
బాలీవుడ్ ప్రముఖ సినీ పాటల రచయిత నాసిర్ ఫరాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. గతంలో ఆయనకు ఏడేళ్ల క్రితం సర్జరీ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఛాతినొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సింగర్ ముజాబా అజీజ్ తెలిపారు.
బాలీవుడ్ సినిమాలు కైట్స్, క్రిష్, బాజీరావ్ మస్తానీ, కాబిల్ వంటి సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. ఆయన మృతితో బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment