ఒకరి వెంట మరొకరు | love failure in visakhapatnam | Sakshi

ఒకరి వెంట మరొకరు

Apr 9 2025 8:45 AM | Updated on Apr 9 2025 8:45 AM

love failure in visakhapatnam

డాబాగార్డెన్స్‌ : ప్రేమ ఎంత బలమైనదో.. కొన్ని సార్లు అంతే విషాదకరమైన ముగింపునిస్తుంది. అందుకు నిదర్శనమే ఈ ఘటన. ఆరిలోవకు చెందిన ప్రశాంత్‌ కుమార్‌ (23), శ్రీకాకుళానికి చెందిన గేదెల సుజాత (27) ప్రేమించుకున్నారు. కేజీహెచ్‌లో ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రశాంత్‌ శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. ఆదివారం ఉదయం అతను విగతజీవుడై కనిపించాడు. మృతదేహం పక్కనే రెండు సిరంజీలు ఉండటం అనుమానాలకు తావిచ్చింది.

అయితే అతని మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రశాంత్‌ మరణ వార్త సుజాతను తీవ్రంగా కలచివేసింది. గోపాలపట్నంలో తన సోదరుడితో కలిసి ఉంటున్న సుజాత, తన ప్రియుడు ఇక లేడన్న విషయాన్ని తట్టుకోలేకపోయింది. అతని మరణించిన 24 గంటల్లోపే సోమవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ప్రశాంత్‌ మరణించగా, సోమవారం ఉదయం అతని పోస్టుమార్టం జరిగింది. అదే సమయంలో సుజాత తన ప్రాణా లు తీసుకుంది.

మంగళవారం ఉదయం సుజాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సుజాత గతంలో కేజీహెచ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన సమయంలోనే చిగురించిన ప్రేమ.. చివరకు విషాదంగా మిగిలింది. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. ప్రేమ విఫలమైందా? కుటుంబ సభ్యులు అంగీకరించలేదా, లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement