విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' ఎట్టకేలకు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. అనుకున్న టైం కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. వచ్చిన తర్వాత చూసేందుకు ప్లాన్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?
(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)
'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాల దెబ్బకు విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత వరసగా మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ ఒక్కటంటే ఒక్క దానితో హిట్ కొట్టలేకపోతున్నాడు. 'ఖుషి' ఓ మాదిరి కలెక్షన్స్‌తో పర్వాలేదనిపించింది. ఇది తప్పితే మిగతావన్నీ డిజాస్టర్స్ అవుతూ వచ్చాయి. దీంతో 'ఫ్యామిలీ స్టార్'పై విజయ్ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ విషయంలోనూ నిరాశే ఎదురైంది.
ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఉగాది, రంజాన్ లాంటి హాలీడే వీకెండ్ దొరికినప్పటికీ.. 'ఫ్యామిలీ స్టార్' చూసేందుకు జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఊహించని విధంగా 20 రోజుల్లోనే ఓటీటీలో తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఏప్రిల్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో దక్షిణాది భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిన 'ఫ్యామిలీ స్టార్'.. ఓటీటీలో ఇంకేం చేస్తాడో చూడాలి?
(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment