సాక్షి,ముంబై: బిగ్‌బాస్-13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణంపై బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. తీవ్రమైన గుండెపోటుతో సిద్దార్థ కన్నుమూశాడన్న వార్తతో నిద్రలేచిన బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శుక్లా మరణించినట్లు ముంబైలోని కూపర్ ఆసుపత్రి ధృవీకరించింది. నిద్రలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
కాగా సిద్ధార్థ్ శుక్లా మరణవార్త విని ఆయన ప్రేయసి, బిగ్‌బాస్ సహ కంటెస్టెంట్ షెహనాజ్ గిల్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయినట్లు సమాచారం. సిద్ధార్థ్ మరణ వార్త విన్న వెంటనే కుప్పకూలిన షెహనాజ్ షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయింది. బిగ్‌బాస్ సీజన్13లో పాల్గొన్న సిద్ధార్ద్ -షెహనాజ్‌ల లవ్ ట్రాక్ ఎంతలా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కపుల్‌కి సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉంది.
సిద్ధార్థ్ ఆకస్మిక మరణంతో 'సిద్‌నాజ్' ఫర్ ఎవర్ అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బిగ్‌బాస్ షో పూర్తయిన తర్వాత కూడా వీళ్ల బంధం కొనసాగింది. వీరిద్దరి చివరగా డ్యాన్స్ దివానే-3 షోలో పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చదవండి : Siddharth Shukla: షెహనాజ్‌తో ప్రేమాయణం..‘సిద్నాజ్’గా ఫేమస్
Siddharth Shukla: దిగ్ర్భాంతిలో బాలీవుడ్, టీవీ ఇండస్ట్రీ
Comments
Please login to add a commentAdd a comment