Parappana Agrahara Central Jail
-
జైల్లో ఖైదీ బర్త్‌డే వేడుకలు, వైరల్ వీడియో
సాక్షి, బెంగళూరు: నేరం చేస్తే కటకటాలపాలై జైలు శిక్ష అనుభవిస్తాం. అయితే, కర్ణాటకలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారుల తీరు చూస్తే మాత్రం.. ఆ జైలుకు వెళ్లేందుకైనా నేరం చేయాలి అనిపిస్తుంది. అంత ‘ఫ్రీడం’ ఉంటుంది అక్కడి ఖైదీలకు. తాజాగా బయటపడిన ఓ ఖైదీ పుట్టినరోజు వేడుకల వీడియో అదే విషయాన్ని చెప్తున్నట్టుగా ఉంది. రెండేళ్ల క్రితం పరప్పన అగ్రహార జైలులోని అధికారులు డబ్బు తీసుకొని, నిబంధనలను ఉల్లంఘిస్తూ ఖైదీలకు వివిధ ప్రోత్సాహకాలు ఇస్తున్నారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అప్పుడు పరప్పన జైలు కుంభకోణంపై దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ఐఎఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఖైదీలకు అధికారాలు ఇచ్చినట్లు ఆ కమిటీ ధ్రువీకరించింది. దాంతో ఆ జైలు అధికారులను బదిలీ చేశారు. అలాంటి ఘటనలు మళీ జరక్కుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. వేడుకలు, ఇంకా వీడియో బెంగళూరు సుబ్రమణియపుర పోలీస్ స్టేషన్‌కు చెందిన రిజ్వాన్ అలియాస్ రౌడీ కుల్లాను ఇటీవల గతేడాది ఓ మర్డర్ కేసులో అరెస్టు చేసి పరప్పన అగ్రహార జైలులో ఉంచారు. మరికొంత మంది అతని అనుచరులు కూడా అదే జైలులో ఉన్నారు. అయితే, జైలులో ఉన్న రిజ్వాన్ స్నేహితులతో కలిసి తన పుట్టినరోజును జరుపుకోవడమే కాక, దాన్నంతా సెల్ఫోన్లో చిత్రీకరించి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అటాచ్ చేసి మరీ సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. జైలులో రిజ్వాన్‌కు సెల్ ఫోన్ ఎలా వచ్చిందనే విషయం ఇప్పుడు వివాదాస్పదమైంది. విస్తృతమైన పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఇటువంటి ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. ఇక బర్త్ డే ఘటనపై విచారణ చేస్తున్నామని, రిజ్వాన్‌కు ఫోన్ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని జైలు ఉన్నతాధికారులు చెప్తున్నారు. కాగా, పరప్పన జైలులో పుట్టిన రోజు వేడుకలు, ఇతర సంప్రదాయ పండుగలు జరపుకునేందుకు అనుమతి ఉండటం విశేషం. మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. -
జనవరి 27న శశికళ విడుదల!
సాక్షి, చెన్నై: అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో నాలుగేళ్ల శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె విడుదల విషయంగా కొంత కాలంగా రక రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ముందుగానే ఆమె విడుదల అవుతారన్న చర్చ జోరుగానే సాగినా, అందుకు తగ్గ దాఖలాలు కనిపించలేదు. అలాగే, శిక్షా కాలం ముగిసినా, జైలులో లగ్జరీ వ్యవహారం ఆమె మెడకు చుట్టుకోవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఇవన్నీ ఊహాజనితాలే అని పేర్కొనే రీతిలో శిక్షా కాలం ముగియగానే చిన్నమ్మ జయలలిత జైలు నుంచి బయటకు రావడం ఖాయం అవుతోంది. ఇందుకు తగ్గ వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చింది. (చదవండి : రూ.300 కోట్ల శశికళ ఆస్తుల జప్తు?) విడుదల ఖాయమేనా? బెంగళూరుకు చెందిన నరసింహమూర్తి చిన్నమ్మ శశికళ విడుదల సమాచారాన్ని సేకరించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఆయన చేసుకున్న విజ్ఞప్తికి బెంగళూరు జైళ్ల శాఖ వర్గాలు వివరాల్ని సమర్పించాయి. శశికళ జైలుకు వచ్చిన వివరాలు, ఆమె శిక్ష కాలం ముగింపు గురించి పేర్కొంటూ, జరిమాన రూ. పది కోట్లు చెల్లించిన పక్షంలో జనవరి 27న విడుదల అవుతారని ప్రకటించారు. ఒక వేళ జరిమానా చెల్లించని పక్షంలో 2022 ఫిబ్రవరి 27న విడుదల అవుతారని సూచించారు. ఈ సమాచారంతో చిన్నమ్మ సేనల్లో ఆనందం తాండవిస్తోంది. చిన్నమ్మ విడుదల కావడం ఖాయమని, ఇక, తమకు మంచి రోజులు వచ్చినట్టే అని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, చిన్నమ్మ న్యాయవాది రాజాచెందూర్ పాండియన్ పేర్కొంటూ, శిక్షా కాలం ముగిసినానంతరం జనవరి 27న ఆమె విడుదల అవుతారని ఇది వరకే తాను పేర్కొన్నట్టు గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం ఆమె ముందే విడుదలకు అవకాశం ఉందన్నారు. గతంలో జైలులో ఉన్న రోజుల లెక్కింపు, సత్ ప్రవర్తన విషయంగా పరిస్థితులు అనుకూలించిన పక్షంలో అక్టోబర్‌లోనే జైలు నుంచి విడుదల అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. -
లగ్జరీగానే చిన్నమ్మ
సాక్షి, చెన్నై : పరప్పన అగ్రహార చెరలో చిన్నమ్మ శశికళకు నేటికీ లగ్జరీ సేవలు, పలు రకాల రాయితీలు అందుతున్నట్టుగా మళ్లీ ఆరోపణలు బయలు దేరాయి. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు సామాజిక కార్యకర్త ఒకరు చేసిన వ్యాఖ్యలు అమ్మ శిబిరంలో ఆగ్రహాన్ని రేపుతున్నాయి.అక్రమాస్తుల కేసులో అమ్మ జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ పరప్పన అగ్రహార చెరలో జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఓ మారు ఆమెకు అందుతున్న లగ్జరీ సేవల వ్యవహారం దుమారానికి దారి తీసింది. జైళ్ల శాఖ అధికారి రూప స్వయంగా ఆరోపణలు గుప్పించడంతో విచారణకు పరిస్థితులు దారి తీశాయి. ఆ తదుపరి పరిణామాలతో చిన్నమ్మ సత్ ప్రవర్తనతో ముందస్తుగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకుతగ్గ ప్రయత్నాల మీద అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ సైతం ఉన్నారు. చిన్నమ్మ ఈఏడాది చివర్లో జైలు నుంచి బయటకు రావడం ఖాయం అన్న ధీమాను ఆ శిబిరం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో శశికళకు గతంలో వలే ఇప్పుడు కూడా రాయితీలు, లగ్జరీ సేవలు జైలులో అందుతున్నట్టుగా కర్ణాటకకు చెందిన సామాజిక కార్యకర్త నరసింహ ఆఆరోపణలు గుప్పించడం గమనార్హం. ఇందుకు తగ్గట్టుగాకొన్ని ఆధారాలను ఆయన బయట పెట్టారు. నిబంధనలకు తిలోదకాలు... చిన్నమ్మ శశికళ జైలులో వ్యవహరిస్తున్న విధానం, ఆమెతో సాగి ఉన్న ములాఖత్‌ల మీద సమాచార హక్కు చట్టం నరసింహ వివరాలను సేకరించి ఉన్నారు. అందులో లభించిన వివరాల మేరకు ఆమెకు నేటికి జైల్లో లగ్జరీగానే సేవలు రాజమార్గంలోనే అందుతున్నట్టుగా ఉందని ఆరోపించారు. జైలు నిబంధనల మేరకు శిక్ష అనుభవిస్తున్న ఒకరితో ములాఖత్‌కు నలుగుర్ని మాత్రమే అనుమతించాల్సి ఉందని, అయితే, శశికళను చూడటానికి ఏకంగా ఆరుగుర్ని పంపిస్తున్నట్టు పేర్కొన్నారు. గత నెల శశికళను మాజీ ఐఎఎస్ అధికారి చంద్ర లేఖ , దినకరన్, ఆయన భార్య అనురాధా, కుమార్తె జయహరినిలతో పాటుగా రాజన్, పుగలేందిలు ములాఖత్ అయ్యారని వివరించారు. దీనిని బట్టి చూస్తే, రాజమా«ర్గంలోనే ఆమెకు కర్ణాటక జైళ్ల శాఖ వర్గాలు సేవల్ని అందిస్తున్నట్టుందని ఆరోపించారు. తప్పని సరి పరిస్థితి అన్నది ఉంటే ఏడుగుర్ని అనుమతించ వచ్చు అని, అయితే, ఆ పరిస్థితి ఇక్కడ లేని దృష్ట్యా, నిబంధనల్ని ఉల్లంఘించి ఆరుగుర్ని అనుమతించడమే కాదు, 45 నిమిషాల పాటుగా ములాఖత్‌కు అనుమతించి ఉన్నారని వివరించారు. అయితే, నరసింహ వ్యాఖ్యలను అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. చిన్నమ్మ విడుదలను అడ్డుకునేందుకు ఇలాంటి శక్తులు తెర మీదకు ఇక రావడం సహజమేనని పేర్కొంటున్నాయి. జైలు నిబంధనలకు అనుగుణంగానే చిన్నమ్మ అక్కడ ఉన్నారని, ములాఖత్‌కు ఇద్దరు ముగ్గుర్ని తప్పా, ఎక్కువ మందిని ఆమే అనుమతించడం లేదని ఆ శిబిరానికి చెందిన ఓ నేత పేర్కొన్నారు. -
ఐపీఎస్ రూప ఫ్యాషన్ ఫోటో షూట్
సాక్షి, బొమ్మనహళ్లి: ఐపీఎస్ అధికారిణి డిఐజీ డి.రూప పేరు వినగానే ముక్కుసూటి పోలీసు అధికారి అని, బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జరుగుతున్న అక్రమాలను బయట పెట్టిన నిజాయతి ఐపీఎస్ అని గుర్తుకొస్తుంది. నిత్యం ఖాకీ యూనిఫాంలో దర్శనమిచ్చే ఆమె ఇటీవల ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మీను సరవన్ డిజైన్ చేసిన ముదురు బ్లూ కలర్ ఫ్రాక్ను ధరించి తమ నివాసంలో చేసిన ప్యాషన్ షూట్ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తాను ఐపీఎస్‌నే అయినా, ప్రముఖ మోడళ్లకు తీసిపోను అన్నట్లు ఈ ఫోటో షూట్లో ఐపీఎస్ రూప సవాల్ చేస్తున్నట్లు కనిపిస్తారు. తమ నివాసంలో తీయించుకున్న ఫ్యాషన్ ఫోటో షూట్ దృశ్యాలు సాధారణ మహిళల కోసమే: రూప ఈ సందర్భంగా తన కాలేజీ రోజులను గుర్తుకు చేసుకున్నారు. మిస్ బెంగళూరు యునివర్సిటి కిరీటం, మిస్ దావణగెరె అవార్డును విద్యార్థినిగా ఉన్న రోజుల్లో గెలుచుకున్నట్లు డి.రూప తెలిపారు. ఫోటో షూట్‌పై స్పందిస్తూ ‘నేనేమి పోలీసు విధులను వదిలి ఫ్యాషన్ షోలకి వెళ్ళలేదు. ఒక సాధారణ మహిళ సైతం ఫ్యాషన్ షోలో పాల్గొని తమలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవచ్చు. ఫ్యాషన్ మోడల్స్, సినిమా నటీమణులు మాత్రమే ఫ్యాషన్ షోలకు పరిమితం కాదని అందరికీ తెలియడం కోసం నేను కెమెరా ముందుకొచ్చాను’ అని చెప్పారు. ఈ సమయంలో తనతో పాటు మరికొంత మంది మహిళలు కూడా ఫోటో షూట్ చేయించుకున్నారని అన్నారు. కాలేజీ రోజుల్లో అందాల టైటిల్స్ గెలుచుకున్న విషయాలను ఎవరికీ చెప్పుకోనని అన్నారు. గడిచిన 10 నెలలుగా ఫ్యాషన్ డిజైనర్ మీను సరవన్ తనకు సలహాలు ఇచ్చిన తరువాత ఈ ఫోటో షూట్ చేశానని రూప తెలిపారు. -
శశికళను చూసి షాకైన రేఖా శర్మ
సాక్షి, బెంగళూర్ : పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళకు స్పెషల్ ట్రీట్మెంట్ కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె తనకు నిర్ధేశించిన జైలు యూనిఫాంను కూడా ధరించడం లేదు. బెంగళూర్ జైలుని జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ సందర్శించిన క్రమంలో తోటి ఖైదీలు, ఆమెకు మధ్య ఈ వ్యత్యాసాన్ని గుర్తించారు. అక్రమాస్తుల కేసులో శశికళ, ఆమె బంధువు ఇళవరసి ఇదే జైలులో ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే. తాను జైలును సందర్శించిన సమయంలో శశికళ, ఇళవరసి జైలు యూనిఫాం ధరించకుండా సాధారణ దుస్తుల్లో కనిపించారని రేఖా శర్మ నిర్ధారించారు. ఇదే విషయమై తాను జైలు అధికారులను ప్రశ్నించగా ఆమె అత్యున్నత కేటగిరీకి చెందిన వారు కావడంతో సొంత దుస్తులు వాడేందుకు అనుమతిస్తామని చెప్పినట్టు తెలిపారు. జైలులో శశికళ ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్నారని, విజిటర్స్‌ను ప్రైవేటు ప్రదేశంలో కలుస్తున్నారని, ప్రత్యేకంగా తయారుచేసిన ఆహారం స్వీకరిస్తున్నారని, ప్రత్యేక సెల్స్‌ను వ్యక్తిగత అవసరాలకు వాడుతున్నారని తొలుత జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప తొలుత వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటక జైళ్లలో ఖైదీలంతా తెలుపు రంగు దుస్తులు వాడాల్సి ఉండగా, శశికళ, ఇళవరసి మాత్రం చీరలు, సల్వార్ కమీజ్ సహా తమ సొంత దుస్తులను వాడుతున్నారని రూప గతంలోనే వెల్లడించారు. యూనిఫాం విషయంలో ఖైదీల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని ఆమె స్పష్టం చేశారు. -
జీవితఖైదీతో మహిళా కానిస్టేబుల్ లవ్
సాక్షి, బెంగళూరు : కొంతకాలంగా సంచలనాలకు వేదికవుతున్న బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీ కానిస్టేబుల్ మధ్య ప్రేమ పురాణం చర్చనీయాంశమైంది. మహిళ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ శివకుమార్... ఒక మహిళా కానిస్టేబుల్ ప్రేమలో పడడం, వారిద్దరూ నగరంలో షికార్లు కొట్టిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శివకుమార్ బెంగళూరులో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. 2005లో కాల్ సెంటర్ ఉద్యోగిని ప్రతిభను హత్య చేశాడు. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. జైల్లోనే పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో పరిచయం పెరిగి ప్రేమ వరకు వచ్చినట్లు తెలిసింది. అనారోగ్యం పేరుతో శివకుమార్ పెరోల్ పొంది మహిళా కానిస్టేబుల్‌తో బెంగళూరులోని పెద్ద పెద్ద హోటళ్లు, మాల్‌లలో తిరుగుతూ తీసుకున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై పరప్పన అగ్రహార జైలు అధికారులు నోరు మెదపడం లేదు. -
జైలుకు తిరిగొచ్చిన శిశికళ
బెంగళూరు(కర్ణాటక): ఏఐఏడీఎంకే నాయకురాలు వీకే శిశికళ బెంగళూరు సెంట్రల్ జైలుకు తిరిగి చేరుకున్నారు. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటరాజన్‌ను పరామర్శించేందుకు ఆమె పెట్టుకున్న వినతిని పరిశీలించిన పరప్పణ అగ్రహారం జైలు అధికారులు షరతులతో కూడిన ఐదు రోజుల పెరోల్ మంజూరు చేసిన విషయం విదితమే. దీంతో శశికళ గత 6వ తేదీన చెన్నై వెళ్లారు. ఆస్పత్రికి వెళ్లి ఆమె తన భర్తను పరామర్శించారు. గురువారంతో పెరోల్ గడువు ముగియటంతో సాయంత్రం 4.30గంటలకు ఆమె జైలుకు చేరుకున్నారని జైలు సూపరింటెండెంట్ జి.సోమశేఖర్ తెలిపారు. పెరోల్ కాలంలో ఆమె ఎలాంటి షరతుల ఉల్లంఘన చేయలేదని చెప్పారు. -
వెండితెరపై సాహస వనిత
ఐపీఎస్ రూప జీవితం, పరప్పన జైలు అక్రమాలే కథ కన్నడ, తమిళంలో సినిమా నిర్మాణం దర్శకుడు ఏఎంఆర్ రమేష్ సన్నాహాలు ఈ నెల 29న ప్రకటన సాక్షి, బెంగళూరు: నిజజీవితంలో సంచలనాలు సాధించిన పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, కళాకారులపై ఎన్నో సినిమాలు వచ్చాయి. అదే కోవలో మరో సినిమా కూడా రావడం ఖాయమైంది. తాజాగా బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో గుట్టురట్టయిన అక్రమాలపై శాండల్‌వుడ్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఆ జైల్లో అవినీతి గురించి ధైర్యంగా బట్టబయలు చేసిన మహిళా ఐపీఎస్ అధికారి డీ.రూప జీవితం ఈ చిత్ర కథాంశం. వాస్తవ ఘటనల ఆధారంగా సైనైడ్, అట్టహాస వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఏ.ఎం.ఆర్.రమేశ్ ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నా డీఎంకే నాయకురాలు శశికళకు అతిథి మర్యాదలు కల్పించడానికి అధికారులు రూ.2 కోట్లు లంచం తీసుకున్నట్లు ఐపీఎస్ అధికారి డీ.రూప తమ నివేదిక ద్వారా వెలుగులోకి తెచ్చారు. అనంతర పరిణామాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశాలుగా మారాయి. ఈ ఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు రమేశ్ సన్నాహాలు చేస్తున్నారు. జైలు వ్యవహారాలపై దర్యాప్తు అధికారులు నాలుగు దక్షిణాది రాష్ట్రాల అధికారులను, రాజకీయ నాయకులను, బిల్డర్లను రహస్య విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూప, పరప్పన జైలు కథను దర్శకుడు రమేష్ అందరికంటే ముందే ఎంచుకున్నారు. సినిమాను ఏక కాలంలో కన్నడ, తమిళ భాషల్లో చిత్రీకరిస్తారని తెలిసింది. తెలుగులోకి కూడా అనువదించి విడుదల చేసే అవకాశాన్ని చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది. ఈ చిత్రంలోనే జైళ్లలో వాస్తవ పరిస్థితులతో పాటు గతంలో ఒక డీఐజీ ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని చూపించించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇప్పటికే పోలీసు పాత్రలకు శాండల్‌వుడ్‌లో మంచి పేరు గడించిన సీనియర్ నటి మాలాశ్రీ కాని, ఇప్పుడిప్పుడే పోలీస్పాత్రలు వేస్తున్న రాగిణి ద్వివేదిని కానీ ఎంచుకునే అవకాశం ఉంది. మరోవైపు చిత్రంలో కనీసం ఒక్క సీన్ లో నైనా ఐపీఎస్ అధికారి రూపను నటింపచేయాలని చిత్ర యూనిట్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు గాంధీనగర్ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర కథలో జైలు అక్రమాలు, ఐపీఎస్‌గా రూప తీసుకున్న సంచలన నిర్ణయాలు చిత్రకథలో ఉంటాయి. రూప అనుమతి తీసుకుంటాం చిత్ర దర్శకుడు ఏ.ఎం.ఆర్.రమేశ్ మాట్లాడుతూ 'కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. తెలుగులో కూడా విడుదల చేసే విషయం కూడా పరిశీలనలో ఉంది. ఐపీఎస్ అధికారి డీ.రూప ఛేదించిన అవినీతి ఘటనల ఆధారంగా తీయనున్నాం. చిత్రం టైటిల్లో రూప పేరు కూడా ఉండనుండడంతో ఐపీఎస్ అధికారి డీ.రూప అనుమతి తప్పనిసరి. ఇప్పటికే సినిమాపై పోలీస్‌శాఖ ఉన్నతాధికారులతో చర్చించాం. జులై 29న మరోసారి వారితోను, చిత్రానికి మూలాధారమైన ఐపీఎస్ డీ.రూపతోను చర్చించి ఆమోదాల అనంతరం షూటింగ్ ప్రారంభిస్తామ'న్నారు. -
శశికళకు వీఐపీ ట్రీట్మెంట్: భారీగా ముడుపులు!
బెంగళూరు: జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు నిబంధనలకు విరుద్ధంగా జైలులో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ తెలిపారు. గురువారం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక సదుపాయాల కోసం రూ.2 కోట్లు ముడుపులు అందాయన్న ఆరోపణలను కొట్టిపారేశారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళకు ఎలాంటి ప్రత్యేక వంటగది వసతి కల్పించలేదని, కోర్టు ఉత్తర్వులు పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. సాధారణ ఖైదీలకు ఇచ్చే సదుపాయాలే ఆమెకు కల్పిస్తున్నామని చెప్పారు. శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు దాదాపు రూ.2 కోట్ల మేర ముడుపులు అందాయని కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ డీ రూప.. డీజీపీకి ఆరు పేజీల లేఖ రాయడం కలకలం రేపింది. అయితే శశికళకు వీఐపీ ట్రీట్మెంట్ అంటూ ఆ లేఖలో పేర్కొన్న ఆరోపణలను సత్యనారాయణ ఖండించారు. ముడుపులు తీసుకున్నట్లు డీఐజీ రూప స్వయంగా గుర్తిస్తే అప్పుడు ఈ విషయంపై చర్చించాల్సి ఉందన్నారు. నేనే డబ్బులు తీసుకున్నట్లు డీఐజీ రూప భావిస్తే నాపై విచారణకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పారు. మరోవైపు ఏడాదిన్నర లీవ్ తర్వాత బాధ్యతలు చేపట్టిన తనకు పరప్పన అగ్రహార జైలులో భారీ అక్రమాలు జరుగుతున్నట్లు తెలిసిందని రూప చెబుతున్నారు. ఆ జైల్లో ఏం జరుగుతుందో తెలియాలంటే విచారణకు ఆదేశించడమే ఏకైక మార్గమని రూప అభిప్రాయపడ్డారు. స్టాంప్ పేపర్ స్కాంలో ఇరుక్కుని జైలుశిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ కరీమ్ తెల్గీకి కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని లేఖలో పేర్కొన్నట్లు జైళ్లశాఖ డీఐజీ రూప వివరించారు. -
2 కోట్ల ముడుపులపై డీజీపీ ఏమన్నారంటే!
-
నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం
బెంగళూరు: జయలలిత నెచ్చెలిగా శశికళ.. చెన్నైలోని పోయెస్ గార్డెన్లో విలాసవంతమైన జీవితం అనుభవించారు. అమ్మతో సమానంగా చిన్నమ్మ రాజమర్యాదలు అందుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు వంగివంగి దండాలు పెట్టారు. ఇదంతా గతం. ప్రస్తుతం చిన్నమ్మ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రి కావాల్సిన 61 ఏళ్ల చిన్నమ్మ.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అవమానాలు, ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొని బెంగళూరు పరప్పణ అగ్రహార జైలు కోర్టులో లొంగిపోయారు. ఆమెకు ఖైదీ నెంబర్ 9234 కేటాయించారు. మూడున్నరేళ్లు జైలులో చిన్నమ్మ శిక్ష అనుభవించాలి. ఈ శిక్షా కాలంలో ఓ రోజు భారంగా గడిచింది. బుధవారం జైలుకు వెళ్లిన శశికళ.. తొలిరోజు రాత్రి నేలపైనే పడుకున్నారు. జైలు సిబ్బంది ఆమెకు ఓ దుప్పటి, దిండు, ఫ్యాన్, బెడ్ షీట్ ఇచ్చారు. తనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని శశికళ చేసిన విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చింది. ఏసీ, టీవీ, ఇంటి భోజనం, మినరల్ వాటర్, వారానికోసారి నాన్ వెజ్ కావాలన్న కోరికను మన్నించలేదు. దీంతో జైలు సిబ్బంది ఆమెను సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నారు. ఆమెకు ఓ గది కేటాయించారు. ఇదే కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ వదిన ఇలవరసిని కూడా ఇదే గదిలో ఉంచారా లేదా అన్న విషయం తెలియరాలేదు. ఇదిలావుండగా జైలు శిక్ష అనుభవించే కాలంలో శశికళ కొవ్వొత్తులు తయారు చేసే పనిని ఎంచుకున్నారు. క్యాండిల్స్ తయారు చేసినందుకు ఆమెకు రోజుకు 50 రూపాయలు వేతనం ఇవ్వనున్నారు. వచ్చే ఆదివారం నుంచి ఆమెకు జైలు అధికారులు పనిని అప్పగించనున్నారు. తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే.. ‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం లొంగిపోయిన చిన్నమ్మ వీడని ఉత్కంఠ ఇక అమ్మ ఫొటో కనిపించదా పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ ఆచితూచి అడుగులు మద్దతు కాదు కృతజ్ఞతే!