వాషింగ్టన్: మీ రక్తం ఏ గ్రూప్ ..? దానిని బట్టి మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎంతో చెప్పేయొచ్చు. ఎ గ్రూప్ రక్తం ఉన్న వారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో మనిషి రక్తంలో గ్రూప్‌కి, స్ట్రోక్‌కి మధ్య సంబంధం ఉందని తేలింది. ఈ అధ్యయనం వివరాలను మెడికల్ జర్నల్ ఆఫ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ప్రచురించింది. ఒక మనిషి రక్తం గ్రూప్‌కు సంబంధించిన జన్యు రకాలను, మెదడు సహా ఇతర శరీర భాగాలకు రక్త సరఫరా సరిగా జరగకపోవడం వల్ల యుక్త వయసులో వచ్చే స్ట్రోక్స్‌కు సంబంధించిన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
► ఒక వ్యక్తి రక్తం గ్రూప్ ఎ అయితే 60 ఏళ్ల కంటే ముందుగానే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గ్రూప్ కలిగిన వారి రక్తం గడ్డకట్టే ప్రమాదం అధికంగా ఉంటుంది. మిగతా గ్రూప్‌ల వారి కంటే స్ట్రోక్ వచ్చే అవకాశం 16% ఎక్కువ.
► ఓ–బ్లడ్ గ్రూప్ వారు నిశ్చింతగా ఉండొచ్చు. వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంది. మిగతా గ్రూప్‌ల కంటే రిస్క్ 12% తక్కువ.
► బి గ్రూప్ రక్తం ఉన్న వారికి ఏ వయసులోనైనా స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నాయి.
ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో బ్రెయిన్ స్ట్రోక్స్‌పై జరిగిన 48పైగా అధ్యయనాలను విశ్లేషించి తాజా నివేదికను రూపొందించారు. ఈ అధ్యయనాల్లో 18 నుంచి 59 వరకు వయసు కలిగిన వారు ఉన్నారు. గతంలో ఒ గ్రూప్ కాని వారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నా యని తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ బ్రాక్స్టన్ మిచెల్ చెప్పారు.
బ్రెయిన్ స్ట్రోక్‌కి రక్తం గ్రూప్‌తో లింక్
Published Thu, Jan 5 2023 5:24 AM | Last Updated on Thu, Jan 5 2023 5:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment