వాషింగ్టన్: జికా వైరస్‌ను ప్రాణాంతకంగా మార్చగలవని భావిస్తున్న ఏడు కీలక ప్రొటీన్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలు, నరాలకు సంబంధించిన రోగాలు సహా అనేక ఆరోగ్య సమస్యలను జికా కలిగించగలదని శాస్త్రవేత్తలు గతంలో కనుగొన్నారు. అయితే జికాలోని ఏ ప్రొటీన్లు దానిని అంత ప్రమాదకరంగా మారుస్తున్నాయో తేల్చలేకపోయారు.
తాజాగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు జికాను ప్రమాదకారిగా మార్చడానికి ఏడు ప్రొటీన్లు దోహదపడుతూ ఉండొచ్చని తేల్చారు. పరిశోధనలో భాగంగా జికా వైరస్‌కు చెందిన 14 ప్రొటీన్లను శాస్త్రవేత్తలు విడి విడిగా తీసి ఉంచారు. అనంతరం ఈస్ట్ కణాలకు వాటిని చేర్చి చర్య జరిపించారు. ఏడు ప్రొటీన్లు కణాలపై దుష్ప్రభావం చూపుతున్నాయని ఈ పరీక్షలో తేలింది.
జికాను ప్రాణాంతకంగా మారుస్తున్నవి ఇవే!
Published Wed, Jan 4 2017 8:10 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM
Advertisement