వెయిట్ లాస్ జర్నీలకు సంబంధించి ఎన్నో స్టోరీలు చూశాం. వాళ్లంతా ఆయా ఫిట్‌నెస్ కోచ్‌ల సూచనల మేరకు రకరకాల డైట్‌లు ఫాలో అయ్యారు. కానీ ఈ వ్యక్తి మాత్రం మన సౌత్ ఇండియన్ డైట్‌తో అలా ఇలా కాదు ఏకంగా 35 కేజీల వరకు బరువు తగ్గి శెభాష్ అనిపించుకున్నారు. ఈ డైట్ వల్లే తన శరీరంలోని అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోగలిగారట. అంతలా బరువు తగ్గిపోయేలా చేసిన ఈ డైట్ ప్రత్యేకతలేంటీ? ఎలాంటి ఆహారాలు తీసుకుంటారు తదితరాల గురించి చూద్దామా..!.
జితిన్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రాం వేదికగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేశారు. ఒక్కసారిగా ఈ పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆయన ఆ పోస్ట్‌లో సౌత్ ఇండియన్ డైట్ ప్లాన్‌తోనే బరువు తగ్గినట్లు చెప్పడమే కారణం. అది కూడా 105 కేజీల ఉన్న వ్యక్తి జస్ట్ ఈ డైట్‌తో ఏకంగా 70 కిలోల వరకు తగ్గడంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. జితిన్ తన పోస్ట్‌లో ఆ డైట్ ప్లాన్‌కి సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకునేవారో కూడా సవివరంగా వెల్లడించారు.
డైట్ ప్లాన్:
జిత్‌న దినచర్య ఉదయం 6.30తో గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లతో మొదలయ్యింది. బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు గుడ్లు, రెండు సాంబార్ ఇడ్లీలు లేదా మొలకెత్తిన పెసలు, ఒక దోసె తీసుకునేవాడు. మధ్యమధ్యలో అంతగా తినాలనిపిస్తే.. కప్పు మజ్జిగ, వేరుశెనగప్ప్పలు తినేవాడినని చెప్పారు జితిన్. ఇక భోజనంలో బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్. దానిలోకి పప్పు, కొబ్బరి వేసిన కూరగాయలు. వందగ్రాముల చికెన్ లేదా చేపలు తీసుకునేవానని అన్నారు. ఇక సాయంత్రం స్నాక్స్‌గా గ్రీన్ టీ, ఉడికించి గుడ్డులోని తెల్లసొన లేదా కాల్చిన చిక్‌పీస్(బఠానీలు) తినేవాడినని చెప్పుకొచ్చారు.
ఇక డిన్నర్‌లో మిల్లెట్ దోస లేదా గోధుమ దోస, బచ్చలి కూర లేదా మునగ సూప్. అది కాకుంటే.. కాల్చిన చేప లేదా చికెన్ లేదా రాజ్మ కూర విత్ రోటీలతో పూర్తి చేసేవాడినని తెలిపారు. అలాగే నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చిన పసుపు పాలల్లో ఒక టేబుల్ స్పూన్ ప్రోటీన్ పౌడర్ కలిపి తీసుకునే వాడనని తన వెయిట్ లాస్ జర్నీ గురించి సవివరంగా ఇన్‌స్టాలో వెల్లడించారు.
గుర్తించుకోవాల్సినవి:
ఈ డైట్ ఫాలో అవుతున్నప్పుడూ డీప్ ఫ్రై లేదా హై క్యాలరీ ఫుడ్ ఐటెమ్స్‌ని ఏ మాత్రం దరిచేరనీయకూడదు. అలాగే కూరల్లో వంటనూనెని కూడా తగ్గించాలి. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటానికి, మంచి జీర్ణక్రియ కోసం ప్రతి పది నుంచి 15 నిమిషాలు నడవాలని చెప్పారు జితిన్. దీనివల్ల బరువు కూడా అదుపులో ఉంటుందన్నారు.
(చదవండి: భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారం!)
Comments
Please login to add a commentAdd a comment