fat body
-
డెలివరీ తర్వాత పొట్ట అధిక బరువు తగ్గాలంటే|
నేను డెలివరీ అయ్యి రెండు వారాలు. మా ఫ్రెండ్స్ కొందరికీ డెలివరీ తర్వాత పొట్ట వదులుగా తయారైంది. నాకు అలా అవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సీహెచ్. శ్రావణి, విజయనగరం ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల పొట్టలోని కండరాలు ముఖ్యంగా రెక్టస్ మజిల్, కనెక్టివ్ టిష్యూ మృదువుగా మారుతాయి. పెరిగే గర్భసంచిని, బిడ్డను అకామడేట్ చేయడానికి స్ట్రెచ్ అవుతాయి. కానీ ప్రసవం తరువాత ఆ కండరాలను శక్తిమంతం చేసే వ్యాయామాలు చేయకపోతే పొట్ట కండరాలు బలహీనపడతాయి. దానివల్ల వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోషన్‌కి వెళ్తున్నప్పుడు సమస్యలు, కీళ్ల నొప్పులు వస్తాయి. స్మాల్ రెక్టస్ సపరేషన్ చాలావరకు 6–8 వారాల్లో మజిల్ స్ట్రెచింగ్‌తో కవర్ అవుతుంది. ఈ స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్‌ని ప్రసవం అయిన రెండు నుంచి నాలుగు వారాల్లో నెమ్మదిగా మొదలుపెట్టాలి. ఈ ఎక్సర్సైజెస్ కోసం ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదిస్తే మంచిది. ఈ వ్యాయామాలు చేసేటప్పుడు నొప్పి, అసౌకర్యం ఉంటే గనుక అసలు చేయకూడదు. ఇప్పుడు చాలా క్లినిక్స్‌లో పోస్ట్‌నాటల్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అని స్పెషల్ కేర్ ఎక్సర్‌సైజెస్‌ని నేర్పిస్తున్నారు. మీ శరీర తత్వం, మీది ఏరకమైన ప్రసవం.. అనే అంశాలను బట్టి మీ గైనకాలజిస్ట్, ఫిజియోథెరపీ టీమ్ కలసి మీకు తగిన వ్యాయామాలను సూచిస్తారు. ఈ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు అబ్డామినల్ బైండర్ లేదా టమ్మీ సపోర్ట్ బెల్ట్‌ను పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మీ శరీరం మునుపటిలా ఫిట్‌గా మారడానికి టైమ్ పడుతుంది. ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట కండరాలు నెలల పాటు స్ట్రెచ్ అయి ఉంటాయి. కాబట్టి అవి మళ్లీ మునుపటిలా టైట్ అవడానికి అంతే టైమ్ పట్టొచ్చు. త్వరగా పూర్వపు స్థితికి రావాలని హడావిడిగా అన్ని ఎక్సర్సైజెస్ చేస్తే వెన్ను నొప్పి ఎక్కువవొచ్చు. సిజేరియన్ అయిన వారు ఇంకొంచెం ఎక్కువ టైమ్ తీసుకుని శరీరం, మనసు సిద్ధమైన తర్వాతే ఎక్సర్సైజెస్ మొదలుపెట్టాలి. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి అందరికీ చాలా మంచివి. ప్రసవమైన రెండు వారాలకు వీటిని స్టార్ట్ చేయొచ్చు. ఆఫ్‌లైనే కాదు ఆన్లైన్ ద్వారా కూడా వీటిని నేర్పిస్తారు. ఈ వ్యాయామాల వల్ల యూరినరీ మజిల్స్ టైట్ అవుతాయి. ప్రసవం తరువాత తలెత్తే యూరిన్ లీకేజ్, అర్జెన్సీ వంటి సమస్యలు తగ్గుతాయి. కవలలను.. అధిక బరువు బిడ్డను మోసినప్పుడు స్ట్రెచ్ ఎక్కువ అవుతుంది. అలాంటివారు ఎక్కువ టైమ్ తీసుకుని డాక్టర్ పర్యవేక్షణలో స్ట్రెంతెనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ప్రెగ్నెన్సీ లేదా డెలివరీ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే పూర్తిగా కోలుకునే వరకు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొద్దని డాక్టర్ చెప్తారు. అది ఫాలో కావాలి. సరైన గైడెన్స్ అవసరం ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రసవం తరువాత ఏడాది వరకు బిడ్డకు చనుబాలు అవసరం కాబట్టి క్రాష్ డైట్ అసలు చేయకూడదు. కూర్చుని చేసే తేలికపాటి యోగాసనాలు, ధ్యానం వంటివి ప్రసవం తరువాత కాస్త ఎర్లీగానే మొదలుపెట్టవచ్చు. మా కుటుంబంలో అందరికీ హై బీపీ ఉంది. బీపీ వల్ల మా అక్కకి 9వ నెల ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వచ్చాయి. నాకు ఇప్పుడు మూడవ నెల. మేము ఉండేది విలేజ్‌లో. ఏ కాంప్లికేషన్ రాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి. – వాణీపద్మజ, బోథ్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో బీపీ, సుగర్ విషయంలో ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. మీ వయసు, బరువును బట్టి బీపీ రిస్క్ ఎంత ఉంది అనేది కాలిక్యులేట్ చేయొచ్చు. మూడవ నెలలో అందరికీ చేసే Nఖీ స్కాన్‌లో ఇవన్నీ అసెస్ అవుతాయి. ఇలాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీలో మూడవ నెల నుంచి అటpజీటజీn మాత్రలను సజెస్ట్ చేస్తారు. ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీని జెస్టేషనల్ హైపర్‌టెన్షన్ లేదా ప్రీఎక్లమ్సియా అంటారు. వందలో 2–8 ప్రెగ్నెన్సీల్లో ఇది కనిపిస్తుంది. ఈ కేసెస్‌లో హై బీపీతోపాటు మూత్రంలో ప్రొటీన్స్ పోతుంటాయి. బిడ్డ ఎదుగుదల మీదా ప్రభావం పడుతుంది. ప్లెసెంటాలో జరిగే మార్పుల వల్ల బీపీ పెరిగి తల్లికి, బిడ్డకు ప్రమాదం సంభవిస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ లేదా అంతకుముందు బీపీ ఉన్నవారిలో రిస్క్ ఎక్కువ. దీన్ని తగ్గించేందుకు బీపీని కంట్రోల్ చేసే మాత్రలతోపాటు ప్రివెంటివ్ కేర్ కింద అటpజీటజీn మాత్రలనూ వాడాలి. హై బీపీని గుర్తించకపోతే తలనొప్పి, బ్లర్డ్ విజన్, కడుపు నొప్పి, ముఖము, పాదాల్లో వాపు వస్తుంది. బిడ్డ ఎదుగుదల మందగించడం, లోపల బ్లీడింగ్ అవడం, బిడ్డ ప్రాణానికి ముప్పు ఏర్పడవచ్చు. అందుకే హై రిస్క్ కేసెస్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏడవ నెల వరకు నెలకు రెండుసార్లు.. ఏడవ నెల తరువాత నుంచి వారానికి ఒకసారి చెకప్స్‌కి వెళ్లాలి. తగిన సమయంలో బ్లడ్, యూరిన్ టెస్ట్‌లు, స్కాన్స్ చేయించుకోవాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీలను చూసే ఆసుపత్రిలో రెగ్యులర్ యాంటీనాటల్ కేర్‌కి వెళ్లడం మంచిది. మీకు ఇప్పుడు మూడవ నెల కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి రిస్క్ అసెస్మెంట్ చేయించుకోండి. ఇందులో హై రిస్క్ వస్తే రెగ్యులర్ చెకప్స్ తప్పనిసరి. మూడవ నెల నుంచి 36 వారాల వరకు అటpజీటజీn మాత్రలను ఇస్తారు. ఈ మాత్రల వల్ల కొంచెం ఎసిడిటీ వస్తుంది. అందుకే రాత్రి భోజనం తర్వాత ఈ మాత్రలను తీసుకోవాలి. ఒకవేళ వెజైనల్ బ్లీడింగ్ లేదా అల్సర్స్ ఉంటే మోతాదు మారుస్తారు. డైట్, జీవనశైలిని మారిస్తే బీపీ వచ్చే రిస్క్ తగ్గుతుంది. పౌష్టికాహారం, ఎక్సర్‌సైజెస్‌తో బరువు పెరగకుండా చూసుకోవాలి. విటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్స్‌ను తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఫోలిక్ యాసిడ్ మాత్రలను వాడాలి. ఈ జాగ్రత్తలతో పాటు ప్రెగ్నెన్సీలో మీకు ఎప్పుడైనా విపరీతమైన తలనొప్పి, బ్లర్డ్ విజన్, వాంతులు, ఛాతీ నొప్పి వంటివి వస్తే వెంటనే హై రిస్క్ యూనిట్‌ని సంప్రదించాలి. వెంటనే బీపీ మెడిసిన్‌ని స్టార్ట్ చేస్తారు. ఇలా ప్రివెంటివ్ మెడిసిన్, లైఫ్‌స్టయిల్ చేంజెస్, క్రమం తప్పని యాంటీనాటల్ చెకప్స్‌తో బీపీ వచ్చే చాన్సెస్ను తగ్గించుకోవాలి. -
లావున్నావంటూ భర్త వేధించడంతో గృహిణి ఆత్మహత్య
ముంబై: భర్త తనను ‘లావున్నావని’ వేధించాడని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్లాం కాండే, తెహ్మీనాలకు 2016లో పెళ్లి జరిగింది. ఇంటి పనుల విషయంలో తల్లిదండ్రులతో గొడవ అవుతుండటంతో అస్లాం భార్యను తీసుకొని వచ్చి బయట ఉంటున్నారు. అయితే.. కొన్ని రోజుల తరువాత భార్యాభర్తల మధ్యా గొడవలు ప్రారంభం అయ్యాయి. ఓసారి తెహ్మీనా పోలీసులకు పిర్యాదు చేయగా.. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే తనతో గొడవపడుతోందని పోలీసులకు చెప్పాడు. అంతే కాదు.. భార్యను బైకుల్లాలోని ఆమె తల్లి రజియా వసీం అన్సారీ ఇంటిలో దించేశాడు. ఫిబ్రవరి 14న తల్లి బయటికి వెళ్లిన సమయంలో తెహ్మీనా ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త అస్లాంపై కేసు నమోదు చేశారు. ‘నువ్వు లావుగా ఉన్నావు, నీకు డ్రెస్‌సెన్స్ లేదు, నీకు పిల్లలు కావడం లేదు’ అంటూ అస్లాం తన కూతురును తరచూ వేధించేవాడని రజియా తెలిపింది. తనకు పిల్లలు పుట్టడం లేదని తన భర్త వేరే పెళ్లి చేసుకున్నాడని తెహ్మీనా తరచూ అనుమానించేదని, ఆ డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకుందని రజియా పోలీసులకు వెల్లడించింది. రజియా ఫిర్యాదు మేరకు అస్లాంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Beauty Tips: వుడ్ థెరపీ.. స్లిమ్‌గా మార్చేస్తుంది! ముడతలు తొలగిస్తుంది!
Beauty Tips In Telugu: ఉన్న అందాన్ని సంరక్షించుకోవడమే అసలైన సౌందర్య సాధన. వయసు పెరిగేకొద్ది.. ఒంటిమీద శ్రద్ధ తగ్గి.. శరీర ఆకృతి మారిపోతుంటుంది. బరువు పెరిగి పొట్ట, నడుము చుట్టుకొలతలు మారిపోవడం.. చర్మం పటుత్వాన్ని కోల్పోవడం.. వాటికి తోడు పని ఒత్తిడి, తీవ్ర అలసటతో మొహంలో కాంతి తగ్గడం.. ఇలా పలు కారణాలతో ఉన్న ఆకృతిని పోగొట్టుకుంటుంటారు చాలామంది. అలాంటి వారికి అసలైన థెరపీని అందిస్తుంది ఈ వుడ్ రోలర్. మనిషిని స్లిమ్‌గా మార్చేస్తుంది. ముడతలు తొలగించి యవ్వనాన్ని తిరిగి ఇస్తుంది. ఈ టూల్‌ని వినియోగించడం చాలా సులభం. ఇది చాలా వేగంగా కండరాల నొప్పిని తగ్గించి.. టెన్షన్‌ను మాయం చేసి.. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తప్రసరణను పెంచుతుంది. కొవ్వు తగ్గించి.. శరీరాన్ని ఫిట్‌గా మారుస్తుంది. చపాతీ కర్ర అంత స్టిఫ్‌గా ఉండదు! ఈ మల్టీఫంక్షనల్ రోలర్.. సహజమైన చెక్కతో తయారైంది. ఈ టూల్‌ని చపాతీ కర్ర పట్టుకున్నట్లుగా పట్టుకుని.. శరీరంలో ఏ భాగం తగ్గాలో, ఏ భాగంలో ఇబ్బంది ఉందో అక్కడ నొక్కుతూ అటు ఇటు జరుపుతూ ఉండాలి. అయితే ఇది చపాతీ కర్ర అంత స్టిఫ్‌గా ఉండదు. టూల్ మొత్తం గుండ్రటి చిన్నచిన్న చెక్క రింగ్స్ పేర్చినట్లుంటుంది. నాన్ స్లిప్ అండ్ ఎక్స్టెండెడ్ హ్యాండిల్ చక్కటి గ్రిప్‌ని కలిగి ఉంటుంది. మెడ, పొట్ట, నడుము, తొడలు, కాళ్లు ఇలా వేటినైనా సులభంగా మసాజ్ చేసుకోవచ్చు. అయితే చేతుల లావు తగ్గాలన్నా.. ముడతలు పోవాలన్నా మరొకరి సాయం తీసుకోవాలి. ఎవరికి వారు చేతులపై ఈ వుడ్ థెరపీని చేసుకోవడం కష్టమే. దీని ధర సుమారు 21 డాలర్లు. అంటే 1,672 రూపాయలు. చదవండి: Beauty Tips: బీట్రూట్ అలోవెరా జెల్‌తో ముఖం మీది మచ్చలు మాయం! అయితే.. Health Tips: పిల్లలు, వృద్ధులు ఖర్జూరాలు తరచుగా తింటే! -
దర్జాగా పడుకోండి.. ఫోన్ చూస్తూ, పేపర్ చదువుతూ బరువు తగ్గండి! ఎలాగంటారా?
‘ఏ కష్టం లేకుండా వచ్చిపడిన ఊబకాయాన్ని తగ్గించాలంటే మాత్రం కచ్చితంగా కష్టపడాలి’ అనేది ఒకప్పటి మాట. ఎంత సులభంగా పెరిగారో అంతే సౌఖ్యంగా తగ్గొచ్చంటోంది ఇప్పటి టెక్నాలజీ. సౌఖ్యమంటే అట్టాంటి ఇట్టాంటి సౌఖ్యం కాదు. దర్జాగా పడుకుని, ఫోన్ లేదా పేపర్ చూస్తూ హ్యాపీగా బరువు తగ్గొచ్చన్న మాట. ఈ స్టీమింగ్ బాడీ బ్లాంకెట్.. ఫార్ ఇన్ఫ్రారెడ్ డిజిటల్ హీట్ థెరపీతో బాడీలోని కొవ్వుని ఇట్టే కరిగించేస్తుంది. అదనంగా శరీరానికి సరికొత్త నిగారింపునూ అందిస్తుంది. దీన్ని ఒకవైపు నుంచి ఓపెన్ చేసి, చిత్రంలో ఉన్న విధంగా ఉపయోగించాలి. చేతులు బయటికి తీసుకునేందుకు ఇరువైపులా రెండు జిప్పులు ఉంటాయి. చదవండి: వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులు... ముప్ఫై నిమిషాలు ఈ బ్లాంకెట్‌లో రెస్ట్ తీసుకుంటే.. ఒక గంట స్విమ్మింగ్‌కు, ఒక గంట రన్నింగ్‌కు.. ఒక గంట సైకిల్ రైడ్‌కు.. వంద సిటప్స్కు.. లేదా 30 నిమిషాల యోగాకు సమానమట. ఈ బ్లాంకెట్ ఇన్ఫ్రారెడ్ లేయర్, వాటర్ ప్రూఫ్ లేయర్, షీల్డ్ లేయర్, థర్మల్ లేయర్, టెంపరేచర్ కంట్రోల్ లేయర్, హీట్ లేయర్, ఇన్సులేషన్ లేయర్ వంటి 7 సమర్థవంతమైన లేయర్స్‌తో రూపొందింది. దీన్ని వినియోగించే సమయంలో.. ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుందని గుర్తించిన వెంటనే.. ఒక నిమిషం పాటు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఈ థెరపీని క్రమం తప్పకుండా తీసుకుంటే.. కొవ్వు తగ్గి.. చర్మకణాలు పునరుత్తేజం చెంది, రోగనిరోధక శక్తి, జీవక్రియ మెరుగుపడతాయి. అలసట తగ్గుతుంది. చిత్రంలోని బ్లాంకెట్‌తో పాటు ఇంటెలిజెంట్ కంట్రోల్ బాక్స్, ఒక రిమోట్ లభిస్తాయి. బాక్స్ మీద టైమ్ డిస్ప్లే, స్టార్ట్ బటన్, టెంపరేచర్ కంట్రోల్, టెంపరేచర్ డిస్ప్లే, సేఫ్టీ స్విచ్.. ఇలా సెట్టింగ్స్ ఉంటాయి. ఈ డివైజ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇదొక హోమ్ స్పా లాంటిది. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు.. తీరిక దొరికినప్పుడు ఆన్ చేసుకుని ఓ వైపు సేదతీరుతూనే ఇంకో వైపు కొవ్వు కరిగించుకోవచ్చు. అందంతో పాటు ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు. -
ఆలూ తింటే వెయిట్ పెరుగుతామా?
-
అప్పుడు నన్ను నేను చాలా అసహ్యించుకున్నా: హీరోయిన్
I hated myself so much Says Heroine Avika Gor: చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి అవికా గోర్. సీరియల్లో తన ముద్దు ముద్దు మాటలు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. ఇక డబ్బింగ్ సీరియల్‌తో తెలుగువారికి సైతం ఎంతో దగ్గరైంది. అయితే ఈ సీరియల్ చేస్తున్నప్పుడు మాత్రం తాను సంతోషంగా లేనని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అవికా ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'సీరియల్ చేస్తున్న సమయానికి నేనంత ఫిట్‌గా లేను. దీంతో నన్ను నేను చాలా అసహ్యించుకున్నాను. స్క్రీన్‌పై ఎలా కనిపిస్తున్నానే విషయాన్ని కూడా పట్టించుకునేదాన్ని కాదు. అసలు అద్దంలో నా ముఖాన్ని చూసుకునేందుకు కూడా ఇష్టపడేదాన్ని కాదు. కానీ నేను ఎలా కనిపిస్తున్నాననే దానికంటే కూడా నా నటనకే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఆ విషయంలో వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని పేర్కొంది. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ భామ ప్రస్తుతం కల్యాణ్ దేవ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది. -
బెల్లీ ఫ్యాట్‌కు ఇలా చెక్ పెట్టండి..
అమ్మాయిలను ఎక్కువగా బాధించే విషయం బరువు, బెల్లీ ఫ్యాట్ (పొట్ట చూట్టు కొవ్వు పేరుకుపోవడం). దీంతో అధిక బరువుతో పాటు పొట్టను తగ్గించుకోవడానికి అమ్మాయిలు జిమ్‌లో గంటలు గంటలు కుస్తీ పడుతుంటారు. అయినప్పటికీ మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల పొట్ట చూట్టూ మళ్లీ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు కసరత్తులు చేయడం లేదా స్ట్రిక్ట్ డైట్‌తో నోరు కట్టేసుకుంటుంటారు అమ్మాయిలు. అయితే అలా చేయడం కూడా ఆరోగ్యానికి హానికరమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జీవక్రియ, శరీరంలోని సమతుల్యతతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చిరిస్తున్నారు. అందుకని వర్కవుట్స్ చేయకుండానే మనకు వంటింట్లో అందుబాటులో ఉన్న సుగంధ ద్రవ్యాలతో మీ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇవి కొవ్వును తగ్గించమే కాకుండా జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాదు శరీరంలో ఇన్సులిన్‌ను సమతుల్యం చేసి ఆరోగ్యంగా ఉంచడంతో పాటు పొట్ట చూట్టూ పేరుకున్న చెడు కొవ్వును కరిగిస్తాయి. ఇక అవేంటో చుద్దాం రండి . (పదే పదే శానిటైజర్ వాడుతున్నారా?) మిరియాలు: ఇది శరీరంలో థర్మోజెనిక్ ప్రభావాలను పెంచుతుందని పరిశోధనలో తెలినట్లు ప్రముఖ పోషకాహార నిపుణులు సుమయ డాల్మియా తెలిపాడు. అంటే ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచడంతో పాటు కొవ్వును కూడా కరిగించడంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేగాక జీవక్రియ రేటును కూడా వేగవంతం చేస్తుంది. మీ ఆహారంలో మిరియాలతో పాటు నిమ్మకాయను కూడా చేర్చండి. ఎందుకంటే నిమ్మకాయలోని సిట్రస్ మీ సిస్టమ్‌ను ఆల్కలీన్గా చేస్తుంది. శరీరంపై కారపు థర్మోజెనిక్ ప్రభావాలను సమతుల్యం చేస్తుంది. సోంపు గింజలు: ఇవి జీర్ణక్రియకు సహాయపడతంతో పాటు ఉబ్బుసం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్క: ఇది మీ ఇన్సులిన్, చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల పేరుకుపోయిన కొవ్వును విచ్చిన్నం చేస్తుంది. ఇంగువ: ఇది శరీరంలో అపానవాయువును తగ్గిస్తుంది. అపానవాయువును సృష్టించే ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీనిని తరచూ మీ ఆహారపు అలవాట్లలో దీనిని చేర్చుకోండని నిపుణులు సూచిస్తున్నారు. . ఆవ పిండి(గింజలు): ఇవి మీ ఆహారానికి సుగంధాన్ని ఇవ్వడమే కాకుండా కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. మెంతులు: ఇది ఆకలిని నియంత్రిస్తుంది. జంక్ ఫుండ్ తినాలన్న మీ ఆహార కోరికలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే మీ ఆహారంలో మెంతులను జోడించండి. పసుపు: ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో సహయపడుతుంది. కొవ్వును కరిగించడంలో సహయపడే హార్మోన్ లెప్టిన్‌ను మరింత విడుదల చేయడానికి జీవక్రియ ప్రక్రియలో అనుమతిస్తుంది. యాలకులు: ఇది ఉబ్బరం, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేసే మెలటోనిన్‌ను కూడా ప్రాసెస్ చేస్తుంది. యాలకులు శరీరంలో పేరుకుపోయిన చెడును కొవ్వును మూత్రవిసర్జన ద్వారా బయటకు పంపిస్తుంది. -
వయసు 20.. బరువు 80..
యువత అంటే ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు.. అనే నిర్వచనం క్రమంగా మారుతోంది. వారిని అధిక బరువు సమస్య వేధిస్తోంది. ప్రధానంగాకళాశాలలకు వెళ్లే వయసులో చాలామందిఊబకాయంతో బాధపడుతున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టడం తప్ప ఆటలకు దూరంగా ఉంటున్నారు. చిన్న వయసులోనే ఇది అధిక బరువు సమస్యకు దారి తీస్తోంది. నగర యువతలో దాదాపు 30 శాతం మంది ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా యువతుల్లో ఈ సమస్య ఎక్కువ ఉందని చెబుతున్నారు. 16 నుంచిపాతికేళ్ల వయసున్న వారిలో గరిష్ట బరువు కంటే 8– 15 కిలోలు అధికంగా ఉన్నట్లు స్పష్టంచేస్తున్నారు. 20 సంవత్సరాలకే 80 కిలోలు ఉండటంతో పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అధిక కేలరీల ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం ఇతరేతర కారణాలతో స్థూలకాయం వస్తుందంటున్నారు. నగరంలోని యువతలో పెరుగుతున్న స్థూలకాయం, కారణాలు, పరిష్కారం తదితర అంశాలపై ‘సాక్షి’ కథనం. శారీరక శ్రమ లేక.. చాలామంది యువతీ యువకుల్లో శారీరక శ్రమ ఉండటం లేదు. స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక.. ఆటలకు దూరమవుతున్నారు. చాలా పాఠశాలలు, కళాశాలల్లో ఆటలకు ప్రాధాన్యం తగ్గుతోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. చదువుతోపాటు ఆటల వైపు పిల్లలను ప్రోత్సహించాలి. ఫలితంగా వారికి శారీరక శ్రమ అలవాటు అవుతుంది. యువతీ, యువకులు చదువుతోపాటు శారీరక శ్రమపై దృష్టి పెట్టాలి. నిత్యం గంటపాటు వ్యాయామం చేయాలి. చెమట వచ్చేలా ఏదైనా పని చేయవచ్చు. క్రికెట్, ఫుడ్‌బాల్, తాడాట, ఈత, తోట పని, వేగవంతమైన నడక ఇలా ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి. మితమే హితం.. ఆహారం విషయంలో మితం పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తక్కువగా తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు నిత్యం 500 గ్రాములకు తక్కువ కాకుండా చూసుకోవాలి. ఉదయం అల్పాహారం ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో ఆకు కూరలు, కాయగూరలు, గుడ్డు, చేపలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి పూట 8 గంటలలోపు భోజనం ముగించాలి. సమతుల ఆహారానికి ప్రాధాన్యమిస్తూ.. జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. ఒకేచోట అతుక్కుపోతూ.. చాలామంది కూర్చున్న చోటు నుంచి కదలటానికి ఇష్టపడరు. కంప్యూటర్, సెల్‌ఫోన్, టీవీలకు గంటల తరబడి అతుక్కుపోతుంటారు. అక్కడే భోజనం కానిస్తుంటారు. చాలామంది ఇంట్లో పనులకు దూరంగా ఉంటున్నారు. ఇళ్లు ఊడవటం.. దుస్తులు ఉతకటం.. గార్డెనింగ్ లాంటి పనులను పని మనుషులకు అప్పగిస్తున్నారు. చిన్నచిన్న పనులు పిల్లలకు అప్పగించక పోవడం వల్ల వారిలో సోమరితనాన్ని పెంచి పోషించినట్లు అవుతోంది. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్న చాలా ఇళ్లలో పిల్లల తిండిపై శ్రద్ధ ఉండటం లేదు. అమ్మానాన్నలతోపాటు పిల్లలకు బయట తిండే అలవాటవుతోంది. మసాలాలు, నూనెలతో కూడిన ఆహారం వల్ల తెలియకుండానే వారిలో అధిక బరువుకు దారి తీస్తోంది. రోడ్‌సైడ్ ఫుడ్‌తో.. రోడ్‌సైడ్ ఆహారంలో ఎక్కువ శాతం మసాలాలు, నూనెలు వాడుతుంటారు. తరచూ ఇదే ఆహారం తీసుకోవడంతో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఒకసారి బరువు పెరిగితే తగ్గించుకోవాలంటే కష్టం. స్థూలకాయం ఎన్నో రకాల శారీరక, మానసిక రుగ్మతలకు హేతువుగా గుర్తించాల్సిన అవసరముంది. వ్యక్తిగతంగా, కేరీర్ పరంగానూ ఇబ్బందే. యువతకు ఈ సమస్య మరింత నష్టం కలిగిస్తోంది. ఎలాంటి ఆహారం తింటున్నామో.. ఎంత తింటున్నామో.. అనే విషయంపై నిత్యం అవగాహనతో ఉండాలి. యుక్త వయసులోనే అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలకు అధిక బరువు ప్రధాన కారణం. కొందరిలో ఇది తీవ్రమైన కుంగుబాటుకు దారి తీస్తుందని గుర్తించాలి. ఈ విషయంలో యువతీయువకులు తగినంత జాగ్రత్త వహించాలి. -
మేనత్త పోలిక చిక్కింది
మేనమామ పోలిక అదృష్టం. మరి మేనత్త పోలిక? మహాభాగ్యం. బంధుత్వాలు బలంగా ఉండాలనే పెద్దలు ఇలా సెలవిచ్చారు.కాని పిల్లలకు అలా అర్థం కాకపోవచ్చు. ఆ మెలకువను చెప్పే కథనం ఇది. మీ ఫ్యామిలీకి ఉపయోగపడే మేలుకొలుపు. గోరుచిక్కుళ్లు, మునక్కాడలు, పొట్లకాయలు మాత్రమే ప్రకృతికి సమ్మతం కాదు. సొరకాయలు, గుమ్మడికాయలు, దోసకాయలు కూడా ఉంటాయి. లలితంగా కోమలంగా ఉండే సన్నజాజులు, విరజాజులు మాత్రమే ప్రకృతి పూయదు. కలువలు, తామరలు, పొద్దు తిరుగుడు పూలు కూడా ఉంటాయి. ఉన్నదంతా ప్రకృతికి అపురూపమే. ఉన్నదే అందం. వచ్చిందే ఆనందం. ...... అమ్మాయికి పదహారేళ్లు. తక్కువ బరువు ఉంది. ఉండాల్సినంత బరువు లేదు. బలహీనంగా ఉంది. తిండి తినడం లేదు. ముద్ద పట్టడం లేదు. ఎటో చూస్తోంది. ఏమిటోగా ఉంటోంది. తల్లిదండ్రులకు ఏమీ అర్థం కాక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొచ్చారు. ‘ఏమిటి సమస్య?’ సైకియాట్రిస్ట్ అడిగింది. ‘అసలు అన్నం తినడం లేదు డాక్టర్’ అంది తల్లి. ‘సరే మీరు బయట కూర్చోండి’ అని తల్లిదండ్రులను బయటకు పంపించింది. తర్వాత అమ్మాయి వైపు చూసింది. చక్కటి ముఖం. అందమైన కళ్లు. చాలా చక్కటి నాసిక. చెంపలు. పెదాలు. కాని ఆ ముఖంలో వెలుతురు లేదు. ఆ వయసులో ఉండాల్సిన తేజస్సు లేదు. ఆనందం కనిపించడం లేదు. ‘ఏమ్మా... ఏమైనా ప్రేమలో పడ్డావా’ అడిగింది సైకియాట్రిస్ట్. తల అడ్డంగా ఊపింది. ‘మార్కులు తీసుకు రమ్మని... రాత్రికి రాత్రి సుందర్ పిచయ్ అయిపోవాలని వేధిస్తున్నారా?’ ‘లేదు’ అని అంది ఆ అమ్మాయి. ‘ప్రేమించకపోతే యాసిడ్ పోస్తామని ఎవరైనా బెదిరిస్తున్నారా?’ ‘ఊహూ’ ‘మరి?’ ‘నేను మా మేనత్తలా ఉంటానట’ ‘ఉంటే?’ ‘అలా ఉండటం నాకిష్టం లేదు’ ‘ఏం?’ ‘అలా ఉంటే నేను చచ్చిపోతాను’... ‘అవును.. నేను మా మేనత్తలా ఉంటే చచ్చిపోతాను... చచ్చిపోతాను’ ఆ అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది. ..... నాగసుందరి ఆ అమ్మాయి పేరు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. దానికి ముందు టెన్త్, ఆ ముందు నైన్త్ చాలా హుషారుగా చదవాలనుకుంది. కాని కొంచెం బొద్దుగా తయారవడం మొదలెట్టింది. కొంచెం లావుగా తయారవడం మొదలెట్టింది. రెండేళ్లలో పది కిలోల బరువు పెరిగింది. బట్ట కొంటే ఎక్కువ కొనాల్సి వచ్చేది. రెడీమేడ్ కొనాలంటే చాలాసేపు వెతకాల్సొచ్చేది. కొత్త చెప్పులు తొందరగా అణిగిపోయేవి. తండ్రి స్కూటర్ మీద ఎక్కించుకునేటప్పుడు ఆ స్కూటర్ కుయ్యోమని మూలిగినట్టుగా ఆ అమ్మాయికి అనిపించేది. వారూ వీరూ ఇంటికి పోచుకోలు కబుర్లు చెప్పడానికి వచ్చినప్పుడు ‘అమ్మాయి.. బొద్దుగా తయారవుతోందండీ... ఈ వయసులోనే కంట్రోల్ చేయాలి... లేకుంటే తర్వాత చాలా కష్టమవుతుంది’ అనేవారు. ‘అది తన తప్పు కాదండీ. మేనత్త పోలిక. ఆమె కూడా ఇలా బొద్దుగా ఉండేది కదా. జీన్సు. ఎక్కడికి పోతాయి’ అనేది. స్కూల్లో పిల్లలు ఏడిపించేవారు. బోండాం బోండాం అనేవారు. క్లాస్ టీచర్ స్నాక్స్ టైమ్‌లో రెండు ప్లేట్లు పెట్టేది. అవన్నీ నాగసుందరి సరదాగానే తీసుకునేది. కాని ఇంటికి వచ్చినప్పుడు అమ్మ వాళ్లతో వీళ్లతో మాట్లాడేటప్పుడు ‘మా అమ్మాయిది మేనత్త పోలిక’ అన్నప్పుడు మాత్రం వణుకు వచ్చేది. ...... ‘కొంచెం లావుగా ఉన్నావని, మేనత్తలా ఉన్నావని ఎవరైనా అంటే భయపడతావా? దిగులు పడతావా? ఇందులో భయపడటానికి ఏముంది?’ అంది సైకియాట్రిస్ట్. ‘అది కాదు డాక్టర్’ అని ఆ అమ్మాయి తల వొంచుకుంది. ‘పర్లేదు చెప్పు’ ‘మా మేనత్తకు లావు తగ్గలేదు. ఎన్నేళ్లున్నా పెళ్లి కాలేదు. ఒక రోజు ఆమె నాకీ లావు ఇష్టం లేదు అని చచ్చిపోయింది’ సైకియాట్రిస్ట్ ఒక్క క్షణం ఆ తీవ్రతను గ్రహించింది. ‘నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. నేను పెద్దయ్యి వాళ్లను బాగా చూసుకోవాలి. లావుగా ఉంటూ పెళ్లి అవకుండా వాళ్లను దిగులుతో చంపకూడదు. నేను చచ్చిపోకూడదు’ అంది వెచ్చటి కన్నీళ్లతో. సైకియాట్రిస్ట్ ఆ అమ్మాయినే చూస్తూ కూచుంది. ..... నాగసుందరిని అనేక పరీక్షలు చేసిన మీదట ఆ అమ్మాయి పరిస్థితి సున్నితంగా ఉందని సైకియాట్రిస్ట్‌కు అర్థమైంది. అస్సలు అన్నం తినడం లేదు. తినడానికి రోజుల తరబడి సంశయిస్తోంది. ఆ లంకణాలను భరించలేక ఒక్కోసారి విపరీతంగా తినేస్తోంది. ఉండాల్సిన బరువు కన్నా తగ్గినా అద్దం ముందు నిలుచుంటే ఆ అమ్మాయికి తనను తాను చాలా లావుగా కనిపిస్తోంది. అంటే ఇంకా సన్నబడాలని తీవ్రంగా తిండిని కంట్రోల్ చేస్తోంది. ఇది ‘అనెరెక్సియా నెర్వోజా’ అనే డిజార్డర్. ఇది ఒక మోస్త్తరు వరకూ ఉంటే హాని ఉండదు. శ్రుతి మించితే ప్రాణాలకు కూడా ప్రమాదం. .... సైకియాట్రిస్ట్ తల్లిదండ్రులను కూచోబెట్టింది.‘చూడండి. పిల్లల మనసులో ఏముందో వారికి ఎటువంటి భయాలు ఏర్పడుతున్నాయో మనం ఎటువంటి భయాలు కల్పిస్తున్నామో సొసైటీ వాళ్లను ఎంత అపోహలో నెడుతోందో ఎప్పటికప్పుడు మనం పట్టించుకోవాలి. బిజీలో ఇవాళ్టి తల్లిదండ్రులు ఏమీ గమనించక తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకోవాలని చూస్తున్నారు. మీ అమ్మాయికి మేనత్త పోలిక వచ్చింది. వస్తే తప్పేంటి? లావుగా ఉండటంలో ఏ తప్పూ లేదు. అది మరీ అవసరానికి మించిన లావు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుని అదుపు చేసుకుంటే సరిపోతుందని చెప్పాలి. లావుగా ఉండటం పాపం సన్నగా ఉండటం వరం అని నూరిపోస్తున్నాం. మన క్యాలెండర్లలో బక్క చిక్కిన లక్ష్మీదేవిని ఎప్పుడైనా చూశామా? ఆరోగ్యకరమైన దేహమే ఐశ్వర్యం. ప్రకృతి ఇచ్చిన శరీరం ఆరోగ్యంగా ఉంటే లావైనా సన్నమైనా తెలుపైనా నలుపైనా ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పాలి. ఆ అమ్మాయి మేనత్తలో ఆత్మవిశ్వాసం నింపి ఉంటే ఆమెను ఏదో ఒక ఉద్యోగంలో వ్యాపకంలో పెట్టి ఉంటే ఎవరో ఒకరు ఇష్టపడేవారు దొరికి ఉండేవారు. లేదా ఆమె ఆ వ్యాపకాల్లో సంతృప్తి పడేది. శరీరం పరమావధి పెళ్లి మాత్రమే అనీ ఆ పెళ్లికి శరీరం సుందరంగా ఉండాలని నూరిపోస్తున్నాం. మామిడి చెట్లే ఉండాలి ద్రాక్ష గుత్తులే కాయాలి అనుకుంటే వేప చెట్టు ఉండేది కాదు. దాని చేదు కూడా కలిస్తేనే తీపి చేదు సమానమై సృష్టి సమతూకంతో ఉంటుంది. అన్ని విధాల రూపాలు, దేహాలు, రంగులు ఇవన్నీ ప్రకృతి తన కోసం అల్లుకున్న నేత. దానిని అర్థం చేయించాలి మన పిల్లలకు. ఆ అమ్మాయి మేనత్తలో కూడా ఏవో పాజిటివ్ విషయాలు ఉండే ఉంటాయి. వాటిని చెప్పండి మీ అమ్మాయికి. తనలోని పాజిటివ్ విషయాలు అర్థం చేయించండి. మీ అమ్మాయి టెన్త్‌లో టాపర్. బుద్ధి కూడా గొప్ప సౌందర్యం అని చెప్పండి’ అంది సైకియాట్రిస్ట్. ఆ తర్వాత సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, న్యూట్రీషనిస్ట్లు కలిసి ఒక టీమ్‌లా మారి నాగసుందరిని ట్రీట్ చేశారు.నాగసుందరి ఇప్పుడు నాగసుందరిలా ఉంది. బాగా చదువుకుంటోంది. సన్నగా ఉందా లావుగా ఉందా అని లోకం చూడవచ్చు. కాని అద్దం ముందు నిలుచున్న ప్రతిసారీ ఇది నేను... నేను నాకు చాలా ఇష్టం అనుకుని బుగ్గ మీద ఒక చిట్టి ముద్దు పెట్టుకుంటోంది.తనను తాను స్వీకరించడమే కదా అసలైన విజయం. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ -
'లావుగా ఉంటే ఆ భయం అవసరం లేదు'
సాధారణంగా యోగా అనగానే మనకు గుర్తొచ్చేది.. నాజుకైన అమ్మాయిలు. ఉదాహరణగా చెప్పాలంటే ఏ బిపాసా బసునో.. శిల్పాశెట్టినో మరింకెవరైనా సన్నగా ఉండే ముద్దుగుమ్మలే ఈ యోగా చేయగలరని ఆలోచన వస్తుంది. లావుగా ఉన్నవాళ్లు అంత ఆరోగ్యంగా ఉండరని.. యోగా చేయడానికి వారి దేహాలు సహకరించవనే అపోహలు ఉన్నాయి. అయితే, ఇక ఈ ఆలోచనలకు స్వస్తి చెప్పాల్సిందే. ఎందుకంటే జెస్సీ మిన్ అనే ఓ ఆఫ్రికా జాతికి చెందిన యువతి ఆ ఆలోచనలు ఉత్త అపోహలే అని స్పష్టం చేసింది. భారీ దేహం ఉన్నప్పటికీ స్లిమ్ పర్సనాలిటీ ఉన్నవాల్లకంటే కూడా గొప్పగా యోగాసనాలు వేస్తోంది. అంతేకాదు తన యోగాసనాలను ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ఇన్ స్టాగ్రమ్లో పంచుకుంది. ఈ ఫొటోలతో ఫిట్ నెస్ అనేది శరీరంతో ముడిపెట్టి చూసే అంశం కాదని ఆమె స్పష్టం చేసింది. 'యోగా నేర్చుకున్న తర్వాత అనవసరంగా నేను నా శరీరాకృతిని గురించి ఇన్నాళ్లు భయపడ్డానని తెలిసింది. చాలామంది కూడా నాలాగే ఎన్నో భ్రమల్లో ఉంటారు. కానీ, యోగాతో అవన్నీ పోతాయి. ఇది నా విషయంలో రుజువు అయింది' అని జెస్సీ చెప్పింది. 24 ఏళ్ల వయసున్న జెస్సీ తన మిత్రురాలి ద్వారా బిక్రం యోగా స్టూడియోకి వెళ్లి యోగా నేర్చుకుంది.