నేను డెలివరీ అయ్యి రెండు వారాలు. మా ఫ్రెండ్స్ కొందరికీ డెలివరీ తర్వాత పొట్ట వదులుగా తయారైంది. నాకు అలా అవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– సీహెచ్. శ్రావణి, విజయనగరం
ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల పొట్టలోని కండరాలు ముఖ్యంగా రెక్టస్ మజిల్, కనెక్టివ్ టిష్యూ మృదువుగా మారుతాయి. పెరిగే గర్భసంచిని, బిడ్డను అకామడేట్ చేయడానికి స్ట్రెచ్ అవుతాయి. కానీ ప్రసవం తరువాత ఆ కండరాలను శక్తిమంతం చేసే వ్యాయామాలు చేయకపోతే పొట్ట కండరాలు బలహీనపడతాయి. దానివల్ల వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోషన్‌కి వెళ్తున్నప్పుడు సమస్యలు, కీళ్ల నొప్పులు వస్తాయి. స్మాల్ రెక్టస్ సపరేషన్ చాలావరకు 6–8 వారాల్లో మజిల్ స్ట్రెచింగ్‌తో కవర్ అవుతుంది. ఈ స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్‌ని ప్రసవం అయిన రెండు నుంచి నాలుగు వారాల్లో నెమ్మదిగా మొదలుపెట్టాలి. ఈ ఎక్సర్‌సైజెస్ కోసం ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదిస్తే మంచిది. ఈ వ్యాయామాలు చేసేటప్పుడు నొప్పి, అసౌకర్యం ఉంటే గనుక అసలు చేయకూడదు. ఇప్పుడు చాలా క్లినిక్స్‌లో పోస్ట్‌నాటల్ అబ్డామినల్ ఎక్సర్‌సైజెస్ అని స్పెషల్ కేర్ ఎక్సర్‌సైజెస్‌ని నేర్పిస్తున్నారు.
మీ శరీర తత్వం, మీది ఏరకమైన ప్రసవం.. అనే అంశాలను బట్టి మీ గైనకాలజిస్ట్, ఫిజియోథెరపీ టీమ్ కలసి మీకు తగిన వ్యాయామాలను సూచిస్తారు. ఈ ఎక్సర్‌సైజెస్ చేసేటప్పుడు అబ్డామినల్ బైండర్ లేదా టమ్మీ సపోర్ట్ బెల్ట్‌ను పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మీ శరీరం మునుపటిలా ఫిట్‌గా మారడానికి టైమ్ పడుతుంది. ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట కండరాలు నెలల పాటు స్ట్రెచ్ అయి ఉంటాయి. కాబట్టి అవి మళ్లీ మునుపటిలా టైట్ అవడానికి అంతే టైమ్ పట్టొచ్చు. త్వరగా పూర్వపు స్థితికి రావాలని హడావిడిగా అన్ని ఎక్సర్‌సైజెస్ చేస్తే వెన్ను నొప్పి ఎక్కువవొచ్చు. సిజేరియన్ అయిన వారు ఇంకొంచెం ఎక్కువ టైమ్ తీసుకుని శరీరం, మనసు సిద్ధమైన తర్వాతే ఎక్సర్‌సైజెస్ మొదలుపెట్టాలి. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్ అనేవి అందరికీ చాలా మంచివి.
ప్రసవమైన రెండు వారాలకు వీటిని స్టార్ట్ చేయొచ్చు. ఆఫ్‌లైనే కాదు ఆన్‌లైన్ ద్వారా కూడా వీటిని నేర్పిస్తారు. ఈ వ్యాయామాల వల్ల యూరినరీ మజిల్స్ టైట్ అవుతాయి. ప్రసవం తరువాత తలెత్తే యూరిన్ లీకేజ్, అర్జెన్సీ వంటి సమస్యలు తగ్గుతాయి. కవలలను.. అధిక బరువు బిడ్డను మోసినప్పుడు స్ట్రెచ్ ఎక్కువ అవుతుంది. అలాంటివారు ఎక్కువ టైమ్ తీసుకుని డాక్టర్ పర్యవేక్షణలో స్ట్రెంతెనింగ్ ఎక్సర్‌సైజెస్ చేయాలి. ప్రెగ్నెన్సీ లేదా డెలివరీ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే పూర్తిగా కోలుకునే వరకు ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయొద్దని డాక్టర్ చెప్తారు. అది ఫాలో కావాలి. సరైన గైడెన్స్ అవసరం ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రసవం తరువాత ఏడాది వరకు బిడ్డకు చనుబాలు అవసరం కాబట్టి క్రాష్ డైట్ అసలు చేయకూడదు. కూర్చుని చేసే తేలికపాటి యోగాసనాలు, ధ్యానం వంటివి ప్రసవం తరువాత కాస్త ఎర్లీగానే మొదలుపెట్టవచ్చు.
మా కుటుంబంలో అందరికీ హై బీపీ ఉంది. బీపీ వల్ల మా అక్కకి 9వ నెల ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వచ్చాయి. నాకు ఇప్పుడు మూడవ నెల. మేము ఉండేది విలేజ్‌లో. ఏ కాంప్లికేషన్ రాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి.
– వాణీపద్మజ, బోథ్
ప్రెగ్నెన్సీ టైమ్‌లో బీపీ, సుగర్ విషయంలో ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. మీ వయసు, బరువును బట్టి బీపీ రిస్క్ ఎంత ఉంది అనేది కాలిక్యులేట్ చేయొచ్చు. మూడవ నెలలో అందరికీ చేసే Nఖీ స్కాన్‌లో ఇవన్నీ అసెస్ అవుతాయి. ఇలాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీలో మూడవ నెల నుంచి అటpజీటజీn మాత్రలను సజెస్ట్ చేస్తారు. ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీని జెస్టేషనల్ హైపర్‌టెన్షన్ లేదా ప్రీఎక్లమ్సియా అంటారు. వందలో 2–8 ప్రెగ్నెన్సీల్లో ఇది కనిపిస్తుంది. ఈ కేసెస్‌లో హై బీపీతోపాటు మూత్రంలో ప్రొటీన్స్ పోతుంటాయి. బిడ్డ ఎదుగుదల మీదా ప్రభావం పడుతుంది. ప్లెసెంటాలో జరిగే మార్పుల వల్ల బీపీ పెరిగి తల్లికి, బిడ్డకు ప్రమాదం సంభవిస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ లేదా అంతకుముందు బీపీ ఉన్నవారిలో రిస్క్ ఎక్కువ.
దీన్ని తగ్గించేందుకు బీపీని కంట్రోల్ చేసే మాత్రలతోపాటు ప్రివెంటివ్ కేర్ కింద అటpజీటజీn మాత్రలనూ వాడాలి. హై బీపీని గుర్తించకపోతే తలనొప్పి, బ్లర్డ్ విజన్, కడుపు నొప్పి, ముఖము, పాదాల్లో వాపు వస్తుంది. బిడ్డ ఎదుగుదల మందగించడం, లోపల బ్లీడింగ్ అవడం, బిడ్డ ప్రాణానికి ముప్పు ఏర్పడవచ్చు. అందుకే హై రిస్క్ కేసెస్‌ని ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏడవ నెల వరకు నెలకు రెండుసార్లు.. ఏడవ నెల తరువాత నుంచి వారానికి ఒకసారి చెకప్స్‌కి వెళ్లాలి. తగిన సమయంలో బ్లడ్, యూరిన్ టెస్ట్‌లు, స్కాన్స్ చేయించుకోవాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీలను చూసే ఆసుపత్రిలో రెగ్యులర్ యాంటీనాటల్ కేర్‌కి వెళ్లడం మంచిది. మీకు ఇప్పుడు మూడవ నెల కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి రిస్క్ అసెస్‌మెంట్ చేయించుకోండి. ఇందులో హై రిస్క్ వస్తే రెగ్యులర్ చెకప్స్ తప్పనిసరి. మూడవ నెల నుంచి 36 వారాల వరకు అటpజీటజీn మాత్రలను ఇస్తారు. ఈ మాత్రల వల్ల కొంచెం ఎసిడిటీ వస్తుంది.
అందుకే రాత్రి భోజనం తర్వాత ఈ మాత్రలను తీసుకోవాలి. ఒకవేళ వెజైనల్ బ్లీడింగ్ లేదా అల్సర్స్ ఉంటే మోతాదు మారుస్తారు. డైట్, జీవనశైలిని మారిస్తే బీపీ వచ్చే రిస్క్ తగ్గుతుంది. పౌష్టికాహారం, ఎక్సర్‌సైజెస్‌తో బరువు పెరగకుండా చూసుకోవాలి. విటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్స్‌ను తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఫోలిక్ యాసిడ్ మాత్రలను వాడాలి. ఈ జాగ్రత్తలతో పాటు ప్రెగ్నెన్సీలో మీకు ఎప్పుడైనా విపరీతమైన తలనొప్పి, బ్లర్డ్ విజన్, వాంతులు, ఛాతీ నొప్పి వంటివి వస్తే వెంటనే హై రిస్క్ యూనిట్‌ని సంప్రదించాలి. వెంటనే బీపీ మెడిసిన్‌ని స్టార్ట్ చేస్తారు. ఇలా ప్రివెంటివ్ మెడిసిన్, లైఫ్‌స్టయిల్ చేంజెస్, క్రమం తప్పని యాంటీనాటల్ చెకప్స్‌తో బీపీ వచ్చే చాన్సెస్‌ను తగ్గించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment