స్లిమ్‌గా, అందంగా ఉండాలని అన్ని వయసుల వారు కోరుకుంటారు. అందుకు డైటింగ్ నుంచి జిమ్‌లో కసరత్తులు చేయడం వరకు రకరకాల పాట్లు పడుతుంటారు. ముఖ్యంగా తల్లి అయిన స్త్రీలు ఎదుర్కొనే ఈ సమస్యను చాందినీ సాధించి చూపింది. 39 ఏళ్ల వయసులో ఏకంగా 40 కిలోల బరువు తగ్గి అందాల కిరీటమూ సొంతం చేసుకుంది. ఎవరీ చాందినీ.. ఏమా కథ అనేవారికి బరువు తగ్గించే ఉపాయాలను మూటగట్టి మరీ మనముందుంచుతోంది.
అధిక బరువు తగ్గడం కంటే ఈ క్రమంలో చేసే ప్రయాణం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఆరోగ్య సమస్యలను జయించేలా చేస్తుంది, ప్రసవానంతర ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇందుకోసం చేసిన కృషి పట్టుదలను, అంతులేని స్ఫూర్తిని కలిగిస్తుంది.
అమెరికాలో ఉంటున్న చాందినీ సింగ్‌కు 39 ఏళ్లు. పిల్లల పాదరక్షల కంపెనీకి కో ఫౌండర్. అంతేకాదు భార్య, తల్లి అయిన చాందినీ ఇటీవలే మిసెస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ యుఎస్‌ఎ– 2024 అందాల ΄ోటీని గెలుచుకుంది. 5 అడుగుల 8 అంగుళాల పొడవుండే చాందినీ 118 కిలోల బరువుండేది. గర్భవతిగా ఉన్నప్పుడు పెరిగిన బరువు ప్రసవానంతరమూ అలాగే ఉండిపోయింది. డబుల్ ఎక్సెల్ నుంచి ట్రిపుల్ ఎక్సెల్ దుస్తులు ధరించడం వరకు శరీరం పరిమాణం పెరిగింది. ఇంట్లో వండిన ఆహారం, రోజూ చేసే వాకింగ్ అందాల కిరీటం దక్కేలా చేశాయని చాందినీ చెప్పిన విషయాలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయి.
భయాన్ని జయిస్తూ...
‘‘విపరీతమైన బరువుతో ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో తీవ్రమైన ఆరోగ్య భయాన్ని ఎదుర్కొన్నాను. గర్భవతిగా ఉన్నప్పుడు ఆరు నెలల పాటు వైద్యుల సలహా మేరకు బెడ్‌రెస్ట్‌లో ఉండక తప్పలేదు. దీంతో విపరీతంగా బరువు పెరిగిపోయాను.
ఫలితంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌తో పాటు ప్రీ–డయాబెటిక్ నిర్ధారణ అయ్యింది. దీంతో నియంత్రణ చర్యలు తీసుకపోతే భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రహించాను. ఈ వ్యాధి నిర్ధారణ నా ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా చేసింది.
బరువుతో పాటు అందానికీ ప్రాధాన్యత
బరువు తగ్గడమే కాదు, అందంగానూ కనిపించాలి. దీంతో నా దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించడం మొదలపెట్టాను. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచేందుకు తోడ్పడింది. ఆరోగ్యంగా ఉండటం నా కుటుంబంపై కూడా మంచి ప్రభావం చూపింది. ముఖ్యంగా నా కూతురిని ఆరోగ్యంగా పెంచాలనుకున్నాను.
అందుకు నన్ను నేను సెట్ చేసుకోవాలనుకున్నాను. నా కూతురిని జాగ్రత్తగా చూసుకుంటూ, నా ప్రాముఖ్యతను ఆమెకు చూపించాలని కోరుకున్నాను. నా ఆరోగ్యంలో ప్రతి చిన్న మెరుగుదల ఫిట్‌గా, చురుకుగా ఉండాలనే నా అభిరుచిని పెంచింది. పోషకాహారంపై విస్తృతమైన పరిశోధన చేశాక, నా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో స్థిరమైన, దీర్ఘకాలిక మార్పులు చేయడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను.
ఫలితంపై కన్నా ప్రక్రియపైనే దృష్టి
పొత్తికడుపు కొవ్వును తగ్గించడానికి వ్యాయామాన్ని దినచర్యగా చేసుకున్నాను. ఇందుకు తక్కువ–తీవ్రత, అధిక తీవ్రత గల వ్యాయామాల మిశ్రమాన్ని పాటించాను. వ్యాయామానికి వారంలో 3–4 సార్లు కేటాయించాను. కార్డియో కోసం వాకింగ్, జాగింగ్‌ని కలిపి వెయిట్ ట్రైనింగ్ తీసుకున్నాను. సెలవులు, గాయం, అనారోగ్యం కారణాలతో ఒక వారం, రెండు వారాల పాటు వర్కవుట్‌లకు దూరమైన సందర్భాలు ఉన్నాయి.
కానీ అది నా కృషిపై ప్రభావం చూపకుండా చూసుకున్నాను. వీలైనంత త్వరగా తిరిగి ట్రాక్‌లోకి వచ్చాను. ఫలితాల కంటే ప్రక్రియపై ఎక్కువ దృష్టి పెట్టాను, ఇది నాకు స్ఫూర్తిగా మారింది. స్థిరంగా ఉండటానికి సహాయపడింది. మొదటి రెండు నెలలు బరువు తగ్గక పోయినప్పటికీ, నా పనిని ఎప్పుడూ వదులుకోలేదు. వెయిటింగ్ స్కేల్‌లోని నంబర్‌లు నన్ను డిమోటివేట్ చేయడానికి ఒప్పుకోలేదు. ఫలితం మీద కాకుండా రెగ్యులర్‌గా చేసే నా పనిపైనే దృష్టిపెట్టాను.
సవాళ్లను ఎంచుకున్నాను
బరువు తగ్గిన తర్వాత శారీరకంగా, బలంగా, మరింత శక్తిమంతంగా బలోపేతమైనట్లు భావించాను. రక్త΄ోటు, కొలెస్ట్రాల్, డయాబెటిస్ స్థాయులు బ్యాలెన్స్‌లో ఉన్నాయి. మిసెస్ గ్రాండ్ ఇండియా యుఎస్‌ఎ– 2024 గురించి తెలిసి, అప్లై చేసుకున్నాను. ఈ అందాల ΄ోటీలో ΄ాల్గొనడం, గెలవడం వంటి కొత్త సవాళ్లను స్వీకరించేలా నన్ను నేను మార్చుకున్నాను. బరువు తగ్గడం నా జీవితంలోని ప్రతి అంశాన్ని – నా ఆరోగ్యం, విశ్వాసం, మనస్తత్వాన్ని మార్చింది.
బరువు తగ్గడంలో చేసే ప్రక్రియలు, ఫలితాలు వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంటాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు తమ శరీరాన్ని అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగా కృషి మొదలుపెట్టాలి. ఫలితం రాలేదని ఎక్కడా వెనకడుగు వేయద్దు. ప్రయత్నాన్ని వదలద్దు’ అని చాందినీ సింగ్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా తన వెయిట్‌లాస్ జర్నీ విశేషాలు పంచుకున్నారు.
ఇంటి భోజనమే ఔషధం
క్రాష్ డైట్‌లను అనుసరించడం ద్వారా వేగంగా బరువు తగ్గగలనని తెలుసు. కానీ, దానిని ఎంచుకోలేదు. ఎందుకంటే ఈ డైట్ ద్వారా ఎంత వేగంగా బరువు తగ్గుతున్నానో, అంత త్వరగా తిరిగి బరువు పెరుగుతున్నాను. ఆ అనుభవం నాకు పెద్ద పాఠం. అందుకే క్రాష్ డైటింగ్‌కు బదులుగా ఆరోగ్యకరమైన, ఇంట్లో వండిన ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చాను, అన్నం, రోటీ, పనీర్, చికెన్ కర్రీ వంటి నాకు ఇష్టమైన భారతీయ వంటకాలన్నీ తినడం కొనసాగించాను.
ఆహార నియంత్రణ పాటించాను. నా భోజనంలో ఎక్కువ ప్రోటీన్, ఫైబర్‌ని చేర్చడం ద్వారా క్యాలరీ లోటును కొనసాగించాను. రెస్టారెంట్లలో ప్రత్యేక సందర్భాలలో తినడానికి మాత్రమే పరిమితం చేశాను. వీలైనంత వరకు జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కట్ చేశాను. దీని వల్ల ఆహార ఎంపికల గురించి. బ్యాలెచేసుకోవడం.. బాగా అబ్బింది.
(చదవండి: కంటి ఉప్పెనను నవ్వుతో కప్పేసి...)
Comments
Please login to add a commentAdd a comment