బ్రెయిన్‌కు ట్యూమర్‌ ముప్పు | Brain Tumors In Children Explained: Here's The Warning Signs That You Should Know | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌కు ట్యూమర్‌ ముప్పు

Published Thu, Jun 13 2024 8:08 AM | Last Updated on Thu, Jun 13 2024 8:48 AM

Brain Tumors in Children:  Warning Signs You Should Know

    ప్రతి నెలా 40 మంది బాధితులు ఆస్పత్రులకు వస్తున్న వైనం 

    బాధితుల్లో చిన్నారులు, మధ్య వయస్సు వారు  

   ఎక్కువగా రెండో దశలోనే ఆస్పత్రికి వస్తున్న బాధితులు  

    అత్యాధునిక డయాగ్నోస్టిక్‌ సౌకర్యాలతో వ్యాధి గుర్తింపు  

    అవసరాన్ని బట్టి మందులు, శస్త్రచికిత్సలు  

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో బ్రెయిన్‌ ట్యూమర్‌ బాధితులు పెరుగుతున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ప్రతి నెలా 40 మంది వరకూ బ్రెయిన్‌ ట్యూమర్‌ బాధితులు వస్తున్నారు. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన బాధితులకు వైద్యులు బ్రెయిన్‌ స్కాన్‌ చేసి వ్యాధిని నిర్ధారించి, అవసరమైన చికిత్సలు, శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలో బ్రెయిన్‌ ట్యూమర్‌లు వచ్చేవని, ఇప్పుడు 15 ఏళ్ల చిన్నారులు, 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారిలోనూ బ్రెయిన్‌ ట్యూమర్స్‌ చూస్తున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. బ్రెయిన్‌ ట్యూమర్స్‌ రావడానికి అనేక కారణాలు ఉంటాయని,      చిన్న పిల్లల్లో జన్యుపరమైన లోపాలే కారణంగా వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధికి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని  పేర్కొంటున్నారు. 

నాలుగు దశల్లో వ్యాధి 
బ్రెయిన్‌ ట్యూమర్‌కు నాలుగు దశలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మొదటి దశలో తలనొప్పి, వాంతులు, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండోదశలో తీవ్రమైన తలనొప్పి, అకారణంగా వాంతులు, తలతిరగడం ఎక్కువగా         ఉంటాయి. మూడో దశలో బ్రెయిన్‌లోని ట్యూమర్‌ ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది. ఊపిరితిత్తులు, వెన్నుపూసలకు విస్తరిస్తుంది. లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయి. నాలుగోదశలో ట్యూమర్‌ కణాలు శరీరంలోని రక్తంలో కలిసి      అంతా వ్యాప్తి చెందుతుంది. ఈ దశలో రోగి      మరింత క్షీణిస్తాడు.

నిర్ధారణ ఇలా.. 
తలనొప్పితో వచ్చిన రోగికి సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్‌లు చేయడం ద్వారా బ్రెయిన్‌ ట్యూమర్‌ను నిర్ధారిస్తారు. ఒకప్పుడు బ్రెయిన్‌ ట్యూమర్‌ను నాలుగో దశ వచ్చే వరకూ గుర్తించే వారు కాదు. వ్యాధి నిర్ధారణ కాకముందే మరణించినవారు కూడా ఉన్నారు. ఇప్పుడు అత్యాధునిక డయాగ్నోస్టిక్‌ సేవలు అందుబాటులోకి రావడంతో తొలిదశలోనే గుర్తించగలుగుతున్నారు. ప్రస్తుతం       ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ సౌకర్యాలు, విస్తృతంగా స్కానింగ్‌ పరికరాలు అందుబాటులోకి రావ      డంతో తొలిదశలో గుర్తించగలుగుతున్నారు.  

చికిత్సలు ఇలా.. 
బ్రెయిన్‌ ట్యూమర్‌ దశ బట్టి చికిత్సలు అందిస్తారు. కొందరికి మందులు ఇస్తూ ట్యూమర్‌ను తగ్గిస్తారు. మరికొందరికి శస్త్ర చికిత్స ద్వారా ట్యూమర్‌ను తొలగిస్తారు. రేడియేషన్‌ థెరపీ, శస్త్ర చికిత్స తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సలు అందిస్తారు. ప్రస్తుతం ఆధునిక చికిత్సలు, అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో బ్రెయిన్‌ ట్యూమర్‌ రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి.  

కారణాలు ఇవీ.. 
జన్యుపరమైన లోపాలు. 
తీసుకునే ఆహారం. 
రేడియేషన్‌ ప్రభావం. 
పొగ, మద్యం తాగడం.   

తీవ్రతను బట్టి వైద్యం 
నెలలో 20 నుంచి 30 మంది వరకూ బ్రెయిన్‌ ట్యూమర్‌ రోగులు వస్తున్నారు. ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు. వారి పరిస్థితిని అంచనా వేసి       మందులు ఇవ్వడమా, శస్త్ర చికిత్స చేయడమా అన్నది నిర్ధారిస్తాం. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయడంతో ట్యూమర్‌ను నిర్ధారిస్తున్నాం. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో స్కానింగ్‌లు అందుబాటులోకి రావడంతో వ్యాధిని త్వరగా గుర్తించగలుగుతున్నాం.  
– డాక్టర్‌ గొల్ల రామకృష్ణ, న్యూరోసర్జన్, విజయవాడ

కచ్చితమైన నిర్ధారణ 
బ్రెయిన్‌ ట్యూమర్లను కాంట్రాస్ట్‌ సీటీతో కచ్చితమైన నిర్ధారణ చేస్తాం. బ్రెయిన్‌లో ఏదైనా గడ్డ ఉంటే అది ట్యూమరా, ఇంకేమైనానా అని తెలుసుకోవచ్చు. ఏ ప్రాంతంలో ట్యూమర్‌ ఉంది అనేది చెప్పవచ్చు. ఒకప్పుడు నాలుగో దశలో వ్యాధిని గుర్తించేవారు. ఇప్పుడు అడ్వాన్స్‌డ్‌ డయాగ్నోస్టిక్‌ సరీ్వసెస్‌ అందుబాటులోకి రావడంతో మొదటి, రెండో దశలోనే గుర్తించగలుగుతున్నాం. లక్షణాలను బట్టి స్కాన్‌ చేసి వ్యాధిని నిర్ధారణ చేయొచ్చు.  
– డాక్టర్‌ ఎన్‌.దీప్తిలత, రేడియాలజిస్ట్, విజయవాడ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement