
బెంగళూరు(కర్ణాటక):
ఏఐఏడీఎంకే నాయకురాలు వీకే శిశికళ బెంగళూరు సెంట్రల్ జైలుకు తిరిగి చేరుకున్నారు. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటరాజన్‌ను పరామర్శించేందుకు ఆమె పెట్టుకున్న వినతిని పరిశీలించిన పరప్పణ అగ్రహారం జైలు అధికారులు షరతులతో కూడిన ఐదు రోజుల పెరోల్ మంజూరు చేసిన విషయం విదితమే.
దీంతో శశికళ గత 6వ తేదీన చెన్నై వెళ్లారు. ఆస్పత్రికి వెళ్లి ఆమె తన భర్తను పరామర్శించారు. గురువారంతో పెరోల్ గడువు ముగియటంతో సాయంత్రం 4.30గంటలకు ఆమె జైలుకు చేరుకున్నారని జైలు సూపరింటెండెంట్ జి.సోమశేఖర్ తెలిపారు. పెరోల్ కాలంలో ఆమె ఎలాంటి షరతుల ఉల్లంఘన చేయలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment