ఆరెస్సెస్ ప్రచారక్ రాంభావు హల్దేకర్ అస్తమయం
హైదరాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) జ్యేష్ఠ ప్రచారకులలో ఒకరైన రాంభావు హల్దేకర్ (87) గురువారం మధ్యాహ్నాం 12.15 గంటల సమయంలో బర్కత్‌పురలోని ఆరెస్సెస్ ప్రాంత కార్యాలయంలో తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా శ్వాసకోశ సంబంధ వ్యాధులకు గురై చికిత్స పొందారు. హల్దేకర్‌జీగా పరిచయమైన శ్రీరామచంద్ర సదాశివ హల్దేకర్ మహారాష్ట్రలోని శంభాజినగర్‌లోని హల్దా గ్రామంలో జన్మించారు. హైదరాబాద్‌లో బీఎస్సీ చదువుతున్నప్పుడే ఆరెస్సెస్ పట్ల ఆకర్షితుడై చదువును వదిలి ఆరెస్సెస్‌లో చేరారు
భాగ్యనగర్ ప్రచారక్‌గా, హైదరాబాద్ విభాగ్ ప్రచారక్‌గా, వరంగల్ విభాగ్ ప్రచారక్‌గా, విజయవాడ విభాగ్ ప్రచారక్‌గా, ఆంధ్రప్రదేశ్ సహప్రాంత ప్రచారక్‌గా, ఆగ్నేయ క్షేత్రానికి క్షేత్ర ప్రచారక్‌గా పనిచేశారు. గో.నీ.దాండేకర్ మరాఠీలో నవల రూపంలో రాసిన సంఘ్ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ జీవిత చరిత్రను హల్దేకర్‌జీ ‘పెను తుఫానులో దీపస్తంభం’ పేరుతో తెలుగులోకి అనువందించారు. వీటితోపా టు ‘ఆంధ్రప్రదేశ్‌లో సంఘ్ ప్రగతిలో ఆత్మీయ జ్ఞాపకాలు’, ‘సద్గురు సమర్థ రామదాసు’ పుస్తకాలను తెలుగు వారికి అందించారు.
నేత్రదానం చేయాలన్న హల్దేకర్‌జీ కోరిక మేరకు మరణానంతరం ఆయన కార్నియాలను ‘వాసన్ ఐ బ్యాంక్’ సేకరిం చింది. శుక్రవారం ఉదయం 10గంటలకు అంబ ర్‌పేటలోని హిందూ స్మశానవాటికలో హల్దేకర్‌జీ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయని ఆరెస్సెస్ ప్రతినిధులు తెలిపారు.
బీజేపీ నేతల సంతాపం
హల్దేకర్‌జీ మృతి పట్ల బీజేపీ నాయకులు డా.కె.లక్ష్మ ణ్, బండారు దత్తాత్రేయ, పి.మురళీధర్‌రావు, జి.కిషన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి సంతాపం తెలిపా రు. హల్దేకర్‌జీ మరణం సంఘ్ కార్యకర్తలకు తీరని లోటని సంతాప సందేశంలో పేర్కొన్నారు. హైదరా బాద్‌లో సంఘ్ విస్తరణకు హల్దేకర్‌జీ విశేషంగా కృషి చేశారన్నారు. వివిధ విభాగాల్లో ప్రచారక్‌గా హల్దేకర్‌జీ అందించిన సేవలను కొనియాడారు.