Shashikala Natarajan
-
కోలుకుంటున్న శశికళ
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌తో విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దివంగత తమిళనాడు సీఎం జయలలిత ప్రియ స్నేహితురాలు వీకే శశికళ నటరాజన్ కోలుకుంటున్నట్లు విక్టోరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వారు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం శ్వాస సాధారణ స్థితికి వచ్చిందని, అయినప్పటికీ ఆక్సిజన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు చెప్పారు. జ్వరం, కోవిడ్ లక్షణాలు తగ్గుముఖం పడుతున్నాయని వెల్లడించారు. ఆదివారం స్వల్పంగా ఆహారం తీసుకుని ఐసీయూలో వాకింగ్ చేశారని వైద్యులు తెలిపారు. చదవండి: శశికళకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక -
సింగర్‌గా మారిన ఫైర్‌బ్రాండ్ డీఐజీ
సాక్షి, బెంగళూరు : ఫైర్‌బ్రాండ్ పోలీసు అధికారిణిగా పేరొందిన కర్ణాటక డీఐజీ (జైళ్ల శాఖ) రూపా ముగ్దిల్ తనలో దాగున్న మరో ప్రతిభను బయటపెట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. 1965లో విడుదలైన మీనా కుమారి - ధర్మేంద్రల ‘కాజల్’ సినిమాలోని ‘తోరా మన్ దర్పణ్ కెహలాయె’ అంటూ సాగే పాటను ఆమె స్వయంగా ఆలపించారు. ‘ఈ పాట ఆడియో రికార్డింగ్ కోసం కేవలం అరగంట సమయం మాత్రమే పట్టింది. వీడియో చిత్రీకరణ కూడా నాలుగు గంటల్లో ముగించేశాం’ అని రూపా చెప్పారు. తమలో దాగున్న శక్తిని గుర్తించాలంటూ సాగే ఈ పాట తనలో ఎంతో స్ఫూర్తి నింపిందని, అందుకే ఈ వీడియో రూపొందించినట్లు తెలిపారు. మనసే అందరిలోని సంతోషం, దుఃఖానికి, సాధించే విజయాలు, అపజయాలకు కారణమని.. బలంగా అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీలేదని అందరూ గుర్తించాలన్నారు. ఈ వీడియో మ్యూజిక్ కంపోజర్‌గా కన్నడ సినీ దర్శకుడు అలెన్ వ్యవహరించారు. ఆర్జే శృతీరావు కోరిక మేరకు వీడియోను రూపొందించానని రూపా తెలిపారు. పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న అన్నాడీఎంకే నేత శశికళకు ప్రత్యేకంగా రాజభోగాలు కల్పిస్తున్నారంటూ నివేదికనిచ్చి ఒక్కసారిగా సంచలనంగా రూపా నిలిచారు. గతంలో కూడా ధార్వాడ్(మధ్యప్రదేశ్) ఎస్పీగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఉమా భారతిని అరెస్ట్ చేసి ఆమె సంచలనం సృష్టించిన విషయం విదితమే. -
జైలుకు తిరిగొచ్చిన శిశికళ
బెంగళూరు(కర్ణాటక): ఏఐఏడీఎంకే నాయకురాలు వీకే శిశికళ బెంగళూరు సెంట్రల్ జైలుకు తిరిగి చేరుకున్నారు. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటరాజన్‌ను పరామర్శించేందుకు ఆమె పెట్టుకున్న వినతిని పరిశీలించిన పరప్పణ అగ్రహారం జైలు అధికారులు షరతులతో కూడిన ఐదు రోజుల పెరోల్ మంజూరు చేసిన విషయం విదితమే. దీంతో శశికళ గత 6వ తేదీన చెన్నై వెళ్లారు. ఆస్పత్రికి వెళ్లి ఆమె తన భర్తను పరామర్శించారు. గురువారంతో పెరోల్ గడువు ముగియటంతో సాయంత్రం 4.30గంటలకు ఆమె జైలుకు చేరుకున్నారని జైలు సూపరింటెండెంట్ జి.సోమశేఖర్ తెలిపారు. పెరోల్ కాలంలో ఆమె ఎలాంటి షరతుల ఉల్లంఘన చేయలేదని చెప్పారు. -
గ్రేటర్లో ‘అమ్మ’ ఆస్తులు
40 ఏళ్ల కిందటే భూమి కొనుగోలు మారేడ్‌పల్లిలో ఇల్లు బూత్ బంగళాను తలపిస్తున్న విలాసవంతమైన ఈ భవనం.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విడిది గృహం. ఆమె నగరంలోని కొంపల్లిలో గల తన జయా గార్డెన్స్‌కు వచ్చినప్పుడల్లా ఈ ఇంట్లోనే బస చేసేవారు. దీంతో ఇది జయలలిత నివాసంగా గుర్తింపు పొందింది. కానీ, ఈ భవనం ఆమె ప్రియసఖి శశికళ నటరాజన్ పేరుతో ఉంది. ఆస్తుల కేసులో శనివారం జయలలితకు జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఇక్కడున్న ఆమె ఆస్తుల వ్యవహారాలు నగరంలో చర్చనీయాంశమయ్యాయి. కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు హైదరాబాద్‌తో సుమారు 40 ఏళ్ల అనుబంధం ఉంది. 1970లలోనే ఆమె బోయిన్పల్లి సమీపంలోని పేట్‌బషీరాబాద్ గ్రామ పరిధిలో సుమారు 15 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. సినీ రంగంలో ఉన్న కాలంలోనే కొనుగోలు చేసిన ఈ స్థలాన్ని అప్పట్లో ఆమె తరచూ సందర్శించే వారని ఆమె ఫామ్ హౌస్ పక్కనే వ్యవసాయ క్షేత్రం కలిగిన సామల రాఘవరెడ్డి (జయలక్ష్మిగార్డెన్స్ అధినేత) తెలిపారు. అప్పట్లో ఫామ్ హౌస్‌కు వచ్చినప్పుడు తమతో ఆప్యాయంగా మెలిగేవారని గుర్తు చేసుకున్నారు. తమ సోదరులతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉండేదన్నారు. సుమారు పదేళ్ల క్రితం చివరిసారిగా ఆమె ఫామ్‌హౌస్‌కు వచ్చినట్లు తెలిపారు. జయలలిత ఫామ్ హౌస్‌కు పక్కనే సత్యం రామలింగరాజుకు చెందిన బైర్రాజు ఫౌండేషన్ ఉంది. బూత్ బంగళాగా మారిన ఇల్లు జయలలిత నగరానికి వచ్చినప్పుడు మారేడ్‌పల్లి రాధికా కాలనీలో ప్లాట్‌నెంబర్ 16లో నివసించేవారని స్థానికులు చెబుతున్నారు. ఆమె ప్రియసఖి శశికళ నటరాజన్ అనే నేమ్‌ప్లేట్‌తో ఉన్న ఈ ఇంట్లో కొన్నేళ్లుగా ఎవరూ ఉండటం లేదని కాలనీ వాసులు తెలిపారు. దీంతో పిచ్చిమొక్కలు పెరిగి బూత్‌బంగళా మాదిరిగా మారిపోయి ఉంది. జయలలిత ఇల్లు తమ కాలనీలో ఉందని ఇన్నాళ్లూ గర్వంగా భావించే వారమని, ఇప్పుడు ఆమె అరెస్టు కావడం తమకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. తమిళనాడు వ్యక్తులతో గార్డెన్ నిర్వహణ జీడిమెట్ల సమీపంలో ‘జయలలిత గార్డెన్’ పేరుతో ఉన్న భూముల చుట్టూ 12 అడుగుల ఎత్తులో ప్రహరీ నిర్మించారు. జాతీయ రహదారి ముందు ప్రధాన గేటు, జీడిమెట్ల స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కేంద్రం సమీపంలో మరో గేటు ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేస్తున్న వారు మొత్తం తమిళనాడుకు సంబంధించిన వారే. స్థానికులను లోనికి అనుమతించరు. మూడు కుటుంబాలు ఇందులో ఉండి గార్డెన్ పనులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అడపాదడపా జయలలితకు అత్యంత సన్నిహితులు వచ్చినపుడే కాస్త హడావుడి ఉంటుంది. ముఖ్యమంత్రి అయిన తరువాత రెండుసార్లు, ఓడిన తరువాత ఒక్కసారి గార్డెన్‌కు వచ్చి వెళ్లారని స్థానికులు చెబుతున్నారు.