‘ఫ్యామిలీ స్టార్‌’బంపరాఫర్‌.. మీ ఇంటికే విజయ్‌ దేవరకొండ! | The Family Star Team Is Going To Pay A Surprise Visit To Your Family Stars | Sakshi
Sakshi News home page

‘ఫ్యామిలీ స్టార్‌’బంపరాఫర్‌.. మీ ఇంటికే విజయ్‌ దేవరకొండ!

Published Sat, Apr 6 2024 3:37 PM | Last Updated on Sat, Apr 6 2024 3:53 PM

The Family Star Team Is Going To Pay A Surprise Visit To Your Family Stars - Sakshi

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీ ఈ  శుక్రవారం విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. తమ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడే వాళ్లంతా ఫ్యామిలీ స్టార్సే అనేది ఈ మూవీ స్టోరీ లైన్. అలాంటి ఫ్యామిలీ స్టార్స్ ను కలిసేందుకు ఫ్యామిలీ స్టార్ టీమ్ సర్ ప్రైజ్ విజిటింగ్ కు వస్తోంది. మీ ఇంటి ఫ్యామిలీ స్టార్ ను ఫ్యామిలీ స్టార్ టీమ్ కలవాలని కోరుకునే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు  గొప్ప అవకాశం ఇది. 

(చదవండి: ఫ్యామిలీ స్టార్‌’ మూవీ రివ్యూ)

ఈ అనౌన్స్ మెంట్ లోని ఫామ్ ఫిల్ చేస్తే ఫ్యామిలీ స్టార్ టీమ్ హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకుడు పరశురామ్ పెట్ల మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీ స్టార్ ను సర్ ప్రైజ్ చేస్తారు. కింద ఇచ్చిన ఫామ్ లో మీ పేరు అడ్రస్ తో పాటు మీ ఫ్యామిలీ స్టార్ ఎ‌వరు, ఎందుకు అనే ప్రశ్నలకు ఆన్సర్స్ రాసి ఫిల్ చేయాలి. నిన్న థియేటర్స్ లోకి వరల్డ్ వైడ్ రిలీజ్ కు వచ్చింది ఫ్యామిలీ స్టార్ సినిమా. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు సహా ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమా టార్గెటెడ్ ఆడియెన్స్ అయిన సకుటుంబ ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతోంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement