మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి కన్నుమూత
షాద్‌నగర్ రూరల్: షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే రాయి కల్ దామోదర్‌రెడ్డి (95) కన్నుమూశారు. అనారోగ్యంతో 4 రోజు లుగా హైదరాబాద్‌లోని బర్కత్‌పురలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస వదిలారు. షాద్ నగర్ నియోజకవర్గ రాజకీయాలలో దామో దర్‌రెడ్డి తనదైన ముద్ర వేశారు.1955 నుంచి 1958 వరకు కొందుర్గు పంచాయతీ సమితి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయాన్ని సాధించారు. అనంతరం 1970లో షాద్‌నగర్ పంచాయతీ సమితి అధ్యక్షులుగా పనిచేశారు. 1981 నుంచి పదేళ్లపాటు స్వగ్రామమైన రాయికల్ గ్రామ సర్పంచ్‌గా, తర్వాత షాద్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా విధులు నిర్వ హించారు. అటు రాజకీయా ల్లోనూ, ఇటు వ్యక్తిగతంగా సమర్థుడైన వ్యక్తిగా దామోదర్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారు. షాద్‌నగర్‌లో జరిగే ప్రతి ఎన్నికల్లో దామోదర్ రెడ్డి క్రియాశీలక పాత్రను పోషించేవారు. దామోదర్‌రెడ్డి మరణంతో స్వగ్రామమైన రాయికల్, షాద్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆస్పత్రికి వెళ్లి దామోదర్‌రెడ్డి భౌతికకాయం వద్ద నివాళు లర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.