సాక్షి, బెంగళూర్ : పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళకు స్పెషల్ ట్రీట్‌మెంట్ కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె తనకు నిర్ధేశించిన జైలు యూనిఫాంను కూడా ధరించడం లేదు. బెంగళూర్ జైలుని జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ సందర్శించిన క్రమంలో తోటి ఖైదీలు, ఆమెకు మధ్య ఈ వ్యత్యాసాన్ని గుర్తించారు. అక్రమాస్తుల కేసులో శశికళ, ఆమె బంధువు ఇళవరసి ఇదే జైలులో ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే. తాను జైలును సందర్శించిన సమయంలో శశికళ, ఇళవరసి జైలు యూనిఫాం ధరించకుండా సాధారణ దుస్తుల్లో కనిపించారని రేఖా శర్మ నిర్ధారించారు. ఇదే విషయమై తాను జైలు అధికారులను ప్రశ్నించగా ఆమె అత్యున్నత కేటగిరీకి చెందిన వారు కావడంతో సొంత దుస్తులు వాడేందుకు అనుమతిస్తామని చెప్పినట్టు తెలిపారు.
జైలులో శశికళ ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్నారని, విజిటర్స్‌ను ప్రైవేటు ప్రదేశంలో కలుస్తున్నారని, ప్రత్యేకంగా తయారుచేసిన ఆహారం స్వీకరిస్తున్నారని, ప్రత్యేక సెల్స్‌ను వ్యక్తిగత అవసరాలకు వాడుతున్నారని తొలుత జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప తొలుత వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటక జైళ్లలో ఖైదీలంతా తెలుపు రంగు దుస్తులు వాడాల్సి ఉండగా, శశికళ, ఇళవరసి మాత్రం చీరలు, సల్వార్ కమీజ్ సహా తమ సొంత దుస్తులను వాడుతున్నారని రూప గతంలోనే వెల్లడించారు. యూనిఫాం విషయంలో ఖైదీల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని ఆమె స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment