
ఇటీవల యువత స్మార్ట్‌గా, నాజుగ్గా ఉండటానికి ఇష్టపడుతోంది. అలా ఉండేందు కోసం వ్యాయామాల, కసరత్తులంటూ తెగ కష్టపడుతున్నారు. మరికొందరూ కఠినమైన డైట్‌ల పేరుతో నోరు కట్టేస్తుకుంటున్నారు. ఎలాగైన హీరోయిన్ మాదిరిగా స్లిమ్‌గా ఉండాలన్నదే అందరి ఆరాటం. ఏ మాత్రం కొద్దిగా బరువు పెరిగినా..ఏదో జరగకూడనిది జరిగినట్లుగా ఫీలవ్వుతున్నారు. అంతలా చిన్నా, పెద్దా..తమ బాడీపై శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే ఆ క్రమంలో ఫాలో అయ్యే డైట్‌లు ఒక్కోసారి బరువు తగ్గడం ఎలా ఉన్నా..పలు ఆరోగ్య సమస్యలు తెచ్చు పెడుతున్నాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇక్కడ అలానే ఒక మహిళ స్లిమ్‌గా ఉండాలని అనుసరించిన డైట్ ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టిందో చూస్తే షాకవ్వుతారు. అంతేకాదండోయ్ వైద్యులు మహిళలందర్నీ అలాంటి డైట్ ఫాలో కావద్దని హెచ్చరిస్తున్నారు కూడా. అదెంటో చూద్దామా..
శరీరంలో కొవ్వుని తగ్గించి శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచేందుకు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడంపై ఆధారపడతారు. ఆ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మాంసాహారాన్ని తీసుకుంటుంటారు. అంటే ఇక్కడ మాంసాహారంతో కూడిన డైట్‌కి ప్రాధాన్యత ఇస్తారు. దీంతో ఈ డైట్‌లో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, చిక్కుళ్లు, నెట్స్ మినహాయించి మాంసం, పౌల్ట్రీ, గుడ్లు, సముద్ర ఆహారం, చేపలు, పాల ఉత్పత్తులు, నీటిని మాత్రమే తీసుకుంటారు.
నిజానికి దీన్ని"జీరో కార్బ్" అని పిలుస్తారు. ఈ డైట్‌లో కార్బోహైడేట్స్ అనేవి ఉండవు. అయితే ఇది మహిళ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్ కరణ్ రాజన్ అందుకు సంబంధించిన వీడయోని షేర్ చేసి మరీ వివరించారు. ఇలా మాంసాహారంతో కూడిన డైట్ మహిళలకు పనికిరాదని చెప్పారు
మహిళలు మాంసాహారం ఎందుకు తీసుకోకూడదంటే..
డాక్టర్ కరణ్ షేర్‌చేసిన వీడియోలో ఒక మహిళ ఎనిమిది వారాలపాటు మాంసాహారమే తీసుకునే డైట్‌ని పాటించినట్లు వెల్లడించి. ఆమె ఆ వీడియోలో తాను ఎమనిది వారాల పాటు మాంసాహారమే తీసుకున్నట్లు చెబుతుంది. దీంతో ఆమె కొవ్వుని కోల్పోయి కొన్ని రకాల ఆరోగ్య సమస్యల బారినపడినట్లు చెబుతోంది. ముఖ్యంగా ఆమెకు పీరియడ్స్ ఆగిపోవడం జరిగిపోతుంది.
అంటే పీసీఓఎస్ సమస్యలు వచ్చాయి. మొటిమలు తీవ్రమయ్యాయి. మాంసాహారం అధికంగా తీసుకుంటే మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. ఎందుకంటే దీనిలో ఫైబర్ ఉండదు అది మొత్తం ప్రత్యుత్పత్తి వ్యవస్థనే తీవ్రంగా ప్రభావితం చేస్తుందట.
అదెలాగంటే..
మొక్కల ఆధారిత ఆహారం జీవక్రియను ప్రభావితం చేసి శరీరంలోని వేస్ట్‌ని బయటకు పంపేస్తుంది.చెప్పాంటే డంపింగ్ పనిని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ కాలేయం ఈస్ట్రోజెన్‌ను గట్‌లోకి పంపిస్తుంది. అయితే ఆహారంలో ఫైబర్ లేని కారణంగా దాన్ని బంధించి బయటకు పంపిచే అవకాశం లేకపోతుంది. దీంతో ప్రేగులే ఈస్ట్రోజన్‌ని తిరిగి గ్రహిస్తాయి.
దీంతో ఈ జీవక్రియ సమస్య కాస్త చర్మంపై దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అధిక ఈస్ట్రోజన్ చర్మ సమస్యలు, హర్మోన్ల అసమతుల్యతకు దారితీసి మొటిమలకు కారణమవుతుందని అన్నారు. అంతేగాదు దీనితోపాటు మూడ్ స్వింగ్స్, ఆందోళన, మెదడు పనిచేయకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు డాక్టర్ కరణ్.
అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్యం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి మాంసాహారం డైట్ సైడ్‌ఎఫెక్ట్స్ ఇవ్వకపోవచ్చు. కానీ చాలామటుకు ఇది సరిపడదని తేల్చి చెప్పారు. హర్మోన్ల అసమతుల్యతకు, గట్ ఆరోగ్యానికి ప్రతిబంధకాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ డైట్ మానవ శరీరాన్ని జడత్వంగా మార్చేస్తుందని, చురుకుదనం ఉండదని పలువురు వైద్యులు చెబుతున్నారు.
(చదవండి: పప్పు ధాన్యాలు తీసుకోకపోతే శరీరంలో సంభవించే మార్పులు ఇవే..!)
Comments
Please login to add a commentAdd a comment