helath
-
‘సౌత్ ఇండియన్ డైట్ ప్లాన్'తో అంతలా బరువు తగ్గొచ్చా..!
వెయిట్ లాస్ జర్నీలకు సంబంధించి ఎన్నో స్టోరీలు చూశాం. వాళ్లంతా ఆయా ఫిట్నెస్ కోచ్‌ల సూచనల మేరకు రకరకాల డైట్లు ఫాలో అయ్యారు. కానీ ఈ వ్యక్తి మాత్రం మన సౌత్ ఇండియన్ డైట్‌తో అలా ఇలా కాదు ఏకంగా 35 కేజీల వరకు బరువు తగ్గి శెభాష్ అనిపించుకున్నారు. ఈ డైట్ వల్లే తన శరీరంలోని అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోగలిగారట. అంతలా బరువు తగ్గిపోయేలా చేసిన ఈ డైట్ ప్రత్యేకతలేంటీ? ఎలాంటి ఆహారాలు తీసుకుంటారు తదితరాల గురించి చూద్దామా..!.జితిన్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రాం వేదికగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేశారు. ఒక్కసారిగా ఈ పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆయన ఆ పోస్ట్‌లో సౌత్ ఇండియన్ డైట్ ప్లాన్‌తోనే బరువు తగ్గినట్లు చెప్పడమే కారణం. అది కూడా 105 కేజీల ఉన్న వ్యక్తి జస్ట్ ఈ డైట్‌తో ఏకంగా 70 కిలోల వరకు తగ్గడంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. జితిన్ తన పోస్ట్‌లో ఆ డైట్ ప్లాన్‌కి సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకునేవారో కూడా సవివరంగా వెల్లడించారు. డైట్ ప్లాన్:జిత్న దినచర్య ఉదయం 6.30తో గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లతో మొదలయ్యింది. బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు గుడ్లు, రెండు సాంబార్ ఇడ్లీలు లేదా మొలకెత్తిన పెసలు, ఒక దోసె తీసుకునేవాడు. మధ్యమధ్యలో అంతగా తినాలనిపిస్తే.. కప్పు మజ్జిగ, వేరుశెనగప్ప్పలు తినేవాడినని చెప్పారు జితిన్. ఇక భోజనంలో బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్. దానిలోకి పప్పు, కొబ్బరి వేసిన కూరగాయలు. వందగ్రాముల చికెన్ లేదా చేపలు తీసుకునేవానని అన్నారు. ఇక సాయంత్రం స్నాక్స్‌గా గ్రీన్ టీ, ఉడికించి గుడ్డులోని తెల్లసొన లేదా కాల్చిన చిక్పీస్(బఠానీలు) తినేవాడినని చెప్పుకొచ్చారు. ఇక డిన్నర్లో మిల్లెట్ దోస లేదా గోధుమ దోస, బచ్చలి కూర లేదా మునగ సూప్. అది కాకుంటే.. కాల్చిన చేప లేదా చికెన్ లేదా రాజ్మ కూర విత్ రోటీలతో పూర్తి చేసేవాడినని తెలిపారు. అలాగే నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చిన పసుపు పాలల్లో ఒక టేబుల్ స్పూన్ ప్రోటీన్ పౌడర్ కలిపి తీసుకునే వాడనని తన వెయిట్ లాస్ జర్నీ గురించి సవివరంగా ఇన్‌స్టాలో వెల్లడించారు.గుర్తించుకోవాల్సినవి:ఈ డైట్ ఫాలో అవుతున్నప్పుడూ డీప్ ఫ్రై లేదా హై క్యాలరీ ఫుడ్ ఐటెమ్స్‌ని ఏ మాత్రం దరిచేరనీయకూడదు. అలాగే కూరల్లో వంటనూనెని కూడా తగ్గించాలి. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటానికి, మంచి జీర్ణక్రియ కోసం ప్రతి పది నుంచి 15 నిమిషాలు నడవాలని చెప్పారు జితిన్. దీనివల్ల బరువు కూడా అదుపులో ఉంటుందన్నారు. (చదవండి: భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారం!) -
కండరాల నొప్పులూ... ఒంటి నొప్పులు!
ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఒళ్లు నొప్పులతో బాధపడటం సహజం. వైద్యపరిభాషలో ‘మయాల్జియా’అనిపిలిచే ఈ ఒళ్లు నొప్పులనేవి ఒక వ్యాధి కాదు... ఎన్నో రుగ్మతల్లో కనిపించేఒక లక్షణం మాత్రమే. నిజానికి అదికండరాల నొప్పి, మృదుకణజాలంలోనొప్పి, ఎముకల్లో నొప్పులు, నరం లాగడం... ఇలా అది ఏదైనా... అవన్నీ ఒళ్లు నొప్పుల రూపంలోనేబయటపడతాయి. అందువల్ల ఒళ్లునొప్పులు వచ్చినప్పుడు అందుకు కారణమేమిటో తెలుసుకుని దానికి తగిన చికిత్స అందించాలి.ఒళ్లు నొప్పులకు మామూలుగా అ΄ాయకరం కాని కారణాలు మొదలుకొని తీవ్రమైన అస్వస్థత వరకు కారణాలేమైనా కావచ్చు. ఉదాహరణకు... పరిమితికి మించి శ్రమపడ్డప్పుడు, ఒంట్లో క్యాల్షియమ్, మెగ్నీషియమ్ వంటి లవణాలూ, బి12, డి వంటి విటమిన్లు తగ్గినప్పుడు; ఏదైనా ప్రమాదంలో గాయపడ్డప్పుడు ఒళ్లు నొప్పులు రావడాన్ని సాధారణ కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇక అ΄ాయకరమైన కారణాల విషయానికి వస్తే ఆటో ఇమ్యూన్ వ్యాధులతో పాటు రాబ్డోమయోలైసిస్ వంటి జబ్బులతో బాధపడుతున్నప్పుడు, జీవక్రియల్లో లోపాలతో వచ్చే మెటబాలిక్ డిసీజ్‌లతో... ఇలా రకరకాల పరిస్థితుల్లో కండరాల నొప్పులు లేదా ఒళ్లునొప్పులు వస్తాయి. అలాంటి కొన్ని సందర్భాలివి...కొన్ని వ్యాధులు / ఆరోగ్య సమస్యల్లో... డెంగీ వంటి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో. జ్వరం తగ్గాక వచ్చే ఒళ్లునొప్పులు. (వీటిని పోస్ట్ వైరల్ మయాల్జియాస్ అంటారు) ట్రైకినోసిస్ వంటి పరాన్నజీవులు ఒంట్లోకి చేరడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్లో స్పాండిలోసిస్ వంటి కేసుల్లో నరం నొక్కుకుపోతున్నప్పుడు. కొన్ని మందులతో... కొన్ని టీకాలు తీసుకున్నప్పుడు. ఫైబ్రేట్స్ లేదా స్టానిన్స్, ఏసీఈ ఇన్హిబిటార్స్, హెచ్ఐవీ మందుల వంటివి కొన్ని వాడుతున్నప్పుడు.కొన్ని మందుల వాడకం ఆపినప్పుడు... 👉 కొన్ని రకాల మందులు ముఖ్యంగా కార్టికోస్టెరాయిడ్స్, ఓపియాయిడ్స్, బార్బిట్యురేట్స్, బెంజోడయజిపైన్స్ వంటి వాటిని అకస్మాత్తుగా ఆపినప్పుడు. 👉 ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల... సొంత వ్యాధినిరోధకత సొంత కణాలపై ప్రతికూలంగా పనిచేసే ఆటో ఇమ్యూన్ వ్యాధులైన సిస్టమిక్ ల్యూపస్ అరిథమెటోసస్ (ల్యూపస్); పాలీమయాల్జియా రుమాటికా; పాలీమైయోసైటిస్; డెర్మటోమయోసైటిస్; మల్టిపుల్ స్కి›్లరోసిస్ వంటి కేసుల్లో.జీవక్రియల్లో లోపాలతో వచ్చే మెటబాలిక్ డిసీజెస్‌లో... దేహంలో జీవక్రియలన్నీ ఒక క్రమపద్ధతిలో జరగకుండా అస్తవ్యస్తంగా జరుగుతున్నప్పుడు వచ్చే వ్యాధులైన మెటబాలిక్ డిసీజెస్‌లో... ఉదాహరణకు హైపర్ థైరాయిడిజమ్; హైపో థైరాయిడిజమ్; తగినంత ఎడ్రినాలిన్ స్రావాలలోపం (అడ్రినాలిన్ ఇన్సఫిషియెన్సీ); కార్నిటిన్ పాల్మిటైల్ ట్రాన్స్‌ఫరేజ్ లోపం; కాన్స్ సిండ్రోమ్ వల్ల.లక్షణాలు... మొదటి లక్షణం ఒంటినొప్పులు. వాటితోపాటు... నొప్పి కారణంగా దేహంలోని ఆ భాగం కదలలేకపోవడం (కాళ్లూ, చేతుల్లో) కండరం బిగుసుకు΄ోవడం లేదా లాగినట్టుగా తీవ్రమైన నొప్పి కండరం తీవ్రమైన అలసట (ఫెటీగ్) లేదా నీరసానికి గురై ఆ అవయవాన్ని కదిలించలేకపోవడం నొప్పి కారణంగా నిద్రపట్టకపోవడం కండరాల్లో మంట లేదా సూదితో పోడుస్తున్నట్లుగా నొప్పి. (ఇది ఒకే చోటగానీ లేదా నొప్పి వస్తున్న పరిసరాలంతటిలోనూ వచ్చే నొప్పి) తీవ్రమైన నొప్పి కారణంగా డిప్రెషన్‌కు లోనుకావడం.నివారణ: ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా... అన్ని పోషకాలతో సమతులాహారం క్రమం తప్పని వ్యాయామం కంటి నిండా నిద్రచికిత్స: ఉపశమనం కోసం డాక్టర్ల సలహా మేరకు ఎన్ఎస్ఏఐడీ (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) 👉 ఒళ్లునొప్పులు లేదా కండరాల నొప్పులు వస్తున్నప్పుడు... అందుకు సరైన కారణాన్ని కనుగొని, వ్యాధి నిర్ధారణ తర్వాత ఏ కారణం వల్ల ఆ నొప్పులు వస్తున్నాయన్నది గుర్తించి, దానికి తగిన చికిత్స తీసుకోవడం.👉 శస్త్రచికిత్సలు: స్పాండిలోసిస్, సయాటికా లేదా నడుము భాగంలోని వెన్నుపూసల అరుగుదల వంటి సందర్భాల్లో నరం నొక్కుకుపోయి వచ్చే నొప్పులు ఎంతకీ తగ్గనప్పుడు చివరి ప్రత్యామ్నాయంగా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.అపోహ... వాస్తవం: 👉 కండరం గాయపడటం వల్ల నొప్పి వచ్చినప్పుడు దాంతో మళ్లీ బాగా పని చేయించినప్పుడు అది బాగవుతుంది, నొప్పి తగ్గుతుంది అనేది అ΄ోహ. అలాగే జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు పట్టేసిన కండరం కూడా మళ్లీ అదే ప్రక్రియ చేస్తున్నప్పుడే రిలాక్స్ అవుతుందన్నది కూడా అపోహే. నొప్పి వస్తున్నప్పుడు అదే కండరంతో పదే పదే పనిచేయిస్తే అది మరింత గాయపడుతుంది. ఆ గాయాన్ని ‘రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజురీ’ అంటారు. గాయపడి నొప్పిగా ఉన్న కండరానికి నొప్పి తగ్గేవరకు విశ్రాంతి ఇవ్వాలి. -
ఢైలీ రొటీన్‌ను ఇలా ప్లాన్ చేయండి
ఆర్థిక విషయాలను పకడ్బందీగా నిర్వహించడం ఎంత అవసరమో ఆరోగ్య భరోసానిచ్చే దైనందిన కృత్యాలు నిర్వహించడమూ అంతే అవసరం. ఆర్‌ఎన్‌ఎ- డీఎన్ఏ మొదలు గుండె–మెదడు వరకూ ప్రతీ అణువు, కణము శరీరంలో కీలకమే. ఒక్క అణువు విచ్ఛిన్నమైనా అనారోగ్యమే. సుమారుగా 37.2 ట్రిలియన్ కణాల సమూహంతో నిర్మితమైన మానవ దేహం నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్రకు ఉపక్రమించే వరకూ.. అంతవరకూ ఎందుకు నిద్రలో సైతం నిత్య జీవ క్రియలను కొనసాగిస్తుంది. మరి అంతటి అమూల్యమైన శరీరం తన విధులను తాను సక్రమంగా నిర్వర్తించాలంటే అందుకు తగినట్లుగా మన పని విధానం ఉండాలి? అలా ఉండాలంటే మనం ఏం చేయాలి..ఏమిటా పనులు? ఎలా చేయాలి? ఇలాంటి అంశాలపై హైదరాబాదీల కోసం ప్రత్యేక కథనం...– ఆరోగ్య భరోసానిచ్చే నిత్యకృత్యాలపై దృష్టి సారించండి– అందుకు తగ్గట్లుగా మీ పని విధానం, అలవాట్లు మార్చుకోండి– శారీరక, మానసిక, ఆరోగ్య సంరక్షణపై బీ కేర్ ఫుల్– పలు అధ్యయనాల పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు వెల్లడిఆహారం ఇలా... పెద్దలకు రోజుకు 1,600–3,000 కేలరీల ఆహారం అవసరం. 19–30 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలకు 1,800–2,400 కేలరీలు, పురుషులకు 2,400–3,000 కేలరీలు, 31–59 ఏళ్ల వయసున్న స్త్రీలకు 1,600–2,200 కేలరీలు, పురుషులకు 2,200–3,000 కేలరీలు అవసరం. అయితే, ఒక వ్యక్తి రోజుకు ఎన్ని కేలరీలు తినాలి అనేది ఆ వ్యక్తి జెండర్, వయస్సు, ఎత్తు, జీవనశైలిని బట్టి మారుతుంది. ఆహారంలో..క్యాల్షియం రోజుకు 1గ్రా, ఫైబర్ రోజుకు 40 గ్రా,–మెగ్నీషియం రోజుకు 410 మిగ్రా, విటమిన్ ఇ రోజుకు 15 మిగ్రా. విటమిన్ సి రోజుకు 75–90 మిగ్రా, విటమిన్ ఎ రోజుకు 600–900 గ్రా, విటమిన్ డి రోజుకు 600 ఐయూ, పొటాషియం రోజుకు 4.7 గ్రా,ప్రొటీన్ రోజుకు 46–56 గ్రా. ఐరన్ రోజుకు 15– 18 గ్రాల వరకూ కావాలి. జాతీయ పరిశోధనా సంస్థ ఐసీఎమ్ఆర్న్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్) సూచనల ప్రకారం..ప్రతి రోజూ తీసుకునే ఆహరంలో ధాన్యాలు–చిరు ధాన్యాలు 250 గ్రా, పప్పులు 85 గ్రా, పాలు–పెరుగు 300గ్రా, కూరగాయలు–ఆకుకూరలు 400 గ్రా, పండ్లు 100 గ్రా, నూనెగింజలు 35 గ్రా, కొవ్వులు–నూనెలు 27 గ్రా ఉండాలి. మెదడుకు మేత కావాలి... విజా్ఞనమే కాకుండా మానసిక స్పందనలపై పుస్తక పఠనం అత్యంత ప్రభావం చూపించేది. రోజుకు 30 నిమిషాల పుస్తక పఠనం లేదా పజిల్స్ సాల్వేషన్ మెదడును యాక్టివ్‌గా ఉంచుతుంది. హైసూ్కల్, కాలేజ్ విద్యార్థులకు రోజుకు 2–3 గంటల చదువు సరిపోతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విరామం లేకుండా ఏకధాటిగా చదవడం ఒత్తిడిని పెంచుతుంది. ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారి విషయంలో పఠన సమయం వేరుగా ఉంటుంది.ప్రాణవాయువు ప్రాముఖ్యత... మనిషి రోజుకు 550 లీటర్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవాలి. పీల్చే గాలిలో 15 శాతం ఆక్సిజన్ ఉంటుంది. కాలుష్యరహిత పరిసరాల్లో రోజూ కొంత సమయం గడపడం ద్వారా తగినంత ఆక్సిజన్ పొందవచ్చు. నవ్వు...కరిగే కొవ్వు... ఓ అధ్యయనం ప్రకారం రోజుకు 10 నుంచి 15 నిమిషాలు నవ్వడం వల్ల దాదాపు 40 కేలరీలు బర్న్ అవుతాయి. నవ్వు తర్వాత 45 నిమిషాల వరకూ కండరాలు రిలాక్స్‌గా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం, ఒత్తిడి హార్మోన్లను తగ్గించడం, సహజమైన ఎండార్ఫిన్ విడుదల చేయడం, గుండెపోటు నివారణ తదితర విషయాల్లో మేలు చేస్తుంది. నవ్వడం వల్ల జీవిత కాలం పెరుగుతుందని నార్వే అధ్యయనం వెల్లడించింది. కప్పు కాఫీ... శరీరానికి కెఫిన్లు ప్రమాదకరమే అయినా రోజుకు 400 మిల్లీగ్రాముల వరకూ సురక్షితమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇది దాదాపు నాలుగు కప్పుల బ్రూ కాఫీ, 10 క్యాన్ల కోలా, రెండు ఎనర్జీ షాట్ డ్రింక్స్‌లతో లభిస్తుంది. ఈ కెఫిన్ మొదడు, నరాల పనితీరును మెరుగు పరుస్తుంది. అయితే ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ కంటెంట్‌లో చాలా తేడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది రొ‘టీ’న్... రోజుకు సగటున 3 నుంచి 5 కప్పుల చాయ్ ఆరోగ్యకరమే. సాధారణ టీలో ఉండే సమ్మేళనాలకు శరీరం ప్రతిస్పందించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అలాగే క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. తాగు...ఆగు... రోజుకు 15–30 మి.లీ మించి ఆల్కహాల్ ప్రమాదకరం. బీర్, వైన్, జిన్, విస్కీ వంటి ఆల్కహాల్స్‌లో ఏదో ఒకటి మాత్రమే సేవించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఆల్కహాల్ పరిమాణాల్లో తేడాలుంటాయి. మహిళలకు రోజుకు ఒక పానీయం, పురుషులకు రోజుకు రెండు పానీయాల పరిమితి మించకూడదు. వేడి...రెడీ... శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మానవ శరీరం 36 నుంచి 37.5 సె.. వరకూ వేడిని తట్టుకుంటుంది. ఇది 40సె మించితే ప్రమాదకరం. అతి వేడి డీహైడ్రేషన్‌తో పాటు ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశముంది. అలాగే 21 సె.డిగ్రీల వరకూ చల్లదనాన్ని తట్టుకుంటుంది. సిట్...రైట్ రోజులో 4 గంటల కన్నా మించి కూర్చుంటే ఆరోగ్య సమస్యలు ప్రారంభమై, ఇది 8 గంటలకు చేరితే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని జస్ట్ స్టాండ్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఉద్యోగ రీత్యా 8 నుంచి 11 గంటల వరకూ కదలకుండా కూర్చోడం వల్ల ఒబెసిటీ సహా అనేక అనారోగ్యాలు దాడి చేస్తున్నాయి.నిద్రే ఆరోగ్యం... అనేక రకాల శారీరక, మానసిక రుగ్మతలకు నిద్రలేమే ప్రధాన కారణమని పలు అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడించాయి. నిద్ర అలవాట్లు, పర్యవసానాల పై మ్యాట్రెస్ మేకర్ వేక్‌ఫిట్ నిర్వహించిన సర్వేలో భాగంగా నగరంలో 56 శాతం మంది వారి పని వేళల్లో నిద్ర మత్తుతో అవస్థలు పడుతున్నారని తేల్చంది. అంతేకాకుండా నిద్ర లేవగానే రిఫ్రెష్ ఫీలింగ్ అనిపించట్లేదని నగరవాసులు పేర్కొన్నారు. ‘ది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్కార్డ్ఙ్గా పిలువబడే ఈ సర్వేలో నగరంలో దాదాపు 33 శాతం మంది తమ నిద్రలేమికి కేవలం అర్థరాత్రి వరకూ డిజిటల్ స్క్రీల్లు తిలకించడమే కారణమని తద్వారా 32 శాతం మంది ఉద్యోగాలకు ఆలస్యంగా వెళ్తున్నారని తేల్చారు. ఆరోగ్యకర జీవనానికి రోజూ 7–8 గంటల నిద్ర అవసరం. అయితే వయస్సులను బట్టి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. 4 నుంచి 12 నెలల చిన్నారులకు 12 నుంచి 16 గంటల పాటు, 1–2 ఏళ్లు... 11–14 గంటలు, 3–5 ఏళ్లు 10–13 గంటలు, 6–12 ఏళ్లు... 9–12 గంటల నిద్ర 13–18 ఏళ్లు.. 8–10 గంటలు... ఆపై వయసు వారికి 7–8గంటలు, పీరియడ్స్‌లో ఉన్న ఆడవారికి కనీసం 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. తాగునీరు...ఇదే తీరు... మనిషి మనుగడకు ప్రామాణికం నీరు. శరీరంలో దాదాపు 60 శాతం నీరే ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనానికి ప్రతీరోజు పురుషులు రోజూ 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణుల సూచన. ఉష్ణోగ్రత, ఆరోగ్య పరిస్థితులను బట్టి హెచ్చుతగ్గులు అవసరం. సరైన మోతాదులో శరీరానికి నీరు అందకపోవడం రోగకారకంగా మారుతుంది. కేలరీలు కరగాలి...రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం శరీరాన్ని చురుగ్గా మార్చుతుంది. ఇందులో భాగంగా జిమ్, ఏరోబిక్, జుంబా వంటివి ఇందుకు ఉపకరిస్తాయి. వారంలో కనీసం..150 నిమిషాలు(రోజుకి 20 ని.) వ్యాయామం చేయాలని హెల్త్ అండ్ హ్యూమన్ సరీ్వసెస్ గైడ్‌లై ప్రకటించిది. యోగా 20 నిమిషాలు. ధ్యానం 5 నుంచి 20 నిమిషాలు చేయడం మంచి ఫలితాలను అందిస్తుంది. ఇక ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక ఆరోగ్యకరం. సాధారణంగా రోజుకు 10,000 అడుగులు వేయాలని సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) సైతం సిఫార్సు చేసింది. ఈత 30 నిమిషాలు, ఆటలైతే 30 నిమిషాల పాటు, సైక్లింగ్ రోజుకు 30 నిమిషాలు సరిపోతుంది. 30 నిమిషాలకు మించి సైకిల్ తొక్కే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం 40 శాతం తక్కువని ఫిన్లాండ్ పరిశోధనలో తేలింది. బీ అలర్ట్ సిటీజన్నిద్ర లేచింది మొదలు... ఏమేం పనులు చేయాలి? ఏ టైమ్‌కి ఎక్కడ ఉండాలి? ఎవర్ని కలవాలి? తదితర పనుల జాబితాను ముందు రోజే సిద్ధం చేసుకునే అలవాటుందా? ఈ ప్రశ్నకు చాలా మంది సిటిజనుల నుంచి అవును అనే సమాధానం వస్తుంది. మరి అదే విధంగా రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఎన్ని కేలరీల ఆహారం తీసుకోవాలి? ఎన్ని కేలరీలు ఖర్చు చేయాలి? ఎన్ని గంటలు మొబైల్ చూడాలి?.. వగైరా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? అని ప్రశి్నస్తే మాత్రం అవును అని బదులిచ్చేవారు అరుదే. ‘స్మార్ట్’గా వాడాలి... మొబైల్, ల్యాప్‌టాప్ వంటి స్క్రీన్ లను రోజులో 2 గంటల కన్నా ఎక్కువ సమయం చూడటం హానికరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన సూచనల ప్రకారం..సంవత్సరం కంటే తక్కువ వయస్సున్న పిల్లలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండాలి. ఐదేళ్లలోపు చిన్నారులు గంటకు మించి ఫోన్ వాడకూడదు. 10 మిలియన్ల రంగులను వేరు చేయగల శక్తి గల మనిషి కన్నుకు ఫోన్ హానికరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉప్పు.. ఎక్కువైతే ముప్పు... శరీర క్రియల కోసం ప్రతిరోజూ 500మి.గ్రా సోడియం (ఉప్పు) అవసరం. ఇది నరాలను ప్రేరేపించడంతో పాటు కండర సంకోచానికీ సహాయం చేస్తుంది. ముఖ్యంగా దేహంలోని నీరు–ఖనిజాల సమతుల్యతను కాపాడుతుంది. అతిగా వాడితే బ్లెడ్ ప్రెజర్, గుండె సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్యానికి...‘పండు’గ రోజువారీ ఆహారంలో 25 నుంచి 30 శాతం పండ్లు ఉండాలనేది ఆరోగ్య నిపుణుల మాట. ద్రవ రూపంలో తీసుకోవాలనుకుంటే... రోజూ 150 మి.లీ లోపు పండ్ల రసాలు తీసుకోవాలి. అతిగా పండ్ల రసాలు సేవించడం వల్ల శరీరంలో గ్లూకోజ్, చక్కెర స్థాయిలు పెరిగే అవకాశముంది. -
బ్రెయిన్‌కు ట్యూమర్ ముప్పు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో బ్రెయిన్ ట్యూమర్ బాధితులు పెరుగుతున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ప్రతి నెలా 40 మంది వరకూ బ్రెయిన్ ట్యూమర్ బాధితులు వస్తున్నారు. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన బాధితులకు వైద్యులు బ్రెయిన్ స్కాన్ చేసి వ్యాధిని నిర్ధారించి, అవసరమైన చికిత్సలు, శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలో బ్రెయిన్ ట్యూమర్లు వచ్చేవని, ఇప్పుడు 15 ఏళ్ల చిన్నారులు, 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారిలోనూ బ్రెయిన్ ట్యూమర్స్ చూస్తున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. బ్రెయిన్ ట్యూమర్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయని, చిన్న పిల్లల్లో జన్యుపరమైన లోపాలే కారణంగా వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధికి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంటున్నారు. నాలుగు దశల్లో వ్యాధి బ్రెయిన్ ట్యూమర్‌కు నాలుగు దశలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మొదటి దశలో తలనొప్పి, వాంతులు, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండోదశలో తీవ్రమైన తలనొప్పి, అకారణంగా వాంతులు, తలతిరగడం ఎక్కువగా ఉంటాయి. మూడో దశలో బ్రెయిన్లోని ట్యూమర్ ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది. ఊపిరితిత్తులు, వెన్నుపూసలకు విస్తరిస్తుంది. లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయి. నాలుగోదశలో ట్యూమర్ కణాలు శరీరంలోని రక్తంలో కలిసి అంతా వ్యాప్తి చెందుతుంది. ఈ దశలో రోగి మరింత క్షీణిస్తాడు.నిర్ధారణ ఇలా.. తలనొప్పితో వచ్చిన రోగికి సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు చేయడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్‌ను నిర్ధారిస్తారు. ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్‌ను నాలుగో దశ వచ్చే వరకూ గుర్తించే వారు కాదు. వ్యాధి నిర్ధారణ కాకముందే మరణించినవారు కూడా ఉన్నారు. ఇప్పుడు అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రావడంతో తొలిదశలోనే గుర్తించగలుగుతున్నారు. ప్రస్తుతం ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సౌకర్యాలు, విస్తృతంగా స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి రావ డంతో తొలిదశలో గుర్తించగలుగుతున్నారు. చికిత్సలు ఇలా.. బ్రెయిన్ ట్యూమర్ దశ బట్టి చికిత్సలు అందిస్తారు. కొందరికి మందులు ఇస్తూ ట్యూమర్‌ను తగ్గిస్తారు. మరికొందరికి శస్త్ర చికిత్స ద్వారా ట్యూమర్‌ను తొలగిస్తారు. రేడియేషన్ థెరపీ, శస్త్ర చికిత్స తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సలు అందిస్తారు. ప్రస్తుతం ఆధునిక చికిత్సలు, అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కారణాలు ఇవీ.. జన్యుపరమైన లోపాలు. తీసుకునే ఆహారం. రేడియేషన్ ప్రభావం. పొగ, మద్యం తాగడం. తీవ్రతను బట్టి వైద్యం నెలలో 20 నుంచి 30 మంది వరకూ బ్రెయిన్ ట్యూమర్ రోగులు వస్తున్నారు. ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు. వారి పరిస్థితిని అంచనా వేసి మందులు ఇవ్వడమా, శస్త్ర చికిత్స చేయడమా అన్నది నిర్ధారిస్తాం. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి సీటీ, ఎంఆర్ఐ స్కాన్ చేయడంతో ట్యూమర్‌ను నిర్ధారిస్తున్నాం. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో స్కానింగ్‌లు అందుబాటులోకి రావడంతో వ్యాధిని త్వరగా గుర్తించగలుగుతున్నాం. – డాక్టర్ గొల్ల రామకృష్ణ, న్యూరోసర్జన్, విజయవాడకచ్చితమైన నిర్ధారణ బ్రెయిన్ ట్యూమర్లను కాంట్రాస్ట్ సీటీతో కచ్చితమైన నిర్ధారణ చేస్తాం. బ్రెయిన్లో ఏదైనా గడ్డ ఉంటే అది ట్యూమరా, ఇంకేమైనానా అని తెలుసుకోవచ్చు. ఏ ప్రాంతంలో ట్యూమర్ ఉంది అనేది చెప్పవచ్చు. ఒకప్పుడు నాలుగో దశలో వ్యాధిని గుర్తించేవారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సరీ్వసెస్ అందుబాటులోకి రావడంతో మొదటి, రెండో దశలోనే గుర్తించగలుగుతున్నాం. లక్షణాలను బట్టి స్కాన్ చేసి వ్యాధిని నిర్ధారణ చేయొచ్చు. – డాక్టర్ ఎన్.దీప్తిలత, రేడియాలజిస్ట్, విజయవాడ -
సెలబ్రిటీలు తాగే బ్లాక్ వాటర్ ఏంటీ? నార్మల్ వాటర్ కంటే మంచిదా..!
చాలా మంది సెలబ్రిటీలు.. బ్లాక్ వాటర్ తాగుతూ ఉన్న ఫొటోలు తెగ సందడి చేస్తున్నాయి. క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి కరణ్ జోహార్, శృతి హాసన్ ఇలా ఎంతో మంది సెలబ్రిటీల వరకు చాలామంది ఈ నీటినే తాగుతున్నారు. ఎందుకు వాళ్లు ఈ నీటిని తాగుతున్నారు. దీని ప్రత్యేకత ఏంటి?. మాములు వాటర్‌కి దీనికి తేడా ఏంటీ అంటే.. బ్లాక్ వాటర్.. ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతోంది. ముక్యంగా సెలబ్రెటీలు బ్లాక్ వాటర్ తాగుతున్న లేదా క్యారీ చేస్తున్న ఫోటోలే ఇందుకు కారణం. ఇక ఈ బ్లాక్ వాటర్ దగ్గర కొస్తే ఇది చూడటానికి బ్లాక్‌గా ఉంటుంది. అయితే ఈ వాటర్ తాగితే అప్పటి వరకు శరీరం కోల్పోయిన నీరు తక్షణమే భర్తీ అవుతుందట. ముఖ్యంగా వ్యాయామం వంటివి చేసినప్పుడు కోల్పోయిన నీరు తక్షణమే పొందడంలో తోడ్పడుతుంట. పైగా వీటిలో పోషకాల శాతం అధికంగా ఉంటాయి. దీని వల్ల ఒనగురే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే.. డిటాక్స్ డ్రింక్‌గా.. ఈ బ్లాక్ వాటర్ శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించే డిటాక్స్ డ్రింక్‌గా పని చేస్తుంది. బ్లాక్ వాటర్‌లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు.. శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను బయటికి పంపించడంలో శక్తిమంతంగా పని చేస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.. బ్రాక్ వాటర్ శరీరంలో యాసిడ్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తీసుకున్న ఆహారం నుంచి సూక్ష్మ పోషకాలను శరీరం త్వరగా గ్రహించగలుగుతుంది. పైగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది.. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే జీవక్రియల పనితీరూ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరంలో కొలస్ట్రాల్ పెరగదు. అదీగాక బరువును కూడా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. రోజంతా ఉత్సాహాంగా, హెల్తీగా ఉంటారు. నార్మల్ వాటర్‌తో ఈ ప్రయోజనాలు పొందగలమా..? నిపుణులు నార్మల్ వాటర్ తోకూడా ఇలాంటి ప్రయోజనాలనే పొందొచ్చని చెబుతున్నారు.ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు. అలాగే రోజంతా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేలా 12-15 గ్లాసుల నీరు త్రాగాలని చెప్పారు. ఇక్కడ శరీరానికి తగినంత నీరు అందితే.. బ్లాక్ వాటర్ వల్ల పొందే ప్రయోజనాలనే మాములు వాటర్‌తో కూడా సొంతం చేసుకుంటామని అన్నారు. అలా అని డైరెక్ట్‌గా ట్యాప్ వాటర్ తాగొద్దని చెప్పారు. నార్మల్ వాటర్‌ని గోరువెచ్చగా లేదా కాచ చల్లార్చి తాగితే ప్రయోజనాలు పొందగలరిన తెలిపారు. ఇలా చేస్తే.. శరీరంలో టాక్సిన్స్ తొలుగుతాయిన చెప్పారు. ముఖ్యంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. దీంతోపాటు శశరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని అన్నారు. అంతేగాక మంచి జీర్ణక్రియ కోసం.. ఉదయాన్ని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చియా గింజలు వేసి తీసుకోంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని అన్నారు. బ్యాక్ వాటర్‌తో కలిగే దుష్ప్రయోజనాలు.. ఈ బ్లాక్ వాటర్ తాగితే ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఎక్కువగా తీసుకుంటే అంతే స్థాయిలో సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికి పీహెచ్ స్థాయిలు ఉంటాయి. దీని కారణంగా శరీరంలో ఆల్కలైన్ స్థాయులు పెరిగిపోయి.. గ్యాస్-ఉదర సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, చర్మ సమస్యలు, ఏకాగ్రత కోల్పోవడం వంటివి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిలో ఉండే అధిక pH మీ చర్మాన్ని పొడిగా మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!) -
డెలివరీ తర్వాత పొట్ట అధిక బరువు తగ్గాలంటే|
నేను డెలివరీ అయ్యి రెండు వారాలు. మా ఫ్రెండ్స్ కొందరికీ డెలివరీ తర్వాత పొట్ట వదులుగా తయారైంది. నాకు అలా అవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సీహెచ్. శ్రావణి, విజయనగరం ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల పొట్టలోని కండరాలు ముఖ్యంగా రెక్టస్ మజిల్, కనెక్టివ్ టిష్యూ మృదువుగా మారుతాయి. పెరిగే గర్భసంచిని, బిడ్డను అకామడేట్ చేయడానికి స్ట్రెచ్ అవుతాయి. కానీ ప్రసవం తరువాత ఆ కండరాలను శక్తిమంతం చేసే వ్యాయామాలు చేయకపోతే పొట్ట కండరాలు బలహీనపడతాయి. దానివల్ల వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోషన్‌కి వెళ్తున్నప్పుడు సమస్యలు, కీళ్ల నొప్పులు వస్తాయి. స్మాల్ రెక్టస్ సపరేషన్ చాలావరకు 6–8 వారాల్లో మజిల్ స్ట్రెచింగ్‌తో కవర్ అవుతుంది. ఈ స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్‌ని ప్రసవం అయిన రెండు నుంచి నాలుగు వారాల్లో నెమ్మదిగా మొదలుపెట్టాలి. ఈ ఎక్సర్సైజెస్ కోసం ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదిస్తే మంచిది. ఈ వ్యాయామాలు చేసేటప్పుడు నొప్పి, అసౌకర్యం ఉంటే గనుక అసలు చేయకూడదు. ఇప్పుడు చాలా క్లినిక్స్‌లో పోస్ట్‌నాటల్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అని స్పెషల్ కేర్ ఎక్సర్‌సైజెస్‌ని నేర్పిస్తున్నారు. మీ శరీర తత్వం, మీది ఏరకమైన ప్రసవం.. అనే అంశాలను బట్టి మీ గైనకాలజిస్ట్, ఫిజియోథెరపీ టీమ్ కలసి మీకు తగిన వ్యాయామాలను సూచిస్తారు. ఈ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు అబ్డామినల్ బైండర్ లేదా టమ్మీ సపోర్ట్ బెల్ట్‌ను పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మీ శరీరం మునుపటిలా ఫిట్‌గా మారడానికి టైమ్ పడుతుంది. ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట కండరాలు నెలల పాటు స్ట్రెచ్ అయి ఉంటాయి. కాబట్టి అవి మళ్లీ మునుపటిలా టైట్ అవడానికి అంతే టైమ్ పట్టొచ్చు. త్వరగా పూర్వపు స్థితికి రావాలని హడావిడిగా అన్ని ఎక్సర్సైజెస్ చేస్తే వెన్ను నొప్పి ఎక్కువవొచ్చు. సిజేరియన్ అయిన వారు ఇంకొంచెం ఎక్కువ టైమ్ తీసుకుని శరీరం, మనసు సిద్ధమైన తర్వాతే ఎక్సర్సైజెస్ మొదలుపెట్టాలి. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి అందరికీ చాలా మంచివి. ప్రసవమైన రెండు వారాలకు వీటిని స్టార్ట్ చేయొచ్చు. ఆఫ్‌లైనే కాదు ఆన్లైన్ ద్వారా కూడా వీటిని నేర్పిస్తారు. ఈ వ్యాయామాల వల్ల యూరినరీ మజిల్స్ టైట్ అవుతాయి. ప్రసవం తరువాత తలెత్తే యూరిన్ లీకేజ్, అర్జెన్సీ వంటి సమస్యలు తగ్గుతాయి. కవలలను.. అధిక బరువు బిడ్డను మోసినప్పుడు స్ట్రెచ్ ఎక్కువ అవుతుంది. అలాంటివారు ఎక్కువ టైమ్ తీసుకుని డాక్టర్ పర్యవేక్షణలో స్ట్రెంతెనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ప్రెగ్నెన్సీ లేదా డెలివరీ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే పూర్తిగా కోలుకునే వరకు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొద్దని డాక్టర్ చెప్తారు. అది ఫాలో కావాలి. సరైన గైడెన్స్ అవసరం ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రసవం తరువాత ఏడాది వరకు బిడ్డకు చనుబాలు అవసరం కాబట్టి క్రాష్ డైట్ అసలు చేయకూడదు. కూర్చుని చేసే తేలికపాటి యోగాసనాలు, ధ్యానం వంటివి ప్రసవం తరువాత కాస్త ఎర్లీగానే మొదలుపెట్టవచ్చు. మా కుటుంబంలో అందరికీ హై బీపీ ఉంది. బీపీ వల్ల మా అక్కకి 9వ నెల ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వచ్చాయి. నాకు ఇప్పుడు మూడవ నెల. మేము ఉండేది విలేజ్‌లో. ఏ కాంప్లికేషన్ రాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి. – వాణీపద్మజ, బోథ్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో బీపీ, సుగర్ విషయంలో ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. మీ వయసు, బరువును బట్టి బీపీ రిస్క్ ఎంత ఉంది అనేది కాలిక్యులేట్ చేయొచ్చు. మూడవ నెలలో అందరికీ చేసే Nఖీ స్కాన్‌లో ఇవన్నీ అసెస్ అవుతాయి. ఇలాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీలో మూడవ నెల నుంచి అటpజీటజీn మాత్రలను సజెస్ట్ చేస్తారు. ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీని జెస్టేషనల్ హైపర్‌టెన్షన్ లేదా ప్రీఎక్లమ్సియా అంటారు. వందలో 2–8 ప్రెగ్నెన్సీల్లో ఇది కనిపిస్తుంది. ఈ కేసెస్‌లో హై బీపీతోపాటు మూత్రంలో ప్రొటీన్స్ పోతుంటాయి. బిడ్డ ఎదుగుదల మీదా ప్రభావం పడుతుంది. ప్లెసెంటాలో జరిగే మార్పుల వల్ల బీపీ పెరిగి తల్లికి, బిడ్డకు ప్రమాదం సంభవిస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ లేదా అంతకుముందు బీపీ ఉన్నవారిలో రిస్క్ ఎక్కువ. దీన్ని తగ్గించేందుకు బీపీని కంట్రోల్ చేసే మాత్రలతోపాటు ప్రివెంటివ్ కేర్ కింద అటpజీటజీn మాత్రలనూ వాడాలి. హై బీపీని గుర్తించకపోతే తలనొప్పి, బ్లర్డ్ విజన్, కడుపు నొప్పి, ముఖము, పాదాల్లో వాపు వస్తుంది. బిడ్డ ఎదుగుదల మందగించడం, లోపల బ్లీడింగ్ అవడం, బిడ్డ ప్రాణానికి ముప్పు ఏర్పడవచ్చు. అందుకే హై రిస్క్ కేసెస్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏడవ నెల వరకు నెలకు రెండుసార్లు.. ఏడవ నెల తరువాత నుంచి వారానికి ఒకసారి చెకప్స్‌కి వెళ్లాలి. తగిన సమయంలో బ్లడ్, యూరిన్ టెస్ట్‌లు, స్కాన్స్ చేయించుకోవాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీలను చూసే ఆసుపత్రిలో రెగ్యులర్ యాంటీనాటల్ కేర్‌కి వెళ్లడం మంచిది. మీకు ఇప్పుడు మూడవ నెల కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి రిస్క్ అసెస్మెంట్ చేయించుకోండి. ఇందులో హై రిస్క్ వస్తే రెగ్యులర్ చెకప్స్ తప్పనిసరి. మూడవ నెల నుంచి 36 వారాల వరకు అటpజీటజీn మాత్రలను ఇస్తారు. ఈ మాత్రల వల్ల కొంచెం ఎసిడిటీ వస్తుంది. అందుకే రాత్రి భోజనం తర్వాత ఈ మాత్రలను తీసుకోవాలి. ఒకవేళ వెజైనల్ బ్లీడింగ్ లేదా అల్సర్స్ ఉంటే మోతాదు మారుస్తారు. డైట్, జీవనశైలిని మారిస్తే బీపీ వచ్చే రిస్క్ తగ్గుతుంది. పౌష్టికాహారం, ఎక్సర్‌సైజెస్‌తో బరువు పెరగకుండా చూసుకోవాలి. విటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్స్‌ను తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఫోలిక్ యాసిడ్ మాత్రలను వాడాలి. ఈ జాగ్రత్తలతో పాటు ప్రెగ్నెన్సీలో మీకు ఎప్పుడైనా విపరీతమైన తలనొప్పి, బ్లర్డ్ విజన్, వాంతులు, ఛాతీ నొప్పి వంటివి వస్తే వెంటనే హై రిస్క్ యూనిట్‌ని సంప్రదించాలి. వెంటనే బీపీ మెడిసిన్‌ని స్టార్ట్ చేస్తారు. ఇలా ప్రివెంటివ్ మెడిసిన్, లైఫ్‌స్టయిల్ చేంజెస్, క్రమం తప్పని యాంటీనాటల్ చెకప్స్‌తో బీపీ వచ్చే చాన్సెస్ను తగ్గించుకోవాలి. -
ఐస్ వాటర్ తెగ తాగేస్తున్నారా? ఆగండాగండి! ఈ ఎఫెక్ట్స్ తెలుసా?
ఇంకా మార్చి నెల రాకుండానే వేడి సెగ తగులుతోంది. రాత్రి పూట ఫ్యాన్లు, ఏసీలు లేనిదే నిద్రపోలేని పరిస్థితి వచ్చేసింది. ఇక ఎండాకాలం అనగానే ముందుగా గుర్తొచ్చేది చల్ల.. చల్లని నీళ్లు. వేడినుంచి ఉపశమనం పొందేందుకు ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగడం అందరికీ అలవాటు. చల్లటి నీళ్లు, లేదా ఇతర పానీయాలు కడుపులో పడగానే హాయిగా అనిపిస్తుంది. కానీ అలా ఐస్ వాటర్ త్రాగడం వల్ల ఆరోగ్యానికి చేటు అని మీకు తెలుసా? వేసవిలో చల్లని నీరు త్రాగడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు గురించి తెలియాలంటే.. ఈ కథనాన్ని చూడండి. జీర్ణక్రియ సమస్యలు చల్లటి నీరు కడుపుని సంకోచింప చేస్తుంది. ముఖ్యంగా భోజనం తర్వాత ఆహారాన్ని జీర్ణం కాదు కష్టమవుతుంది. మనం చల్లటి నీరు తాగితే ఆహారం జీర్ణం కావడానికి శరీరం చాలా కష్టపడాల్సి వస్తుంది. అవును, చల్లటి నీరు జీర్ణవ్యవస్థను వేగంగా ప్రభావితం చేస్తుంది. నిజానికి మనం చల్లటి నీరు తాగినప్పుడు, అది శరీర ఉష్ణోగ్రతతో సరిపోలక కడుపులో ఉన్న ఆహారం జీర్ణం కష్టమవుతుంది. హార్ట్ రేట్ తగ్గిపోతుంది కొన్ని అధ్యయనాలు ప్రకారం చల్లని నీరు తాగడం గుండె స్పందన రేటు కూడా తగ్గిపోతుంది. మెడ మీద ఉండే గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలను కంట్రోల్ చేసే వాగస్ నాడి మెదడును ప్రభావితం చేస్తుంది. ఈ నాడి శరీరం స్వయం ప్రతిపత్త నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. అందుకే చల్లగా తిన్నా, తాగినా హార్ట్ రేట్ ప్రభావిత మవుతుంది. నాడీ వ్యవస్థ చల్లపడి హార్ట్ రేట్, పల్స్ రేట్ తగ్గి, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. సైనస్ , తలనొప్పి అతి చల్లగా తాగడం వల్ల కూడా 'బ్రెయిన్ ఫ్రీజ్' సమస్య వస్తుంది. ఐస్ వాటర్ లేదా ఐస్ క్రీం అధికంగా తీసుకుంటే, వెన్నెముకకు సంబంధించిన సున్నితమైన నరాలు కూడా చల్లగా అయిపోతాయి. ఫలితంగా తలనొప్పి , సైనస్ సమస్యలొస్తాయి. మలబద్ధకం చల్లటి నీరు తాగడం వల్ల పేగుల్లో ఆహారం గడ్డకడుతుంది. దీంతో మలబద్ధకం సమస్య ఉత్పన్నమవుతుంది. కడుపునొప్పి, వికారం, మలబద్ధకం, గ్యాస్ బుల్ లాంటివి కూడా వస్తాయి కొవ్వును పెంచుతుంది చల్లటి నీరు శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును మరింత గట్టిగా తయారు చేస్తుంది. ఒక పట్టాన కరగదు కూడా. సో.. బరువు తగ్గాలనుకున్న వారు చల్లని నీటికి దూరంగా ఉండాలి. గొంతు నొప్పి చల్లని నీరు, పానీయాల వల్ల ముఖ్యంగా భోజనం తర్వాత, అదనపు శ్లేష్మం (శ్వాసకోశ శ్లేష్మం) ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది గొంతు నొప్పి, ముక్కు దిబ్బడం సమస్య వస్తుంది. ఇది ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఇది ముదిరితే జ్వరం కూడా వస్తుంది. అంతేకాదు చల్లటి నీరు తాగడం వల్ల దంత సమస్యలు కూడా వస్తాయి. అందుకే కుండలోని నీళ్లు అయినా, ఫ్రిజ్ వాటర్ అయినా మరీ చల్లని నీళ్లు కాకుండా, ఒక మాదిరివి తాగి, వేడినుంచి ఉపశమనం పొందవచ్చు. లేదంటే సమస్యలు తప్పవు. -
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
శివాజీనగర: శరీరానికి వచ్చినట్లే మనసుకూ అనారోగ్యాలు వస్తుంటాయి. అయితే వీటిపై ప్రజలలో మూఢనమ్మకాలు ఉన్నాయి. మానసిక అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటుంటే సమాజం వారిని పిచ్చివారిగా, వీరికి చికిత్స చేసే వారిని పిచ్చి డాక్టర్లుగా పరిహసిస్తూ సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఇది చాలా తప్పుడు పద్ధతి అని చెప్పనవసరం లేదు. మానసిక అనారోగ్యానికి చికిత్స కల్పించే బాధ్యత కుటుంబం, సమాజంపై ఉంది. ఈ దిశగా మానసిక రోగాలను తెలుసుకోండి–మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి ఏటా అక్టోబర్ 10న జరుపుతుంటారు. ఈసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరి మానవ హక్కు అనే నినాదం ఇచ్చింది. తీవ్రమైన పోటీ, దురలవాట్లతో సమస్య ప్రస్తుతం సమాజంలో చదువులు, ఉద్యోగం, వ్యాపారం, ఆస్తుల సంపాదన సహా అనేక రంగాలలో తీవ్రమైన పోటీ నెలకొంది. మద్యం, డ్రగ్స్ వంటి దురలవాట్లు వ్యాపించాయి. అవి సులభంగా మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. దీంతో డిప్రెషన్‌కు గురవుతున్న వారి సంఖ్య పెరిగింది. ఇందులో పీయూసీ విద్యార్థుల నుంచి డైబ్భె ఏళ్ల వృద్ధుల వరకూ ఉంటున్నారు. సమర్థతకు మించి పెట్టుకుంటున్న లక్ష్యాలు కూడా గాయపరుస్తాయి. షిప్ట్ ఉద్యోగాల వల్ల జీవితంలో సమతుల్యత లోపిస్తుంది. ఇక భార్యాభర్తలు సర్దుకుపోయే మనస్తత్వం తగ్గి, ప్రతిచిన్న అంశాన్ని పెద్దది చేసుకుని విడాకుల వైపు అడుగులు తీస్తున్నారు. ఇది కూడా ఒక రకమైన మానసిక అనారోగ్యమే అని డాక్టర్లు అంటున్నారు. 10 శాతం మందే చికిత్స తీసుకుంటున్నారు మానసిక అనారోగ్యంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. విపరీతమైన జ్వరం, కోపం, నిద్రలేమి ఇలాంటివి ఉన్నపుడు తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. మానసిక అనారోగ్యం చికిత్స కోసం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లడంలో సిగ్గు పడాల్సిన అవసరం లేదు. సమస్యలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులతో చెప్పుకోవాలి. ప్రస్తుతం 13 శాతం మంది ఏదో ఒక మానసిక అనార్యోగానికి గురవుతుంటే, అందులో 10 శాతం మందికి మాత్రమే చికిత్స అందుతోంది. మిగతావారు అలాగే బాధపడుతున్నారు. నిర్లక్ష్యం చేయడం అనేది తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. కాబట్టి వైద్యచికిత్సలు తీసుకోవాలి. సమాజంతో సంబంధాలు పెంపొందించుకుని ఒంటరి జీవితానికి దూరంగా ఉండాలి. –డాక్టర్ హెచ్.చంద్రశేఖర్, విక్టోరియా ఆస్పత్రి ఉన్నంతలో సర్దుకుపోవాలి డిప్రెషన్‌కు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఆలోచిస్తూ స్థాయికి మించి పనులు చేయడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం భంగపడే అవకాశముంది. ఉన్నదాంట్లో సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. రోజూ యోగా, వ్యాయామంతో పాటు మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. బెంగళూరు నగర వ్యాప్తిలో 2016 నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా మానసిక అనార్యోగానికి చికిత్స ఇస్తున్నారు. –డాక్టర్ విక్రమ్, మానసిక వైద్య నిపుణుడు, బీబీఎంపీ -
మందులు మరువొద్దు.. పుండు పడి, అవయవాలే తొలగించే పరిస్థితి వద్దు!
– ఉయ్యూరుకు చెందిన శేఖర్(50)కు ఐదేళ్లుగా సుగర్ ఉంది. సరిగా మందులు వాడక పోవడంతో అదుపులో లేదు. దీంతో ఇటీవల ఎడమకాలుకు పుండు పడి మానలేదు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి రాగా, డాప్లర్ స్కాన్ చేసి రక్తప్రసరణ తగ్గినట్లు నిర్ధారించారు. దీంతో మోకాలు కింద భాగం వరకూ కాలును తొలగించాల్సి వచ్చింది. – చిరు వ్యాపారం చేసి జీవనం సాగించే పటమటకు చెందిన వెంకాయమ్మకు 60 ఏళ్లు. పదేళ్లుగా సుగర్ ఉంది. సరిగా మందులు వాడటం లేదు. దీంతో ఇటీవల మోకీలు వద్ద పుండు ఏర్పడి, కిందిభాగం అంతా రక్తప్రసరణ నిలిచిపోయి నల్లగా మారింది. దీంతో తుంటె కింద భాగం వరకూ కాలును తొలగించాల్సి వచ్చింది. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు సుగర్ ఇన్ఫెక్షన్లతో రోగులు బారులు తీరుతున్నారు. కాళ్ల రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గి పుండ్లు ఏర్పడటం కారణంగా ఒక్క ప్రభుత్వాస్పత్రిలోనే నెలకు 50 నుంచి 60 మందికి అవయవాల తొలగింపు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. వీరిలో కొందరికి వేళ్లు, మరికొందరికి పాదాలు, మోకాలు వరకూ, ఇంకొందరికీ తుంటె వరకూ కూడా తొలగించిన సందర్భాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాళ్లు, కాళ్ల వేళ్లు తొలగిస్తున్న వారిలో 90 శాతం మందికి మధుమేహం కారణం కాగా, 5 శాతం మందికి ధూమపానం, వెరికోజ్ వెయిన్స్ కారణమని వివరిస్తున్నారు. ఇంకా లెప్రసీ, వెన్నుముఖ గాయం, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్న వారికి కూడా రక్తనాళాలు మూసుకు పోతుంటాయని వైద్యులు చెబుతున్నారు. ఓపీకి 400 మందికిపైగా.. విజయవాడ ప్రభుత్వాస్పత్రి జనరల్ సర్జరీ ఓపీకి ప్రతి రోజూ 100 నుంచి 150 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. వారిలో నిత్యం 15 నుంచి 20 మంది వరకూ వివిధ రకాల పుండ్లు, కాళ్లకు రక్తప్రసరణ తగ్గడం వంటి కారణాలతో వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నెలకు 350 నుంచి 400 మంది వరకూ వస్తారంటున్నారు. ఇలాంటి వారిలో కొందరికి పుండ్లకు డ్రెస్సింగ్ చేసి మందులు రాసి పంపుతుండగా, పుండ్లు తీవ్రంగా ఉన్న వారిని సెప్టిక్ వార్డులో అడ్మిట్ చేస్తున్నారు. కాళ్లకు, ఇతర శరీర అవయవాలపై మానని పుండ్లు(నాన్హీలింగ్ అల్సర్స్)తో ఎక్కువ మంది వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ముప్పు.. కాళ్లకు రక్తప్రసరణ తగ్గడం వల్ల ఎక్కువగా మానని పుండ్లు ఏర్పడుతున్నాయి. కొందరికి కాళ్లు, వేళ్లు కుళ్లి నల్లగా అయిపోవడంతో, అలాంటి వారికి రక్తప్రసరణ లేని భాగాన్ని తొలగించాల్సి వస్తోంది. నెలలో 50 నుంచి 60 వరకూ అలాంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. వేళ్లు, పాదాలు, మోకీలు వరకూ ఇలా రక్తప్రసరణను బట్టి అవయవాలను తొలగించాల్సి ఉంటుంది. తొలగించకుండా ఇన్ఫెక్షన్ పెరిగితే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. కుళ్లిన పుళ్లు(గ్యాంగ్రీన్స్)తో వస్తున్న వారు ఉంటున్నారు. అలాంటి వారిని సెప్టిక్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ కె. అప్పారావు, జనరల్ సర్జరీ విభాగాధిపతి, జీజీహెచ్ -
ఎటాక్.. స్ట్రోక్ వేర్వేరు...
సాధారణంగా గుండె నిమిషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకోవాలి. కానీ కొందరికి 250 సార్లు.. మరికొందరికి 60 కన్నా తక్కువ సార్లకు పడిపోతోంది. ఈ కారణంగా జిమ్‌ల్లో వ్యాయామం చేస్తూనే, డీజే పాటలకు నృత్యం చేసూ్తనే కుప్పకూలుతున్నట్లు తెలుస్తోంది. గుండె కొట్టుకోవడంలో ఏర్పడే తేడాల కారణంగా రక్త సరఫరా నిలిచిపోవడం కూడా కుప్పకూలడానికి, మరణాలకు కారణమవుతోంది. ఇటీవల వెలుగుచూసిన ఘటనల్లో ఇవి కొన్ని మాత్రమే. గతంలో యాభై ఏళ్లు లేదంటే అరవై ఏళ్లు దాటితేనే గుండెపోటు వస్తుందనే భావన ఉండేది. కానీ ప్రస్తుతం వయోబేధం లేకుండా ఎవరికైనా గుండెపోటు వచ్చి ప్రాణాలపైకి తీసుకొస్తోంది. ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందే వారి సంఖ్య జిల్లాలో నానాటికీ పెరుగుతోంది. వ్యాయామం చేస్తూ, నృత్యం చేసూ్తనో, నడుచుకుంటూ వెళ్తున్న వారు అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. అప్పటివరకు ఆరోగ్యంగా, శారీరకంగా దృఢంగా ఉన్న వారికి సైతం గుండె ఆకస్మాత్తుగా ఆగిపోయి కన్నుమూయడం కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. కొందరిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లేలోగా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ ఆకస్మిక మరణాలను సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా తెలుసుకుంటున్న ప్రజలు భయభ్రాంతులకు గుర వుతున్నారు. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో చోటు చేసుకుంటున్న అకస్మిక గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న వయస్సులో ఆకస్మికంగా కుప్పకూలిపోయి పలువురు తనువు చాలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఘటనలు ఎక్కువయ్యాయి. ఇంటర్, డిగ్రీ చదువుతున్న కుర్రకారే కాకుండా అంతకంటే చిన్న వయస్సు వారు కూడా గుండెపోటుతో మృతి చెందటం భయబ్రాంతులకు గురిచేస్తోంది. కాగా, మారిన జీవనశైలి, వృత్తి, ఇతర అంశాల్లో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా గుండె సంబంధిత అనారోగ్యంతో మరణాల సంఖ్య పెరగటానికి కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే, నియమిత ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేని జీవన శైలి కూడా కారణాలేనని చెబుతున్నారు. ► మధిర మండలం బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన కొట్టె మురళీకృష్ణ హైదరాబాద్‌లో గురువారం ఛాతినొప్పి వస్తోందంటూ కుప్పకూలి మృతి చెందాడు. త్వరలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాల్సి ఉన్న ఆయన మృతితో తల్లిదండ్రులు ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయారు. ► పెనుబల్లి మండలం గణేషన్‌పాడు పంచాయతీకి చెందిన రైతు మెట్టుల అశోక్ శుక్రవారం సాగు పనులు చేస్తుండగానే గుండెపోటుతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స మొదలుపెట్టే లోగా కన్నుమూశాడు. ► ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన గుండాల మండలం రోళ్లగడ్డ తండాకు చెందిన మూడ్ పాషా ఇంట్లో శుభకార్యం నిమిత్తం స్వగ్రామానికి రాగా, శుక్రవారం రాత్రి నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. ► బోనకల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి మరీదు రాకేష్ గుండెనొప్పి వస్తోందని చెప్పగా చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. ఎటాక్.. స్ట్రోక్ వేర్వేరు... గుండె పనిచేయడం హఠాత్తుగా ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. స్పృహ కోల్పోవడం, స్పందించకపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్‌కు ప్రధాన సంకేతాలుగా చెప్పొచ్చు. ఇక మెదడుకు రక్త సరఫరా ఆగిపోవటాన్ని హార్ట్ స్ట్రోక్ అని అంటారు. అయితే సాధారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల గుండె పోటు సంభవిస్తుంది. రక్తం గడ్డ కట్టినప్పుడు, రక్తనాళాలు కుచించుకుపోయినప్పుడు గుండెకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయి గుండెపోటు వచ్చి మరణానికి దారితీస్తుంది. తగిన జాగ్రత్తలు తప్పనిసరి జీవన శైలిలో మార్పుల మూలంగా గుండె జబ్బులకు గురయ్యేవారు పెరుగుతున్నారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ మితమైన ఆహారం తీసుకో వడం, కార్పోహైడ్రేట్లు, ప్రొటీన్స్ ఉండేలా ఆహారాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి. మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండాలి. ప్రతీరోజు 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. ఇటీవలి మరణాలకు పోస్ట్ కోవిడ్ లక్షణాలు కొంత మేర కారణం కాగా.. జీవన శైలిలో వచ్చే మార్పులు, ఒత్తిడి తదితర అంశాలే ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. మరికొందరికి ఊపిరితిత్తులు, మెదడులో రక్తసరఫరా నిలిచిపోతుంది. వ్యాక్సిన్ మూలంగా ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయనే అపోహకు గురవుతున్నారు. కానీ ఇప్పటివకు ఈ విషయం నిర్ధారణ కాలేదు. – డాక్టర్ సీతారాం, గుండె వైద్య నిపుణులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆహార అలవాట్లలో మార్పులు ముఖ్యంగా ఇటీవల యువత ఎక్కువగా జంక్‌ఫుడ్‌కు అలవాటయ్యారు. దీంతో ఆ ప్రభావం శరీరంలోని అవయవాలపై పడి చిన్న వయస్సులోనే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి తోడు మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు కూడా చిన్న వయస్సులోనే గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. ఆధునిక జీవన శైలికి అలవా టు పడిన మనిషి పూర్తిగా శారీరక శ్రమ మర్చిపోయా డు. వ్యాయామం లేకపోవటం కూడా శరీరం వ్యాధు ల బారిన పడడానికి ఓ కారణంగా నిలుస్తోంది. -
ప్రీతి ఆత్మహత్యయత్నం ఘటనపై కొనసాగుతున్న విచారణ
-
నాకు మా బావ అంటే చాలా ఇష్టం.. కానీ
నాకు మా బావ అంటే చాలా ఇష్టం. మేనరికం పెళ్లి మంచిదికాదని తెలిసినా ఈ పెళ్లిని అవాయిడ్ చేయలేను. పెళ్లికి ముందే జెనెటికల్ కౌన్సెలింగ్ తీసుకుంటే నాకేమైనా హెల్ప్ అవుతుందా? – ఎన్‌కేఎస్, గుంటూరు మేనరికం పెళ్లి అనుకుంటే.. పెళ్లికి ముందే ఫ్యామిలీ అండ్ కపుల్ జెనిటిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం చాలా అవసరం. దీనిని ప్రీకన్సెప్షనల్ జెనెటిక్ కౌన్సెలింగ్ అంటారు. మేనరికం పెళ్లిళ్లలో తరతరాలుగా అంటే తాతముత్తాతల నుంచి వస్తున్న సేమ్ జీన్స్‌తో కొన్ని జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే రిస్క్ లేకపోలేదు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు జరిగినప్పుడు కొన్ని రెసెసివ్ జెనెటిక్ వ్యాధులను చూస్తాం. మేనరికం పెళ్లిళ్లలో కాగ్నీషియల్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే లోపాలు రెండు.. మూడు రెట్లు ఎక్కువ. మీరు కౌన్సెలింగ్ వెళ్లినప్పుడు మీ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో వంశపారంపర్యమైన జబ్బులు, డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయా అని మీ మీ కుటుంబాల ఆరోగ్య చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జన్యుపరమైన వ్యాధి ఉన్న కుటుంబసభ్యుల వ్యాధి నిర్ధారణ, ఆ జన్యువుకి సంబంధించి ఎలాంటి మ్యుటేషన్ ఉంది వగైరా వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది క్యారియర్‌గా కపుల్కీ ఉన్నట్టయితే అది పిల్లలకు వచ్చే రిస్క్ ఎంత ఉందో చెప్తారు క్యారియర్ టెస్టింగ్‌లో.. భవిష్యత్‌లో గర్భస్థ శిశువుకి చేసే శాంప్లింగ్ ద్వారా ఆ వ్యాధి బిడ్డకు వస్తుందా లేదా అని కూడా తెలిపే డిటెక్షన్ టెస్ట్స్ ఉంటాయి. పుట్టే పిల్లలకు అవకరాలు ఉండే రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ మూడవ నెల, అయిదవ నెలలో వైద్యపరీక్షలతో కనిపెట్టి గర్భస్రావం చేయించుకోమని సూచిస్తాం. అందుకే బేసిక్ టెస్ట్స్కి హాజరవడం చాలా అవసరం. సాధారణంగా మేనరికం పెళ్లిళ్లలో బెటా తలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా వంటివి ఎక్కువ. వీటిని పెళ్లిచేసుకునే జంటకు చేసే మామూలు రక్తపరీక్షతో కూడా కనిపెట్టి రిస్క్‌ను అంచనావేయొచ్చు. జన్యుపరమైన వ్యాధులకు చికిత్స లేదు.. నివారణ మాత్రమే చేయగలం. నాకు 43 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడంలేదు. స్కానింగ్ ద్వారా ఇంకెన్ని రోజుల్లో నాకు పీరియడ్స్ ఆగిపోవచ్చనేది తెలుసుకోవచ్చా? – జి. ప్రసన్నకుమారి, కోటగిరి మెనోపాజ్ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. మామూలుగా నెలలు ఆగి.. ఏడాది వరకూ రాకపోతే దాన్ని మెనోపాజ్‌గా పరిగణిస్తాం. పెరీమెనోపాజ్.. అంటే మెనోపాజ్ కంటే రెండుమూడేళ్లు ముందు.. వెనుక టైమ్ అన్నమాట. అండాశయాల్లో అండాలు తయారుకానప్పుడు పీరియడ్స్ ఆగిపోతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ బాగా తగ్గిపోతుంది. మెనోపాజ్‌కి సగటు వయసు 51 ఏళ్లు. నలభై అయిదేళ్లలోపు ఆగిపోతే ఎర్లీ మెనోపాజ్ అంటారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో గర్భసంచి లైనింగ్ పలుచగా ఉండడం, అండాశయాల్లో అండాలు లేదా ఫాలికిల్స్ లేకపోవడం.. మెనోపాజ్ అని చెప్పడానికి కొన్ని మార్గాలు.. సూచనలు. నిర్ధారించడానికి ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ అనే రక్తపరీక్ష చేసినప్పుడు అది 35 కన్నా ఎక్కువ ఉంటే మెనోపాజ్ అని నిర్ధారిస్తారు. కొన్నిసార్లు ఒంట్లోంచి వేడివేడి ఆవిర్లు, ఆ వెంటనే చెమటలు, మూడ్‌స్వింగ్స్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. నెలలు ఆగిపోయిన తర్వాత కూడా గర్భసంచి లైనింగ్ పలుచగా కాకుండా దళసరిగా అంటే 5ఎమ్ఎమ్ కన్నా ఎక్కువగా ఉంటే తర్వాత పరీక్షల కోసం సూచిస్తాం. దీనిని ఎండోమెట్రియల్ హైపర్ప్లాజియా అంటారు. అందుకే 40 నుంచి 45 ఏళ్లలోపు నెలసరి ఆగిపోతే టీఎస్‌హెచ్, థైరాయిడ్ పరీక్షలను కచ్చితంగా చేయించాలి. డా‘‘ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ఎయిడ్స్ విజృంభణ.. 3,380 మంది మృతి!
ఖమ్మం వైద్యవిభాగం : జిల్లాలో ఎయిడ్స్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ వ్యాధితో ప్రతీనెల మరణాలు నమోదవుతున్నాయి. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా నివారణ చర్యలు తీసుకుంటున్నా వ్యాధి వ్యాప్తి ఆగడం లేదు. అయితే, ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలు అంతగా లేకపోవటంతో వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రతీనెల 50కి పైగా హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవి అధికారిక లెక్కలు మాత్రమే! అనధికారికంగా చాలా మంది వ్యాధి బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా డిసెంబర్ 1న ఎయిడ్స్ డేగా జరుపుకుంటున్న నేపథ్యాన కథనం. 3,380 మంది బాధితులు మృతి జిల్లాలో ఎయిడ్స్ బారిన పడి మృతి చెందే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2006 నుండి ఇప్పటి వరకు 3,380 మంది మృతి చెందగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 310 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు 47,487 మందికి హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు జరపగా 310 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ఇందులో 28,105 గర్భిణుల్లో పరీక్షలు చేయగా11 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. అలాగే, 15 ఏళ్లలోపు పిల్లలు 80 మంది వ్యాధితో బాధపడుతున్నారు. కాగా, హెచ్ఐవీ బాధితుల కోసం జాగృతి, ఇతర స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ వారి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నాయి. ఇక జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కోసం నాలుగు ఐసీటీసీ కేంద్రాలు, 36 ఎఫ్‌ఐసీటీసీ కేంద్రాలు, ఒక ఏఆర్టీ కేంద్రం, రెండు లింక్ ఏఆర్టీ కేంద్రాలు, ఒక సురక్ష క్లినిక్, 9 రక్త నిధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే, కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యాన అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యాన మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి్సన ఆవశ్యకత ఉందని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 16,307 పాజిటివ్ కేసులు జిల్లాలో గత ఏడాది 15,995 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం సంఖ్య పెరిగింది. ఇప్పు డు జిల్లాలో 16,307 పాజిటివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ద్వారా తెలుస్తోంది. వీరు ఖమ్మం ఏఆర్టీ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకున్న వారే కాగా, పేర్లు నమోదు చేసుకోని వారి కూడా ఉంటారని సమాచారం. ఎయిడ్స్ వ్యాధి సోకిన వారిలో ప్రతీనెల క్రమం తప్పకుండా 6,160 మంది మందులు వాడుతుండగా, 2,780 మంది పెన్షన్ పొందుతున్నారు. తెలంగాణలో ఎయిడ్స్ బాధితుల్లో హైదరాబాద్, మహబూబ్‌నగర్ తర్వాత ఖమ్మం మూడో స్థానంలో ఉండడం గమనార్హం. ఎయిడ్స్‌ను తరిమికొట్టేందుకు కృషి జిల్లా నుంచి ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. వ్యాప్తిని అరికట్టేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. మందుల కొరత లేకుండా చూస్తూ, బాధితులందరూ మందులు వాడేలా చూస్తున్నాం. పీహెచ్‌సీలకు వచ్చే వారిలో 10 శాతం తక్కువ కాకుండా హెచ్ఐవీ టెస్టులు చేయిస్తున్నాము. ర్యాలీలు, కళాజాతాల ద్వారా ఎయిడ్స్ వ్యాధి తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ ఎల్. ప్రవీణ, అడిషనల్ డీఎంహెచ్ఓ, ఎయిడ్స్ అండ్ లెప్రసీ -
ఈ వయసులో పిల్లలను కనడం ఆరోగ్యకరమేనా?
నాకు 38ఏళ్లు. కెరీర్ గొడవలో పడి పిల్లలను కనడాన్ని వాయిదా వేసుకున్నాం. ఇప్పుడు కావాలనుకుంటున్నాం. ఈ వయసులో పిల్లల్ని కనడం ఆరోగ్యకరమేనా.. నాకు.. పుట్టబోయే బిడ్డక్కూడా? – వి. ప్రత్యూష, జామ్‌నగర్ 35 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గర్భాన్ని అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ మధ్య చాలామందిని ఈ లేట్ ప్రెగ్నెన్సీస్తో చూస్తున్నాం. కెరీర్ గ్రోత్ కోసం జాబ్ ప్రయారిటీస్, టార్గెట్స్ వల్ల చాలా మంది ప్రెగ్నెన్సీ – చైల్డ్బర్త్ని వాయిదా వేసుకుంటున్నారు. కానీ వయసు దాటిన తరువాత వచ్చే ప్రెగ్నెన్సీలో ఇటు తల్లికీ.. అటు బిడ్డకూ సమస్యలు తలెత్తుతాయి. లేట్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్, హై బీపీ చాన్సెస్ పెరుగుతాయి. ఏఆర్టీ ఆర్టిఫీషియల్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరిగినందువల్ల లేటు వయసు అంటే 40– 45ఏళ్లకూ గర్భం దాల్చే పరిస్థితులను చూస్తున్నాం. అయితే 35 ఏళ్లు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే.. పుట్టబోయే బిడ్డకు జెనెటిక్, క్రోమోజోమల్ రిస్క్ పెరగటం, డౌన్‌సిండ్రోమ్ వంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ చాన్సెస్ పెరగడం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, నిలలు నిండకుండానే ప్రసవం, మాయ (ప్లెసెంటా)లో మార్పులు రావడం, బీపీ, సుగర్ అటాక్ వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. సీజేరియన్ డెలివరీ చాన్సెస్ కూడా పెరుగుతాయి. ఏఆర్టీ ద్వారా అంటే ఐవీఎఫ్, ఐవీఐకి ప్రయత్నించినప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్విన్స్, ట్రిప్లెట్స్ ఉండే అవకాశాలూ పెరుగుతాయి. వీటితో ఉండే సమస్యలూ ఎక్కువవుతాయి. ఇలాంటి కాంప్లికేషన్స్ ఏవీ లేకుండా.. సుఖ ప్రసవంలో పండండి బిడ్డను కనాలనుకుంటే ప్రీప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్‌కి హాజరవ్వాలి. ముందుగానే బీపీ, సుగర్ ఉన్నట్టయితే నియంత్రణలో ఉంచుకోవాలి. బరువు బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉంటే తగ్గే ప్రయత్నాలు చేయాలి. ఫోలిక్ యాసిడ్ 5ఎమ్జీ మాత్రలు మూడు నెలల ముందునుంచే మొదలుపెట్టాలి. ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించుకోవాలి. 35 ఏళ్లు దాటితే ఫెర్టిలిటీ చాన్సెస్ కూడా తగ్గుతాయి. మీకు 38 ఏళ్లు అంటున్నారు కాబట్టి మీరు వెంటనే ఒక గైనకాలజిస్ట్‌ను కలసి జనరల్ చెకప్ చేయించుకోండి. కౌన్సెలింగ్ చేసినప్పుడు వేరే డీటైల్స్‌ను కూడా గమనిస్తారు. నేనొక ఎమ్ఎన్సీలో మేనేజర్ స్థాయిలో పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నాను. అయితే పిల్లలకు సంబంధించి బయాలాజికల్ క్లాక్ గురించి కాస్త టెన్షన్‌గానే ఉంది. అలాగని ఉద్యోగాన్నీ వదులుకోలేను. సో నేను ఎగ్ ఫ్రీజింగ్‌కి వెళ్లొచ్చా? ప్రీజ్ అయిన ఎగ్స్ వల్ల పిల్లలు ఆరోగ్యంగానే పుడతారా? – సీహెచ్. సౌమ్య, పుణె ఎగ్ ఫ్రీజింగ్‌ను ‘ఊసైట్ క్రయోప్రిజర్వేషన్ (oocyte cryopreservation) అంటారు. ఈ ప్రక్రియలో అండాలను అండాశయాల నుంచి సేకరించి ఫ్రీజ్ చేసి.. ‘వా ఫెర్టిలైజ్డ్ స్టేట్(vafertilised state)'’లో ఉంచుతారు. భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు ఫెర్టిలైజేషన్‌కి యూజ్ చేసి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేలా చూస్తారు. ఇంతకుముందు 38–40 ఏళ్ల వయసు అమ్మాయిలు ఈ ప్రక్రియను ఎక్కువగా యాప్ట్ చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు జీవనశైలి మారడం వల్ల చాలా మంది ఆడవాళ్లలో ఊసైట్ క్వాలిటీ త్వరగా తగ్గిపోతోంది. అందుకే ఇప్పుడు 30 – 35 ఏళ్లక్కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేనివాళ్లు ఈ ప్రక్రియ ద్వారా ఆరోగ్యకరమైన అండాలను ఫ్రీజ్ చేసుకునే ఆప్షన్‌ను చాలా ఆసుపత్రులు కల్పిస్తున్నాయి. ఇలా ఫ్రీజ్చేసిన అండాలను పదేళ్ల వరకూ వాడుకోవచ్చు. అయితే 35 ఏళ్లు దాటితే ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కనుక దాన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. అంతేకాదు ఎగ్స్ ఫ్రీజింగ్ ప్రక్రియలో కూడా కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఫ్రోజెన్ ఎగ్స్ , క్రయోఫీజింగ్ ప్రాసెస్‌లో కొన్నిసార్లు డామేజ్ కావచ్చు. కంటామినేషన్ రిస్క్ ఉంటుంది. అండాలను అండాశయాల నుంచి తీసే సమయంలో ఆ ప్రక్రియకు సంబంధించిన కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఉదాహరణకు పొట్టలో పేగులు, రక్తనాళాలకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ అండాలను సేకరించడానికి ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల కొంతమందికి పొట్టలో నొప్పి, ఛాతీ నొప్పి తలెత్తవచ్చు. అయిదు శాతం మందిలో ఇలాంటివి చూస్తాం. ఇవి మందులతో తగ్గిపోతాయి. కానీ 0.1 శాతం కేసుల్లో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. బ్లడ్ క్లాట్స్, ఛాతీలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఫ్రోజెన్ ఎగ్స్‌తో వచ్చే ప్రెగ్నెన్సీలో బిడ్డకు పుట్టుకతో వచ్చే డిఫెక్ట్స్.. సాధారణ ప్రెగ్నెన్సీ ద్వారా పుట్టే బిడ్డకు ఎంత చాన్స్ ఉంటుందో అంతే చాన్స్ ఉంటుంది. కేవలం ఫ్రీజింగ్ ఎగ్స్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే వైకల్యాలు అంటూ ఏమీ ఉండవని పరిశోధనల్లో తేలింది. ఫ్రోజెన్ ఎగ్స్‌తో ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే చాన్సెస్ 30 శాతం నుంచి 60 శాతం వరకు ఉంటుంది. అది కూడా ఎగ్స్‌ను ఫ్రీజ్ చేసే సమయంలో మీ వయసును బట్టే. అయితే ఇక్కడ మీ విషయంలో మీరు మీ ఉద్యోగరీత్యా మీ ఎగ్స్‌ను ఫ్రీజ్ చేయాలనుకుంటున్నారు. దీనిని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. సాధారణంగా క్యాన్సర్ బాధితుల్లో కీమె థెరపీ వల్ల అండాశయాలు ఎఫెక్ట్ అవుతాయి. దాంతో భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. అలాంటి వారి విషయంలో ప్రెగ్నెన్సీకి మిగిలి ఉన్న ఏకైక మార్గం.. ఎగ్ ఫ్రీజింగ్. సోషల్ రీజన్స్‌కి ఎగ్స్ ఫ్రీజింగ్ చేసినప్పుడు దాన్నుంచి వచ్చే కాంప్లికేషన్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది మరి. -
సాక్స్ అలా ఉంటే చాలా ప్రమాదకరం.. ఏం జరుగుతుందో తెలుసా..?
పాదరక్షలు ఫుల్ షూస్, హాఫ్ షూ, బెల్ట్ షూ, పీప్ టోస్, వెడ్జెస్, శాండల్స్... ఏ రకమైనా సరే సాక్స్ ధరించడం కామన్. సాక్స్ చాలా మందికి డైలీ రొటీన్లో భాగమైపోయాయి కూడా. అయితే సాక్స్ ఎంపికలో మనకు తెలియకుండానే జరిగిపోయే పొరపాట్లు అనేకం. సాక్స్ అంటే సెకండ్ స్కిన్ అని చెప్పాలి. ఎక్కువసేపు పాదాలను అంటిపెట్టుకునే ఉంటాయి. అందుకే అవి స్కిన్ ఫ్రెండ్లీగా ఉండాలి. సాక్స్ వదులుగా జారిపోతూ ఉంటే వెంటనే స్పందిస్తాం. సాక్స్ బిగుతుగా ఉంటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలంలో కానీ బయటపడవు. ఆ క్షణంలో తెలియదు కాబట్టి మనం ఏ మాత్రం పట్టించుకోం. చదవండి: సంక్రాంతికి వీటిని తినే ఉంటారు.. అయితే వాటి లాభాలు కూడా తెలుసుకోండి! పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటాం. సాక్స్ మరీ టైట్‌గా ఉంటే పాదం, వేళ్ల కదలికలు తగ్గిపోతాయి. అది రక్తప్రసరణ మీద ప్రభావం చూపిస్తుంది. కండరాల కదలికలు, రక్తప్రసరణ వేగం తగ్గిపోతూ ఉంటే చర్మం కూడా జీవం కోల్పోతుంటుంది. అందుకే సాక్స్ కాలివేళ్ల కదలికలను నియంత్రించకూడదు. సాక్స్ ధరించిన తర్వాత వేళ్లను సులువుగా కదిలించగలిగేటట్లు ఉండాలి. రకరకాల ప్రయత్నాల తర్వాత ఏదైనా ఒక కంపెనీ సాక్స్ సౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తే ఇక ఆ బ్రాండ్‌నే కొనసాగించడం మంచిది. ఇక పిల్లల విషయానికి వస్తే... పిల్లలకు ఉదయం స్కూలుకు వెళ్లేటప్పుడు వేసిన సాక్స్ సాయంత్రం ఇంటికి వచ్చేవరకు అలాగే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్స్ బిగుతుగా ఉండకూడదు. అలాగే సాక్స్ పాతవైపోయి వదులై జారిపోతున్నప్పుడు ‘ఆదివారం సెలవు రోజు వెళ్లి కొత్తవి కొందాం’ అనుకుని ఆపద్ధర్మంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేయడం జరుగుతుంటుంది. అలా రబ్బర్ బ్యాండ్‌తోనే రోజులు గడిపేస్తుంటారు. అది చాలా ప్రమాదం. తాత్కాలికంగా ఒకటి –రెండు రోజులు వేసే రబ్బర్ బ్యాండ్ కూడా పిల్లల కాళ్ల మీద ఒత్తిడి పడి చర్మం ఎర్రబడేటట్లు ఉండకూడదు. రక్తప్రసరణకు ఆటంకం కలిగించని విధంగా ఉండాలి. ఇంతకంటే తక్షణం కొత్త సాక్స్ కొనడమే ఉత్తమం. -
Baby Blues: పుట్టిన బిడ్డతో పాటే.. బేబీ బ్లూస్..
గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం అనేవి మహిళకు ఎంతో ఆనందాన్ని, మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. అదే సమయంలో కొన్ని శారీరక సమస్యలు కూడా తెచ్చిపెడతాయి. ప్రసవానంతరం 3/4 రోజుల స్వల్ప వ్యవధిలో వచ్చే ఈ తరహా సమస్యలను బేబీ బ్లూస్‌గా పేర్కొంటారు. దీని గురించి అపోలో స్పెక్ట్రా ఆసుపత్రులకు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డా.మేఘాజైన్ అందిస్తున్న సూచనలివి... దీర్ఘకాలం ఉంటే... హార్మోన్లలో హెచ్చుతగ్గులు తద్వారా వచ్చే ప్రవర్తనా పరమైన మార్పులు, కొంత ఆందోళన తల్లల్లో కనిపించడమే ఈ బేబీ బ్లూస్. సాధారణంగా ఈ తరహా సమస్యలు 10రోజుల్లోగా సర్ధుకుంటాయి. అయితే 2 వారాలకు పైగా కూడా ఉంటే... వీటని ప్రసవానంతర డిప్రెషన్‌గా వ్యవహరిస్తారు. ఆ డిప్రెషన్ తీవ్రతను బట్టి పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. నిద్రలేమి/అతినిద్ర మొదలుకుని తీవ్రమైన అలసట, శక్తి హీనంగా అనిపించడం, ఏకాగ్రత లోపించడం, మతిమరపు, ఆత్మవిశ్వాసం లోపించడం, పుట్టిన బిడ్డ మీద కూడా ఆసక్తి కనపరచకపోవడం..వంటివి ఉంటాయి. ప్రసవానంతర ఒత్తిడి, బ్రెస్ట్ ఫీడింగ్‌కి సంబంధం... అమ్మ పాలను మించిన అమృతం లేదని మన పెద్దలెప్పుడో చెప్పినట్టుగానే ఇప్పుడు ఆధునిక వైద్య ప్రపంచం కూడా తల్లిపాలను పిల్లలకు అందివ్వడాన్ని ప్రోత్సహిస్తోంది. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల పుష్కలమైన పోషకాలు లభించి, బిడ్డకు అవసరమైన శక్తియుక్తులకు బలమైన పునాది పడడంతో పాటు ఇది తల్లి ఆరోగ్యానికి కూడా ఇతోధికంగా సహకరిస్తుందనేది నిస్సందేహం. తల్లిపాలు ఫీల్ గుడ్ హార్మోన్‌గా పిలవబడే ఆక్సిటోసిన్ విడుదలకు కారణమవుతాయి. అంటే... ప్రసవానంతర ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహకరిస్తుందని తెలుస్తోంది. అయితే ఒకసారి ప్రసవానంతర డిప్రెషన్‌కు లోనవడం జరిగితే... బ్రెస్ట్ ఫీడింగ్ పట్ల తల్లులు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవడం కీలకం. కొన్ని సార్లు బంధువులు, సమాజం కోసమే తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్‌కు బలవంతంగా అంగీకరించడం వారిలో డిప్రెషన్‌ను మరింత పెంచుతుంది. కాబట్టి తల్లికి కౌన్సిలింగ్‌తో పాటు ప్రత్యామ్నాయాల సూచన కూడా చికిత్సలో భాగం అవుతాయి. గతంలో డిప్రెషన్‌కు గురైన దాఖలాలు ఉన్నా, తమ కుటుంబంలో ఎవరైనా ప్రసవానంతర మానసిక సమస్యలు చవిచూసి ఉన్నా, దీని గురించి జనరల్ ప్రాక్టీషనర్‌తో గర్భం దాల్చిన వెంటనే మాట్లాడాలి. ప్రసవానంతర ఒత్తిడి దరి చేరకుండా కొన్ని నివారణ మార్గాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, తరచుగా కుటుంబ సభ్యులు, స్నేహితులు,తమ వైద్యునితో ముచ్చటించడం, సన్నిహితులతో కలిసి మంచి ప్రదేశాలలో కాలం గడపడం, గర్భిణిలను స్నేహితులుగా మార్చుకోవడం వంటివి కూడా మేలు చేస్తాయి. –మేఘాజైన్, క్లినికల్ సైకాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, కొండాపూర్ -
కోలుకుంటున్న శశికళ
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌తో విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దివంగత తమిళనాడు సీఎం జయలలిత ప్రియ స్నేహితురాలు వీకే శశికళ నటరాజన్ కోలుకుంటున్నట్లు విక్టోరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వారు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం శ్వాస సాధారణ స్థితికి వచ్చిందని, అయినప్పటికీ ఆక్సిజన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు చెప్పారు. జ్వరం, కోవిడ్ లక్షణాలు తగ్గుముఖం పడుతున్నాయని వెల్లడించారు. ఆదివారం స్వల్పంగా ఆహారం తీసుకుని ఐసీయూలో వాకింగ్ చేశారని వైద్యులు తెలిపారు. చదవండి: శశికళకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక -
ఆ నొప్పి వెన్ను నుంచి వేళ్ల వరకు
ఓ వయసు దాటాక వెన్నెముకలోని మెడ దగ్గర ఉండే ఎముకలుఅరిగిపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతుంటుంది. మెడ దగ్గరనొప్పి భుజం నుంచి మోచేతి మీదుగా వేళ్లకూ పాకుతూ చికాకు పెడుతుంటుంది. నొప్పి, తిమ్మిరులతో ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి చేయి బలహీనంగా అయినట్లుగానూ అనిపిస్తుంది. ఈ సమస్య పేరే సర్వైకల్ స్పాండిలోసిస్. జీవనశైలి, పని ప్రదేశం (వర్క్‌ప్లేస్)లో కూర్చునే భంగిమల వల్ల ఇప్పుడు చాలా త్వరగా వచ్చేస్తోంది. ఈ కారణంగా వెన్నుకు వచ్చే కొన్ని సమస్యలపై అవగాహన పెంచుకుందాం. అదే పనిగా సరైన తీరులో కాకుండా... ఇష్టం వచ్చినట్లు కూర్చోవడంతోపాటు వెన్నుమీద తీవ్రమైన ఒత్తిడి పడటం వల్ల డిస్కులు పక్కకు తప్పుకోవచ్చు. ఇలా వచ్చే సమస్యను సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. అంతేకాకుండా ఈ సమస్య చాలాకాలం పాటు కొనసాగినా లేదా వయసు మీరాక మెడలోని వెన్నెముకలు అరగడం వల్ల ఆ ఎముకల మధ్య ఉన్న నాడులపై ఒత్తిడి పడి వచ్చే సమస్యను సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. ఇటీవల దాదాపు అన్ని వర్గాల్లోనూ మెడమీద ఒత్తిడి తీవ్రమయ్యేలా చేసే ఉద్యోగాలు, వృత్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్య సర్వసాధారణమయ్యింది. అందుకే ఓ వయసు దాటాక వచ్చే సర్వైకల్ స్పాండిలోసిస్‌కు ముందర వచ్చే డిస్క్ప్రొలాప్స్లు పెరుగుతున్నాయి. అందుకే ఈ సమస్యల గురించి తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మెడ దగ్గరి ఎముకలనుతెలుసుకుందాం... మన మెడ భాగంలోని వెన్నెముకలో ఏడు ఎముకలు ఉంటాయి. వాటినే వరసగా సీ1, సీ2, సీ3, సీ4, సీ5, సీ6, సీ7గా చెబుతారు. ఈ ఎముకలు తలను నిటారుగా నిలబెట్టి ఉంచేందుకు ఉపయోగపడతాయి. మెడను అటు ఇటు తిప్పడానికి (ఫ్లెక్సిబుల్‌గా ఉంచేందుకు) ఉపయోగపడతాయి. లోపల ఉన్న వెన్నుపాము (స్పైనల్‌కార్డ్)ను కాపాడతాయి. ఆ ఎముకల మధ్య ఘర్షణ (ఫ్రిక్షన్) నివారించేందుకు ఎముకకూ, ఎముకకూ మధ్యన డిస్క్ ఉంటుంది. ఈ ఎముకల మధ్యనుంచి నరాలు బయటకు వచ్చి వేర్వేరు అవయవాలను చేరి వాటిని నియంత్రిస్తుంటాయి. మెడలోని ఈ వెన్నెముకలు ఎముకలు, లేదా వాటిమధ్యన ఉండే మెత్తలాంటి డిస్క్ అరుగుదల వల్ల, లేదా ఒక్కోసారి డిస్క్‌లు పక్కకు జరగడం వల్ల నరాలపై ఒత్తిడి పడి ఈ తిమ్మిరి, నొప్పి వస్తుంది. ఇలా డిస్క్‌లు పక్కకు తొలగడాన్ని సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. మెడలో ఉండే వెన్నెముకలు సీ1–సీ7 అరిగి, వాటి మధ్య ఉండే ఫేసెటల్ జాయింట్స్ కూడా అరిగి, రియాక్షన్‌గా ఆ అరిగిన మేరకు ఎముక పెరగడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. సాధారణంగా సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ కొద్దిగా యంగ్ ఏజ్‌లో వస్తుంది. ఇలాంటి డిస్క్ ప్రొలాప్స్ వల్ల దీర్ఘకాలికంగా అరుగుదల (డ్యామేజీ) జరిగితే అది సర్వైకల్ స్పాండిలోసిస్‌కు దారితీయవచ్చు. చికిత్స ప్రక్రియలివి... సర్వైకల్స్పాండిలోసిస్ కండిషన్ కనిపించిన రోగుల్లో జీవనశైలిలో మార్పులు తప్పనిసరిగా ప్రభావం చూపుతాయి. దాంతోపాటు ఫిజియోథెరపీ ప్రక్రియ వల్ల గణనీయమైన మెరుగుదల కనిపించేందుకు అవకాశం ఉంది. ఇక కొన్ని నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్‌ఎన్‌ఏఐడీ) అని చెప్పే నొప్పి నివారణ మందులు వాడటం ఈ చికిత్సల్లో ఒక భాగం. వీటితోపాటు శస్త్రచికిత్స ద్వారా ఎముకలు అరిగిన, తొలగిన ప్రాంతంలో సరిచేయడం చివరగా చేసే చికిత్స ప్రక్రియ. జీవనశైలి మార్పులతో... మనం పనిచేసే చోట మెడపై తీవ్రమైన ఒత్తిడి పడకుండా చూసుకోవడం ప్రధానం. నిద్రపోయేప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు తలను సరైన భంగిమలో ఉంచడం, మెడ కండరాలపై అసమతౌల్యంగా బరువు పడుతుంటే నివారించడం వంటివి జీవనశైలిలో మార్పులు. గంటలకొద్దీ కూర్చుని పనిచేసే సాఫ్ట్వేర్ వంటి వృత్తుల్లో ఉన్నవాళ్లు తమ తల బరువు మెడపై అసహజమైన రీతిలో పడుతుంటే దాన్ని నివారించడం కూడా ముఖ్యం. ఫిజియోథెరపీ... మెడ కండరాలకు వ్యాయామాన్ని ఇవ్వడం ద్వారా వాటిని ఆరోగ్యకరంగా ఉంచుకోవడం మంచిది. దీనివల్ల వయసు పెరగడం వల్ల వెన్నెముక అరుగుదల ప్రక్రియ వేగంగా జరగకుండా చూడవచ్చు. ఫలితంగా ఈ అరుగుదలతో వచ్చే స్పాండిలోసిస్ అంత త్వరగా రాదు. కాబట్టి మెడ కండరాలకు వ్యాయామం అవసరం. ఇక ఈత వల్ల వెన్నెముకతోపాటు అన్ని కండరాలకూ తగినంత వ్యాయామం లభిస్తుంది. ఇలా వెన్నెముకతో పాటు మెడ కండరాలకు వ్యాయామం అందించేందుకు ఫిజియో థెరపీ ఉపయోగిస్తుంది. ఇందులోనూ రెండు దశల్లో ఫిజియోథెరపీ చికిత్స జరుగుతుంది. మొదటిది నొప్పి నివారణకు ఐఎఫ్‌టీ, అల్ట్రాసోనిక్ థెరపీ లేదా షార్ట్వేవ్ డయాథెర్మీ, రెండో దశలో మెడ, చేతులు, కాళ్లకు (లింబ్) ఎక్సర్సైజ్లు. ఇంటర్‌ఫెరెన్షియల్ థెరపీ (ఐఎఫ్‌టీ): ఈ ప్రక్రియలో ఒక రకం విద్యుత్తరంగాలను (వీటిని) ఉపయోగించి నొప్పి నివారణ చేస్తారు. శరీరంపై ఏదైనా గాటు లేదా గాయం ఉన్నవారికి లేదా పుండు వంటివి ఉన్నవాళ్లకు, గర్భిణులకు వీటిని ఉపయోగించరు. అల్ట్రాసోనిక్ థెరపీలో శబ్దతరంగాలను ఉపయోగించి చికిత్స చేస్తారు. ఇక షార్ట్వేవ్ తరంగాలను ఉపయోగించి కూడా నొప్పి నివారణ చేస్తారు. ఇది స్వల్పకాలికంగా జరిగే చికిత్స. ఇక రెండోదశలో మెడ, చేతులు, కాళ్లకు నిత్యం వ్యాయామం చేయించడం, దీర్ఘకాలం పాటు చేయించడం ద్వారా వాటిని మరింత దృఢతరం అయ్యేలా చూసి నొప్పి నివారణ జరిగేలా చూస్తారు. సాధారణంగా సర్వైకల్ స్పాండిలోసిస్‌కు ఫిజియోథెరపీ ప్రధానమైన చికిత్స ప్రక్రియలా పరిగణిస్తారు. సర్వైకల్ కాలర్: తల బరువు అరిగిన మెడ వెన్నెముకలు (సీ1 టు సీ7) వరకు పడుతుంటే ఆ బరువును వాటిపై పడకుండా చేసే ఒక ఉపకరణం ‘సర్వైకల్ కాలర్’. అయితే ఇది అంతగా ఉపయోగపడదు కూడా. పైగా ఈ ఉపశమనం చాలా తాత్కాలికం మాత్రమే కావడంతో కొందరు డాక్టర్లు దీన్ని సూచించరు కూడా. దానికి కారణాలూ ఉన్నాయి. ఉదాహరణకు సర్వైకల్ కాలర్‌ను కొన్ని సందర్భాల్లో నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు కొంతకాలం పాటు ఉపయోగిస్తారు. నొప్పి నుంచి ఉపశమనం కలగడం వల్ల అలా అదేపనిగా దాన్నే ఉపయోగిస్తూ ఉండటం వల్ల మెడ కండరాలు బలహీనపడి దానిపైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకే అది చాలాకాలం ఉపయోగించడం అంతగా సరికాదు. సర్వైకల్ ట్రాక్షన్: నరం దెబ్బతిన్నదని తెలిసినప్పుడు సర్వైకల్ ట్రాక్షన్‌ను అమర్చకూడదు. కేవలం ఎలాంటి నర్వ్ డ్యామేజీ లేదనుకున్నప్పుడే నొప్పి ఉన్న కొందరిలో దీన్ని ఉపయోగించి, ఉపశమనం పొందవచ్చు. శస్త్రచికిత్స... సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్‌లో... ఇతరత్రా ప్రత్యామ్నాయ మార్గాలు, సాంత్వన ప్రక్రియలు అవలంబించి కనీసం ఆరు నుంచి పన్నెండు వారాలు గడిచాక కూడా తగినంత ఉపశమనం లేకపోతే అప్పుడు శస్త్రచికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది. శస్త్రచికిత్సలు కంఠం ముందు భాగం నుంచీ కొన్ని, మెడ వెనక భాగం నుంచి చేసేవి... ఇలా రకరకాలుగా ఉంటాయి. డిస్క్ లేదా ఎముకల అరుగుదలతో నరాలమీద కలిగే ఒత్తిడి స్థానాన్ని బట్టి ఎటువైపు నుంచి శస్త్రచికిత్స చేయాలన్న విషయాన్ని నిర్ధారణ చేస్తారు. అయితే శస్త్రచికిత్స ఎటువైపునుంచి జరిగినా చివరిలక్ష్యం మాత్రం రోగికి నొప్పి నివారణ కలిగేలా చూడటమే. శస్త్రచికిత్స ముందువైపు నుంచి జరిగితే (అది చాలా చిన్న గాటుతో) డిస్కెసెక్టమీ రూపంలో చేస్తారు. ఐదు నుంచి ఎనిమిది మిల్లీమీటర్ల గాటు పెట్టి డిస్క్‌ను తొలగిస్తారు. రోగి తుంటిఎముక నుంచి తొలగించిన భాగాన్ని (మనం చేత్తో తడిమినప్పుడు తుంటి వద్ద పొడుచుకు వచ్చినట్లు కనిపించే ఎముక) ఆ డిస్క్‌ను తొలగించిన చోట అమరుస్తారు. లేదా దీనికి బదులు డిస్క్ తొలగించిన ఆ గ్యాప్‌లో టైటానియం లోహంతో చేసిన ఒక డిస్క్‌ను అమర్చుతారు. దీన్ని ఎలా అమర్చాలన్న దాన్ని రోగికి అవసరమేమిటన్న అంశంపై డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. అంటే.. ఇక్కడ జరిగే ప్రక్రియ ఒక్కటే. గతంలో ఎముకల భారం పడే డిస్క్ భాగాన్ని తొలగించి శస్త్రచికిత్స తర్వాత మెడ కదలికలతో పడే ఒత్తిడి అక్కడి చాలా కండరాలు ఆ భారాన్ని తీసుకునేలా చూస్తారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలివి... సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలతో పాటు స్పర్శజ్ఞానం కోల్పోయినట్లు అనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించడం తప్పనిసరి. సాధారణ ఎక్స్–రే వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి తెలిసిపోతుంది. అదే సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అయితే ఎమ్మారై పరీక్షల వల్ల నిర్దిష్టంగా డిస్క్‌లు, వెన్నుపాము, నరాల పొజిషన్ వెన్నుపాము వ్యవస్థపై ఎముకల అరుగుదల, డిస్క్‌ల అరుగుదల వల్ల పడుతున్న ప్రభావం... ఇవన్నీ ఎమ్మారైలో స్పష్టంగా తెలుస్తుంది. సీటీ స్కాన్ అయితే కాస్తంత పరిమితమైన వివరాలే తెలుస్తాయి. అవి కూడా కొందరు పేషెంట్లలోనే కొంతమేరకే తెలుస్తుంది. డాక్టర్నుకలవాల్సిందెప్పుడు...? మెడ నొప్పి వచ్చినప్పుడు సాధారణంగా కొందరు పెయిన్‌కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం తప్పే అయినా... అలా పెయిన్‌కిల్లర్ వేసుకున్నా ఆగకుండా అదేపనిగా నొప్పి వస్తున్నప్పుడు, ఆ నొప్పి వారం రోజుల తర్వాత కూడా తగ్గకపోతే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ కారణంగా వచ్చే అని అనుమానించాల్సి ఉంటుంది ∙నొప్పి ఒకే చోట లేకుండా చురుక్కుమంటూ భుజానికిగాని, ఇతర అవయవాలకు గాని పాకుతూ ఉన్నట్లుగా అనిపించడం కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణమే ∙పై లక్షణాలతో పాటు నీరసంగా ఉండి చేతులు గాని, కాళ్లు గాని తిమ్మిరి పట్టినట్లుగా ఉండవచ్చు ∙కాళ్లు లేదా చేతులు బిగదీసినట్లుగా (స్టిఫ్నెస్తో) ఉండవచ్చు ∙మెడలో ఇబ్బందిగా (టెండర్నెస్) కూడా ఉండవచ్చు ∙శరీరంలో ఎక్కడైనా స్పర్శజ్ఞానం కోల్పోయినట్లుగా అనిపిస్తే... ఈ లక్షణాలన్నీ సర్వైకల్ స్పాండిలోసిస్ను సూచిస్తాయి. సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలివి... మెడ నొప్పిగా ఉంటుంది. మెడను మునుపటిలా ఫ్రీగా తిప్పడం సాధ్యం కాకపోవచ్చు ∙మన దేహంలోని వివిధ అవయవాలను నియంత్రించి నరాలపై ఒత్తిడి పడటం వల్ల ఆ అవయవాలు సైతం నొప్పికి గురి కావడం, ఉదాహరణకు భుజం, మోచేయి, చేతి వేళ్లు లాంటివి ∙చేయి, వేళ్లు, కొన్ని సందర్భాల్లో కాళ్లు తిమ్మిరి పట్టినట్లు అనిపిస్తుంటుంది ∙పరిస్థితి తీవ్రమైన కొందరిలో కాళ్లు బిగదీసుకుపోయినట్లు (స్టిఫ్నెస్) కూడా అనిపించవచ్చు ∙నడవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది ∙కొందరిలో ఈ లక్షణాలు నెమ్మది నెమ్మదిగా క్రమంగా వస్తే మరికొందరిలో ఒక్కసారిగా కనిపించవచ్చు. డాక్టర్ టి.దశరథ రామారెడ్డిసీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్,యశోద హాస్పిటల్స్,సోమాజిగూడ, హైదరాబాద్ -
వెల్కం టు హెల్త్ విలేజ్
సాక్షి, సిద్దిపేట: భవిష్యత్తులో ప్రతి గ్రామంలోని ప్రజలు పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా మారి ఆరోగ్య గ్రామంగా ‘వెల్కమ్ టూ హెల్త్ విలేజ్’ అనే బోర్డులు పెట్టే స్థాయికి మనం చేరుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో సుమారు 200 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులుకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్న యోగా శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందులో భాగంగానే ముందుగా ప్రతి గ్రామంలో, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరి యోగాను అచరించాలన్నారు. నిజమైన అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే అన్నారు. ఆరోగ్యంగా ఉండి చేతి నిండా పని లభించి సుఖంగా, సంతోషంగా ఉన్నప్పుడే అది నిజమైన అభివృద్ధిగా భావించాలన్నారు. ప్రతి గ్రామానికి ఇది ఆరోగ్య గ్రామం అనే బోర్డులు పెట్టే రోజులు రావాలన్నారు. ఇప్పుడు సమాజాన్ని రెండు వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయని వాటిలో ఒకటి సెల్‌ఫోన్ కాగా మరొకటి మద్యం అన్నారు. యువత శక్తిసామర్థ్యాలను నిర్వీర్యం చేస్తూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నాయన్నారు. సమాజంలో ఒక మార్పును తెచ్చే దిశగా జరుగుతున్న ప్రక్రియకు సిద్దిపేట నియోజకవర్గం నాందిగా నిలవాలన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక తెలంగాణ ఉద్యమం సమయంలో జిల్లాలు, జైల్లు, కోర్టులు చుట్టు తిరగడం జరిగిందని ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశానన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్ల మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ అంటూ చెట్లు, గుట్టలు, పుట్టలు, వాగులు, వంకలు తిరిగానన్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని, దగ్గరుండి ప్రజల బాగోగులు చూసుకునే అవకాశం కలగడం అదృష్టంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం యోగ, పేద విద్యార్థుల కోసం ట్యూషన్, ప్రతి గ్రామంలో ఉచిత అంత్యక్రియలు ఇలా అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో యోగ, ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమాజంలో మార్పు కోసం గ్రామాలలో ఉదయం యోగ తరగతులను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా ప్రతి ఇంటిలో తులసి, వేప మొక్కలను తప్పనిసరిగా పెంచాలన్నారు. గ్రామాలు అపరిశుభ్రంగా మారకుండా ఉండేందుకు గొర్రెలు, బర్రెలు ఆరోగ్యంగా ఉండేందుకు వాటికోసం హాస్టల్స్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇబ్రహీంపూర్ గ్రామాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో యోగ తరగతులను నిర్వహించే క్రమంలో ముందుగా శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీవితంలో ఒక భాగంగా యోగాను గుర్తించాలన్నారు. యోగ ద్వారా కలిగే లాభాలను తెలుసుకున్న తర్వాతే విద్యార్థులకు యోగాసనాలు సులభంగా నేర్పే అవకాశం కలుగుతుందన్నారు. అంతకు ముందు జెడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, రాష్ట్ర యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బ్రిజ్ బూషన్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవికాంత్‌రావు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, ఎంఈఓలు,ఉపా«ధ్యాయలు పాల్గొన్నారు. -
బాబు ఇంకా పక్క తడుపుతున్నాడు
పేనుకొరుకుడుకు చికిత్స ఉందా? :మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. ఈమధ్య ఒకేదగ్గర వెంట్రుకలు రాలిపోతున్నాయి. అందరూ పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? – శ్రీలక్ష్మి, యాప్రాల్ పేనుకొరుకుడు సమస్యను వైద్యపరిభాషలో అలొపేషియా అంటారు. ఈ కండిషన్లో ఒక నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, నున్నగా మారుతుంది. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. అలాంటప్పుడు చాలాసార్లు తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. ఇది తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగాని ఇది రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య కనిపించదు. కారణాలు: ∙మానసిక ఆందోళన ∙థైరాయిడ్ సమస్య ∙డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది ∙వంశపారంపర్యంగా ∙కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు: ∙తలపై మొత్తం జుట్టు ఊడిపోయి, బట్టతల లక్షణాలు కనిపిస్తాయి. తలపై అక్కడక్కడ గుండ్రంగా ప్యాచ్‌లలా జుట్టు ఊడిపోతుంది ∙సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతితో ఈ ప్యాచ్‌లు ఉంటాయి. నిర్ధారణ: ఈ సమస్య నిర్దిష్టంగా ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్ పరీక్షలు, పిగ్మెంట్ ఇన్‌కాంటినెన్స్ వంటివే మరికొన్ని పరీక్షలు. చికిత్స: పేనుకొరుకుడు సమస్యకు హోమియోలో మంచిమందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు వ్యాధి కారణాలు, లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు.దీనికి హోమియోలో యాసిడ్ ఫ్లోర్, సల్ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలీనియమ్, సొరినమ్, తుజా వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. -డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ బాబుఇంకా పక్క తడుపుతున్నాడు మా బాబు వయసు 13 ఏళ్లు. చిన్న వయసు నుంచి రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటు ఉంది. ఇప్పటికీ ఇది ఆగలేదు. ఈ సమస్య వల్ల బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించే అవకాశం ఉందా?– ఎమ్డీ. రమీజా, గుంటూరు మీ బాబు రాత్రుళ్లు నిద్రలో పక్క తడిపే ఈ అలవాటును వైద్య పరిభాషలో నాక్చర్నల్ ఎన్యురెసిస్ అంటారు. ఈ సమస్యతో బాధపడే పిల్లలు, వారి తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఈ సమస్య చిన్న పిల్లల్లోనే గాక కొంతమంది పెద్దల్లోనూ ఉంటుంది. సాధారణంగా పిల్లల్లో రాత్రి సమయంలో మూత్రవిసర్జనపై అదుపు అన్నది రెండు నుంచి ఐదేళ్ల వయసులో వస్తుంటుంది. కానీ ఐదు శాతం మంది పిల్లల్లో పదేళ్ల వయసు తర్వాత కూడా మూత్రవిసర్జనపై అదుపు సాధించడం జరగకపోవచ్చు. ఐదేళ్ల వయసు తర్వాత కూడా తరచూ పక్కతడిపే అలవాటు ఉండటాన్ని ప్రైమరీ ఎన్యురెసిస్ అంటారు. సాధారణంగా ఇది కొన్నాళ్లలోనే తగ్గిపోతుంది. ఎదుగుదల సమయంలో వచ్చే లోపం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. అయితే కొంతమంది పిల్లలు పక్కతడపడం మానివేశాక, మళ్లీ ఆర్నెల్ల తర్వాత సమస్య తిరగబెట్టవచ్చు. ఇంతకుముందు పక్కతడపకుండా ప్రస్తుతం మళ్లీ పక్కతడపడం మొదలుపెట్టినట్లయితే ఈ పరిస్థితిని ‘సెకండరీ ఎన్యురెసిస్’ అంటారు. కారణాలు: నాడీవ్యవస్థ ఎదుగుదల లోపాలు, జన్యుపరమైన సమస్యలు (ముఖ్యంగా డౌన్‌సిండ్రోమ్), ఇన్ఫెక్షన్లు, మూత్రాశయం సమస్యలు, కొందరిలో వంశపారంపర్య కారణాల వల్ల ఈ సమస్య కనిపిస్తుండవచ్చు. ఇంకొంతమంది పిల్లల్లో కండరాలు ఎక్కువసార్లు అనియంత్రితంగా సంకోచం చెందడం వంటి కారణాలతోనూ ఈ సమస్య కనిపించవచ్చు. టైప్–1 డయాబెటిస్, మలబద్దకం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడటం వల్ల, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమంది పిల్లల్లో మానసిక ఒత్తిడి, భయం వల్ల కూడా రాత్రివేళలో తమకు తెలియకుండానే మూత్రవిసర్జన జరిగిపోవచ్చు. చికిత్స: పక్క తడిపే పిల్లలను తిట్టడం, వాళ్లకు శిక్షలు విధించడం వల్ల పిల్లలు మరింత కుంగిపోయి సమస్య మరింత జటిలం అవుతుంది. ఇలా పిల్లలను మందలించడం వల్ల ప్రయోజనం చేకూరదు సరికదా... కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ పిల్లలను దండించకూడదు. హోమియో చికిత్సతో పిల్లల్లో ఈ అలవాటు పూర్తిగా మాన్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.-డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్ హోమియోపతి, హైదరాబాద్ బాబుకుఆటిజమ్...చికిత్ససూచించండి మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి.– డి. రాగిణి, వరంగల్ ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య.యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ∙అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ∙నలుగురిలో కలవడలేకపోవడం ∙ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది.డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
అమ్మాయికి మొటిమలు వస్తున్నాయి..?
నా జుట్టు బాగా పొడవుగా ఉంటుంది. అయితే ప్రతి ఏడాది వర్షాకాలం రాగానే అది బాగా పొడిబారిపోతోంది. చుండ్రు వల్ల తలంతా దురదగా కూడా ఉంటోంది. వర్షాకాలంలో కూడా నా జుట్టు బాగుండాలంటే ఏం చేయాలో దయచేసి సూచించండి.– ఎమ్. ఉదయలక్ష్మి, కాకినాడ మీ జుట్టు పొడిబారడం అనే సమస్యకు మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మీరు జుట్టుకు రోజువారీ వాడే ఉత్పాదనలు (హెయిర్ ప్రోడక్ట్స్) వంటి అంశాలు కారణమవుతాయి. మీరు రోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్ పాళ్లు తగ్గడం వల్ల జుట్టు పొడిబారే ప్రమాదం ఉంది. అలాగే వాతావరణంలో తేమ తగ్గినప్పుడు కూడా జుట్టు పొడిబారుతుంది. అంతేకాదు... అది తేలిగ్గా విరిగిపోయేలా (బ్రిటిల్గా) కూడా మారుతుంది. ఇలా అనేక అంశాలు మీ సమస్యకు కారణమవుతుంటాయి. మీ విషయానికి వస్తే మొదట మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు మీ జీవనశైలిని ఆరోగ్యకరమైన రీతిలో మార్పులు చేసుకోవడం, ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా దొరికేలా మీ ఆహారంలో మార్పులు చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాక మీరు మెడికేటెడ్ షాంపూ వాడటం మంచిది. మీ మాడు (స్కాల్ప్)తో పాటు మీ జుట్టు కండిషన్‌ను బట్టి మీరు వాడాల్సిన షాంపూను సూచించడం జరుగుతుంది. మీకు చుండ్రు కూడా ఉందంటున్నారు కాబట్టి... డాక్టర్ సూచించిన యాంటీడాండ్రఫ్ లోషన్ కూడా వాడాల్సి ఉంటుంది. చుండ్రుకు చికిత్స చేయకపోతే జుట్టు రాలిపోవడం అనే సమస్య అదేపనిగా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే పైన సూచించిన జాగ్రత్తలు పాటించడంతో పాటు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి. చర్మం పొడిబారకుండా ఉండాలంటే...? నాది బాగా పొడి చర్మం. నా చర్మం గురించి నేను చాలా శ్రద్ధ తీసుకుంటాను. కొద్దిరోజుల్లో నేను పైచదువుల కోసం కెనడాకు వెళ్లబోతున్నాను. అక్కడి వాతావరణానికి నా చర్మంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియదు. నా చర్మం పాడవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– సునయన, హైదరాబాద్ కెనడా వంటిచోట్ల వాతావరణం బాగా చల్లగా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం మరింత పొడిబారిపోయే ప్రమాదం ఉంది. సాధారణ సబ్బులు చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. కాబట్టి మీరు స్నానానికి స్కిన్ పీహెచ్ బ్యాలెన్స్ చేసే మెడికేటెడ్ సబ్బును వాడటం మంచిది. అలాగే మీరు మెడికేటెడ్ మాయిష్చరైజర్ వాడటం కూడా వాడాల్సి ఉంటుంది. దీనివల్ల మీ చర్మం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలతో మీరు మీ చర్మసౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అమ్మాయికి మొటిమలు వస్తున్నాయి మా అమ్మాయి వయసు 15 ఏళ్లు. ఆమెకు మొటిమలు వస్తున్నాయి. అవి పెరగకుండా ఉండేందుకు ఏమైనా జాగ్రత్తలు ఉంటే చెప్పగలరు.– పద్మ, నిజామాబాద్ టీనేజీలో హార్మోన్ల ప్రభావం వల్ల మొటిమలు రావడం చాలా సాధారణం. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మొటిమల తీవ్రతను తగ్గించవచ్చు. మొదటగా... ముఖం కడుక్కోడానికి సబ్బు కాకుండా, నాన్సోప్ బేస్డ్ క్లెన్సర్స్ వాడితే మంచిది. అలా చేయడం వల్ల చర్మం పీహెచ్ బ్యాలన్స్ అయ్యి, నూనె గ్రంథులు సరైన విధంగా పనిచేస్తాయి. ముఖం పైన ఏవైనా క్రీమ్స్గానీ లేదా ఇతర ఉత్పాదనలు (ప్రోడక్ట్స్)గానీ వాడే అలవాటు ఉంటే, అవి తప్పనిసరిగా నాన్–కామెడోజెనిక్ అని లేబుల్ చేసినవే వాడాలి. కొంతమందిలో హై గ్లైసిమిక్ ఇండెక్స్ (చక్కెరను తొందరగా విడుదల చేసే పిండిపదార్థాలు) కలిగిన పదార్థాలు తినడం వల్ల కూడా మొటిమలు ఎక్కువగా వస్తాయి. వాటికి దూరంగా ఉండటం లేదా వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొటిమల తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. అంతేకాదు... వాటి కారణంగా వచ్చే మచ్చలు (స్కారింగ్), పిగ్మెంటేషన్ని కూడా అదుపు చేయవచ్చు. చుండ్రు ఎందుకు వస్తుంది? నా వయసు 30 ఏళ్లు. నాకు జుట్టు నుంచి చుండ్రు విపరీతంగా రాలుతోంది. దాంతో నలుగురిలోకి వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంటోంది. యాంటీ–డాండ్రఫ్ షాంపూలు వాడుతున్నప్పటికీ ప్రయోజనం కనబడటం లేదు. అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుంది? దాన్ని తగ్గించడం ఎలా?– ప్రసాద్, సికింద్రాబాద్ చుండ్రు (డాండ్రఫ్) రావడానికి చాలా కారణాలు ఉంటాయి. సాధారణంగా చర్మంపై గల మలస్సేజియా అనే సూక్ష్మజీవి కారణంగా చర్మంపై రియాక్షన్ వచ్చి డాండ్రఫ్ వస్తుంటుంది. శరీరంలో నూనె గ్రంథులు (ఆయిల్ గ్లాండ్స్) ఎక్కువగా ఉండే చోట చుండ్రు ఎక్కువగా వస్తుంది. ఉదాహరణకు చర్మం (స్కాల్ప్), వీపుభాగం, ముఖం వంటి చోట్ల ఎక్కువగా వస్తుంటుంది. ఇలా శరీరం రియాక్ట్ అవ్వడానికి ఒత్తిడి (స్ట్రెస్), ఆహారపు అలవాట్లు, జీవనశైలి విధానాల వంటివి ముఖ్య కారణాలు. ఉప్పునీరు ఉపయోగించడం, కఠినమైన రసాయనాలు ఉన్న ఉత్పాదనలు వాడటం కూడా డాండ్రఫ్ పెరగడానికి కారణమవుతుంది. మీరు ఒకసారి డాక్టర్‌ను (చర్మవ్యాధి నిపుణులను) సంప్రదించండి. వారు మీకు తగిన / సరిపడే యాంటీ–ఫంగల్ లోషన్స్‌తో తగిన చికిత్సను సూచిస్తారు.డాక్టర్ సుభాషిణి జయం, కన్సల్టెంట్ మెడికల్ కాస్మటాలజిస్ట్, ఎన్ఛాంట్ మెడికల్ కాస్మటాలజీ క్లినిక్, శ్రీనగర్‌కాలనీ, హైదరాబాద్ -
నిద్ర.. ఎక్కువైనా, తక్కువైనా కష్టమే!
న్యూయార్క్: కొందరు ఎప్పుడూ అతిగా నిద్రపోతుంటారు. పైగా అధిక విశ్రాంతి తీసుకుంటున్నాం కదా. అరోగ్యానికి వచ్చే ఇబ్బందిలేదు అని భావిస్తారు. కానీ అది తప్పు అని తేలింది. సరిపడా నిద్ర పోకపోవడం మాత్రమే కాదు అతిగా నిద్రపోవడం కూడా ప్రమాదకరమేనని వైద్యులు అంటున్నారు. ఇప్పటిదాకా ఇటువంటి పరిస్థితుల వల్ల శారీరక అనారోగ్య సమస్యలు మాత్రమే తలెత్తుతాయని భావించారు. కానీ మానసికంగా కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. నిద్రలేమి, అతినిద్ర వల్ల రక్తంలో సి-రియాక్టివ్ ప్రోటీన్, ఇంటర్ ల్యూకేన్-6లు పెరిగిపోయి రక్తపోటు, టైప్-2 డయాబెటీస్‌తో పాటు గుండె సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ రెండు వ్యాపకాల వల్ల చిరాకు, కోపం, అసహనం, తీవ్ర భావోద్వేగానికి లోనుకావడం, కోరికలు పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని రీసెర్చర్స్ చెబుతున్నారు. ఈ సమస్యలను ఎదుర్కొంట్నునవారు తాము నిద్రపోయే గంటలలో మార్పులు అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మనిషికి సగటున 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు అంటున్నారు. దాదాపు 50 వేల మందిపై పరిశోధన చేసిన వైద్య బృందం ఈ విషయాలను వెల్లడించింది. -
మనుషులను, వాళ్ల మనస్తత్వాలను చదవడం ఇష్టపడతాను!
అక్కినేని దేవుణ్ని పెద్దగా నమ్మేవారు కాదు; అభిమానుల ఆశీర్వాదబలాన్ని మాత్రం నమ్మేవారు. అక్కినేని గుడికి వెళ్లేవారు కాదు; పరిశ్రమనే దేవాలయంగా భావించేవారు. ఆధ్యాత్మిక, ఆహార, అలవాట్ల విషయాల్లో ఆయనవైన పద్ధతులు ఉండేవి. నటనలోనే కాదు, వాటిలో కూడా ఆయన్ను రోల్‌మోడల్‌గా తీసుకోవచ్చు. కొన్నేళ్లక్రితం అక్కినేనితో వివిధ వ్యక్తిగత అంశాల మీద జరిపిన సంభాషణాసారం.. ఆరోగ్యం: మీ ఆరోగ్య రహస్యం ఏంటంటారు? 1. వారసత్వంగా వచ్చిన జీన్స్; 2. నిర్వహణ; 3. అభిమానుల ఆశీస్సులు! నిర్వహణ అంటే క్రమశిక్షణ, మితాహారం, సమయపాలన, ప్రతి విషయానికీ గాభరా పడకపోవడం... ఇవన్నీ! ఇక అభిమానుల ఆశీస్సులు కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. (నవ్వుతూ) లండన్‌లో బీబీసీ వాడి ప్రసారాలు ఇక్కడ మనం అందుకోవడం లేదూ... ఇదీ అంతే! మిమ్మల్ని భయపెట్టిన అనారోగ్యం ఏదైనా వుందా? (క్యాన్సర్‌ను గుర్తించకముందు చెప్పిన మాటలివి) అసలు ఇంతవరకూ తలనొప్పి, జ్వరం, కడుపునొప్పి ఎరగను! ఒక్క పన్నూ ఊడలేదు! ఒకే ఒక్కసారి అనారోగ్యం వచ్చింది. 1955లో కాశ్మీరులో ఉండగా స్మాల్‌పాక్స్ వచ్చింది. 1974 అక్టోబర్ 18న తొలిసారి బైపాస్ సర్జరీ జరిగింది. 1988లో రెండోసారి గుండెపోటు వచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలనుకుని, గుండె బలహీనంగా ఉండడంతో మానేశారు. ఆ ఆపరేషన్ అయ్యి నాలుగు దశాబ్దాలైంది. ప్రపంచంలోనే ఇంతవరకు ఎవరూ ఇలా ఆపరేషన్ అయ్యాక ఇన్నేళ్లు బతకలేదట! మనోబలాన్ని మించింది మరొకటి లేదు. అదే నా శక్తి! మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? ఉదయం 5 గంటలకు లేస్తాను. 45 నిమిషాలు మెడిటేషన్, వాకింగ్ చేస్తాను. తర్వాత పేపర్లు చదువుతాను. 1946 నుంచి దర్శక నిర్మాత బి.ఎన్.రెడ్డి సలహా మేరకు ‘హిందూ’ పేపరు కచ్చితంగా చదువుతున్నాను. ఆల్కహాల్ అలవాటు వుందా? నాకు మొదట్లో మందు అలవాటు లేదు. అయితే కొలెస్టరాల్‌ను కరిగించేందుకు ఆల్కహాల్ ‘వాసోడైలేటర్’గా పనిచేస్తుందని రోజుకు రెండు ఔన్సుల బ్రాందీ తీసుకోమన్నారు డాక్టర్లు. అప్పటినుంచీ తీసుకుంటున్నాను. ఆహారం: మీరు వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? ఇష్టపడే ఐటమ్స్? తిననివి? దాదాపు వెజిటేరియన్నే! మునుపు కొంచెం నాన్‌వెజ్ తినేవాణ్ణి కానీ ఇప్పుడు పూర్తిగా మానేశాను. ఒకప్పుడు వృత్తి మూలంగా లిమిట్లో తినాల్సి వస్తే, ఇప్పుడు ఆరోగ్యరీత్యా లిమిట్లో తినాల్సి వస్తోంది. గుత్తి వంకాయ కూరంటే ఇష్టం! అలాగే బెల్లంతో చేసిన పదార్థాలంటే ఇష్టం. ఇక ఇష్టపడనివంటే... వేపుళ్లు అస్సలు తినను! మీ డైలీ ఫుడ్ చార్ట్..? బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్స్ ఎక్కువగా వుండే పదార్థాలు, పాలు తీసుకుంటాను. వీటికి అదనంగా చిన్న పైనాపిల్ ముక్క, గ్లాసు మజ్జిగ! మధ్యాహ్నం సోయామిల్క్ తాగుతాను. మళ్లీ 11.30 నుంచి 12 గంటల మధ్య మజ్జిగ తీసుకుంటాను. ఇక లంచ్ విషయానికొస్తే ఒక చపాతీ, పులుసు కూర, ఇగురు కూర, సాంబారు, ఒక స్పూన్ అన్నం తింటా! రాత్రి మాత్రం కొద్దిగా అన్నం తీసుకుంటాను. దుస్తులు: సాధారణంగా ఎటువంటి దుస్తులు ఇష్టపడతారు? షాపింగ్ చేస్తారా? సినిమాల్లో రంగురంగుల బట్టలు వేసుకోవడం ఇష్టపడేవాణ్ణి కానీ, విడిగా ఖద్దరు ఇష్టం. అప్పుడప్పుడూ ప్యాంటూ షర్టూ వేస్తుంటాను. ఇక షాపింగ్ అంటారా... అమెరికాలాంటి దేశాలకెళితే తప్ప అస్సలు చేయను! ఫ్యాషన్లను పట్టించుకుంటారా? పట్టించుకుంటాను... కానీ అవి సినిమాల వరకే పరిమితం! ఈ పంచెకట్టు ఎప్పటినుంచి అలవాటు? సినిమాల్లోకి రాకముందు నాటకాలు వేస్తున్నప్పుడు ఓసారి వెయ్యి రూపాయలు సంపాదించాను. ఆ సమయంలో దుక్కిపాటి మధుసూధనరావుగారు, మరో ఇద్దరు బంధువులు కలిసి తలో ఐదువేల పెట్టుబడితో గుడివాడలో ‘జవహర్ ఖాదీబండార్’ పెట్టారు. ఆ షాపు ఓపెనింగ్ టైంలో ముగ్గురు కలిసి వ్యాపారం చేయకూడదని ఎవరో సెంటిమెంట్ పెట్టారు. దాంతో నా దగ్గరున్న వెయ్యి రూపాయలతో నేనూ ఒక భాగస్వామిగా చేరాను. అప్పుడు ఖద్దరు బట్టలు కొన్నాను. అప్పటినుంచీ పంచెలే అలవాటయ్యాయి. అప్పుడు నా వయసు పదిహేడేళ్లు. అన్నపూర్ణా స్టూడియో కట్టిన సమయంలో ప్యాంట్లు కుట్టించుకున్నాను. జూలై, ఆగస్టుల్లో గాలి ఎక్కువగా వీస్తుంది. అప్పట్లో స్టూడియో చుట్టుపక్కలంతా నిర్మానుష్యం కాబట్టి సుడిగాలులు వీచేవి. దగ్గరుండి పనులు చేయిస్తున్నప్పుడు ఈ గాలులు వల్ల పంచె ఎగురుతుండేది. దాంతో కంఫర్ట్ కోసం పది ప్యాంట్లు కుట్టించాను. అంతకుముందు నా జీవితంలో ప్యాంట్లు కుట్టించడమే ఎరుగను. నా కోసం అప్పట్లో ప్రత్యేకంగా పొందూరులో పంచె అంచెను డిజైన్ చేసేవారు. ‘నాగేశ్వరరావు అంచు’ అని దానికి పేరు. ఇప్పుడు హైదరాబాదులోనే కొంటున్నాను. ప్రస్తుతం సభలూ సమావేశాలకే పంచెను పరిమితం చేశాను. ఆడవాళ్లలో మీరు ఎటువంటి వస్త్రధారణను కోరుకుంటారు? చీరకంటే అందమైనది ఇంకేం ఉంది! ఒంపుసొంపులన్నీ చీరకట్టులోనే బాగా కనబడతాయి! పుస్తకాలు: మీరు పుస్తకాలు చదువుతుంటారా? చదవను! మనుషులను, వాళ్ల మనస్తత్వాలను చదవడం ఇష్టపడతాను. అయితే చిన్నప్పుడు మాత్రం శరత్ నవలలు చదివేవాణ్ణి. ఆధ్యాత్మిక గ్రంథాలు..? అస్సలు చదవను! నా ఆధ్యాత్మిక గ్రంథం సినిమానే! దేవాలయం ఇక్కడే వుంది... దేవుడూ ఇక్కడే వున్నాడు! ఇక వేరే ఆధ్యాత్మికత లేదు. మీరిష్టపడే సినీరచయితలు? చాలామంది ఉన్నారు. నీట్‌గా డైలాగ్‌లు రాయాలంటే సముద్రాల రాఘవాచార్యగారే! అలాగే ఆరుద్ర గారిది ఒక స్టయిల్. నాకెక్కువ ఆత్రేయగారే పనిచేశారు. ఇలా ఇంకా ఎంతోమంది అద్భుతమైన ప్రతిభావంతులు నాకెంతో జ్ఞానాన్నిచ్చారు! భక్తి: దేవుని ఉనికి గురించి..? ఎనభై లక్షల జీవరాశుల్లో గొప్ప జీవరాశి మానవుడు. అతణ్ణి మించిన శక్తిమంతుడు లేడు. అసలు నా దృష్టిలో మనకు మించిన శక్తిమంతుణ్ణి గౌరవించడమే ఆస్తికత్వం! నేను పెద్దవాళ్లను గౌరవిస్తాను, మంచితనం ఎక్కడుంటే అక్కడే భగవంతుడు ఉంటాడని నమ్ముతాను. అసలు దేవుడున్నాడా లేడా అనే మీమాంసను పక్కనపెడితే... ఆ భావన వల్ల్లే మానవుల్లో కనీసం ఈ మాత్రమైనా క్రమశిక్షణ ఉందనిపిస్తుంది. అయితే మీరు నాస్తికులనుకోవచ్చా? మనల్ని సృష్టించిన అమ్మానాన్నల్ని పూజించకుండా, ఎక్కడో వున్నాడనుకునే దేవుణ్ణి పూజిస్తాం. దేవుడు ఉన్నాడని అనుకోవడం తప్పనికాదు... అన్నీ తనే చూస్తాడులే అనుకుని అనేక పాపాలు చేసుకుంటూ పోవడమే మంచిది కాదు! వెళ్లి హుండీలో డబ్బు వేసేస్తే పాపాలు కడిగేస్తాడు అనుకోవడం పొరపాటు. నువ్వు చెడు చేయనంతవరకు దేవునిగురించి ఆలోచించనక్కర్లేదంటాను నేను! మీ హ్యాపీనెస్‌కి, హ్యాపీలైఫ్కి దేవుడు కారణం అనుకోవడం లేదా? వయసు పెరిగాక - ఆరోగ్యం, మనశ్శాంతి, కాలక్షేపం అనేవి అతిపెద్ద సమస్యలు. అయితే వీటిని మూడు ఆయుధాలతో తిప్పికొట్టవచ్చు. దేహాన్ని దేవాలయంగా చూసుకోవడంతో ఆరోగ్యాన్ని; తన చుట్టూ వున్న వాళ్లను ప్రేమిస్తూ, ప్రేమించబడటంతో మనశ్శాంతిని; దేనికి ఎంత సమయం కేటాయించాలనే సమయపాలన ద్వారా కాలక్షేప సమస్యను జయించవచ్చు. ఏ వయసులోనైనా మనిషి సుఖసంతోషాలతో హాయిగా జీవించాలంటే యుద్ధాలు, పోరాటాలు చేసి రాజ్యాలు జయించనవసరం లేదు. ఈ మూడు సూత్రాలను కచ్చితంగా పాటించడమే నా హ్యాపీనెస్‌కు, హ్యాపీలైఫ్కూ ఫార్ములా! - పులగం చిన్నారాయణ