మృణాల్ అలాంటి పిలుపు.. ఏం కావాలంటోన్న విజ‍య్ దేవరకొండ! | Vijay Deverakonda's Family Star Movie Teaser Trending #1 On Youtube | Sakshi
Sakshi News home page

Vijay Deverakonda: విజ‍య్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. నంబర్‌వన్‌లో ట్రెండింగ్‌!

Mar 5 2024 8:53 PM | Updated on Mar 6 2024 8:43 AM

Vijay Deverakonda latest Movie Family Star Trending Number one On Youtube - Sakshi

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం'ఫ్యామిలీ స్టార్'.  పరశురామ్ పెట్ల డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 

రిలీజైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ టీజర్‌ నంబర్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈ విషయాన్ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్‌ చేశారు. అంతే కాకుండా మృణాల్ ఠాకూర్ క్యూట్‌గా విజయ్‌ను పిలుస్తున్న వీడియోను పోస్ట్‌ చేశారు. ఏవండీ.. ఏవండీ.. అంటూ మృణాల్ పిలవగా.. ఆ.. ఏం కావాలి? అంటూ మన హీరో రిప్లై ఇచ్చాడు. దీనికి మృణాల్ నవ్వులు చిందిస్తూ చిందులు వేస్తూ కనిపించింది. మృణాల్ అలా ప్రేమగా పిలవడంతో మా సెట్‌ వెలిగిపోతోందంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటో మీరు చూసేయండి. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement