ఎంఎస్ నారాయణకు ట్విట్టర్ లో నివాళులు | sudden demise of MS Narayana is Terrible loss for Telugu cinema and his millions of fans said siddarth | Sakshi
Sakshi News home page

ఎంఎస్ నారాయణకు ట్విట్టర్ లో నివాళులు

Published Fri, Jan 23 2015 12:05 PM | Last Updated on Thu, Sep 12 2019 8:55 PM

ఎంఎస్ నారాయణకు ట్విట్టర్ లో  నివాళులు - Sakshi

ఎంఎస్ నారాయణకు ట్విట్టర్ లో నివాళులు

హఠాత్తుగా ఎం ఎస్ గారిని కోల్పోవడంతో షాక్కు గురయ్యాను...అయనతో రెండు చిత్రాల్లో నటించాను . ఆయన ఆత్మకి శాంతి చేకురాలి.. ఎంఎస్ కుటుంబానికి బాసటగా నిలుద్దాం.
-రకుల్ ప్రీత్ సింగ్

ఎంఎస్ నారాయణ అంకుల్ చాలా త్వరగా వెళ్లిపోయారు. నాకు ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు. నాన్నగారు ఆయన్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. వాళ్లమ్మాయి శశికిరణ్ దర్శకత్వం వహించిన సాహెబా సుబ్రహ్మణ్యం చిత్రం గురించి మాట్లాడారు. ఇంతలోనే ఇలా అయింది.

మంచు లక్ష్మిప్రసన్న

ఎంతో మందిని నవ్వించిన గొప్ప వ్యక్తి ....ఎంఎస్ నారాయణ గారి ఆత్మకి శాంతి చేకూరాలి.
-నటుడు రాహుల్ రవీంద్రన్

మీతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మిమ్మల్ని కోల్పోవడం చాలా బాధాకరం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి . ఆయన కుటుంబానికి అండగా నిలుద్దాం.
-నటుడు వరుణ్ తేజ్

మా అందరికి ఆనందాన్నిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు....మా అందరిని వదిలి వెళ్లడం చాలా దారుణం. మీ ఆత్మకి శాంతి చేకూరాలి సర్.
సుశాంత్

ఎంఎస్ నారాయణ ఉత్తమమైన వ్యక్తిత్వం గల వారు.  అయనలాంటి నటున్ని తిరిగి పొందలేము. మీ ఆత్మకి శాంతి చేకూరాలి సర్.
-సమంత

ఎంఎస్ గారు అన్ని తెలిసిన వ్యక్తి. ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, అంతేకాకుండా దయా హృదయం గలవాడు. తెలుగు చిత్ర పరిశ్రమకి, లక్షలాది అభిమానులకి ఆయన లేరనే వార్త నిజంగా తీరని లోటే
-సిద్దార్థ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement