అందగాళ్లకు అన్నీ కష్టాలే..! | Why being handsome is bad for a man's career | Sakshi
Sakshi News home page

అందగాళ్లకు అన్నీ కష్టాలే..!

Published Thu, Dec 10 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

అందగాళ్లకు అన్నీ కష్టాలే..!

అందగాళ్లకు అన్నీ కష్టాలే..!

టింగురంగళ్లలా తయారయ్యే అందగాళ్లను చూస్తే చాలామందికి కాస్తంత అసూయగానే ఉంటుంది. అందగాళ్లను అంతా అబ్బురంగా చూస్తారు. అమ్మాయిలూ ఎక్కువగా వారి వెంటే పడతారు. ఇలాంటి సహజ పరిణామాలన్నీ అందగాళ్లకు కాస్తంత ఆనందాన్నే ఇస్తాయి. మరి, వాళ్లకు కష్టాలేమిటి అనుకుంటున్నారా? అందగాళ్లకు బయట ఫాలోయింగ్ ఎలా ఉన్నా, కెరీర్‌లో మాత్రం ఇబ్బందులు తప్పవని లండన్ వర్సిటీ కాలేజీకి చెందిన స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అమెరికాలోని మేరీలాండ్ వర్సిటీలకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

అందగాళ్ల పట్ల వాళ్ల బాస్‌లకు కాస్తంత బెదురు ఉంటుందని, వీలైనంతగా వాళ్లను అణగదొక్కడానికే ప్రయత్నిస్తారని అంటున్నారు. అయితే, అందగత్తెలైన మహిళలకు కెరీర్‌లో ఇలాంటి సమస్యలేవీ ఎదురుకావని కూడా వారు చెబుతున్నారు. బాస్‌ల అసూయ కారణంగానే అందగాళ్లు కెరీర్‌లో నష్టపోతారని, ఏడాదిపాటు జరిపిన తమ అధ్యయనంలో ఈ విషయం తేలిందని వెల్లడిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement