
భోపాల్ : కరోనా వైరస్ బారినపడి మధ్యప్రదేశ్‌కు చెందిన 62 ఏళ్ల డాక్టర్ మరణించారు. జనరల్ ఫిజిషియన్ అయిన బాధిత వైద్యుడు ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం ఉదయం మరణించారని ఇండోర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ జదియా వెల్లడించారు. కరోనా వైరస్ రోగికి చికిత్స అందిస్తూ ఈ డాక్టర్ ఇన్ఫెక్షన్‌కు గురై ఉంటారని భావిస్తున్నామని చెప్పారు. ఇన్ఫెక్షన్ ఆయనకు ఎక్కడి నుంచి సోకిందనే దానిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
కాగా, మధ్యప్రదేశ్‌లో కరోనా మహమ్మారితో ఓ వైద్యుడు మరణించిన తొలికేసు ఇదే కావడం గమనార్హం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎంజీఎం కాలేజీ బుధవారం రాత్రి విడుదల చేసిన కోవిడ్ రోగుల జాబితాలో వైద్యుడి పేరు ఉందని అధికారులు తెలిపారు. అయితే ఓ కోవిడ్-19 రోగికి ఆయన చికిత్స చేశారనేది ఇంకా గుర్తించలేదని చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా మహమ్మారి బారినపడిన కేసుల సంఖ్య ఇప్పటివరకూ 5734కు చేరుకోగా, 166 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నుంచి 473 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. చదవండి : సౌదీ రాజ కుటుంబంలో కరోనా కలకలం
Comments
Please login to add a commentAdd a comment