
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌తో విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దివంగత తమిళనాడు సీఎం జయలలిత ప్రియ స్నేహితురాలు వీకే శశికళ నటరాజన్ కోలుకుంటున్నట్లు విక్టోరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వారు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం శ్వాస సాధారణ స్థితికి వచ్చిందని, అయినప్పటికీ ఆక్సిజన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు చెప్పారు. జ్వరం, కోవిడ్ లక్షణాలు తగ్గుముఖం పడుతున్నాయని వెల్లడించారు. ఆదివారం స్వల్పంగా ఆహారం తీసుకుని ఐసీయూలో వాకింగ్ చేశారని వైద్యులు తెలిపారు. చదవండి: శశికళకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
Comments
Please login to add a commentAdd a comment