శృంగారంతో తెలివితేటలూ పెరుగుతాయి!! | Bring it on! Sex does boost intelligence | Sakshi
Sakshi News home page

శృంగారంతో తెలివితేటలూ పెరుగుతాయి!!

Published Mon, Feb 24 2014 1:12 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

శృంగారంతో తెలివితేటలూ పెరుగుతాయి!! - Sakshi

శృంగారంతో తెలివితేటలూ పెరుగుతాయి!!

శృంగారంతో ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా.. మానసిక ఒత్తిడి తగ్గడం, ఒంట్లో కొవ్వు కరగడమే కాదు.. తెలివితేటలు కూడా పెరుగుతాయట! మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలలో తేలింది. హిప్పో క్యాంపస్ దీర్ఘకాల జ్ఞాపకశక్తికి ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఎలుకలపై దీనికి సంబంధించిన ప్రయోగాలు చేశారు. వీటికి కొత్తగా న్యూరాన్లు ఏర్పడుతున్నా, లైంగిక కార్యకలాపాలు లేకపోతే మాత్రం జ్ఞాపకశక్తి ఏమాత్రం పెరగలేదని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్కు చెందిన మానసిక వైద్యనిపుణులు వెల్లడించారు. శృంగారంలో పాల్గొనడం వల్ల మెదడు కణాల్లోకి ఆక్సిజన్ బాగా చేరుతుందని వాళ్లు గుర్తించారు.

అలాగే, దక్షిణ కొరియాలోని కొంకుక్ యూనివర్సిటీచేసిన పరిశోధనలలో కూడా మరో ప్రబల సాక్ష్యం లభించింది. శృంగారం వల్ల తెలివితేటలు పెరుగుతాయని, దీనివల్ల హిప్పోక్యాంపల్ ప్రాంతంలో న్యూరాన్లు కొత్తవి వస్తాయని వీళ్లు కూడా చెప్పారు. విపరీతమైన ఒత్తిడి కారణంగా మతిమరుపు వస్తే, తగ్గించడానికి ఈ న్యూరాన్లు ఉపయోగపడతాయి. లేటు వయసులో కూడా శృంగారాన్ని ఆస్వాదించేవారికి మతిమరుపు దగ్గరకు రాకపోవడం, డిమెన్షియా కూడా దరి చేరకపోవడం ఇందువల్లేనని వాళ్లు తేల్చి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement