'ఎంఎస్ మరణం నాకు తీరని లోటు' | Tollywood in a shock on MS Narayana Demise | Sakshi
Sakshi News home page

'ఎంఎస్ మరణం నాకు తీరని లోటు'

Published Fri, Jan 23 2015 10:52 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

'ఎంఎస్ మరణం నాకు తీరని లోటు'

'ఎంఎస్ మరణం నాకు తీరని లోటు'

హైదరాబాద్ : ఎంఎస్ నారాయణ ఎంత గొప్ప నటుడో, అంత ఆత్మీయుడని హాస్యనటుడు కొండవలస అన్నారు. ఆయన స్వర్గస్తులయ్యారంటే మనసు చలించిపోతోందన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతుంటే ఎంఎస్ ఆదరించి, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారన్నారు.

 

విభిన్న పాత్రలు చేసిన ఎంఎస్...సెట్లో ఉన్నప్పుడు తోటి నటులకు సలహాలు ఇచ్చేవారని, అనవసరపు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వొద్దు... అవసరం ఉన్నంతవరకూ నటించాలని అనేవారని కొండవలస తెలిపారు. క్రమశిక్షణ లేనిదే సినిమా రంగంలో రాణించలేరని, డిసిప్లెస్ వల్లే ఎంఎస్ ఈ స్థాయికి ఎదగగలిగారన్నారు.

ఎంఎస్ నారాయణ మృతి తనకు, తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటు అని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొండవలస అన్నారు. ఎంఎస్ కుటుంబసభ్యులకు కొండవలస ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంఎస్ నారాయణ గురించి మాట్లాడేందుకు తనకు మాటలు రావటం లేదని కన్నీటిపర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement