్లకు ప్రత్యేకంగా స్వస్థలమంటూ లేదు. రంగనాథ్ చెన్నైలో పుట్టారు. రేణిగుంటలో పెరిగారు. రాజమండ్రిలో రైల్వే టీసీగా కొన్నాళ్లు చేశారు. వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది సంగీత విద్వాంసులున్నారు. రంగ నాథ్ తల్లి జానకి వీణ వాయించడంలో దిట్ట. సినిమాల్లో సింగర్ కావాలని కోరిక. ఆమె చాలా ట్రై చే శారు. నలుగురు పిల్లలుండడంతో సంసా రంలో మునిగిపోయారామె. దాంతో రంగనాథ్‌ను నటుణ్టి చేయాలని ఆమె కలలు కన్నారు. చివరకు ఆమె కలను రంగనాథ్ నెరవేర్చారు. బాపు ‘బుద్ధిమంతుడు’లో చిన్నవేషం దొరి కింది. జస్ట్ ఫ్లూట్ పట్టుకుని కనబడటమే. తర్వాత ‘అందాల రాముడు’లో శ్రీరాముడి వేషం ఉంటే రంగనాథ్‌ని పిలిచారు. అప్పుడే ‘చందన’లో హీరో ఛాన్స్. రంగనాథ్‌కు డైలమా. చివరకు ‘చందన’ చే శారు. ‘అందాల రాముడు’ చేసుంటే ‘సీతాకల్యాణం’లో శ్రీరాముడి వేషమిద్దామనుకున్నారు బాపు. అలా గోల్డెన్ ఛాన్స్ మిస్. పాపం రంగనాథ్ కెరీరంతా ఇంతే. ఎక్కడా సాఫీ కాదు. అంతా ఎగుడుదిగుళ్లే. హీరోగా ఎంత ఎత్తుకెదిగారో అంత సడన్‌గా మాయమయ్యారు. మంచి హైటు, పర్సనాలిటీ, బిహేవియర్, టాలెంట్ ఉండీ రేసులో వెనకబడిపోయారాయన. దర్శక-నిర్మాత విఠలాచార్య ‘మదనమంజరి’ సినిమా టైమ్‌లో రంగనాథ్ జాతకం చూశారు. విఠలాచార్య జ్యోతిషంలో దిట్ట. ఆయన చెప్పింది జరుగుతుందని పరిశ్రమలో ప్రతీతి. రంగనాథ్ జాతకం చూసి ఆయనొకటే చెప్పారు. ‘‘ఇక మీరు హీరోగా కష్టం. 19 ఏళ్లు అష్టకష్టాలు పడతారు’’ అన్నారు. అచ్చం ఆయన చెప్పినట్టుగానే 1980ల నుంచి రంగనాథ్ కెరీర్లో డౌన్‌ఫాల్ మొదలైంది. హీరోగా చేసిన ఫిల్మ్‌లన్నీ అటూయిటయ్యాయి. పాతికడుగుల కటౌట్లలో ఉన్నవాడు పోస్టర్లో చిన్న ఫొటో కూడా కనబడని స్థాయికి చేరారు. హీరోగా అవకాశాల్లేవు. వెనుక చూస్తే పెద్ద ఫ్యామిలీ. అందరికీ తనే దిక్కు. ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని పోషించాల్సిందే. దాంతో ‘గువ్వల జంట’తో విలన్‌గా మారాల్సిన పరిస్థితి. 40-50 సినిమాలు విలన్‌గా చేశాడాయన. తర్వాత క్యారె క్టర్ ఆర్టిస్టుగా టర్నయ్యాడు. టీవీల్లో చేయడానికి సినీ తారలు శంకిస్తున్న టైమ్‌లో రంగనాథ్ ధైర్యం చేసి, బాపు ‘శ్రీభాగవతం’లో కంసుడి వేషం వేశారు. కె. రాఘవేంద్రరావు తీసిన ‘శాంతి నివాసం’లో మెయిన్ రోల్ చేశారు. ఎన్ని మంచి పాత్రలు చేసినా రంగనాథ్‌కు రావాల్సినంత పేరు రాలేదు. హైదరాబాద్‌కు షిఫ్ట్ అయి, పరిశ్రమకు దగ్గరగా ఉన్నా, పరిశ్రమ ఆయనకు దూరం పాటించింది. 2005లో ‘మొగుడ్స్- పెళ్లామ్స్’ సినిమా ఆయన డెరైక్ట్ చేశారు. రంగనాథ్‌లో మంచి కవి ఉన్నాడు. పత్రికల్లో పొయిట్రీ రాశారు. ‘కవితా సుదర్శనం, అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి, అక్షర వేదికలు, పదపరిమళం, నడత’ తదితర పుస్తకాలు ప్రచురించారు. ఎవరు మంచి వ్యాసం, ఇంట ర్వ్యూ రాసినా ఫోన్ చేసిమరీ అభినందించేవారు. రంగనాథ్ గురించి ప్రపంచం గొప్పగా చెప్పుకునే ఎపిసోడ్ ఒకటి. ఆయన భార్య ప్రమాదవశాత్తూ బాల్కనీ నుంచి కింద పడి, 14 ఏళ్ళ పాటు మంచానికే పరిమితమైపోతే కట్టుకున్నవాడే కన్నబిడ్డలా సపర్యలు చేశాడు. కానీ, గొప్ప చెప్పుకోలేదు. ‘నాలో సగభాగమైన భార్యకు చేయడం సేవ ఎందుకవుతుంద’నేవారు. 2009లో ఆమె కన్ను మూశారు. ఇద్దరమ్మాయిలు, ఒకబ్బాయి ఉన్నా, అప్పటి నుంచీ ఆయన మానసికంగా ఒంటరే! రైలు ఆలస్యంతో అప్పట్లో నిర్ణయం మార్చుకున్న ఆయనకు ఈసారి నిర్ణయం మార్చుకొనే ఊతమేదీ దొరకలేదు. సమస్యలు, కారణాలే మైనా, ఒక తరాన్ని నిండైన విగ్రహం, నటనలో నిగ్రహం, విశిష్ట వాచికంతో ఆకట్టుకున్న రంగ నాథ్ చివరి పేజీ విషాద భరితంగా ఉరేసుకుంది. ఒక గొప్ప నటుడు... సాహిత్యాన్నీ, సమాజాన్నీ ప్రేమించిన భావుకుడు... ఒక మంచి భర్త, మంచి మనిషి అందరికీ కన్నీళ్ళు మిగిల్చివెళ్ళిపోయాడు. -
మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి
టీనగర్: మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నమ్మాళ్ మృతిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, పీఎంకే నేత రాందాస్, వీసీకే నేత తిరుమావళవన్, టీఎంసీ నేత వాసన్ తదితరులు సంతాపాలు ప్రకటించారు. రాహుల్ గాంధీ తన ప్రకటనలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఝాన్సీరాణి అవ్వ, సీనియర్ మహిళా నేత పొన్నమ్మాళ్ మృతి వార్త విని ఆవేదన చెందానని, ఆమె ఎడబాటుతో బాధపడుతున్న ఝాన్సీరాణి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుకుంటున్నానన్నారు. ఆమె మృతి రాష్ట్ర కాంగ్రెస్‌కు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె తన జీవితాంతం పార్టీ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల పురోగతికి కృషి చేశారని తెలిపారు. వీసీకే నేత తిరుమావళవన్ తన ప్రకటనలో నిలకోట్టై, చోళవందాన్ నియోజకవర్గాలలో రాష్ట్ర అసెంబ్లీకి ఏడు సార్లు ఎన్నికయ్యారన్నారు. తాత్కాలిక స్పీకర్‌గాను సేవలందించారన్నారు. ఇదేవిధంగా పలువురు నేతలు తమ సంతాపాలు ప్రకటించారు. -
ఏడిదకు నివాళి మంచి సినిమా మరలిపోయింది..
-
ఏడిదకు నివాళి మంచి సినిమా మరలిపోయింది...
మూగ అమ్మాయి, దంపతుల తగాదాలు తీర్చే ముసలి దంపతులు, ఒకప్పుడు బాగా బతికి ఆ తర్వాత చితికిపోయిన గాత్ర విద్వాంసుడు, తాడూ బొంగరం లేకపోయినా పరాయి మతం అమ్మాయితో ప్రేమలో పడే అల్లరి చిల్లరి కుర్రాడు, జీవితంలో అన్ని విధాలా దివాలా తీసిన డాన్సర్... ఇలాంటి పాత్రలు తెరమీద కనపడాలంటే ఆ నిర్మాతకు ఉండాల్సింది కరెన్సీని ఎంచే వేళ్లు కాదు... కథను అక్కున జేర్చుకునే గుండె . ఏడిదకు అది నిండుగా ఉంది. ‘సాగర సంగమం’లో ఒక సన్నివేశం ఉంటుంది. ‘పంచభూతములు ముఖపంచకమై..’ అనే చరణానికి ఎస్.పి.శైలజ చేసిన అభినయాన్ని తప్పు పడుతూ రిపోర్టర్ పాత్రధారి అయిన కమల్ పిచ్చి చేష్టలు కుప్పిగంతులు అని రిపోర్ట్ రాస్తాడు. అది చూసి శైలజ ప్రియుడు రెచ్చిపోయి నీకేం తెలుసని... అపాలజీ చెప్పరా బాస్టర్డ్ అంటాడు. అప్పుడు జరిగే సన్నివేశం తెలుగు ప్రేక్షకులందరికీ చాలా ఇష్టమైనది. ‘సాగర సంగమం’ ఎప్పుడొచ్చినా అందరూ పదే పదే చూసేది. ఆ సన్నివేశంలో కమల్ పంచభూతములు అనే చరణానికి భరతనాట్యం, కథక్, కథాకళి... ఈ నృత్య సంప్రదాయాలన్నింటిలోనూ అభినయం చేసి చూపిస్తాడు. పొగరు కాదు అది. పాండిత్యం. మంచి కథను ఎంపిక చేసుకోవడంలో నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు కూడా అలాంటి పాండిత్యమే ఉంది. లేకుంటే మూగపిల్ల ఉంటుంది.... ఆమెకు డాన్స్ చేయాలని ఉంటుంది అనంటే బాగుందే అని ‘సిరిసిరిమువ్వ’ తీయడానికి అంగీకరించేవారా? ఒక గొప్ప గాత్ర విద్వాంసుడు. కాలం మారి సంగీతం కలుషితమయ్యి సంప్రదాయానికి విలువ తగ్గిపోయి దీనావస్థలో బతుకుతుంటాడు అనంటే ఇది చెప్పాల్సిన కథే అని రంగంలోకి దిగి ఉండేవారా?... మంచి దర్శకులు ఎప్పుడూ తయారవుతూనే ఉంటారు. గొప్ప కథలు సిద్ధమవుతూనే ఉంటాయి. కాని కళ ఉన్నవాడి దగ్గర కాసు ఉండదు.కాసు ఉన్నవాడికి ఆ కళను గ్రహించగలిగే శక్తి ఉండి దానిని జనం దగ్గరకు తీసుకెళ్లాలనే హృదయం ఉండాలి. మంచి పని చేస్తే విజయం ఎలాగూ వస్తుంది. దాని వెనుక కాసు రాకుండా ఉంటుందా? ఏడిద నాగేశ్వరరావు తీసిన సినిమాలు చూస్తే అదే అనిపిస్తుంది. ‘శంకరాభరణం గొప్పదా... సాగర సంగమం గొప్పదా’ అనంటే శంకరాభరణమే గొప్పది అనంటాను. ఎందుకంటే కమల్ లేకపోతే ‘సాగర సంగమం’ లేదు. కమల్ని దృష్టిలో పెట్టుకోకపోతే ఆ సినిమా కథ లేదు. కాని ‘శంకరాభరణం’ అలా కాదు. అది దానికదే ఒక ప్రాణమున్న కథ. దానికి నటులతో పని లేదు’ అన్నారు కృష్ణవంశీ ఒక సందర్భంలో. నిజం. దానికదే ఒక కథ అయిన దానిని ఏడిద నాగేశ్వరరావు గౌరవించారు. దర్శకుడు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలకు సపోర్టివ్‌గా నిలిచారు. నాటకాలు వేసుకునే జె.వి.సోమయాజులు, వాంప్ పాత్రల ముద్రపడిన మంజుభార్గవి... వీళ్లతో సినిమా తీయడమా? నిర్మాతకు దర్శకుడి మీద నమ్మకం ఉంది. ప్రేక్షకుల మీద ఇంకా ఎక్కువ నమ్మకముంది. యాక్షన్ సినిమాలు, డబుల్ మీనింగ్ సినిమాలు, రీమేక్ సినిమాలు.... సీజన్ ఏదైతే దాని చుట్టూ పరిశ్రమ తిరగడం చాలా సార్లు జరిగింది. కాని పూర్ణోదయా సంస్థ, దాని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పంథాలో మాత్రం మార్పు లేదు. మంచి కథ, మంచి దర్శకుడు, మంచి సంగీతం... ఈ మూడింటినే నమ్ముకున్నారు. ఏడిద నాగేశ్వరరావుకు తాను తీసిన సినిమాల్లో కీలకమైన సూచనలు చేసే శక్తి ఉంది. ‘సాగర సంగమం’లో చివరన హీరో చనిపోవాలా వద్దా అనే తర్జన భర్జన జరుగుతున్న సందర్భంలో చనిపోతేనే బాగుంటుందన్న సూచన ఆయనదే. అది ప్రేక్షకులకు ఎటువంటి ఫీల్ మిగిల్చిదో మనకు తెలుసు. ‘సీతాకోక చిలుక’ క్లయిమాక్స్‌ను దుఃఖాంతం చేయాలని దర్శకుడు భారతీరాజా పట్టుబట్టారు. కాని సుఖాంతమే కరెక్టని ఏడిద పంతం. భారతీరాజా రెండు విధాలుగా చిత్రీకరించి తెలుగులో నిర్మాత కోరిక మేరకు సుఖాంతం, తమిళంలో దుఃఖాంతంతో విడుదల చేద్దామనుకుని చివరకు ఏడిద నిర్ణయమే కరెక్టని రెండు భాషల్లోనూ సుఖాంతంగా విడుదల చేశారు. అది ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుసు. ఒక చెప్పులు కుట్టేవాడి పాత్ర చిరంజీవికి బాగుంటుంది.. ఆయన చేస్తే జనం చూస్తారు అనే నమ్మకం ఒమ్ముకాకపోవడం కూడా ఏడిద అభిరుచికి ఒక నిదర్శనం. ఏడిద నాగేశ్వరరావు చాలామంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ‘సితార’ వంటి కొత్త తరహా కథ చెప్పినా, కొత్త తరహా సంవిధానంతో తీసినా వంశీ వంటి కొత్త దర్శకుడికి మద్దతుగా నిలిచి ఆయనను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత ఆయన.సినిమా ఇండస్ట్రీలో చాలా థియరీలు ఉంటాయి. ఫలానా కథ మాస్కు ఎక్కదని ఫలానా కథ యూత్‌కు పట్టదని.... ఏడిద నాగేశ్వరరావు ఈ లెక్కలేవి వేసుకున్న పాపాన పోలేదు. ‘సిరిసిరి మువ్వ’తో మా అనుబంధం మొదలైంది. ఆ తర్వాత పూర్ణోదయాలో ‘శంకరాభరణం’ చేశాను. ఆ చిత్రంతో దర్శకుడిగా నాకు ఇంకో కొత్త తొడుగు వచ్చినట్లయింది. ఆ తర్వాత మేం చేసిన ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘స్వర్ణకమలం’ చిత్రాలు కూడా ఆణిముత్యాలే. ఏడిద నాగేశ్వరరావుగారి స్థానం భర్తీ కానిది.ఙ- కె.విశ్వనాథ్, దర్శకుడు విలువలున్న చిత్రాలు తీశారు. భాగస్వామ్యంతో ఆయన తీసిన ‘సిరి సిరి మువ్వ’లో హీరోగా చేశాను. పూర్ణోదయా సంస్థపై నిర్మించిన చిత్రాల్లో ‘శంకరా భరణం’, ‘తాయారమ్మ బంగారయ్య’లో గెస్ట్ రోల్స్ చేశాను. ఏడిద నాగేశ్వరరావుగారితో నాది 30ఏళ్ల అనుబంధం. ఆయన మరణం తీరని లోటు. - చంద్రమోహన్, నటుడు ఏడిద నాగేశ్వరరావుగారు నిర్మించిన చిత్రాల్లో నేను పాడని చిత్రం లేదు. ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’ చిత్రాలకు జాతీయ అవార్డులు పొందాను. ఆరోగ్యవంతమైన సినిమాలు, సకుటుంబంగా చూడబడే సినిమాలు కూడా వ్యాపారాత్మకమైన సినిమాలని నిరూపించిన సంస్థ పూర్ణోదయా. చిత్రసీమ ఓ మంచి నిర్మాతను కోల్పోయింది. - బాలసుబ్రహ్మణ్యం, గాయకుడు నాలో ఆయన్ను చూసుకున్నారు ‘‘నాన్నగారు గొప్ప నిర్మాత మాత్రమే కాదు.. మంచి వ్యక్తి కూడా. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు ఏడిద శ్రీరామ్. తండ్రి గురించి మరికొన్ని విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘నాన్నగారికి నటన అంటే చాలా ఇష్టం. మొదట్లో కొన్ని పాత్రలు చేశారు. కానీ, నిర్మాత అయిన తర్వాత ఆయనంతట ఆయన నటుడిగా రిటైర్ అయ్యారు. నేను నటుడు కావాలన్నది ఆయన కోరిక. నాలో తనను చూసుకోవాలనుకున్నారు. అందుకే నేను ఆర్టిస్ట్ అయినప్పుడు చాలా ఆనందపడ్డారు. ఇటీవల ‘శ్రీమంతుడు’లో నేను చేసిన పాత్రను చాలా ఇష్టపడారు. నాన్నగారు ఆరోగ్యంగానే ఉండేవారు. గత నెల 19న వాంతులు అయ్యాయి. దాంతో ఆస్పత్రిలో చేర్చాం. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. నాన్నగారు పరిపూర్ణమైన జీవితం అనుభవించారు. అది మాకు సంతృప్తిగా ఉంటుంది. కానీ, నాన్నగారి మరణం మా కుటుంబానికి తీరని లోటు’’. - ఏడిద శ్రీరామ్, నటుడు పూర్ణోదయ సంస్థలో ఆరు చిత్రాల్లో నటించాను. ఏడిద నాగేశ్వరరావుగారికి నేనంటే ఓ గురి. అందుకని, నాకు నప్పే పాత్ర ఉంటే తప్పకుండా తీసుకునే వారు. కమర్షియల్ చిత్రాలు తీస్తేనే సక్సెస్ కాగలం అనే పరిస్థితి ఉన్న తరుణంలో, ఆ పంథాలో కాకుండా తాను నమ్మిన కథతో సినిమాలు తీసి, కమర్షియల్ విజయం సాధించారు. మంచి నిర్మాతగా ఎప్పటికీ గుర్తుండిపోతారు. -శరత్‌బాబు, నటుడు పూర్ణోదయా చిత్రావళి ప్రతి ఒక్కడూ మనిషే. ఒక మంచి కథ మన హృదయాన్ని తాకితే హృదయాన్ని తాకేలా తీయగలిగితే అది అందరికీ చేరుతుంది అని నమ్మాడాయన. ఆయనగాని, ఆయన సినిమాలుగాని ఇప్పటికీ ఎప్పటికీ మరెప్పటికీ ఒక రుజువులా నిలిచిపోతాయి.- సాక్షి ఫ్యామిలీ -
కలాం మృతితో దిగ్భ్రాంతి
సాక్షి, చెన్నై : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం మృతితో రాష్ర్టంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన సొంత గ్రామంలో ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. రామనాథపురం జిల్లా రామేశ్వరంలో జైనులుద్దీన్, ఆషిమా దంపతుల ఇంట 1931 అక్టోబర్ 15న కలాం జన్మించారు. కడుపేదరికంలో పుట్టిన ఆయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం రామనాథపురంలో సాగింది. తిరుచ్చిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో కళాశాల విద్యాభ్యాసం సాగింది. మద్రాసు వర్సిటీలో ఉన్నత విద్యాభాస్యం సాగింది. శాస్త్రవేత్తగా అవతరించిన ఆయన భారత రాష్ట్రపతిగా అత్యున్నత స్థానాన్ని అధిరోహించారు. ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అంటూ నేటితరం విద్యార్థులకు ఒక మార్గదర్శిగా నిలిచారు. తమిళుల ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటినకలాంకు సొంత గడ్డ అంటే ఎనలేని మక్కువ. తన స్వగ్రామమంటే ఎంతో ఇష్టం. తమిళనాడులో తరచూ పర్యటించే ఆయన్ను కలుసుకునేం దుకు ఇక్కడి విద్యార్థి లోకం ఉత్సాహం చూపుతుంది. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ, సమయానుకూలంగా తమిళంలోనే ఎక్కువసార్లు మాట్లాడడం కలాం నైజం. అలాంటి మహనీయుడు ఇక లేరు అన్న సమాచారంతో తమిళులు తమ సొంత బిడ్డను కోల్పోయినంత ఆవేదనలో మునిగారు. రామేశ్వరంలో ప్రతి ఇంటా విషాదం నెలకొంది. నేడు పాఠశాలలకు సెలవు కలాం మరణంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్, డీఎండీకే నేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో, పీఎంపీ నేత జీకే.వాసన్, వీసీకే నేత తిరుమావళవన్‌తో పాటు మైనారిటీ సంఘాల నేతలు సంతాపం తెలియజేశారు. కలాం సేవలను స్మరించుకున్నారు. గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయాం ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయామని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. కలాం లేరన్న సమాచారం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. శాస్త్రవేత్తగానే కాకుండా పరిపాలనాధక్షుడిగా రాణించారని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ అవిశ్రాంతంగా ఆయన సేవలు అందించారని కొనియాడారు. ఆ మహనీయుడు ఆత్మకు శాంతి కలగాలని కోరారు. -
సజల నయనాలతో.. బరువెక్కిన హృదయాలతో...
కలాం మృతితో జిల్లాలో విషాదం ‘తూర్పు’న స్ఫూర్తి రగిల్చిన మహా శాస్త్రవేత్త సైంటిస్టులుగా ఎదిగిన పలువురు యువకులు అమలాపురం టౌన్ : శాస్త్ర సాంకేతిక రంగ పితామహుడుగా ఖ్యాతినొందిన మహా శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పాదముద్రలకు జిల్లా నోచుకోనప్పటికీ ఇక్కడ ఎందరో యువత, విద్యార్థులు ఆయన అడుగుజాడల్లో శాస్త్రరంగంలో ఉన్నతస్థానాలను అందుకున్నారు. కలాం తన పరిశోధనాస్ఫూర్తితో జిల్లాలో ఎందరో యువకులను ప్రభావితం చేశారు. ఆయన చెప్పిన సుభాషితాలు ఎందరో విద్యార్థులకు సరైన దారి చూపిన దివిటీలయ్యూయి.కలాం, జీవితం.. ఆయన పరిశోధన ప్రస్థానం పాఠ్య పుస్తకాల్లో లేకపోయినప్పటికీ జిల్లాలోని కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు ఆయన అనుసరించిన మార్గాన్ని బోధించటం విశేషం. అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడికి చెందిన పరమట రాధాకృష్ణ బెంగళూరులోని ఎల్.ఆర్.డి.ఓ.లో శాటిలైట్లకు సంబంధించిన పరిశోధనల్లో రాడార్ నిపుణుడుగా పనిచేస్తున్నారు. ఆయన కూడా తనకు కలాం ఎంతో స్ఫూర్తినిచ్చారని చెబుతున్నారు. అమలాపురానికి చెందిన మలిశెట్టి భీమేశ్వరరావు బెంగళూరు ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆయన ఓసారి కలాంను చూడటమే కాక మరో సందర్భంలో కలుసుకున్నారు. కలాంను కలుసుకోనక్కర లేదు.. కనీసం చూసినా మనలో పరిశోధన ప్రకంపనలు వస్తాయని భీమేశ్వరరావు కలాం పట్ల తనకున్న అత్యున్నత గౌరవాన్ని, ఆరాధనను వ్యక్తం చేశారు. పి.గన్నవరం మండలం ఆదిమూలంవారిపాలెంకు చెందిన ఆదిమూలం సూర్యతేజ్ త్రివేండ్రంలో, అమలాపురం రూరల్ మండలం బండార్లంకకు చెందిన పడవల విజయగణేష్ బెంగళూరులో శాస్త్రవేత్తలుగా పని చేస్తున్నారు. వారిద్దరూ కలామే తమకు స్ఫూర్తి అన్నారు. ‘భారత జనాభాలో 30 శాతం మంది యువతీ యువకులు ఉన్నారు. వీరిలో ఉన్న విజ్ఞానాన్ని శాస్త్రసాంకేతిక రంగం వైపు మళ్లిస్తే దేశ పరిశోధన ప్రగతి ప్రపంచ దేశాలకు ఆదర్శం అవుతుందని’ కలామ్ ‘విజన్- 20’ పేరుతో రగిలించిన స్ఫూర్తిని జిల్లాలో ఎందరో అంది పుచ్చుకున్నారు. దేశంలో ప్రముఖ విశ్వ విద్యాలయాల్లో ఆయన చేసిన ప్రసంగాలు కూడా జిల్లా యువతపై చెరగని ముద్ర వేశాయి. ఆయన మృతి జిల్లావాసులను.. ముఖ్యంగా యువతను కలచి వేసింది. లోటును తలుచుకుంటూ జిల్లా ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. చెమర్చిన కళ్లతో ఆయన స్మృతులను, స్ఫూర్తిని నెమరు వేసుకున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో చరిత్ర సృష్టించారు.. అబ్దుల్ కలాం దేశ అంతరిక్ష పరిశోధనల్లో చరిత్ర సృష్టించారు. ఆయన పరిశోధన మార్గం దేశంలోని ఎందరో శాస్త్రవేత్తలకు ఆదర్శప్రాయం. ఆయన లేని దేశాన్ని ఊహించుకోలేకపోతున్నాను. కలాం రచించిన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ నాలాంటి యువ శాస్తవేత్తలకు మార్గదర్శకం. కర్ణాటక రాష్ట్రంలోని హాసన్‌లో గల మాస్టర్ కంట్రోలర్ యూనిట్‌కు ఆయన వచ్చినప్పుడు నేను తొలిసారిగా చూశాను. ఇటీవల మంగళయాన్ ప్రయోగం విజయవంతం అయినప్పుడు కలామ్‌ను కలుకుని మాట్లాడినప్పుడు నా జీవితం ధన్యమైందని ఆనందించాను.ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నాను. - మలిశెట్టి భీమేశ్వరరావు, ఇస్రో శాస్త్రవేత్త, బెంగళూరు (సొంతూరు అమలాపురం) యువతకు దిశానిర్దేశకుడు యువకులకు దిశానిర్దేశం చేయడంతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని నిరంతరం తపించిన కలాం మరణం దేశానికి తీరనిలోటు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జేఎన్టీయూకేలో జరిగే అంతర్జాతీయ ప్రపంచ ఆరోగ్య సదస్సుకు ఆయనను ఆహ్వానించాలనుకున్నాం. ఈలోపే ఆయన మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది. - వెల్లంకి సాంబశివకుమార్, వైస్ చాన్సలర్, జేఎన్టీయూకే సైన్సు చరిత్రలో మేరు పర్వతం.. సైన్సు చరిత్రలో ఒక మేరు పర్వతం అబ్దుల్ కలాం. దేశ ప్రగతికి తన పరిశోధనలతో దోహదపడడమే కాక రాష్ట్రపతిగా దేశకీర్తిని ప్రపంచానికి చాటిన మహా మేధావి కలాం. శాస్త్రీయ ధోరణిల పట్ల అసాధారణ స్ఫూర్తిని కలిగించిన ఆయనను ప్రజలు దేవునిగా కొలిచి ఆయన ఫోటోకు పూజలు చేస్తూ రుణం తీర్చుకోవాలి. కోనసీమ సైన్స్ పరిషత్ ద్వారా నిర్వహించిన 2,000 సైన్స్ మహాసభల్లో విద్యార్థులకు కలామ్ శాస్త్రీయ పరిశోధనా స్ఫూర్తినే ఆదర్శంగా చెప్పేవాడిని. - సీవీ సర్వేశ్వరశర్మ, అధ్యక్షుడు, కోనసీమ సైన్స్ పరిషత్ దేశానికి తీరని లోటు కలాం మృతి దేశానికి తీరని లోటు. పరిశోధనల్లో ఆయన దేశాన్ని కొత్త పుంతలు తొక్కించారు. యువ శాస్త్రవేత్తల్లో పరిశోధనా స్ఫూర్తిని రగి లించారు. రాష్ట్రపతిగా ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆయన పోషించిన భూమిక పొరుగు దేశాలకు కూడా ఆదర్శమైంది. అలాంటి గొప్ప పరిశోధకుడిని, అత్యుత్తమ పౌరుడిని కోల్పోవటందురదృష్టం. - నిమ్మకాయల చినరాజప్ప, ఉప ముఖ్యమంత్రి -
ఓ మహాత్మా, మహర్షీ..
తన అద్భుత ఆలోచనలతో యువతను మేలుకొలిపిన అభినవ వివేకానందుడు కలాం. ఆయన ఆకస్మిక మృతి జిల్లా వాసులను కలచి వేసింది. జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని విద్యాధికులు, రాజకీయవేత్తలు, విద్యార్థులు స్మరించుకుని నివాళులర్పించారు. ఎక్కడో మారుమూల శ్రీకాకుళం జిల్లాకు సైతం నాలుగేళ్ల క్రితం ఆయన తరలివచ్చి ఇక్కడి విద్యార్థిలోకాన్ని ప్రభావితం చేసేలా ఆయన ప్రబోధించిన తీరు నభూతో.. రాజాంలో జీఎంఆర్ ఐటీలో సుదీర్ఘమైన ఆ ఉపన్యాసం ఆ ప్రాంగణంలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆనాడు వేదికపై గంభీరమైన, ఆలోచనాత్మమైన, విజ్ఞానప్రపూర్ణమైన ఆయన మాటలు ఎన్నటికీ మరువలేనివి. ఆరోజు అక్కడ కాలేజీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలోని ప్రతి అంశాన్ని పరిశీలించి ప్రశంసించారు. రాజాం: కలలు కనండి... సాకారం చేసుకోండి... అంటూ యువతను ప్రభావితం చేసిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాంకు శ్రీకాకుళం జిల్లాతోనూ అనుబంధం ఉంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంధి మల్లిఖార్జునరావు రాజాంలో స్థాపించిన జీఎంఆర్‌ఐటీలో 2009 మార్చి 12న నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శాస్త్ర సంకేతిక రంగాల్లో దేశానికి ఎన్నో విజయాలు అందించిన ఆయన రాజాం జీఎంఆర్‌ఐటీకి రావడం ఒక చారిత్రక సంఘటనగానే చెప్పుకోవచ్చు. జీఎంఆర్ ఆహ్వానం మేరకు ఇంజినీరింగ్ పట్టభద్రులకు, అధ్యాపకులకు, శాస్త్ర సాంకేతిక శాస్త్రవేత్తలకు దిశా నిర్దేశం చేసే విధంగా ఆయన కీలక ఉపన్యాసం చేశారు. ఆయన వస్తున్నారని తెలియగానే జీఎంఆర్ విద్యాసంస్థలకు సంబంధించిన విద్యార్థులతో పాటు ఇతరత్రా విద్యార్థులు పాల్గొని ఆయన ఉపన్యాసంతో స్ఫూర్తి పొందారు. అనంతరం ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో రాజాంలోని పలు విద్యాసంస్థలు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన పలు సృజనాత్మకత అంశాలను ఆసక్తిగా పరిశీలించి అభినందించారు. సోమవారం ఆయన మృతి పట్ల జీఎంఆర్‌ఐటీ సిబ్బందితో పాటు విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. -
అబ్దుల్ కలాం కన్నుమూత!
-
మూగబోయిన మధుర స్వరం
* మూగబోయిన మధుర స్వరం * ప్రముఖ గాయకుడు రామకృష్ణ కన్నుమూత హైదరాబాద్ : ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు విస్సంరాజు రామకృష్ణ(68) కన్నుమూశారు. కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న రామకృష్ణ జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విస్సంరాజు రంగశాయి-రత్నం దంపతులకు 1947 ఆగస్టు 20న విజయనగరంలో రామకృష్ణ జన్మించారు. ప్రఖ్యాత సినీ నేపథ్యగాయని సుశీల.. రామకృష్ణకు పినతల్లి. ఆయన నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెలకువలు నేర్చుకున్నారు. అలనాటి అగ్రహీరోలందరికీ గాత్రం అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. భక్తి గీతాల ఆలాపనలో తనదైన ముద్రవేసి శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన విశిష్ట గాయకుడు ఆయన. సుమారు 200 చిత్రాల్లో అయిదువేలకు పైగా పాటలను పాడారు. రామకృష్ణ మృతితో సంగీత ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఆయన పార్థివ దేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, నటుడు తనికెళ్ల భరణి, ఎస్పీ.శైలజ, సునీత తదితర గాయకులు, దర్శకులు విచ్చేసి రామకృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన అంత్యక్రియలు పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో జరిగాయి. రామకృష్ణ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తపరిచారు. పార్క్‌హయత్ హోటల్లో జరిగిన సంతాప సభకు రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి, నటీమణులు జమున, జయసుధ, జయప్రద, జీవిత రాజశేఖర్, నటుడు సుమన్, దర్శకుడు కోదండరామిరెడ్డి,సురేష్‌బాబు తదితరులు హాజరై సంతాపం వ్యక్తంచేశారు. కొద్దిసేపు పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. రామకృష్ణ మృతి పట్ల కేసీఆర్ సంతాపం ప్రముఖ గాయకుడు విస్సంరాజు రామకృష్ణ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దాదాపు 200 చిత్రాల్లో 5 వేలకు పైగా పాటలు ఆలపిం చిన రామకృష్ణ.. తన మధుర గానంతో ఎంతో మంది అభిమానులను సంపాదించారని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సినీ, భక్తిరస గీతాలే కాకుండా తెలంగాణ ఉద్యమ పాటలు కూడా ఆలపించిన రామకృష్ణ.. రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారని సీఎం కొనియాడారు. రామకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి అలనాటి ప్రముఖ గాయకుడు విస్సంరాజు రామకృష్ణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సినిమాలు, ప్రైవేటు ఆల్బమ్‌లలో 5 వేలకు పైగా పాటలు పాడిన రామకృష్ణ మృతి చలనచిత్ర రంగానికే కాకుండా యావత్ సంగీత ప్రపంచానికే తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైఎస్ జగన్ సంతాపం ప్రముఖ సినీ గాయకుడు వి.రామకృష్ణ మృతికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. సినిమా పాటల ఆలాపనలో ఆయన ఎన్నో మైలురాళ్లు అధిగమించారని, ఆయన లేని లోటు పూడ్చ లేనిదని జగన్ పేర్కొన్నారు. రామకృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
భవసాగరం ఈదుకుంటూ...పడవెళ్లిపోయింది!
జీవనదిలా... పాట సాగుతుంది..! జీవితమన్న పడవ పల్లవుల అలల్లో... చరణాల హోరుల్లో... లేస్తూ పడుతూ... దారిన నిలబడిన శ్రోతల హృదయాలలో తీగలు మీటుతూ... మంత్రముగ్ధులను చేస్తూ... ప్రయాణానికి ఆమంత్రిస్తూ... సాగిపోయింది. పాట జీవనదిలా చిరస్థాయిగా మిగిలిపోయింది... అపురూప మధు‘రామకృష్ణ’ స్వరమాధుర్యం తీపి జ్ఞాపకంగా మనసును ఒకసారి గిలిగింతలు పెడుతూ, మరోసారి తన్మయత్వానికి గురిచేస్తూ... ఇంకొకసారి తాత్వికంగా నిలదీస్తూ మిగిలిపోయింది. స్వరప్రసాదంగా చిరస్థాయిగా నిలిచిపోయింది. విజయనగరంలో పుట్టి పెరిగిన విస్సంరాజు రామకృష్ణకు బాల్యంలోనే స్వరానుబంధం ఏర్పడింది. విస్సంరాజు రంగశాయి, రత్నం దంపతులకు 1947 ఆగస్టు 20న జన్మించారాయన. రామకృష్ణ తల్లి సుప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు శిష్యురాలు. ఇంట్లోనూ ఆమె సంగీత సాధన సాగించేవారు. ఆమె ప్రభావంతోనే రామకృష్ణకు బాల్యం నుంచి సంగీతంపై ఆసక్తి, అనురక్తి ఏర్పడ్డాయి. రామకృష్ణ మాతామహులు పులిపాక ముకుందరావు ప్రముఖ వైణికులు. సంగీత కుటుంబంలో పుట్టిపెరిగిన రామకృష్ణ తన పదిహేనో ఏట కర్ణాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి వద్ద స్వరాభ్యాసం చేశారు. తండ్రి రంగశాయి మైన్స్ అండ్ జియా లజీ శాఖ డెరైక్టర్. ఆయన ఉద్యోగ రీత్యా వారి కుటుంబం హైదరాబాద్‌లో ఉండేది. ‘యువవాణి’ ద్వారా రామకృష్ణ రేడియోశ్రోతలకు పరిచయమ య్యారు. చిత్తరంజన్ స్వరకల్పనలో లలిత గీతాలు ఆలపించారు. అవకాశమిచ్చిన అక్కినేని చదువు పూర్తయ్యాక పాటలపై పూర్తిస్థాయిలో దృష్టిపెడదామని భావించిన రామకృష్ణకు అనూహ్యంగా అక్కినేని నాగేశ్వరరావు తొలి సినీ అవకాశం ఇచ్చారు. సారథి స్టూడియోలో ఒక డాక్యుమెంటరీ కోసం పాడుతుండగా, అక్కడే ఉన్న అక్కినేని రికార్డింగ్ పూర్తవుతూనే రామకృష్ణను అభినందించారు. తాను హీరోగా నటించే ‘విచిత్రబంధం’ చిత్రంలో పాడా ల్సిందిగా కోరారు. అప్పటికి బీఎస్సీ పరీక్షలకు మరో రెండు నెలలే గడువు ఉండటంతో, పరీక్షలు పూర్తయ్యాక పాడతానన్నారు రామకృష్ణ. అప్పటి వరకు నిరీక్షించి మరీ అక్కినేని ‘విచిత్రబంధం’ (1972)లో రామకృష్ణతో పాడించారు. ఆ చిత్రంలో సుశీలతో కలసి పాడిన ‘వయసే ఒక పూల తోట’, ‘చిక్కావు చేతిలో చిలకమ్మా’ పాటలు ఉర్రూత లూపాయి. ఆ తరువాత ‘భక్త తుకారాం’, ‘ధనమా? దైవమా?’, ‘అందాల రాముడు’, ‘శారద’, ‘భక్త కన్నప్ప’, ‘తాత -మనవడు’, ‘మహాకవి క్షేత్రయ్య’, ‘దానవీరశూర కర్ణ’, ‘కురుక్షేత్రం’, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ వంటి పలుచిత్రాల్లో రామకృష్ణ పాటలు హిట్టు. ఘంటసాల ప్రోత్సాహం రామకృష్ణ చిన్నప్పటి నుంచి ఘంటసాలను విపరీతంగా అభిమానించేవారు. ఆయన బాణీనే ప్రామాణికంగా భావించేవారు. ‘తాత- మనవడు’లో ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం..’ పాట రికార్డింగ్ అప్పుడు ఆ పాట విన్న ఘంటసాల ‘నా అంతటి గాయకుడివి కావాలి’ అని రామకృష్ణను ఆశీర్వదించారు. అంతేకాదు, తన ఆరోగ్యం క్షీణించి, పాడలేని పరిస్థితుల్లో నిర్మాతలకు చెప్పి మరీ, రామకృష్ణ చేత చాలా పాటలు పాడించారు. ‘అల్లూరి సీతారామ రాజు’లో ‘తెలుగువీర లేవరా..’ పాట తొలి సగం పాడిన తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో, ఆ పాట మిగిలిన సగాన్ని రామ కృష్ణ చేత ఘంటసాలే పాడించారు. ‘భక్త తుకారాం’ శతదినోత్సవంలో ‘కరుణామయా దేవా’ రికార్డు వినిపిస్తుండగా రామకృష్ణ పక్కనే కూర్చున్న ఘంటసాల ‘ఈ పాట నేను పాడిందా నువ్వు పాడిందా?’ అని అడిగారు. ‘ఘంటసాల ప్రశంసకి మించి అవార్డ లేదు’ అని రామ కృష్ణ వినమ్రంగా చెప్పేవారు. ఇవాళ్టికీ రామకృష్ణ పేరు చెప్పగానే జనసామాన్యంలో ఎన్టీఆర్ ‘దానవీరశూర కర్ణ’లోని తిరుపతి వేంకట కవుల ప్రసిద్ధ రాయబారం పద్యాలు, ‘వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’లోని పాటలు, తత్త్వాలు, కాలజ్ఞానం గుర్తుకొస్తాయి. గ్రామ్‌ఫోన్ రికార్డుల దశ నుంచి క్యాసెట్ల దశ మీదుగా ఇవాళ్టి సీడీ, పెన్‌డ్రైవ్‌లలో ఎమ్పీ3 దశ దాకా ఆ పాటలు, పద్యాలు, తత్త్వాల సేల్స్ సూపర్‌హిట్టే. వినమరుగైన ప్రాభవం ఘంటసాల మాస్టారి చివరి రోజుల్లో 1970వ దశకంలో సినీ రంగ ప్రవేశం చేసిన రామకృష్ణ, మాస్టారి మరణం తరువాత కొంతకాలం వరకు తన హవా సాగించారు. అప్పట్లో రామకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గళాలు పోటాపోటీగా తెలుగు సినీగీతాల శ్రోతలకు వినిపించేవి. అయితే, 1977 తరువాత ఎస్పీబీ తిరుగులేని గాయకుడిగా స్థిరపడడంతో, రామకృష్ణ గాన ప్రాభవం క్రమంగా తగ్గింది. తరువాతి రోజుల్లో ఆయన ప్రధానంగా ప్రైవేట్ కచ్చేరీలు, ప్రైవేట్ ఆల్బమ్‌లలో పాటల మీద దృష్టి పెట్టారు. ‘వెంగ మాంబ’ లాంటి కొన్ని సినిమాల్లో, కొన్ని టీవీ సీరియళ్ళలో కొన్ని పాత్రలు పోషించి, తన నటనాభిలాషను తీర్చు కున్నారు. నాగార్జున - కృష్ణవంశీల ‘నిన్నే పెళ్ళాడతా’ (1996), ‘సీతక్క’ (1997) లాంటి సినిమాల్లో అడపా దడపా ఆయన గొంతు వినిపించింది. కొన్నేళ్ళ క్రితం ‘హైటెక్ స్టూడెంట్స్’లోనూ గళం విప్పిన రామకృష్ణ చివరిసారిగా గుమ్మడి నటించిన ‘జగద్గురు శ్రీకాశీనాయని చరిత్ర’ (2007)లో పాడారు. ఆ సినిమాలో గురుచరణ్ రాసిన ‘ఈ క్షేత్రకథాగానం...’ ఆయన చివరి సినీ గీతం. తెలంగాణ ఉద్యమవేళ అంద్శైరచన ‘జయ జయహే తెలంగాణ జననీ...’ గీతాన్ని రామకృష్ణ పాడారు. ఉద్యమ కారులకు ఊపునిచ్చిన ఆ పాటే ప్రత్యేక రాష్ట్రసాధన తర్వాత తెలంగాణ రాష్ట్రగీతమై, ఇప్పటికీ ఆ గొంతులో వినిపిస్తోంది. రామకృష్ణ ‘‘పాడిన సినీ గీతాలు 400లోపుంటాయి. ఆ పాటలు, పద్యాలన్నీ సేకరించాం. అవి కాక వందల ప్రైవేట్ గీతాలుంటాయి. ఆయన పాడిన సినీ గీతాలు, పద్యాల సమగ్ర సమాచారంతో ఈ ఆగస్టులో ఆయన పుట్టినరోజుకు పుస్తకం తీసుకొస్తున్నాం. ఈ లోగానే ఈ దుర్ఘటన జరిగింది’’ అని రాజమండ్రికి చెందిన సినీగీత సేకర్త గోలి సాయిబాబు తెలిపారు. భక్తి, రక్తి, జీవన తాత్త్విక గీతాలు మూడూ పాడి, ఘంటసాలను తలపించిన రామకృష్ణ ఓ పాటలో అన్నట్లు... ‘‘పడవెళ్ళిపోయింది.’’ తీపిగుర్తుగా పాట మిగిలిపోయింది. ► పాటల పూదోటలో... కొన్ని మల్లెలు... ► వయసే ఒక పూలతోట - ‘విచిత్ర బంధం’ (1972) ► చిక్కావు చేతిలో చిలకమ్మా - ‘విచిత్ర బంధం’ (1972) ► అనుబంధం ఆత్మీయత.. అంతా ఒక బూటకం - ‘తాత-మనవడు’ (1972) ► ఒసే వయ్యారీ రంగీ... వగలమారి బుంగీ - ‘పల్లెటూరి బావ’ (1973) ►శారదా నను చేరగా - ‘శారద’ (1973) ► పాండురంగనామం పరమపుణ్యధామం - ‘భక్త తుకారాం’ (1973) ► రాముడేమన్నాడోయ్ - ‘అందాల రాముడు’ (1973) ► ఎదగడానికెందుకురా తొందరా - ‘అందాల రాముడు’ (1973) ► కృష్ణవేణి తెలుగింటి విరిబోణి - ‘కృష్ణవేణి’ (1974) ► అందాలు కనువిందు చేస్తుంటే - ‘కన్నవారి కలలు’ (1974) ► నాయుడోళ్ల ఇంటికాడ నల్లతుమ్మ చెట్టు కింద - ’అందరూ దొంగలే’ (1974) ► మనసు లేని దేవుడు - ‘ప్రేమలు-పెళ్లిళ్లు’ (1974) ► తెలుగు వీర లేవరా - ‘అల్లూరి సీతారామరాజు’ (1974) ► ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు - ‘ముత్యాల ముగ్గు’ (1975) ► శివ శివ శంకరా... భక్తవశంకర! - ‘భక్త కన్నప్ప’ (1976) ► మనసు లేని బ్రతుకొక నరకం - ‘సెక్రటరీ’ (1976) ► నా పక్కన చోటున్నది ఒక్కరికే- ‘సెక్రటరీ’ (1976) ► జాబిల్లి పిలిచేను - ‘మహాకవి క్షేత్రయ్య’ (1976) ►విఠలా! పాండురంగ విఠలా - ‘చక్రధారి’ (1977) ►నా జీవన సంధ్యా సమయంలో - ‘అమర దీపం’ (1977) ► ఎవరికి ఎవరు... చివరికి ఎవరు - ‘దేవదాసు మళ్లీ పుట్టాడు’ (1978) ► పువ్వుల కన్నా పున్నమి వెన్నెల కన్నా - ‘కరుణామయుడు’ (1978) ► ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో - ‘యువతరం కదిలింది’ (1980) ► వినరా వినరా - ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రప్వామి చరిత్ర (1984) ► నందామయా గరుడ నందామయా - ‘శ్రీమద్విరాట్ పోతులూరి ► వీరబ్రహ్మేంద్రప్వామి చరిత్ర (1984) అది కొడుక్కైనా దక్కాలనుకున్నాడు! ఘంటసాల గారినే గురువుగా భావించి, ఆ పాటలే వేదికలపై పాడుతూ వచ్చిన రామకృష్ణ గొంతు ఆయనకు చాలా దగ్గరగా ఉండేది. ఘంటసాల గారు గతిం చాక, జనం అలాంటి మంచి వాయిస్‌ను రామకృష్ణలో చూసుకున్నారు. తొలి రోజుల్లో పరిశ్రమ ప్రోత్సహించింది. అతని గొంతు విని, సంగీత దర్శకుడు రమేశ్‌నాయుడు మా ‘తాత మనవడు’కు ‘అనుబంధం ఆత్మీయత’ పాడించారు. తర్వాత ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ సహా నా సినిమాలు చాలా వాటిలో పాడాడు. కొన్ని కారణాల వల్ల పరిశ్రమలో అతనికి చిన్న గ్యాప్ వచ్చి, నెమ్మదించాడు. అతను ఫ్రాంక్‌గా మాట్లాడేవాడు. నిర్మాత లను డబ్బు కోసం డిమాండ్ చేసేవాడు కాదు. తనకు రాని పేరు కొడుక్కైనా దక్కాలని సంగీతం నేర్పించాడు. - దాసరి నారాయణరావు, దర్శకుడు అంకితభావానికి అది గుర్తు! రామకృష్ణది మంచి గొంతు. మా సిని మాలు ‘కృష్ణవేణి’, ‘అమర దీపం’లో రామకృష్ణతో పాటలు పాడించా. అవి ఇవాళ్టికీ పాపులరే. కానీ, చిత్రంగా పెద్దగా అవకాశాలెందుకో రాలేదు. ఆ తరువాత ‘భక్త కన్నప్ప’లో కిరాతార్జునీయ గీతం తప్ప, అన్నీ పాడించా. అందులో ‘ఆకాశం దించాల’ లాంటి పాటలన్నీ పెద్ద హిట్టు. అందుకే, ఎప్పుడూ ‘నాకు మీరు లైఫ్ ఇచ్చారు’ అంటూ, కృతజ్ఞత చూపేవాడు. ‘తాండ్ర పాపారాయుడు’ (1986)లో మంచి దమ్ముతో పాడాల్సిన పద్యానికి పిలిస్తే, చాలా రిహార్సల్స్ చేసి, తృప్తిగా వచ్చేవరకు పాడాడు. అది ఆయన అంకితభావానికి నిదర్శనం. వ్యక్తిగతంగా మంచి మనిషి.’ - కృష్ణంరాజు, నటుడు ఆయన, ఈయన చెరిసగం పాడారు! రామకృష్ణ గారు మరణించారన్న సంగతి ఇందాక టీవీలో చూసి షాక్ అయ్యా. ఒక మంచి గాయకుడిగా, మంచి మనిషిగా ఆయన తెలుసు. చూసి, చాలా రోజులైంది. అనారోగ్యం గురించి తెలి యదు. తక్కువ పాటలే పాడినా, కెరీర్లో చాలా హిట్లున్న గాయకుడు ఆయన. మా ‘అల్లూరి సీతారామరాజు’లోని ‘తెలుగు వీర లేవరా’ పాటను ఘంటసాల పాడితే, అందులో చివర వచ్చే ‘స్వాతంత్య్ర వీరుడా స్వరాజ్యభానుడా...’ అనే బిట్‌ను రామకృష్ణ గానం చేశారు. ఘంటసాల అనారోగ్యంతో ఆ బిట్ పూర్తి చేయలేక, తానే స్వయంగా రామకృష్ణ గారిని పిలిచి మరీ ఆ పాట పూర్తి చేయించారు. ఇవాళ్టికీ ఆ పాట అందరి నోటా నిలిచింది. ఘంట సాలను తలపించే రామకృష్ణ గొంతు మూగపోయినందుకు బాధగా ఉంది. - విజయనిర్మల, నటి - దర్శకురాలు తనమీద తానే జోక్స్ వేసుకునేవారు! రామకృష్ణ గారు చాలా సరదా అయిన మనిషి. ప్రముఖ సినీ సంగీత దర్శకులు రాజ్ - కోటి గార్లు ముందుగా ‘రుద్రాక్ష మాల’ అనే క్యాసెట్‌కి సంగీతం చేశారు. అప్పుడు నేను, రామకృష్ణ గారు కలసి పాడడం జరిగింది. ఆ తరువాత ఎన్నో వేదికలపై కలసి పాడాం. ఎన్నో కచ్చేరీలు కలసి చేశాం. బయట చాలామందికి తెలియని గొప్ప కోణం ఏమిటంటే, ఆయన ఎప్పుడూ సరదాగా, ఏవో జోక్స్ వేస్తూనే ఉంటారు. ముఖ్యంగా తన మీద తానే జోక్స్ వేసుకొనేవారు. ఆయన పోయారనే వార్త హైదరాబాద్‌లో షూటింగ్‌కి వచ్చిన నాకు షాకింగ్ న్యూస్. స్వయంగా వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించా. ఇవాళ ఆయన మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. - ఎస్పీ శైలజ, సినీ గాయని వాళ్లది సంగీత కుటుంబం రామకృష్ణ కుటుంబమంతా నాకు బాగా తెలుసు. రామకృష్ణే కాదు, అతని చెల్లెలు బి.ఎ. లక్ష్మి, తమ్ముడు వాసుదేవ్ మంచి సింగర్స్. 1960ల చివర్లో ‘హైదరాబాద్ ఫిల్మ్ టాలెంట్స్ గిల్డ్’ అనే ఆర్కెస్ట్రాతో సినీ, లలిత గీతాల కచ్చేరీలు ఇక్కడ చేసేవాళ్ళం. చదువుకొనే రోజుల్లోనే రేడియోలో, ఆ ఆర్కెస్ట్రాలో నా దగ్గర రామకృష్ణ పాడేవాడు. అప్పట్లో ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి పాడడానికి చాన్స్ వస్తే, నాకు కుదరక సారథీ స్టూడియోకు అతణ్ణి పంపా. అక్కడ అతని గొంతు విని, దైవికంగా ఏయన్నార్ ఫస్ట్ సినిమా ఛాన్సిచ్చారు. నా వల్లే ఆ ఛాన్స్ వచ్చిం దంటూ, ఆ సంగతి ఎప్పుడూ అందరికీ చెబుతుండేవాడు. అన్నీ బాగా పలికే, మంచి గాత్రం అతనిది. ఘంటసాలను తలపిస్తూ చాలా సినీగీతాలు పాడాడు. - ఎం. చిత్తరంజన్, లలిత సంగీతజ్ఞుడు -
ఆగిన హనీఫా గళం
సాక్షి, చెన్నై:ప్రముఖ గాయకుడు నాగూర్ హనీఫా(97) చెన్నైలో అస్తమించారు. ఆయన మరణ సమాచారంతో డిఎంకే అధినేత ఎం కరుణానిధి ఉద్వేగానికి లోనయ్యారు. నాగూర్ దర్గా ఆవరణలోని ముస్లీం సామాజిక వర్గ శ్మశాన వాటికలో హనీఫా మృత దేహాన్ని ఖననం చేశారు. ‘నాగూర్ హనీఫా’ ఈ పేరు వింటే తమిళనాట ఉన్న ముస్లీం సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ఆనంద డోలికల్లో తేలియాడుతారు. ఆయన గ ళం వీనూల విందు. ముస్లీం సామాజిక వర్గానికి సంబంధించిన అనేకానేక భక్తి గీతాలను ఆయన ఆలపించారు. ఆయన పాడిన వందలాది పాటల్లో ఒక్కో పాట ఒక్కో మదురం. ముస్లీంల వివాహ వేడుకకు అర్థాన్ని ఇస్తూ ఆయన పాడిన పాట ప్రతి వివాహ వేడుకలో తప్పని సరిగా మోగాల్సిందే.అలాగే, డిఎంకేకు ఆయన తీవ్ర విధేయుడు. డిఎంకే కోసం ఆయన ఆలపించిన గీతాలు ఎన్నో. డిఎంకే సభలు, సమావేశాలు, ర్యాలీల్లో హనిఫా పాడిన పాటలు తప్పని సరిగా విన్పించి తీరుతాయి. ప్రఖ్యాత గాయకుడిగా పేరు గడించిన హనీఫా కొన్ని తమిళ, ఇస్లాం సంబంధిత చిత్రాలకు సైతం తన గాత్రాన్ని అందించారు. డిఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై అస్తమించినప్పుడు ‘ ఎక్కడికి వెళ్లావో...’ అన్న పాట ప్రతి హృదయాల్నికదిలించక తప్పలేదు. అలాగే, డిఎంకే అధినేత ఎం కరుణానిధిని స్తుతిస్తూ కొన్ని పాటలను ఆలపించిన హనీఫాకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఓ కుమారుడు నవ్‌షత్ తండ్రి బాటలో నడిచి గాయకుడు అయ్యారు. హనీఫా కన్నుమూత: వయో భారంతో ఉన్న హనీఫా సతీమణి ఇటీవల అస్తమించారు. ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలతో కలసి ఒకే ఇంట్లో ఆయన నివాసం ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి చెన్నైలోని కొట్టూరు పురంలో నివాసంలో హనీఫా తుది శ్వాస విడిచారు.ఆయన మరణ సమాచారంతో డిఎంకే అధినేత ఎం కరుణానిధి ఉద్వేగానికి లోనయ్యారు. కరుణానిధి,పార్టీ కోశాధికారి ఎంకే స్టాలి న్,ఎంపి కనిమొళి, నేతలు రాజ తదితరులు కొట్టూరు పురంకు చేరుకున్నారు. హనీఫా భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సమయంలో హనీఫా భౌతిక కాయాన్ని తీక్షణంగా చూస్తూ కరుణానిధి ఉద్వేగానికి లోనయ్యారు. నాగూర్‌కు తరలింపు: నాగూర్ హనీఫా భౌతిక కాయాన్ని గురువారం ఉదయాన్నే ఆయన స్వగ్రామం నాగూర్‌కు తరలించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో నాగపట్నం జిల్లా నాగుర్కు చేరుకున్న ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. అక్కడి నూర్ షా తైకాల్ వీధిలోని సొంత ఇంటిలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. ఆప్తులు, బంధువుల సందర్శనానంతరం సాయంత్రం సంప్రదాయ పద్దతిలో ఊరేగింపుగా నాగర్ దర్గా ఆవరణకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక ప్రార్ధన అనంతరం ముస్లీంల స్మశాన వాటికలో వారి సంప్రదాయ బద్దంగా భౌతిక కాయాన్ని ఖననం చేశారు. -
ఎడిటర్ కిషోర్ ఇకలేరు
తమిళసినిమా: సినీ ఎడిటర్ కిషోర్ (37) శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఈరం చిత్రం ద్వారా ఎడిటర్‌గా పరిచయం అయిన కిషోర్ ఆడుగళం, పయనం, కాంచన, ఆరోహరణం, ఎంగేయుం ఎప్పోదుం, పరదేశి, ఎదిర్ నీశ్చల్ వంటి విజయవంతమైన చిత్రాలకు పని చేశారు. ఆడుగళం చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ మధ్య విచారణై చిత్రానికి పని చేస్తుండగా అనూహ్యంగా స్పృహ కోల్పోవడంతో వెంటనే వడపళనిలోని విజయా ఆసుపత్రిలో చేర్చారు. కిషోర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడుకు చేరే నరం మూసుకుపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆయనకి శస్త్ర చికిత్స చేశారు. అయినా ఫలితం లేకపోయింది. వారానికి పైగా కోమాలో ఉన్న కిషోర్ శుక్రవారం కన్నుమూశారు. అవయవదానం: కిషోర్ శరీరంలోని అవయవాలను ఆయన తల్లిదండ్రులు దా నం చేయడానికి అంగీకరించారు. దీంతో నగరంలోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రికి అవయవదానం చేశారు. శుక్రవారం రా త్రి 11 గంటలకు ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా కిషోర్ హృదయం, కళ్లు, కాలేయం తదితర అవయవాలను వేరు చేసి శనివారం ఉదయం పార్థివ దేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కిషోర్ భౌతిక కాయాన్ని స్థానిక సాలిగ్రామంలోని ఆయన ఎడిటింగ్ రూమ్ వద్ద సినీ వర్గాలు దర్శనార్థం ఉంచారు. శనివారం సాయంత్రం ఆయన సొంత ఊరు విల్లుపురం జిల్లా వళువసూరు గ్రామానికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కిషోర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. కిషోర్ భౌతిక కాయానికి ఎడిటర్ మోహన్, వెట్రిమారన్, ఎస్పీ జోనదన్, సర్గుణం, వేల్‌రాజా, దురై సెంథిల్‌కుమార్, ఎంగేయుం ఎప్పోదుం శరవణన్, ధరణి, ఎస్.ఎళిల్, జి.వి.ప్రకాష్‌కుమార్, శివకార్తికేయన్, సుబ్రమణి శివ, పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిం చారు. -
సినీదిగ్గజానికిది.. సెంటిమెంట్ సిటీ
-
మన గడ్డంటే ‘మూవీ మొఘల్’కు ఎంత మక్కువో..
అమలాపురం టౌన్ :వెండితెరకు ‘ప్రేమనగర్, జీవనతరంగాలు’ వంటి ఎన్నో కళాఖండాలను నజరానాగా ఇచ్చిన మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడికి గోదావరి జిల్లాలంటే వల్లమాలిన అభిమానం. ఇక్కడి గోదావరి పరవళ్లు, ప్రకృతి అందాలంటే ప్రాణం. గ్రామీణ వాతావరణంతో ముడిపడ్డ కథ అయితే గోదావరి , ఏటిగట్లు, లంకలు, పల్లెపట్టుల్నే ఎంచుకుని చిత్రీకరించే వారు. జిల్లాలో ముఖ్యంగా కోనసీమలో షూటింగ్ జరిగేటప్పుడు రామానాయుడు చిత్రీకరణ పర్యవేక్షణపై కంటే గోదావరి పరవళ్లనే చూస్తూ మురిసిపోయేవారు. నూటయాభై చిత్రాల ఆ మహానిర్మాత మరణం జిల్లావాసులను కలచివేస్తోంది. దాదాపు నలభైఏళ్ల క్రితం శోభన్‌బాబు హీరోగా, 2005లో తరుణ్ హీరోగా ‘సోగ్గాడు’ పేరుతో రామానాయుడు తీసిన రెండు సినిమాలను జిల్లాలోని గోదావరి తీరాల్లో చిత్రీకరించారు. ఇక 1982లో శోభన్‌బాబు, శ్రీదేవి, జయప్రదలతో నిర్మించిన ‘దేవత’ చాలా వరకూ కోనసీమలోని గోదావరిపాయల్లో, లంకల్లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ‘వెల్లువొచ్చి గోదారమ్మా... వెల్లాకిలా పడ్డాదమ్మా’ అనే పాట కోనసీమవాసుల నోట నేటికీ పల్లవిస్తూనే ఉంటుంది. మామిడికుదురు మండలం పెదపట్నంలంకను ఆనుకుని ప్రవహించే వైనతేయ నదీ తీరాన..లంకలో ఆ పాటను పూర్తిగా చిత్రీకరించారు. పాట ఆద్యంతం గోదావరిలో తేలియాడుతూ కనిపించే బిందెలను అమర్చినప్పుడు దర్శకుడు రాఘవేంద్రరావుకు రామానాయుడు పలు సూచనలు ఇచ్చారని ఆ గ్రామస్తులు అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. అమలాపురం వచ్చి బాలయోగికి నివాళులు ‘చంటి’ సినిమాకు కె.ఎస్.రామారావు నిర్మాతైనా అందులో తన కుమారుడు సురేష్ కూడా భాగస్వామి కాావటంతో రామానాయుడు కోనసీమలో ఆ చిత్రం షూటింగప్పుడు వారం రోజులు రాజోలులో మకాం చేశారు. మలికిపురం మండలం కేశనపల్లిలోని శంకరగుప్పం కౌశిక కాల్వలో ‘ఎన్నెన్నో అందాలు’ అనే పాటను చిత్రీకరించినప్పుడు ఆ గ్రామంలో రామానాయుడు నాలుగు రోజులు గడిపారు. 1998లో రాజశేఖర్ హీరోగా ‘శివయ్య’ సినిమాను అల్లవరం మండలం కోడూరుపాడు, బోడసకుర్రు వైనతేయ ఒడ్డున చిత్రీకరించారు. ఈ సినిమాలోని పలు దృశ్యాలకు అప్పటి రాష్ట్ర మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు క్లాప్ కొట్టారు. ‘అహనా పెళ్లంట, ముందడుగు, నాయుడుగారి కుటుంబం, నువ్వులేక నేను లేను, హిందీ చిత్రం అనారీ’ల షూటింగ్ కూడా వంటి కోనసీమలో ఎక్కువశాతం జరిగింది. 2002లో అప్పటి లోక్‌సభ స్పీకర్ బాలయోగి మృతి చెందినప్పుడు రామానాయుడు అమలాపురం వచ్చి ఎస్కేబీఆర్ కళాశాలలో ఉంచిన బాలయోగి భౌతికకాయానికి నివాళులర్పించారు. ‘అన్నదాతా! సుఖీభవ’ అని దీవించారు.. మండపేట రూరల్ : ముందు వచ్చిన ‘సోగ్గాడు’లో హీరో శోభన్‌బాబు రైతు బిడ్డగా ఎడ్లబండిపై పంట పొలాల్లో వెళుతున్న దృశ్యాలను మండపేట తదితర ప్రాంతాలతో పాటు కోనసీమలోనూ చిత్రీకిరించారు. మండపేటలో చౌదరి అనే రైతుకు చెందిన ఎడ్లను, బండిని ఆ సినిమాలో ఉపయోగించారు. రామానాయుడు ఆ ఎడ్లను చూసి మురిసిపోవటమే కాక వాటితో సరదాగా గడిపేవారని మండపేట ప్రాంత వాసులు చెబుతున్నారు. అప్పట్లో తెల్లదుస్తులు, నల్లకళ్లజోడుతో హుందాగా కనిపించే రామానాయుడుని చూసి ‘ఈయనా సోగ్గాడే’ అని ఇక్కడి వారు వ్యాఖ్యానించేవారు. మూడేళ్ల కిందట ‘బెండు అప్పారావు’ చిత్రీకరణ సమయంలో కూడా రామానాయుడు రాజమండ్రి, తాపేశ్వరరం వంటి ప్రదేశాల్లో కొద్దిరోజులు ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ శ్రీభక్తాంజనేయ స్వీట్‌స్టాల్‌లో మూడు రోజులు జరిగింది. అక్కడే ఉండి పర్యవేక్షించిన రామానాయుడు ఆ మూడురోజులూ శ్రీభక్తాంజనేయస్వీట్స్టాల్లోనే భోజనం చేశారు. ఆయన సమయపాలనను, భోజనం చేసిన అనంతరం ‘అన్నదాతా సుఖీభవ’ అని దీవించారని శ్రీభక్తాంజనేయస్వీట్స్టాల్ యాజమాన్యం, సిబ్బంది ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆయన మృతి పట్ల స్వీట్‌స్టాల్ అధినేత సలాది శ్రీనుబాబు, సిబ్బంది సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనకు మూడు రోజులు భోజనం పెట్టే అవకాశం కలగడం మరువలేని అనుభూతి అన్నారు. మొక్కలంటే తగని మక్కువ కడియం : రామానాయుడికి మొక్కలంటే అమితమైన ఆసక్తి అని కడియం నర్సరీ రైతులు గుర్తు చేసుకున్నారు. ఆయన మరణవార్త విని దిగ్భ్రాంతి చెందిన వారు పలు సినిమా షూటింగ్‌లకు ఆయన తమ నర్సరీలకు వచ్చిన రోజులను గుర్తు చేసుకున్నారు. వచ్చినప్పుడల్లా వివిధ రకాల మొక్కలను గురించి ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకునే వారని చెప్పారు. ‘నాయుడుగారికుటుంబం, పరువుప్రతిష్ట’ వంటి చిత్రాల్లో పలు సన్నివేశాలతోపాటు, ఏవీఎస్ దర్శకత్వంలో నిర్మించిన ‘శ్రీకట్నలీలలు’ అధికభాగం పల్ల వెంకన్న నర్సరీలోనే చిత్రీకరణ జరుపుకొంది. ఈ నేపథ్యంలో రామానాయుడితో ఏర్పడిన అనుబంధాన్ని పల్లవెంకన్న గుర్తు చేసుకున్నారు. -
నవ్వుల 'నారాయణ'కు.. కన్నీటి వీడ్కోలు..
-
ఎమ్మెస్ నారాయణ అంత్యక్రియలు పూర్తి
-
ఎంఎస్ నారాయణ ఇక లేరు
చికిత్స పొందుతూ కన్నుమూత ఫిలిం చాంబర్లో పార్థివదేహానికి ప్రముఖుల నివాళి కేసీఆర్, చంద్రబాబు, జగన్ సహా పలువురు నేతల సంతాపం నేడు ఈఎస్ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, దర్శకుడు, రచయిత ఎం.ఎస్.నారాయణ (63) ఇక లేరు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9:45 గంటలకు కన్నుమూశారు. సంక్రాంతి సందర్భంగా స్వస్థలం భీమవరం వెళ్లిన ఎంఎస్‌కు ఫుడ్ పాయిజన్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. గుండెపోటు రావడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించి కన్నుమూశారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సినీప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఎం.ఎస్. నారాయణ భౌతికకాయాన్ని కిమ్స్ ఆస్పత్రి నుంచి ఫిలిం చాంబర్‌కు తరలించారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటులు మురళీమోహన్, బాబూమోహన్, తనికెళ్ల భరణి, సుమన్, వెంకటేశ్, రాంచరణ్ తేజ్, అలీ, వేణుమాధవ్, నాగబాబు, ఎల్బీ శ్రీరాం, అనంత్ తదితరులు ఎం.ఎస్. నారాయణ భౌతికాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలు శనివారం ఉదయం 10 గంటలకు ఈఎస్ఐ శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎం.ఎస్. నారాయణ మృతిపట్ల దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి, బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. 700 చిత్రాల్లో నవ్వులు... పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన మైలవరపు బాపిరాజు, వెంకట సుబ్బమ్మ దంపతులకు మూడో సంతానంగా 1951 ఏప్రిల్ 16న జన్మించిన ఎం.ఎస్. నారాయణ ‘ఎం. ధర్మరాజు ఎం.ఎ’ చిత్రం ద్వారా నటుడిగా సినీరంగప్రవేశం చేశారు. ఆయన ఇప్పటివరకు 700పైగా చిత్రాల్లో నటించారు. రుక్మిణి, పెదరాయుడు, ఒట్టేసి చెబుతున్నా, సొంతం, దిల్, దుబాయ్ శీను, శశిరేఖా పరిణయం, దూకుడు.. వంటి చిత్రాల్లో తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. తనయుడు విక్రమ్‌ను కథానాయకునిగా పరిచయం చేస్తూ, తొలి ప్రయత్నంగా ఆయన ‘కొడుకు’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ‘భజంత్రీలు’ సినిమాని తెరకెక్కించారు. శుక్రవారం విడుదలైన ‘పటాస్’లో ఆయన చేసిన ‘సునామీ స్టార్ సుభాశ్’ పాత్ర ఆ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భీమవరంలో విషాద ఛాయలు ఎం.ఎస్. నారాయణ మృతితో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నిడమర్రులో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన నిడమర్రులో జన్మించినా.. సినీరంగానికి రాకముందు ఎక్కువ కాలం భీమవరంలోనే గడిపారు. భీమవరం ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసిన ఎం.ఎస్. నారాయణ 1978 అక్టోబర్ 30న కేజీఆర్ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా చేరి 23 ఏళ్లపాటు అందులో పనిచేశారు. ఆయన పాఠం చెబుతుంటే.. ఇతర తరగతుల విద్యార్థులంతా ఆ తరగతికి వెళ్లి మరీ ఎమ్మెస్ పాఠాలను వినేవారు. హాస్యం జోడించి ఆయన పాఠాలు చెప్పే విధానం విద్యార్థుల్ని విశేషంగా ఆకర్షించేది. ఎం.ఎస్. నారాయణ విద్యార్థులతో నాటకాలు వేయించేవారు. ఆంధ్రా యూనివర్సిటీ స్థారుులో నిర్వహించిన నాటక పోటీల్లో ఆయన రచించి, దర్శకత్వం వహించిన ‘రెండు రెళ్లు ఆరు’ నాటకానికి 8 బహుమతులు వచ్చారుు. ‘ఉపాధ్యాయుడి స్థారుు నుంచి ఎం.ఎస్. నారాయణ స్వయం కృషితో లెక్చరర్, ఆ తరువాత సినీ రంగానికి వెళ్లారు. కథా రచరుుతగా స్థిరపడాలనుకున్న ఆయన ప్రతి శనివారం సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి చెన్నై వెళ్లి సోమవారం తిరిగి వచ్చేవారు. అక్కడకు వెళ్లినప్పుడు ఉండటానికి రేలంగి నరసింహరావు ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అనుకోకుండా హాస్యనటుడిగా స్థిరపడ్డారు’ అని ఎం.ఎస్. నారాయణతో కలసి పనిచేసిన లెక్చరర్లు జి.హరిప్రసాద్, తాడి లక్ష్మణరావు, టీవీ రమణ, జేవీవీ నాగేశ్వరరావు చెప్పారు. -
ఎంఎస్ నారాయణ ఇకలేరు.
-
ఎమ్మెస్ మా గుండెల్లో ఉంటారు: ఆలీ
-
కామెడికి పెద్ద లోటు: ఎస్వీ కృష్ణారెడ్డి
-
"అందరూ నవ్వూతూ ఉండాలనుకునేవారు"
-
'ఎంఎస్ ప్రేమపెళ్లి చేసింది నేనే'
హైదరాబాద్ : ఎంఎస్ నారాయణ నటుడుగా, రచయితగా మాత్రమే ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమకు తెలుసునని... అయితే అతడు తనకు విద్యార్థి అని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఎంఎస్‌కు తాను పాఠాలు చెప్పానని.. కులాంతర వివాహానికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోతే అతని పెళ్లికి పెద్దరికం వహించింది తానేనని చెప్పారు. కళాప్రపూర్ణను ఎంఎస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్నారు. బతుకుదెరువు కోసం ఎంఎస్ ఓ సినిమా థియేటర్లో బుకింగ్ క్లర్క్‌గా పనిచేశాడని చెప్పారు. అనుకున్నది చేయాలి, ఎవరికీ అన్యాయం చేయకూడదనేది ఎంఎస్ నైజం అని పరుచూరి తెలిపారు. ఎంఎస్, అతని భార్య కళాప్రపూర్ణ భీమవరంలో ఉద్యోగం చేసేవారని, చిత్ర పరిశ్రమలోకి వచ్చే ముందు తననే కలిశాడని ఆయన పేర్కొన్నారు. సినీ రచయితగా తన ప్రస్థానం ప్రారంభించాడని, అయితే ఒకానొక సమయంలో అవకాశాలు రాకపోవటంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావటంతో తిరిగి వెళ్లిపోతానని చెప్పాడని, అయితే ప్రతి ఒక్కరికీ మంచి రోజు వస్తుందని, అప్పటివరకూ ఓర్చుకోవాలని ఎంఎస్‌కు తాను ధైర్యం చెప్పానన్నారు. ఆ తర్వాత 'మా నాన్నకు పెళ్లి' చిత్రం ద్వారా ఎంఎస్ దశ తిరిగిందని, అప్పటి నుంచి ఇప్పటివరకూ వెనక్కి తిరిగి చూడలేదని పరుచూరి అన్నారు. అనంతరం తనను కలిసిన ఎంఎస్ .. వెళ్లిపోవద్దని మంచి సలహా ఇచ్చారు మాస్టారు అని అన్నాడని ఆయన తెలిపారు. ఆరోగ్యం గురించి ఎంఎస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, గురువారం కూడా అతడిని చూశానని, అతనికి ఉన్న ధైర్యాన్ని చూస్తే త్వరగా కోలుకుంటాడనుకున్నానన్నారు. నిన్న ఉంటాడనుకున్న వ్యక్తి నేడు లేకపోవడం బాధాకరమని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. -
పైన వినోదం కరువై తీసుకెళ్తున్నారేమో..
-
'ఎంఎస్‌తో అవే నా చివరి మాటలు'
హైదరాబాద్ : ఎంఎస్ నారాయణ గురించి ఎంత చెప్పినా తనివి తీరదని హాస్యనటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్ అన్నారు. ఆయన శుక్రవారం కిమ్స్‌లో ఎంఎస్ నారాయణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ తామిద్దరం కలిసి అనేక సినిమాల్లో నటించామన్నారు. ఇటీవలే ఎంఎస్ నారాయణ తనకు ఫోన్ చేసి అరగంట మాట్లాడారన్నారు. ఆయన ఇటీవల తాను నటించిన ఓ సినిమాలో నటించికపోయినా...తన నటనను అభినందించారన్నారు. తన సినిమా ఇంకా విడుదల కాలేదని, అయితే ప్రివ్యూ చూసిన ఎంఎస్ నారాయణ... ఉండబట్టలేక తనకు ఫోన్ చేశానని చెప్పారన్నారు. 'ఎల్బీగారు మీ సినిమా చూశాను. అద్భుతంగా నటించారు. మీరు ఏడ్వకుండా..చూసేవారిని ఏడ్పించారని' ఎంఎస్ తనతో అన్నారని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అదే ఆయనతో తాను చివరిగా మాట్లాడటం అని తెలిపారు. తెల్లారి లేస్తే ఎంతోమందిని నవ్వించే కమెడియన్లకు అదే టానిక్ అని... అందర్ని నవ్వేంచేవాళ్లు భౌతికంగా లేకున్నా వందేళ్లు బతకాలని ఎల్బీ శ్రీరామ్ అన్నారు. -
ఏ అడ్రస్ పట్టుకొని వెళ్ళిపోయాడో..
-
ఎంఎస్ నారాయణకు ట్విట్టర్ లో నివాళులు
హఠాత్తుగా ఎం ఎస్ గారిని కోల్పోవడంతో షాక్‌కు గురయ్యాను...అయనతో రెండు చిత్రాల్లో నటించాను . ఆయన ఆత్మకి శాంతి చేకురాలి.. ఎంఎస్ కుటుంబానికి బాసటగా నిలుద్దాం. -రకుల్ ప్రీత్ సింగ్ ఎంఎస్ నారాయణ అంకుల్ చాలా త్వరగా వెళ్లిపోయారు. నాకు ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు. నాన్నగారు ఆయన్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. వాళ్లమ్మాయి శశికిరణ్ దర్శకత్వం వహించిన సాహెబా సుబ్రహ్మణ్యం చిత్రం గురించి మాట్లాడారు. ఇంతలోనే ఇలా అయింది. మంచు లక్ష్మిప్రసన్న ఎంతో మందిని నవ్వించిన గొప్ప వ్యక్తి ....ఎంఎస్ నారాయణ గారి ఆత్మకి శాంతి చేకూరాలి. -నటుడు రాహుల్ రవీంద్రన్ మీతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మిమ్మల్ని కోల్పోవడం చాలా బాధాకరం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి . ఆయన కుటుంబానికి అండగా నిలుద్దాం. -నటుడు వరుణ్ తేజ్ మా అందరికి ఆనందాన్నిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు....మా అందరిని వదిలి వెళ్లడం చాలా దారుణం. మీ ఆత్మకి శాంతి చేకూరాలి సర్. సుశాంత్ ఎంఎస్ నారాయణ ఉత్తమమైన వ్యక్తిత్వం గల వారు. అయనలాంటి నటున్ని తిరిగి పొందలేము. మీ ఆత్మకి శాంతి చేకూరాలి సర్. -సమంత ఎంఎస్ గారు అన్ని తెలిసిన వ్యక్తి. ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, అంతేకాకుండా దయా హృదయం గలవాడు. తెలుగు చిత్ర పరిశ్రమకి, లక్షలాది అభిమానులకి ఆయన లేరనే వార్త నిజంగా తీరని లోటే -సిద్దార్థ -
నాన్న తిరిగి వస్తారనుకున్నాం...
హైదరాబాద్ : 'ఇది నిజంగా మాకు షాకింగ్. నాన్న తిరిగి వస్తారనుకున్నాం. మలేరియానే కదా తగ్గిపోద్దనుకున్నాం...ఇలా మనిషిని తినేస్తుందనుకోలేదు' అని ఎంఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్ కన్నీటి పర్యంతమయ్యారు. అభిమానుల సందర్శనార్థం నాన్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్లో ఉంచుతామని, అనంతరం ఇంటికి తరలిస్తామన్నారు. అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎంఎస్ నారాయణ శుక్రవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఎంఎస్ నారాయణ ఆరోగ్యం విషమంగా ఉందంటూ గురువారమే వార్తలొచ్చాయి. అయితే ఆయన కోలుకుంటున్నారని కుటుంబసభ్యులు చెప్పడంతో... అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కానీ ఇంతలోనే చేదువార్త. గుండెపోటు కారణంగా వెంటిలేటర్ సాయంతో వైద్యం అందుకుంటున్న ఎంఎస్ తుదిశ్వాస విడిచారంటూ కొద్దిసేపటి క్రితమే కిమ్స్ వైద్యులు ధృవీకరించారు. ఈ వార్తతో సినీ అభిమానులు, హాస్య ప్రియులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సంక్రాంతికి భీమవరం వెళ్లిన ఎంఎస్‌కు అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యిందనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత విషాహారం కారణంగానే ఆయన ఆస్పత్రి పాలయ్యారని కూడా చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌కి తీసుకొచ్చిన తర్వాత... ఆయనకు గుండెనొప్పి రావడంతో కిమ్స్ లో మూడు స్టంట్స్ వేసినట్టు కూడా చెప్పారు. దీంతో ఆయన అనారోగ్యానికి విషాహారం కారణం కాదని తేలింది. ఎంఎస్ నారాయణ మృతితో తెలుగు సినీ పరిశ్రమకు ఒక గొప్ప హాస్యనటుడు దూరమయ్యారు. దశాబ్దాలుగా నవ్వులు పంచిన ఎమ్మెస్ ఆ నవ్వుల్నే మిగిల్చి వెళ్లిపోయారు. -
మలేరియా ఇలా ప్రాణం తీస్తుందనుకోలేదు..
-
మల్టీ ఆర్గాన్స్ పని చేయకపోవటం వల్లే..
హైదరాబాద్ : ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం ఈరోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి నాలుగు గంటల వరకూ ఎంఎస్ నారాయణ భౌతికకాయాన్ని ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉంచుతారు. అనంతరం ఆయన నివాసానికి తరలిస్తారు. కాగా ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు ఎక్కడ జరిపేది ఈరోజు సాయంత్రం ఆయన కుటుంబసభ్యులు నిర్ణయిస్తామని నటుడు అనంత్ తెలిపారు. మరోవైపు ఎంఎస్ మృతిపై కొండాపూర్ కిమ్స్ వైద్యులు శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మధుమేహం, గుండెపోటుతో ఎంఎస్ ఆస్పత్రిలో చేరారని, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు పని చేయకపోవటంతో ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. ఉదయం 9.40 నిమిషాలకు ఎంఎస్ తుదిశ్వాస విడిచినట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు. -
ఎమ్మెస్ను గుర్తుతెచ్చే సన్నివేశాలివీ!
-
'ఎంఎస్ మరణం నాకు తీరని లోటు'
హైదరాబాద్ : ఎంఎస్ నారాయణ ఎంత గొప్ప నటుడో, అంత ఆత్మీయుడని హాస్యనటుడు కొండవలస అన్నారు. ఆయన స్వర్గస్తులయ్యారంటే మనసు చలించిపోతోందన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతుంటే ఎంఎస్ ఆదరించి, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారన్నారు. విభిన్న పాత్రలు చేసిన ఎంఎస్...సెట్లో ఉన్నప్పుడు తోటి నటులకు సలహాలు ఇచ్చేవారని, అనవసరపు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వొద్దు... అవసరం ఉన్నంతవరకూ నటించాలని అనేవారని కొండవలస తెలిపారు. క్రమశిక్షణ లేనిదే సినిమా రంగంలో రాణించలేరని, డిసిప్లెస్ వల్లే ఎంఎస్ ఈ స్థాయికి ఎదగగలిగారన్నారు. ఎంఎస్ నారాయణ మృతి తనకు, తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటు అని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొండవలస అన్నారు. ఎంఎస్ కుటుంబసభ్యులకు కొండవలస ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంఎస్ నారాయణ గురించి మాట్లాడేందుకు తనకు మాటలు రావటం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. -
టాలీవుడ్‌కు ఏదో పట్టుకుంది...
రాజమండ్రి : హాస్య నటుడు ఎంఎస్ నారాయణ మృతి తెలుగు చిత్రపరిశ్రమకు షాకింగ్ న్యూస్ అని సినీనటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఎమ్మెస్ నారాయణ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారన్నారు. సినిమా, సినిమాకు ఆయన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉండేవన్నారు. మొదటి సారిగా ఎంఎస్ నారాయణ తన దగ్గరకు కథ చెప్పడం కోసం వచ్చారని, అనుకోకుండా ఈవీవీ సత్యనారాయణ ద్వారా నటుడుగా మారారని మురళీమోహన్ తెలిపారు. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకూ ఆయన నటన వినూత్నంగానే ఉండేదని గుర్తు చేసుకున్నారు. నిన్న ఆయన మృతిపై వదంతులు వచ్చాయని, దాంతో వెంటనే ఎంఎస్ కుమార్తె శశికిరణ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. అలాగే కిమ్స్ ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి ఎంఎస్ నారాయణ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కోరినట్లు మురళీమోహన్ తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏదో పట్టుకుందని, 23 రోజుల్లో ఇది నాలుగో చావు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎంఎస్ నారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని మురళీమోహన్ పేర్కొన్నారు. -
ఎంఎస్ నారాయణ ఇకలేరు..
-
గుత్తా సోదరులకు మాతృవియోగం
చిట్యాల/చైతన్యపురి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నార్మక్స్ చైర్మన్ జితేందర్‌రెడ్డి తల్లి సరస్వతమ్మ(80) ఆకస్మికంగా మృతిచెందారు. సరూర్‌నగర్‌లోని సుఖేందర్‌రెడ్డి సోదరుడు మధర్డెయిరీ చైర్మన్ జితేందర్‌రెడ్డి ఇంటిలో ఆమె తుదిస్వాస విడిచారు. మృతి వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖు లు, బంధువులు సోమవారం ఉదయం ఆమె పార్థీవశరీరాన్ని సందర్శించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు. తల్లి చని పోయిన సమయంలో ఆమె రెండవ కుమారుడు జితేందర్‌రెడ్డి దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఆమె మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం స్వగ్రామమైన చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి తీసుకొచ్చారు.జితేందర్‌రెడ్డి సాయంత్రం ఉరుమడ్లకు చేరుకున్న తరువాత అంత్యక్రియలు నిర్వహించారు. ప్రముఖుల నివాళి కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి, తెలంగా ణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య, వరంగల్ ఎంపీ సీతారాంనాయక్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరుజానారెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎస్పీ ప్రభాకర్‌రావు, డీఈఓ విశ్వనాథరావు, భువనగిరి ఎంపీ భూర నర్సయ్యగౌడ్, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీం ద్రనాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఎమ్మెల్సీలు కర్నెప్రభాక ర్, పూలరవీందర్, మాజీఎమ్మెల్యేలు జూలకంటిరంగారెడ్డి, నర్సింహయ్య, ఉజ్జని యాదగిరిరావు, డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్, భువనగిరి, మిర్యాలగూడ, మేడ్చల్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నర్రా రాఘవరెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎలిమినేటి ఉమామాదవరెడ్డి, గుత్తా మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భారతి రాగ్యనాయక్, డీసీసీబీ చైర్మన్ పాండురంగారావు, సుం కరి మల్లేష్‌గౌడ్, తూడి దేవెందర్‌రెడ్డి, గూడురు నారాయణరెడ్డి, కర్నాటి లింగారెడ్డి, బోందుగుల నర్సింహారెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బడుగుల లింగయ్య యా దవ్, మోతె సోమిరెడ్డి, మార్కెండేయు లు, రెగట్టె నర్సింహారెడ్డి, రెగట్టె మల్లికార్జున్‌రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య యాదవ్, శేపూరి రవీందర్, అల్లంపల్లి నర్సింహ, గాదె నిరంజన్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, గుండగోని వెంకటేశ్వర్లు, గంట్ల దయాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి తది తరులు నివాళులర్పించారు. -
పీఆర్వో శంకర్ గణేష్ కన్నుమూత
సీనియర్ పీఆర్వో శంకర్ గణేష్ (77) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన సినీ రంగంలో పలు విభాగాల్లో అనుభవం గడించారు. తిరునెల్వేలికి చెందిన శంకర్ గణేష్ చెన్నైకి వచ్చిన తొలి రోజుల్లో వీనస్ మూవీస్ రత్నం వద్ద పని చేశారు. ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్‌గా తేన్‌మళై చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఈయన నిశ్చల ఛాయాగ్రాహకుడిగా సందేశమిత్రన్ అనే పత్రిక లో పని చేశారు. ఆ తరువాత సినీ పీఆర్వోగా పని చేశారు. అదే విధంగా కొంతకాలం దివంగత మాజీ మంత్రి మురసోలిమారన్‌వద్ద కొంతకాలం సహాయకుడిగా పని చేశారు. సిల్క్‌కు సినిమా అనే పత్రికను ఆరేళ్లు నడిపారు. అనంతరం సినీ పీఆర్వో సంఘానికి కార్యదర్శిగా పని చేశారు. శంకర్ గణేష్ నాలుగేళ్లపాటు ప్రముఖ దినపత్రిక ఁసాక్షిరూ.లో పని చేశారు. ఈయన భార్య కొద్దికాలం క్రితమే కాలంచేశారు. వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో స్థానిక రాయపేటలోని ఆస్పత్రిలో చికిత్స పొందిన శంకర్‌గణేష్ ఆదివారం కన్నుమూశారు. -
ఆత్మబలంతో నెగ్గిన దసరా బుల్లోడు!
తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. 1960, 70లలో దాదాపు అరవై ఏళ్ళ క్రితం సమాజంపై సినిమాల ప్రభావం,ప్రజల్లో సినిమాల పట్ల క్రేజు ఎక్కువవుతున్న రోజుల్లో తెలుగు నేలపై కోస్తా తీరం నుంచి సినీ రంగంలోకి వచ్చిన తరానికి చెందిన వ్యక్తి - వి.బి. రాజేంద్రప్రసాద్‌గా ప్రసిద్ధులైన వీరమాచనేని బాబూ రాజేంద్రప్రసాద్. నాటకాల్లో నటించి, ఆ అనుభవం, ప్రేమతో అటు నుంచి వెండితెరపైకి వచ్చారాయన. నటుడు కావాలనే కోరికతో సినీ రంగానికి వెళ్ళినా, నిర్మాతగా మొదలై, అపూర్వమైన విజయాలు సాధించి, అనుకోని రీతిలో దర్శకుడిగా మారి, ఆ విభాగంలోనూ రాణించిన ఘనత ఆయనది. రంగస్థలంపై స్త్రీ పాత్రధారి! ఎనభై రెండేళ్ళ క్రితం 1932 నవంబర్ 4న కృష్ణాజిల్లా ఉయ్యూరులో జన్మించిన వి.బి. రాజేంద్ర ప్రసాద్ స్వగ్రామం - గుడివాడ తాలూకా డోకిపర్రు గ్రామం. ఆయన తండ్రి జగపతిరావు చౌదరి భూస్వామి. స్కూలు చదువంతా పామర్రు, గన్నవరం, బందరుల్లో చేసిన ఆయన కాకినాడ పి.ఆర్. కాలేజీలో బి.ఎస్సీ చేశారు. కాలేజీ రోజుల్లోనే నటనపై మోజుతో ఆయన రంగస్థలం వైపు ఆకర్షితులయ్యారు. ఇప్పటి ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆ సమయంలోనే అదే కాలేజీలో బి.ఏ. చదువుతున్నారు. తరువాతి రోజుల్లో ీసినీ హీరోగా రాణించిన హరనాథ్ వీళ్ళకు ఒక ఏడాది జూనియర్. మరికొందరితో కలసి వీరంతా ఒక బృందంగా ఏర్పడి, నాటక రంగ ప్రముఖుడు బళ్ళారి రాఘవ పేరిట ‘రాఘవ కళా సమితి’ ఏర్పాటు చేసి, ఆ గొడుగు కింద నాటకాలు ప్రదర్శించేవారు. వడ్డాది సూర్యనారాయణ, తరువాత కాలంలో సినీ రంగంలో పేరు తెచ్చుకున్న విజయచందర్, అర్జా జనార్దనరావు, మాడా వెంకటేశ్వరరావు తదితరులు ఆ సంస్థలో కీలకసభ్యులు. ఆనాటి రంగస్థల ప్రముఖుడు డాక్టర్ గరికపాటి రాజారావుతో ఆ సంస్థను ప్రారంభించారు. ఆ రోజుల్లో రాజేంద్రప్రసాద్ రంగస్థలంపై ఆడవేషాలు కూడా వేసి, మెప్పించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ‘అంతర్ కళాశాలల నాటక పోటీ’ల్లో ఆత్రేయ ‘కప్పలు’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, రాజేంద్రప్రసాద్ కథానాయిక పంకజం పాత్రను అద్భుతంగా పోషించారు. ఆ స్త్రీ పాత్రలో ఆయన ఉత్తమ నటిగా, అదే నాటకంలో ఏడిద నాగేశ్వరరావు ఉత్తమ నటుడిగా బహుమతులు గెల్చుకోవడం విశేషం. ఆత్రేయ ‘వరప్రసాదం’, రెంటాల గోపాలకృష్ణ ‘ఇన్స్పెక్టర్ జనరల్’, అవసరాల సూర్యారావు ‘పంజరం’, అనిసెట్టి సుబ్బారావు ‘చెప్పు కింద పూలు’, పినిశెట్టి శ్రీరామమూర్తి ‘ఆడది’ లాంటి నాటకాలను అనేక చోట్ల ప్రదర్శించి, బహుమతులందుకున్నారు. తండ్రి పేరిట చిత్ర నిర్మాణ సంస్థ అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయం రీత్యా, హీరోగా రాణించాలని సినీ రంగానికి వచ్చిన ఆయన అక్కినేని సలహాతో చిత్ర నిర్మాణం వైపు మళ్ళారు. తొలి సినిమా విఫలమైతే, వ్యవసాయానికి వచ్చేయాలని షరతు పెట్టి తండ్రి జగపతిరావు చౌదరి ఆయనకు యాభై వేలు ఇచ్చారు. తండ్రి పేరు మీదే తమ చిత్ర నిర్మాణ సంస్థకు ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ అని పేరు పెట్టారు రాజేంద్రప్రసాద్. మరో మిత్రుడు పి. రంగారావుతో కలసి స్థాపించిన ఆ సంస్థపై ఆయన నిర్మించిన తొలి చిత్రం - ‘అన్నపూర్ణ’. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఆ తరువాత వరుసగా ‘ఆరాధన’, ‘ఆత్మబలం’, ‘అంతస్తులు’, ‘ఆస్తిపరులు’, ‘అదృష్టవంతులు’ తదితర చిత్రాలను అందించారు. ఆ చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. అలా అతి కొద్ది కాలంలోనే తెలుగు చిత్రసీమలోని నాగిరెడ్డి - చక్రపాణిల ‘విజయ’, దుక్కిపాటి మధుసూదనరావు ‘అన్నపూర్ణ’ తదితర ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థల సరసన రాజేంద్రప్రసాద్ ‘జగపతి’కి స్థానం దక్కింది. ఆయన కొలువు... స్టార్స్‌కు నెలవు అక్కినేనికి బాగా సన్నిహితుడైన రాజేంద్రప్రసాద్ సహజంగా ఆయనతోనే అప్పట్లో ఎక్కువ సినిమాలు నిర్మించారు. ఆనాటి మరో ప్రముఖ నటుడు జగ్గయ్య ‘జగపతి’ వారి చిత్రాల్లో పర్మినెంట్ ఆర్టిస్ట్. ఇక, భానుమతి, ఎస్వీ రంగారావు, జమున, జయలలిత, బి. సరోజాదేవి, వాణిశ్రీ, మంజుల, శోభన్‌బాబు - ఇలా స్టార్స్‌తో రాజేంద్రప్రసాద్ చిత్రాలు ప్రేక్షకులకు కనువిందు చేసేవి. ఆయన తమ ‘అంతస్తులు’ చిత్రానికి జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. అలాగే, ‘ఆస్తిపరులు’ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ పురస్కారం లభించింది. అక్కినేని, బి. సరోజాదేవి నటించిన ‘ఆత్మబలం’ వానపాట ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ లాంటి వాటితో ఇవాళ్టికీ జనహృదయాల్లో నిలిచిపోయింది. ఆపద్ధర్మ దర్శకత్వం... ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్ ఇటు కథ, అటు పాటలు, మరోపక్క సంగీతం - ఇలా అన్నీ దగ్గరుండి చూసుకొనే ఆ తరం ఉత్తమ నిర్మాతల్లో వి.బి. రాజేంద్ర ప్రసాద్ ఒకరు. దర్శకుడు వి. మధుసూదనరావు డేట్స్ కుదరకపోవడంతో, అక్కినేని ప్రోత్సాహం అండగా, అనుకోని పరిస్థితుల్లో ‘దసరాబుల్లోడు’తో రాజేంద్రప్రసాద్ దర్శకుడయ్యారు. సినిమా రూపకల్పనపై, సామాన్య ప్రేక్షక జనం నాడిపై ఆయనకున్న అవగాహనకు సాక్ష్యం - వాణిశ్రీ, అక్కినేని నటించిన ‘దసరాబుల్లోడు’ అప్పట్లో ఆల్‌టైమ్ హిట్ కావడం! ఆ చిత్రంలోని ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల...’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా...’, ‘నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే...’ పాటలు ఇవాళ్టికీ జనం నోట నిలిచిపోయాయి. అలాగే, దర్శకుడిగా ఆయన రెండో చిత్రం ‘బంగారు బాబు’, ఆ సినిమాలో మళ్ళీ అదే అక్కినేని, వాణిశ్రీపై వచ్చే ‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది...’ పాట ఆ తరం ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే! ‘మంచి మనుషులు’, ‘బంగారు బొమ్మలు’, ‘ముద్దుల కొడుకు’, ‘ఎస్.పి. భయంకర్’, ‘కెప్టెన్ నాగార్జున’ తదితర చిత్రాలుఆయన దర్శకత్వంలోవే! తెలుగుతో పాటు తమిళంలో ‘ఎంగళ్ తంగరాజా’, ‘ఉత్తమన్’, ‘పట్టాకత్తి భైరవన్’, హిందీలో ‘రస్తా ప్యార్‌కే’, ‘బేకరార్’ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అలాగే, పల్లవి వారి ‘అందరూ దొంగలే’, అన్నపూర్ణా స్టూడియో వారి భాగస్వామ్యంతో తీసిన ఎన్టీఆర్ - ఏయన్నార్‌లతో ‘రామకృష్ణులు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తన చిత్రాల్లోని హిట్ పాటలను గీతమాలికగా రూపొందించి, ‘చిటపట చినుకులు’ పేరిట రెండు భాగాల సినిమాలుగా విడుదల చేసి, అక్కడా విజయం అందుకున్నారు. అలాగే, దర్శకుడు దాసరితో ‘లంచావతారం’, రవిరాజా పినిశెట్టితో ‘బంగారు బుల్లోడు’, ఫాజిల్‌తో ‘కిల్లర్’ తదితర చిత్రాలు అందించారు. కార్మికుల కోసం సినీ నిర్మాణం అభిరుచి గల నిర్మాతగా, సంస్కారవంతుడైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ అందుకు తగ్గట్లే తన కోసం శ్రమించే వారి బాగు చూసేవారు. జగపతి సంస్థలో పనిచేసే కార్మికుల బాగు కోసం ఆ రోజుల్లోనే ఆయన ‘పిచ్చిమారాజు’ అనే చిత్రం నిర్మించారు. ఆ చిత్రం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కార్మికులకే పూర్తిగా కేటాయించారు. అప్పట్లో మద్రాసులోని తెలుగు చిత్రసీమతో పాటు తమిళ, తదితర పరిశ్రమల్లోనూ అది పెద్ద సంచలనమైంది. ఆయన పెద్దకుమారుడి పేరు - రామ్‌ప్రసాద్. రెండో కుమారుడు - యోగేంద్రకుమార్, మూడో కుమారుడు జగపతిబాబుకు తన తండ్రి పేరునే పెట్టుకున్నారు రాజేంద్రప్రసాద్. తరువాతి కాలంలో కుమారుడు జగపతిబాబును ‘సింహస్వప్నం’ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేశారు. హీరో కావాలన్న తన చిన్నప్పటి కోరికను అలా కుమారుడి రూపంలో తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక చింతనలో... చిత్ర పరిశ్రమలో పరిస్థితులు మారి, నష్టాలు వచ్చాక ఆయన క్రమంగా చిత్ర నిర్మాణానికి దూరం జరిగారు. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాక, ఇక్కడి ‘ఫిలిమ్‌నగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’లో కీలక బాధ్యతలు పోషించారు. అలాగే, జీవితంలోని చివరి అంకాన్ని పూర్తిగా దైవభక్తిలో గడిపారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఫిలిమ్నగర్లో ఫిల్మ్‌చాంబర్ పక్కనే కొండపై నెలకొన్న దేవాలయాల సముదాయం ‘దైవసన్నిధానం’ నిర్మాణంలో ఆయన ముఖ్యపాత్ర వహించారు. చిత్రసీమకు చేసిన సేవకు గుర్తింపుగా 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ప్రతిష్ఠాత్మక ‘రఘుపతి వెంకయ్య అవార్డు’తో గౌరవించింది. కాగా, సీనియర్ సినీ జర్నలిస్టు భగీరథ ఈ సినీ దిగ్గజం జీవిత చరిత్రకు ‘దసరా బుల్లోడు’ పేరిట పుస్తకరూపం ఇవ్వడం విశేషం. చిన్నప్పటి నుంచి ఉబ్బసంతో బాధపడుతూ, కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతూ వచ్చిన రాజేంద్రప్రసాద్ సోమవారం రాత్రి కన్నుమూయడంతో పాత తరం ప్రముఖ దర్శక, నిర్మాతల్లో మరొకరు కనుమరుగయ్యారు. ఇవాళ ఆయన లేరు... కానీ, ఆయన సినిమాలు, వాటిలోని పాటలు మాత్రం తెరస్మరణీయంగా మిగిలిపోయాయి. టాప్ 5 మూవీస్ ఆరాధన (1962): సక్సెస్ఫుల్ ఎక్స్‌పెర్‌మెంట్ చాలా రిస్కీ కథాంశమిది. సినిమా సగంలో కథానాయకుడు గుడ్డివాడవుతాడు. ఏయన్నార్‌లాంటి రొమాంటిక్ హీరోతో ఇలాంటి సినిమా చేయడమంటే సముద్రంలో ఈత కొట్టడంలాంటిదే. దర్శక, నిర్మాత బీఎన్ రెడ్డి సగం షూటింగ్ అయ్యాక రష్ చూసి ‘మీ ప్రయత్నం వృథా’ అని హెచ్చరించినా, వీబీ రాజేంద్రప్రసాద్ వెన్ను చూపలేదు. కథే శ్రీరామరక్ష అనుకున్నారు. ఆయన మొండితనం, సాహసం ఫలించింది. ‘ఆరాధన’ సినీ చరిత్రలో నిలిచిపోయింది. ‘నా హృదయంలో నిదురించే చెలి’, ‘ఆడదాని ఓరచూపులో’, ‘వెన్నెలలోని వికాసమే’ లాంటి గొప్ప గొప్ప పాటలు ఇందులోవే. ఆత్మబలం (1964): వండర్ఫుల్ థ్రిల్లర్ ఒక్క పాటతో హిస్టరీలో నిలిచిపోవడం, హిస్టరీగా మారడం అంటే ఇదేనేమో! ఈ సినిమా పేరు చెప్పగానే ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ పాట గుర్తుకు రాకపోతే ఒట్టు. ఈ సినిమా లేకపోతే జగపతి సంస్థ లేదు. ‘ఆరాధన’ తర్వాత ప్రధాన భాగస్వామి చనిపోవడం, ఇతర భాగస్వాములు దూరమవడంతో ఒంటరైపోయారు వీబీ రాజేంద్రప్రసాద్. అయితే ఊరు తిరిగి వెళ్లిపోవాలి. లేకపోతే ఒంటరిగా సినీ సముద్రాన్ని ఈదాలి. వీబీ రాజేంద్రప్రసాద్ మొండివాడు. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలనుకున్నారు. అలా ‘ఆత్మబలం’ మొదలు పెట్టారు. హిట్టుకొట్టారు. ఇందులో ఏడు పాటలూ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. అదృష్టవంతులు (1969): అడ్వాన్స్డ్ యాక్షన్ ఏయన్నార్‌తో చేసిన యాక్షన్ సినిమా ఇది. మేకింగ్ చాలా అడ్వాన్డ్స్ థాట్స్‌తో ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్రెయిన్ ఫైట్ అయితే ఎక్స్లెంట్. గ్లామర్ హీరోయిన్ జయలలితతో మేల్ కేరెక్టర్ చేయించాలనుకోవడం తమాషా ఆలోచన. ఇందులో జగ్గయ్య విలన్‌గా చేశారు. ఆయన డెన్ని సీసీ టీవీలతో మోడ్రన్‌గా డిజైన్ చేయించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నాగార్జునకు ఈ సినిమాలో యాక్షన్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా విలన్ డెన్ సెటప్ ఆయనకు తెగ నచ్చేసింది. దసరా బుల్లోడు (1971): బాక్సాఫీస్‌కి న్యూ బ్లడ్ ఈ సినిమాతో అనుకోకుండా దర్శకుడయ్యారు వీబీ రాజేంద్రప్రసాద్. ‘జగపతి’ సంస్థ ఆస్థాన దర్శకుడైన వి. మధుసూధనరావు బిజీగా ఉండటంతో తానే మెగాఫోన్ పట్టాల్సి వచ్చింది. తొలి షెడ్యూలు కృష్ణా జిల్లాలో తీస్తే, రష్ మొత్త పోయింది. మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా అంతా దాదాపుగా అవుడ్డోర్‌లోనే తీశారు. సినిమా సూపర్‌హిట్టయ్యింది.అక్కినేని స్టెప్పుల హవా మొదలైంది ఈ సినిమాతోనే. ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా’, ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్’ తదితర పాటల కోసం కుర్రకారు వేలంవెర్రిగా ఎగబడ్డారు. అక్కినేని-వాణిశ్రీ కాంబినేషన్, పాటలు, స్టెప్పులు, మాటలు, మాస్ ఎలిమెంట్స్, మేకింగ్ వేల్యూస్‌తో బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిసింది. ఈ సినిమా విజయంతో వీబీ రాజేంద్రప్రసాద్ విజృంభించి దర్శకునిగా 17 సినిమాలు తీశారు. ‘దసరాబుల్లోడు’ని హిందీలో జితేంద్ర, రేఖ, షబనా ఆజ్మీతో ‘రాస్తే ప్యార్’గా రీమేక్ చేసి విజయం సాధించారు. బంగారు బాబు (1973): గెస్ట్ మల్టీ స్టారర్ ఓ సినిమా హీరోయిన్ పారిపోయి రహస్యంగా ఓ స్టేషన్ మాస్టర్ దగ్గర ఆశ్రయం పొందుతుంది. జీవితంలో కొంగొత్త రుచులేంటో చూస్తుంది. ఇదీ ‘బంగారు బాబు’ సినిమా కథ. అప్పట్లో ప్రేక్షకులకు చాలా కిక్కిచ్చిన కథ ఇది. ‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది’ అంటూ ఏయన్నార్, వాణిశ్రీ పాడిన డ్యూయెట్ ఇప్పటికీ రెపరెపలాడుతూనే ఉంటుంది. ప్రముఖ నటులు శివాజీ గణేశన్, రాజేష్‌ఖన్నా, కృష్ణ, శోభన్‌బాబులు గెస్ట్లుగా కనిపించడం అప్పట్లో నిజంగా గ్రేట్. జగమెరిగిన ‘జగపతి’వారి పాటలు చిటపట చినుకులు పడుతూ వుంటే - ఆత్మబలం (1964) ఎక్కడికి పోతావు చిన్నదానా - ఆత్మబలం నువ్వంటే నాకెందుకో అంత ఇది - అంతస్తులు (1965) అయ్యయ్యో బ్రహ్మయ్య - అదృష్టవంతులు (1968) మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో - అదృష్టవంతులు ము.. ము... ముద్దంటే చేదా - అదృష్టవంతులు చిటాపటా చినుకులతో కురిసింది వాన - అక్కాచెల్లెలు (1970) పాండవులు పాండవులు తుమ్మెద - అక్కాచెల్లెలు నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే - దసరా బుల్లోడు (1971) పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ - దసరా బుల్లోడు చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది - బంగారుబాబు (1973) ఏడడుగుల సంబంధం - బంగారుబాబు నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్లాలని - మంచి మనుషులు (1974) నీవు లేక నేను లేను - మంచి మనుషులు నేనీ దరిని నువ్వా దరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ - బంగారు బొమ్మలు (1977) చిటపట చినుకుల మేళం - ముద్దుల కొడుకు (1979) దులపర బుల్లోడా - ఆస్తిపరులు (1964) ప్రియా ప్రియతమా రాగాలు - కిల్లర్ (1991) -
కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి కన్నుమూత
-
విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి
నకిరేకల్ :విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా, నకిరేకల్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన మూసపాటి కమలమ్మ(72) బుధవారం రాత్రి మృతి చెం దారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె నిమ్స్‌లో చికిత్సపొందారు. ఆస్పత్రి నుంచి ఈ నెల 8న నాంపల్లిలోని తన సోదరిడి ఇంటికి వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి పరిస్థితి విష మించి మృతి చెందారు. ఆమె అంత్యక్రియ లను నాంపల్లిలోనే నిర్వహించారు. జీవితాం తం కుమారిగానే ఉండి తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసారామె. నకిరేకల్ స్థానం నుంచి ఆరుసార్లు ప్రాతినిథ్యం వహించిన నర్రారాఘవరెడ్డిపై పోటీ చేసి గెలుపొందిన రికార్డు ఆమెకే సొంతమైంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే మూసపాటి కమలమ్మ మృతి చెందడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన కమలమ్మ అనేక ఉద్యమాల్లో పనిచేశారు. రాజకీయాల్లోకి చేరిన తర్వాత నకిరేకల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి ఇక్కడి ప్రజలతో మమేకమయ్యారు. మెదక్‌జిల్లా జిన్నారం మండలం దాసారం గ్రామానికి చెందిన శాంతమ్మ, నాగయ్యలకు 1943లో మూసపాటి కమలమ్మ జన్మించింది. ఈమెకు నలుగురు అన్నదమ్ములున్నారు. ఆనాడు తండ్రి ద్వారా గాంధీ, నెహ్రూలతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల గాధులు విన్న ఆమె, వారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలిగా.. బీఏ వరకు చదివిన మూసపాటి కమలమ్మ 1959లో నల్లగొండ జిల్లా పరిషత్, పంచాయతీ సమితీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లాలో గ్రామ గ్రామాన ఎడ్ల బండ్లపై తిరిగి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారు.. ఆనాటి జిల్లా కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతోనే జిల్లా రాజకీయాల్లో స్థిరపడ్డారు. 1967 ఎన్నికలోఉ్ల నకిరేకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రాఘవరెడ్డిపై ఓడిపోయారు. తిరిగి 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ప్రాతినిథ్యం వహించిన నర్రా రాఘవరెడ్డిపై 3,836 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. 1970లో సామాజిక కార్యకర్తగా అంతర్జాతీయ సోషల్ వర్కర్స్ మహాసభల్లో ఫిలిప్పిన్స్, జపాన్, బ్యాంకాక్, హాంకాంగ్‌లో ఇందిరాగాంధీతో కలిసి పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధిగా.. ఎమ్మెల్యేగా ఎన్నికైనా తరవాత కమలమ్మ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఎమ్మెల్యేగా నకిరేకల్, కట్టంగూర్, శాలిగౌరారం, తోపుచర్ల, ఫిర్కాలలో బలహీన వర్గాల రైతుల కోసం బావులు తవ్వించారు. 1972 సెప్టెంబర్ 7న ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీని నకిరేకల్‌కు పిలిపించి నియోజక వర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. నకిరేకల్‌లో కోఆపరేటివ్ బ్యాంక్, బస్టాండ్ నిర్మాణం, చేనేత కార్మికులకు రుణాలు, గుడివాడలో వడ్డెర కార్మికులకు 25 బోరు బావులు వేయించారు. నిర్వహించిన పదవులు.. 1959లో సేవాదళ్ కార్యకర్తగా, 1962లో జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా, 1972లో నకిరేకల్ ఎమ్మెల్యేగా, ఆల్ఇం డియా పల్స్ బోర్డ్ డెరైక్టర్‌గా, 1978, 79లో మైనింగ్ కార్పోరేషన్ డెరైక్టర్‌గా, బీసీ కార్పోరేషన్ ైడె రెక్టర్‌గా, రెండు సార్లు సెం ట్రల్ వెల్ఫేర్ బోర్డ్ డెరైక్టర్‌గా పని చేశారు. పీసీసీ సభ్యురాలిగా కొనసాగారు. -
ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మృతి
-
గుండెపోటుతో తెలంగాణ శకుంతల(65) మృతి
-
ధర్మవరపు సుబ్రహ్మణ్యం కన్నుమూత