
రూమ్‌లోపల గడియ పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న డాక్టర్ వసంత్ కుమార్
సాక్షి, హైదరాబాద్: తాను తయారు చేసిన కొవిడ్ మందును ప్రభుత్వం గుర్తించి వాడుకలోకి తీసుకురావాలని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూమ్‌లోపలకు వెళ్లి లోపల గడియ పెట్టుకుని ఓ డాక్టర్ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నాడు. తలుపులు పగులగొట్టే ప్రయత్నం చేస్తే తాను కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది.
ఇసామియా బజార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇన్‌చార్జిగా డాక్టర్ వసంత్ కుమార్ (52) పనిచేస్తున్నారు. కరోనా వైరస్‌ను తరిమి కొట్టడానికి తాను కొవిడ్ మందును రెండేళ్లుగా శ్రమించి తయారు చేశానన్నారు. అయితే.. మందును అనేక మంది వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు విన్నవించినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.కోవిడ్ మందును ప్రజలకు అందజేయాలని సోమవారం ఇసామియా బజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పై అంతస్తులో తలుపులు వేసుకొని గడియ పెట్టుకుని కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నాకికి పాల్పడుతానని భయబ్రాంతులకు గురిచేశాడు.
కాచిగూడ ఇన్ స్పెక్టర్ రామలక్ష్మణ రాజు సంఘటన స్థలానికి చేరుకుని రూమ్‌లోనుంచి బయటకు రావాలని నచ్చచెప్పినా వినిపించుకో లేదు. ప్రస్తుతం ఇసామియాబజార్ ఆరోగ్య కేంద్రం రూమ్‌లోనే లోపలకు గడియ పెట్టుకుని బెదిరించాడు. డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
చదవండి: ఇదెక్కడి విడ్డూరం..! ఎద్దు మూత్రం పోసిందని కేసు పెట్టడమేంటి?
Comments
Please login to add a commentAdd a comment