Pratyusha Banerjees Father About Sidharth Shukla : బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మృతి అందరినీ షాక్‌కి గురి చేస్తుంది. 40 ఏళ్ళకే యువనటుడు గుండెపోటుతో హఠాన్మరణం చెందడాన్ని అభిమానులు జీర్జించుకోలేకపోతున్నారు. తాజాగా దివంగత నటి ప్రత్యూష బెనర్జీ తండ్రి శంకర్ బెనర్జీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ శుక్లాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.
'సిద్ధార్థ్‌ను నేను నా కొడుకులా భావించాను. బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు)సీరియల్ టైం నుంచి సిద్ధార్థ్, ప్రత్యూష మంచి స్నేహితులు. అయితే నా కూతురు చనిపోయాక సిద్ధార్థ్-ప్రత్యూషల గురించి మీడియాలో ఏవేవో వార్తలు రాసేవారు. దీంతో తను మా ఇంటికి రావడం మానేశాడు. కానీ నాతో ఫోన్‌లో ఎప్పుడూ టచ్‌లో ఉండేవాడు. మా బాగోగుల గురంచి అడిగి కనుక్కునేవాడు.
లాక్‌డౌన్ టైంలో కూడా తరుచూ వాట్సాప్‌లో నాతో టచ్‌లో ఉండేవాడు. అంకుల్,ఆంటీ..మీరు బాగున్నారా? మీకు ఏదైనా సహాయం కావాలా? నేను మీకు ఏదైనా సహాయడగలనా అంటూ తరుచూ మమ్మల్ని అడిగేవాడు. వద్దన్నా బలవంతంగా ప్రతీ నెల 20వేల రూపాయలు పంపేవాడు. అతని మరణం సడెన్ షాక్‌లా అనిపిస్తుంది' అంటూ సిద్ధార్థ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
కాగా కరణ్ జోహార్ నిర్మించిన “హంప్టీ శర్మకి దుల్హనియా” తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ “జలక్ దిఖ్లా జా 6”, “ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాది 7”, “బిగ్ బాస్ 13” వంటి రియాలిటీ షోలలో పాల్గొని మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. బాలికా వధు సీరియల్‌లో ప్రత్యూష బెనర్జీ, సిద్ధార్థ్ శుక్లా హీరో, హీరోయిన్లుగా నటించి స్టార్స్‌గా ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే దురదృష్టవశాత్తూ 24 ఏళ్ల వయసులోనే ప్రత్యూష బెనర్జీ కన్నుమూసింది. 2016లో ప్రియుడితో వివాదాల కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు ప్రచారంలో ఉంది. ఇటీవలె బామ్మగా అలరించిన సురేఖ సిఖ్రి కన్నుమూయగా, ఇప్పుడు సిద్ధార్థ్ మరణం తీరని విషాదాన్ని నింపింది.
చదవండి: సిద్ధార్థ్ శుక్లా మరణవార్త విని కుప్పకూలిన ప్రేయసి షెహనాజ్
సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియల్లో వివాదం..వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment