University of Maryland
-
అమెరికాలో మనిషికి పంది గుండె
వాషింగ్టన్: అమెరికాలోని మేరీలాండ్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి డాక్టర్లు పంది గుండె అమర్చారు. అతడి ప్రాణం కాపాడారు. ఇలాంటి అరుదైన చికిత్స జరగడం అమెరికాలో ఇది రెండోసారి కావడం విశేషం. బాధితుడు లారెన్స్ ఫాసెట్ నావికాదళంలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. అతడి వయసు ప్రస్తుతం 58 ఏళ్లు. గుండె వైఫల్యంతో బాధపడుతున్నాడు. మరణానికి దగ్గరయ్యాడు. ఇతర వ్యాధులు కూడా ఉండడంతో సంప్రదాయ గుండె మారి్పడికి అవకాశం లేకుండాపోయింది. దాంతో ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడిసిన్’ డాక్టర్లు కష్టతరమైన ప్రయోగానికి సిద్ధమమయ్యారు. లారెన్స్ ఫాసెట్‌కు ఇటీవలే పంది గుండెను అమర్చారు. ఈ చికిత్స విజయవంతమైంది. రెండు రోజుల విశ్రాంతి తర్వాత అతడి ఆరోగ్యం మెరుగైంది. ఇదే ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడిసిన్’ వైద్యులు గత ఏడాది పంది గుండెను డేవిట్ బెనెట్ అనే వ్యక్తికి అమర్చారు. కానీ, అతడు రెండు నెలలు మాత్రమే జీవించాడు. ఈ విషయం తెలిసి కూడా లారెన్స్ ఫాసెట్ శస్త్రచికిత్సకు సిద్ధపడ్డాడు. తాను నిండు నూరేళ్లు జీవిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అమెరికాలో మానవ అవయవాలకు కొరత ఏర్పడింది. దేశంలో గత ఏడాది కేవలం 4,100 గుండె మార్చిడి చికిత్సలు చేశారు. గుండెతోపాటు ఇతర అవయవాల కోసం పెద్ద సంఖ్యలో బాధితులు ఎదురు చూస్తున్నారు. -
బ్రెయిన్ స్ట్రోక్‌కి రక్తం గ్రూప్‌తో లింక్
వాషింగ్టన్: మీ రక్తం ఏ గ్రూప్ ..? దానిని బట్టి మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎంతో చెప్పేయొచ్చు. ఎ గ్రూప్ రక్తం ఉన్న వారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో మనిషి రక్తంలో గ్రూప్‌కి, స్ట్రోక్‌కి మధ్య సంబంధం ఉందని తేలింది. ఈ అధ్యయనం వివరాలను మెడికల్ జర్నల్ ఆఫ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ప్రచురించింది. ఒక మనిషి రక్తం గ్రూప్‌కు సంబంధించిన జన్యు రకాలను, మెదడు సహా ఇతర శరీర భాగాలకు రక్త సరఫరా సరిగా జరగకపోవడం వల్ల యుక్త వయసులో వచ్చే స్ట్రోక్స్‌కు సంబంధించిన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ► ఒక వ్యక్తి రక్తం గ్రూప్ ఎ అయితే 60 ఏళ్ల కంటే ముందుగానే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గ్రూప్ కలిగిన వారి రక్తం గడ్డకట్టే ప్రమాదం అధికంగా ఉంటుంది. మిగతా గ్రూప్‌ల వారి కంటే స్ట్రోక్ వచ్చే అవకాశం 16% ఎక్కువ. ► ఓ–బ్లడ్ గ్రూప్ వారు నిశ్చింతగా ఉండొచ్చు. వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంది. మిగతా గ్రూప్‌ల కంటే రిస్క్ 12% తక్కువ. ► బి గ్రూప్ రక్తం ఉన్న వారికి ఏ వయసులోనైనా స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నాయి. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో బ్రెయిన్ స్ట్రోక్స్‌పై జరిగిన 48పైగా అధ్యయనాలను విశ్లేషించి తాజా నివేదికను రూపొందించారు. ఈ అధ్యయనాల్లో 18 నుంచి 59 వరకు వయసు కలిగిన వారు ఉన్నారు. గతంలో ఒ గ్రూప్ కాని వారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నా యని తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ బ్రాక్స్టన్ మిచెల్ చెప్పారు. -
మహమ్మారికి వాయువేగం.. ఎయిర్‌బార్న్ డిసీజ్‌గా మారే ప్రమాదం
వేషము మార్చెను, భాషను మార్చెను, చివరకు తానే మారెను... అని మనిషి పోకడను ఒక సినీ కవి వర్ణించాడు. ప్రస్తుతం కరోనా ఇదే బాటలో పయనిస్తోంది. ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తూ మరణ మృదంగం మోత పెంచుతూ వస్తోంది. ఇలాంటి ప్రమాదకారి గాలి ద్వారా ఎక్కువ దూరం, ఎక్కువ వేగంతో వ్యాపించే శక్తిని పొందితే? ఆ ఊహే భయానకంగా ఉంది కదా! కానీ ఈ భయాలు నిజమయ్యే చాన్సుల ఎక్కువయ్యాయి. కోవిడ్ కొత్త వేరియంట్లు వాయు మార్గంలో ఎక్కువ దూరం, ఎక్కువ వేగంతో వ్యాపించే శక్తిని సంతరించుకుంటున్నాయి. ఈ శక్తి మరింత ఎక్కువైతే కరోనా ఎయిర్‌బార్న్ డిసీజ్(గాలిద్వారా వ్యాపించే వ్యాధి)గా మారే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ ఏరోసాల్స్(గాలి తుంపర), డ్రాప్లెట్స్(సూక్ష్మ బిందువులు) ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. సదరు రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్ దగ్గరలో ఉన్నవారికి, పక్కనే ఉండేవారికి సోకుతుంది. పక్కన ఎవరూ ఆ సమయంలో లేకుంటే క్రమంగా బయటి వాతావరణంలో కరోనా వైరస్ నిర్వీర్యం అవుతుంది. కానీ జలుబు లాంటి వైరస్లు గాలి ద్వారా కూడా వ్యాపిస్తాయి. వీటి ఏరోసాల్స్ ఎక్కువ దూరం పయనిస్తాయి, ఎక్కువకాలం గాల్లో ఉంటాయి. అందుకే ఒక సమూహంలో ఒకరికి జలుబు చేసినా ఇతరులందరికీ తొందరగా అంటుకునే అవకాశాలు ఎక్కువ. కరోనా వైరస్ ప్రస్తుతం ఈ శక్తిని సాధించే యత్నాల్లో ఉంది. కరోనా వేరియంట్లు గాల్లో ప్రయాణించడంలో మెలకువలు సాధిస్తున్నాయని, దీనివల్ల కరోనా గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు పెరుగుతాయని మేరీల్యాండ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మరింత టైట్ ఫిట్ మాస్కులు ధరించడం, నివాస గృహాల్లో విస్తృత వెంటిలేషన్ ఏర్పరుచుకోవడం చేయాలని సూచించింది. అప్పుడే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని తెలిపింది. ఇప్పటికే కరోనా సోకిన వారు వదిలే గాలిలో వైరస్ ఉంటుంది. అల్ఫా వేరియంట్ సోకిన వారు వదిలే గాలిలో 43–100 రెట్లు అధిక వైరస్‌లోడు ఉంటుందని అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఇప్పటివరకు ఇవి బయట గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించి ఇతరులకు సోకడం జరగలేదు. అయితే క్రమంగా వాయు ప్రయాణం చేసే శక్తిని వేరియంట్లు పెంచుకుంటున్నాయని, దీనివల్ల వైరల్ ఏరోసాల్స్ పెరిగిపోతున్నాయని సీఐడీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. టీకా ప్లస్ మాస్క్ అల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్‌కు అధిక సంక్రమణ శక్తి కలిగిఉన్నట్లు అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ డాన్ మిల్టన్ చెప్పారు. ఈ వేరియంట్లు క్రమంగా గాల్లో ప్రయాణించడాన్ని అలవరుచుకుంటున్నాయన్నారు. ఇవి పూర్తిగా వాయుమార్గంలో సోకే వేరియంట్లుగా మారకుండా నిరోధించేందుకు టీకా తీసుకోవడం, టైట్ మాస్కులు ధరించడం, శుభ్రమైన వాతావరణంలో నివసించడం చేయాలన్నారు. అల్ఫా కన్నా డెల్టాలో ఈ శక్తి ఎక్కువగా కనిపిస్తోందని, దీన్నిబట్టి వైరస్‌లో వాయుప్రయాణ అనుకూల మార్పులు పెరుగుతున్నాయని డాక్టర్ లాయ్ చెప్పారు. ఇప్పటికీ మాస్కులు కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిçస్తూనే ఉన్నాయన్నారు. మాస్కుల వల్ల వైరస్సోకే అవకాశాలు దాదాపు 50 శాతం తగ్గుతాయని వివరించారు. కానీ లూజుగా ఉండే దుస్తులు, సర్జికల్ మాస్కుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని తెలిపారు. -
జికాను ప్రాణాంతకంగా మారుస్తున్నవి ఇవే!
వాషింగ్టన్: జికా వైరస్‌ను ప్రాణాంతకంగా మార్చగలవని భావిస్తున్న ఏడు కీలక ప్రొటీన్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలు, నరాలకు సంబంధించిన రోగాలు సహా అనేక ఆరోగ్య సమస్యలను జికా కలిగించగలదని శాస్త్రవేత్తలు గతంలో కనుగొన్నారు. అయితే జికాలోని ఏ ప్రొటీన్లు దానిని అంత ప్రమాదకరంగా మారుస్తున్నాయో తేల్చలేకపోయారు. తాజాగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు జికాను ప్రమాదకారిగా మార్చడానికి ఏడు ప్రొటీన్లు దోహదపడుతూ ఉండొచ్చని తేల్చారు. పరిశోధనలో భాగంగా జికా వైరస్‌కు చెందిన 14 ప్రొటీన్లను శాస్త్రవేత్తలు విడి విడిగా తీసి ఉంచారు. అనంతరం ఈస్ట్ కణాలకు వాటిని చేర్చి చర్య జరిపించారు. ఏడు ప్రొటీన్లు కణాలపై దుష్ప్రభావం చూపుతున్నాయని ఈ పరీక్షలో తేలింది. -
కులాంతర వివాహాల్లో మిజోరం ఫస్ట్
న్యూఢిల్లీ: భారతదేశంలో కులాంతర వివాహాలను అనుమతిస్తూ 50 ఏళ్ల క్రితమే చట్టం తీసుకొచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కులాంతర వివాహాలు జరగడం లేదు. దేశవ్యాప్తంగా 95 శాతం మంది ఇప్పుటికీ అదే కులం వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఆశ్చర్యంగా 87శాతం మంది క్రైస్తవులుగల మిజోరంలో 55 శాతం మంది కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత మేఘాలయలో 46 శాతం, సిక్కింలో 37 శాతం మంది కులాంతర వివాహాలను చేసుకుంటున్నారు. ఆ తర్వాత కాశ్మీర్లో 35 శాతం మంది, గుజరాత్లో 13 శాతం మంది కులాంతర వివాహాలను చేసుకుంటున్నారు. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన వారు కులాంతర వివాహాలు ఎక్కువగా చేసుకుంటారంటూ ఇంతకాలం మనం భావిస్తున్న దృక్పథం తప్పని ఈ గణాంకాలతో స్పష్టమవుతోంది. వివిధ సర్వేలు వెల్లడించిన ఈ గణాంకాలను మేరీలాండ్ యూనివర్శిటీ క్రోడీకరించి ఈ అంశాలను తెలియజేసింది. ఒకే కులం మధ్య జరుగుతున్న పెళ్లిళ్లలో దేశంలోనే మధ్య ప్రదేశ్ ముందుంది. ఆ రాష్ట్రంలో 99 శాతం మంది అదే కులం వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో, చత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాల్లో 98 శాతం మంది, పంజాబ్‌లో 97 శాతం మంది అదే కులస్థులను పెళ్లి చేసుకుంటున్నారు. కులాంతర వివాహాలను అనుమతిస్తూ దేశంలో చట్టం తీసుకొచ్చినప్పుడు ఒకే కులం మధ్య పెళ్లిళ్లు 98 శాతం ఉండగా, ఇప్పుడది 95 శాతానికి పడిపోయింది. కులాంతర వివాహాలు వేగం పుంజుకోనప్పటికీ కొత్త పురోగతి మాత్రం ఉందని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. -
అందగాళ్లకు అన్నీ కష్టాలే..!
టింగురంగళ్లలా తయారయ్యే అందగాళ్లను చూస్తే చాలామందికి కాస్తంత అసూయగానే ఉంటుంది. అందగాళ్లను అంతా అబ్బురంగా చూస్తారు. అమ్మాయిలూ ఎక్కువగా వారి వెంటే పడతారు. ఇలాంటి సహజ పరిణామాలన్నీ అందగాళ్లకు కాస్తంత ఆనందాన్నే ఇస్తాయి. మరి, వాళ్లకు కష్టాలేమిటి అనుకుంటున్నారా? అందగాళ్లకు బయట ఫాలోయింగ్ ఎలా ఉన్నా, కెరీర్లో మాత్రం ఇబ్బందులు తప్పవని లండన్ వర్సిటీ కాలేజీకి చెందిన స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, అమెరికాలోని మేరీలాండ్ వర్సిటీలకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. అందగాళ్ల పట్ల వాళ్ల బాస్‌లకు కాస్తంత బెదురు ఉంటుందని, వీలైనంతగా వాళ్లను అణగదొక్కడానికే ప్రయత్నిస్తారని అంటున్నారు. అయితే, అందగత్తెలైన మహిళలకు కెరీర్లో ఇలాంటి సమస్యలేవీ ఎదురుకావని కూడా వారు చెబుతున్నారు. బాస్‌ల అసూయ కారణంగానే అందగాళ్లు కెరీర్లో నష్టపోతారని, ఏడాదిపాటు జరిపిన తమ అధ్యయనంలో ఈ విషయం తేలిందని వెల్లడిస్తున్నారు. -
ఎన్నికలపై ఇండియన్ ముజాహిదీన్ దాడి చేస్తుందా?
ఎన్నికలు పూర్తయేలోపల ఇండియన్ ముజాహిదీన్ దేశంలో భారీ దాడి చేస్తుందా? మే నెలలోపునే ఈ దాడి జరిగే అవకాశం ఉందా? అవుననే అంటున్నారు ప్రొఫెసర్ వి.ఎస్ సుబ్రమణియన్. 'ఎవరే... ఎవరే... ఎవరే సుబ్రమణ్యన్?' అనుకుంటున్నారా. ఆయన అమెరికాలోని మేరీలాండ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్. లష్కరె తోయబా, ఇండియన్ ముజాహిదీన్ల కార్యకలాపాలను కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సాయంతో అధ్యయనం చేసిన సుబ్రమణియన్ మే నెలలోపు ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని అంటున్నారు. తాము తయారుచేసిన కంప్యూటర్ మోడల్స్ ఈ దాడి జరిగే అవకాశం ఉందని చెబుతున్నాయని ఆయన ఢంకా బజాయిస్తున్నారు. ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్టులు భారీ సంఖ్యలో అరెస్టయిన కొన్ని రోజులకే ఉగ్రవాద దాడులు జరిగాయని, అదే విధంగా భారత, పాక్ దౌత్య సంబంధాలు కొద్దిగా మెరుగుపడగానే ఈ దాడులు జరుగుతాయని ఆయన లెక్క వేసి మరీ చెబుతున్నారు. కాబట్టి మే నెలలోపు దాడులు జరగడం ఖాయమని ఆయన అంటున్నారు.సరిగ్గా ఎన్నికల వేడి పుంజుకోగానే ఈ దాడులు జరుగుతాయంటున్నారు ఆయన. ఆదివారం నాడు నరేంద్ర మోడీని టార్గెట్ చేయాలని ప్లాన్ వేస్తున్న నలుగురు ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్టులు అరెస్టు కావడం గమనార్హం. -
శృంగారంతో తెలివితేటలూ పెరుగుతాయి!!
శృంగారంతో ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా.. మానసిక ఒత్తిడి తగ్గడం, ఒంట్లో కొవ్వు కరగడమే కాదు.. తెలివితేటలు కూడా పెరుగుతాయట! మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలలో తేలింది. హిప్పో క్యాంపస్ దీర్ఘకాల జ్ఞాపకశక్తికి ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఎలుకలపై దీనికి సంబంధించిన ప్రయోగాలు చేశారు. వీటికి కొత్తగా న్యూరాన్లు ఏర్పడుతున్నా, లైంగిక కార్యకలాపాలు లేకపోతే మాత్రం జ్ఞాపకశక్తి ఏమాత్రం పెరగలేదని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్కు చెందిన మానసిక వైద్యనిపుణులు వెల్లడించారు. శృంగారంలో పాల్గొనడం వల్ల మెదడు కణాల్లోకి ఆక్సిజన్ బాగా చేరుతుందని వాళ్లు గుర్తించారు. అలాగే, దక్షిణ కొరియాలోని కొంకుక్ యూనివర్సిటీచేసిన పరిశోధనలలో కూడా మరో ప్రబల సాక్ష్యం లభించింది. శృంగారం వల్ల తెలివితేటలు పెరుగుతాయని, దీనివల్ల హిప్పోక్యాంపల్ ప్రాంతంలో న్యూరాన్లు కొత్తవి వస్తాయని వీళ్లు కూడా చెప్పారు. విపరీతమైన ఒత్తిడి కారణంగా మతిమరుపు వస్తే, తగ్గించడానికి ఈ న్యూరాన్లు ఉపయోగపడతాయి. లేటు వయసులో కూడా శృంగారాన్ని ఆస్వాదించేవారికి మతిమరుపు దగ్గరకు రాకపోవడం, డిమెన్షియా కూడా దరి చేరకపోవడం ఇందువల్లేనని వాళ్లు తేల్చి చెప్పారు.