తెరపై చేసే ప్రతి పాత్ర నా గుండెల్లో నిలిచిపోతుంది: మృణాల్ ఠాకూర్ | Mrunal Thakur Reveals About Feeling Over Her Role In Family Star Movie, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: ఆ పాత్ర చేయడం సవాల్‌గా అనిపించింది: మృణాల్ ఠాకూర్

Apr 12 2024 7:55 AM | Updated on Apr 12 2024 10:22 AM

Mrunal Thakur Feeling About Her Role In Familt Star Movie - Sakshi

విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామలీ స్టార్‌. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ చిత్రానికి బాగా కనెక్ట్‌ అయ్యారు. తాజాగా ఈ మృణాల్‌ ఠాకూర్‌ తన పాత్రపై ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుందని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది ముద్దుగుమ్మ. 

మృణాల్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను ఇందుగా ఉన్న క్షణాలు. ఇందు నేనుగా ఉన్న క్షణాలు. తెరపై నేను చేసే ప్రతి పాత్ర నా గుండెల్లో ఉంటుంది. ఇందు పాత్రకు న్యాయం చేయడానికి నేను ఇందుగానే ఉండాలి.  ఆమెలా కేవలం షూస్‌ ధరించడం మాత్రమే కాదు. ఆమెలా ఒక మైలు నడవాలి. ఆమెను నా జీవితంలోకి తీసుకురావడానికి మొదట కొంచెం సవాలుగా అనిపించింది. కానీ నేను నెమ్మదిగా ఆమెను అర్థం చేసుకోవడం ప్రారంభించా.  ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ... నేను ఆ పాత్రను ఇంకా వదిలివేయాలని అనుకోలేదు. ఇందు పాత్రను నేను ఎంత ఆనందించానో మీరు కూడా ఆస్వాదించారని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఇందు పాత్రలో కనిపించింది. ఓ కంపెనీకి సీఈవోగా అందరినీ మెప్పించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement