ఆమె ఈమెనా...! ఏకంగా 150నుంచి 68 కిలోలు.. | Woman Incredible Weight Loss Transformation From 150 kg to 68 kg | Sakshi
Sakshi News home page

అద్భుతమైన వెయిట్‌ లాస్‌ జర్నీ..! ఏకంగా 150నుంచి 68 కిలోలు..

Jan 27 2025 12:36 PM | Updated on Jan 27 2025 2:27 PM

Woman Incredible Weight Loss Transformation From 150 kg to 68 kg

బరువు తగ్గడం అనేది అంత సులభమైన పని కాదు. అందులోనూ మూడంకెల రేంజ్‌లో బరువు ఉంటే నో ఛాన్స్‌ అనేస్తారు. కేవలం ఫ్యాట్‌ తగ్గించుకునే ఆపరేషన్‌లతోనే సాధ్యమవుతుంది. కానీ ఈ మహిళ అంత భయనాక స్థాయిలో ఉన్న తన శరీర బరువుని విజయవంతంగా తగ్గించుకుని నాజుగ్గా మారిపోయింది. ఆమె పాత ఫోటోలు చూస్తే "ఆమె ఈమెనా.."అని ఆశ్చర్యపోవాల్సిందే అంతలా ఆమె బాడీ రూపురేఖలు మారిపోయాయి. సన్నబడితే ఇంత అందంగా ఉంటుందా అని అంతా కళ్లప్పగించి చూసేలా స్లిమ్‌గా అందంగా మారిపోయింది. ఏదో మాయ చేసినట్లుగా బరువు తగ్గి, అందరిచేత శెభాష్‌ అనిపించుకుంది. 

ఇది సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండే(Pranjal Pandey) వెయిట్‌ స్టోరీ. బరువు తగ్గడం అనేది ఎంత క్లిష్టమైన ప్రక్రియ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ప్రాంజల్‌ పాండే అలా ఇలా కాదు..ఏకంగా 150 కిలోలు బరువు ఉండేది. ఈమె బరువు తగ్గాలనుకున్నా(Weight Loss) తగ్గుతుందా అనేంతగా భారీగా ఉండేది ఆమె శరీరం. 

కానీ ఆమె మాత్రం సాధ్యమే అంటూ ఎవ్వరూ ఊహించని రీతీలో బరువు తగ్గి గుర్తపట్టేలేనంత అందంగా మారిపోయింది. ఎవరీ అమ్మాయి అనుకునేలా ప్రాంజల్‌ పాండే తన బాడీ రూపరేఖలను మార్చుకుంది. కానీ తాను కూడా ఈ రేంజ్‌లో బరువు తగ్గగలనని అస్సలు ఊహించలేదని అంటోంది. 

అయితే ప్రాంజల్‌ పాండే డైట్‌(Diet), వర్కౌట్లు(work out) అంటూ నెటింట వైరల్‌ అవుతున్న కొత్తకొత్త వాటిని వేటిని ఫాలో కాలేదు. కేవలం తన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. అదే తనకు 'పెద్ద గేమ్‌ చేంజర్‌'లా పనిచేసి కిలోలు కొద్దీ బరువు తగ్గేందుకు ఉపకరించిందని అంటోంది. అందుకు సంబంధించిన వీడియో తోపాటు తన జీవనశైలిలో జతచేసిన అలవాట్లను గురించి ఇన్‌స్టాగ్రాం వేదికగా షేర్‌ చేసుకుంది. అవేంటంటే..

ఆరోగ్యకరమైన జీవనశైలి..

  • ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్‌తో కూడిన గోరు వెచ్చని నీరు తీసుకోవడం. ఇది పొట్ట ఉబ్బరాన్ని నివారిస్తుంది, కాలేయ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.

  • ప్రతి భోజనానికి ముందు ఫైబర్. ఫైబర్ ఉండే సలాడ్‌లు లేదా పళ్లు, నట్స్‌ వంటివి తినడం. దీంతో పొట్ట నిండి ఉంటుంది కాబట్టి భోజనం మితంగా తింటారు. పైగా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉండదు.

  • ప్రోటీన్ లేదా కొవ్వుతో ఉండే పండ్లు తినడం. ఇలా అందరికీ వర్తించదు. ఇక్కడ న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండేకి పీసీఓసీ సమస్య ఉంది. అందువల్ల బాదంతో కలిపి ఆపిల్‌ తినడం,  వెన్నతో కూడిన పెరుగుతో  స్ట్రాబెర్రీలు తీసుకునేదట.

  • ప్రతిరోజూ 4 లీటర్ల నీరు త్రాగడం. దీనివల్ల మూత్రం ద్వారా అదనపు కొవ్వు తొలగిపోతుంది

  • అలాగే భోజనం అనంతరం కనీసం 10 నిమిషాలు నడవడం, 10-15 స్క్వాట్‌లు చేయడం వంటివి చేయాలి. 

  • పడుకోవడానికి కనీసం 2-3 గంటల ముందు చివరి భోజనం చేయడం.

  • భోజనంలో ప్రోటీన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కడుపు నిండుగా తిన్న అనుభూతి దక్కుతుంది. 

  • కొద్దిపాటి సింపుల్‌ వ్యాయామాలు శరీరాన్ని ఫ్రీగా కదిలించడానికి, రిఫ్రెషింగ్‌కి ఉపయోగపడతాయి. 

  • ఇలాంటి అలవాట్లతో కొండలాంటి శరీరాన్ని నాజుగ్గా మార్చేయవచ్చని ప్రూవ్‌ చేసింది న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండే. ఎలాంటి డైట్‌లు అవసరం లేదు జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుని, జస్ట్‌ తీసుకునే ఫుడ్‌పై ఫోకస్‌ పెట్టండి అంటోంది.

 

 (చదవండి: నిఖిల్ కామత్ సూపర్‌ ఫుడ్‌ ఇదే..! దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుందా..?)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement