Balika Vadhu
-
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి..!
బుల్లితెర భామ స్మృతి ఖన్నా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2017లో నటుడు తమ్ గుప్తాను పెళ్లాడిన నటికి ఇప్పటికే అనైక కూతురు కూడా ఉన్నారు. తాజాగా మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ బుల్లితెర జంటకు రెండో కూతురికి తమ జీవితంలోకి ఆహ్వానం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.స్మృతి ఖన్నా బాలీవుడ్లో మెరీ ఆషికి తుమ్ సే హై అనే సీరియల్‌తో కెరీర్ ప్రారభించింది. ఆ తర్వాత యే హై ఆషికి, సీఐడీ, బాలికా వధు(తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) లాంటి సీరియల్స్‌తో మెప్పించింది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో డాక్టర్ వందనా మిట్టల్ పాత్రలో అలరించింది. అంతే కాకుండా పలు రియాలిటీ షోలలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. వీటితో పాటు జట్ ఎయిర్వేస్ అనే పంజాబీ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. చివరిసారిగా 2022లో వచ్చిన దప్పా అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. అయితే పెళ్లి తర్వాత సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పేసింది బుల్లితెర భామ స్మృతి ఖన్నా. View this post on Instagram A post shared by Smoo (@smriti_khanna) -
తల్లి కాబోతున్న చిన్నారి పెళ్లికూతురు ఫేం
చిన్నారి పెళ్లి కూతురు ఫేం, నటి నేహా మర్దా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 10 ఏళ్ల క్రితం ఆయూష్మాన్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ సందర్భంగా నేహా తన భర్తతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో ఈ శుభవార్త పంచుకుంది. 2023లో బేబీ తమ జీవితాల్లోకి రాబోతున్నట్లు ఆమె స్పష్టం చేసింది. కాగా నేహా మర్దా బాలిక వధు(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌తో గుర్తింపు పొందింది. అందులో ఆమె అత్త పాత్ర పొషించింది. అంతేకాదు ఆమె పలు టీవీ షో, డాన్స్‌లో షోలో పాల్గొంది. View this post on Instagram A post shared by Neha Marda (@nehamarda) చదవండి: ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి నాన్నా: మహేశ్ ఎమోషనల్ -
అప్పుడు నన్ను నేను చాలా అసహ్యించుకున్నా: హీరోయిన్
I hated myself so much Says Heroine Avika Gor: చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి అవికా గోర్. సీరియల్లో తన ముద్దు ముద్దు మాటలు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. ఇక డబ్బింగ్ సీరియల్‌తో తెలుగువారికి సైతం ఎంతో దగ్గరైంది. అయితే ఈ సీరియల్ చేస్తున్నప్పుడు మాత్రం తాను సంతోషంగా లేనని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అవికా ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'సీరియల్ చేస్తున్న సమయానికి నేనంత ఫిట్‌గా లేను. దీంతో నన్ను నేను చాలా అసహ్యించుకున్నాను. స్క్రీన్‌పై ఎలా కనిపిస్తున్నానే విషయాన్ని కూడా పట్టించుకునేదాన్ని కాదు. అసలు అద్దంలో నా ముఖాన్ని చూసుకునేందుకు కూడా ఇష్టపడేదాన్ని కాదు. కానీ నేను ఎలా కనిపిస్తున్నాననే దానికంటే కూడా నా నటనకే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఆ విషయంలో వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని పేర్కొంది. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ భామ ప్రస్తుతం కల్యాణ్ దేవ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది. -
'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు'
Pratyusha Banerjees Father About Sidharth Shukla : బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మృతి అందరినీ షాక్‌కి గురి చేస్తుంది. 40 ఏళ్ళకే యువనటుడు గుండెపోటుతో హఠాన్మరణం చెందడాన్ని అభిమానులు జీర్జించుకోలేకపోతున్నారు. తాజాగా దివంగత నటి ప్రత్యూష బెనర్జీ తండ్రి శంకర్ బెనర్జీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ శుక్లాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. 'సిద్ధార్థ్‌ను నేను నా కొడుకులా భావించాను. బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు)సీరియల్ టైం నుంచి సిద్ధార్థ్, ప్రత్యూష మంచి స్నేహితులు. అయితే నా కూతురు చనిపోయాక సిద్ధార్థ్-ప్రత్యూషల గురించి మీడియాలో ఏవేవో వార్తలు రాసేవారు. దీంతో తను మా ఇంటికి రావడం మానేశాడు. కానీ నాతో ఫోన్లో ఎప్పుడూ టచ్‌లో ఉండేవాడు. మా బాగోగుల గురంచి అడిగి కనుక్కునేవాడు. లాక్డౌన్ టైంలో కూడా తరుచూ వాట్సాప్‌లో నాతో టచ్‌లో ఉండేవాడు. అంకుల్,ఆంటీ..మీరు బాగున్నారా? మీకు ఏదైనా సహాయం కావాలా? నేను మీకు ఏదైనా సహాయడగలనా అంటూ తరుచూ మమ్మల్ని అడిగేవాడు. వద్దన్నా బలవంతంగా ప్రతీ నెల 20వేల రూపాయలు పంపేవాడు. అతని మరణం సడెన్ షాక్‌లా అనిపిస్తుంది' అంటూ సిద్ధార్థ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కాగా కరణ్ జోహార్ నిర్మించిన “హంప్టీ శర్మకి దుల్హనియా” తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ “జలక్ దిఖ్లా జా 6”, “ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాది 7”, “బిగ్ బాస్ 13” వంటి రియాలిటీ షోలలో పాల్గొని మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. బాలికా వధు సీరియల్లో ప్రత్యూష బెనర్జీ, సిద్ధార్థ్ శుక్లా హీరో, హీరోయిన్లుగా నటించి స్టార్స్‌గా ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే దురదృష్టవశాత్తూ 24 ఏళ్ల వయసులోనే ప్రత్యూష బెనర్జీ కన్నుమూసింది. 2016లో ప్రియుడితో వివాదాల కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు ప్రచారంలో ఉంది. ఇటీవలె బామ్మగా అలరించిన సురేఖ సిఖ్రి కన్నుమూయగా, ఇప్పుడు సిద్ధార్థ్ మరణం తీరని విషాదాన్ని నింపింది. చదవండి: సిద్ధార్థ్ శుక్లా మరణవార్త విని కుప్పకూలిన ప్రేయసి షెహనాజ్ సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియల్లో వివాదం..వీడియో వైరల్ -
సిద్ధార్థ్ శుక్లా మరణవార్త విని కుప్పకూలిన ప్రేయసి షెహనాజ్
సాక్షి,ముంబై: బిగ్‌బాస్-13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణంపై బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. తీవ్రమైన గుండెపోటుతో సిద్దార్థ కన్నుమూశాడన్న వార్తతో నిద్రలేచిన బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శుక్లా మరణించినట్లు ముంబైలోని కూపర్ ఆసుపత్రి ధృవీకరించింది. నిద్రలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా సిద్ధార్థ్ శుక్లా మరణవార్త విని ఆయన ప్రేయసి, బిగ్‌బాస్ సహ కంటెస్టెంట్ షెహనాజ్ గిల్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయినట్లు సమాచారం. సిద్ధార్థ్ మరణ వార్త విన్న వెంటనే కుప్పకూలిన షెహనాజ్ షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయింది. బిగ్‌బాస్ సీజన్13లో పాల్గొన్న సిద్ధార్ద్ -షెహనాజ్ల లవ్ ట్రాక్ ఎంతలా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కపుల్‌కి సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉంది. సిద్ధార్థ్ ఆకస్మిక మరణంతో 'సిద్నాజ్' ఫర్ ఎవర్ అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బిగ్‌బాస్ షో పూర్తయిన తర్వాత కూడా వీళ్ల బంధం కొనసాగింది. వీరిద్దరి చివరగా డ్యాన్స్ దివానే-3 షోలో పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి : Siddharth Shukla: షెహనాజ్‌తో ప్రేమాయణం..‘సిద్నాజ్’గా ఫేమస్ Siddharth Shukla: దిగ్ర్భాంతిలో బాలీవుడ్, టీవీ ఇండస్ట్రీ -
బిగ్‌బాస్ విన్నర్ మరణం: షాక్‌లో బాలీవుడ్
సాక్షి,ముంబై: యువనటుడు, బిగ్‌బాస్-13 విన్నర్ సిద్ధార్థ శుక్లా (40) హఠాన్మరణంపై బాలీవుడ్, టీవీ పరిశ్రమ పెద్దలు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి లోనయ్యారు. తీవ్రమైన గుండెపోటుతో సిద్దార్థ కన్నుమూశాడన్న వార్తతో నిద్రలేచిన బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సిద్ధార్థ్ గుండెపోటు కారణంగా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్టు ముంబైలోని కూపర్ హాస్పిటల్ ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. సిద్ధార్థ్ మరణంపై పలువురు నటీ నటులు, ఇతర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు. దీంతో ట్విటర్ ఆర్ఐపీ సిద్ధార్థ్ శుక్లా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. నమ్మకలేకపోతున్నామంటూ ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్, నటి మోడల్ మల్లికా షెరావత్ ట్వీట్ చేశారు. ప్రముఖ టీవీ, సినీ నటి రేణుకా సహానే, మున్మున్ దత్తా తదితరులు సిద్ధార్థ్ ఆకస్మిక మరణంపై సంతాపం వ్యక్తంచేశారు. చదవండి : Sidharth Shukla: బిగ్‌బాస్ విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం కాగా1980, డిసెంబర్ 12న ముంబైలో జన్మించిన సిద్ధార్థ్ శుక్లా మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. బాబుల్ కా ఆంగన్ చూటే నా అనే టెలివిజన్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యాడు. జానే పెహచానే సే, యే అజ్నబీ, లవ్ యు జిందగీ లాంటి సీరియల్స్‌లో నటించాడు. ముఖ్యంగా పాపులర్ టీవీ సీరియల్ ‘బాలికా వధు’ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. 2014లో కరణ్ జోహార్ నిర్మించిన హంప్టీ శర్మకి దుల్హానియాతో బాలీవుడ్‌కీ ఎంట్రీ ఇచ్చాడు. చదవండి : నేను అమ్మకూచిని: బిగ్‌బాస్ విన్నర్ With a broken heart and sadness in in my soul I miss you more every day. Rest in peace#SiddharthShukla absolutely heartbroken I don't know what to say totally blank I miss you your jabra fan ❤️❤️ pic.twitter.com/NFy9gsJjth — Dhruvvvv🌟 (@dhruvda7) September 2, 2021 Too young to go💔 #SiddharthShukla RIP 🙏🙏 pic.twitter.com/78AW1l8Gsd — Mallika Sherawat (@mallikasherawat) September 2, 2021 Shocked and numb. No Words 🙏🙏🙏 #SiddharthShukla — Munmun Dutta (@moonstar4u) September 2, 2021 I cannot process that Siddharth Shukla has passed away. Life is just too unpredictable. RIP Siddharth. My condolences to his family and friends and to all his devastated fans 🙏🏽🙏🏽🙏🏽😢 — Renuka Shahane (@renukash) September 2, 2021 Hello bollywood !!! Is it really a heart attack ??? Remember SSR.#SiddharthShukla 😓😨💔 pic.twitter.com/6TSfBe9hlS — Diptiman Yadav (@Dipti_6450) September 2, 2021 I cannot process this news that I just came across. Is this true? Please no. No… #SiddharthShukla — ARMAAN MALIK (@ArmaanMalik22) September 2, 2021 -
మా కుమార్తె చనిపోయాక చేతిలో చిల్లిగవ్వ లేదు: నటి తల్లిదండ్రులు
బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ ద్వారా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ వల్లే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి ప్రత్యూష తల్లిదండ్రులు రాహుల్‌పై న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ కుమార్తె మరణం తర్వాత అన్నీ పొగొట్టుకున్నామని.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రత్యూష తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం సింగిల్ రూమ్ ఉన్న ఇంటికి మారామని.. రోజు వారి జీవితం గడవడం కూడా చాలా కష్టంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యూష తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘‘మా కుమార్తె మరణం తర్వాత ఓ పెద్ద భయంకరమైన తుపాను వచ్చి.. మా సర్వస్వం లాక్కెళ్లింది. మా దగ్గర చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. ఈ కేసు పోరాటంలో భాగంగా మేం సర్వస్వం కోల్పోయాం. నేను చైల్డ్ కేర్ సెంటర్లో పని చేస్తుండగా.. నా భర్త కథలు రాస్తూ.. పొట్ట పోసుకుంటున్నాం. ప్రస్తుతం మేం ఒక్క గదిలో నివసిస్తున్నాం’’ అని ప్రత్యూష తల్లి తెలిపారు. ప్రత్యూష బెనర్జీ 2016 లో తన ముంబై అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని కనిపించింది. ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె మరణం వెనుక ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్, నటుడు రాహుల్ రాజ్ సింగ్ పాత్ర ఉందని ఆరోపించారు. అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాహుల్ మూడు నెలల్లో బెయిల్ పొంది బయటకు వచ్చాడు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం రాహుల్, నటి సలోని శర్మను వివాహం చేసుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నేను గతం నుంచి బయటపడాలని భావించాను. ప్రత్యూష మరణం తర్వాత నా జీవితం ఓ టీవీ షో అయ్యింది. ఇప్పటికి సంతోషం కోసం పోరాడుతున్నాను. ఈ పరిస్థితులన్నింటిని నేను తట్టుకుని నిలబడటానికి నా కుటుంబ సభ్యులు, భార్య మద్దతు ఎంతో ఉంది. వారు నా బాధను అర్థం చేసుకుని.. నాకు అండగా నిలబడ్డారు’’ అని తెలిపాడు. -
'చిన్నారి పెళ్లికూతురు' బామ్మ చేసిన మొదటి ఉద్యోగం ఇదే..
ఆమె నానమ్మగా వేసిన ‘బాలికా వధు’ 2248 ఎపిసోడ్స్‌తో దేశంలోనే సుదీర్ఘంగా సాగిన టీవీ సీరియల్‌గా రికార్డు స్థాపించింది. మొన్నటి ‘బధాయి హో’ సినిమాలో 50 ఏళ్ల కోడలు గర్భం దాలిస్తే ఆ కోడలిని అత్తగారి పాత్రలో ఆమె అక్కున చేర్చుకున్న తీరు అద్భుతం. సురేఖ సిక్రి (75) అంటే నాటక, టీవీ, సినిమా రంగంలో ఒక విశిష్టమైన పేరు. ఒక పరంపరకు ప్రతినిధి. సిక్రి శుక్రవారం కన్ను మూసింది. ఆమెకు నివాళి. దూరదర్శన్‌లో విఖ్యాతమైన ‘తమస్’ సీరియల్లో ఒక దృశ్యం. ఒక వృద్ధ సిక్కు జంట నిలువ నీడ లేక ఒక ఇంటి తలుపు తడుతుంది. ఆ సిక్కు జంటకు ఇల్లు లేదు. దారి లేదు. గమ్యం లేదు. దేశంలో దారుణమైన అల్లర్లు జరుగుతున్నాయి. ఎవరు ఎవరిని హత మారుస్తున్నారో తెలియదు. పోనీ ఎందుకు హతమారుస్తున్నారో తెలియదు. మనిషి కళ్లేలు ఉన్నంత వరకే మనిషి. వదిలితే మృగం. ఆ వృద్ధజంటను గడప దగ్గర చూసిన ‘రాజో’ అనే ముస్లిం మహిళ పాత్రలో ఉన్న సురేఖ సిక్రి ‘మా ఇంట్లో చోటు లేదు వెళ్లండి’ అంటుంది. వాళ్లు నిరాశతో తిరిగి వెళ్లిపోతుంటే తమాయించుకోలేక ‘ఆశపడి వచ్చారు ఆ పై గదిలో దాక్కోండి’ అని చోటు ఇస్తుంది. అన్నం పెడుతుంది. ‘నా మొగుడికి దేవుడంటే భయం ఉంది. మిమ్మల్ని ఏమి అనడు. కాని నా కొడుకు సంగతి చెప్పలేను’ అని తాపత్రయ పడుతుంది. కొడుకు వస్తాడు. ఈ సిక్కు జంటను చూసి మండిపడతాడు. వాళ్లను వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కాని ఒక హృదయమున్న స్త్రీ, సిక్రి, ఊరుకుంటుందా? బెబ్బులిలా తిరగబడుతుంది. ఆ ముసలి జంట పక్షాన నిలుస్తుంది. ఆ సన్నివేశంలో సురేఖా సిక్రి నటన చూడాలి. అలాంటి ఇలాంటి నటన కాదు. 2018లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘బధాయి హో’లో సురేఖ సిక్రి చివరి రోజులలో ఉన్న వృద్ధురాలు. ఇంటి పెద్ద. కొడుకు, కోడలు, వయసొచ్చిన మనవలు... అలాంటి టైమ్‌లో, 50 ఏళ్ల వయసులో కోడలు గర్భం దాల్చిందన్న వార్త ఆమెకు తెలుస్తుంది. ఇదేమి చోద్యం? ఈ వయసు లో. కొడుకును తిట్టిపోస్తుంది. కోడల్ని గదిలో వేసి తాళం పెడుతుంది. అయ్యో.. ఏమి ఖర్మరా అని బాధ పడుతుంది. కాని తల్లి గర్భం దాల్చిందని నామోషీ ఫీలైన పెద్ద కొడుకు ఆమెకు దూరంగా ఉంటున్నాడన్న విషయం తెలుసుకుని, ఒక సహజమైన సహజాతమైన విషయానికి కోడలు మాటలు పడుతోందని సాటి స్త్రీగా అర్థం చేసుకొని తానే మొదట ఆ గర్భాన్ని అంగీకరించి ఆహ్వానిస్తుంది. మన ఇళ్లల్లో కనిపించే వృద్ధుల మనస్తత్వాన్ని, రూపాన్ని, స్వభావాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుంది సురేఖ సిక్రి ఆ పాత్రలో. ఏళ్ల తరబడి ‘కలర్స్ టీవీ’లో ఆ తర్వాత డబ్బింగ్ ద్వారా ప్రాంతీయ భాషలలో ప్రసారమైన ‘బాలికా వధు’లో ఆమె నానమ్మ పాత్రలో నటించింది. ఆమె ఆ కథలో ఎంత సేపటికి తన మనవడి పక్షం. అందుకని ఆ మనవణ్ణి చేసుకున్న చిన్నారిని అదలిస్తుంది. బెదిరిస్తుంది. దారికి తేవడానికి చూస్తుంది. కాని కథ గడిచే కొద్దీ మనవడు సరైన వాడు కాదని గ్రహించి చిన్నారి పెళ్లి కూతురుకు పెద్ద సపోర్ట్‌గా మారుతుంది. అంతేకాదు ఆ పెళ్లి కూతురు తన మనవణ్ణి వదిలి మరో కుర్రాణ్ణి పెళ్లి చేసుకోవడానికి కూడా సహకరిస్తుంది. సురేఖ సిక్రి పాత్రలు ఇలాంటి పాత్రల వల్ల ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. సురేఖ సిక్రీ ఒక కాలంలో వచ్చిన ఉత్తమ నటులు నసీరుద్దిన్ షా, ఓం పురి, రఘువీర్ యాదవ్... వీళ్ల సమకాలికురాలు. అలిగర్లో తల్లి టీచర్‌గా పని చేయడం వల్ల అలిగర్ యూనివర్సిటీలో చదువుకుంది. అక్కడే ఉర్దూ కవిత్వం అంటే ఆమెకు ప్రేమ ఏర్పడింది. ఆ తర్వాత ఢిల్లీ ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో మూడేళ్ల నటనలో కోర్సు చేసి అక్కడి రెపట్రీలో నాటకాలు వేస్తూ వేయిస్తూ 15 సంవత్సరాలు గడిపింది. ఆ తర్వాత ముంబై వచ్చి సినిమాల్లో పని చేసింది. ‘సలీమ్ లంగ్డే పే మత్ రో’, ‘మమ్నో’, ‘నసీమ్’, ‘సర్దారీ బేగమ్’, ‘మిస్టర్ అండ్ మిసెస్’ అయ్యర్ వంటి సినిమాల్లో ఆమె మంచి పాత్రలు పోషించింది. మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందింది. ‘ఆమె నాటకాలు వేస్తుంటే తొంగి తొంగి చూసి ఆమెలా నటించాలని ఎన్.ఎస్.డిలో నేను అనుకునేదాన్ని’ అని నటి నీనా గుప్తా అంది. వీరిద్దరూ కలిసి ‘బధాయీ హో’లో నటించారు. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ సినిమా హీరోయిన్గా నటించిన అవికా గోర్ ‘బాలికా వధు’లో చిన్నారి పెళ్లికూతురిగా నటించింది. ‘నా నట జీవితం అటువంటి శిఖరంతో మొదలుకావడం నా అదృష్టం’ అని అవికా గోర్ అంది. సురేఖ సిక్రికి నటుడు నసీరుద్దిన్ షాకు బంధుత్వం ఉంది. సిక్రి సవతి చెల్లెలు పర్వీన్ మురాద్‌ను నసీరుద్దిన్ మొదటి వివాహం చేసుకున్నాడు. వీళ్లిద్దరికి షీబా షా అనే కుమార్తె ఉంది. షీబా షా సురేఖ సిక్రితో కలిసి నటించింది. ‘ఒక మంచి నటికి రెండులైన్ల డైలాగ్ ఉన్న పాత్ర దొరికినా ఆ రెండులైన్లను ఎంత బాగా చెప్పొచ్చు.. ఆ లైన్ల వెనుక కథ ఏమిటి... ఆ లైన్లకు ఎలా న్యాయం చేయాలి... ఇవి ఆలోచించి నటించినట్టయితే తప్పక ఆత్మతృప్తి పొందవచ్చు’ అంటుంది సురేఖ సిక్రి. కవిత్వం మీద తన అభిమానాన్ని ఉర్దూ స్టూడియో, హిందీ స్టూడియోలలో గొప్ప గొప్ప కవుల కవిత్వాన్ని చదివి రికార్డు చేసి ఆమె మనకు కానుకగా ఇచ్చింది. భారతీయ నటనా రంగం చూసిన ఒక ఉత్తమ కవిత సురేఖ సిక్రి. ‘బధాయీ హో’లో... ‘తమస్’ సీరియల్లో... ‘బాలికా వధు’ సీరియల్లో... -
గుండె బద్దలైపోయింది.. ఇది నమ్మలేకపోతున్నాను :నటి
చిన్నారి పెళ్లికూతుర(బాలికా వధు)ఫేమ్ సురేఖ సిఖ్రి మృతిపై సీనియర్ నటి నీనా గుప్తా స్పందించారు. సిఖ్రి ఇక లేరన్న విషయం తెలిసి గుండె బద్దలైపోయింది. ఇది నమ్మలేకపోతున్నాను. ఆమెతో బధాయి హో అనే సినిమాలో కలిసి నటించాను. షూటింగ్ బ్రేక్‌లో చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. స్పాట్లో రెగ్యులర్‌గా కలిసే తినేవాళ్లం. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. సిఖ్రి మరణవార్త జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది అంటూ నీనా గుప్తా ఎమోషనల్ అయ్యారు. 2018లో వచ్చిన బధాయి చిత్రం ఘన విజయం సాధించింది. ఈ మూవీలో సురేఖ సిఖ్రి నీనా గుప్తాకు అత్తగా నటించారు. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు) ఫేమ్ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి (75) గుండెపోటుతో శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి ఈ ఉదయం తుదిశ్వాస విడిచింది. 'కిస్సా కుర్సి కా' చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి తమాస్ (1988), మమ్మో (1995) బధాయ్ హో (2018) చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్ అవార్డులు సంపాదించుకుంది. -
విషాదం: 'చిన్నారి పెళ్లికూతురు' ఫేం సురేఖ సిఖ్రి మృతి
ముంబై : బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు) ఫేమ్ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి (75) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సిఖ్రి మరణించిందని ఆమె మేనేజర్ మీడియాకు వివరించారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి.. శుక్రవారం తుదిశ్వాస విడిచింది. 'కిస్సా కుర్సి కా' చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి తమాస్ (1988), మమ్మో (1995) బధాయ్ హో (2018) చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్ అవార్డులు సంపాదించుకుంది. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు)సీరియల్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సిఖ్రి తెలుగు వారికి కూడా బాగా దగ్గరైంది. బామ్మగా సిఖ్రి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2018లో షూటింగ్ సమయంలో బాత్రూంలో జారిపడటంతో సురేఖ సిఖ్రికు బ్రెయిన్ స్ర్టోక్ వచ్చింది. కోలుకుంటున్న సమయంలోనే రెండేళ్ల తర్వాత మరోసారి బ్రెయిన్ స్ర్టోక్ రావడంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అప్పటినుంచి నటనకు కాస్త బ్రేక్ ఇచ్చిన సురేఖ సిఖ్రి చివరిసారిగా ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్ అనే చిత్రంలో నటించింది. -
కర్మ వారిద్దరిని శిక్షిస్తుంది: నటుడు
ప్రత్యూష బెనర్జీ గుర్తుందా.. ‘బాలికా వధు’ సీరియల్లో మొదట యుక్త వయసు ఆనంది పాత్రలో నటించింది. ఈ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష 2016లో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. చనిపోయే నాటికే ప్రత్యూష రెండు నెలల గర్భవతి అని తెలిసింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ వల్లనే నటి ఆత్మహత్య చేసుకుందని.. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపించారు. అతడిపై కేసు కూడా నమోదయ్యింది. మూడు నెలల తర్వాత రాహుల్ రాజ్‌కి బాంబే హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్ల క్రితం అతడు నటి సలోని శర్మని వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల మీడియా రాహుల్‌ని ఇంటర్వ్యూ చేసింది. పలు విషయాలపై ఆయన మాట్లాడారు. ఇప్పుడిప్పుడే ప్రత్యూషని కోల్పోయిన బాధ నుంచి బయటకు వస్తున్నానని.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘‘నా జీవితంలో గతంలో చోటు చేసుకున్న విషాదం, సంతోషకర క్షణాల నుంచి బయటకు రావాలనుకుంటున్నాను. జీవితాంతం బాధపడుతూ ఉండాలని ఎవరూ భావించారు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాను. ప్రస్తుతం నేను జీవితంలో అత్యంత దుర్భర క్షణాలను దాటుకుని వచ్చాను. ఇలాంటి సమయంలో పిల్లలను కనాలనుకోవడం సరైంది కాదని నా అభిప్రాయం. ఇక కుటుంబ సభ్యులు, నా భార్య సలోని ప్రతి ఒక్కరు నన్ను నమ్మారు.. నాకు మద్దతుగా నిలిచారు. నా జీవితంలో ఎదురైన ప్రతి ఒడిదుడుకుల్లో వారు నాకు అండగా నిలిచారు’’ అని తెలిపాడు రాహుల్ రాజ్. ‘‘ప్రత్యూష మరణం తర్వాత నా జీవితం ఓ టీవీ షో కన్నా దారుణంగా తయారైంది. ప్రతి ఒక్కరు నన్ను దోషిలా చూస్తున్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. జీవితం చీకటి అయ్యింది. కానీ నేను పోరాడుతున్నాను. సంతోషంగా జీవించాలనుకుంటున్నాను. పరిస్థితులతో.. సమస్యలతో చాలా గట్టిగా పోరాడుతున్నాను. ఈ విషయంలో కుటుంబ సభ్యులు, నా భార్య మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అన్నాడు. కర్మ వారిని శిక్షిస్తుంది ‘‘ప్రత్యూష మరణం తర్వాత ఆమె కుటుంబ సభ్యులతో పాటు కామ్య పంజాబీ, వికాస్ గుప్తా నాపై ఆరోపణలు చేశారు. ప్రత్యూష తల్లిదండ్రుల మీద నాకు ఎలాంటి కోపం లేదు. తమ కుమార్తెని కొల్పోయిన బాధలో వారు నన్ను అవమానించారు. దీన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ కామ్య పంజాబీ, వికాస్ గుప్తా అలా కాదు. కావాలనే వారు నాపై అబద్దపు ఆరోపణలు చేశారు. ప్రత్యూషపై నేను చేయి చేసుకున్నానని.. అది అందరూ చూస్తుండగా అని చెప్పారు. కానీ ఇది పచ్చి అబద్దం. ఇలా తప్పుడు ఆరోపణలు చేసినందుకు నేను వారిని ఏం చేయలేకపోవచ్చు. కానీ కర్మ అంటూ ఒకటి ఉంటుంది.. అది అందర్ని శిక్షిస్తుంది. ఇప్పటికే వికాస్ ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాడు అని’’ తెలిపాడు. చదవండి: గువ్వల్ని మింగుతున్న గద్దలు నటుడి ఆత్మహత్య: భార్య, అత్తపై ఎఫ్ఐఆర్ -
‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్’
‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. మేము కోరుకున్నాము. నువ్వు ఇక్కడ ఉన్నావు. మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మేము పరిపూర్ణమయ్యాము. నేను కోరుకున్న అన్నింటితో పాటు ప్రత్యేకమైన ఈ కానుక ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు. నా బెస్టీ ఇక్కడ ఉంది. నా జీవితం మార్చేసింది’ అంటూ మోడల్, టీవీ నటి మహి విజి తాను తల్లిని అయిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ కూతురి పాదాలను ముద్దాడుతున్న భర్త ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క్రమంలో ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి మహి విజి దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా హిందీ టీవీ స్టార్ కపుల్ మహి విజ్-జై భనుశాలిలకు 2011లో వివాహం జరిగింది. ఈ క్రమంలో 2017లో ఈ జంట తమ పనిమనిషి కూతురిని దత్తత తీసుకున్నారు. అయితే ఆమె కన్నతల్లి సమక్షంలోనే పెరుగుతున్నా తనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఇక పెళ్లైన దాదాపు 8 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులుగా మారడంతో ప్రస్తుతం ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. కూతురి రాక గురించి జై చెబుతూ...’మా భవిష్యత్తు ఇప్పుడే ఈ లోకంలోకి వచ్చింది. మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్యూ రాజకుమారి’ అంటూ ఓ ఆత్మీయ సందేశాన్ని పోస్ట్ చేశాడు. కాగా మోడల్ అయిన మహి పలు హిందీ సీరియళ్లలో నటించి అవార్డులు పొందారు. తెలుగులో డబ్ అయిన ‘చిన్నారి పెళ్లి కూతురు’(బాలికా వధు)లో ఆనంది కూతురు నందినిగా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. అదే విధంగా జై కూడా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ నిర్మించే సీరియళ్లలో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. మహి- జై జంట టీవీ రియాలిటీ షో ‘నచ్ బలియే 5’లో పాల్గొని టైటిల్ గెలుచుకున్నారు. View this post on Instagram Twinkle twinkle little star we made a wish and here you are.thank you for choosing us as your parents.we feel complete.We are blessed with baby girl 👧 ❤️💋🙏thank u god for everything this one is special thank you.We feel blessed.My best friend is here.Meri zindagi Badal di 🙏🙏🙏🙏 A post shared by Mahhi Jay❤️bhanushali (@mahhivij) on Aug 20, 2019 at 9:35pm PDT -
ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్!
బ్రహ్మ ముహూర్తంలో తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రేమ విషయం చెప్పాను కాబట్టి తమ బంధం చాలా దృఢంగా ఉందంటున్నాడు చిన్నారి పెళ్లి కూతురు ఫేం అవినాశ్ ముఖర్జీ. జగదీశ్‌గా బుల్లితెర అభిమానులను అలరించిన అవినాశ్ ప్రస్తుతం వరుస సీరియళ్లతో బిజీగా ఉన్నాడు. అయితే అతడు ప్రేమలో పడ్డాడంటూ గత కొంతకాలంగా ఇండస్ట్రీలో రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై తొలిసారిగా పెదవి విప్పిన అవినాశ్.. తన క్లాస్మేట్ సలోని లూత్రాతో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు. తన ప్రేమ ప్రయాణం గురించి అవినాశ్ ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ...‘ తను నా కాలేజ్‌మేట్. మా కంపెనీకి కంటెంట్ రైటర్ కావాలంటూ ఓరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు మెసేజ్ చేశాను. నిజానికి తను చాలా బాగా రాస్తుందని నాకు తెలుసు. అందుకే తననే రిక్రూట్ చేసుకోవాలనుకున్నా. కానీ తను మాత్రం భిన్నంగా స్పందించింది. వేరే వాళ్లను రికమెండ్ చేసింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా తనను మళ్లీ మళ్లీ అడగటం మొదలుపెట్టాను. ఆఖరికి తను అంగీకరించింది. అలా మొదలైన మా ప్రయాణం ప్రేమకు దారితీసింది. తనను మా అమ్మకు కూడా పరిచయం చేశాను. వారిద్దరు మంచి స్నేహితులయ్యారు. ఈ క్రమంలో ఓ రోజు ఉదయం 4 గంటలకు తనకు ప్రపోజ్ చేశాను. అది బ్రహ్మ ముహూర్తం. అందరి తలరాతలు రాసే బ్రహ్మ ఆ సమయంలోనే నిద్ర లేస్తాడు. ఆయన మా బంధాన్ని దృఢంగా ఉంచుతాడు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. -
ఆస్పత్రిలో ప్రత్యూష ఫ్రెండ్
ప్రత్యూష గర్భవతి అని అనుమానాలు ముంబై: బుల్లితెర నటి, ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ ఆదివారం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది నీరజ్ గుప్తా తెలిపారు. అతను ఛాతీలో నొప్పి, లో బీపీ, కుంగుబాటు కారణంగా స్థానిక ఆస్పత్రిలో చేరారని, చాలా బలహీనంగా ఉన్న ఆయనను ఐసీయూలో ఉంచారని చెప్పారు. కాగా, ప్రత్యూష ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. అయితే రాహుల్ కారణంగానే ఆమె ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ప్రత్యూష గర్భవతా..?: చనిపోయే సమయానికి ప్రత్యూష రెండు నెలల గర్భవతి అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం వైద్యులు ఇచ్చిన రిపోర్టులో పేర్కొనలేదని విచారణాధికారి తెలిపారు. ఆమె పోస్ట్‌మార్టమ్ రిపోర్టు నెల రోజుల్లో రానుందని, అది వస్తే అందులో ఆమె గర్భవతా కాదా అనేది తేలుతుందన్నారు. ప్రత్యూష, రాహుల్ జంటకు స్నేహితులైన పలువురు చెబుతున్న దాని ప్రకారం బెంగాలీ నూతన సంవత్సరాది రోజైన ఈ నెల 14న వారు పెళ్లి చేసుకోడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. కాగా, ప్రత్యూషకు ఆర్థిక ఇబ్బందులున్నాయని, ఆమె తల్లిదండ్రుల కోసం రూ. 50 లక్షల అప్పు తీసుకుందని రాహుల్ తండ్రి హర్షవర్ధన్ చెప్పారు. దీంతో ఆమె ఒత్తిడికి గురయ్యేదన్నారు. ఆమెకు అప్పుడప్పుడు రూ. పది వేల చొప్పున డబ్బులు పంపేవాడినని అన్నారు. -
ప్రత్యుషను పెళ్లి చేసుకోవాలనుకున్నా!
ప్రముఖ టీవీ నటి ప్రత్యుష బెనర్జీ అనుమానాస్పద మృతి వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియడు రాహుల్ రాజ్ సింగ్ తాజాగా నోరువిప్పాడు. తాను అమాయకుడినని, ఈ వ్యవహారంలో తన తప్పు ఏమీ లేదని 'మిడ్ డే' పత్రికతో చెప్పాడు. ప్రత్యుష-తాను తరచూ గొడవలు పడిన విషయం వాస్తవమేనని అంగీకరించాడు. నవంబర్ 2015 నుంచి తాను ప్రత్యుషతో డేటింగ్ చేస్తున్నానని, ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని భావించానని తెలిపాడు. ఆమెను ఎప్పుడూ తన భార్యగానే భావించినట్టు చెప్పాడు. ఆత్మహత్యకు ముందురోజు ప్రత్యుషతో తాను గొడవ పడ్డానని, ఆ రోజంతా తాను తాగుతూ గడిపిందని తెలిపాడు. పనిమీద తాను బయటకు వెళ్లి వచ్చేలోపు తాను ఉరేసుకొని కనిపించిందని, తను అలా చేసుకుంటుందని తెలిసి ఉంటే తాను ఇంటి నుంచి బయటకు వెళ్లేవాడిని కాదని చెప్పుకొచ్చాడు. కాగా, రాహుల్ రాజ్ సింగ్ ఆదివారం ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. రాహుల్ తీవ్ర ఒత్తిడి, కుంగుబాటుతో సతమవుతున్నాడని, ఛాతినోప్పి రావడంతో అతన్ని ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్చామని రాహుల్ తరఫు లాయర్ నీరజ్ గుప్తా తెలిపారు. రాహుల్ పోలీసు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరడంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లలేదు. -
రాహుల్ పిచ్చివాడిలా చేస్తున్నాడు!
ప్రముఖ టీవీ నటి ప్రత్యుష బెనర్జీ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఆస్పత్రి పాలయ్యాడు. రాహుల్ తీవ్ర ఒత్తిడి, కుంగుబాటుతో సతమవుతున్నాడని, ఛాతినొప్పి రావడంతో అతన్ని ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్చామని రాహుల్ తరఫు లాయర్ నీరజ్ గుప్తా తెలిపారు. రాహుల్ ఆదివారం పోలీసు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరడంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లలేదు. మరోవైపు అతన్ని ఆస్పత్రిలో చేర్చిన అతని స్నేహితురాలు శైలా చద్దా మాట్లాడుతూ.. రాహుల్ దాదాపు పిచ్చివాడిగా మారిపోయాడని, అందుకే కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రిలో చేర్చారని తెలిపింది. 'అతను తీవ్ర వేదనలో ఉన్నాడు. దిగ్భ్రాంతికి లోనయ్యాడా? లేక పిచ్చివాడు అవుతున్నాడా? తెలియడం లేదు. అతనికి ఏమైనా జరిగే అవకాశముంది. అందుకే మేం అతన్ని ఆస్పత్రిలో చేర్చాం' అని ఆమె తెలిపింది. 'ప్రపంచం అతనికి వ్యతిరేకంగా ఉండవచ్చు. కానీ నాకు మాత్రం అతనిది ఏ తప్పు లేదని అనిపిస్తోంది. ఘటన జరిగిన నాటి నుంచి అతను ఏడుస్తూనే ఉన్నాడు. నేను స్వయంగా చూశాను' అని ఆమె చెప్పింది. ప్రత్యుష బెనర్జీ అనుమానాస్పద ఆత్మహత్య వ్యవహారంలో ప్రధానంగా రాహుల్‌పైనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడు ఆమెను కొట్టేవాడని, వారిద్దరి మధ్య గతకొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ముంబై పోలీసులు రాహుల్‌ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. -
పెళ్లికూతురి ముస్తాబులో ప్రత్యూష అంత్యక్రియలు
ముంబై : చివరి ప్రయాణంలో ప్రత్యూష బెనర్జీ(24)ని పెళ్లి కూతురిలా ముస్తాబు చేసి కడసారి వీడ్కోలు పలికారు. శనివారం అశ్రునయనాల మధ్య ముంబైలోని ఓ శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. త్వరలోనే తనకు పెళ్లి దుస్తులు రూపొందించాల్సిందిగా డిజైనర్ అయిన స్నేహితుడు రోహిత్ వర్మను ప్రత్యూష ఇటీవలే కోరడం.. ఇంతలోనే ఆమె అర్థాంతరంగా తనువు చాలించడం కుటుంబసభ్యులతోపాటు స్నేహితులను తీవ్రంగా కలచివేసింది. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ద్వారా ప్రేక్షకులకు ఆనందిగా సుపరిచితురాలైన ప్రత్యూష బెనర్జీ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కుమార్తె మృతి విషయమై తల్లి డాలీ బింద్రా మట్లాడుతూ.. ముందు ఓ టీవీ చానెల్ నుంచి ప్రత్యూష గురించి ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఏప్రిల్ ఫూల్ చేయడానికి చెబుతున్నారని భావించానని, వినోదం కోసం ఇలాంటి పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారా అంటూ వారిపై కోప్పడ్డానని తెలిపారు. కానీ ఆ తర్వాత నిజంగానే ప్రత్యూష ఇక లేదని తెలిశాక షాక్‌కు గురయ్యామన్నారు. రాహుల్‌తో ప్రేమ విషయం తమకు తెలిపిందని, వివాహానికి తమ అనుమతి కూడా కోరిందని ఆమె చెప్పారు. ప్రత్యూష మృతిపై చాలా అనుమానాలున్నాయని డాలీ చెబుతున్నారు. ప్రత్యూష కళ్లు ప్రశాంతంగా ఉండటం, నుదుటి మీద తాజా సింధూరం కనబడటం.. ఆమెది ఆత్మహత్యలా అనిపించడం లేదన్నారు. ఏదేమైనా రాహుల్ తమ కుమార్తె మృతి విషయంలో తప్పక సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. ఆమె మృతదేహాన్ని పరిశీలించినప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తాయని, పోలీసులకు ప్రతి విషయం తెలియజేశామని ఆమె తెలిపారు. నిజం తప్పక బయటపడుతుందని.. అప్పటివరకు ఓపికగా ఉంటామని ప్రత్యూష తల్లి అన్నారు. -
ఊపిరాడకే ప్రత్యూష మృతి
ముంబై: శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ‘బాలికా వధు’ ఫేం నటి ప్రత్యూష బెనర్జీ ఊపిరాడకే చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో స్పష్టమైంది. గొంతుబిగుసుకుపోయిన ఆనవాళ్లున్నాయని తేలింది. కాగా, ప్రత్యూష అంత్యక్రియలు శనివారం ముంబైలో నిర్వహించారు. బుల్లితెర నటులు పలువురు హాజరై కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్‌ను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. రాహుల్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ప్రత్యూష సెల్ నుంచి వెళ్లిన చివరి కాల్స్, వీరి మధ్య జరిగిన సందేశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. అయితే.. ప్రత్యూష తన వివాహానికి దుస్తుల్ని డిజైన్ చేయమని కాస్ట్యూమ్ డిజైనర్ అయిన స్నేహితుడు రోహిత్‌ను అడిగినట్లు తెలుస్తోంది. -
ఆమె లోపలి బడబాగ్ని ఎవరికి తెలుసు
ముంబై టీవీ నటి ప్రత్యూష బెనర్జీ అకాల మరణం పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు, నటులు, టీవీనటులు దిగ్బ్రాంతి వక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ ఆకాంక్షించారు. 'బాలికా వధు' ద్వారా సుపరితచితమైన ప్రత్యూష మృతిపై బాలీవుడ్ దర్శకులు కరణ్ జోహార్, మధుర్ భండార్కర్, సీనియర్ నటుడు రిషి కపూర్, అనుపమ్ ఖేర్, అర్బాజ్ ఖాన్, సిమీ గరేవాల్ తదితరులు ట్విట్ చేశారు. టీవీ నటీనటులు సోఫీ చౌదరి, కరిష్మా తన్నా, మికా సింగ్, గౌర్ ఖాన్ కూడా ఆమె మరణంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని తట్టుకోలిగే శక్తిని తల్లిదండ్రులకు ప్రసాదించాలని వేడుకున్నారు. ఈ సందర్బంగా గతంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన జియా ఖాన్, నఫీసా ఖాన్ లను గుర్తు చేసుకున్నారు. ఎంత అవమానం, అంత మంచి అమ్మాయి అర్థాంతరంగా జీవితాన్ని ముగించడం బాధ కలిగించిందని బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషి కపూర్ అన్నారు. ఆమెలో చెలరేగిన బడబాగ్ని ఎవరికి తెలుసంటూ ప్రత్యూష మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. బాలికా వధు సీరియల్ ఒక్కటే తాను చూస్తానని సిమీ గరేవాల్ అన్నారు. 24 ఏళ్లకే ఆమె తనువుచాలించడం విచాకరమన్నారు. కుటుంబ మద్దతు లేకుండా ఆడపిల్లల మనుగడ చాలా కష్టమవుతుందని ఆమె ట్విట్ చేశారు. మానసిక ఒత్తిడిపై సీరియస్ గా స్పందించని కుటుంబాలకు , స్నేహితులకు ఇది ఒక హెచ్చరిక లాంటిదని కరణ జోహార్ ట్విట్ చేశారు. ఆమె హఠాన్మరణం తనను షాక్ కు గురి చేసిందంటూ మధుర్ భండార్కర్ ప్రత్యూష మృతికి సంతాపం తెలిపారు. What a shame! Such a lovely person should suicide! Who knows the turmoil within her. RIP. pic.twitter.com/tIDk1QetF1 — Rishi Kapoor (@chintskap) 1 April 2016 #pratushabanerjee The only serial I've watched was Balika. For her! Very sad. Only 24. It's too tough here for girls without family support. — Simi Garewal (@Simi_Garewal) 2 April 2016 -
ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్యే
ముంబై: ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ(24) మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నా.. సన్నిహితులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె ఆత్మహత్యా చేసుకుందా లేక హత్యా అనేది విచారణలో తేలాల్సివుంది. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని సహనటి పాల్ డాలీ బింద్రా బింద్రా చెప్పారు. బిగ్ బాస్ లో ప్రత్యూష తో కలిసి నటించిన అజీజ్ ఖాన్ మాట్లాడుతూ ఇది కచ్చితంగా ప్రీ పాన్డ్ మర్డర్ అయి వుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యూష మృతదేహంపై మెడ, ఎడమ చెంపపై గాయాలు ఉండటం, నోటినుంచి రక్త రావడంతో ప్రత్యూషది హత్య అని సన్నిహితులు భావిస్తున్నారు. ఆమె హత్యకు గురైందనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతదేహంపై గాయాలు ఉండటం, సూసైడ్ నోట్ లభించకపోవడం , ప్రియుడు రాజ్ సింగ్ పరారీలో ఉండడంతో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెది హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోస్ట్ మార్టం నివేదిక అనంతరం మరికొన్ని వివరాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్‌సింగ్, ఆమె చనిపోయినపుడు ఆసుపత్రిలో ప్రశాంతంగా కనిపించడం, ప్రత్యూష తల్లిదండ్రులకు విమాన టికెట్లు బుక్ చేయడంపై సన్నిహితులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి పెళ్లికూతురు ఆనందిగా తెలుగు టీవీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రత్యూష ముంబై శివార్లలోని సొంత ఫ్లాట్‌లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. -
'ప్రత్యూష జీవితాన్ని సర్వనాశనం చేశాడు'
ముంబై: రాహుల్ రాజ్‌సింగ్ తన కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశాడని బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ తండ్రి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కూతురు ప్రశాంతంగా ఉండేదని, రాహుల్ సింగ్ వచ్చాక హింసకు గురైందని కన్నీటిపర్యంతమయ్యాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాహుల్‌ను వదిలిపెట్టేది లేదని అన్నాడు. ప్రత్యూష బెనర్జీ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో ఉన్న సొంత ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నానని ఆమె సోదరి రిషిత ఆవేదన వ్యక్తం చేసింది. 'ఆ సమయంలో నేను టూషన్ క్లాస్‌లో ఉన్నాను. ఇంటికి తిరిగి వచ్చాక, అందరూ ఏడుస్తున్నారు. నా సోదరి ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నా. ఆమె ఈ పని చేసుండదు' అని రిషిత చెప్పింది. -
పరారీలో ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్
ముంబై: బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ(24) మరణానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని ముంబై పోలీసులు చెప్పారు. ఈ కేసును విచారిస్తున్నామని, ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్ను ప్రశ్నించనున్నట్టు తెలిపారు. కాగా రాహుల్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. రాజ్ సింగ్‌తో అనుబంధానికి సంబంధించి ఆమె ఇబ్బందులను ఎదుర్కోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకునే ముందు ప్రతూష్, రాజ్సింగ్లు చాటింగ్ చేసుకున్నట్టు వెల్లడైంది. వాట్సాప్‌లో ఇద్దరూ పరస్పరం ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాజ్సింగ్కు వాట్సాప్ మెసేజ్ పంపింది. అనంతరం 3:30 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న ప్లాట్‌లో పోలీసులు పరిశీలించారు. సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెప్పారు. డబ్బింగ్ సీరియల్ చిన్నారి పెళ్లికూతురులో ఆనందిగా తెలుగు టీవీ ప్రేక్షకులకు చిరపరిచితురాలైన ప్రత్యూష బెనర్జీ(24) శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో ఉన్న సొంత ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సిద్ధార్థ్ ఆస్పత్రికి తరలించారు. -
‘చిన్నారి పెళ్లి కూతురు’ ఆత్మహత్య!
ఆనంది ఫేం ప్రత్యూష అనుమానాస్పద మృతి ముంబై: డబ్బింగ్ సీరియల్ ‘చిన్నారి పెళ్లికూతురు’లో ఆనందిగా తెలుగు టీవీ ప్రేక్షకులకూ చిరపరిచితురాలైన ప్రముఖ బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ(24) శుక్రవారం మరణించారు. ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో ఉన్న సొంత ఫ్లాట్‌లో సీలింగ్‌కు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించిందని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. అయితే, సూసైడ్ నోట్ ఏదీ అక్కడ లభించలేదన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగి ఉండొచ్చని, మరణానికి కచ్చితమైన కారణం పోస్ట్‌మార్టం అనంతరమే తెలుస్తుందని స్పష్టం చేశారు. టీవీ ప్రొడ్యూసర్ అయిన బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్‌తో అనుబంధానికి సంబంధించి ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. చివరి వాట్సాప్ సందేశంలోనూ.. ‘మరణం తరువాత కూడా నీ నుంచి ముఖం తిప్పడంలేదు’ అని ఒక స్మైలీతో పాటు ఉంది. ప్రత్యూష మరణానికి కారణాలు తెలియవని చిన్నారి పెళ్లికూతురు(బాలికా వధు)లో ఆమె సహనటుడు సిద్ధార్థ్ శుక్లా తెలిపారు. ‘బిగ్ బాస్ 7’, ‘జలక్ దిఖ్లాజా’ తదితర టీవీ షోల్లోనూ ఆమె పాల్గొన్నారు. ప్రత్యూష మృతిపై సహనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు ఆమె మృతి ఆత్మాహత్య కాదేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. చిన్నారి పెళ్లి కూతురులో చిన్నప్పటి ఆనంది పాత్రను అవికా గోర్ పోషించగా, అనంతరం యుక్త వయస్సు ఆనందిగా ప్రత్యూష నటించారు. 2013లో ప్రత్యూష స్థానంలో తోరల్ రసపుత్రాను ఆ పాత్ర కోసం తీసుకున్నారు. -
35 ఏళ్ల వయసులో తాత పాత్రలా?
ముంబై: ఒక టీవీ నటుడికి ప్రయోగాలు చేసే ఆస్కారం తక్కువగా ఉంటుందన్నాడు బుల్లితెర నటుడు హర్షా చాయా. నేడు టీవీ షోలు అంతంగా ఆకట్టుకోవడం లేదన్నాడు. 'స్వాభిమాన్'టెలివిజన్ షోతో మంచి పేరు తెచ్చుకున్న ఈ నటుడు తండ్రి పాత్రలు చేయడమంటే బోర్ అంటున్నాడు. అసలు 30 ఏళ్లకే తండ్రి పాత్రలేంటని ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుతం తాను ఆ తరహా ఆఫర్లకు దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశాడు. ఇప్పుడు 30 ఏళ్లు దాటితే తండ్రి పాత్రలు.. 35 ఏళ్లు పైబడితే తాత పాత్రలు అంటున్నారు అంటూ బుల్లితెరపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. తాను ఆర్టిస్ట్ గా ప్రధానం ఉన్న పాత్రలనే చేస్తున్నానని తెలిపాడు. త్వరలో 'బాలికా వధు' సీరియల్ లో పెయింటర్ గా దర్శనమివ్వనున్నట్లు పేర్కొన్నాడు. అంతకుముందు ఈ సీరియల్ లో ఓ లవర్ బాయ్ గా పాత్ర చేసానన్నాడు. అయితే పెయింటర్ గా తాను చేసేది చిన్న క్యారెక్టరే అయినా.. అది ప్రాధాన్యత ఉన్న పాత్ర అని పేర్కొన్నాడు.