అప్పుడు నన్ను నేను చాలా అసహ్యించుకున్నా: హీరోయిన్‌ | Avika Gor On Battling Body Image Issues As Teen Actor | Sakshi
Sakshi News home page

Avika Gor: 'అద్దంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు'..

Published Sun, Jan 30 2022 8:34 PM | Last Updated on Sun, Jan 30 2022 8:52 PM

Avika Gor On Battling Body Image Issues As Teen Actor - Sakshi

I hated myself so much Says Heroine Avika Gor: చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి అవికా గోర్‌. సీరియల్‌లో తన ముద్దు ముద్దు మాటలు, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. ఇక డబ్బింగ్‌ సీరియల్‌తో తెలుగువారికి సైతం ఎంతో దగ్గరైంది.

అయితే ఈ సీరియల్‌ చేస్తున్నప్పుడు మాత్రం తాను సంతోషంగా లేనని పేర్కొంది. తాజాగా  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అవికా ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'సీరియల్‌ చేస్తున్న సమయానికి నేనంత ఫిట్‌గా లేను. దీంతో నన్ను నేను చాలా అసహ్యించుకున్నాను. స్క్రీన్‌పై ఎలా కనిపిస్తున్నానే విషయాన్ని కూడా పట్టించుకునేదాన్ని కాదు.

అసలు అద్దంలో నా ముఖాన్ని చూసుకునేందుకు కూడా ఇష్టపడేదాన్ని కాదు. కానీ నేను ఎలా కనిపిస్తున్నాననే దానికంటే కూడా నా నటనకే ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యారు. ఆ విషయంలో వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని పేర్కొంది. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ ప్రస్తుతం కల్యాణ్‌ దేవ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement