Brain stroke
-
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం వారికే ఎక్కువ..!
ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషులందరిలోనూ వైకల్యాలు తెచ్చిపెట్టడంలో లేదా మరణానికి దారితీసే అంశాల్లో పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) ప్రధానమైంది. అయితే అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ లెక్కల ప్రకారం పురుషులతో పోలిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు మహిళల్లోనే ఎక్కువ. దీనికి గల అనేక కారణాలను నిపుణులు వివరిస్తున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల హార్మోన్లలో మార్పులు రావడం చాలా సాధారణంగా జరుగుతుంటుంది. దీనికి అనేక అంశాలు కారణమవుతుంటాయి. అవి... మహిళల్లో తరచూ హార్మోన్లలో మార్పులు రావడం మామూలే. దీంతోపాటు నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రల వల్ల కూడా వాళ్లలో తరచూ హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. ఈ హార్మోన్ల మార్పులే పురుషులతో పోలిస్తే మహిళల్లో పక్షవాతం ఎక్కువగా వచ్చేందుకు కారణమవుతుంటాయి. ఇటీవల మానవులందరిలోనూ ఆయుఃప్రమాణాలు బాగా పెరిగాయి. ఇలా చాలాకాలం జీవిçస్తున్న క్రమంలో హైబీపీ, దాంతోపాటు అనేక రకాల గుండె జబ్బుల (ఉదాహరణకు గుండె స్పందనలు దెబ్బతినడం వల్ల వచ్చే గుండెదడ, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే గుండె పైగదుల స్పందనల్లో వేగం పెరగడం వల్ల అక్కడ రక్తం గడ్డకట్టి అవి ప్రధాన ధమనుల ద్వారా మెదడుకు చేరడం) వంటి కారణాలు బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తుంటాయి. గర్భనివారణ మాత్రలు వాడేవాళ్లలో పొగతాగే అలవాటు ఉండటం స్ట్రోక్ ముప్పును మరింత పెంచుతుంది. ఇక మహిళల్లో గర్భధారణ సమయంలో రక్తపోటు బాగా పెరిగి΄ోయే ప్రీ–ఎక్లాంప్సియా అనే కండిషన్ కూడా బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును పెంచుతుంది. పురుషులతో పోలిస్తే పక్షవాతం వచ్చినప్పుడు లేదా రాబోయే ముందు కనిపించే సాధారణ లక్షణాలైన తీవ్రమైన అలసట, అయోమయం, వికారం లేదా వాంతుల వంటి లక్షణాలు మహిళల్లో అంత ప్రస్ఫుటంగా కనిపించవు. దాంతో సమస్యను గుర్తించడం, సమయానికి చికిత్స అందించడం వంటివి ఆలస్యమయ్యేందుకు అవకాశాలెక్కువ. ఇక పక్షవాతంలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలైన... మాటలు ముద్దముద్దగా రావడం, ముఖంలో ఒకవైపు కిందికి జారినట్లుగా అయిపోవడం వంటివి స్త్రీ, పురుషులిద్దరిలోనూ కనిపించినప్పటికీ మహిళలల్లో ఈ లక్షణాలన్నీ తలతిరిగినట్లు ఉండటం, తీవ్రమైన అలసట, ఎక్కిళ్ల వంటి మాటున అంత స్పష్టంగా కనిపించవు. అయితే ఇలా తల తిరిగినట్లుగా ఉండటం, తీవ్రమైన అలసట, నీరసం వంటివి మహిళల్లో అప్పుడప్పుడూ కనిపించేవే కావడంతో ఈ లక్షణాల మాటున పక్షవాతం దాగుండిపోయినట్లుగా అవుతుంది. దాంతో మహిళల్లో చాలాసేపటికి గాని పక్షవాతాన్ని గుర్తించడం సాధ్యపడకపోవడంతో అసలు విషయం బయటపడేసరికి ఆలస్యమయ్యే ప్రమాదం ఎక్కువ.మహిళల చికిత్స విషయంలో మరింత ప్రాధాన్యం అవసరం.. పక్షవాతం (స్ట్రోక్) విషయంలో పురుషులకూ, మహిళలకూ ఇచ్చే చికిత్స అన్నివిధాలా సమానమే. అయితే కోలుకున్న తర్వాత వారి పనులు వారే చేసుకునే విధంగా ఇచ్చే రిహ్యాబిలిటేషన్ ్ర΄ోగ్రామ్ విషయంలో మాత్రం మహిళలపై మరింత శ్రద్ధ చూ΄ాల్సిన అవసరముంటుంది. ఎందుకంటే వారి రీ–హ్యాబ్, వారిలో తరచూ పునరావృతమయ్యే డిప్రెషన్, నైపుణ్యాలు నేర్చుకునే (కాగ్నిటివ్ స్కిల్స్) ప్రక్రియలు ఆలస్యం కావడం, మానసిక ఆరోగ్యం అన్ని విధాలా బాగుపడేలా చేయడం వంటి అంశాలన్నీ... మహిళలకు రీ–హ్యాబ్ సేవలు మరింత ఎక్కువకాలం అవసరమయ్యేలా చేస్తాయంటున్నారు నిపుణులు.నివారణ మార్గాలు అనుసరించండి... హైబీపీని అదుపులో పెట్టుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వాడటం, ఆహారంలో కొవ్వులు తక్కువగా తీసుకోవడం, ఒకవేళ రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే వాటిని అదుపు చేసే మందులు వాడటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం తోపాటు సంతాన నిరోధక మాత్రలు వాడే మహిళలు, గర్భధారణ సమయంలో ప్రీ–ఎక్లాంప్సియా వచ్చిన వారు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యం విషయంలో క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలో అప్‌లో ఉండటం, అవసరాన్ని బట్టి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) వంటి చర్యలతో నివారణ మార్గాలు అనుసరిస్తుంటే అది స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందంటున్నారు వైద్య నిపుణులు.(చదవండి: మెల్ల ఉందని తెలుసుకోవడమెలా? ఎలా సరిదిద్దాలి..?) -
బ్రెయిన్ స్ట్రోక్: ఇన్‌టైంలో వస్తే.. అంతా సేఫ్..!
కాలూ, చేయి చచ్చుపడినపోతే పక్షవాతం అనిపిలిచే సమస్య వస్తే కేవలం మంచానికి పరిమితమైపోవడమనే అనే భావన ఒకప్పుడు ఉండేది. ఇప్పటికీ కొందరిలో ఉంది. కానీ సమయానికి సరైన చికిత్స అందితే ‘స్ట్రోక్’ అని పిలిచే ఈ సమస్య నుంచి బాగుపడటం సాధ్యమే అని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నెల (అక్టోబరు) 29న వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ‘బ్రెయిన్ స్ట్రోక్’పై అవగాహన కోసం...మెదడును రక్షించుకోవడంలో టైమ్ చాలా కీలకం. స్ట్రోక్ వచ్చాక వైద్యం అందడంలో జరిగే ప్రతి నిమిషం జాప్యానికి కోటీ ఇరవై లక్షల న్యూరాన్లు నశించిపోతుంటాయి. అందుకే ‘‘టైమ్ ఈజ్ బ్రెయిన్’’ అంటారు. అందుకే స్ట్రోక్ గురించి మరింతగా తెలుసుకోవడం అవసరం. స్ట్రోక్‌లో రకాలు... 1) ఇస్కిమిక్ స్ట్రోక్ : రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల మెదడులో ఒక భాగానికి రక్తం అందక ఆ భాగం దెబ్బతినడాన్ని ‘ఇస్కిమిక్ స్ట్రోక్’ అంటారు. 2) హేమరేజిక్ స్ట్రోక్ : మెదడు లోపలి రక్తనాళాలు చిట్లడంతో మెదడులో రక్తస్రావం కావడం వల్ల వచ్చే స్ట్రోక్‌ను ‘హేమరేజిక్ స్ట్రోక్’ అంటారు. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టిఐఏ)... పక్షవాతం లక్షణాలు కనిపించాక అవి ఒకటి నుంచి రెండు గంటలలోపు తగ్గిపోయి బాధితుడు కోలుకుంటే దాన్ని ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్’ అని పిలుస్తారు. అంటే... పెద్ద భూకంపానికి ముందు చిన్న చిన్న ప్రకంపనల్లా ఒక పెద్ద స్ట్రోక్ రావడానికి ముందు సూచనలుగా ఇలాంటివి వస్తుంటాయి. ఒకవేళ చిన్న చిన్న లక్షణాలు కనిపించాక 24 గంటల తర్వాత కూడా బాధితుడు వాటి ప్రభావం నుంచి బయటపడకపోతే అప్పుడు దాన్ని పూర్తిస్థాయి స్ట్రోక్‌గా పరిగణిస్తారు. ఎవాల్వింగ్ స్ట్రోక్ : కాళ్లూ చేతులు చచ్చుబడుతూ పూర్తి స్థాయి స్ట్రోక్ క్రమంగా రావడాన్ని ఎవాల్వింగ్ స్ట్రోక్ అంటారు. ఈ టిఐఏ, ఇవాల్వింగ్ స్ట్రోక్‌లను ముందుగానే గుర్తించి తగిన చికిత్స చేయిస్తే పూర్తిస్థాయి స్ట్రోక్ రాకుండా నివారించవచ్చు. అందుకే పైన పేర్కొన్న ఏదైనా లక్షణం లేదా కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స చేయించుకుని భవిష్యత్తులో పక్షవాతం రాకుండా నివారించుకోవడం సాధ్యమే. స్ట్రోక్‌కు కారణాలు: నిజానికి బ్రెయిన్ స్ట్రోక్ అన్నది ఎవరికైనా రావచ్చుగానీ సాధారణంగా చాలామందిలో హైబీపీ, డయాబెటిస్, పొగతాగడం, అతిగా మద్యం తాగే అలవాటు, సరైన వ్యాయామం లేక΄ోవడం, స్థూలకాయం, ఒత్తిడికి గురికావడం, రక్తంలో కొవ్వులు (కొలెస్ట్రాల్) ఎక్కువగా ఉండటం అనే అంశాలు స్ట్రోక్‌కు కారణమవుతాయి. అలాగే గుండె జబ్బులు, రక్తం గడ్డకట్టే స్వభావం ఎక్కువగా ఉండటమూ స్ట్రోక్‌కు కారణాలే.చికిత్స మొదటి నాలుగున్నర గంటల్లోపు హాస్పిటల్‌కు తీసుకువస్తే అది ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే వాళ్లకు టిష్యూ ప్లాస్మెనోజెన్ యాక్టివేటర్ అనే మందును రక్తనాళంలోకి ఇస్తారు. మొదటి ఆరుగంటలలోపు హాస్పిటల్‌కు తీసుకువస్తే పెద్ద రక్తనాళాలలో అడ్డంకులు (క్లాట్స్) ఏర్పడి స్ట్రోక్ వచ్చినవాళ్లలో స్టెంట్ ద్వారా క్లాట్స్‌ను తొలగించవచ్చు. పై రెండు పద్ధతుల ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చినవారు రక్తం పలుచబడటానికి వాడే మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. లేని పక్షంలో మళ్లీ స్ట్రోక్ రావచ్చు. అలాగే హైబీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు వాటిని అదుపులో పెట్టే మందులు వాడాలి. పునరావాస సేవలు (రీహ్యాబిలిటేషన్ సర్వీసెస్): స్ట్రోక్ వచ్చిన మొదటిరోజు నుంచే మొదలుపెట్టి తమ రోజువారీ కార్యక్రమాలను స్వతంత్రంగా చేసుకునేవరకు ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, సరైన రీతిలో నడిచేలా శిక్షణ వైద్యచికిత్సలో ముఖ్యం. స్టోక్ నిర్ధారణ ఇలా... సీటీ స్కాన్ (బ్రెయిన్)తో స్ట్రోక్ వచ్చిందనే నిర్ధారణ తోపాటు... అది ఇస్కిమిక్ స్ట్రోకా లేదా హేమరేజిక్ స్ట్రోకా అన్నది నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ సీటీ స్కాన్ (బ్రెయిన్)లో నిర్ధారణ కాక΄ోతే ఎమ్మారై (బ్రెయిన్), ఎమ్మార్ యాంజియో పరీక్ష చేయించాలి. అలాగే ఈ స్ట్రోక్ ఎందుకు వచ్చిందో తెలుసుకుని, మళ్లీ రాకుండా చూసుకోడానికి టూడీ ఎకో, గొంతు రక్తనాళాల డాప్లర్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించడం, షుగర్ మోతాదులు తెలుసుకోవడం... ఇవన్నీ రొటీన్‌గా చేయించే పరీక్షలు. చిన్న వయసులో స్ట్రోక్ వచ్చినా లేదా మందులు వాడుతున్నప్పటికీ మళ్లీ స్ట్రోక్ వచ్చినా కొన్ని అరుదైన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.లక్షణాలుపక్షవాతంలో సాధారణంగా ఒక చేయీ, కాలూ చచ్చుపడిపోవడం మూతి వంకరపోవడం / మాట స్పష్టంగా రాకపోవడం కళ్లు తిరిగి పడిపోవడం శరీరం తూలడం మాట పడిపోవడం ఒకవైపు చూపు తగ్గిపోవడం మింగడం కష్టం కావడం ఎదురుగా ఉన్న వస్తువులు, మనుషులు ఒకటి రెండుగా/ఒకరు ఇద్దరుగా కనిపించడంఅరుదుగా పూర్తిగా స్పృహతప్పి పడిపోవడం జరగవచ్చు. పైన పేర్కొన్నవాటిల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపించవచ్చు. నివారణే ప్రధానం... జీవనశైలి (లైఫ్‌స్టైల్)లో, ఆహారంలో మార్పులు లైఫ్ స్టైల్ మార్పులుప్రతిరోజూ వ్యాయామం మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం తిండి, నిద్రలలో వేళలు పాటించడం.ఆహారంలో మార్పులివి ఉప్పు తగ్గించడం తాజా కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సరైన సమయంలో చికిత్స పొందితే స్ట్రోక్ వల్ల మంచానికే పరిమితమైపోతామనే దురభిప్రాయం నుంచి బయటికి రావచ్చు. (చదవండి: పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే..? మనసులో సునామిలా..) -
కొలెస్ట్రాల్ పూర్తిగా హానికరమేనా?
శరీరంలో కాలేయం ఉత్పత్తి చేసే ఒకలాంటి కొవ్వుని కొలెస్ట్రాల్ అంటారు. మన శరీర ప్రతికణంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ అనగానే అదేదో ఆరోగ్యానికి చాలా హానికరమనీ, చెడు చేస్తుందనే అభి్రపాయం పెరిగింది. కానీ జీవక్రియలకు పరిమిత మోతాదులో కొలెస్ట్రాల్ చాలా అవసరమే కాకుండా ఉండాల్సిన మోతాదులో ఉంటే మంచి చేస్తుంది కూడా.ఏ కొలెస్ట్రాల్‌తో డేంజర్?కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు రెండూ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పాళ్లు ఉండాల్సిన పరిమితిలో ఉండి, శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ కూడా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను ‘హై డెన్సిటీ లైపో్రపోటీన్’ (హెచ్‌డీఎల్) అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ‘లో డెన్సిటీ లైపో్రపోటీన్’ (ఎల్డిఎల్) అంటారు. అందుకే ఎల్‌డీఎల్‌ను ‘‘చెడు కొలెస్ట్రాల్’’ (బ్యాడ్ కొలెస్ట్రాల్) అంటారు. అదే హెచ్‌డీఎల్ రక్తనాళాల్లోకి కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే దీన్ని ‘‘వుంచి కొలెస్ట్రాల్’’ (గుడ్ కొలెస్ట్రాల్) అని అంటారు. మన శరీరంలో ఎప్పుడు హెచ్‌డీఎల్ ఎక్కువగా ఉండి ఎల్డీఎల్ తక్కువగా ఉండేలా మంచిది. ఈ ఎల్డీఎల్ ఉండాల్సిన మోతాదు కంటే మించితే అది రక్తనాళాల్లో చేరి రక్తప్రవాహాన్ని అడ్డుకుని గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారితీసే అవకాశం ఉంది. అందుకే చెడు కొలెస్ట్రాల్‌ను ఉండాల్సిన పరిమితికి మించకుండా చూసుకోవాలని జాగ్రత్త చెబుతారు.మోతాదు కనుగొనడం ఎలా? వున శరీరంలో కొలెస్ట్రాల్ మోతాదులను రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. పన్నెండు గంటలపాటు ఏమీ తినకుండా ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరీక్షలో ఎల్డీఎల్ (లో డెన్సిటీ లైపో్ర ప్రోటీన్ లెవల్), హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లైపో ప్రోటీ లెవెల్) తెలుస్తాయి. ఎల్డీఎల్ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది.మంచి కొలెస్ట్రాల్ కోసం... కొలెస్ట్రాల్ ఉండే గుడ్డు వంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అయితే వాటిని పరిమితంగా తీసుకోవాలి. అందరికీ అందుబాటులో ఉండే గుడ్డులోని తెల్లసొనలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. పచ్చ సొనలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. సరైన వ్యాయామం లేకపోవడం, ఫ్యామిలీ హిస్టరీ, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. అందుకే గతంలో ఎలాంటి లక్షణాలూ లేనివారు కూడా 40 ఏళ్లు పైబడ్డాక ప్రతి ఐదేళ్లకోవూరు పరీక్ష చేయించుకోవాలి. అదే రిస్క్ఫ్యాక్టర్స్ ఉన్నవారైతే డాక్టర్ సలహా మేరకు ప్రతి ఏడాదీ, లేదా డాక్టర్ సూచించిన ప్రకారం కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. -
వాతావరణ మార్పులతో ‘బ్రెయిన్ స్ట్రోక్’
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఉష్ణోగ్రతలతో స్ట్రోక్ మరణాలు, పక్షవాత వైకల్య బాధితులు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దాదాపు మూడు దశాబ్దాల డేటాను విశ్లేషించడం ద్వారా వాతావరణ మార్పులతో స్ట్రోక్ ప్రమాదం ముడిపడి ఉన్నట్టు నిర్ధారించారు. 2019లో 5.20 లక్షలకు పైగా స్ట్రోక్ మరణాలపై శీతల గాలులు, మండే వేడి తరంగాలు తీవ్ర ప్రభావం చూపాయని న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనం వెల్లడించింది. స్ట్రోక్ మరణాల్లో అధిక భాగం 4.70 లక్షల కంటే ఎక్కువ మరణాలు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సంభవించినప్పటికీ.. 1990తో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతల పెరుగుదలతో మరణించిన వారి సంఖ్య స్వల్పంగా పెరిగినట్టు కనుగొంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంనాటకీయ ఉష్ణోగ్రత మార్పులు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని చైనాలోని చాంగ్షాలోని జియాంగ్యా హాస్పిటల్ సెంట్రల్ సౌత్ వర్సిటీకి చెందిన అధ్యయనం నివేదిక చెబుతోంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా స్ట్రోక్ ప్రమాదం వేగంగా పెరుగుతోందని, పదేళ్లు దాటిన వారితో పాటు ఆఫ్రికా వంటి వెనుకబడిన దేశాల్లో ప్రమాదం పొంచి ఉందని అధ్యయనం స్పష్టం చేస్తోంది. వృద్ధాప్యం కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని సూచిస్తున్నాయని పేర్కొంది. భారతదేశంలో సరైన ఉష్ణోగ్రతలు లేని కారణంగా 33 వేల స్ట్రోక్ మరణాలు సంభవిస్తే.. వాటిల్లో 55 శాతం ఉష్ణోగ్రతలు పెరగడంతో, 45 శాతం ఉండాల్సిన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం ప్రధాన కారణమని విశ్లేషించింది. పురుషుల్లోనే ఎక్కువఉష్ణోగ్రతల్లో మార్పులతో పక్షవాతం వచ్చి మరణించే వారి సంఖ్య ప్రతి లక్ష మందిలో 5.9 శాతం మంది మహిళలు కాగా.. పురుషుల్లో 7.7 శాతం ఉన్నట్టు అధ్యయన బృందం తేల్చింది. మధ్య ఆసియాలో లక్ష మందిలో 18 మంది అనుకూలంగా లేని (నాన్–ఆప్టిమల్) ఉష్ణోగ్రతల కారణంగా అత్యధిక స్ట్రోక్‌కు మరణాల రేటు నమోదైంది. శిలాజ ఇంధనాల దహనం, అటవీ నిర్మూలన, పారిశ్రామిక కాలుష్యం వాతావరణాన్ని పెను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ముప్పును తగ్గించే లక్ష్యంతో ప్రపంచ దేశాలు పని చేయాలని సూచిస్తోంది.ఎందుకు జరుగుతోందంటే..!చల్లని ఉష్ణోగ్రతలు మానవ శరీరంలోని సునిశిత నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు రక్తనాళాల్లో అధిక రక్తపోటును పెంచి స్ట్రోక్‌లకు దారి తీస్తోందని అధ్యయన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతలో వేడి ఉష్ణోగ్రతలు నిర్జలీకరణానికి కారణమవుతాయని.. తద్వారా రక్తం చిక్కబడటం (క్లాట్స్) వల్ల స్ట్రోక్ ప్రమాదాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. -
ఉపాధికి గల్ఫ్ వెళ్లి.. శవంలా తిరిగొచ్చి..
జన్నారం: ఉన్న ఊరిని.. కట్టుకున్న భార్యను.. కనిపెంచిన తల్లీదండ్రులను వదిలి ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన యువకుడు శవమై తిరిగొచ్చాడు. బ్రేన్ స్టోక్‌తో 24 రోజుల క్రితం మృతిచెందగా అప్పటి నుంచి చివరి చూపు కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. జన్నారం మండలం దేవునిగూడ గ్రామానికి చెందిన కునారపు వెంకటేశ్(24) ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ఉన్న ఊరిలో ఉపాధి లేక ఆరు నెలల క్రితం ఏజెంట్‌కు డబ్బులు పెట్టి ఇరాక్ దేశంలోని ఇబ్రహిల్ పట్టణానికి వెళ్లాడు. విధులు నిర్వహిస్తుండగా జనవరి 30న బ్రేన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే కంపెనీ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటి నుంచి భర్త మృతదేహం కోసం కంటిలో నీరు కడుపులో దాచుకుని భార్య ఎదురుచూస్తోంది. శుక్రవారం పెట్టెలో భర్త మృతదేహం స్వగ్రామానికి రావడంతో భార్య రోదన ఎవరు ఆపలేకపోయారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కల్లెడ భూమన్న, వర్కింగ్ ప్రసిడెంట్ తిరుపతి, సంఘం నాయకులు ఎల్లయ్య, కునారపు భీమరాజు మృతదేహం వద్ద నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా అప్పుల పాలైనా వెంకటేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతదేహం స్వగ్రామం రావడానికి సహకరించిన ఎమిగ్రేట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంద భీంరెడ్డి, అంబులెన్స్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. -
యంగ్ స్ట్రోక్
విజయవాడకు సమీపంలోని పెనమలూరుకు చెందిన ఆటోడ్రైవర్ వెంకట్ (38)కు ఇటీవల ఆకస్మికంగా కాలు, చేయి చచ్చుబడిపోయాయి. విజయవాడలోని యనమలకుదురుకు చెందిన నగరపాలక సంస్థ డ్రెయినేజీ విభాగ ఉద్యోగి రాజేష్ (42) విధుల్లో ఉండగా.. చేయి చచ్చుబడింది. క్షణాల్లోనే గుర్తించిన స్థానికులు వెంకట్, రాజేష్‌లను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తక్షణమే సీటీ స్కాన్ చేసిన వైద్యులు వారు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడినట్టు గుర్తించారు. వెంటనే త్రోంబొలైసిస్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. వైకల్యం రాకుండా ఇద్దరినీ కాపాడగలిగారు. సాధారణంగా 55–60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) సంభవించేది. ఇటీవల కాలంలో 45 ఏళ్లలోపు వారిలో ఈ కేసులు అధికమవుతున్నాయి. లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఇటీవల కాలంలో స్ట్రోకింగ్ యంగ్ (45 ఏళ్లలోపు వారిలో బ్రెయిన్ స్ట్రోక్) కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిపై వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలకు వస్తున్న వారిలో స్ట్రోకింగ్ యంగ్ కేసులు ఎక్కువగా ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కదలిక లేని జీవన విధానం.. తీవ్రమైన వత్తిళ్లు.. రక్తం, రక్తనాళాల్లో లోపాలు.. ధూమపానం.. హెరాయిన్ లాంటి మత్తు పదార్థాల వినియోగం.. వంశపారంపర్య కారణాలు 30 ఏళ్లకే బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమవుతున్నాయి. 25% ‘స్ట్రోకింగ్ యంగ్’ కేసులే ఒకప్పుడు వయస్సు 55, 60 ఏళ్ల వారు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యేవారు. కానీ.. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్న వారిలో 25 నుంచి 30 శాతం మంది 30–45 ఏళ్లలోపు యువతే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వాస్పత్రిలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తున్నారు. స్ట్రోక్ తీవ్రతను బట్టి జనరల్ మెడిసిన్, ఏఎంసీ, న్యూరాలజీ విభాగాల్లో చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తున్న వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగకపోవడం వలన వచ్చే స్ట్రోక్ (ఇస్కిమిక్) 80 శాతం మంది, రక్తనాళాలు చిట్లిపోయి (హెమరైజ్డ్) 20 శాతం మంది ఉంటున్నారు. గోల్డెన్ అవర్‌లో గుర్తించడం ముఖ్యం ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్‌కు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. లక్షణాలను గుర్తించి.. నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే స్ట్రోక్ కారణంగా వైకల్యం బారినపడకుంటా వైద్యులు కాపాడగలుగుతున్నారు. ఇస్కిమిక్ స్ట్రోక్ వచి్చన వారికి త్రోం»ొలైసిస్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రక్తంలోని పూడికలు కరిగేలా చేస్తున్నారు. ముఖం, చేయి, కాలు ముఖ్యంగా శరీరం ఒకవైపున ఆకస్మిక తిమ్మిరి, బలహీనత ఏర్పడటం, అకస్మికంగా గందరగోళం ఏర్పడటం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కంటిచూపు మందగించడం, తల తిరగడం, బ్యాలెన్స్ తప్పడం, ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి వంటివి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. స్ట్రోక్‌కు కారణాలివీ పెద్ద వయసుల వారిలో రక్తపోటు, మధుమేహం స్ట్రోక్‌కు కారణమవుతోంది. అయితే.. 45 ఏళ్లలోపు వారిలో హోమోసిస్టీన్, సికిల్ సెల్ అనీమియా, రక్తంలో జన్యుపరమైన లోపాలు, హెరాయిన్ వంటి డ్రగ్స్ వినియోగం, మితిమీరిన మద్యపానం, ధూమపానం, ప్రమాదాల్లో తలకు గాయాలైన వారిలో ఎక్కువగా స్ట్రోక్ వస్తున్నట్టు వైద్యులు చెపుతున్నారు. వీరితో పాటు కదలిక లేని జీవన విధానం కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి స్ట్రోక్‌కు గురవుతున్న కేసులూ ఉంటున్నాయి. మహిళల్లో హార్మోన్స్ ఇబ్బందులు, రక్తనాళాల్లో లోపాల కారణంగా స్ట్రోక్ రావచ్చంటున్నారు. గుండె లోపాలు ఉన్న వారిలోనూ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. యువకుల్లోనూ కేసులు ఇటీవల 45 ఏళ్లలోపు యువత బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతోంది. స్ట్రోక్ కేసుల్లో 25% యువతే ఉండటం గమనార్హం. బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడినవారు 4 గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే వైకల్యం లేకుండా కాపాడవచ్చు. – డాక్టర్ దారా వెంకట రమణ, న్యూరాలజిస్ట్, జీజీహెచ్ -
జమ్ములో ఏపీ జవాను మృతి
తుని రూరల్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవానుగా జమ్ములో విధులు నిర్వహిస్తున్న తంతటి కిరణ్ కుమార్ (41) సోమవారం బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. తుని మండలం హంసవరం గ్రామం ఆయన స్వస్థలం. కిరణ్‌కుమార్ మృతి సమాచారం తెలియడంతో ఆయన భార్య విజయకుమారి, సోదరుడు రవికుమార్ హుటాహుటిన జమ్మూ వెళ్లారు. వారికి కిరణ్ కుమార్ పార్థివ దేహాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో అప్పగించారు. భర్త మృతదేహాన్ని చూసి విజయకుమారి కన్నీరు మున్నీరుగా విలపించారు. రాత్రికి విశాఖపట్నానికి చేరుకుని తెల్లవారుజామున మృతదేహాన్ని గ్రామానికి తీసుకువస్తామని బంధువులు తెలిపారు. కిరణ్‌కుమార్ మృతదేహానికి బుధవారం ఉదయం అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కిరణ్ కుమార్‌కు భార్యతో పాటు కుమారుడు జతిన్ (12), కుమార్తె మెర్సీ (10), తల్లిదండ్రులు జాన్, భాగ్యవతి ఉన్నారు. దేశ సేవలో ఇద్దరు కుమారులు హంసవరం గ్రామానికి చెందిన జాన్, భాగ్యవతి దంపతులకు ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూండగా రెండో కుమారుడైన కిరణ్ కుమార్ 2005లో సీఆర్పీఎఫ్లో చేరారు. మూడో కుమారుడు రవికుమార్ ఆర్మీలో చేరాడు. ఇద్దరు కొడుకులు దేశ రక్షణలో సేవలు అందిస్తూండటం తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్నిచ్చిందని, కిరణ్ కుమార్ మృతి పుత్రశోకాన్ని మిగిల్చిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. కిరణ్ కుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులను సర్పంచ్ రాయి మేరీ అవినాష్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
బ్రెయిల్ స్ట్రోక్ రావడానికి కారణాలివే.. ఎవరికి వస్తుందంటే?
స్ట్రోక్ అంటే చాలా మంది హార్ట్ ఎటాక్ అనుకుంటారు. అలాగే మెదడుకు వచ్చే పోటును బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. దీనిపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కాళ్లు, చేతులు పడిపోతేనో, మూతి వంకర పోయిన తర్వాత మాత్రమే వైద్యుల వద్దకు వెళుతున్నారు. అయితే లక్షణాలను ముందుగా గుర్తించి వెంటనే వైద్యుల వద్దకు వెళితే జరగాల్సిన నష్టాన్ని సాధ్యమైనంతగా నివారించవచ్చు. నేడు వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. నెల్లూరు సిటీ: మారుతున్న జీవన విధానం, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. కరోనా తరువాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. వ్యాధుల లక్షణాలను బట్టి ముందుగా వైద్యులను సంప్రదించడం ఎంతో అవసరం. దీనినే గోల్డెన్ పీరియడ్ అంటారు. తద్వారా జరగబోయే నష్టాన్ని వీలైనంతగా నివారించే అవకాశం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించి కూడా ముందుగా కనిపించే లక్షణాలను బట్టి డాక్టర్లను సంప్రదిస్తే ప్రమాదం నుంచి బయటపడవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం అక్టోబర్ 29వ తేదీన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తోంది. బ్రెయిన్ స్ట్రోక్ అంటే.. సాధారణంగా శరీరంలో అన్ని భాగాల్లో రక్త సరఫరా సంపూర్ణంగా జరగాలి. అలా జరిగితేనే ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో ఏ భాగానికై నా రక్త సరఫరా సక్రమంగా జరగకపోతే ఆ భాగం అచేతనంగా మారుతుంది. ఏ సందర్భంలోనైనా మెదడుకు ఆ స్థితి ఎదురైతే మరణం సంభవిస్తుంది. దీనినే వైద్య పరిభాషలో బ్రెయిన్ స్ట్రోక్ అని అంటారు. రక్త ప్రసరణలో అసమతుల్యతకు రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి కొవ్వు చేరడం వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం, రెండోది రక్తనాళాలు బలహీనపడి చిట్లడం. స్ట్రోక్ శరీరంలో ఏ భాగానికై నా రావచ్చు. సదరు శరీర భాగానికి రక్తం అందకపోవడం, గడ్డ కట్టడం వల్ల పక్షవాతం వస్తుంది. ఈ స్థితి నుంచి కోలుకోవడం అంత సులభమైన విషయం కాదని వైద్యులు చెబుతున్నారు. మెదడు, గుండెకు వచ్చే స్ట్రోక్‌లు ప్రాణాంతకాలని పేర్కొంటున్నారు. కరోనా తర్వాత పెరిగిన కేసులు కోవిడ్–19 ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. కరోనా తరువాత మనిషిలో కొత్తగా అనేక ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైన సమస్య థ్రాంబోసిస్ ఒకటి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం చాలామందిలో వారికి తెలియకుండానే జరుగుతోంది. తద్వారా స్ట్రోక్‌కు గురయ్యే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. వయస్సుతో నిమిత్తం లేకుండా.. గతంలో ఓ నిర్ధిష్ట వయస్సు తర్వాతే స్ట్రోక్ వచ్చేది. అప్పట్లో 40 ఏళ్ల నంచి 60 ఏళ్ల వయస్సు లోపు వారిలోనే ఈ సమస్య కనిపించేది. ఇటీవల కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికై నా ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల చిన్న వయస్సు వారిలోనూ ఈ సమస్యను గుర్తిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయమైన వారికి, భారీ శరీరం కలవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి, వంశ పారంపర్యంగా పక్షవాతం వచ్చే వారికి, మద్యపానం.. ధూమపానం చేసే వారికి, రక్తం చిక్కబడడం, రక్తనాళాలు పటుత్వం కోల్పోవడం ద్వారా స్ట్రోక్ ముప్పు ఉంటుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చేస్తే మేలు ► అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లేకుండా చూసుకోవాలి. ► మద్యం, పొగ తాగడం పూర్తిగా వదిలివేయాలి. ► ఒత్తిడికి గురికాకూడదు. ► రోజూ కనీసం అర్ధగంటపాటు నడక కానీ, వ్యాయామం కానీ చేయాలి. ► ఉప్పు తినడం తగ్గించాలి. శరీర బరువు అదుపులో ఉంచుకోవాలి. ► గుండె కొట్టుకోవడంలో మార్పులు గమనించాలి. ► డయాబెటిస్ ఉన్న వారు గ్లూకోజ్ స్థాయిని నియంత్రించుకోవాలి. ► ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు, చేపలు, తృణధాన్యాలు ఆహారంగా తీసుకోవాలి. ► బీపీ, షుగర్, గుండె సంబంధిత మందులు వాడుతున్న వారు ఆపకూడదు. ► తిన్న వెంటనే పడుకోవడం శ్రేయస్కరం కాదు. ఆరోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచుకోవాలి ఆరోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా 90 శాతం బ్రెయిన్ స్ట్రోక్‌ను నివారించవచ్చు. రోగి వయస్సు, ఆరోగ్య పరిస్థితిని బట్టి స్ట్రోక్ నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయి. బీపీ, షుగర్లను కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. గుండె జబ్బుకు సంబంధించిన మందులను ఆపకూడదు. – డాక్టర్ ఎ.హేమలతారెడ్డి, న్యూరాలజిస్ట్, ఎండీ, డీఎం గోల్డెన్ పీరియడ్ ఎంతో కీలకం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే నాలుగున్నర గంటల్లోపు సమీప న్యూరోఫిజీషియన్ ఉన్న ఆస్పత్రికి వెళితే వెంటనే వారు థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ వేస్తారు. ఇది వెంటనే రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని పలుచబడేలా చేసి రక్త ప్రసరణలో ఇబ్బందులు లేకుండా చేస్తుంది. నాలుగున్నర గంటలు దాటితే ప్రతి నిమిషానికి బ్రెయిన్లో న్యూరాన్స్ తగ్గిపోతాయి. ఈ గోల్డెన్ పీరియడ్ ఎంతో కీలకం. – డాక్టర్ ఎ.యామిని, న్యూరాలజిస్ట్, ఎండీ, డీఎం -
బ్రెయిన్ స్ట్రోక్..నెల రోజుల ముందుగానే ఇలా గుర్తించవచ్చు
ఈ మధ్యకాలంలో చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా చనిపోతున్నారన్న వార్తలు తరచు వింటున్నాం. ఈ నేపథ్యంలో బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్య రాకముందే దీని గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి పరిస్థితి నుంచి బయటపడొచ్చు. ఇంతకీ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చూద్దాం. మెదడు కణాలకు ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా నిలిచిపోవడంతో వచ్చే ప్రమాదమే బ్రెయిన్ స్ట్రోక్. ఈ వ్యాధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అయితే కొన్నిసార్లు సమస్యను ముందే పసిగడితే ప్రమాదం నుంచి బయటపడొచ్చంటున్నారు వైద్య నిపుణులు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలపై అవగాహన ఏర్పరచుకుంటే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ ఎన్ని రకాలు? బ్రెయిన్ స్ట్రోక్‌ను సాధారణంగా ఐస్కీమిక్ స్ట్రోక్, హీమోరజిక్ స్ట్రోక్, ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్‌లుగా మూడు రకాలుగా గుర్తించవచ్చు. ఐస్కీమిక్ స్ట్రోక్: ఇది మెదడుకు దారితీసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయిన సందర్భాల్లో వచ్చే స్ట్రోక్‌ని ఐస్కీమిక్ స్ట్రోక్‌గా పిలుస్తారు. హీమోర్హజిక్ స్ట్రోక్: మెదడు రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కలిగే స్ట్రోక్ ఇది. రక్తస్రావం జరగడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్: ఉన్నట్టుండి రక్త సరఫరా ఆగిపోతుంది. మళ్ళీ దానంతట అదే తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ స్థితినే ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్ అంటారు. ఒకరకంగా దీన్ని బ్రెయిన్ స్ట్రోక్‌కి హెచ్చరికగా భావించవచ్చు. ఈ లక్షణాన్ని నిర్దిష్ఠ కాలంలో గుర్తించి, చికిత్స అందిస్తే బ్రెయిన్ స్ట్రోక్‌ను అడ్డుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ►ఏ రకమైన స్ట్రోక్ వచ్చినా ముందుగా తలనొప్పి వస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ సాధారణ లక్షణం తలనొప్పి.కరోటిడ్ ఆర్టరీ నుండి స్ట్రోక్ మొదలవుతుంది. ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ముఖం ఓ వైపుకి వంగిపోవవడం,రెండు చేతులు పైకి ఎత్తకపోవడం,ఓ చేయి తిమ్మిరి, బలహీనంగా మారడం, నడవలేకపోవడం వంటివి దీని లక్షణాలు. ►అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని జాగ్రత్తపడాలి. ► ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఒక సర్వే ప్రకారం.. 10శాతం మంది మహిళలలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. మహిళల్లో స్ట్రోక్ వచ్చే ముందు మార్పులు.. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంటుంది. మహిళల్లో స్ట్రోక్ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చని నిపుణులు అంటున్నారు. ఉన్నట్టుండి కొన్ని విషయాలు మర్చిపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు తెలుస్తుంటాయి. అంతేకాకుండా వికారం, వాంతులు, మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు, వికారంగా ఉండటం వంటివి కనిపిస్తాయి. ఇక చూపులో సమస్యతో పాటు భ్రమ పడుతున్నట్లు కూడా అనిపిస్తుంటుందట. ఈ స్ట్రోక్ వచ్చే ముందు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల మెదడులో రక్త గడ్డ కట్టే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు గర్భస్రావాలు జరుగుతుంటాయి. అది స్ట్రోక్ రిస్క్ ను పెరిగేలా చేస్తుంది. అడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే డీహెచ్ఈఏ హార్మోన్ వెంటనే తగ్గిపోతుంది. దాని వల్ల ఈస్ట్రోజన్లు, ఆండ్రోజన్స్ తగ్గిపోతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గల కారణాలు అధిక రక్తపోటు,డయాబెటిస్,అధిక కొలెస్ట్రాల్,ధూమపానం, మధ్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం, వీటితో పాటు ఎక్కువగా ఆందోళన చెందడం, గుండె వ్యాధులు, అధిక ప్లాస్మా లిపిడ్స్ వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు. ముందుగానే సమస్యను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. కానీ జన్యు సంబంధిత కారణాలు, వృద్ధాప్యం,ఇంతకుముందే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడటం వంటివి స్ట్రోక్ ముప్పును శాశ్వతంగా కలిగిస్తాయి. వీటి నుంచి మనం తప్పించుకోలేం. చికిత్స ఇలా.. పైన వివరించిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బీపీ, షుగర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండటమే కాకుండా బరువును అదుపులో ఉంచుకోవాలి. స్ట్రోక్ నుంచి నెల ముందే కాపాడొచ్చు బ్రెయిన్ స్ట్రోక్‌కు నెల ముందు వచ్చే లక్షణాలను పసిగడితే ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చు. ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం వంటివి సాధారణ లక్షణాలే అయినా, బ్రెయిన్ స్ట్రోక్‌కు ముందు ఇలా జరుగుతుంది. ముఖం, చేతులు, కాళ్లు ఒక వైపు మాత్రమే మొద్దుబారడం కూడా జరగుతుంది. కంటి చూపులో తేడా వస్తుంది. కళ్లు మసకబారడం లాంటివి జరుగుతుందని యూకేలో 1300మందిపై ఇటీవలె జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన చాలామంది ఆడవాళ్లలో కనిపించిన మరో లక్షణం తలనొప్పి. ఒక్కో సమయంలో స్పృహ కూడా కోల్పోయి పడిపోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు. - డాక్టర్ నవీన్ రోయ్,ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఫోన్ -9703706660 -
షాకింగ్ ఘటన.. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ..
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని అర్బన్ అల్లిపురంలో విషాద ఘటన జరిగింది. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ ఓ మహిళ సడన్‌గా కుప్పకూలింది. అనంతరం హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించినట్లు నిర్ధారించారు. మృతురాలి పేరు రాణి. బంధువుల పెళ్లికి హాజరై ఊరేగింపులో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అప్పటిదాకా ఆనందంగా సాగుతున్న పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. రాణి మృతితో కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఊరేగింపును అర్ధాంతరంగా నిలిపివేశారు. చదవండి: పెళ్లింట విషాదం.. అప్పుడు వరుడి తండ్రి.. ఇప్పుడు వధువు తండ్రి.. -
చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్' ఘటనలు.. సరిగా నిద్రపోతున్నారా?
కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన 44 ఏళ్ల బసవయ్య విజయవాడ నగరపాలక సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. ఇతనికి మొన్న డిసెంబర్ 20న విధి నిర్వహణలో ఉండగా ఎడమవైపు చెయ్యి, కాలు చచ్చుబడిపోయాయి. దీంతో తోటి ఉద్యోగులు విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. బ్రెయిన్ స్టోక్‌గా వైద్యులు నిర్థారించారు. గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి వెళ్లడం, సకాలంలో వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ఐదున్నర గంటల వ్యవధిలో బసవయ్య తేరుకున్నాడు. విశాఖపట్నం నగరానికి చెందిన 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం ఇంట్లో ఉన్నట్టుండి స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లుగా వైద్యులు గుర్తించారు. సాక్షి, అమరావతి: ..ఈ రెండు ఘటనల్లో తీవ్రమైన పనిఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు స్ట్రోక్‌కు దారితీసినట్లు వైద్యులు తెలిపారు. ఈ తరహా యంగ్ స్ట్రోక్ ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకప్పుడు 50–60 ఏళ్లు పైబడిన వారు బీపీలు, సుగర్లు నియంత్రణలో లేకపోవడంతో స్ట్రోక్ గురయ్యేవారు. అయితే, ఇప్పుడు మార్పు వచ్చింది. ప్రస్తుతం నమోదవుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో 20–30 శాతం బాధితుల వయస్సు 45 ఏళ్ల లోపే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. అలాగే, రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఓపీలు ఏటా పెరుగుతూ వస్తున్నాయి. 2020–21లో 1,476, 2021–22లో 24,197, ప్రస్తుత సంవత్సరంలో జనవరి నెలాఖరు నాటికి 22,928 ఓపీలు నమోదయ్యాయి. ముప్పు తెచ్చిపెడుతున్న ఆధునిక జీవన శైలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి మానవాళికి అనేక రకాల ముప్పును తెచ్చిపెడుతున్నాయి. ఇందులో బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో చదువుకునే పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీనిని అధిగమించే చర్యలు చేపడుతున్న వారు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నారు. దీంతో చిన్న వయసులోనే సుగర్, బీపీలు, ఊబకాయం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాక.. బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, కిడ్నీ, ఇతర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. యువతలో బ్రెయిన్ స్ట్రోక్‌కు వైద్యులు చెబుతున్న కారణాలు.. ► పొగతాగడం, మద్యం సేవించడం, గంజాయి, డ్రగ్స్ తీసుకోవడం. ► 15–24 ఏళ్ల వయస్సులోనే యువత మద్యం, ధూమపానానికి అలవాటు పడుతున్నారు. ఈ వయస్సులో స్మోకింగ్ అలవాటు చేసుకున్న వారికి పదేళ్లు గడిచేసరికి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనబడుతున్నట్లు తెలుస్తోంది. ధూమపానం, మద్యపానానికి బానిసలైన వారిలో 70–80 శాతం బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ► బీపీ, సుగర్ నియంత్రణలో లేకపోవడం.. ఊబకాయం ఉండటం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 25 శాతం మంది బీపీ, సుగర్‌లతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ఆధారంగా రాష్ట్రంలో 36.3 శాతం మంది మహిళల్లో, 31.3 శాతం పురుషుల్లో ఊబకాయం ఉంది. ► మహిళలు నెలసరిని వాయిదా వేయడం, అధిక రక్తస్రావాన్ని నియంత్రించుకోవడం కోసం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా మందులు వాడటం. ► కరోనా బారినపడి కోలుకున్న 5 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. జీవనశైలిలో మార్పు రావాలి ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజ్ స్ట్రోక్.. ఇలా రెండు రకాలుగా బ్రెయిన్ స్ట్రోక్ ఉంటుంది. మెదడులోని రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడంవల్ల శరీరంలోని కొన్ని భాగాలు చచ్చుబడటాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. రక్తనాళాలు చిట్లినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. హైబీపీ ఉన్న వారిలో హెమరేజ్ స్ట్రోక్ వస్తుంది. మా వద్దకు ఓపీ ఉన్న రోజుల్లో సగటున ఐదు కొత్త కేసులు వస్తున్నాయి. స్ట్రోక్ బాధితులను గోల్డెన్ అవర్‌లో బాధితులను ఆస్పత్రికి తీసుకుని వస్తే ప్రాణాపాయం నుంచి తప్పించడానికి ఆస్కారం ఉంటుంది. జీవనశైలిలో మార్పు చేసుకోవడంతో పాటు, బీపీ, సుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై ప్రజల్లో సరైన అవగాహన పెరిగితే స్ట్రోక్ ఘటనలను అరికట్టవచ్చు. – డాక్టర్ దార వెంకట రమణయ్య, న్యూరాలజీ విభాగాధిపతి, విజయవాడ జీజీహెచ్ 25 శాతం కేసులకే సర్జరీ అవసరం బ్రెయిన్ స్ట్రోక్ ఘటనల్లో 25 శాతం మందికే సర్జరీ అవసరమవుతుంది. మిగిలిన 75 శాతం మెడికల్ మేనేజ్మెంట్తో నయమవుతుంది. కరోనా అనంతరం సర్జరీ ఘటనలు ఐదు శాతం మేర పెరిగాయి. కరోనా వచ్చిన వారిలో స్ట్రోక్ ఘటనలు కనిపిస్తున్నాయి. 25ఏళ్లలోపు వారు కూడా బ్రెయిన్ హెమరేజ్‌కు గురవుతున్నారు. ప్రస్తుతం అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. బాధితుడిని వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించడమే కీలకంగా మారుతోంది. చాలా సందర్భాల్లో స్ట్రోక్‌కు ముందే లక్షణాలు బయటపడతాయి. ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం, కంటిచూపు మందగించడం జరుగుతుంది. ఇవి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే ప్రాథమిక దశలోనే సమస్యను గుర్తించడంతో పాటు నయం చేయడానికి వీలుంటుంది. – డాక్టర్ భవనం శ్రీనివాసరెడ్డి, న్యూరో సర్జన్, గుంటూరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. రోజుకు 45 నిమిషాలు నడవాలి, ఇతర వ్యాయామాలు చేయాలి.శరీర బరువును నియంత్రించుకోవడం, బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా నియంత్రించాలి.తీవ్ర ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి. తప్పనిసరిగా ఆరు గంటలు నిద్రపోవాలి. -
కొడుకు చితికి నిప్పుపెట్టిన తల్లి
కరీంనగర్: తన కన్నీళ్లు తుడుస్తాడనుకున్న కుమారుడు బ్రెయిన్‌స్ట్రోక్‌తో కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆతల్లి రోదనలు మిన్నంటాయి. మండలంలోని నీల్వాయికి చెందిన పున్యపురెడ్డి మధుకర్–రాజేశ్వరి దంపతులకు కుమారుడు సాయికుమార్, కూతురు పల్లవి సంతానం. సాయికుమార్ పదో తరగతి, ఇంటర్లో ఉన్నత శ్రేణి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. తండ్రి మధుకర్ ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా తల్లి రాజేశ్వరి అన్నీతానై పిల్లలిద్దర్నీ చదివించింది. కుమారుడు ఢిల్లీలో ఐఐటీ పూర్తి చేసి మూడునెలల క్రితం బాచ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరాడు. మంగళవారం బ్రెయిన్ స్టోక్ రావడంతో బెంగళూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, బంధువుల సహకారంతో మృతదేహాన్ని నీల్వాయికి తరలించారు. పుట్టెడు దుఃఖంలో తల్లి రాజేశ్వరి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు చేసింది. -
AP: ఫ్యామిలీ డాక్టర్.. సరికొత్త ‘జీవన శైలి’
సాక్షి, అమరావతి: దేశంలో 66 శాతం మరణాలకు జీవనశైలి జబ్బులే ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. 2019 గణాంకాలే ఇందుకు నిదర్శనం. బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణ అవసరం. తరచూ పరీక్షలతోపాటు జబ్బు తీరు ఆధారంగా మందుల డోసు మారుస్తుండాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా బాధితులకు మెరుగైన వైద్యం అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ట్రయల్ రన్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పోటెత్తుతున్న బీపీ రాష్ట్రంలో మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, ఇతర జీవనశైలి జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించేందుకు 30 ఏళ్లు దాటిన వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. 2,09,65,740 మందికి ఇప్పటివరకు పరీక్షలు చేశారు. వీరిలో 14.87 లక్షల మందికి రక్తపోటు ఉన్నట్లు నిర్ధారణ కాగా 33.84 లక్షల మంది హైరిస్క్ గ్రూప్‌లో ఉన్నట్లు తేలింది. ఇక 11.17 లక్షల మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించగా మరో 36 లక్షల మంది డయాబెటిస్ హైరిస్క్ గ్రూప్‌లో ఉన్నారు. ఫ్యామిలీ డాక్టర్ యాప్‌లో డేటా మధుమేహం, రక్తపోటు ఉన్నట్లు నిర్ధారించిన వారి వివరాలను ఫ్యామిలీ డాక్టర్ యాప్‌తో అనుసంధానించి వైద్యులు గ్రామాలకు వెళ్లినప్పుడు బాధితుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 4,33,157 మంది రక్తపోటు బాధితులు ఫ్యామిలీ డాక్టర్ క్లినిక్‌కు హాజరు కాగా 90 శాతం మందికిపైగా వ్యక్తుల్లో సమస్య అదుపులో ఉన్నట్లు తేలింది. 3.23 లక్షల మంది మధుమేహం బాధితులు క్లినిక్‌లకు హాజరు కాగా 78 శాతం మందిలో సమస్య అదుపులోకి వచ్చింది. క్యాన్సర్ రోగులకు సాంత్వన క్యాన్సర్ బాధితులకు ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా పలు రకాల వైద్య సేవలు గ్రామాల్లోనే లభిస్తున్నాయి. పీహెచ్సీ వైద్యులు గ్రామాలకు వెళ్లినప్పుడు ఆయా చోట్ల క్యాన్సర్ రోగుల ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ నోటి క్యాన్సర్ బాధితులు 2,959 మంది, ఛాతీ క్యాన్సర్ బాధితులు 757 మంది, గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 3,332 మంది గ్రామాల్లోనే వైద్య సేవలు అందుకోవడం ఊరట కలిగిస్తోంది. వ్యయ ప్రయాసలు తొలిగాయి నాకు బీపీ ఉంది. గతంలో వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా ఊరిలోనే వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటైంది. ఇక్కడే బీపీ చెకప్ చేసి మందులు కూడా ఇస్తున్నారు. డాక్టర్ మా గ్రామానికే వస్తుండటంతో వ్యయ ప్రయాసలు తొలిగాయి. – ఏపూరి భాగ్యమ్మ, కామేపల్లి, పిడుగురాళ్ల మండలం, పల్నాడు జిల్లా -
బ్రెయిన్ స్ట్రోక్‌కి రక్తం గ్రూప్‌తో లింక్
వాషింగ్టన్: మీ రక్తం ఏ గ్రూప్ ..? దానిని బట్టి మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎంతో చెప్పేయొచ్చు. ఎ గ్రూప్ రక్తం ఉన్న వారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో మనిషి రక్తంలో గ్రూప్‌కి, స్ట్రోక్‌కి మధ్య సంబంధం ఉందని తేలింది. ఈ అధ్యయనం వివరాలను మెడికల్ జర్నల్ ఆఫ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ప్రచురించింది. ఒక మనిషి రక్తం గ్రూప్‌కు సంబంధించిన జన్యు రకాలను, మెదడు సహా ఇతర శరీర భాగాలకు రక్త సరఫరా సరిగా జరగకపోవడం వల్ల యుక్త వయసులో వచ్చే స్ట్రోక్స్‌కు సంబంధించిన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ► ఒక వ్యక్తి రక్తం గ్రూప్ ఎ అయితే 60 ఏళ్ల కంటే ముందుగానే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గ్రూప్ కలిగిన వారి రక్తం గడ్డకట్టే ప్రమాదం అధికంగా ఉంటుంది. మిగతా గ్రూప్‌ల వారి కంటే స్ట్రోక్ వచ్చే అవకాశం 16% ఎక్కువ. ► ఓ–బ్లడ్ గ్రూప్ వారు నిశ్చింతగా ఉండొచ్చు. వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంది. మిగతా గ్రూప్‌ల కంటే రిస్క్ 12% తక్కువ. ► బి గ్రూప్ రక్తం ఉన్న వారికి ఏ వయసులోనైనా స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నాయి. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో బ్రెయిన్ స్ట్రోక్స్‌పై జరిగిన 48పైగా అధ్యయనాలను విశ్లేషించి తాజా నివేదికను రూపొందించారు. ఈ అధ్యయనాల్లో 18 నుంచి 59 వరకు వయసు కలిగిన వారు ఉన్నారు. గతంలో ఒ గ్రూప్ కాని వారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నా యని తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ బ్రాక్స్టన్ మిచెల్ చెప్పారు. -
ఉప్పుతో ముప్పే
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కూరయినా, పప్పయినా, చారయినా... ఏ వంటకమైనా ఉప్పు వేయనిదే రుచి ఉండదు. ఉప్పు లేని పదార్థం చప్పగా ఉంటుంది. కానీ, రుచినిచ్చే ఈ ఉప్పే ఎక్కువ అయితే ప్రమాదకరమే అంటున్నారు వైద్య నిపుణులు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అది వైట్ పాయిజన్‌లా మారి జీవితకాలాన్ని తగ్గిస్తుందని, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌తో పాటు లంగ్, గ్యాస్ట్రిక్, కిడ్నీ క్యాన్సర్లకు దారి తీస్తుందని యూకే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం వివరాలను యూరోపియన్ హార్ట్ జర్నల్ ప్రచురించింది. మన దేశంలో యూకే కంటే రెట్టింపు మొత్తంలో ఉప్పు తీసుకోవడంతో దుష్ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీవిత కాలం తగ్గుతోంది.. యూకే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ 5,01,379 మందిని పదేళ్ల పాటు పరిశీలించి, ఈ వివరాలు వెల్లడించింది. వీరిలో 18,474 మంది వేర్వేరు కారణాలతో మరణించారు. మూత్రంలో సోడియం శాతం ఆధారంగా నిర్వహించిన అధ్యయనాల్లో ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్న వారు హైపర్ టెన్షన్ (బీపీ), గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, గ్యాస్ట్రిక్, లంగ్, కిడ్నీ క్యాన్సర్లకు గురవుతున్నట్టు గుర్తించారు. మహిళల్లో 1.5 సంవత్సరాలు, పురుషుల్లో 2.28 సంవత్సరాల జీవిత కాలం తగ్గినట్టు తేలింది. ఉప్పు ఎక్కువగా తీసుకున్నప్పటికీ, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకునే వారిలో దాని దుష్ఫలితాలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఎంత తీసుకోవాలంటే.. సోడియం అయితే రోజూ 2.30 గ్రాములు, సాల్ట్ అయితే 5 గ్రాముల వరకు తీసుకోవచ్చు. కానీ మన దేశంలో రెట్టింపు మొత్తంలో తీసుకుంటున్నారు. ప్యాక్ట్, బేకరీ ఫుడ్, నిల్వ పచ్చళ్లు వంటి వాటిలో ఉప్పు ఎక్కువుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 40 ఏళ్లు కూడా నిండకుండానే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్న వారిని ఇక్కడ మనం చూస్తున్నాం. ముప్పై ఏళ్ల వయస్సులోనే రక్తపోటు అదుపులో ఉండటంలేదు. ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడమే ఇందుకు ఓ కారణమని వైద్యులు అంటున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ప్రమాదకరమని యూకే అధ్యయనాల్లో తేలింది. మన ప్రాంతంలో అయితే తీసుకోవాల్సిన దానికంటే రెట్టింపు స్థాయిలో ఉప్పు తీసుకుంటున్నాం. దీంతో హైపర్‌టెన్షన్‌తో పాటు 40 ఏళ్లకే గుండెపోటుకు గురవుతున్నారు. జీవిత కాలాన్ని తగ్గించి, ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న ఉప్పును తగిన మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే ప్రమాదమే. – డాక్టర్ జె. శ్రీమన్నారాయణ, కార్డియాలజిస్ -
పురుషులకే స్ట్రోక్ రిస్క్ ఎక్కువా? అపోహలు- వాస్తవాలు.. ఈ ఆహారం తీసుకుంటే
World Brain Stroke Day 2022: మెదుడుకు ఆక్సిజన్, పోషకాలను తీసుకువెళ్లే రక్తనాళాలు చిట్లిపోవడం లేదంటే మూసుకుపోవడం వల్ల రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో మెదడులోని ఆ భాగంలో కణ మరణానికి దారి తీసి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ఇది మరణానికి దారి తీయవచ్చు. సాధారణంగా ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండానే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అక్టోబరు 29న వరల్డ్ స్ట్రోక్ డే. ఈ ఏడాది.. ప్రాణాన్ని కాపాడుకోవడంలో ప్రతి నిమిషం విలువైనదే అనే థీమ్‌తో(‘Minutes can save lives’ #Precioustime) అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పక్షవాతానికి దారితీసే పరిస్థితులు, దీని గురించి ప్రజల్లో ఉన్న అపోహలు, వాస్తవాలు, స్ట్రోక్‌కు గురైన పేషెంట్లు తీసుకోవాల్సిన ఆహారం గురించి ఈ కథనం. బ్రెయిన్ స్ట్రోక్- రిస్క్ ఫ్యాక్టర్స్ ►ఒబేసిటి ►జన్యుపరమైన లోపాల వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ►అధిక రక్తపోటు ►శరీరంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం ►మధుమేహం ►ఆహారపుటలవాట్లు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ►పొగ తాగే అలవాటు ►శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం ►మోతాదుకు మించి ఆల్కహాల్ సేవించడం ►జీవనశైలి నివారణ ఎలా? ►జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. వాటిలో కొన్ని.. ►పొగతాగే అలవాటు మానుకోవడం ►ఆల్కహాల్ మానేయడం ►రోజూ కాసేపు వ్యాయామం చేయడం ►బరువు పెరగకుండా ఉండటం ►సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అపోహలు- వాస్తవాలు అపోహ: 1. కేవలం నడివయస్కులు, వృద్ధులకు మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. వాస్తవం: వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం రెట్టింపవుతుంది. ఒబేసిటీ, అధిక రక్తపోటుతో బాధ పడుతున్న 15- 65 ఏళ్ల ఏజ్ గ్రూప్‌లో ఎవరైనా దీని బారిన పడే అవకాశం ఉంది. అపోహ 2. బ్రెయిన్ స్ట్రోక్ చాలా అరుదుగా వస్తుంది. వాస్తవం: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్న వాళ్ల సంఖ్య దాదాపు 17 మిలియన్లు. అంతేకాదు ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న ఆరోగ్య సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్‌ది రెండో స్థానం. అపోహ 3: బ్రెయిన్ స్ట్రోక్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వాస్తవం: మెదుడుకు ఆక్సీజన్, పోషకాలను తీసుకువెళ్లే రక్తనాళాలు చిట్లిపోవడం, రక్తప్రసణకు అంతరాయం ఏర్పడటం వల్ల.. రక్తం గడ్డకట్టుకుపోయి మెదడులోని కణాలు చచ్చుబడిపోతాయి. అపోహ 4: పురుషులకే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ వాస్తవం: పురుషులతో పోలిస్తే మహిళలే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువని నిపుణులు అంటున్నారు. హార్మోన్ల అసమతుల్యం కారణంగా తీసుకునే థెరపీలు, గర్భనిరోధక మాత్రలు వాడటం, గర్భం ధరించిన సమయంలో మధుమేహం బారిన పడటం వంటివి ఇందుకు దారి తీసే అంతర్లీన కారణాలుగా చెప్పవచ్చు. అపోహ 5: ఒక్కసారి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైతే జీవితాంతం జీవచ్ఛవంలా ఉండాల్సిందే! వాస్తవం: నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ నివేదిక ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడిన వారిలో 10 శాతం మంది పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది. 25 శాతం మంది బాధితులు పాక్షిక ఉపశమనం పొందుతున్నారు. కొద్దిమంది మాత్రమే జీవితాంతం ఈ సమస్య వల్ల బాధపడుతున్నారు. అయితే, వారు కూడా సరైన థెరపీ తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆహారం తీసుకోవడం మేలు పక్షవాతం బారిన పడిన వాళ్లు డైట్లో ఈ ఆహార పదార్థాలు చేర్చుకోవడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ►సాల్మన్ ఫిష్, అవిసె గింజలు(ఫ్లాక్స్ సీడ్స్), విటమిన్ ఈ కలిగి ఉండే విత్తనాలు, గింజలు, అవకాడోలు, కోడిగుడ్లు, ఆలివ్ ఆయిల్ వాడకం, క్వినోవా(చిరు ధాన్యం), కాల్షియం, ప్రొటిన్ అత్యధికంగా కలిగి ఉండే గ్రీక్ యోగర్ట్, గ్రీన్ టీ. ఈ పండ్ల వల్ల ►వీటితో పాటు బ్లూబెర్రీస్, దానిమ్మ పండ్లు, విటమిన్ సీ కలిగి ఉండే పండ్లు, ఆపిల్స్, టొమాటోలు వంటివి ఆహారంలో చేర్చుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. సాధారణంగా పక్షవాతం వచ్చిన నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకగలిగితే ప్రయోజనకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్న మాట. నోట్: ఆరోగ్యం గురించి అవగాహన కొరకు మాత్రమే ఈ కథనం. చదవండి: World Stroke Day: మెదడుకు ‘పోటు’.. బ్రెయిన్ స్ట్రోక్ నుంచి తప్పించుకోండి ఇలా.. Custard Apple: సీజనల్ ఫ్రూట్ సీతాఫలం.. తరచూ తింటున్నారా? ఇందులోని బయోయాక్టివ్ అణువుల వల్ల -
World Stroke Day: సమయం లేదు మిత్రమా!
సాక్షి, లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యేవారు. ఇప్పుడు రెండు పదుల వయస్సులోనే దాని బారిన పడుతున్నట్టు వైద్యులు చెపుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఇటీవల 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు స్ట్రోక్‌కు గురై చికిత్సకోసం వస్తున్నారు. తొమ్మిదేళ్ల హెచ్ఐవీ బాధిత బాలుడు బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. మధ్య వయస్సు వారు పక్షవాతం బారిన పడటంతో వారి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయి. అందుకే స్ట్రోక్‌కు గురైన తర్వాత ప్రతి నిమిషం విలువైనది అనే నినాదంతో ఈ ఏడాది వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అవగాహన కలిగిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే... ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా వచ్చేదే బ్రెయిన్ స్ట్రోక్. రక్త ప్రసరణలో అవరోధం కలగడం, నరాలు చిట్లడం ప్రధాన కారణాలు. మెదడుకు ఆక్సిజన్, పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాలు చిట్లిపోవడం, రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడటం వలన, మెదడలోని ఆ భాగం కణ మరణానికి దారి తీసి స్ట్రోక్‌కు గురవుతారు. పక్షవాతానికి కారణాలివే... ►యువత ఎక్కువుగా స్ట్రోక్‌కు గురవడానికి ప్రధాన కారణం స్మోకింగ్, ఆల్కహాల్‌గా వైద్యులు చెపుతున్నారు. ►జీవన విధానంలో మార్పులు, మధుమేహం , రక్తపోటు, కొలస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉండటం, ఒబెసిటీ వారిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ►మహిళల్లో కంటే పురుషులకు స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ. ►ఈస్ట్రోజెన్ కలిగి ఉన్న హార్మోన్ థెరఫీలు, గర్భనిరోధక మాత్రలు వాడిన మహిళల్లో స్ట్రోక్ వచ్చే అవకాశాల ఎక్కువ. ►గుండె జబ్బులు ఉన్న వారికి బ్రెయిన్‌స్ట్రోక్ రావచ్చు. ►అన్యూరిజం వంటి శరీర నిర్మాణ లోపాల(రక్తనాళాల గోడలు బలహీనమై ఉబ్బడం) వలన స్ట్రోక్ రావచ్చు. ►రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలైన వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ. ►పుట్టుకతోనే జన్యుపరమైన లోపాల కారణంగా రక్తం గడ్డకట్టే గుణం వున్న వారికి స్ట్రోక్ రావచ్చు. స్ట్రోక్‌లో రకాలు బ్రెయిన్‌స్ట్రోక్ ఇస్కిమిక్, హెమరైజ్డ్ అనే రెండు రకాలుగా వస్తుంది. ఇస్కీమిక్ ధమనిలో అడ్డంకుల కారణంగా స్ట్రోక్ వస్తుంది. మెదడు రక్తనాళం సన్నబడటం, అవరోధం ఏర్పడటం వలన వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 80 శాతం మంది ఈ రకం స్ట్రోక్‌కు గురవుతుంటారు. ►కొందరిలో తాత్కాలిక ఇస్కీమిక్ ఎటాక్ ఉంటుంది. ఐదు నిమిషాల లోపు లక్షణాలు కనిపించి ఎలాంటి నష్టాన్ని కలిగించదు. హెమరైజ్డ్ స్ట్రోక్ రక్తనాళం లోపలి నుంచి లీకేజీ, ధమని చిట్లడం వలన ఈ రకం స్ట్రోక్ వస్తుంది. మెదడు రక్తస్రావం రక్తనాళాలను ప్రభావితం చేసే అనేక పరిస్థితుల ఫలితంగా వస్తంది. స్ట్రోక్ లక్షణాలు ►మాట్లాడటం, మాట అర్ధం చేసుకోవడంలో ఇబ్బంది ►ముఖం వేలాడి పోవడం ►చేతులు బలహీనత ►సమతుల్యత కోల్పోవడం ►తీవ్రమైన తలనొప్పి ►జ్ఞాపకశక్తి కోల్పోవడం ►దృష్టిలో ఇబ్బంది ►కళ్లు తిరగడం ఈ లక్షణాలు గుర్తించిన నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి చేరుకోగలిగితే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. 24 గంటల తర్వాతే వస్తున్నారు ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారిలో స్ట్రోక్‌కు గురైన 24 గంటలు దాటి కాలు,చేయి చచ్చుపడిన తర్వాతే వస్తున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్ కారణంగా యువత స్ట్రోక్‌కు గురవుతున్నారు. స్ట్రోక్ లక్షణాలు గుర్తించి నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి చేరుకోగలిగితే నష్టతీవ్రతను తగ్గించవచ్చు. ప్రభుత్వాస్పత్రిలో ఆధునిక సేవలు అందుబాటలో ఉన్నాయి. –డాక్టర్ డి.వి.మాధవికుమారి, న్యూరాలజిస్టు ప్రభుత్వాస్పత్రి అందుబాటలో ఆధునిక చికిత్సలు బ్రెయిన్ స్ట్రోక్ రకాన్ని బట్టి అత్యవసర చికిత్సలు చేస్తాం. తీవ్రమైన ఇస్కీమిక్ స్ట్రోక్‌కు గురైన వారికి థ్రాంబోలైటిక్ థెరపీ చేస్తాం. మెదడుకు రక్తప్రవాహాన్ని నిరోధించే గడ్డను విచ్ఛిన్నం చేయడానికి సిర ద్వారా ఔషధాన్ని ఇస్తాం. స్ట్రోక్‌కు గురైన ఐదు గంటల్లోపు ఈ థెరపీ చేయాలి. మరో విధానం మెకానికల్ థ్రాంబెక్టమీ, స్టెంట్ రిట్రీవర్ పరికరం ద్వారా మూసుకుపోయిన రక్తనాళాల్లో నుంచి క్లాట్స్‌ను మెదడు నుంచి తొలగించడం. హెమరైజ్డ్ స్ట్రోక్‌కు గురైన వారిలో రక్తస్రావం వలన మెదడు దెబ్బతినడం తగ్గించడం, రక్తపోటు ఉంటే కంట్రోల్చేస్తాం. – డాక్టర్ డి.అనిల్‌కుమార్, న్యూరాలజిస్ట్ -
Paralysis: పక్షవాతం పడగొడుతోంది!
ఈ చిత్రంలో కనిపిస్తున్న దంపతులు ముస్తాబాద్‌కు చెందిన అనమేని బాలయ్య, శ్యామల. మేస్త్రీ పనిచేస్తూ, వ్యవసాయం చేసుకునే బాలయ్యకు ఏడాదిన్నర క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. రూ.3లక్షల వరకు అప్పు చేసి వైద్యం చేయిస్తున్నారు. కూతురు వెన్నెలను ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదివిస్తున్నారు. బాలయ్యకు నెలకు రూ.13వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ చిత్రంలో మంచానికే పరిమితమైన మెంగని శ్రీనివాస్(51)ది ముస్తాబాద్. ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీనివాస్ 2020లో తిరిగొచ్చాడు. ఆరు గెదెలు కొని, డెయిరీతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతలోనే శ్రీనివాస్‌కు పక్షవాతం రాగా.. రూ.8లక్షలు ఖర్చ య్యింది. అయినా నయం కాలేదు. కుటుంబ పెద్ద పక్షవాతానికి గురవడంతో పాలిటెక్నిక్ పూర్తి చేసిన కొడుకు వివేక్ బీటెక్‌కు చదువలేకపోయాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తండ్రికి ఆసరాగా నిలుస్తున్నాడు. చిన్నకుమారుడు సాత్విక్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో ఇటీవల పక్షవాతానికి గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మారుతున్న జీవన విధానం.. ఆహారమార్పులతో బీపీ(బ్లడ్ ప్రెషర్) పెరిగి అనారోగ్యం పాలవుతున్నారు. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వ్యక్తులు మంచానికి పరిమితం అవుతుండగా.. చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. మారుతున్న జీవన విధానం ప్రస్తుత ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలతో చిన్న వయస్సులోనే పక్షవాతానికి గురవుతున్నారు. పెరుగుతున్న రక్తపోటు(బీపీ), షుగర్, కొలెస్ట్రాల్ వంటి వాటితో పక్షవాతం దాడి చేస్తుంది. ఒకే చోట కదలకుండా పనిచేయడం, మద్యం ఎక్కువగా తాగడం, మాంసం, జంక్‌ఫుడ్ తీసుకోవడం, పొగతాగే అలవాటు ఉన్న వాళ్లలో పెరాలసిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. అతిగా మొబైల్ వినియోగించే వారిలోనూ పెరాలసిస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. స్పందించే సమయం ముఖ్యం పక్షవాతానికి గురయ్యే వారికి ముందుగానే లక్షణాలు బయటపడుతుంటాయి. ఇలాంటి లక్షణాలు ముందుగానే గుర్తించి తక్షణమే వైద్యం అందిస్తే త్వరగా కోలుకునే లక్షణాలు ఉన్నాయి. ఇటీవల సిరిసిల్లకు చెందిన ఒకరు పక్షవాతానికి గురికాగా కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యంత వేగంగా స్పందించిన డ్యూటీ డాక్టర్ పక్షవాతానికి గురైన నాలుగు గంటల్లోపే ఖరీదైన ఇంజక్షన్ ఇవ్వడంతో శాశ్వత పక్షవాతం నుంచి బయటపడ్డాడు. (క్లిక్: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే..) ఇలా తెలుసుకోవాలి మెదడులో ఒక ప్రాంతం ఒక్కో భాగాన్ని నియంత్రిస్తుంది. రక్తప్రసరణ నిలిచిపోయినప్పుడు ఆ భాగంలో రక్తం గడ్డకట్టి తలనొప్పి, కళ్లు తిరగడం, అపస్మారక స్థితిలోకి వెళ్తుంటాయి. నాడీవేగం తగ్గడం, తల, కళ్లు ఒక వైపునకు తిరగడం. కనుపాపలు వెలుతురుకు స్పందించకపోవడం జరుగుతుంది. మూత్ర ఆపుకునే శక్తి సన్నగిల్లడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాంతి సమస్యలు లక్షణాలు కనిపిస్తాయి. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వారు బలహీనంగా ఉంటారు. పక్షవాతానికి గురైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి, ఎంతవేగంగా చికిత్స అందిస్తే రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ–హెల్త్ ద్వారా నమోదు జిల్లాలో ఈ–హెల్త్ అధికారులు సర్వే చేపట్టారు. జిల్లాలో అధిక రక్తపోటు(బీపీ) కేసులు 29,213 ఉన్నాయి. ఇందులోని వారే పెరాలసిస్‌కు గురవుతున్నట్లు ఆరోగ్యశాఖ భావిస్తోంది. జిల్లాలో దాదాపుగా 2500 ఆపైగా పక్షవాతం కేసులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పక్షవాతానికి కారణమయ్యే షుగర్ కేసులు కూడా జిల్లాలో 13,331 కేసులు ఉన్నాయి. పెరాలసిస్ బాధితులకు కూడా ప్రభుత్వం అండగా నిలవాలని పేద కుటుంబాలు కోరుతున్నాయి. (క్లిక్: స్వదేశీ సాహివాల్‌కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి) జీవన విధానం మార్చుకోవాలి ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చా యి. స్మోకింగ్, ఆల్కహల్, జంక్‌ఫుడ్ తీసుకుంటున్నారు. యువత కూడా పెరాలసిస్‌కు గురవడం సాధారణంగా మారింది. లక్షణాలు బయటపడగానే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. మానసిక ఒత్తిడికి గురికావద్దు. వ్యాయామం, యోగా చేయాలి. – డాక్టర్ చింతోజు శంకర్, ఐఎంఏ జిల్లా మాజీ అధ్యక్షుడు -
మెదడులో కల్లోలం.. 45 ఏళ్ల లోపు వారిలోనూ..
సాక్షి, విజయవాడ: శరీర అవయవాల పనితీరును నియంత్రించే మెదడు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్. మెదడులో రక్తం సరఫరా సరిగ్గా జరగక పోవటం, రక్తనాళాలు చిట్లటం వంటి కారణాలతో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై పక్షవాతం బారిన పడతారు. ఈ వ్యాధి ఒకప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికే వచ్చేది. కానీ ప్రస్తుతం 30 నుంచి 45 ఏళ్ల లోపు యువత కూడా దీని బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన విధానంలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాల వల్ల అనేక మంది పక్షవాతానికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 30 శాతం మంది యువతే.. ఒకప్పుడు వయస్సు 55, 60 ఏళ్ల వారిలో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 25 నుంచి 30 శాతం మంది 45 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తుంటారు. వారి స్ట్రోక్ తీవ్రతను బట్టి జనరల్ మెడిసిన్, ఏఎంసీ, న్యూరాలజీ విభాగాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తున్న వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగక పోవడం వలన వచ్చే స్ట్రోక్(ఇస్కిమిక్) 80 శాతం మంది, రక్తనాళాలు చిట్లి (హెమరైజ్డ్) 20 శాతం మంది ఉంటున్నారు. ప్రధాన కారణాలివే.. ►పెద్ద వయస్సు వారిలో రక్తపోటు, మధుమేహం స్ట్రోక్‌కు కారణంగా చెబుతున్నారు. ►45 ఏళ్లలోపు వారిలో హోమోసిస్టీన్, సిక్కుసెల్ అనే రక్తంలో జెనిటిక్ లోపాలు, వంశపారంపర్యంగా, హెరాయిన్ వంటి డ్రగ్స్, మద్యపానం, ధూమపానం, ప్రమాదాల్లో తలకు గాయాలైన వారిలో ఎక్కువగా స్ట్రోక్ వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ►వీరితో పాటు కదలిక లేని జీవన విధానం కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి స్ట్రోక్‌కు గురవుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ►ఆడవారిలో హార్మోనల్ ఇబ్బందులు, రక్తనాళాల్లో లోపాల కారణంగా కూడా స్ట్రోక్ రావచ్చంటున్నారు. గుండెలోపాలు ఉన్న వారిలోనూ బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువని వివరిస్తున్నారు. ఆ నాలుగు గంటలే కీలకం.. ఇప్పుడు బ్రెయిన్‌స్ట్రోక్‌కు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. లక్షణాలను గుర్తించి, నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే స్ట్రోక్‌తో వైకల్యం రాకుండా వైద్యులు కాపాడగలుగుతున్నారు. ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన వారికి త్రోంబలైసిస్ ఇంజెక్షన్‌ను ఇవ్వడం ద్వారా రక్తంలోని పూడికలు కరిగేలా చేస్తున్నారు. ముఖం, చేయి, కాలు ముఖ్యంగా శరీరం ఒకవైపున ఆకస్మిక తిమ్మిరి, బలహీనత ఏర్పడటం, ఆకస్మికంగా గందరగోళం ఏర్పడటం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కంటి చూపు మందగించడం, తలతిరగడం, బ్యాలెన్స్ తప్పడం, ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి వంటికి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. జీవన విధానం ముఖ్యం.. ప్రతి ఒక్కరూ మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. కదలిక లేని జీవన విధానం కారణంగా చిన్న వయస్సులోనే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, మధ్య వయస్సు వచ్చేసరికి స్ట్రోక్‌కు దారి తీస్తున్నాయి. వంశపారంపర్యంగా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్న వారు మందులు సక్రమంగా వాడటం ద్వారా ముప్పు ను తప్పించుకోవచ్చు. రోజూ వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా చాలా వరకూ ఈ వ్యాధిని నివారించవచ్చు. – డాక్టర్ ప్రసన్నకుమార్, ఫిజీషియన్, ప్రభుత్వాస్పత్రి ‘స్ట్రోకింగ్ యంగ్’ కేసులు వస్తున్నాయి.. ఇటీవల 45 ఏళ్లలోపు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్న(స్ట్రోకింగ్ యంగ్) వారిని తరచూ చూస్తున్నాం. మా వద్ద వస్తున్న స్ట్రోక్ కేసుల్లో 25 శాతం అలాంటి వారే ఉంటున్నారు. తక్కువ వయస్సు వారిలో స్ట్రోక్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు వాడటం, మద్యపానం, ధూమపానంతో పాటు, హోమోసిస్టీన్, సిక్కుసెల్, రక్తంలో లోపాలు కూడా కారణం కావచ్చు. బ్రెయిన్‌స్ట్రోక్ లక్షణాలను గుర్తించి నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే వైకల్యం లేకుండా కాపాడవచ్చు. – డాక్టర్ డి. అనిల్‌కుమార్, న్యూరాలజిస్ట్ -
Health Tips: ఉప్పు, కారంతో పాటు ఆ అలవాట్లూ తగ్గించండి! లేదంటే!
హైపర్ టెన్షన్‌తో దాదాపు 10 శాతానికి మించి గుండె జబ్బుకు గురవుతున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. హైపర్‌టెన్షన్‌తో ఉన్నవారిలో పది శాతం మంది పక్షవాతం బారిన పడగా మరో అయిదు శాతం కిడ్నీసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ టెన్షన్ వల్ల కొందరికీ బ్రెయిన్ స్టోక్ కూడా వచ్చే ప్రమాదముంది. ఇటీవల కాలంలో బ్రెయిన్ స్టోక్, గుండెకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. హైపర్‌టెన్షన్ ఉన్నవారికీ కిడ్నీ రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడుతాయి. దీనివల్ల కిడ్నీ దెబ్బతిని పని వేయకుండా పోయే ప్రమాదముంది. అదే విధంగా రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడడం వల్ల గుండె, బ్రెయిన్ స్ట్రోక్‌లు వస్తున్నాయి. చిత్రం ఏమిటంటే, చాలామందికి తమకు హైపర్ టెన్షన్ ఉన్నట్లు కూడా తెలియకపోవడం. అయితే హైపర్ టెన్షన్‌ను గుర్తించగలిగితే దాని వల్ల కలగబోయే ముప్పును నివారించుకోవచ్చు. గుర్తించటం ఎలా? బీపీ తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు ముందు తలదిమ్ము మొదలవుతుంది. తర్వాత వివరీతమైన తలనొప్పి, నిద్రలేమి, చూపు మసక బారటం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వాన తీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి. రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►ప్రతిరోజూ తవ్పని నరిగ్గా 30 నుంచి 45 నిమిషాలు నడవాలి ►అస్తమానం కుర్చీకే అతుక్కుని కూర్చోకుండా ప్రతి అరగంటకు ఒకసారి లేచి నాలుగు అడుగులు వేస్తుండాలి. ►నిత్యం వ్యాయామం, యోగా చేయాలి. ►చిన్న చిన్న విషయాలకు టెన్షన్‌కు గురికావద్దు ►ఉదయం, సాయంత్రాల్లో మంచి వాతావరణంలో చక్కటి సంగీతం వినడం మంచిది. ►టెన్షన్‌కు గురవుతున్న నమయంలో నచ్చిన వారితో మాట్లాడడం, మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల టెన్షన్ దూరం అవుతుంది. ►ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏది తగ్గించాలి? ►ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జూగ్రత్త వహించాలి. ►బత్తాయి, కమలాలు, ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీనుకోవాలి. ►ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ►ఎర్రటి మాంసం, మీగడ, వెన్న, నూనె వంటి వాటికీ దూరంగా ఉండాలి. ►బయటి ఆహార పదార్థాల జోలికి వెళ్లరాదు. ►బరువు పెరగకుండా చూనుకోవాలి. హైపర్‌టెన్షన్ ఉన్నవారు ఏమి చేయాలి? ►తరచు వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. ►మందుల వాడకాన్ని ఒకరోజు కూడా నిలిపేయొద్దు. ►ఆరోగ్య పరిస్థితిని బట్టి మందుల వాడకాన్ని మార్చుకోవాలి. ►షుగర్ , గుండె , థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ►కొలస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ►మద్యపానం, సిగరెట్లను పూర్తిగా మానేయాలి. ►కారం, ఉప్పు తగ్గించాలి. చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! High Vitamin D Rich Foods: ట్యూనా, సాల్మన్, గుడ్లు, పాలు.. వీటిలో విటమిన్- డి పుష్కలం! -
విషాదం: ప్రముఖ లిరిసిస్ట్ మాయా గోవింద్ కన్నుమూత
ప్రముఖ లిరిసిస్ట్ మాయా గోవింద్(82)ఇక లేరు. గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమె గురువారం గుండెపోటు కారణంగా కన్నుమూసినట్లు ఆమె తనయుడు అజయ్ తెలిపారు. 'బ్రెయిన్ క్లాట్ కావడంతో అమ్మ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించింది. చికిత్స తర్వాత కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. అయితే గురువారం గుండెపోటు రావడంతో అమ్మ చనిపోయింది' అంటూ అజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన మాయా గోవింద్ సుమారు 350 సినిమాలకు పనిచేశారు. ‘ఆంఖో మే బేస్ హో తుమ్’,‘మై ఖిలాడీ తూ అనారీ’,‘ మోర్ ఘటర్ ఆయే సజన్వా, గుటుర్ గుటుర్ వంటి ఎన్నో పాపులర్ పాటలను రాశారు. కాగా మాయా గోవింద్ మృతి పట్ల బీ టౌన్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మాయా గోవింద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. -
బ్రెయిన్ స్ట్రోక్ / టీఐఏ ముప్పు ఎవరిలో ఎక్కువ?
కొన్ని జబ్బు లక్షణాలు వ్యాధి రాకముందే బయటపడతాయి. తాము రాబోతున్నామంటూ హెచ్చరికలు జారీచేస్తాయి. జాగ్రత్తపడమంటూ చెప్పి, నివారించుకునేందుకు అవకాశాలిస్తాయి. ఆ వార్నింగ్ సిగ్నల్స్‌ను ఎలా గుర్తించాలో ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి వివరిస్తున్నారు. వాటిని నిలువరించే మార్గాలూ చెబుతున్నారు. తెలుసుకుందాం... రండి. ప్రశ్న : వార్నింగ్ ఇచ్చి వచ్చే వ్యాధులేమైనా ఉన్నాయా? జ: న్యూరో విభాగానికి సంబంధించిన చాలా జబ్బులు ముందస్తు వార్నింగ్ ఇచ్చాకే వస్తాయి. ఉదాహరణకు మైగ్రేన్, ఫిట్స్, పక్షవాతం, అల్జైమర్స్ వంటివి. వీటిల్లో మైగ్రేన్ బాధాకరమే గానీ... చాలావరకు నిరపాయకరం. కానీ పక్షవాతం వల్ల అవయవాలు పనిచేయకపోయే ప్రమాదం ఉంది. ఇతరులపై జీవితాంతం ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. ఫిట్స్ కూడా ప్రమాదమే. అందుకే ముందస్తు హెచ్చరికలు చేసే ఆ వ్యాధుల వార్నింగ్ సిగ్నల్స్ అర్థం చేసుకోవడం వల్ల చాలా అనర్థాలను నివారించుకోవచ్చు. ప్రశ్న : పక్షవాతం ముందస్తు సిగ్నల్స్ ఇస్తుందా? అదెలా? జ: పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్)లో చేయిగానీ, కాలుగానీ, లేదా రెండూ పడిపోవడం గానీ, ఒకవైపు చూపు తగ్గిపోవడం, మూతి వంకరపోవడం, మాట పడిపోవడం, మింగడం కష్టం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తాత్కాలికంగా పది నిమిషాల నుంచి ఒక గంట లోపు వస్తే దాన్ని ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) అంటారు. ఈ టీఐఏ లక్షణాలు... అసలు పక్షవాతం కంటే కొంత ముందుగానే కనపడవచ్చు. ముందుగా వచ్చే ఈ ‘టీఐఏ’ తర్వాత బాధితులు పూర్తిగా కోలుకుంటారు. కానీ ఆ సిగ్నల్స్ పెడచెవిన పెట్టి... అసలు పక్షవాతం వచ్చే వరకు నిర్లక్ష్యం చేస్తే కోలుకోడానికి చాలా టైమ్ పట్టవచ్చు లేదా ఆ నష్టం జీవితాంతం బాధించవచ్చు. ప్రశ్న : బ్రెయిన్ స్ట్రోక్ / టీఐఏ ముప్పు ఎవరిలో ఎక్కువ? జ: సాధారణంగా 50 ఏళ్లు దాటి... షుగరు, హైబీపీ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లు ఈ ముప్పును మరింత పెంచుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికీ, ఊబకాయం ఉన్నవారికీ స్ట్రోక్ ముప్పు ఎక్కువ. ప్రశ్న : మైగ్రేన్‌లో ఏయే ముందస్తు లక్షణాలు కనిపిస్తాయి? జ: మైగ్రేన్ తలనొప్పి రెండు విధాలుగా వస్తుంది. మొదటిదానిలో తలనొప్పికి ముందర కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ‘మైగ్రేన్ విత్ ఆరా’ అంటారు. దాదాపు 20శాతం మందిలో ‘ఆరా’ కనిపిస్తుంది. రెండో రకంలో నేరుగా తలనొప్పి వస్తుంది. ‘మైగ్రేన్ ఆరా’లో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. ∙తలనొప్పి వచ్చే గంటలోపు చూపు కొద్దిగా మందగిస్తుంది. ∙కళ్ల ముందు మెరుపులు మెరిసినట్లుగా అనిపించడం, వెలుగు చూడలేకపోవడం, శబ్దాలు వినడంలో ఇబ్బంది కలగడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ∙చుట్టూరా ఉన్నవి కనిపించకుండా, ముందు ఉన్నవే కనిపిస్తాయి. దీన్ని టెలిస్కోపిక్ విజన్ అంటారు. ∙అరుదుగా ఏదో ఓ పక్క కాలు / చేతిలో బలం తగ్గడం. ∙త్వరగా కోపం రావడం, చికాకు పడటం వంటివి కనిపించిన గంట లేదా రెండు గంటల్లోపు అసలు తలనొప్పి మొదలవుతుంది. ప్రశ్న : మైగ్రేన్‌కు చికిత్స ఎలా? జ: దీనికి రెండు రకాలుగా చికిత్స అందిస్తారు. మొదటిది తీక్షణంగా వచ్చే తలనొప్పిని తగ్గించడానికి ఇచ్చే మందులు. ఇవి ఎంత త్వరగా తీసుకుంటే, అంత త్వరగా ఉపశమనం కలుగుతుంది. రెండోవి... మళ్లీ రాకుండా ఉండేందుకు ఇచ్చే మందులు. ప్రశ్న : ఫిట్స్‌లో కూడా ముందస్తు సిగ్నల్స్ కనిపిస్తాయా? జ: మూర్ఛను వైద్యపరిభాషలో ఫిట్స్ అనీ, ఆ జబ్బును ఎపిలెప్సీ అని అంటారు. ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు చల్లటి నీటితో ఒళ్లు తుడుస్తూ, శరీర ఉష్ణోగ్రత తగ్గించి ఫిట్స్ రాకుండా నివారించుకోవచ్చు. కొంతమందిలో ఫిట్స్ వచ్చే కొన్ని నిమిషాల నుంచి గంటల ముందుగా తలనొప్పి, కళ్లు తిరగడం, ఒళ్లు జలదరించడం (జర్క్స్), కనురెప్పలు కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు ఈ లక్షణాలను గమనించలేరు. కాబట్టి పెద్దలే వాటిని గమనించాలి. ముఖ్యంగా ముందురోజు నిద్ర సరిపోకపోవడం, తీవ్ర ఒత్తిడికి లోనవ్వడం వంటి పరిస్థితుల్లో ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రశ్న : అల్జైమర్స్ జబ్బును ముందస్తుగా గుర్తుపట్టడం ఎలా? జ: అల్జైమర్స్‌లో ముఖ్యమైన మొట్టమొదటి లక్షణం – కొన్ని సెకండ్ల నుంచి నిమిషాలకు ముందుగా జరిగిపోయిన విషయాలను మరచిపోతుండటం. (వీళ్లలో చిన్నప్పటి విషయాలు మాత్రం బాగా గుర్తుండవచ్చు). తర్వాత క్రమంగా దారులు, తేదీలు, పండుగలు మరచిపోతారు. కొత్త విషయాలు ఏవీ గుర్తుపెట్టుకోలేరు. క్రమంగా ప్రవర్తనలో కూడా మార్పు రావచ్చు. సరైన సమయంలోనే ఈ లక్షణాలను గుర్తించలిగితే... సరైన చికిత్సతో... వ్యాధి పెరుగుదలనూ, తీవ్రతనూ నియంత్రించవచ్చు. ఇక్కడ చెప్పిన ఏ వార్నింగ్ కనిపించినా వెంటనే ‘న్యూరో ఫిజీషియన్’ను సంప్రదించి, తగిన పరీక్షలూ, వాటి ఆధారంగా తగిన చికిత్స తీసుకుంటే... ఈ జబ్బులను చాలావరకు రాకముందే నివారించవచ్చు. - డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్ -
మెదడు గురించీ ఆలోచించాలి..బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలు
సాక్షి, అమరావతి: గుంటూరు నగరానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఓ ప్రైవేట్ షోరూమ్‌లో పనిచేస్తుంటాడు. ఇతనికి రెండు నెలల క్రితం మూతి వంకరపోవడంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం)గా నిర్ధారణ అయింది. డిగ్రీ చదివే రోజుల నుంచే సురేశ్ సిగరెట్లు తాగేవాడు. రోజులు గడిచే కొద్దీ చైన్ స్మోకర్గా మారాడు. చిన్న వయసులోనే స్ట్రోక్‌కు గురికావడానికి పొగతాగడమే కారణంగా వైద్యులు గుర్తించారు. విశాఖపట్నం నగరానికి చెందిన 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కరోనా కారణంగా గత ఏడాదిగా ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. రెండు వారాల క్రితం ఇంట్లో పనిచేస్తూ స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించగా వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. తీవ్రమైన పని ఒత్తిడితో, నిద్రలేమి వంటి సమస్యల వల్ల స్ట్రోక్ వచ్చినట్టుగా గుర్తించారు. ఆలోచనల ఒత్తిడితో సతమతమయ్యే మెదడు గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆధునిక జీవన శైలి, దురలవాట్ల కారణంగా 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయసులో కొందరు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుండేది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న 25 నుంచి 30 శాతం బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో వ్యక్తుల వయసు 20 నుంచి 45 ఏళ్ల లోపు ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలు.. ► పొగతాగడం, మద్యం, గంజాయి, డ్రగ్స్ తీసుకోవడం. మద్యపానం, ధూమపానం అలవాటైన పదేళ్లకే పలువురిలో బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనబడుతున్నాయి. ► బీపీ, షుగర్లు నియంత్రణలో లేకపోవడం. శారీరక శ్రమ లేకపోవడం. ► మహిళలు నెలసరిని వాయిదా వేయడం. అధిక రక్తస్రావం నియంత్రణకు వైద్యుల సలహాలు తీసుకోకుండా మందులు వాడటం. ► ప్రస్తుతం కరోనా బారినపడి కోలుకున్న వారిలో 5 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. రాష్ట్రంలో బీపీ, షుగర్, ఊబకాయం పరిస్థితి ఇలా.. ► మన రాష్ట్రంలో 30 ఏళ్లు నిండిన ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉంటోంది. ► గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు, గ్రామాల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం మంది షుగర్ బాధితులు. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ఆధారంగా రాష్ట్రంలో 36.3 శాతం మంది మహిళల్లో, 31.3 శాతం పురుషుల్లో ఊబకాయం ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► రోజూ 45 నిమిషాల నడకతో పాటు ఇతర వ్యాయామాలు చేయాలి. ► ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్స్ ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా నియంత్రించాలి. ► శరీర బరువును నియంత్రించుకోవాలి. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ► ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. రోజుకు ఆరు గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. స్ట్రోక్ రెండు రకాలు మెదడులోని రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు చచ్చుబడటాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. రక్తనాళాలు చిట్లినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. బీపీ, షుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల మన దేశంలో మధ్య వయసుల వారు స్ట్రోక్‌కు గురవ్వడం పెరుగుతోంది. కేజీహెచ్‌కు రోజుకు సగటున ఆరు కేసులు వస్తుంటాయి. – డాక్టర్ జి.బుచ్చిరాజు, న్యూరాలజీ విభాగాధిపతి, విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాల మూడు గంటల్లోపు ఆస్పత్రికి వస్తే.. గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేకంగా స్ట్రోక్ యూనిట్ ఉంది. గతేడాది 614 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకూ 416 మంది స్ట్రోక్ బాధితులకు చికిత్స అందించాం. ఈ ఏడాది కరోనా చికిత్స కారణంగా మే నెలలో అడ్మిషన్లు లేవు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా చికిత్స ఉంటుంది. స్ట్రోక్ వచ్చిన మూడు గంటల్లోపు రోగిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తే వైకల్యం లేకుండా చేయవచ్చు. – డాక్టర్ కె. సుందరాచారి, న్యూరాలజీ విభాగాధిపతి, గుంటూరు మెడికల్ కళాశాల -
ప్రతీ నిమిషం విలువైనదే!
-
World Stroke Day 2021: ఆ.. 60 నిమిషాలు విలువైనవి
సాక్షి, లబ్బీపేట (విజయవాడ తూర్పు): బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారిని తొలి గంట సమయంలోపు ఆస్పత్రిలో చేర్చితే ప్రాణాపాయం తప్పినట్లే. కనీసం నాలుగున్నర గంటల్లోపు వస్తే వైకల్యం రాకుండా కాపాడొచ్చని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు మూడు పదుల వయసు వారిలోనూ కనిపిస్తోంది. పోస్ట్ కోవిడ్ రోగులు ఎక్కువగా స్ట్రోక్ బారిన పడుతున్నారు. ఈ ఏడాది వరల్డ్ స్ట్రోక్డే సందర్భంగా ‘ప్రాణాలు కాపడటంలో ప్రతి నిమిషం విలువైనదే’ అనే నినాదంతో అవగాహన కలిగించనున్నారు. శుక్రవారం ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా ప్రత్యేక కథనం ఇదీ.. విజయవాడకు చెందిన 30 ఏళ్ల యువకుడు ఓ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేన్నాడు. అతను కోవిడ్ నుంచి కోలుకున్న ఇరవై రోజులకు మూతి వంకర పోవడంతో పాటు, కాలు, చేయి పట్టుకోల్పోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, వెంటనే అతనికి రక్తంలో గడ్డలు కరిగేందుకు ఇంజక్షన్ ఇవ్వడంతో స్ట్రోక్ ముప్పు నుంచి బయట పడ్డాడు. కోవిడ్ నుంచి కోలుకున్న కొద్ది రోజులకు ఓ 25 ఏళ్ల యువకుడికి బ్లాక్ ఫంగస్ సోకింది. ఆ ఫంగస్ మొదడు రక్తనాళాల్లో గడ్డలుగా ఏర్పడటంతో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. వీళ్లిద్దరే కాదు ఈ ఏడాది ఎంతో మంది పోస్టు కోవిడ్ రోగులు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు. చదవండి: (Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా..) స్ట్రోక్ లక్షణాలు ఇవీ.. మూతి వంకర పోవడం, కాలూచేయి పనిచేయక పోవడం, మాట ముద్దగా, నత్తిగా రావడం, మాటలో తేడా రావడం, నియంత్రణ తప్పడం, మనం మాట్లాడేది వారు అర్థం చేసుకోలేక పోవడం వంటివి సాధారణంగా కనిపిస్తాయి. కొందరిలో ఒకటి రెండుగా కనిపించడం, చూపు కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. 80 శాతం మందికి క్లాట్స్ కారణం సాధారణంగా మధుమేహం, రక్తపోటు, కొలస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉండటం, సిగిరెట్లు, మద్యం తాగే వారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. వీరిలో రక్తంలో గడ్డ (క్లాట్)లు కట్టే అవకాశం ఎక్కువ. జన్యుపరంగా రక్తం గడ్డకట్టే గుణం ఉన్న వారికి, గుండె సంబంధిత వ్యాధులు వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పోస్టు కోవిడ్ రోగుల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. బ్లాక్ ఫంగస్ రోగులు కూడా స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు చెపుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 80 శాతం మందిలో రక్త నాళాల్లో గడ్డలు ఏర్పడటమే, మరో 15 నుంచి 20 శాతం మందిలో రక్తనాళాలు చిట్లడం కారణం. రక్తనాళాల్లో గడ్డలతో స్ట్రోక్‌కు గురయ్యే వారు సకాలంలో ఆస్పత్రికి చేరితే మంచి ఫలితం ఉంటుంది. నాలుగున్నర గంటల్లోపు రక్తనాళాల్లో గడ్డలు కరగడానికి ఇంజక్షన్స్ ఇవ్వడం ద్వారా స్ట్రోక్ ద్వారా వచ్చే వైకల్యాన్ని నివారించే అవకాశం ఉంది. ప్రతి నిమిషమూ విలువైనదే.. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారి ప్రాణాలు కాపాడటంలో ప్రతి నిమిషమూ విలువైనదే. స్ట్రోక్ లక్షణాలు గుర్తించిన మొదటి గంటలోపు, కనీసం నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రి చేరితే ప్రాణాపాయంతో పాటు వైకల్యం నుంచి కాపాడ వచ్చు. 80 శాతం మందికి రక్తనాళాల్లో గడ్డలు కారణంగా బ్రెయిన్‌స్ట్రోక్ వస్తుంది. అలాంటి వారికి థ్రోంబలైసిస్ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా రక్తనాళాల్లో గడ్డలు కరిగించి, మంచి ఫలితాలు సాధిస్తున్నాం. – డాక్టర్ డి.వి.మాధవీకుమారి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వాస్పత్రి, విజయవాడ లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ పెరిగాయి పోస్టు కోవిడ్ రోగులు కొందరు లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ పెరిగి స్ట్రోక్‌కు గురవుతున్నారు. కోవిడ్ వైరస్ కారణంగా రక్తనాళాలు దెబ్బతిని, వాటిలో గడ్డలు ఏర్పడి బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటుకు గురవుతున్న వారిని చూస్తున్నాం. ఒక సారి స్ట్రోక్ వచ్చిన వారికి మళ్లీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. అలాంటి వారు మధుమేహం, రక్తపోటు, కోలస్ట్రాల్ స్థాయిలను పూర్తిగా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ డి.అనీల్‌కుమార్, న్యూరాలజిస్ట్ -
ఆర్థిక ఇబ్బందుల్లో 'లగాన్' నటి.. ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ..
Aamir Khans Lagaan Co-star Parveena Seeks Help: అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో 'లగాన్' ఒకటి. 2001లో విడుదలైన ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. అంతేకాకుండా ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ మంచి గుర్తింపు వచ్చింది. అయితే కాలం మారుతున్న కొద్దీ పరిస్థితులు మారుతాయి. సినిమా అనే రంగుల ప్రపంచంలో కనిపించేదంత నిజం కాదు. తెర వెనుక ఎన్నో విషాదాలు గూడుకట్టుకుంటాయి. చదవండి: నా మాజీ భార్య ఎవరినైనా ఇష్టపడ్డా నేను సంతోషిస్తా లగాన్‌లో నటించిన ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పర్వీనా పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే ఉంది. రీసెంట్ గా ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్ రావటం, ఆర్థికంగా చతికిలపడిపోవటం, చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవటంతో ఆమె పరిస్థితి అయోమయంగా ఉంది. దీంతో ఆమె గత్యంతరం లేక నన్ను ఆదుకోవాలంటూ తాజాగా అమీర్ ఖాన్ కి సోషల్ మీడియా వేదికగా మొర పెట్టుకుంది. చిత్ర పరిశ్రమలో తనకు కాస్టింగ్ డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతుంది. (ఖరీదైన కారును వదిలి ఆటోలో ప్రయాణించిన హీరోయిన్) లగాన్‌తో పాటు ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించిన పర్వీనాకు 2002లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రంగంలోకి దిగి అక్షయ్ కుమార్, సోనూసూద్ లాంటి సెలబ్రిటీల ద్వారా ఆమె వైద్యానికి సాయం అందించారు. అయితే ఆ డబ్బు చికిత్సకే సరిపోయింది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో తనకు సాయం చేయాల్సిందిగా కోరుతుంది. తన పరిస్థితి గురించి అమీర్ ఖాన్‌కు తెలియదని, తెలిస్తే కశ్చితంగా ఏదో ఒక విధంగా సాయం చేసేవాడని తెలిపింది. గతంలో వల్లభ వ్యాస్ అనే నటుడికి బ్రెయిన్ స్ట్రోక్‌తో పక్షవాతానికి గురైనప్పుడు అమీర్ ఖాన్ సాయం చేయడాన్ని గుర్తుచేసింది. (సారికతో కపిల్‌దేవ్ బ్రేకప్ లవ్‌స్టోరీ) -
'ఆషిఖి' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్
'ఎల్ఏసీ' సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్‌కు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. కార్గిల్‌లో ఉన్న వాతావరణం కారణంగా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే షూటింగ్ నిలిపివేసి రెండు రోజుల క్రితం ముంబైకి వచ్చారు. ఈ విషయాన్ని రాహుల్ రాయ్ సోదరుడు రోమీర్ సేన్ ఆలస్యంగా మీడియాకు తెలిపారు. రాహుల్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడని, అయితే ఎవరూ భయపడాల్సిన పని లేదని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. కోవిడ్ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందన్నారు. (చదవండి: రియాలిటీ షో: వారిద్దరూ కలిసుండటం లేదా!) రాహుల్ రాయ్.. 'ఆషిఖి' సినిమాతో 22 ఏళ్లకే బాలీవుడ్లో తెరంగ్రేటం చేశారు. మొదటి సినిమాతోనే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తర్వాత పలు సినిమాల్లో తన ప్రతిభ చూపించారు. 2006లో హిందీ బిగ్‌బాస్ మొదటి సీజన్ టైటిల్‌ను సైతం ఆయన కైవసం చేసుకున్నారు. పలు టీవీ షోలలోనూ ప్రత్యేక అతిథిగా కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన 'ఎల్ఏసీ- లైవ్ ద బాటిల్ ఇన్ కార్గిల్' సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. (చదవండి: 26/11 విషాదం.. ‘మీ జ్ఞాపకాలే నా బలం’) -
కరోనాతో కొత్తముప్పు !
సాక్షి, విజయవాడ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో రోజుకో కొత్త సమస్యలు వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకూ కరోనాతో పలువురిలో మధుమేహం స్థాయిలు పెరగడంతో పాటు, లంగ్ ఇన్ఫెక్షన్స్కు గురవడం, లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. తాజాగా కరోనాకు గురైన వారిలో కొందరిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌లకు గురవుతున్నట్లు వెల్లడైంది. ఆస్పత్రిలో చికిత్స పొంది, డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన రోగుల్లో 7 నుంచి 8 శాతం మంది రోగులు నాలుగు నుంచి ఆరు వారాల్లో గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా వెంటిలేటర్ దాకా వెళ్లొచ్చిన రోగుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. దీంతో కరోనా తగ్గినా మూడు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ గుండె పరీక్షలు... కరోనాతో కోవిడ్ స్టేట్ ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరికీ గుండె పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా సివియర్ కండీషన్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. కోవిడ్ రోగుల్లో గుండె సమస్యలను గుర్తించడంతో ఇటీవల కోవిడ్ స్టేట్ ఆస్పత్రిలో గుండె వైద్య విభాగాన్ని సైతం ఆఘమేఘాలపై ప్రారంభించారు. ఆ విభాగంలో ప్రతి రోగికి ఈసీజీ, ఎకో కార్డియాలజీ పరీక్ష చేస్తున్నారు. అవసరమైతే యాంజియోగ్రామ్ నిర్వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు కరోనా రోగులకు గుండె వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తున్నారు. (ఫిబ్రవరికల్లా సగం జనాభాకు కరోనా!) వెలుగు చూస్తున్న సమస్యలివే... కరోనాతో చికిత్స పొందుతున్న రోగులు కొందరు పల్మనరీ ఎంబోలిజయ్(ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం)కు ఎక్కువుగా గురవుతున్నారు. కరోనా మరణాల్లో ఎక్కువ మందిలో ఇదే కారణంగా చెపుతున్నారు. కొందరిలో గుండె రక్తనాళాల్లో, మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి, పూడికలు రావడం, కాళ్ల రక్తనాళాల్లో సైతం గడ్డలు ఏర్పడి రక్తప్రసరణ తగ్గుతున్న వారిని గుర్తిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 2 నుంచి 3 శాతం మందిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి మరణాలు సంభవిస్తుండగా, డిశ్చార్జి అయిన వారిలో 7 నుంచి 8 శాతం మందిలో గుండె, మెదడు సమస్యలు వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ►ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఖచ్చితంగా మూడు నెలల పాటు యాంటి కో ఆగ్యులేషన్ మందులు వాడాలి. అలా వాడిన వారిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడిన సందర్భాలు లేవు. ►ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్కు స్టెరాయిడ్స్ వాడిన వారు, ఆ తర్వాత ఫాలోఅప్ మందులు కూడా వాడాలి. ►యోగా, మెడిటేషన్, వ్యాయామం చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ►పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ►తరచూ రక్తంలో ఆక్సిజన్శాతాన్ని పరీక్షించుకోవాలి. ఏ మా త్రం తగ్గినట్లు గుర్తించినా వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలి. రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి కోవిడ్ సివియర్ స్టేజ్‌కు వెళ్లిన కొందరిలో యాంజియోగ్రామ్ చేసినప్పుడు రక్తంలో విపరీతమైన గడ్డలు ఏర్పడటం గుర్తిస్తున్నాం. గుండె రక్తనాళాలతో పాటు, మెదడు, కాళ్ల రక్తనాళాల్లో కూడా గడ్డలు ఉంటున్నాయి. ఒక వ్యక్తి పదిరోజుల పాటు మంచంపైనే పడుకుంటే సాధారణంగా పల్మనరీ ఎంబోలిజమ్కు గురయ్యే అవకాశం ఉంది. అలాంటిది ఐసీయూలో కదలకుండా రోజుల తరబడి ఉంటున్న వారికి పల్మనరీ ఎంబోలియజ్, కరోనాతో ఏర్పడే గడ్డలతో ప్రాణాపాయం ఏర్పడుతుంది. అలాంటి వారికి యాంటి కో ఆగ్యులేషన్ థెరపీ అందిస్తారు. కరోనా చికిత్స పొందిన వారిలో పదిహేను ఇరవై రోజుల్లో కొందరిలో, నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో మరికొందరిలో గుండె సమస్యలు, గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురవుతున్న వారిని గుర్తిస్తున్నాం. విజయవాడ కోవిడ్ ఆస్పత్రిలో ఈసమస్యలకు అత్యాధునిక చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ విజయ్ చైతన్య, కార్డియాలజిస్ట్ -
రమేష్ ఆస్పత్రి నిర్వాకం.. డబ్బులు చెల్లించాకే
సాక్షి, గుంటూరు మెడికల్: బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న మహిళ మృతిచెందగా, డబ్బులు చెల్లించాకే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం తేల్చిచెప్పిన ఘటన గుంటూరులోని రమేష్ హాస్పిటల్లో సోమవారం జరిగింది. ప్రజాసంఘాలు ఆస్పత్రి ఎదుట ధర్నా చేయటంతో చివరకు మృతదేహాన్ని అప్పగించారు. గుంటూరు మార్కెట్ సెంటర్లోని రమేష్ హాస్పిటల్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామానికి చెందిన చింతగుంట్ల విజయలక్ష్మి (40)కి గత నెల 26న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం విజయవాడ రమేష్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మెరుగైన చికిత్స గుంటూరు రమేష్ హాస్పిటల్లో ఉందంటూ ఆస్పత్రి యాజమాన్యం అదే నెల 29న గుంటూరుకు ఆమెను రిఫర్ చేసింది. గుంటూరులో రూ.3 లక్షలు ఖర్చుపెట్టుకుంటే విజయలక్ష్మి కోలుకుంటుందని చెప్పటంతో కుటుంబసభ్యులు ఆ మేరకు సొమ్ము చెల్లించారు. సెపె్టంబర్ ఒకటిన ఆపరేషన్ చేసినా ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. నాలుగు రోజుల్లో ఆరోగ్యం కుదుటపడుతుందని ఆస్పత్రి వైద్యులు చెప్పినా మెరుగుపడకపోవటంతో కుటుంబ సభ్యులు ఈ విషయంపై వైద్యులను ప్రశ్నించారు. ప్రతిరోజూ రూ.50 వేలు కడితేనే ఆస్పత్రిలో వైద్యం అందిస్తామని, లేకపోతే వెళ్లిపోవాలని చెప్పటంతో ఇప్పటివరకు రూ.11 లక్షలు ఖర్చు చేసినట్టు విజయలక్ష్మి భర్త రాజు తెలిపారు. అప్పు చేసి ఆస్పత్రికి రూ.11 లక్షలు కట్టినా తన భార్య సోమవారం చనిపోయిందని రాజు వాపోయాడు. ఆమె భౌతికకాయాన్ని అప్పగించేందుకు రూ.1.30 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి యజమాన్యం డిమాండ్ చేయటంతో బాధితుడు ప్రజా సంఘాల వారిని సంప్రదించాడు. ఆంధ్ర బహుజన సమితి నాయకుడు పంతగాని రమేష్, అంబేడ్కర్ యువజన సంఘం నాయకుడు బత్తుల వీరాస్వామి, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు విజయభాస్కర్, వినయ్‌కిషోర్, ఇతర సంఘాల నేతలు ఆస్పత్రి యాజమాన్యం తీరును నిరసిస్తూ రమేష్ హాస్పిటల్ ఎదుట ధర్నా చేశారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం దిగివచ్చి విజయలక్ష్మి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించింది. (పది మంది చనిపోతే దర్యాప్తు చేయొద్దా?) -
పాతికేళ్లకే బ్రెయిన్ స్ట్రోక్
సాక్షి, హైదరాబాద్: మనిషి మొదడు మొద్దుబారుతోంది. ఓపక్క పని ఒత్తడి.. మరోపక్క నిద్రలేమి వెరసి దాని పనితనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్న వయసులోనే ప్రమాదకరమైన బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమవుతుంది. ప్రస్తుతం 40 ఏళ్లలోపు వయస్కుల్లో వెలుగు చూస్తున్న 20 శాతం మరణాలకు ఇదే కారణంమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హెచ్‌సీసీ వేదికగా ఇటీవల నిర్వహించిన ‘ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ’ వార్షిక సదస్సులో దేశవిదేశాలకు చెందిన సుమారు 2500 మంది న్యూరోసర్జన్లు హాజరై ఇదే అభిప్రాయం వెలుబుచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ సదస్సు కో–చైర్మన్ డాక్టర్ సుభాష్‌కౌల్ యువత మొదడు ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో వివరించారు. ఒత్తిడి వల్ల చిన్నతనంలోనే స్ట్రోక్ మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లకు తోడు శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడంతో ఒకప్పుడు యాభై ఏళ్ల తర్వాత వెలుగు చూసిన బ్రెయిన్ స్ట్రోక్స్ పాతికేళ్ల వయస్కుల్లోనే కనిపించడం ఆందోళన కలిగించే అంశం. టార్గెట్లను ఛేదించాలనే ఆశయంతో రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని పనిచేస్తూ, మానసికంగా తీవ్ర ఒత్తిడిలోనవుతున్నారు. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన బాధితులను ఆరు గంటల్లోగా ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స అందించగలిగితే ప్రాణాలు కాపాడొచ్చు. అవగాహన లేమికితోడు నిర్లక్ష్యం వల్ల చాలామంది పూర్తిగా కాళ్లు, చేతులు, మాట పడిపోయిన తర్వాత అచేతనాస్థితిలో ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. అప్పటికే మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి మృత్యువాతపడుతున్నార’ని డాక్టర్ కౌల్ ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ప్రశాంతతతోనే విముక్తి ఇప్పటికే హై బీపీతో బాధపడుతున్న వారు ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రశాంత మైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. అంతేకాదు వేళకు ఆహారం తీసుకోవడం, ఆహారంలో పిండిపదార్థాలకు బదులు పీచుపదార్థాలు ఎక్కువ ఉండేలా చూసుకోవడం, మద్యం, మాంసాహారాలకు దూరంగా ఉండటం, ప్రతిరోజు ఉదయం కనీసం అరగంట పాటు వ్యాయామం, యోగాతో మానసిక ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. మానసిక ఆరోగ్యం, చికిత్సల్లో వచ్చిన అత్యాధునిక మార్పులను అధ్యయనం చేసేందుకు ఇలాంటి సదస్సులు భావితరం వైద్యులకు ఎంతో ఉపయోగపడుతాయని ఆయన స్పష్టం చేశారు. -
మాంసాహారుల్లోనే ‘స్ట్రోక్’లు తక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్ స్ట్రోక్) మాంసాహారుల్లో ఎక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో తక్కువగా ఉంటుందని ప్రజలు గత కొంత కాలంగా నమ్ముతూ వస్తున్నారు. పర్యవసానంగా బ్రిటన్‌లో శాకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం వారి సంఖ్య 17 లక్షలకు చేరుకుంది. వాస్తవానికి మాంసాహారుల కన్నా శాకాహారుల్లోనే ఈ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తాయని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఓ సుదీర్ఘ అధ్యయనంలో తేలింది. వారు 50 వేల మందిపై 18 ఏళ్లపాటు అధ్యయనం జరిపి ఈ విషయాన్ని తేల్చారు. మాంసాహారులకన్నా శాకాహారుల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 20 శాతం అధికమని పరిశోధకులు తెలిపారు. శాకాహారుల్లో మెదడు రక్తనాళాల గుండా తక్కువ కొలస్ట్రాల్, బీ12 లాంటి విటమిన్లు తక్కువగా ప్రవహించడం వల్ల రక్తనాళాలు చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వారు చెప్పారు. అయితే మాంసాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెప్పారు. మాంసం తినేవారికన్నా శాకాహారులు, చేపలు తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని వారు తెలిపారు. మాంసహారులతో పోలిస్తే శాకాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశం 22 శాతం తక్కువని చెప్పారు. వారు తమ అధ్యయన వివరాలను బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. సగటున 45 ఏళ్ల ప్రాయంగల 50వేల మందిని ఎంపిక చేసుకొని వారిపై పరిశోధకులు తమ అధ్యయనం చేశారు. వారిలో సగం మంది మాంసహారులుకాగా, మూడో వంతు మంది శాకాహారులుకాగా, ఐదో వంతు మంది చేపలు తినేవారు. వారిపై 18 ఏళ్లపాటు అధ్యయనం కొనసాగించగా వారిలో 2,820 మంది గుండె జబ్బులకు గురికాగా, 1,072 మంది బ్రెయిన్ స్ట్రోక్‌లకు గురయ్యారు. మాంసహారులపైన అధ్యయనం జరపడం చాలా సులువుగానీ శాకాహారులపై అధ్యయనం జరపడం కష్టమని వివిధ యూనివర్శిటీలకు చెందిన ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. శాకాహారుల్లో సాధారణ ఆకుకూరలు, కూయగారలు తినే వాళ్లు ఎక్కువగా ఉంటారని, దుంపలు, గింజలు, పప్పు దినుసులు, పండ్లు తినేవారు తక్కువగా ఉంటారని, శాకాహారుల మెదడు రక్తనాళాల్లో కొలస్ట్రాల్ శాతం తక్కువ ఉన్నవాళ్లు వీటిని తిన్నట్లయితే కచ్చితంగా కొలస్ట్రాల్ శాతం పెరుగుతుందని ‘బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్’ సీనియర్ డైటిస్ట్ ట్రేసి పార్కర్ చెప్పారు. నేటి పరిస్థితుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కన్నా గుండెపోటు వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నందున శాకాహారమే ఒక విధంగా మేలని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి: ఇదీ శాకాహార చరిత్ర) -
మాజీమంత్రి మల్యాల రాజయ్య కన్నుమూత
జోగిపేట /హైదరాబాద్: మాజీమంత్రి, పార్లమెంట్ మాజీ సభ్యుడు మల్యాల రాజయ్య(82) బ్రెయిన్ స్ట్రోక్‌తో కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని సీతాఫల్మండి మేడిబావిలో నివసిస్తున్న రాజయ్య గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతి చెందారు. 1936లో కరీంనగర్ జిల్లా వెదిర గ్రామంలో జన్మించిన రాజయ్యకు భార్య అనసూయదేవి, కుమారుడు, ఇద్దరు కుమా ర్తెలున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, ఎల్.ఎల్.బి చేసిన రాజయ్య మొదట న్యాయవాదిగా పనిచేశారు. ఆ తరువాత జడ్జీగా చీరాల, కల్వకుర్తి, హైదరాబాద్, సిటీ సివిల్ కోర్టుల్లో పనిచేశారు. 1984లో రాజకీయాల్లోకి వచ్చిన రాజయ్య 1985, 1989, 1994లో టీడీపీ తరఫున అందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1998, 1999ల్లో సిద్దిపేట నుంచి ఎంపీగా గెలిచారు. 2006లో టీఆర్ఎస్లో చేరి కొంతకాలం తర్వాత తిరిగి టీడీపీలో చేరా రు. రాజయ్య అంత్యక్రియలను మంగళవారం ఉదయం 10 గంటలకు సీతాఫల్మండి శ్మశానవాటికలో నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సీతాఫల్మండి మేడిబావి గృహంలో రాజయ్య మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ సంతాపం రాజయ్య మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రజాప్రతినిధిగా ఆయన సేవలను స్మరించుకున్నారు. రాజయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
అమర్నాథ్ యాత్రలో అపశ్రుతి
శ్రీకాకుళం రూరల్: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన జిల్లాకు చెందిన వృద్ధుడు బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందాడు. దీంతో నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్న అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సావూకారి రవీంద్రనాథ్ చౌదరి (72), భార్య భువనేశ్వరి గత నెల 18న శ్రీకాకుళం నుంచి ఓ ట్రావెల్ సంస్థ ఏర్పాటు చేసిన ప్యాకేజీతో బయలుదేరి వెళ్లినట్లు తమ రెండో కూతురు సుమన ఆదివారం తెలిపింది. ట్రావెల్ సంస్థ ఆధ్వర్యంలోనే పయనం వీరిద్దరూ గత నెల 20వతేదీ నాటికి అమనాథ్ చేరుకున్నారు. ఈ 3న అమర్నాథ్ దైవదర్శనం చేసుకున్నాక అక్కడ్నుంచి వారుండే చోటుకు తిరిగి చేరుకున్నారు. మరుసటి రోజు 4న ఉదయం టిఫిక్ చేస్తుండగా రవీంద్రనాథ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడే శ్రీనగర్‌లోని కాశ్మీర్ హాస్పిటల్లో వైద్య సేవలందించారు. దీంతో వెంటిలేటర్ తీయడానికి వీలు లేకపోవడంతో ఆయన్ను ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో శ్రీకాకుళం తరలించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదేక్రమంలో ఒక్కసారిగా హార్ట్స్ట్రోక్ రావడంతో ప్రాణాలు వదిలారని ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ ఆర్జీ శ్రీకాంత్ ఒక ప్రకటనలో మీడియాకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న మృతుడు కొడుకు కిరణ్ హైదరాబాద్ నుంచే హుటాహుటిన అమర్నాథ్ చేరుకున్నాడు. అయితే మృతదేహాం ఈ నెల 10వ తేదీకి శ్రీకాకుళానికి చేరుతుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లుతెలిసింది. కుటుంబ నేపథ్యం ఇదీ.. మృతుడు రవీంద్రనాథ్ టీచర్ స్థాయి నుంచి ఎంఈవోగాను, డీఐవోగాను, హెచ్ఎంగా వివిధ హోదాల్లో పనిచేస్తూ కొన్నేళ్ల క్రితం పదవీవిరమణ పొందారు. ఈయన భార్య కుడా టీచర్‌గా పదవీ విరమణ చేశారు. ఈయన స్వస్థలం వజ్రపుకొత్తూరు మండలం వంకులూరు గ్రామం అయినప్పటికీ జిల్లా కేంద్రంలోనే స్థరపడ్డారు. వీరికి ముగ్గురు సంతానం. అందులో పెద్దమ్మాయి సృజన ఓంగోలు రిమ్స్ డిప్యూటీ డైరెక్టర్‌గా, రెండో అమ్మాయి సుమన శ్రీకాకుళంలోనే స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. వీరి తమ్ముడు కిరణ్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తన తండ్రికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, అమర్నాథ్ యాత్రలో ఒక్కసారిగా మృత్యువాత పడటం నమ్మలేక పోతున్నామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
బ్రైన్ స్టోక్‌తో కానిస్టేబుల్ మృతి
రణస్థలం/శ్రీకాకుళం రూరల్: మండలంలోని వల్లభరావుపేట గ్రామానికి చెందిన ట్రైనీ సివిల్ కానిస్టేబుల్ పిల్లా సుబ్బారావు(23) బ్రెయిన్ స్ట్రోక్‌తో సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసులు, కుటుంబçసభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలావున్నాయి. 2017 జనవరిలో విశాఖపట్నం జిల్లాకు సివిల్ కానిస్టేబుల్‌కు ఎంపికయ్యాడు. శ్రీకాకుళంలోని తండేవలసలో ఉన్న జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు. ఆదివారం సాయంత్రం వరకు పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ పొందారు. తర్వాత అర్ధరాత్రి వరకు తోటి స్నేహితులతో సందడిగా గడిపి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. సోమవారం ఉదయం 4 గంటల సమయంలో హైబీపీ ఒక్కసారిగా రావడంతో తోటి స్నేహితులు వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రిమ్స్ వైద్యులు పరిశీలించాక తలంతా ఓ రంగులోకి మారిపోయిందని, మెదడులో నరాలు కదలికలు లేక రక్తం గడ్డికట్టినట్టుగా గుర్తించారు. వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ చేసేందుకు జెమ్స్, కిమ్స్ వైద్యులను సంప్రదించారు. ఆ ఆపరేషన్ చేసేందుకు సౌకర్యాలు లేకపోవడంతో వెంటనే ఉన్నత వైద్యుల సలహాలు మేరకు విశాఖపట్నంలోని అత్యున్నతమైన ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. హైబీపీ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మృతి చెందాడు. వెంటనే మృతదేహాన్ని మార్చురికీ తరలించారు. మంగళవారం ఉదయం పోలీసు లాంఛనాలతో మృతదేహానికి అంత్యక్రియలు చేస్తామని జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. గ్రూప్స్‌లో ఉద్యోగమే లక్ష్యంగా సాధన ఇదిలావుండగా సుబ్బారావు గ్రూప్స్‌లో ఉద్యోగం సాధించే దిశగా హైదరాబాద్‌లో ఓ శిక్షణ సంస్థలో కొన్ని నెలలు శిక్షణ తీసుకున్నాడు. ఆ ఉద్యోగంలో అర్హత సాధించకపోవడం, తర్వాత వీఆర్వో ఉద్యోగంలో కూడా అనుకున్న మార్కులు రాకపోవడంతో మనస్థాపం చెందినట్టు తోటి మిత్రులు తెలిపారు. ప్రతీసారి ఈ విషయాలనే తలచుకొని ఏదో కోల్పోయినట్టు దిగాలుగా ఉండడం, ఎక్కువగా ఆలోచించడం, ఎవరితో మాట్లాడకపోవడం చేసేవాడని తోటి ట్రైనీలు చెబుతున్నారు. అతిగా ఆలోచించడం వల్లే మెదడు మరింత వత్తిడికి గురైనట్టు వైద్యులు గుర్తించారు. రిమ్స్ ఆస్పత్రిలో చేరినప్పుడే బీపీని పరిశీలించగా 100/180 ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దిక్కు కోల్పోయిన కుటుంబం పిల్లా సుబ్బారావు మృతితో వల్లభరావుపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వ్యవసాయంపైనే ఆధారపడిన కుటుంబానికి సుబ్బారావుకు ఉద్యోగం రావడంతో ఆధారం దొరికిందని సంబరపడిపోయారు. అయితే ఏడాదిలోపే ఇలా జరగడంతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి తవిటినాయుడు, తల్లి అనసూయమ్మ కాయకష్టం చేసి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెను చదివించారు. వీరిలో చిన్నవాడైన సుబ్బారావు మృతితో కుటుంబం ఆధారం కోల్పోయింది. మమ్మల్ని ఆదుకోవాలని జిల్లా ఎస్పీ సి.ఎం.త్రివిక్రమవర్మకు మృతుని కుటుంబ సభ్యులు కోరారు. తల్లడిల్లిపోయిన ఏఎస్పీ విషయం తెలుసుకున్న ఏఎస్పీ పనసారెడ్డి వెంటనే రిమ్స్‌కు చేరుకున్నారు. అయితే కుమారుడు మృతదేహాన్ని చూసి తండ్రి తవిటినాయుడు బోరునా విలపించాడు. అక్కడే వైద్యులతో మాట్లాడుతున్న ఏఎస్పీ ఆయన్ను చూసి ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు. ఎలా ఓదార్చాలో తెలియక కాసేపు ఉద్వేగంకు గురయ్యారు. కొత్త సంవత్సరంతో దేవుడు మాకు ఇలాంటి కడుపుకోతను మిగిల్చాడంటూ కుటుంబీకులంతా గుండెలవిసేలా విలపించారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
బ్రెయిన్ డెడ్ అమ్మ.. కవలలకు జన్మ..
ఎన్ని విధాలుగా వర్ణించిన ఇంకా వర్ణించడానికి మిగిలిపోయే ఆనందం పేరు అమ్మ. అమ్మ గొప్పతనం మరోమారు చాటిచెప్పే సంఘటన బ్రెజిల్లో వెలుగు చూసింది. బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ దాదాపు 123 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కవలలకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. మ్యూరియల్ పదిల్హ(24), ఫ్రాంక్లిన్ డిసిల్వా జాంపోలి పదిల్హ(21)లు భార్యభర్తలు. మ్యూరియల్ వృత్తిరీత్యా రైతు. వివాహం జరిగిన కొన్నాళ్లకే భార్య గర్భం దాల్చడంతో అందరిలానే సంబరపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎన్నాళ్లో నిలవలేదు. ఓ రోజు మ్యూరియల్ పొలానికి వెళ్లిన సమయంలో తన తల తీవ్రంగా నొప్పిపెడుతుందంటూ ఫ్రాంక్లిన్ ఫోన్ చేసింది. సాధారణ నొప్పేమోనని భావించిన మ్యూరియల్ ట్లాబ్లెట్ వేసుకోవాలని సూచించాడు. ట్యాబ్లెట్‌కు తగ్గేలా లేదని.. తన తలతో పాటు మెడ నరం నుంచి కూడా విపరీతంగా నొప్పి వస్తుందని ఫ్రాంక్లిన్ చెప్పడంతో హుటాహుటిన ఇంటికి చేరుకుని భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను వెంటనే గుర్తించిన డాక్టర్లు ఫ్రాంక్లిన్‌ను ఐసీయూకి తరలించి చికిత్స ప్రారంభించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. తలలో ఒక నరం చిట్లి రక్తస్రావం ప్రారంభమైనట్లు డాక్టర్లు గుర్తించారు. అంతలోనే ఫ్రాంక్లిన్ కోమాలోకి వెళ్లిపోయింది. అమ్మ కోమాలో ఉన్నా.. లిన్ గర్భంలో కవలలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆమె కోమాలోకి వెళ్లినా చిన్ని గుండెలు మాత్రం కొట్టుకుంటున్నాయని(అప్పటికి లిన్‌కు ఏడు నెలలు) మానవ ప్రయత్నంతో వారిని రక్షించాలని భావించారు. అనుకున్నదే తడవుగా అందుకు తగిన ఏర్పాట్లను చేశారు. 123రోజుల పాటు బిడ్డలను తల్లిగర్భంలో సేఫ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నెలలు నిండిన తర్వాత లిన్‌కు సిజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యులు కవలలు(బాబు,పాప)ను బయటకు తీశారు. అయితే, ఆపరేషన్ పూర్తైన వెంటనే లిన్ మరణించింది. గర్భంలో ఉన్న బిడ్డలను లాలించా.. కదలిక లేని తల్లి శరీరంలో ఉన్న బిడ్డలకు అన్నీ తానై లాలించానని వారి తండ్రి మ్యూరియల్ చెప్పారు. లిన్ గర్భంపై తల ఆన్చి పిల్లలతో కబుర్లు చెప్పానని, కానీ ఇప్పుడు ఆమె తనతో లేకుండాపోయిందని కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం బిడ్డలే లోకంగా బతుకుతున్నానని చెప్పారు. చూడ ముచ్చటగా ఉన్న బిడ్డల ఫోటోను మీడియాతో పంచుకున్నారు. బిడ్డలు జన్మించిన సమయంలో డాక్టర్లతో పాటు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారని వెల్లడించారు. ఆసుపత్రిలోని తమ దీనగాథ విన్న వందలాది మంది బ్రెజిలియన్లు వేల కొద్దీ పౌండ్లను వైద్యం కోసం సాయం చేశారని చెప్పారు. కొందరు పిల్లలకు దుస్తులు తదితర వస్తువులు ఇచ్చారని తెలిపారు. తక్కువ బరువుతో జన్మించిన పిల్లలను మూడు నెలల పాటు ఇంక్యూబేటర్లో ఉంచామని చెప్పారు. ఆ తర్వాత వారు సాధారణ స్ధితికి చేరుకున్నట్లు వెల్లడించారు. -
‘సిరి’నవ్వులు.. ఇక లేవు
బ్రెయిన్‌స్ట్రోక్‌తో చిన్నారి మృతి రామగుండంలో విషాదం వినాయక నిమజ్జనం వాయిదా రామగుండం(కరీంనగర్ జిల్లా): ఆ చిన్నారి గారాల మాటలు.. బుడిబుడి అడుగులు వేస్తుంటే వచ్చే మువ్వల శబ్దాలకు ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందపడేవారు.. ఆమెచేసే సందడితో ఆ ఇంట్లో నిత్యం పండగే... అలా హాయిగా గడిచిపోతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. రెండున్నరేళ్ల సంబరాల ‘సిరు’లు కురిపించిన ఆ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయి. బ్రెయిన్‌స్టోక్ రావడంతో పాప మృతిచెందింది. ఆ కుటుంబానికి తీరని దుఃఖం మిగిలిచ్చింది. ఈ సంఘటన రామగుండం పట్టణంలోని పాత బజార్లో జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. పాతబజార్‌లో ఉంటున్న కట్కూరి శ్రావణ్–సంధ్య దంపతులకు కుమారుడు, కూతురు సుశ్రుత(సిరి) సంతానం. వినాయక నవరాత్రోత్సవాల్లో రెండున్నరేళ్లు సిరి ఉత్సాహంగా పాల్గొంది. వారి ఇంటిముందే ఏర్పాటుచేసిన వినాయకుడి మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన భజన, సాంస్కృతిక కార్యక్రమాల్లో సందడి చేసింది. రాత్రి 11గంటల వరకు సందడి చేసింది. అనంతరం ఇంటికి వెళ్లి నిద్రపోయింది. కొద్దిసేపటికి నిద్రలోనే వాంతులు చేసుకుంది. తల్లిదండ్రులు దిష్టి తగిలిందేమోనని అనుకున్నారు. సోమవారం వేకువజామున 3 గంటలకు నిద్రలేచిన సిరి నీళ్లు కావాలని అడిగింది. నీళ్లు తాగిన వెంటనే ఫిట్స్‌తోపాటు నోటి నుంచి నురుసులు రావడంతో తల్లిదండ్రుల ఆందోళన చెందారు. గోదావరిఖనిలోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రతిమ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నం చేస్తుండగా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఐసీయూకు తరలించారు. కొద్ది సేపట్లోనే మూడుసార్లు హార్ట్స్ట్రోక్, బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చింది. వెంటనే చిన్నారి కోమాలోకి వెళ్లింది. డాక్టర్లు పరిశీలించి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టి ఉండవచ్చని తెలిపారు. 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. పరిస్థితి విషమించి బుధవారం వేకువజామున సుశ్రుత మృతిచెందింది. చిన్నారి హఠాన్మరణంతో పట్టణంలో విషాదం నెలకొంది. చిన్నారి తాత కట్కూరి ఆత్మలింగం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కావడంతో బుధవారం నిర్వహించాల్సిన నిమజ్జనం వాయిదా వేశారు. -
అపోలోలో బ్రెయిన్ స్ట్రోక్ చికిత్స విభాగం
కాకినాడ సిటీ: కోస్తాలోనే తొలిసారిగా గుండె మాదిరిగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి న్యూరో సర్జన్, న్యూరో ఫిజీషియన్లతో అత్యవసర చికిత్సా విభాగాన్ని కాకినాడ అపోలో హాస్పటల్లో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నట్టు అపోలో హాస్పటల్స్ రీజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సందీప్ చత్రాత్ తెలియజేశారు. స్థానిక జీఆర్టీ గ్రాండ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారిన జీవన శైలి కారణంగా మనిషికి వస్తున్న బ్లడ్ ప్రెజెర్, డయాబెటిక్, ఊబకాయం వంటి వాటివల్ల హార్ట్ ఎటాక్ మాదిరిగా బ్రెయిన్ స్ట్రోక్‌లు కూడా వస్తున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, 15 సంవత్సరాల అనుభవం ఉన్న న్యూరో సర్జన్ డాక్టర్ ఎం.వి.కిరణ్‌కుమార్ విభాగాధిపతిగా, నిమ్స్‌లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న డాక్టర్ భూషణ్‌పాల్ వద్ద శిక్షణ పొందిన న్యూరో ఫిజీషియన్లతో ఈ బ్రెయిన్‌స్ట్రోక్ చికిత్సా విభాగాన్ని కాకినాడ అపోలోలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీన్ని మంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్పు చేసేందుకు వీలుగా అపోలో యాజమాన్యం రూ.14 కోట్లు మంజూరు చేసిందని, దీంతో అధునాతన పరికరాలు సమకూర్చుకోనున్నట్టు, మరో ఆరునెలల్లో కొత్తబ్లాక్ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. న్యూరో సర్జన్ డాక్టర్ ఎం.వి.కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆధునిక చికిత్స, మందులు ద్వారా బ్రెయిన్లో డ్యామేజీ జరగకుండా అరికట్టేందుకు వీలవుతోందన్నారు. ఈ సమావేశంలో అపోలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఐవీ రమణ, న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బెజవాడ కామరాజు, ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ చటర్జి పాల్గొన్నారు. -
బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలి?
ఆయుర్వేదం కౌన్సెలింగ్ నేను దానిమ్మ, సీతాఫలం చాలా ఇష్టంగా తింటుంటాను. అవి బాగా చలువ పదార్థాలనీ, ఆ పండ్లను తినడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని అంటున్నారు. మేము ఆయుర్వేదాన్ని విశ్వసిస్తాము. ఆయుర్వేదంలో వీటి ప్రస్తావనలు ఉంటే వివరించండి. - పేరి రామశర్మ, బొబ్బిలి మీరు విన్న నష్టాలు కేవలం అపోహలు మాత్రమే. దానిమ్మను సంస్కృతంలో దాడిమ, దంతబీజ, లోహితపుష్పక అంటారు. రుచిని బట్టి ఇందులో తియ్యటివి, పుల్లటివి, రెండింటి సమ్మేళనంతో ఉన్నవి అని మూడు రకాలుగా ఉంటాయి. ఈ ఫలం శరీరానికి చాలా మంచిది. దేహంలో మంట, జ్వరం, దప్పికలను తగ్గిస్తుంది. హృదయదౌర్బల్యం, నోటిపూతలను పోగొడుతుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. శరీరంలోని వాపులను తగ్గిస్తుంది. అరుచి, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించి, జీర్ణాశయాన్ని బలవత్తరం చేస్తుంది. రక్తవర్థకం, శక్తివర్థకం. శుక్రకరం. ఈ చెట్టు బెరడును ఎండించి, చూర్ణం చేసి ఒక చెంచా పొడిని నీళ్లతో సేవిస్తే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. ఈ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకొంటే కోరింత దగ్గు తగ్గుతుంది. పండుపై తొక్కను దంచి, రసం తీసి తేనెతో నాకిస్తే గర్భిణుల్లో అయ్యే వాంతులు తగ్గుతాయి. దీని పువ్వులను ఎండబెట్టి చూర్ణం చేసి తేనెతో కలిపి సేవిస్తే గొంతుబొంగురుపోయినప్పుడు సత్వరమే గుణం కనిపిస్తుంది. దానిమ్మ ఆకులను దంచి కనురెప్పలపై ఉంచితే కండ్లకలక తగ్గుతుంది. సీతాఫలాన్ని సంస్కృతంలో ‘గండగాత్ర, కృష్ణబీజ’ అంటారు. ఈ ఫలం మధురరసం, శీతవీర్యం, గురు, స్నిగ్ధ గుణాత్మకం, శరీరానికి శక్తిని, పుష్టిని కలిగిస్తుంది. శరీరంలోని మంటలను తగ్గించి రక్తస్రావాలను అరికడుతుంది. దీని ఆకులు కొంచెం వేడిచేసి, ముద్దగా చేసి పట్టువేస్తే సెగగడ్డలు తగ్గుతాయి. పిప్పిపన్ను బాధతగ్గుతుంది. పచ్చి పండులోని గింజలను నీటితో ముద్దగా నూరిగానీ లేదా ఎండించిన గింజల చూర్ణాన్ని కొబ్బరినూనెతో కలిపిగానీ శిరోజాలకు పట్టించి, రాత్రిపూట ఉండనిచ్చి మర్నాటి ఉదయం తలస్నానం చేస్తే పేలు తగ్గుతాయి. ఈ గింజలను మేకపాలతో నూరి లేపనం చేస్తే శిరోజాలు దృఢంగా వృద్ధిచెందడమే గాక, పేనుకొరుకుడు వచ్చిన చోట్ల వెంట్రులు మొలిచే అవకాశముంది. కాయల్ని, గిజలను ఎండించి, చూర్ణం చేసి పంటలపై ప్రయోగిస్తే చీడపీడలూ తొలగిపోతాయి. గమనిక: కాకపోతే సీతాఫలంలోని అనేక భాగాలు కళ్లకు హానికరమని గుర్తుంచుకోవాలి. కాబట్టి వాటిని కళ్లకు దూరంగా ఉంచాలి. విత్తులు గర్భపాతకరం కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. బహుశా ఈ అంశాలనే మీ మిత్రులు ప్రస్తావించి ఉంటారు. ఈ జాగ్రత్త మినహా మిగతా అన్ని అంశాలలో సీతాఫలం పూర్తిగా ఉపయోగకరం. న్యూరో కౌన్సెలింగ్ నా వయసు 33. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను. ఇటీవల నాతో పనిచేస్తున్న నా మిత్రుడు అకస్మాత్తుగా మృతిచెందారు. ఎలా మృతి చెందారని విచారిస్తే బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందినట్లు తెలిసింది. అతనిదీ నా వయసే. మా స్నేహితుడు ఆకస్మికంగా మరణించినప్పటి నుంచి నాతో పాటు నా స్నేహితులందరూ భయాందోళనకు గురవుతున్నారు. మా అందరికీ డెడ్లైన్లు ఉండడంతో పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. మా స్నేహితుడికి ఈ వయసులో బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. అసలు బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - వివేక్, హైదరాబాద్ బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మారుతున్న జీవనశైలి, జంక్ఫుడ్స్, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, స్థూలకాయం, మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటి కారణాలతో ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా సకాలంలో సరైన చికిత్స అందిస్తే మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌కు మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన మొదటి నాలుగున్నర గంటలలోపు ఆసుపత్రికి తీసుకువెళితే క్లాట్ బర్స్టింగ్ థెరపీ ద్వారా ప్రాణాపాయం లేకుండా, కాళ్లు, చేతులు చచ్చుబడిపోకుండా, మాట పడిపోకుండా కాపాడవచ్చు. ఆలస్యం అయ్యే కొద్దీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడడానికి ప్రతి ఒక్కరిలో ముందస్తుగా కొన్ని లక్షణాలు బయటపడతాయి. మెదడులో రక్తసరఫరా ఆగిన చోటును బట్టి లక్షణాలు ముఖం బలహీనం కావడం, మూతి వంకరపోవడం, నడకలో తేడా రావడం, అస్పష్టంగా కనిపించడం, చేతులు బలహీనం కావడం, మాట్లాడడంలో ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ హెచ్చరికలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మీరు సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. ఒకవేళ మీకు రక్తపోటు, మధమేహంగానీ ఉంటే వాటిని నియంత్రణలో ఉంచుకుంటూ మీ బరువును అదుపులో ఉంచుకోండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలావరకు బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కాపాడుకోగలుగుతారు. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. నాకు గత పన్నెండేళ్లుగా షుగర్ ఉంది. ఈ మధ్య ప్రయాణాలు చేసేప్పుడు ఎక్కువగా కాళ్ల వాపులు వస్తున్నాయి. నా బ్లడ్‌టెస్ట్‌లో క్రియాటినిన్ 10 ఎంజీ/డీఎల్, యూరియా 28 ఎంజీ/డీఎల్ అని ఉన్నాయి. పోటీన్ మూడు ప్లస్ అని చెప్పారు. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. మనోహర్‌నాయుడు, కోదాడ మీ రిపోర్టు ప్రకారం మీకు యూరిన్‌లో ప్రోటీన్ ఎక్కువగా పోతోంది. ఇది షుగర్ వల్ల వచ్చిన కిడ్నీ సమస్య వల్లనా లేదా ఇతర కారణాల వల్లనా అనే అంశం తెలుసుకోవాలి. మీరు ఒకసారి కంటి డాక్టర్‌ను కలిసి రెటీనా పరీక్ష చేయించుకోవాలి. షుగర్ వల్ల రెటీనా దెబ్బతిన్నట్లయితే యూరిన్‌లో ప్రోటీన్ పోవడానికి కూడా అదే కారణం వల్లే అయి ఉంటుందని గుర్తించాలి. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. ఆహారం తీసుకోకముందు 100 ఎంజీ/డీఎల్, భోజనం తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేట్లుగా చూసుకోవాలి. కొలెస్టరాల్ పాళ్లనూ, బీపీ నియంత్రణలో ఉంచుకోవాలి. యూరిన్‌లో ప్రోటీన్ పోవడం తగ్గించడం కోసం డాక్టర్ సలహా మేరకు కొన్ని మందులు తీసుకోవాలి. అవేకాకుండా ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి. అలాగే నొప్పి నివారణ మందులను డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. మా అబ్బాయి వయసు ఐదేళ్లు. ఈ మధ్య పొద్దునే లేచినప్పుడు వాడి కళ్లు, కాళ్లలో వాపు కనిపిస్తోంది. యూరిన్ పరీక్షల్లో ప్రోటీన్ మూడు ప్లస్ అని అన్నారు. తగిన సలహా ఇవ్వండి. - ప్రసాద్‌బాబు, అనకాపల్లి మీ బాబుకు నెఫ్రోఇక్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ సమస్య ఉన్నవారిలో మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పడతాయి. మొదట ఈ వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. మీరు ఒకసారి మీ బాబుకు 24 గంటలలో యూరిన్ ప్రొటీన్ టెస్ట్ చేయించండి. సీరమ్ అల్బుమిన్ కొలెస్ట్రాల్ పరీక్ష చేయించండి. నెఫ్రోటిక్ సిండ్రోమ్ సమస్య ఉన్నవారికి సీరమ్ ఆల్బుమిన్ తక్కువగా ఉండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఇది చాలా సాధారణమైన సమస్య. మొదటి మూడు నెలలూ స్టెరాయిడ్స్ వాడాలి. పదిహేనేళ్లలోపు పిల్లల్లో ఇది మాటిమాటికీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మందులు పూర్తికాలం వాడితే మొదటిసారి వచ్చినప్పుడే తగ్గిపోతుంది. ఆహారంలో ఉప్పు, కొవ్వు తగ్గించాలి. ఇన్ఫెక్షన్ వస్తే ఇది మళ్లీ రావచ్చు. కాబట్టి ఇన్ఫెక్షన్ను నివారించాలి. -
వరంగల్ జైలులో ఖైదీ మృతి
వరంగల్ : వరంగల్ కేంద్ర కారాగారంలో అనారోగ్యంతో ఒక ఖైదీ మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి మంగళవారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి సాయంత్రం మృతి చెందాడు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
శబరిమలలో భక్తుడికి బ్రెయిన్ స్ట్రోక్
పట్టించుకోని కేరళ ప్రభుత్వం భాష రాకపోవడంతో ఇబ్బందులకు గురైన సహచరులు నాగోలు: శబరిమలకు వెళ్లిన ఓ భక్తుడు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. అతడిని నగరానికి తీసుకొచ్చేందుకు సహచరులు అష్టకష్టాలుపడ్డారు. వివరాలు.. హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేటకు చెందిన భీమగాని సోషలిజం అలియాస్ వెంకటేష్‌గౌడ్ ఆటోనగర్‌లో రేడియం ఆర్టిస్ట్. ఈనెల 9న అయ్యప్ప స్వాములతో కలిసి శబరిమల వెళ్లాడు. 11న ఉదయం పంబానదిలో స్నానం చేసి అయ్యప్ప దర్శనానికి వెళ్తుండగా వెంకటేష్‌గౌడ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే సహచరులు అతడిని కొట్టాయం గాంధీనగర్‌లోని మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడి భాష రాక.. డాక్టర్లు చెప్పేది అర్థం కాకవారు ఇబ్బందులుపడ్డారు. కొట్టాయం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఆస్పత్రి వర్గాలు సరైన చికిత్సను అందించలేకపోయాయి. మరోవైపు వెంకటేష్‌గౌడ్ కుటుంబీకులకు కేరళ వెళ్లే వీలు లేకపోవడం వారు మానసిక వేదనకు గురయ్యారు. అతడిని నగరానికి తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నించారు. కొచ్చిన్ నుంచి విమానంలో తీసుకొద్దామని టికెట్ బుక్ చేసినా ఫలితం లేదు. చివరికి అంబులెన్స్‌లో నగరానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు.