సాక్షి,ముంబై: యువనటుడు, బిగ్‌బాస్-13 విన్నర్ సిద్ధార్థ శుక్లా (40) హఠాన్మరణంపై బాలీవుడ్, టీవీ పరిశ్రమ పెద్దలు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి లోనయ్యారు. తీవ్రమైన గుండెపోటుతో సిద్దార్థ కన్నుమూశాడన్న వార్తతో నిద్రలేచిన బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సిద్ధార్థ్ గుండెపోటు కారణంగా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్టు ముంబైలోని కూపర్ హాస్పిటల్ ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి.
సిద్ధార్థ్ మరణంపై పలువురు నటీ నటులు, ఇతర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు. దీంతో ట్విటర్ ఆర్‌ఐపీ సిద్ధార్థ్ శుక్లా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. నమ్మకలేకపోతున్నామంటూ ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్, నటి మోడల్ మల్లికా షెరావత్ ట్వీట్ చేశారు. ప్రముఖ టీవీ, సినీ నటి రేణుకా సహానే, మున్‌మున్ దత్తా తదితరులు సిద్ధార్థ్ ఆకస్మిక మరణంపై సంతాపం వ్యక్తంచేశారు.
చదవండి : Sidharth Shukla: బిగ్‌బాస్ విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం
కాగా1980, డిసెంబర్ 12న ముంబైలో జన్మించిన సిద్ధార్థ్ శుక్లా మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. బాబుల్ కా ఆంగన్ చూటే నా అనే టెలివిజన్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యాడు. జానే పెహచానే సే, యే అజ్‌నబీ, లవ్ యు జిందగీ లాంటి సీరియల్స్‌లో నటించాడు. ముఖ్యంగా పాపులర్ టీవీ సీరియల్ ‘బాలికా వధు’ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. 2014లో కరణ్ జోహార్ నిర్మించిన హంప్టీ శర్మకి దుల్హానియాతో బాలీవుడ్‌కీ ఎంట్రీ ఇచ్చాడు.
చదవండి : నేను అమ్మకూచిని: బిగ్‌బాస్ విన్నర్
With a broken heart and sadness in in my soul I miss you more every day. Rest in peace#SiddharthShukla absolutely heartbroken I don't know what to say totally blank I miss you your jabra fan ❤️❤️ pic.twitter.com/NFy9gsJjth
— Dhruvvvv🌟 (@dhruvda7) September 2, 2021
Too young to go💔 #SiddharthShukla RIP 🙏🙏 pic.twitter.com/78AW1l8Gsd
— Mallika Sherawat (@mallikasherawat) September 2, 2021
Shocked and numb. No Words 🙏🙏🙏 #SiddharthShukla
— Munmun Dutta (@moonstar4u) September 2, 2021
I cannot process that Siddharth Shukla has passed away. Life is just too unpredictable. RIP Siddharth. My condolences to his family and friends and to all his devastated fans 🙏🏽🙏🏽🙏🏽😢
— Renuka Shahane (@renukash) September 2, 2021
Hello bollywood !!!
— Diptiman Yadav (@Dipti_6450) September 2, 2021
Is it really a heart attack ???
Remember SSR.#SiddharthShukla 😓😨💔 pic.twitter.com/6TSfBe9hlS
I cannot process this news that I just came across. Is this true? Please no. No… #SiddharthShukla
— ARMAAN MALIK (@ArmaanMalik22) September 2, 2021
Comments
Please login to add a commentAdd a comment