Chinnari Pellikuthuru
-
తల్లి కాబోతున్న చిన్నారి పెళ్లికూతురు ఫేం
చిన్నారి పెళ్లి కూతురు ఫేం, నటి నేహా మర్దా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 10 ఏళ్ల క్రితం ఆయూష్మాన్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ సందర్భంగా నేహా తన భర్తతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో ఈ శుభవార్త పంచుకుంది. 2023లో బేబీ తమ జీవితాల్లోకి రాబోతున్నట్లు ఆమె స్పష్టం చేసింది. కాగా నేహా మర్దా బాలిక వధు(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌తో గుర్తింపు పొందింది. అందులో ఆమె అత్త పాత్ర పొషించింది. అంతేకాదు ఆమె పలు టీవీ షో, డాన్స్‌లో షోలో పాల్గొంది. View this post on Instagram A post shared by Neha Marda (@nehamarda) చదవండి: ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి నాన్నా: మహేశ్ ఎమోషనల్ -
అప్పుడు నన్ను నేను చాలా అసహ్యించుకున్నా: హీరోయిన్
I hated myself so much Says Heroine Avika Gor: చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి అవికా గోర్. సీరియల్లో తన ముద్దు ముద్దు మాటలు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. ఇక డబ్బింగ్ సీరియల్‌తో తెలుగువారికి సైతం ఎంతో దగ్గరైంది. అయితే ఈ సీరియల్ చేస్తున్నప్పుడు మాత్రం తాను సంతోషంగా లేనని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అవికా ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'సీరియల్ చేస్తున్న సమయానికి నేనంత ఫిట్‌గా లేను. దీంతో నన్ను నేను చాలా అసహ్యించుకున్నాను. స్క్రీన్‌పై ఎలా కనిపిస్తున్నానే విషయాన్ని కూడా పట్టించుకునేదాన్ని కాదు. అసలు అద్దంలో నా ముఖాన్ని చూసుకునేందుకు కూడా ఇష్టపడేదాన్ని కాదు. కానీ నేను ఎలా కనిపిస్తున్నాననే దానికంటే కూడా నా నటనకే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఆ విషయంలో వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని పేర్కొంది. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ భామ ప్రస్తుతం కల్యాణ్ దేవ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది. -
షేక్ చేస్తున్న బిగ్‌బాస్ విన్నర్ పాట!
ముంబై: చిన్నారి పెళ్లి కూతురు నటుడు శివ(సిద్దార్థ్ శుక్లా), నేహా శర్మల రోమాంటిక్, ఎమోషనల్ సాంగ్ ‘దిల్ కో కరార్ ఆయా’ యుట్యూబ్‌ను షేక్ చేస్తోంది. నిన్న(శుక్రవారం) ఈ పాట యుట్యూబ్లో విడుదలైంది. విడుదలైన 9 గంటల్లోనే ఈ పాట 25 లక్షల వ్యూస్ సంపాదించి యుట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. ‘దిల్ కో కరార్ ఆయా’ అంటూ సాగే ఈ పాట లింక్‌ను శుక్లా అభిమానుల కోసం శుక్రవారం ట్విటర్లో పంచుకున్నారు. ‘దీనిని మీరు ఇష్టపడతారని ఆశిస్తున్నాను... ఈ పాటపై మీ అభిప్రాయాన్ని నాకు తెలపండి’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. Hope you guys like it.. let me know...https://t.co/ZjYlePGHrv — Sidharth Shukla (@sidharth_shukla) July 31, 2020 శుక్లా, నేహా రోమాంటిక్ పాట సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు ఫిదా అవుతూ నెటిజన్లు కామెంట్స్‌లో హర్ట్ ఎమోజీల వర్షం కురిపిస్తున్నారు. ‘తన అభిమానుల కోసం సిద్దార్థ్ శుక్లా మరోసారి ప్రేమ, సంతోషాన్ని విస్తరించారు. ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది. ఆయన నుంచి నా కళ్లు తిప్పుకోలేకపోయాను’, ‘సిద్దార్థ్ హర్ట్... చూస్తూనే ఉండండి’, ‘ఈ పాట మొత్తం ప్రేమ, ఎమోషన్స్‌తో నిండి ఉంది’ అంటూ అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. -
ఆనంది... భర్తకు దూరం కానుందా?!
యేళ్ల తరబడి సా..గు..తూ.. ఉంటే ఏ సీరియల్ అయినా బోర్ కొట్టి తీరుతుంది. కానీ ‘చిన్నారి పెళ్లికూతురు’ మాత్రం అంతకంతకూ ఆకట్టుకుంటోంది. ఆనంది అనే చిన్న అమ్మాయి బాల్యవివాహంతో మొదలైన ఈ సీరియల్... ఉత్కంఠభరితమైన మలుపులతో నేటికీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. అయితే ఇందులో అతి త్వరలో ఓ పెద్ద మలుపు రాబోతోంది. అది ఇప్పటివరకూ రానంత పెద్ద మలుపు. అందరి మనసులనూ కలచివేసే మలుపు. అదే... హీరో శివ్‌రాజ్ శేఖర్ మరణం! అప్పటికే మొదటి పెళ్లితో ఘోర పరాభవానికి గురై, అష్టకష్టాలు అనుభవించి, గుండెను రాయి చేసుకుని బతుకుతోన్న ఆనంది జీవితంలోకి వస్తాడు శివ్. ఎలాగో ఆమె మనసును కరిగించి, అందులో స్థానం సంపాదిస్తాడు. ఆమెకు అన్ని విషయాల్లో తోడు నీడగా ఉంటూ ఆదర్శ భర్తగా మెలుగుతున్నాడు. అలాంటివాడికి మరణమా? అతను పోతే ఆనంది పరిస్థితి ఏమిటి? అతడే లోకమనుకునే ఆమె ఎలా బతుకుతుంది? తలచుకుంటేనే ప్రేక్షకుడికి, ముఖ్యంగా ఆ సీరియల్ అభిమానికి గుండె చెరువైపోతుంది. కానీ ఏం చేస్తాం... ఈ ట్విస్టుకు సిద్ధపడాల్సిందే! -
గోరంత దీపం
ఇంటర్వ్యూ హీరోయిన్ అంటే స్లిమ్‌గా ఉండాలి, మోడ్రన్‌గా రెడీ అవ్వాలి, గ్లామర్ ఒలకబోయాలి అంటారంతా. కానీ వీటిలో ఏదీ అవసరం లేదు, టాలెంట్ చాలు అంటుంది అవికా గోర్. మిగతా హీరోయిన్లంతా గ్లామర్ క్వీన్సలా మెరుస్తుంటే... తాను మాత్రం సంప్రదాయబద్ధంగా ఉంటూనే సంచలనాలు సృష్టిస్తానని నమ్మకంగా చెబుతోంది. తెలుగు చలన చిత్ర రంగంలో గోరంత దీపంలా వెలుగుతోన్న అవిక చెప్పిన మరిన్ని కబుర్లు చదవండి... * మీ బ్యాగ్రౌండ్..? నేను ముంబైలో పుట్టాను. నాన్న ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నారు. అమ్మ నేచురోపతి డాక్టర్. అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే. * నటనపై ఆసక్తి ఎలా వచ్చింది? ఎనిమిదేళ్ల వయసులో ఓ షాపింగ్ మాల్కి వెళ్లిన ప్పుడు, అక్కడి మ్యూజిక్‌కి నేను డ్యాన్స్ చేయడం మొద లెట్టాను. అప్పుడు ఎవరో నాన్నతో... ‘భలే డ్యాన్స్ చేస్తోంది, తనని యాక్టర్‌ని చేయండి’ అన్నారట. నాన్నకి కూడా అభ్యంతరం లేకపోవడంతో నన్ను నటిని చేయడానికి ఇష్టపడ్డారు. తర్వాత ‘బాలికావధు (చిన్నారి పెళ్లికూతురు)’ సీరియల్‌తో నా కెరీర్ ప్రారంభమైంది. * దక్షిణాదిన చాన్స్ ఎలా వచ్చింది? ‘చిన్నారి పెళ్లికూతురు’తో నేను ఇక్కడ కూడా బాగా పాపులర్ అయ్యాను. అందుకే ‘ఉయ్యాల జంపాల’లో ఆఫర్ వచ్చింది. అంతకు ముందు హిందీ, తమిళం, గుజరాతీ, రాజస్థానీ చిత్రాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. అలాంటివి చేయడం ఇష్టం లేక ఒప్పుకోలేదు. కానీ తెలుగులో ఆ సమస్య లేదు. ‘ఉయ్యాల జంపాల’ క్లీన్ మూవీ. పైగా నా వయసుకు తగిన క్యారెక్టర్. దాంతో వెంటనే ఓకే అనేశా. * ‘ససురాల్ సిమర్‌కా (మూడుముళ్లు)’ సీరియల్లో భార్యగా, కోడలిగా చేశారు. ఇంత చిన్న వయసులో అంత బరువైన పాత్ర ఎందుకు ఎంచుకున్నారు? వయసు ఎంతయితే ఏంటి! నేనా పాత్రకి సూటవుతాను కాబట్టి వాళ్లు తీసుకున్నారు. చేయగలనన్న నమ్మకం నాకుంది కాబట్టి నేను చేశాను. ఈ వయసులో అమితాబ్‌గారు ‘పా’లో చిన్న పిల్లాడిగా చేయలేదా? ఆయన కంటే ఎంతో చిన్నదైన విద్యాబాలన్ ఆయనకు తల్లిగా చేయలేదా? యాక్టర్ అన్న తర్వాత అన్నీ చేయాలి. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ప్రెగ్నెంట్‌గా నటించడానికి కూడా రెడీ నేను. * అందులో రొమాంటిక్ సీన్లు కూడా చేశారు..? నటించడానికి సిద్ధపడిన తర్వాత నవ రసాలూ పండించాలిగా! అది నటన అని గుర్తున్నంత వరకూ ఇబ్బందిగా ఉండదు. అయినా సీరియల్లో ఎంత రొమాన్స ఉంటుంది చెప్పండి! పైగా అది అసభ్యంగా కూడా ఉండదు. ఉంటే నేను చేసేదాన్ని కాదు. * మోడ్రన్‌గా ఉండటానికి ఇష్టపడరెందుకని? పొట్టి పొట్టి స్కర్టులు, నిక్కర్లు సౌకర్యంగా అనిపించవు నాకు. కుర్తీ, గాగ్రా, చీర వంటివే బాగుంటాయి. అవే ఇష్టపడతాను, ధరిస్తాను. * ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే? నటన నా ప్రాణం. దానికోసం ఎంతయినా కష్టపడతాను. అయితే నా కుటుంబంతో కలిసి చూడలేని విధంగా నా సినిమా ఉండకూడదు. ఆ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. * ఇప్పుడున్న హీరోయిన్లతో పోలిస్తే లావుగా ఉన్నారు. సన్నబడాలని లేదా? అది నేను చేసే పాత్ర మీద ఆధారపడి ఉంటుంది. పాత్ర కోసం బరువు తగ్గాలంటే తగ్గుతా లేకపోతే పెరుగుతా. నిజానికి నాకు కాజోల్ అంటే ఇష్టం. అందుకే ఆమెలా బొద్దుగా ఉండటానికే ఇష్టపడతా. * మీలో మార్చుకోవాలనుకునేది ఏదైనా ఉందా? నేను ఫుడ్ లవర్ని. బాగా తింటాను. కంట్రోల్ చేసుకోకపోతే కెరీర్‌కి దెబ్బవుతుం దని అమ్మ చెబుతూంటుంది. అప్పుడు నిజమే కదా అనుకుంటా. తర్వాత మళ్లీ మామూలే. * ఎవరినైనా ప్రేమించారా? చిన్నప్పుడు ‘ఇష్క్ విష్క్’ సినిమా చూసి షాహిద్ కపూర్‌తో ప్రేమలో పడ్డాను. * మరి ఇప్పుడు? ప్రేమలో పడేంత, డేటింగ్ చేసేంత వయసు నాకింకా రాలేదు. * ఫ్యూచర్ ప్లాన్స్? ఏమున్నాయి! ప్రస్తుతానికి మంచి ఆఫర్స ఉన్నాయి. తెలుగులో చేస్తున్నా. హిందీలో కూడా ఓ సినిమాలో చాన్స వచ్చింది. రెండు చోట్లా సక్సెస్ కావాలన్నదే లక్ష్యం.