
ముంబై: చిన్నారి పెళ్లి కూతురు నటుడు శివ(సిద్దార్థ్ శుక్లా), నేహా శర్మల రోమాంటిక్, ఎమోషనల్ సాంగ్ ‘దిల్ కో కరార్ ఆయా’ యుట్యూబ్‌ను షేక్ చేస్తోంది. నిన్న(శుక్రవారం) ఈ పాట యుట్యూబ్‌లో విడుదలైంది. విడుదలైన 9 గంటల్లోనే ఈ పాట 25 లక్షల వ్యూస్ సంపాదించి యుట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ‘దిల్ కో కరార్ ఆయా’ అంటూ సాగే ఈ పాట లింక్‌ను శుక్లా అభిమానుల కోసం శుక్రవారం ట్విటర్‌లో పంచుకున్నారు. ‘దీనిని మీరు ఇష్టపడతారని ఆశిస్తున్నాను... ఈ పాటపై మీ అభిప్రాయాన్ని నాకు తెలపండి’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
Hope you guys like it.. let me know...https://t.co/ZjYlePGHrv
— Sidharth Shukla (@sidharth_shukla) July 31, 2020
శుక్లా, నేహా రోమాంటిక్ పాట సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు ఫిదా అవుతూ నెటిజన్లు కామెంట్స్‌లో హర్ట్ ఎమోజీల వర్షం కురిపిస్తున్నారు. ‘తన అభిమానుల కోసం సిద్దార్థ్ శుక్లా మరోసారి ప్రేమ, సంతోషాన్ని విస్తరించారు. ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది. ఆయన నుంచి నా కళ్లు తిప్పుకోలేకపోయాను’, ‘సిద్దార్థ్ హర్ట్... చూస్తూనే ఉండండి’, ‘ఈ పాట మొత్తం ప్రేమ, ఎమోషన్స్‌తో నిండి ఉంది’ అంటూ అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.