ప్రముఖ లిరిసిస్ట్ మాయా గోవింద్(82)ఇక లేరు. గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమె గురువారం గుండెపోటు కారణంగా కన్నుమూసినట్లు ఆమె తనయుడు అజయ్ తెలిపారు. 'బ్రెయిన్ క్లాట్ కావడంతో అమ్మ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించింది. చికిత్స తర్వాత కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. అయితే గురువారం గుండెపోటు రావడంతో అమ్మ చనిపోయింది' అంటూ అజయ్ భావోద్వేగానికి లోనయ్యారు.
కాగా ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన మాయా గోవింద్ సుమారు 350 సినిమాలకు పనిచేశారు. ‘ఆంఖో మే బేస్ హో తుమ్’,‘మై ఖిలాడీ తూ అనారీ’,‘ మోర్ ఘటర్ ఆయే సజన్‌వా, గుటుర్ గుటుర్ వంటి ఎన్నో పాపులర్ పాటలను రాశారు. కాగా మాయా గోవింద్ మృతి పట్ల బీ టౌన్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మాయా గోవింద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment