సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కరోనా వారియర్స్‌కు, మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వైద్యులు, పోలీసులు, మహిళా కొనుగోలుదారుల కోసం కొత్త పథకాలను లాంచ్ చేసింది. ముఖ్యంగా డాక్లర్ల కోసం బై నౌ పే లేటర్ అనే పథకాన్ని అందుబాటులో వుంచింది. కరోనా వైరస్, లాక్‌డౌన్ సంక్షోభ సమయంలో తమ వినియోగదారులకు, ప్రధానంగా కరోనా వారియర్స్‌కు ఆర్థిక సౌలభ్యంగల ప్రత్యేకమైన ఫైనాన్సింగ్ పథకాలను తీసుకొచ్చామని సంస్థ (ఆటోమోటివ్ డివిజన్) సీఈవో వీజయ్ నక్రా ప్రకటించారు.
ఈ పథకం కింద వైద్యులకు ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం రద్దు. అలాగే 8 సంవత్సరాల రుణ కాలపరిమితిపై 90 రోజుల మారటోరియాన్ని కూడా వర్తింప చేయనుంది. దీంతోపాటు 100 శాతం ఆన్-రోడ్ ఫైనాన్సింగ్ వంటి ప్రత్యేక ఆఫర్లతో ఈ కొత్త పథకాన్ని ఎం అండ్ ఎండ్ మంగళవారం విడుదల చేసింది. లాక్‌డౌన్, ఫైనాన్సింగ్ లాంటి సమస్యల మధ్య సులువుగా వాహనాల కొనుగోలుకు ఈ ఆఫర్లు సహాయపడనున్నాయి. (పరిశ్రమలకు ఊరట, ఉద్యోగులకు షాక్)
పోలీసు సిబ్బందికి భారీ ఫైనాన్సింగ్ సదుపాయాన్ని అందివ్వనుంది. అలాగే మహిళా వినియోగదారులకు ఫైనాన్సింగ్ వ్యయంపై 10 బేసిస్ పాయింట్ తగ్గింపు వుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఎస్‌యువీ కొనుగోళ్లపై కూడా బై నౌ , పే లేటర్ ఆఫర్ వర్తించనుంది. ఇపుడే వాహనాన్ని సొంతం చేసుకొని, 2021 నుండి ఇఎంఐ ప్రారంభమయ్యే వెసులుబాటు కల్పించింది . మరో పథకం కింద, ఫైనాన్స్‌డ్ వాహనం కొనుగోలుపై లక్షకు ఇఎంఐ అతి తక్కువగా రూ .1,234 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది.. (కరోనా : లాక్‌డౌన్ సడలింపుల వేళ గుడ్ న్యూస్!)
Comments
Please login to add a commentAdd a comment