
సాక్షి, బెంగళూరు : కొంతకాలంగా సంచలనాలకు వేదికవుతున్న బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీ కానిస్టేబుల్ మధ్య ప్రేమ పురాణం చర్చనీయాంశమైంది. మహిళ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ శివకుమార్... ఒక మహిళా కానిస్టేబుల్ ప్రేమలో పడడం, వారిద్దరూ నగరంలో షికార్లు కొట్టిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శివకుమార్ బెంగళూరులో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు.
2005లో కాల్ సెంటర్ ఉద్యోగిని ప్రతిభను హత్య చేశాడు. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. జైల్లోనే పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో పరిచయం పెరిగి ప్రేమ వరకు వచ్చినట్లు తెలిసింది. అనారోగ్యం పేరుతో శివకుమార్ పెరోల్ పొంది మహిళా కానిస్టేబుల్‌తో బెంగళూరులోని పెద్ద పెద్ద హోటళ్లు, మాల్‌లలో తిరుగుతూ తీసుకున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై పరప్పన అగ్రహార జైలు అధికారులు నోరు మెదపడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment