కండరాల నొప్పులూ... ఒంటి నొప్పులు! | Muscle Pain: Causes, Symptoms | Sakshi
Sakshi News home page

కండరాల నొప్పులూ... ఒంటి నొప్పులు!

Published Sun, Jun 16 2024 1:30 PM | Last Updated on Mon, Jun 17 2024 10:45 AM

Muscle Pain: Causes, Symptoms

ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఒళ్లు నొప్పులతో బాధపడటం సహజం. వైద్యపరిభాషలో ‘మయాల్జియా’అనిపిలిచే ఈ ఒళ్లు నొప్పులనేవి ఒక వ్యాధి కాదు... ఎన్నో రుగ్మతల్లో కనిపించేఒక లక్షణం మాత్రమే. నిజానికి అదికండరాల నొప్పి, మృదుకణజాలంలోనొప్పి, ఎముకల్లో నొప్పులు, నరం లాగడం... ఇలా అది ఏదైనా... అవన్నీ ఒళ్లు నొప్పుల రూపంలోనేబయటపడతాయి. అందువల్ల ఒళ్లునొప్పులు వచ్చినప్పుడు అందుకు కారణమేమిటో తెలుసుకుని దానికి తగిన చికిత్స అందించాలి.

ఒళ్లు నొప్పులకు మామూలుగా అ΄ాయకరం కాని కారణాలు మొదలుకొని తీవ్రమైన అస్వస్థత వరకు కారణాలేమైనా కావచ్చు. ఉదాహరణకు... పరిమితికి మించి శ్రమపడ్డప్పుడు, ఒంట్లో  క్యాల్షియమ్, మెగ్నీషియమ్‌ వంటి లవణాలూ, బి12, డి వంటి విటమిన్లు తగ్గినప్పుడు; ఏదైనా ప్రమాదంలో గాయపడ్డప్పుడు ఒళ్లు నొప్పులు రావడాన్ని సాధారణ కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇక అ΄ాయకరమైన కారణాల విషయానికి వస్తే ఆటో ఇమ్యూన్‌ వ్యాధులతో పాటు రాబ్డోమయోలైసిస్‌ వంటి జబ్బులతో బాధపడుతున్నప్పుడు, జీవక్రియల్లో లోపాలతో వచ్చే మెటబాలిక్‌ డిసీజ్‌లతో... ఇలా రకరకాల పరిస్థితుల్లో కండరాల నొప్పులు లేదా ఒళ్లునొప్పులు వస్తాయి. అలాంటి కొన్ని సందర్భాలివి...

కొన్ని వ్యాధులు / ఆరోగ్య సమస్యల్లో... 
డెంగీ వంటి కొన్ని వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌లో. 
 జ్వరం తగ్గాక వచ్చే ఒళ్లునొప్పులు. (వీటిని పోస్ట్‌ వైరల్‌ మయాల్జియాస్‌ అంటారు) 
ట్రైకినోసిస్‌ వంటి పరాన్నజీవులు ఒంట్లోకి చేరడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్‌లో 
 స్పాండిలోసిస్‌ వంటి కేసుల్లో నరం నొక్కుకుపోతున్నప్పుడు. 

కొన్ని మందులతో... 
కొన్ని టీకాలు తీసుకున్నప్పుడు. 
 ఫైబ్రేట్స్‌ లేదా స్టానిన్స్, ఏసీఈ ఇన్హిబిటార్స్, హెచ్‌ఐవీ మందుల వంటివి కొన్ని  వాడుతున్నప్పుడు.

కొన్ని మందుల వాడకం ఆపినప్పుడు... 
👉 కొన్ని రకాల మందులు ముఖ్యంగా కార్టికోస్టెరాయిడ్స్, ఓపియాయిడ్స్, బార్బిట్యురేట్స్, బెంజోడయజిపైన్స్‌ వంటి వాటిని అకస్మాత్తుగా ఆపినప్పుడు.  

👉 ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌ వల్ల... సొంత వ్యాధినిరోధకత సొంత కణాలపై ప్రతికూలంగా పనిచేసే ఆటో ఇమ్యూన్‌ వ్యాధులైన సిస్టమిక్‌ ల్యూపస్‌ అరిథమెటోసస్‌ (ల్యూపస్‌); పాలీమయాల్జియా రుమాటికా; పాలీమైయోసైటిస్‌; డెర్మటోమయోసైటిస్‌; మల్టిపుల్‌ స్కి›్లరోసిస్‌ వంటి కేసుల్లో.

జీవక్రియల్లో లోపాలతో వచ్చే మెటబాలిక్‌ 
డిసీజెస్‌లో... దేహంలో జీవక్రియలన్నీ ఒక క్రమపద్ధతిలో జరగకుండా అస్తవ్యస్తంగా జరుగుతున్నప్పుడు వచ్చే వ్యాధులైన మెటబాలిక్‌ డిసీజెస్‌లో... ఉదాహరణకు  హైపర్‌ థైరాయిడిజమ్‌; హైపో థైరాయిడిజమ్‌; తగినంత ఎడ్రినాలిన్‌ స్రావాలలోపం (అడ్రినాలిన్‌ ఇన్‌సఫిషియెన్సీ); కార్నిటిన్‌ పాల్మిటైల్‌ ట్రాన్స్‌ఫరేజ్‌ లోపం; కాన్స్‌ సిండ్రోమ్‌ వల్ల.

లక్షణాలు... 
మొదటి లక్షణం ఒంటినొప్పులు. వాటితోపాటు... 
నొప్పి కారణంగా దేహంలోని ఆ భాగం కదలలేకపోవడం (కాళ్లూ, చేతుల్లో) 
కండరం బిగుసుకు΄ోవడం లేదా లాగినట్టుగా తీవ్రమైన నొప్పి 
కండరం తీవ్రమైన అలసట (ఫెటీగ్‌) లేదా నీరసానికి గురై ఆ అవయవాన్ని కదిలించలేకపోవడం 
నొప్పి కారణంగా నిద్రపట్టకపోవడం 
కండరాల్లో మంట లేదా సూదితో పోడుస్తున్నట్లుగా నొప్పి. (ఇది ఒకే చోటగానీ  లేదా నొప్పి వస్తున్న పరిసరాలంతటిలోనూ వచ్చే నొప్పి) తీవ్రమైన నొప్పి కారణంగా డిప్రెషన్‌కు లోనుకావడం.

నివారణ: ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా... 
అన్ని పోషకాలతో సమతులాహారం 
క్రమం తప్పని వ్యాయామం 
కంటి నిండా నిద్ర

చికిత్స: 
ఉపశమనం కోసం డాక్టర్ల సలహా మేరకు ఎన్‌ఎస్‌ఏఐడీ (నాన్‌ స్టెరాయిడ్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌) 
👉 ఒళ్లునొప్పులు లేదా కండరాల నొప్పులు వస్తున్నప్పుడు... అందుకు సరైన కారణాన్ని కనుగొని, వ్యాధి నిర్ధారణ తర్వాత ఏ కారణం వల్ల ఆ నొప్పులు వస్తున్నాయన్నది గుర్తించి, దానికి తగిన చికిత్స తీసుకోవడం.
👉 శస్త్రచికిత్సలు: స్పాండిలోసిస్, సయాటికా లేదా నడుము భాగంలోని వెన్నుపూసల అరుగుదల వంటి సందర్భాల్లో నరం నొక్కుకుపోయి వచ్చే నొప్పులు ఎంతకీ తగ్గనప్పుడు చివరి ప్రత్యామ్నాయంగా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.

అపోహ... వాస్తవం: 
👉 కండరం గాయపడటం వల్ల నొప్పి వచ్చినప్పుడు దాంతో మళ్లీ బాగా పని చేయించినప్పుడు అది బాగవుతుంది, నొప్పి తగ్గుతుంది అనేది అ΄ోహ. అలాగే జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు పట్టేసిన కండరం కూడా మళ్లీ అదే ప్రక్రియ చేస్తున్నప్పుడే రిలాక్స్‌ అవుతుందన్నది కూడా అపోహే. నొప్పి వస్తున్నప్పుడు అదే కండరంతో పదే పదే పనిచేయిస్తే అది మరింత గాయపడుతుంది. ఆ గాయాన్ని ‘రిపిటీటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజురీ’ అంటారు. గాయపడి నొప్పిగా ఉన్న కండరానికి నొప్పి తగ్గేవరకు విశ్రాంతి ఇవ్వాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement