Zika virus
-
బాలుడికి జికా వైరస్‌పై ‘నారాయణ’ నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి : దేశంలో అరుదుగా నమోదవుతున్న జికా వైరస్ లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్య, ఆరోగ్య శాఖకు కనీస సమాచారం ఇవ్వకుండా మంత్రి నారాయణకు చెందిన నెల్లూరులోని నారాయణ ఆస్పత్రి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆరేళ్ల బాలుడిలో లక్షణాలు గుర్తించినప్పటికీ ముంబైలోని ప్రైవేట్ ల్యాబ్‌కు నమూనాలు పంపింది. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో జికా వైరస్ అని తేలింది. వాస్తవానికి.. గతనెల 30న జ్వరంతో బాధపడుతున్న బాలుడికి నారా యణ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈనెల 7న జ్వరంలో ఫిట్స్ రావడంతో తిరిగి మరో మారు తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స అందిస్తున్నా ఆరోగ్య సమస్యలు తగ్గకపోవడం, డెంగీ, మలేరియా పరీక్షలు కూడా నెగిటివ్ రావడంతో జికా ఏమోనని వైద్యులు అనుమానించి ఈనెల 13న నేరుగా ముంబైకు నమూనాలు పంపారు. 16న వెలువడిన ఫలితాల్లో జికా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు తేలింది. ఇలా అరుదైన వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యశాఖలోని ఎపిడమాలజీ విభాగానికి సమాచారం ఇస్తే ప్రత్యేక బృందాలు బాలుడి నమూనాలను నేరుగా పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ వైరాలజీ (ఎన్ఐవీ) ల్యాబ్‌కు పంపేవారు. దీంతోపాటు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వ్యాధి వ్యాప్తి నియంత్రణకు వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, నారాయణ ఆస్పత్రి బాధ్యతారాహిత్యం కారణంగా ఇప్పుడు ఈ వ్యవహారంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. ప్రైవేట్ ల్యాబ్ ఫలితాల ఆధారంగా జికా వైరస్ అని నిర్ధారణకు రాలేని వైద్యశాఖ.. బాలుడితో పాటు, తల్లిదండ్రులు, గ్రామంలోని మరికొందరి నమూనాలను పూణేలోని ఎన్ఐవీ ల్యాబ్‌కు గురువారం పంపింది. గర్భస్థ శిశువులపై తీవ్ర ప్రభావం..డెంగీ, చికున్‌గున్యా మాదిరిగానే జికా వైరస్ పగటిపూట కుట్టే ఎడిస్ జాతి దోమ కాటు ద్వా రా వ్యాపిస్తుంది. ఇది సోకిన గర్భిణుల ద్వారా పుట్టే శిశువుల్లో మైక్రోసెఫలీ సమస్య ఎదురవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు స్ప ష్టం చేశాయి. దీంతో.. శిశువు మెదడుపై ప్రభా వం పడి నరాలు, కండరాల సమస్యలు, పక్షవాతం, బలహీనత లక్షణాలు ఎదురవుతాయి. సాధారణ వ్యక్తుల్లో సైతం కండరాలు బిగుసుకుపోవడం, దృశ్య లోపాలు, పక్షవాతం సంభవించే అవకాశం ఉంటుంది. రక్తం, వీర్యం, జననాంగ స్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకుతుంది. ఈ ఏడాది జూలైలో దేశంలో జికా వైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలను ఇచ్చింది. జికా వైరస్ సోకిన ప్రాంతాల్లోని గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని ఆదేశించింది. -
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం
నెల్లూరు(అర్బన్): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపింది. మర్రిపాడు మండలం వెంకటాపురానికి చెందిన బత్తుల నాగరాజు, కళ్యాణి దంపతుల ఐదేళ్ల కుమారుడు సుబ్బరాయుడు జ్వరం, తలనొప్పితో సుమారు 20 రోజులుగా బాధపడుతున్నాడు. మొదట్లో స్థానికంగా వైద్యం చేయించినా తగ్గలేదు.దీంతో 10 రోజుల కిందట నెల్లూరులోని నారాయణ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి మందులు రాసి ఇంటికి పంపారు. అయినా తగ్గకపోవడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో వైద్యులు థర్డ్ పార్టీ ల్యాబ్ సహకారంతో ముంబైలోని ప్రైవేటు ల్యాబ్‌కు రక్త నమూనాలు పంపారు. అక్కడ జికా వైరస్ అని తేలింది. దీంతో బాలుడిని మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్మోర్‌లోని బేబీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోన్న జికా వైరస్
-
జికా వైరస్ కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
మహారాష్ట్రలో జికా వైరస్ కేసులో ఆందోళన రేపుతున్నాయి. పుణెలో ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకిన వారిలో ఇద్దరు గర్బిణీలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్రలో జికా వైరస్ కేసుల పెరుగుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది. నిరంతరం వైరస్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. జికా వైరస్ పాజిటివ్‌గా పరీక్షించిన తల్లుల పిండాల పెరుగుదలను పర్యవేక్షించడం ద్వారా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది.బాధిత గర్భిణీ స్త్రీ పిండంలో జికా మైక్రోసెఫాలీ నాడీ సంబంధిత పరిణామాలతో సంబంధం కలిగి ఉన్నందున, పర్యవేక్షణ కోసం వైద్యులను అప్రమత్తం చేయాలని సూచించింది. ఇంటి ఆవరణలో ఏడిస్ దోమలు లేకుండా చూసేందుకు నోడల్ అధికారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించింది. నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, సంస్థలు, ఆరోగ్య సౌకర్యాల్లో కీటకాలు లేకుండా నిఘా పెంచాలని, నియంత్రణ కార్యకలాపాలను తీవ్రతరం చేయాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది.ప్రజల్లో భయాందోళనలను తగ్గించడానికి సోషల్ మీడియా, ఇతర ఫ్లాట్ఫారమ్లలో ముందు జాగ్రత్తగా సందేశాలు పంపి అవగాహన కల్పించాలని రాష్ట్రాలు కోరింది. కాగా జులై 1న పూణెలో ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి జికా వైరస్ పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. అరంద్వానే ప్రాంతంలో నాలుగు, ముండ్వా ప్రాంతంలో రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్ దేశాలతోసహా భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాలకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. -
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం
మహారాష్ట్రలోని పూణెలో ఆరు జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులున్నారు. జికా వైరస్ కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో రాష్ట్ర ఆరోగ్యవిభాగం అప్రమత్తమయ్యింది. పూణె మున్సిపల్ అధికారులు వైరస్ నివారణకు చర్యలు ప్రారంభించారు. జికా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమికొట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు.రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం అరంద్వానేలోని 46 ఏళ్ల డాక్టర్ జికా వైరస్ బారిపడ్డారు. ఇది రాష్ట్రంలో జికా వైరస్ తొలికేసుగా గుర్తించారు. అనంతరం ఆ వైద్యుని కుమార్తె(15)కు వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వీరిద్దిరితోపాటు ముండ్వాకు చెందిన ఇద్దరి రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయి. ఈ నాలుగు కేసులు నమోదైన దరిమిలా అరంద్వానేకు చెందిన ఇద్దరు గర్భిణులకు జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే జికా వైరస్ సోకిన వీరందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. కాగా వైరస్ సోకిన ఎడెస్ దోమ కాటు కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినప్పుడు బాధితునిలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌ను తొలిసారిగా 1947లో ఉగాండాలో కనుగొన్నారు. -
బెంగళూరులో జికా వైరస్ కలకలం
బెంగళూరు: బెంగళూరు సమీపంలో జికా వైరస్ కలకలం రేపింది. ఓ వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిక్కబళ్లాపూర్ పరిధిలోని ఓ దోమలో జికా వైరస్ బయటపడినట్లు ఇప్పటికే వైద్యులు తెలిపారు. దీంతో తెల్కబెట్టా పరిధిలోని ఐదు కిలోమీటర్ల మేర వైద్య ఆరోగ్యశాఖ అలర్డ్ జారీ చేసింది. అనుమానాస్పద జ్వరం కేసులను పరీక్షలకు పంపాలని ఆదేశించారు. 'రాష్ట్రమంతా కలిపి దాదాపు 100 శాంపిళ్లను పరీక్షలకు పంపాం. చిక్కబళ్లాపూర్ నుంచి వచ్చిన ఆరు కేసుల్లో ఒకటి మాత్రమే పాజిటివ్‌గా నమోదైంది.' అని జిల్లా ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ ఎస్ మహేశ్ తెలిపారు. అత్యధిక జ్వరం లక్షణాలు ఉన్న ముగ్గుర్ని పర్యవేక్షణలో ఉంచామని చెప్పారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఏడెస్ దోమ కాటు ద్వారా జికా వైరస్ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ఇన్ఫెక్షన్లకు కూడా కారణమౌతుంది . 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. గత డిసెంబర్లో కర్ణాటకాలోని రాయ్‌చూర్ జిల్లాలో ఐదేళ్ల బాలునికి జికా వైరస్ సోకింది. మహారాష్ట్రాలోనూ మరో వ్యక్తి దీని బారిన పడ్డారు. ఇదీ చదవండి: అమానవీయం: రక్తపు మడుగులో ఫిల్మ్‌మేకర్.. ఫోన్, కెమెరా దొంగతనం -
కర్ణాటకలో జికా వైరస్ కలకలం.. ఐదేళ్ల చిన్నారికి పాజిటివ్
కర్ణాటకలో జికా వైరస్ కలకలం రేగింది. రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. రాయచూర్ జిల్లాలోని అయిదేళ్ల బాలికకు జికా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. కొన్ని రోజులుగా చిన్నారి అనారోగ్యానికి గురైందని, డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో టెస్ట్‌లు చేయించినట్లు తెలిపారు. టెస్టుల్లో పాజిటివ్‌గా రావడంతో చిన్నారికి అన్ని జాగ్రత్త చర్యలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి సుధాకర్ మాట్లాడుతూ.. పూణె నుంచి వచ్చిన ల్యాబ్ నివేదిక ద్వారా జికా వైరస్ నిర్ణారణ జరిగిందన్నారు. డిసెంబర్ 5న ముగ్గురి నామూనాలను ల్యాబ్‌కు పంపించగా ఇద్దరికి నెగిటీవ్ వచ్చిందని అయిదేళ్ల చిన్నారికి పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. రాష్ట్రంలో ఇదే మొదటి కేసని వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో పరిస్థితిని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ఏదైనా ఆసుపత్రుల్లో అనుమానాస్పద ఇన్ఫెక్షన్ కేసులు కనిపిస్తే జికా వైరస్ పరీక్షల కోసం నమూనాలను పంపాలని రాయచూర్ దాని పొరుగు జిల్లాల్లోని ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని, అన్ని ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా కొన్ని నెలల కిత్రం జికా వైరస్ కేరళలో తొలిసారి వెలుగు చూసిన విషయం తెలిసిందే. తరువాత మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌లోనూ ఈ కేసులు నమోదయ్యాయి. చదవండి: అందుకే ‘హెల్మెట్’ పెట్టుకోమని చెప్పేది.. ఓసారి ఈ వీడియో చూడండి జికా వైరస్ ఏలా వ్యాప్తిస్తుంది జికా వైరస్ వ్యాధి ఎడెస్ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ఇన్ఫెక్షన్లను కూడా ఇదే దోమే వ్యాపి చేస్తుంటుంది. ఈ వైరస్‌ను మొదటిసారిగా 1947లో ఉగాండాలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఎడెస్ దోమలు సాధారణంగా పగటిపూట కుడతాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాయి. అయితే ఈ వైరస్ పెద్దగా ప్రాణాంతకం కాదు. చికిత్సతో రికవరీ అవుతారు. కానీ గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారి కడుపులోని పిండానికి ఇది చాలా ప్రమాదకరం. మైక్రోసెఫాలీ (మెదడుపై ప్రభావం) లేదా పుట్టుకతో వచ్చే జికా సిండ్రోమ్ అని పిలువబడే ఇతర పరిస్థితులకు కారణమవుతుంది. -
Warning: తెలంగాణలో జికా వైరస్ కలకలం
దేశంలో కరోనా వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. ప్రజలను జికా వైరస్ టెన్షన్‌కు గురి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జికా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది. ఐసీఎంఆర్, నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన అధ్యయనంలో.. జికా వైరస్ తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలకు వ్యాపించిందని పేర్కొంది. ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ఇటీవలే ప్రచురించబడింది. వీరి అధ్యయనంలో భాగంగా 1,475 నమూనాలను పరీక్షించగా.. 64 నమునాలు జికా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు చెప్పింది. ఇక, ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో జికా వైరస్ ఉనికిని కనుగొన్నట్టుగా అధ్యయనం పేర్కొంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సేకరించిన ఒక నమూనాలో జీకా వైరస్ నిర్ధారణ అయినట్లు తెలిపింది. హైదరాబాద్‌లో కూడా ఈ కేసులు నమోదైనట్టు సమాచారం. మరోవైపు.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్, ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ బీఆర్ శమ్మన్నా స్పందించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు జీకా వైరస్‌ను గుర్తించడంపై దృష్టిపెట్టడం మొదలుపెట్టారని అధ్యయనంలో తేలిందని అన్నారు. జికా వైరస్‌పై అవగాహన పెరుగుతోందని చెప్పారు. ఇంతకు ముందు జికా వైరస్ గురించి అంతగా పట్టించుకోలేదన్నారు. ఇక, జీకా వైరస్ దోమలద్వారా వ్యాపించే వ్యాధి. ఈ వైరస్ కారణంగా జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. కాగా, డెంగ్యూలాగే ఈ వైరస్ కూడా చాలా ప్రమాదకరని వైద్యులు హెచ్చిరిస్తున్నారు. #ZikaVirus has spread to various Indian cities including #Hyderabad. It was disclosed by a study conducted by #ICMR and NIV, #Pune. #News #NewsAlert #NewsUpdate #India #Update #Healthcare pic.twitter.com/rDp9D2i6K1 — First India (@thefirstindia) July 6, 2022 ఇది కూడా చదవండి: అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు -
జికా వైరస్ కలకలం..100 దాటిన కేసులు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో జికా వైరస్ కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు పెరుగుతూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్తగా మరో 16 జికా వైరస్ కేసులు నమోదు కావడంతో యూపీలో ఈ కేసుల సంఖ్య 100 దాటింది. ఇక ప్రత్యేకంగా కాన్పూర్‌లో అత్యధిక జికా వైరస్ కేసులు నమోదు అవుతూ ఆ ప్రాంతాన్ని వణికిస్తోన్నాయి. కాన్పూర్‌లో అక్టోబరు 23న తొలి జికా వైరస్ కేసు వెలుగుచూసింది. జికా వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. చదవండి: అరుణాచల్ ప్రదేశ్‌లో గ్రామం.. ‘అది చైనాలోనే ఉంది’ -
యూపీలోని కాన్పూర్‌లో విజృంభిస్తోన్న జికా వైరస్
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలోని కొన్ని చోట్ల జికా వైరస్ విజృంభిస్తుండగా, గత వారం రోజులుగా కాన్పూర్‌లో పెరుగుతున్న జికా వైరస్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. దోమల ద్వారా సంక్రమించే ఈ కేసుల సంఖ్య సోమవారంనాటికి 89కి చేరింది. బాధితుల్లో ఒక గర్భిణీ, 17 మంది పిల్లలు ఉండటం మరింతగా ఆందోళన కలిగిస్తోంది. మొదటి జికా కేసు అక్టోబర్ 23న గుర్తించగా, గత వారంలో కేసుల సంఖ్య పెరిగింది. సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడెస్ ఈజిప్టి దోమల ద్వారా జికా వ్యాపిస్తుంది. నిలకడగా ఉన్న నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. డెంగ్యూ, చికున్ గున్యా వ్యాప్తికి కారకాలు కూడా. జికా వైరస్ సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్లు చర్మం ఎర్ర బారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కొందరిలో మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాగా జికా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోందని, అనేక వైద్య బృందాలు వ్యాధిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కాన్పూర్ జిల్లా మెడికల్ చీఫ్ ఆఫీసర్ డాక్టర్ నేపాల్ సింగ్ తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్‌తోపాటు, వైరస్‌ను వ్యాప్తి చేసే దోమ సంతానోత్పత్తి జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. -
Zika Virus: కాన్పుర్‌లో 25 జికా వైరస్ కేసులు నమోదు
-
Zika Virus: కాన్పుర్‌లో 25 జికా వైరస్ కేసులు నమోదు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బుధవారం 25 కొత్త జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నమోదైన 11 కేసులతో కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం 36 జికా వైరస్ కేసులు నమోదైనట్లు కాన్పుర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నెపాల్ సింగ్ తెలిపారు. 36 జికా కేసుల్లో ఇద్దరు గర్భిణీ స్త్రీలు ఉన్నట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖ 400 నుంచి 500 ఇళ్లలో ఉన్నవారి నుంచి సాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ప్రతి ఇంటిలోను సాంపిల్స్ సేకరించే కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. జికా వైరస్ కేసులు పెరుగుతన్నాయని ఎవరూ ఆందోళన చెందవద్దని, నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాన్పుర్‌లోని తివారీపూర్, అష్రఫాబాద్, పోఖర్‌పూర్, శ్యామ్ నగర్, ఆదర్శ్ నగర్ ప్రాంతాల్లో కొత్త జికా వైరస్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. -
మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు నమోదు
ముంబై: మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోప్ బుధవారం తెలిపారు. పుణెకు సమీపంలోని బెస్లార్ గ్రామానికి చెందిన ఓ 50 ఏళ్ల మహిళకు జికా వైరస్ సోకినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఆరుగురు వ్యక్తులకు చికెన్ గున్యా, ఒకరికి డెంగ్యూ వచ్చినట్లు చెప్పారు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఫాగింగ్, నీరు నిలువ ఉన్న ప్రాంతాలను శుభ్రపరచాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. మరోవైపు కరోనా వైరస్ కేసుల సంఖ్య కూడా కొల్హాపూర్, సాహ్ని, సతారా, పుణె జిల్లాల్లో తగ్గడంలేదని తెలిపారు. కరోనా కేసుల నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాజేశ్ తోప్ పేర్కొన్నారు. -
కేరళ: జికా కలకలం.. కొత్తగా మరో 5 కేసులు
తిరువనంతపురం : కేరళలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కొత్తగా మరో ఐదు జికా కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 28కి చేరింది. తాజాగా జికా బారిన పడిన వారిలో అనయారాకు చెందిన ఇద్దరు.. కున్నుకుళి, పొట్టాం, ఈస్ట్పోర్టుకు ఒక్కోరి చొప్పున ఉన్నారు. అధికారులు అనయారా ప్రాంతానికి 3 కిలోమీటర్ల పరిధిలో జికా వైరస్ క్లస్టర్‌ను గుర్తించారు. వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ మాట్లాడుతూ.. ‘‘ తిరువనంతపురంలోని ఇతర ప్రాంతాల్లో దోమల నివారణకోసం ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నాము. ప్రజలు ఇళ్లలో కానీ, చుట్టప్రక్కల కానీ, నీటిని నిల్వ ఉండనీయకండి. తద్వారా కేవలం జికా మాత్రమే కాదు దోమల ద్వారా వ్యాప్తి చెందే ఇతర ప్రమాదకర వ్యాధుల నివారణ కూడా సాధ్యపడుతుంది’’ అని అన్నారు. కాగా, జికా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో హై అలెర్ట్ ప్రకటించింది. జికా వైరస్ బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అదేవిధంగా కేరళ పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా జికా వైరస్ వ్యాప్తి విషయంలో అప్రమత్తమైంది. -
కేరళలో రెండు రోజులు సంపూర్ణ లాక్ డౌన్
-
జికా వైరస్: హై అలర్ట్ ప్రకటించిన కేరళ ప్రభుత్వం
సాక్షి, తిరువనంతపురం: కరోనా మహమ్మారితో వణికిపోతున్న తరుణంలో కేరళలో జికా వైరస్ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం జికా వైరస్‌పై హై అలెర్ట్ ప్రకటించింది. జికా వైరస్ బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అదేవిధంగా కేరళ పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా జికా వైరస్ వ్యాప్తి విషయంలో అప్రమత్తమైంది. చామరాజనగర్, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కేరళలో మొదట ఓ 24 ఏళ్ల గర్భిణిలో జికా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఆమెతోపాటు మరికొందరి శాంపిళ్లను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. ఆమె సహా 14 మందికి జికా ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా తేలింది. జికా ఇన్ఫెక్షన్ మరీ ప్రమాదకరమేమీ కాదని.. కానీ కొన్నేళ్లుగా మ్యుటేట్ అయి కొత్త వేరియంట్లు వస్తుండటంతో జాగ్రత్త తప్పనిసరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం శుక్రవారం ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు నిపుణుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించిన విషయం తెలిసిందే. ఈ బృందం కేరళలో పరిస్థితులను సమీక్షించడంతోపాటు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందజేస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. మరోవైపు కేరళ ప్రభుత్వం జికా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. కేసులను గుర్తించిన తిరువనంతపురం జిల్లాల్లో విస్తృతంగా వైద్య పరీక్షలు చేపట్టింది. -
జికా ఎలా వ్యాపిస్తుంది.. లక్షణాలు, జాగ్రత్తలు తెలుసుకోండి
కరోనా మహమ్మారితో వణికిపోతున్న తరుణంలో కేరళలో జికా వైరస్ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. మొదట ఒక 24 ఏళ్ల గర్భిణిలో జికా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఆమెతోపాటు మరికొందరి శాంపిళ్లను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. ఆమె సహా 14 మందికి జికా ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా తేలింది. జికా ఇన్ఫెక్షన్ మరీ ప్రమాదకరమేమీ కాదని.. కానీ కొన్నేళ్లుగా మ్యుటేట్ అయి కొత్త వేరియంట్లు వస్తుండటంతో జాగ్రత్త తప్పనిస రని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ జికా ఏంటి? లక్షణాలు, ప్రమాదాలేమిటి తెలుసుకుందామా? మెదడు, నాడీ మండలంపై ఎఫెక్ట్ జికా వైరస్ లక్షణాలు మరీ ఇబ్బందిపెట్టే స్థాయిలో ఉండవు. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాల నొప్పులు ఉంటాయి. కొందరిలో మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. బయటికి వైరస్ లక్షణాలు కనబడకున్నా ‘గిల్లేన్ బారే సిండ్రోమ్ (నాడులు దెబ్బతిని చేతులు, కాళ్లపై నియంత్రణ దెబ్బతినడం, వణికిపోవడం)’ తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఉగాండాలో మొదలై.. 1947లో ఉగాండాలోని జికా అడవిలో ఉండే కోతుల్లో కొత్త వైరస్‌ను కనుగొన్నారు. దోమల ద్వా రా వ్యాపిస్తుందని గుర్తించారు. ఆ అడవి పేరుతోనే జికా వైరస్‌గా పేరుపెట్టారు. 1952లో తొలిసారిగా ఉగాండా, టాంజానియాల్లో మనుషులకు జికా వైరస్ సోకింది. మెల్లగా ఇతర దేశాలకు విస్తరించింది. 2007లో, 2013లోనూ పలు దేశాల్లో కొన్ని కేసులు బయటపడ్డాయి. తర్వాత వైరస్ మ్యుటేట్ అయి కొత్త వేరియంట్లు వచ్చాయి. 2015–16లో జికా మహమ్మారి గా మారింది. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాల్లో ప్రతాపం చూపింది. –సాక్షి సెంట్రల్‌డెస్క్ ఎలా వ్యాపిస్తుంది? ►డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులను వ్యాప్తి చెందించే ఎడిస్ రకానికి చెందిన దోమల ద్వారానే జికా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇవి పగలు మాత్రమే కుడతాయి. ►లైంగిక ప్రక్రియ ద్వారా, రక్తం ద్వారా కూడా వ్యాపిస్తుంది. గాలి, నీళ్లు, బాధితులను తాకడం వంటి వాటి ద్వారా ఇది సోకే అవకాశం లేదు. రక్త పరీక్ష ద్వారా ఈ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తారు. ►ఈ వైరస్ సోకినా కూడా.. ప్రతి పది మందికిగాను ఇద్దరిలో మాత్రమే లక్షణాలు ఉంటాయి. ►వ్యక్తులను బట్టి శరీరంలో 3 రోజుల నుంచి 14 రోజుల మధ్య ఈ వైరస్ సంఖ్యను పెంచుకుని, లక్షణాలు బయటపడతాయి. వారం రోజుల్లోగా వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. ►జికాకు సంబంధించి ప్రత్యేకంగా చికిత్సగానీ, వ్యాక్సిన్‌గానీ ప్రస్తుతం అందుబాటులో లేవు. లక్షణాలను బట్టి సాధారణ మందులనే ఇస్తారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌పై పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. గర్భస్థ శిశువులకు ప్రమాదం గర్భిణులకు సంబంధించి మిగతా చాలా రకాల వైరస్‌లతో పోలిస్తే జికా వైరస్ అత్యంత ప్రమాదకరమైనది. ఇది గర్భం లోని శిశువులకు కూడా వ్యాపించి మైక్రోసెఫలీ (మెదడు సరిగా ఎదగదు. తల పైభాగం కుచించుకుపోతుంది), ఇతర సమస్యలకు కారణం అవుతుంది. గర్భిణులు, పిల్లలను కనేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు, రెండేళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ‘జికా’పై కేంద్రం అప్రమత్తం కేరళకు ఆరుగురు నిపుణుల బృందం న్యూఢిల్లీ: కేరళలో జికా వైరస్ కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు నిపుణుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించింది. ఈ బృందం కేరళలో పరిస్థితులను సమీక్షించడంతోపాటు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందజేస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. కేంద్ర బృందంలో సీనియర్ వైద్యులతోపాటు అంటువ్యాధుల నిపుణులు ఉన్నారని.. కేరళలో పరిస్థితిని కేంద్రం పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. మరోవైపు కేరళ ప్రభుత్వం జికా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. కేసులను గుర్తించిన తిరువనంతపురం జిల్లాల్లో విస్తృతంగా వైద్య పరీక్షలు చేపట్టింది. -
‘జికా’ కలకలం, గర్భిణీ మహిళకు సోకిన మహమ్మారి
తిరువనంతపురం : కేరళలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. 24 ఏళ్ల గర్భిణీ మహిళకు జికా వైరస్ సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లా పరస్సల గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ జూన్ 28న తలనొప్పితో పాటు, శరీరంపై రెడ్ మార్క్‌లు ఏర్పడడంతో ఆమె కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె జికా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. మరోవైపు తిరువనంతపురానికి చెందిన డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు టెస్ట్‌లు చేయగా 13మందిలో దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్ లక్షణాలు ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాటిని నిర్ధారించేందుకు ఆ శాంపిల్స్లు పూణే వైరాలజీ ల్యాబ్‌కు తరలించారు. ఆ రిజల్ట్ రావాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం జికా వైరస్‌పై అప్రమత్తమైంది. ఈ సందర్భంగా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణజార్జ్ మాట్లాడుతూ.. జికా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. "గర్భిణీ మహిళకు జికా వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుంది. గత వారం రోజుల క్రితం బాధితురాలి తల్లి జికా వైరస్ లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో చేరారు. ఆమె ట్రావెల్ హిస్టరీ గురించి ఆరాతీస్తున్నాం. బాధితురాలు, ఆమె తల్లికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని తెలుస్తోందని " అన్నారు. చదవండి: ఎస్సై ఫిర్యాదు, రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు -
ఇంతకూ వైరస్ల మొత్తం సంఖ్య ఎంతో తెలుసా..!!
వైరస్.. ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు ఈ మధ్య గడగడలాడిపోతున్నాయి. సార్స్ నుంచి కరోనా వరకు దశాబ్దకాలంగా కనీవినీ ఎరుగని కొత్త వైరస్లు, వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు వివిధ దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఈ వ్యాధులపై గట్టి పోరాటమే చేస్తోంది. ఈ వ్యాధులతో ప్రాణనష్టంతో పాటు, వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రయాణాలపై ఆంక్షలు, ఎగుమతి దిగుమతులపై నియంత్రణల కారణంగా చాలా దేశాలు ఆర్థికంగానూ నష్టపోతున్నాయి. ఇప్పుడు చైనాలో కరోనా వ్యాధి ప్రబలడంతో ప్రాణాంతక వైరస్లు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కొన్ని వైరస్‌లకు చికిత్సలు ఉండటం లేదు. నివారణ ఒక్కటే మార్గం. అసలు ఏమిటీ వైరస్లు? ఇటీవల కాలంలో వివిధ దేశాల్ని ఎలా వణికించాయి? కరోనా వైరస్‌పై పోరాటం చేయడానికి చైనా చేస్తున్నదేంటి? ఇదే ఇవాళ్టి సండే స్పెషల్... 3,20,000 రకాల వైరస్లు వైరస్ అంటే లాటిన్ భాషలో విషం అని అర్థం. ఇవి సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులే కానీ అత్యంత శక్తిమంతమైనవి. బ్యాక్టీరియా, ఫంగస్ కంటే ఇవి చాలా శక్తిమంతంగా దాడి చేస్తాయి. ఇవి కంటికి కనిపించవు. కొన్ని రకాల వాటిని మైక్రోస్కోప్‌ల ద్వారా చూడగలం. ఈ వైరస్లు సంతానాన్ని వాటంతట అవి సృష్టించలేవు. కణజాలం ఉంటేనే ఇవి అభివృద్ధి చెందుతాయి. అడవి జంతువులు, మొక్కల నుంచి ఈ వైరస్లు మానవ శరీరాలపై దాడి చేస్తాయి. దీంతో మానవాళిని వివిధ రకాల వ్యాధులు భయపెడుతున్నాయి. ఫ్లూ, ఎబోలా, జికా, డెంగీ, సార్స్, మెర్స్ ఇప్పుడు కరోనా వీటన్నింటికీ వైరస్‌లే కారణం. మన శరీరంలోకి ఒక్కసారి ఈ వైరస్ ప్రవేశించిందో ఇక అది ఉత్పత్తి ఫ్యాక్టరీగా మారిపోతుంది. ఒక్క వైరస్ మరో 10 వేల కొత్త వైరస్‌లను సృష్టించే సామర్థ్యం ఉంటుంది. అందుకే భూమ్మీద ఉండే మనుషుల కంటే 10 వేల రెట్లు ఎక్కువ వైరస్లు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా. మన శరీరంలో కూడా ఎన్నో వైరస్లు ఉన్నప్పటికీ చాలా వైరస్లు నిద్రాణ స్థితిలో ఉంటాయి. అందుకే వాటి వల్ల హాని జరగదు. అయితే మనిషిలో రోగ నిరోధక వ్యవస్థ నిర్వీర్యం అయిపోతే మాత్రం ఈ వైరస్లు విజృంభిస్తాయి. అంతుపట్టని వ్యాధులకు కారణమవుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో ఈ వైరస్ల దాడి మొదలవుతుంది. చివరికి జ్వరం, రక్తస్రావం వంటి వాటికి దారి తీసి ప్రాణాలే పోతాయి. వైరస్‌లన్నీ హానికరమైనవే. మనిషిలో రోగాలను ఎదుర్కొనే శక్తిని బట్టే వాటి విజృంభన ఉంటుంది. అయితే కొన్ని మాత్రమే ప్రాణాంతక వైరస్లు ఉంటాయి. అమెరికన్ జర్నల్ సొసైటీ ఆఫ్ మైక్రో బయోలజీ అంచనాల ప్రకారం ఈ భూమి మీద 3 లక్షల 20 వేల రకాల వ్యాధికారక వైరస్లు ఉన్నాయి. ఎబోలా... పుట్టిన ప్రాంతం: ఆఫ్రికా ఎలా సంక్రమిస్తుంది: గబ్బిలాలు మరణాల రేటు: 50% ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ డిసీజ్ (ఈవీడీ) జర్వం, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలతో మొదలవుతుంది. ఒక్కోసారి శరీరం వెలుపల, లోపల కూడా రక్తస్రావం అవుతుంది. చివరికి బ్రెయిన్ హెమరేజ్‌తో మనిషి ప్రాణాలే పోతాయి. మొట్టమొదటిసారి 1976లో ఆఫ్రికాలో ఈ వైరస్ బట్టబయలైంది. సూడాన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాల్లో ఒకేసారి వ్యాప్తి చెందిన ఈ వైరస్ ఇంకా ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఆఫ్రికాలో ప్రవహించే నది ఎబోలా పేరునే ఈ వైరస్‌కు పెట్టారు. ఫ్రూట్ గబ్బిలాల నుంచి ఈ వైరస్ సంక్రమిస్తుంది. ఆ తర్వాత మనిషి నుంచి మనిషికి విస్తరిస్తుంది. గాయాలు, రక్తం, లాలాజలం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అప్పట్లో ఈ వైరస్ సోకిన వారిలో 90% మంది ప్రాణాలు కోల్పోయారు. 2014–16 మధ్య మళ్లీ ఈ వ్యాధి విజృంభించింది. అయితే మొత్తం కేసుల్లో మరణాల రేటు 50 శాతంగా ఉంది. ఆ రెండేళ్లలోనే దాదాపుగా 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వైరస్‌కు చికిత్స కోసం మందుని కనుక్కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వైరస్ రాకుండా వ్యాక్సినేషన్ కూడా ప్రయోగాల దశలో ఉంది. డెంగీ... పుట్టిన ప్రాంతం: ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ ఎలా సంక్రమిస్తుంది: దోమలు మరణాల రేటు: 20% కొన్ని వందల ఏళ్ల క్రితమే డెంగీ వైరస్ ఆఫ్రికా దేశాలను అతలాకుతలం చేసింది. ఇప్పుడు 20వ శతాబ్దంలో ఈ వైరస్ 1950లో ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌లో తొలిసారిగా బయటకి వచ్చింది. అక్కడ్నుంచి ఆసియా పసిఫిక్, కరేబియన్ దేశాలను వణికిస్తోంది. భారత్‌లో కూడా ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఏడెస్ దోమ కాటుతో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఏడెస్ వేగంగా వృద్ధి చెందుతుంది. దీనిని టైగర్ దోమ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 40 శాతం మంది డెంగీ వ్యాధి ప్రబలే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రతీ ఏడాది డెంగీ 5 కోట్ల నుంచి 10 కోట్ల మందికి సంక్రమిస్తుంది. వారం రోజులకు పైగా జ్వరంతో మనిషిని పీల్చి పిప్పిచేస్తుంది. ఒక్కోసారి డెంగీ జ్వరం తీవ్రత ఎక్కువై బ్రెయిన్ హెమరేజ్ వచ్చి ప్రాణాలు కోల్పోతారు. ఇలా మృతి చెందేవారు ప్రపంచ దేశాల్లో ఏడాదికి 25 వేల మంది వరకు ఉంటారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా దోమల్ని అరికట్టే కార్యక్రమాలు డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు చేపడుతూ ఉండటంతో డెంగీ కేసులు కాస్తయినా నివారించగలుగుతున్నారు. స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1) పుట్టిన ప్రాంతం: ఆఫ్రికా ఎలా సంక్రమిస్తుంది: పందులు మరణాల రేటు: 10% స్వైన్‌ఫ్లూ వ్యాధి మొట్టమొదట పందుల్లో బయటపడింది. ఇది మనుషులకి సోకడం తక్కువే. 1918–19 సంవత్సరాల్లో తొలిసారిగా ఇది మనుషులకి సోకింది. అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి ఈ వైరస్ సోకిందని అంచనాలున్నాయి. ఆ తర్వాత మళ్లీ 2009లో ఒక్కసారిగా ఈ వ్యాధి మనుషులకి సోకి తన విశ్వరూపం చూపించింది. మొత్తం 200 దేశాలకు విస్తరించింది. దాదాపుగా 3 లక్షల మంది ఈ వ్యాధితో మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పితో ఈ వైరస్ లక్షణాలు బయటకొస్తాయి. జ్వరం, డయేరియా వస్తే మాత్రం ఇది ప్రాణాంతకంగా మారుతోంది. సార్స్... పుట్టిన ప్రాంతం: చైనా ఎలా సంక్రమిస్తుంది: గబ్బిలాలు, పిల్లులు మరణాల రేటు: 10% చైనాలో గూంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో 2002లో తొలిసారిగా సివియర్ అక్యూట్ రెస్పరేటరీ డిసీజ్ (సార్స్) వైరస్ బయటపడింది. కొద్ది వారాల్లోనే ఆ వైరస్ 37 దేశాలకు పాకింది. జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఈ వ్యాధి లక్షణాలు. సార్స్ వ్యాధితో చైనా, హాంకాంగ్‌లోనే అత్యధిక మరణాలు సంభవించాయి. ఈ వైరస్ వచ్చిన తర్వాత ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణాలపై నిషేధాలు, ఆ దేశాల్లో ఉన్న తమ పౌరుల్ని వివిధ దేశాలు వెనక్కి తీసుకురావడం వంటి చర్యలు మొదలయ్యాయి. సార్స్ వ్యాధిని నియంత్రించడానికి చైనా, హాంకాంగ్, కెనడా, తైవాన్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడంతో ఆర్థికపరమైన నష్టాలు కూడా మొదలయ్యాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సార్స్ వ్యాధితో 2002–03లో 774 మంది మరణించారు. కొన్ని వేల మందిపై ఈ వైరస్ దాడి చేసింది. చాలా ఏళ్లుగా సార్స్‌ని నిరోధించే వ్యాక్సిన్ తయారు చేయడానికి వైద్య నిపుణులు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంకా అవి సఫలం కాలేదు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధికారక వైరస్‌లకు చికిత్సలు ఉండవు. నియంత్రణే మార్గం. ఈ వైరస్ మళ్లీ విజృంభించినప్పుడల్లా డబ్ల్యూహెచ్ఓ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలపైనే విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జికా... పుట్టిన ప్రాంతం: ఉగాండా ఎలా సంక్రమిస్తుంది: దోమలు మరణాల రేటు: 9% డెంగీ తరహాలోనే జికా వైరస్ కూడా ఏడెస్ దోమ ద్వారా వస్తుంది. జ్వరం, ఒళ్లంతా దద్దుర్లు, కంటికి కలక, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ వైరస్ కోతుల్లో కనపడింది. 1952 సంవత్సరం నాటికి ఈ వ్యాధి మనుషులకీ సంక్రమించింది. ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలో ఈ వ్యాధి ప్రబలింది. 1960–80 మధ్య కాలంలో ఈ వ్యాధి అమెరికా, ఆసియా, పసిఫిక్ దేశాలకు వ్యాపించింది. 2013లో ఈ వ్యాధి ఒక్కసారిగా ఫ్రాన్స్‌లో విజృంభించింది. 30 వేల మందికి ఈ వ్యాధి సంక్రమించింది. అప్పుడే ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అయితే ఈ వైరస్ త్వరగానే అదుపులోకి వస్తుంది. రోగ నిరోధక శక్తి బాగా కలిగి ఉండేవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు తక్కువ. 2015లో బ్రెజిల్‌ని కూడా జికా వణికించింది. గర్భిణులకు ఈ వ్యాధి సోకి గర్భస్థ శిశువులకీ సంక్రమించడం ఆందోళన కలిగించే అంశం. జికా వ్యాధితో పుట్టిన శిశువుల్లో మెదడు సక్రమంగా ఎదగదు. 2016లో జికాని అదుపు చేయడానికి డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. దోమకాటుతో పాటు, లైంగిక సంపర్కం, రక్తం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. వైరస్ ప్రూఫ్ కారు..! ఎన్నో రకాల వ్యాధికారక వైరస్లు చైనాలోనే బయటపడ్డాయి. సార్స్ నుంచి ఇప్పుడు కరోనా దాకా రకరకాల వైరస్‌లపై చైనా పోరాటం చేస్తూనే ఉంది. కరోనా వైరస్ దాటికి బెంబేలెత్తిన చైనా కేవలం పదంటే పది రోజుల్లోనే ఆస్పత్రిని నిర్మించింది. ఇప్పుడు వైరస్‌ని నిరోధించే కార్ల తయారీ పనిలో పడింది. జిలీ గ్రూప్ వైరస్‌లను నిరోధించే, గాలిని ప్యూరిఫై చేసే ఫిల్టర్లు ఏర్పాటు చేసేలా కార్లను అభివృద్ధి పరుస్తోంది. ఈ కార్లను ఆరోగ్యకరమైన, తెలివైన కార్లుగా ఆ కంపెనీ అభివర్ణిస్తోంది. యూరప్, అమెరికా, చైనాలో ఉన్న జిలీ ఆటోస్ గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్ డిజైన్ నెట్వర్క్ వాతావరణంలో వస్తున్న మార్పులకి అనుగుణంగా కార్ల డిజైన్లను తయారు చేస్తుంది. బ్యాక్టీరియా నిరోధక, వైరల్ నిరోధక సాంకేతిక వ్యవస్థను ఈ కార్లలో పొందుపరుస్తూ కొత్త కార్లను తీసుకురానుంది. ‘ఇవాళ రేపు ప్రజలు ఇళ్లలో గడిపే సమయం తర్వాత అత్యధికంగా ప్రయాణాల్లోనూ, అందులోనూ కార్లలోనే గడుపుతున్నారు. వాటిపైనే చైనా ప్రజలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అందుకే కారు ప్రయాణాల్లో వారికి ఎలాంటి వైరస్లు సోకకుండా కొత్త తరహా కార్లను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ – ‘జిలీ’ అధ్యక్షుడు అన్ కాంఘై -
55కు పెరిగిన రాజస్తాన్ జికా కేసులు
జైపూర్: రాజస్తాన్‌లో జికా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 55 మందికి ఈ వైరస్ సోకినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు శనివారం ధ్రువీకరించారు. చికిత్సపొందిన తరువాత 38 మంది పరిస్థితి మెరుగైందని తెలిపారు. జైపూర్‌లోని పలు ప్రాంతాల నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ బృందాలు దోమ లార్వాల నమూనాలను సేకరించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు చెప్పాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఫాగింగ్ కొనసాగిస్తున్నారు. 11 మంది గర్భిణులకూ జికా వైరస్ సోకింది. పరిస్థితిని పర్యవేక్షించడానికి ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశారు. -
జైపూర్‌లో కోరలు చాస్తోన్న జికా వైరస్
-
వణికిస్తున్న 'జికా'
సాక్షి, ముంబై: జికా వైరస్ దేశంలో పంజా విసురుతోంది. గతనెలలో తొలికేసు నమోదైన రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్‌లో జికా విజృంభిస్తోంది. ఇది మరిన్ని రాష్ట్రాలకు సోకనుందనే వార్తలు మరింత ఆందోళన పుట్టిస్తున్నాయి. జైపూర్‌లో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య తాజాగా 22కి చేరింది. ఇప్పటివరకూ 22 కేసులను గుర్తించామనీ, ఎన్సీడీసీ పరిస్థితిని సమీక్షిస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది దీంతో రంగంలోకి దిగిన కేంద్రం సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా కోరింది. తాజాగా 22 మందికి పాటిజివ్ గా తేలడంతో ప్రధానమంత్రి కార్యాలయం ఒక నివేదికను కోరిందని అధికారులు వెల్లడించారు. అటు ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీ) లో ఒక కంట్రోల్ రూంను ఏర్పాటుచేయడంతో పాటు ఒక ఉన్నతస్థాయి కమిటీ జైపూర్‌కు తరలి వెళ్లింది. మరోవైపు బీహర్ లోనూ జికా వైరస్ లక్షణాలు కనిపిస్తుండటంతో అక్కడి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. దాదాపు 38 జికా అలర్ట్ జారీ చేశారు. జికా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలనీ, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. -
రాజస్తాన్‌లో తొలి జికా కేసు
జైపూర్: రాజస్తాన్‌లో ఆదివారం తొలి జికా కేసు నమోదైంది. జైపూర్‌లోని శాస్త్రి నగర్‌కు చెందిన ఓ మహిళ కళ్లు ఎర్రబా రడం, కీళ్లనొప్పులు, బలహీనత వంటి లక్షణాలతో ఈ నెల 11న స్థానిక స్వామి మాన్ సింగ్ (ఎస్ఎమ్ఎస్) ఆస్పత్రిలో చేరింది. తొలుత వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ లేవని నిర్ధారణ అయింది. దీంతో జికా సోకిందనే అనుమా నంతో ఆమె రక్త నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపించారు. పరీక్షల్లో జికా వైరస్ సోకినట్లు తేలిందని ఎస్ఎమ్ఎస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, వైద్యుడు యూఎస్ అగర్వాల్ ప్రకటిం చారు. రాష్ట్రంలో ఇదే మొదటి జికా కేసు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాము రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. -
ఆ దోమ కాటు మంచిదే
వాషింగ్టన్ : జికా వైరస్ మానవాళికి చెడు కంటే మంచే ఎక్కువ చేస్తుందా?. గత రెండేళ్లుగా గర్భంలో ఉన్న పిండంపై పెను ప్రభావం చూపుతూ జికా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కానీ, జికా వైరస్‌లో ఉన్న ఓ మంచి లక్షణాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రెయిన్ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసేందుకు జికా వైరస్ ఉపయోగపడుతుందని జర్నల్ ఆఫ్ ఎక్స్పరిమెంటర్ మెడిసిన్‌లో పేర్కొన్నారు. మెదడుపై జికా వైరస్ ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలకు బ్రెయిన్ క్యాన్సర్ సెల్స్‌ను అది పూర్తిగా నాశనం చేయడం గమనించారు. ఇదే సందర్భంలో సాధారణ మెదడు కణాలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని గుర్తించారు. బ్రెయిన్ క్యాన్సర్ సోకిన 18 చిట్టెలుకలకు జికా వైరస్, ఉప్పునీటిని ఇంజెక్షన్ల ద్వారా ఎక్కించారు. రెండు వారాల అనంతరం చిట్టెలుకల స్థితిని పరిశీలించిన శాస్త్రవేత్తలకు జికా వైరస్ ఇంజెక్షన్లు చేసిన చిట్టెలుకల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు గుర్తించారు. అనంతరం మానవ మెదడుపై పరిశోధన కోసం జికా వైరస్ ఇంజెక్షన్‌కు ఎక్కించగా.. కొద్దిరోజుల తర్వాత బ్రెయిన్ క్యాన్సర్ కణాలు నాశనమైనట్లు గుర్తించారు. అయితే, జికా వైరస్ ప్రాథమిక లక్షణం(గర్భస్త పిండంపై తీవ్ర ప్రభావం చూపడం) వల్ల కేవలం వయసులో పెద్దవారిలోనే బ్రెయిన్ క్యాన్సర్‌ను నయం చేయడానికి అవకాశం కలుగుతుందని జర్నల్‌లో పరిశోధనా బృందం పేర్కొంది. -
జికా వైరస్‌కు సమర్థవంతమైన టీకా
వాషింగ్టన్: ప్రాణాంతకమైన జికా వైరస్‌కు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మొక్కల నుంచి టీకాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది అత్యంత సమర్థవంతమైనదని, సురక్షితమైనదని, అంతేకాకుండా ఇది చాలా చవకైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జికా వైరస్‌ను నిలువరించేందుకు అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించి ఈ టీకాను అభివృద్ధి చేశార జికా వైరస్ ప్రజలకు సోకేలా చేయడంలో జికా వైరల్ ప్రొటీన్‌లోని డీ – ఐఐఐ అనే డొమైన్ కీలక పాత్ర పోషిస్తుందని ఏఎస్యూకి చెందిన శాస్త్రవేత్త కియాంగ్ చెన్ వివరించారు. దీన్ని నిలువరించేందుకుగాను ముందుగా పొగాకు మొక్కల్లోకి డీ – ఐఐఐని ప్రవేశపెట్టి, అదే మొక్క నుంచి ప్రతిరక్షకాన్ని అభివృద్ధి చేసినట్లు కియాంగ్ చెప్పారు. ముందుగా ఈ టీకాను ఎలుకలపై ప్రయోగించి 100 శాతం విజయం సాధించామని వివరించారు. -
భారత్‌లో ‘జికా వైరస్’ ఎప్పుడో ఉందట!
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల ముగ్గురు రోగులకు సోకిన ‘జికా’ వైరస్ బ్రెజిల్, మెక్సికో లాంటి వైరస్ బాధిత దేశాల నుంచి సంక్రమించిందా ? లేదా దేశంలోనే ఎప్పుడో పుట్టి ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చిందా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరికినట్లే. జికా వైరస్ సోకిన ముగ్గురు రోగులు గతంలో విదేశాల్లో ఎన్నడూ పర్యటించిన వాళ్లు కాదని తేలడంతో విదేశాల నుంచి ఆ వైరస్ వచ్చిందనడానికి వీల్లేదని ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్’ డైరెక్టర్ డాక్టర్ ఏసీ ధనివాల్ స్పష్టం చేశారు. భారత్‌లో ఎప్పుడో జికా వైరస్ ఉందని 1954 నాటి వైద్య పర్యవేక్షణా నివేదికను విశ్లేషిస్తే అర్థం అవుతుంది. న్యూయార్క్‌లోని రాక్ఫెల్లర్ ఫౌండేషన్‌కు చెందిన కేసీ స్మిత్బర్న్, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలోజీ నాటి డైరెక్టర్ జేఏ కెర్, బాంబే మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసిన పీబీ గాట్నే ఈ నివేదికను రూపొందించారు. ప్రస్తుతం గుజరాత్‌లోని బారుచ్, నాగపూర్ నుంచి సేకరించిన శాంపిల్స్‌లో జికా వైరస్ ఉందని తేలింది. అది అంతగా విస్తరించకపోవడంతో దాన్ని ఎదుర్కొనే శక్తి భారతీయ ప్రజల్లో పెరిగిందని వైద్యులు భావించారు. భారత్, పాకిస్తాన్, ఇండోనేసియా, ఆసియా దేశాల్లో జికా వైరస్ ఒకప్పుడు ఉండేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావించినప్పటికీ 2016లో విడుదల చేసిన జికా వైరస్ విజంభించిన దేశాల జాబితాలో భారత్‌ను చేర్చక పోవడం విశేషం. జికా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి భారతీయుల్లో పెరిగి ఉండే వాటి యాంటీ బాడీస్ కనిపించాలి. వాటి ఆనవాళ్లు లేవు. భారత్‌లో ఎప్పుడో అంతరించి పోయిన ఈ వైరస్ తిరిగి దేశంలో బయల పడడం కాస్త ఆందోళనకరమే. అయితే మొన్న గుజరాత్లో బయట పడి జికా వైరస్ జాతి ఎక్కువగా బ్రెజిల్లో, సింగపూర్‌లో కనిపించే జాతని, ఇది పెద్ద ప్రమాదరకమైనది కాదని డాక్టర్ ధనివాల్ చెబుతున్నారు. -
జికాను ప్రాణాంతకంగా మారుస్తున్నవి ఇవే!
వాషింగ్టన్: జికా వైరస్‌ను ప్రాణాంతకంగా మార్చగలవని భావిస్తున్న ఏడు కీలక ప్రొటీన్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలు, నరాలకు సంబంధించిన రోగాలు సహా అనేక ఆరోగ్య సమస్యలను జికా కలిగించగలదని శాస్త్రవేత్తలు గతంలో కనుగొన్నారు. అయితే జికాలోని ఏ ప్రొటీన్లు దానిని అంత ప్రమాదకరంగా మారుస్తున్నాయో తేల్చలేకపోయారు. తాజాగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు జికాను ప్రమాదకారిగా మార్చడానికి ఏడు ప్రొటీన్లు దోహదపడుతూ ఉండొచ్చని తేల్చారు. పరిశోధనలో భాగంగా జికా వైరస్‌కు చెందిన 14 ప్రొటీన్లను శాస్త్రవేత్తలు విడి విడిగా తీసి ఉంచారు. అనంతరం ఈస్ట్ కణాలకు వాటిని చేర్చి చర్య జరిపించారు. ఏడు ప్రొటీన్లు కణాలపై దుష్ప్రభావం చూపుతున్నాయని ఈ పరీక్షలో తేలింది. -
జికా వైరస్ నిర్ధారణకు 2 కేంద్రాల గుర్తింపు
సాక్షి, అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జికా వైరస్ నిర్ధారణకు ప్రత్యేక ల్యాబొరేటరీల ఏర్పాటుకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతించింది. జికా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అప్ర మత్తంగా ఉండాలని ఈ మేరకు కేంద్ర అధి కారులు ఆదేశాలు జారీచేశారు. దేశం మొత్తం మీద 25 ల్యాబొరేటరీలను గుర్తించగా అందులో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ వెంకటేశ్వరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎస్వీఎంసీ-తిరుపతి), తెలంగాణలో గాంధీ మెడికల్ కాలేజ్ (జీఎంసీ-సికింద్రాబాద్)లను గుర్తించారు. ఈ రెండు సెంటర్లలో జికా వైరస్‌కు సంబంధించిన కేసులను నిర్ధారిస్తే కేంద్రానికి తెలియ జేయాలని పేర్కొన్నారు. -
జికా.. వస్తోంది జర జాగ్రత్త!
భారత్‌ను హెచ్చరిస్తున్న డబ్ల్యూహెచ్‌వో డెంగీ, చికెన్‌గున్యాకు కారణమయ్యే ‘ఏడిస్’ దోమ ద్వారా వైరస్ వ్యాప్తి దేశంలో ఇప్పటికే డెంగీ స్వైరవిహారం 64 ఏళ్ల కిందటే పుణేలో బయటపడ్డ జికా ఆనవాళ్లు నాటి నుంచి భారతీయుల్లో అంతర్లీనంగా వైరస్ వైరస్ జన్యువులో మార్పులతో తాజాగా శక్తివంతం అందుకే అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు యాసీన్ దాదాపు ఏడాదిన్నర కిందట యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. చికిత్సే లేని మహమ్మారిగా మారి ఎన్నో ప్రాణాలను కబళించింది. మానవాళికే పెనుముప్పుగా పరిణమిస్తూ వైద్య రంగానికే కొత్త సవాల్ విసిరింది. వైద్య అత్యయిక పరిస్థితిని, ఎన్నో దేశాల మధ్య రవాణాను స్తంభింపజేసేంతటి ఉపద్రవాన్ని సృష్టించి ఆ తర్వాత కాస్త నెమ్మదించింది.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది! రెండో ఆగమనంలో రెట్టించిన శక్తితో విరుచుకుపడుతోంది. అదే ప్రాణాంతక జికా వైరస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజా పరిశోధనల్లో ఈ వైరస్ తీవ్రతను గుర్తించింది. ఇది ఏ క్షణంలోనైనా భారత్‌లోనూ వ్యాపించొచ్చని హెచ్చరిస్తోంది. పొంచి ఉన్న ముప్పు... భారత్‌కు ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్‌వో విశ్వసనీయంగా చెప్పడానికి కారణాలున్నాయి. మన దేశంలోకి వచ్చే పర్యాటకులను డబ్ల్యూహెచ్‌వో నిశితంగా గమనిస్తోంది. ఏటా లక్షల సంఖ్యలో వచ్చే విదేశీ పర్యాటకుల వల్ల భారతీయులు ఈ వైరస్బారినపడే ప్రమాదం ఉందని చెబుతోంది. ‘ఏడిస్’ అనే దోమ ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది. డెంగీ, చికన్‌గున్యా వ్యాప్తికీ ఈ దోమే కారణం. ఇప్పటికే మన దేశంలో ఈ దోమ కుట్టడం వల్ల డెంగీ స్వైరవిహారం చేస్తోంది. ‘ఏడిస్’ విస్తృతి ఎక్కువగా ఉండటం వల్ల విదేశీ పర్యటకుల వల్ల ఒకవేళ జికా మన దేశానికి ఒకసారి గనక చేరితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందనేది డబ్ల్యూహెచ్ఓ అంచనా. అప్పట్లో డేంజర్ కాకపోవచ్చుగానీ ఇప్పుడైతే... ‘‘ఏడిస్ దోమ వ్యాపింపజేసే జికా వైరస్ మొదట్లో ఇంత తీవ్రంగా ఉండేది కాదు. పైగా ఆ వైరస్ సోకినప్పటికీ అప్పట్లో మెదడు కుంచించుకుపోవడం అనే లక్షణం కనిపించేది కాదు. దాదాపు 64 ఏళ్ల క్రితం దీన్ని పుణెలో గుర్తించినప్పుడు అది ప్రమాదకరంకాని విధంగా (బినైన్గా) అంతర్లీనంగా భారతీయుల్లో ఉండేది. 1952లో జపనీస్ ఎన్సెఫలైటిస్ వంటి మెదడువాపు వ్యాధి జాడలను గుర్తించే క్రమంలో జికా వైరస్‌ను డబ్ల్యూహెచ్‌వో నిపుణులు కనుగొన్నారు. గతంలో ఉన్న వైరస్‌లో ‘ఎన్ఎస్1’అనే జన్యువులో వచ్చిన మ్యుటేషన్స్ వల్ల ఇప్పుడు అది మానవుల్లో నరాలను దెబ్బతీసే వ్యాధి (న్యూరోట్రోపిక్)గా మారింది. ఈ ఉత్పరివర్తనం (మ్యూటేషన్) వల్ల రక్త కణాల్లో వైరస్ తన సంఖ్యను పెంచుకొని, వ్యాధి నిరోధక శక్తికి అతీతంగా వ్యవహరించే అవకాశం ఉంది. అందుకే భారత్‌లోని ప్రజలు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం మరింత అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం’’ అని అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ డీన్ పీటర్ హోటెజ్ పేర్కొన్నారు. ‘‘ఈ విషయమై భారత్‌ను వారం నుంచి హెచ్చరిస్తున్నామని, ఈ ముప్పును ఎట్టి పరిస్థితుల్లో అలక్షం చేయొద్దని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ), ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సరివియలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ)లకు సూచించారు. ప్రజలు, ప్రభుత్వాలూ అప్రమత్తం కావాలని అయన కోరుతున్నారు. ‘‘తొలుత దీన్ని ఆఫ్రికాలో కనుగొన్నారు. ఆ తర్వాత యూరప్, మధ్యప్రాచ్యాలకు విస్తరించింది. గతేడాది బ్రెజిల్, అమెరికాపై దాడి చేసింది. ఇప్పుడు తూర్పు దేశాల దండెత్తి ప్రపంచమంతటికీ విస్తరించే పనిలో ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌కు ముప్పు ఎందుకంటే... దేశంలో జనసంఖ్య ఎక్కువ. ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి అంశాలపై అవగాహన ఒకింత తక్కువ. పైగా ఇప్పుడు వర్షాకాలం. దాంతో నీళ్ల చేరికకు అవకాశం పెరిగి దోమలు మరింతగా వృద్ధి చెందే కాలం. ఇప్పుడు సింగపూర్ వంటి సమీప ప్రాంతాల్లోనూ దీని ఉనికి స్పష్టమైంది. ఇక దీని విస్తృతి ఉన్న దేశాల నుంచి పర్యాటకుల ప్రయాణాలు చాలా ఎక్కువ. అందునా జికాను వ్యాప్తి చేసే దోమ ఏడీస్ వల్లనే కలుగుతున్న డెంగ్యూ కేసులు చాలా ఎక్కువ. వీటన్నింటినీ చూస్తే భారత్‌లో ఇది విస్తరించడానికి అవసరమైన నేపథ్యం ఉంది. అందుకే హోటెజ్ వంటి వారు మరీ మరీ హెచ్చరిస్తున్నారు. జికాను గుర్తించిందిలా... అది విస్తరించిందిలా... ఉగాండా అడవుల్లోని రిసస్ కోతుల్లో 1947లో మొదటిసారి జికా వైరస్‌ను గుర్తించారు. ఏడేళ్ల తర్వాత నైజీరియా అడవుల్లోని మానవుల్లోనూ గుర్తించారు. 10 లక్షల ఇన్ఫెక్షన్ల తర్వాత అది మరింత శక్తిని పుంజుకోవడంతో మానవాళి అప్రమత్తమైంది. 2007లో పసిఫిక్ ద్వీపాల్లో వైరస్ కొత్త రూపం (స్టెయిన్స్) కనిపించింది. గతేడాది బ్రెజిల్లో దాదాపు 10 లక్షల కంటే ఎక్కువ మందిలో జికాను గుర్తించారు. ఇది సోకిన గర్భవతులకు కలిగిన సంతానంలో మెదడు సంకోచించి ఉండటాన్ని కనుగొన్నారు. ఇలా మెదడు సంకోచించిపోవడాన్ని వైద్య పరిభాషలో ‘మైక్రో సెఫాలీ’ అంటారు. తల్లికి వ్యాధి సోకితే పుట్టే పిల్లల తల చాలా చిన్నదిగా ఉంటుంది. మెదడు అభివృద్ధి, వికాసం... ఈ రెండు అంశాలూ చాలా తక్కువ. ఇక ఆ తర్వాత అమెరికా ఖండంలోని 26 దేశాలకు ఇది పాకిందని తెలుసుకున్నారు. అనంతరం ఆఫ్రికాలోని కేప్ వెర్డెలో, సింగపూర్‌లోనూ జికా కేసులను కనుగొన్నారు. కేవలం ఐదు రోజుల వ్యవధిలో 200 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయనే అంశం దీని విస్తృతి తీవ్రతను చెబుతుండగా... అదే తీవ్రత ప్రపంచాన్ని వణికిస్తోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)తోపాటు అమెరికన్ నేషనల్ హెల్త్ ఏజెన్సీ చెప్పే లెక్కల ప్రకారం ప్రస్తుతం జికా వైరస్ 58 దేశాల్లో మృత్యుఘంటికలు మోగిస్తోంది. తాజాగా తమ దేశంలో జికాను గుర్తించినట్లు ఫిలిప్పిన్స్ ఈ నెల 5న ప్రకటించింది. ఇవీ లక్షణాలు... - జ్వరం - ఒంటి మీద దద్దుర్లు (ర్యాష్) - కళ్లు ఎర్రబడటం, కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, తలనొప్పి - గర్భవతుల్లో పిండం మెదడు కుంచించుకుపోవచ్చు, మిగతా వారిలో ఒళ్లు చచ్చుబడే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) రావొచ్చు జాగ్రత్తలు... - ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు, పొడవు చేతుల కుర్తాలు ధరించాలి. - దోమలను పారదోలే ‘మస్కిటో రెపెల్లెంట్స్’ ఉపయోగించాలి. - ఈ దోమలు పగలూ కుడతాయి... కాబట్టి పగటి వేళ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాధి గర్భవతులకు ఈ వ్యాధి సోకితే మిగతా వారిలాగే వ్యక్తిగతంగా వారికీ, ప్రసవం తర్వాత తమ బిడ్డలకు మెదడు కుంచించుకుపోయే మెక్రోసెఫాలీతో వారి బిడ్డలకూ ముప్పు కలిగే అవకాశం ఉంది కాబట్టి గర్భవతులు దోమలు కుట్టకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. చికిత్స... - వ్యాధి సోకిన తర్వాత నిర్దిష్ట చికిత్స ప్రక్రియ లేదు. - ఇతర వైరల్ జబ్బుల విషయంలో ఇచ్చే మందులే దీనికీ ఇస్తున్నారు. -
13 మంది భారతీయులకు జికా వైరస్
సింగపూర్‌లో 13 మంది భారతీయులు దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదకర జికా వైరస్ బారినపడ్డారు. భారత విదేశాంగశాఖ అధికారులు గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే సింగపూర్ లో వందల మందికి జికా వైరస్ సంక్రమించిన విషయం తెలిసిందే. తాజాగా వైద్యులు జరిపిన టెస్టుల్లో భారతీయులకు ఈ వైరస్ సంక్రమించినట్లు తమకు సమాచారం అందినట్లు వికాస్ స్వరూప్ తెలిపారు. మొదటగా భవన నిర్మాణ కార్మికులలో జికా వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. గతంలో బ్రెజిల్ ను వణికించిన జికా వైరస్ ప్రస్తుతం సింగపూర్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జికా నిర్మూలనకు సింగపూర్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా జికా కేసులు మాత్రం పెరుగిపోతున్నాయి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గర్బిణీలకు జికా వైరస్ వ్యాప్తి చెందితే పుట్టబోయే పిల్లలు చిన్న తలతో పుట్టడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. -
భారత అథ్లెట్ సుధాకు 'జికా'పరీక్షలు!
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ సుధా సింగ్ తీవ్ర జ్వరానికి గురి కావడంతో ఆమెకు జికా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒలింపిక్స్ ముగిసిన అనంతరం బెంగుళూరులోని స్పోర్ట్స్ అథారిటీ హాస్టల్‌కు చేరిన సుధా సింగ్‌కు విపరీతమైన జ్వరం వచ్చింది. దాంతోపాటు బాగా నీరసించిపోవడంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ఫోర్టిస్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే దోమ కాటు ద్వారా వచ్చే డెంగ్యూ, చికెన్‌గున్యాలు ఆమెకు సోకలేదని లేదని అక్కడ చేసిన టెస్టుల్లో తేలింది. కాగా, బ్రెజిల్ లో జికా వైరస్ తీవత్ర హెచ్చుగా ఉండటంతో ఆ మేరకు టెస్టులు కూడా చేయాలని డాక్టర్లు భావించారు. దానిలో భాగంగా ఆమె రక్త నమూనాను పుణెలోని జికా వైరస్ ఇనిస్టిట్యూట్‌కు పంపారు. మంగళవారం ఈ వైరస్‌కు సంబంధించిన టెస్టులు పూర్తయిన తరువాత రిపోర్ట్ వెల్లడిస్తామని కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో సుధా సింగ్ మూడు వేల మీటర్ల స్టీపల్ చేజ్లో పాల్గొంది. -
జికా ఉన్నా.. జిల్జిల్ జిగా..
జికా వైరస్ అంటే అందరూ జడుసుకు చస్తున్నారు.. మరి ఇలాంటి టైమ్‌లో పర్యాటకులు ఏం చేయాలి? జికా వైరస్ ఉన్న దేశాల్లో తిరక్కూడదంటే ఎలా? అని అంటే.. ఇదిగో ఇదేసుకుని తిరిగేయండి అంటోంది ఓ జపాన్ కంపెనీ. మొత్తం అంతటినీ కప్పేసేలా నెట్స్మెన్ పేరిట ఈ దోమ తెరను తయారుచేసింది. ఇదేసుకుని ఎంచక్కా తిరిగేయొచ్చని చెబుతోంది. జికా కాదు.. డెంగీతోపాటు దోమల వల్ల వచ్చే వ్యాధులన్నిటి నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని ‘బిబిల్యాబ్’ కంపెనీ చెబుతోంది. దీన్ని తీయాల్సిన పని కూడా లేదట. కాళ్లు, చేతులు కడుక్కోవాలన్నా.. బాత్రూంకు వెళ్లాలన్నా అందుకు వీలుగా.. ఎక్కడికక్కడ జిప్‌లను ఏర్పాటు చేశారు. పర్యాటకులతోపాటు జికా వైరస్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకూ ఉపయోగపడుతుందని అంటోంది. దీని ధర రూ.4,200. -
ఆ వైరస్ సోకుతుందని భయపడను!
ముంబై: త్వరలో జరగనున్న ఒలింపిక్స్‌లో పతకం గురించి ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. ప్రతి పెద్ద టోర్నీకి ఎలా సన్నద్ధమవుతానో ఒలింపిక్స్‌కు కూడా అలాగే సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. 'ప్రతి మ్యాచ్‌లో నెగ్గడానికి ప్రయత్నించాలి. ఆటను మెరుగుపర్చుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు దక్కుతాయి. అలా కానీ పక్షంలో మళ్లీ ప్రయత్నించాలి. అంతేకానీ ముందుగానే ప్రతి విషయంపై అంచనాలు పెంచుకోకూడదు' అని సానియా అంటోంది. డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్నతో తనకు చక్కటి భాగస్వామ్యం కుదిరిందని, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో అతనితో కలసి ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. తనకు జికా వైరస్ గురించి భయంలేదని, కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పింది. తన డబుల్స్ భాగస్వామి ప్రార్థన తొంబారే ఆత్మవిశ్వాసంతో ఉండడం ఒలింపిక్స్‌లో తమ జోడీకి కలిసొస్తుందని తెలిపింది. ఈ నెల 22న కెనడా ఓపెన్, ఆ తర్వాత ఒలింపిక్స్‌లో పాల్గొని అట్నుంచి యూఎస్ ఓపెన్‌లో ఆడేందుకు వెళ్తానని చెప్పుకొచ్చింది. చాలాకాలం పాటు టెన్నిస్‌లో కొనసాగాలని భావిస్తున్నట్లు తెలిపింది. మేకప్ వేసుకుని నటిస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదని టెన్నిస్ క్వీన్ సానియా సమాధానమిచ్చింది. -
జికా భయం... రియోకు రాలేం
ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న రానిచ్, హాలెప్ పారిస్: జికా వైరస్ కారణంగా రియో నుంచి అథ్లెట్లు తప్పుకోవడం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా వింబుల్డన్ రన్నరప్ రానిచ్, 2014 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ హాలెప్... ఇద్దరూ రియో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జికా వైరస్ కారణంగానే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇరువురూ ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా కూడా పలువురు ఆటగాళ్లు రియోకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రియోలో భద్రతను రెట్టింపు చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. క్రీడా గ్రామంలో 85వేల మంది పోలీసులతోపాటు కట్టుదిట్టమైన ట్రాఫిక్ నిబంధనలు, అదనంగా చెక్‌పాయింట్స్, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రెజిల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. -
జికా భయంతో గర్భస్రావాలు
లండన్: జికా వైరస్ భయంతో లాటిన్ అమెరికా దేశాల్లో అనేక మంది గర్భిణులు గర్భస్రావాలు చేయించుకుంటున్నారు. అయితే అక్కడి చాలా దేశాల్లో ఇది చట్టవిరుద్ధమైనందున వారు ఇందుకోసం సురక్షితం కాని మార్గాలను ఎంచుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండానే గర్భస్రావానికి కారణమయ్యే మందులను వాడుతున్నారు. ఆనక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. జికా వైరస్ ప్రభావం మనుషులపైన కన్నా, గర్భంలో ఉన్న శిశువుపై అధికంగా ఉంటుందని అమెరికా ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. -
లాటిన్ అమెరికాలో అబార్షన్ల గొడవ షురూ
లండన్: జికా వైరస్ కారణంగా లాటిన్ అమెరికాలో అబార్షన్లకు డిమాండ్ పెరుగుతోంది. బ్రెజిల్లో ప్రస్తుత అంఛనాల ప్రకారం గతంలో ఉన్న అబార్షన్ల కేసులకన్నా ప్రస్తుతం రెండింతలు ఎక్కువయ్యాయంట. ఇక మరికొన్ని లాటిన్ దేశాల్లో ఈ డిమాండ్ మూడింతలు పెరుగుతోంది. జికా వైరస్ కారణంగా చిన్నారులు అంద విహీనంగా పుట్టడమే కాకుండా చిన్న పరిమాణంలో ఉండే బ్రెయిన్‌తో జన్మిస్తున్నందున ఇది మంచి పరిణామం కాదని, సుదీర్ఘకాల సమస్యలు వస్తాయని ఇప్పటికే అన్నిరకాల ప్రభుత్వాలు ప్రజలకు సలహాలు ఇచ్చాయి. ఏ మహిళ కూడా గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. దీంతో ఇప్పటికే గర్భం దాల్చిన మహిళలంతా తమకు అబార్షన్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
జికాను అడ్డుకునే కండోమ్‌లు ఇస్తారట!
రియో డి జెనిరోలో ఈ సంవత్సరం జరగనున్న ఒలింపిక్స్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా క్రీడాకారులకు జికా వైరస్‌ను అడ్డుకునే కండోమ్‌లు ఇవ్వబోతున్నారట. ఇందుకోసం ప్రపంచంలోనే నెంబర్ 2 కండోమ్ తయారీ కంపెనీ ఆన్సెల్ లిమిటెడ్‌తో ఆస్ట్రేలియా ఔషధ తయారీ కంపెనీ స్టార్ఫార్మా హోల్డింగ్స్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. మొత్తం ఆస్ట్రేలియా అథ్లెట్లు అందరికీ స్టార్ ఫార్మా వాళ్ల వివాజెల్తో లూబ్రికేట్ చేసిన డ్యూయల్ ప్రొటెక్షన్ కండోమ్స్ ఇస్తామని చెబుతున్నారు. శృంగారం ద్వారా జికా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, తాము తయారుచేసిన వివాజెల్ ఈ వైరస్‌ను సమర్థంగా అడ్డుకుంటుందని స్టార్ ఫార్మా సీఈవో జాకీ ఫైర్లీ తెలిపారు. ఇప్పటికే ఒలింపిక్ గ్రామానికి కొన్ని కండోమ్‌లను పంపామని, వీటితోపాటు ఇప్పుడు కొత్తవాటిని కూడా పంపుతామని ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ తెలిపింది. వీటితోపాటు ఒలింపిక్ గ్రామంలో కొన్ని కండోమ్ డిస్పెన్సింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. వాటిద్వారా 3.50 లక్షల పురుషుల కండోమ్‌లు, లక్ష మహిళల కండోమ్‌లు అథ్లెట్లకు ఉచితంగా అందిస్తారు. రియో నుంచి తిరిగి వచ్చే అథ్లెట్లకు తప్పనిసరిగా రక్తపరీక్షలు చేయించాలన్న నిబంధనలు ఉన్నట్లు వచ్చిన కథనాలను ఏఓసీ ఖండించింది. -
దేవిక దేశానికే గర్వకారణం
న్యూఢిల్లీ: జికా వైరస్ ను గుర్తించిన పరిశోధనా బృందంలో భాగమైన వైద్య విద్యార్థినిని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన డాక్టోరల్ విద్యార్ధిని దేవికా సిరోహి (29) కొనియాడుతూ బుధవారం ఆయన ట్విట్ చేశారు. జికా వైరస్ ను విజయవంతంగా డీకోడ్ చేసిన అమెరికా విశ్వవిద్యాలయ పరిశోధన బృందంలో మీరట్ కు చెందిన దేవికా భాగస్వామిగా ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఆమె కుటుంబానికే కాకుండా, దేశానికి కూడా గర్వకారణంగా నిలిచిందంటూ కేంద్రమంత్రి ప్రశంసించారు. దేవికా సిరోహి సాధించిన ఈ విజయం ఆడపిల్లల విద్యా ప్రాముఖ్యతను మరోసారి తెలియజేసిందన్నారు. 'బేటీ బచావో , బేటీ పడావో' పై దృష్టి పెట్టాలంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరోవైపు తమ ఏడుగురి పరిశోధకుల బృందంలో దేవికా అతి చిన్న వయస్కురాలని అమెరికాకు పురుద్వే యూనివర్శిటీ తెలిపింది. జికా వైరస్ నిర్మాణాన్ని గుర్తించడం ఇదే మొదటి సారని పేర్కొంది. ముగ్గురు ప్రొఫెసర్లు, నలుగురు విద్యార్థులు పాల్గొన్న ఈ సంచలన పరిశోధనలోతాను కూడా ఉండడం ఆనందంగా ఉందని దేవిక సంతోషం వ్యక్తం చేసింది. ఈ ప్రాణాంతకమైన వైరస్ ను ఛేదించడంలో తాము చాలా కష్టపడ్డామని, రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవాళ్లమని తెలిపింది. తమ పరిశోధన ఫలించి విజయం సాధించడం గర్వంగా ఉందని పేర్కొంది. Ms Sihori has not only made her family proud but also the country feels proud of her achievement. Congratulations to her family as well. — Rajnath Singh (@BJPRajnathSingh) 6 April 2016 -
ఆరోగ్య కార్యకర్తల్లా వచ్చి...
రియో డి జనిరో: జికా వైరస్ వ్యాప్తితో ఒక్కపక్క వణికిపోతుంటే మరోపక్క దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. జికా వైరస్ ను బూచిగా చూపి హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. జాయిన్ విల్లే నగరంలో ముగ్గురు వ్యక్తులు హెల్త్ వర్కర్లుగా నటించి ఓ ఇంట్లోకి అందినకాడికి దోచుకుపోయారు. సెక్యురిటీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. ముగ్గురు దొంగల్లో ఇద్దరు బ్రెజిల్ సైనిక దుస్తులు, ఒకడు హెల్త్ ఇన్స్ పెక్టర్ మాదిరిగా తెల్లని కోటు ధరించాడు. తాము నగర ఆరోగ్యశాఖ అధికారులమని చెప్పి వారు ఇంట్లోకి చొరబడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. డబ్బు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుని వారు ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. జికా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు బ్రెజిల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 220,000 సైనికులు, 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి జికా వ్యాప్తికి కారణమవుతున్న ఎడిస్ ఈజిప్టై దోమ నివారణ చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. హెల్త్ కార్యకర్తల పేరుతో వచ్చే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఈ దోమలతో డెంగీకి చెక్!
మెల్బోర్న్: డెంగీ, జికా వైరస్‌లను ఎదుర్కోడానకి ‘సూపర్ ఇన్ఫెక్టెడ్ దోమల’ను తయారు చేశారు. ఏడిస్ ఏజిప్టి అనే దోమలో వోల్బాకియా అనే బ్యాక్టీరియా స్ట్రైన్స్ను ప్రవేశ పెట్టి అభివృద్ధి చేశారు. వీటితో డెంగీ వ్యాప్తిని అడ్డుకోవచ్చని మెల్బోర్న్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. దోమలోని వోల్బాకియా డెంగీ వైరస్‌తో పాటు జికా, చికన్‌గున్యా వంటి వైరస్‌లను సైతం ప్రభావవంతంగా అడ్డుకోగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డెంగీ తదితర వైరస్ సోకిన వ్యక్తులను ఈ దోమ కుట్టినపుడు వోల్బాకియా బ్యాక్టీరియా స్ట్రైన్స్ ఆ వైరస్‌ను ఇతరుల్లోకి వెళ్లకుండా నిరోధిస్తాయన్నారు. -
కండోమ్‌లు ఓకే.. గర్భస్రావం వద్దు!
జికా వైరస్ వస్తుందన్న భయం ఉన్న మహిళలు కావాలంటే కండోమ్‌ల లాంటి కృత్రిమ గర్భనిరోధక పద్ధతులు వాడొచ్చు గానీ, ఆ పేరు చెప్పి గర్భస్రావానికి వెళ్లడం మాత్రం సరికాదని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి గర్భస్రావం ఒక్కటే మార్గం అనడాన్ని ఆయన నిర్మొహమాటంగా ఖండించారు. 1960 ప్రాంతాల్లో బెల్జియన్ కాంగో ప్రాంతంలో కొంతమంది నన్లపై పదేపదే అత్యాచారాలు జరిగేవని, వాళ్లు గర్భం ధరించకుండా ఉండేందుకు కృత్రిమ గర్భనిరోధ పద్ధతులు పాటించాల్సిందిగా అప్పట్లో పోప్ పాల్ -6 చెప్పిన విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ గుర్తుచేశారు. అబార్షన్లు మానవాళికే మంచివి కావని, అయితే గర్భం రాకుండా ఆపడం మాత్రం తప్పు కాదని ఆయన చెప్పారు. జికా లాంటి సందర్భాలలో అయితే పోప్ పాల్ 6 సూచించిన మార్గాన్ని అనుసరించడం మంచిదని తెలిపారు. గర్భిణులకు ఎక్కువగా సోకుతున్న జికా వైరస్ కారణంగా పుట్టబోయే శిశువులకు కూడా లోపాలు ఉంటున్నాయన్న కారణంగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వవ్యాప్త ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఐదుగంటల్లోనే జికా నిర్ధారణ
బ్రెసీలియా: ప్రమాదకర జికా వైరస్‌ను గుర్తించే పరీక్షను బ్రెజిల్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని సాయంతో ఐదు గంటల వ్యవధిలోనే వైరస్‌ను గుర్తించవచ్చని వారు చెబుతున్నారు. యూనికాంప్ యూనివర్సిటీ పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో సావ్ పాలో యూనివర్సిటీ, సావ్ పాలో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సైతం పాలుపంచుకున్నారు. రోగుల రక్త, మూత్ర, లాలాజల నమూనాల ఆధారంగా వైరస్‌ను గుర్తించవచ్చని వీరు వివరించారు. ప్రస్తుతం బ్రెజిల్లో రెండు రకాలుగా రోగ నిర్ధారణ చేస్తున్నారు. వీటి ద్వారా ఫలితాలు వెలువడేందుకు ఐదు నుంచి ఎనిమిది రోజుల సమయం పడుతోంది. దీంతో ప్రస్తుత పరిశోధనకు ప్రాముఖ్యం ఏర్పడింది. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రయోగించే అవకాశం ఉంది. -
ప్రయోగ దశలో జికా వ్యాక్సీన్లు!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్‌ను నియంత్రించడంలో భారత్ ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ వైరస్‌తో పోరాడేందుకు వ్యాక్సిన్లను తీసుకురానున్న హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ వాటిపై క్లినికల్ ట్రయల్స్ చేపడుతోంది.. ఇవి విజయవంతమైతే భారత్ ప్రపంచ బయోటెక్ రంగంలో అగ్రభాగాన నిలవనుంది. భారత్ బయోటెక్ ఇలాంటి రెండు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసినట్లు ప్రకటించడం తెలిసిందే. జికా మన దేశంలో లేనప్పటికీ భారత్ బయోటెక్ ప్రయోగాలు చేపట్టింది. వ్యాక్సిన్‌కు పేటెంట్ దక్కించుకోవడంతో ఈ ప్రయోగంతో ప్రపంచదేశాల కన్నా భారత్ ముందే ఉందనే చెప్పొచ్చు. భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా నేతృత్వంలోని బృందం ఈ వ్యాక్సిన్లను తయారు చేసింది. అవి క్లినికల్ పరీక్షలకు సిద్ధమయ్యాయి. వాటిని ముందుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి(ఐసీఎంఆర్) నిపుణులు ఆమోదించాలి. ‘జికా వైరస్‌కు వ్యాక్సిన్లను భారత్ బయోటెక్ తయారు చేస్తున్నట్లు తెలిసింది. వైరస్‌ను అడ్డుకోవడంలో ఏ మేరకు సత్ఫలితాలిస్తాయో పరీక్షించి ముందుకు తీసుకుపోతాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. భారత్ బయోటెక్ సంస్థ హెపటైటిస్-బి, పోలియో వైరస్ వంటి వ్యాధులకు వ్యాక్సిన్లను తక్కువ ధరకే అందరికీ లభ్యమయ్యేలా తయారు చేస్తోందని సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలసి డయేరియాను అరికట్టేందుకు గాను ‘రోటావాక్’ వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధిపరిచింది. -
'జికా' ఉచ్చులో 3వేల గర్భిణులు
బొగోటా: గతేడాది బ్రెజిల్ ను వణికించిన ప్రమాదకర జికా వైరస్ ఇప్పుడు కొలంబియా వాసులను హడలెత్తిస్తోంది. 3వేల మందికి పైగా గర్భిణులకు జికా వైరస్ వ్యాపించిందని కొలంబియా ప్రభుత్వ అధికారులు శనివారం అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 25,645 జికా కేసులు నమోదైనట్లు అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ వెల్లడించారు. అమెరికాలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వైద్యులకు జికా నిర్మూలనపై ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా అక్కడ ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. గర్భిణులకు ఈ వైరస్ సోకితే పుట్టే పిల్లలు చిన్న తలతో పుట్టడం జికా లక్షణాల్లో మరొకటి. దీనిపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం స్పందిస్తూ.. జికా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న లాటిన్ అమెరికా దేశాల్లో గర్భిణులకు అబార్షన్, గర్భనిరోధక విధానాలను పాటించాలని అధికారులకు సూచించింది. జికాను అరికట్టడానికి ఎలాంటి వ్యాక్సిన్ గాని, నిర్మూలనకు మందులు గానీ ఇప్పటికీ కనిపెట్టలేదు. దీంతో ప్రత్యామ్నాయ విధానాలవైపు దృష్టిసారించాలని కొలంబియా భావిస్తోంది. -
పరులను ముద్దు పెట్టుకోకండి!
బ్రసిల్లా: దక్షిణ అమెరికా దేశాలను వణికిస్తున్న జికా వైరస్ నోటి లాలాజలం (సలైవా) ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వైద్య నిపుణుల తాజా పరిశోధనలో వెల్లడైంది. దీంతో మహిళలు, ముఖ్యంగా గర్భిణీలు తమకు తెలియని పరులను ముద్దాడ రాదంటూ బ్రెజిల్ వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లైంగిక చర్య ద్వారా కూడా ఈ జికా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని తేలడంతో తప్పనిసరిగా కండోమ్స్‌ను వాడాలంటూ అమెరికా వైద్యాధికారులు తమ పౌరులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. జికా వైరస్ ఉధృతంగా ఉన్న బ్రెజిల్ దేశంలో జికా వైరస్ సోకిన రోగుల లాలాజలం, యూరిన్‌లలో జికా వైరస్ సజీవంగా ఉన్నట్టు తాజాగా తమ పరిశోధనలో వెల్లడైందని బ్రెజిల్ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ ‘ఫియోక్రజ్’ తాజాగా ప్రకటించింది. రోగుల లాలాజలంలో జికా వైరస్ సజీవంగా ఉండడం వల్ల ఆ రోగి మరొకరిని ముద్దు పెట్టుకోవడం ద్వారా ఆ మరొకరికి కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉందని, అయితే ఈ విషయాన్ని వైద్య పరీక్షల ద్వారా ధ్రువీకరించుకోవాల్సి ఉందని ఫియోక్రజ్ వైద్యాధికారులు తెలిపారు. దోమకాటు ద్వారా మనుషులకు వ్యాపించే జికా వైరస్ మానవుల రక్తంలోనే జీవనం సాగిస్తుందని, అది ఒక మనిషి నుంచి మరో మనిషికి సోకే అవకాశం లేదని ఇంతకాలం వైద్య నిపుణులు భావిస్తూ వచ్చారు. జికా వైరస్ సోకిన ఓ రోగి నుంచి తీసిన రక్తాన్ని ఎక్కించిన వ్యక్తికి కూడా వైరస్ సోకిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మెక్సికో నగరానికి వెళ్లి అక్కడ సెక్స్‌లో పాల్గొని వచ్చిన అమెరికన్‌ను కూడా జికా వైరస్ సంక్రమించడంతో లైంగిక చర్యల ద్వారా కూడా ఈ వైరస్ సోకుతుందని వైద్యులు గ్రహించారు. ఇప్పుడు నోటి లాలాజలం ద్వారా కూడా సోకుతుందన్న విషయం కొత్తగా తేలింది. మానవ శరీరాలు స్రవించే ద్రవాల ద్వారా ఇతరులకు ఈ జికా వైరస్ సోకుతుందా, లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించేందుకు తాము పరిశోధనలు జరుపుతున్నామని, ముందు జాగ్రత్తగా రోగుల మంచాలకు, కంచాలకు దూరంగా ఉండాలని దేశ ప్రజలను బ్రెజిల్ వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. బ్రెజిల్లో ప్రస్తుతం 3,700 మంది జికా వైరస్ బారిన పడగా, అమెరికాలో 30 మంది ఈ వైరస్‌తో బాధ పడుతున్నారు. -
అమెరికా ప్రజలారా.. కండోమ్స్ వాడండి!
వాషింగ్టన్: లాటిన్ అమెరికాను గతేడాది హడలెత్తించిన ప్రమాదకర 'జికా' వైరస్ నిర్మూలనకు అగ్రదేశం అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అమెరికాలోనూ జికా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు అక్కడి ప్రభుత్వం కొన్ని సూచనలు, సలహాలు ఇస్తుంది. జికా వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాలకు వెళ్లి స్వదేశానికి తిరిగొచ్చిన మగవాళ్లు కొన్ని రోజులపాటు సెక్స్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. శారీరక సంబంధాలు కొనసాగించాలనుకుంటే కచ్చితంగా కండోమ్ వాడాలని సూచించింది. ముఖ్యంగా భార్యలు గర్భవతులుగా ఉన్నప్పుడు వారితో కలవాలనుకునే భర్తలు నిరోధ్ వాడటం వల్ల జికా వైరస్ భారిన పడకుండా తప్పించుకునే అవకాశం ఉంది. డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సెంటర్ దేశ ప్రజలకు ఈ సూచనలు ప్రకటించింది. జికా ప్రభావం ఉన్న ప్రాంతాలకు వెళ్లొచ్చిన మహిళలు రెండు నుంచి 12 వారాల సమయంలో వైరస్ భారినపడే అవకాశం ఉందని, వాళ్లు కచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వివరించారు. సాధారణంగా దోమలు కుట్టడం వల్ల ప్రాథమికంగా ఈ వ్యాప్తి జరుగుంది.. అయితే, సెక్స్ లో పాల్గొనడం వల్ల కూడా వైరస్ వ్యాపిస్తుందని భావించిన సీడీసీ అమెరికా వాసులను హెచ్చిరించింది. -
మానవాళికి మరో సవాలు
ప్రపంచం ఆరోగ్యపరమైన మరో కొత్త సవాలును ఎదుర్కొంటోంది. ఎబోలా భయం నుంచి కోలుకుంటున్న ప్రపంచానికి జికా వైరస్ కలవరం కలిగిస్తోంది. జికా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర అంతర్జాతీయ విపత్తుగా పరిగణించి ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వ్యాధి ప్రబలిన లాటిన్ అమెరికన్ దేశాలకు ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. 2013-15 మధ్య ఎబోలా వైరస్ కోరలకు చిక్కి పశ్చిమ ఆఫ్రికాలో పదకొండు వేల మందికి పైగా మృత్యువు వాతబడ్డారు. జికా అలాంటి ప్రాణాంతక వైరస్ కాదు. పైగా దోమల ద్వారా సోకేది. ఆ వైరస్ సోకిన వారిలో 80 శాతానికి వ్యాధి లక్షణాలే కనిపించవు. మిగతా వారిలో సైతం ఈ వైరస్ కొద్దిపాటి జ్వరం వంటి నిరపాయకరమైన లక్షణాలకే పరిమిత మవుతుంది. ఆ వైరస్ సోకిన తల్లుల నుంచి గర్భస్త, నవజాత శిశువులకు మైక్రోసఫలీ అనే చికిత్సలేని నాడీసంబంధమైన రుగ్మత కలుగుతుందనే అనుమా నాలు బలంగా ఉన్నాయి. ఈ వైకల్యం వల్ల బిడ్డ తల చాలా చిన్నదిగా, విరూపమై ఉంటుంది. అలాంటి బిడ్డల భవితవ్యం ఏమిటో వైద్యులూ చెప్పలేరు. మంద బుద్ధులు కావడం నుంచి చక్రాల కుర్చీకో, మంచానికో అంటిపెట్టుకుని గడపాల్సి రావడం వరకు వివిధ స్థాయిలలో నాడీమండల సంబంధ వైకల్యానికి గురి కావచ్చు. తల్లిదండ్రుల పాలిట పీడకలలాంటి మైక్రోసఫలీ కొత్తదేమీ కాదు. ఒక్క అమెరికాలోనే ఏటా 25,000 మైక్రోసఫలీ కేసులు నమోదవుతున్నాయి. ఇంత వరకు అంతుబట్టనిదిగా ఉన్న ఆ రుగ్మతకు కారణం జికా వైరస్ కావచ్చని ఇప్పుడు భావిస్తున్నారు. గత ఏడాది మేలో బ్రెజిల్లో జికా వైరస్ ప్రబలినప్పటి నుంచి ఈ అనుమానాలు బలపడుతూ వస్తున్నాయే తప్ప ఇదమిత్థంగా నిర్ధారణ కాలేదు. ఆ కారణ ంగానే జికా సమస్యను భూతద్దాలలో చూపుతున్నారనే విమర్శలూ వినవస్తున్నాయి. ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్ ప్రబలే ముప్పు గురించి ఎంతో సమాచారం ముందుగానే పోగుపడి ఉన్నా, ఆ వ్యాధి విరుచు కుపడే వరకు పట్టించుకోని డబ్ల్యూహెచ్ఓ వంటి అంతర్జాతీయ సంస్థలు జికా వైరస్ గురించి అనవసర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయని వారి వాదన. ఏది ఏమైనా ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే వ్యాధులను, ప్రత్యేకించి సంక్రమిత వ్యాధులను... అవి ఎంత హానికరమైనవనే దానితో నిమిత్తం లేకుండానే ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సమాజం అత్యుత్తమంగా సంసిద్ధం కావడ మెలాగనేదే అసలు సమస్య. మైక్రోసఫలీకి జికా కారణమనే భయం నిజమని తేలితే, ఆ వ్యాధి నిరోధక శక్తిని కలిగించే వాక్సిన్లను కనిపెట్టడం, అందరికీ అందుబాటులోకి తేవడమే శాశ్వత పరిష్కారం కావచ్చు. కాని అందుకు సమయం పడుతుంది. అయితే జికా వైరస్ మనుషులకు సోకేది మాత్రం దోమల ద్వారానే. కాబట్టి ఇప్పటికైతే దోమలను నిర్మూలించడమే జికా వైరస్‌ను అరికట్టడానికి ఉన్న మార్గం. దోమల ద్వారా మనిషికి సంక్రమించిన జికా వైరస్ లైంగిక సంబంధం ద్వారా భాగస్వామికి కూడా సోకవచ్చని టెక్సాస్ పరిశోధకులు అంటున్నారు. అది రూఢి అయితే జికా సమస్య మరింత సంక్లిష్టంగా మారుతుంది. హెచ్ఐవీ వైరస్ వ్యాప్తిని అదుపుచేయగలిగినా, పూర్తిగా నిర్మూలించలేకపోయాం. ప్రత్యేకించి మన దేశం వంటి అభివృద్ధిచెందుతున్న దేశాలలో ఆ వైరస్ ఇంకా ముఖ్య సమస్యగానే ఉంది. జికా అప్పుడు హెచ్ఐవీకి తోడు మరో పీడగా మారుతుంది. దోమలను నిర్మూలించిన అమెరికాలాంటి అభివృద్ధిచెందిన దేశాలకు కూడా జికా వైరస్ నుంచి పూర్తి రక్షణ ఉండదు. జికా వైరస్‌ను వ్యాప్తి చేసే ఎడీజ్ ఎజిప్టీ దోమ సహా అన్ని రకాల దోమల వ్యాప్తికి, వాటితో పాటూ వ్యాధులు ప్రబలడానికి వేడి, తేమ పరిస్థితులు అనువైనవి. నేటి ప్రపంచీకరణ శకంలో వ్యాధులు కూడా ఖండఖండాంతరాలకు అతివేగంగా వ్యాపిస్తున్నాయి. లాటిన్ అమెరికా దేశాలకు ప్రయాణాలను మానుకోవడం జికా వైరస్ వ్యాప్తికి తాత్కాలిక నివారణేగానీ పరిష్కారం కాదు. ప్రపంచీకరణ ఫలితంగా కిక్కిరిసిన నగరాలు, మురికివాడలు అతి వేగంగా పెరిగి పోతున్నాయి. పట్టణీకరణ అంటేనే దట్టమైన పురాతన అరణ్యాలు అంతరించి పోవడంగా మారింది. మారుమూల అటవీ ప్రాంతాలకు పరిమితమైన ప్రమా దకర వ్యాధి కారక వైరస్లు అక్కడి వృక్ష, జంతు జాతులతో పాటూ అంతరించి పోయేవి కావు. జనారణ్యాలు వాటి కొత్త ఆవాసాలవుతాయి. అడవులలో కంటే మరింత వేగంగా వృద్ధి చె ందే అనుకూల పరిస్థితులను కల్పిస్తాయి. హెచ్ఐవీ, డెంగ్యూ, చికెన్‌గున్యా, ఎబోలా అలా కొత్తవిగా మానవాళిని చుట్టుకుంటున్న పాత వైరస్‌లే. జికా వైరస్ కూడా ఉగాండాలోని జికా అడవులలో పరిశోధకులకు మొదట కనిపించిన వైరసే. ప్రపంచీకరణ వల్ల భూతాపం అసాధారణంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతు న్నాయి. పట్టణీకరణతోపాటూ మురికివాడల విస్తరణ అనివార్యంగా మారింది. దీంతో కొత్త వ్యాధులు వృద్ధి చెందడానికి కావలసిన పరిస్థితులు పెంపొందు తున్నాయి. ప్రపంచ స్థాయిలో ఎప్పటికప్పుడు ఆరోగ్యపరమైన కొత్త సవాళ్లను ఎదుర్కోవడం అనివార్యంగా మారుతోంది. ఎబోలా, జికా వంటి వైరస్లు మానవ సృష్టి కాదు. అనర్థదాయకమైన పురాతన హరిత వనాల హననం, హేతువిరుద్ధమైన పట్టణీకరణ, వాతావరణ మార్పుల వంటి మానవ తప్పిదాల వల్లనే అవి ప్రపంచ సమస్యలుగా మారుతున్నాయనే గుర్తింపు అవసరం. కొత్త, పాత వ్యాధుల నివారణ , చికిత్స, శిక్షణ, అత్యవసర సహాయక వ్యవస్థలను అంతర్జాతీయస్థాయిలో శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటు చేయడం ఆవశ్యకం. అంతర్జాతీయ సమాజానికి నేతృత్వం వహిస్తున్న అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు ఆ బాధ్యతను స్వీకరించాలి. -
టాటా మెటార్స్ను భయపెడుతున్న 'జికా'
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న 'జికా' వైరస్ ఇపుడు వాహనాల తయారీ సంస్థను కూడా వణికిస్తోంది. గర్భిణుల పాలిట శాపంగా పరిణమించిన ఈ వైరస్ ఇపుడు టాటా మోటార్స్ ను భయపెడుతోంది. అందుకే ఆ సంస్థ ఆలోచనలో పడింది. ఈడిస్ ఈజిప్టీ జాతికి చెందిన దోమల కారణంగా వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ వల్ల టాటా మోటార్స్‌కు ఏమి నష్టం అనుకుంటున్నారా... అదేనండి.. 'జికా' అనే పేరులోనే ఉంది భయమంతా.. జికా పేరుతో ఒక కొత్త కారును లాంచ్ చేసేందుకు సంస్థ ప్లాన్ చేసింది. చిన్న కార్ల సెగ్మెంట్ లో జికా ద్వారా వినియోగదారులును ఆకర్షించాలని పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించింది. త్వరలోనే జరగబోయే ఎక్స్ పో లో ఈ జికాను ప్రదర్శనకు పెట్టాలని యోచిస్తోంది. ఇంతలో శిశువుల పాలిట ప్రాణ సంకటంగా మారిని జికా పేరును ఈ కొత్త వాహనానికి పెట్టడం అంత శుభం కాదని సంస్థ భావిస్తోంది. ఈ ప్రమాదకర వైరస్ పేరుకు దగ్గరగా వున్న జికా పేరును తమ కొత్త వాహనానికి పెట్టడం అంత శ్రేయస్కరం కాదనే ఆలోచనలో పడింది. అందుకే కొత్త పేరును పరిశీలిస్తున్న విషయాన్ని స్వయంగా ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. మొత్తం పరిస్థితిని పరిశీలిస్తున్నామని.. ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సంస్థ ప్రతినిధి మినారి షా ముంబై లో తెలిపారు. ఈ మధ్య కాలంలో జికా పేరుతో టాటా మోటార్స్ జిప్పీ కారును బాగా ప్రచారంలోకి తెచ్చిన విషయం తెలిసిందే. బార్సిలోనా ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు లియోనిల్ మెస్సీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. కాగా ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్ గర్భిణుల నుంచి పిల్లలకు సోకి ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇటీవల స్పష్టం చేసింది. జికా వైరస్‌పై కొలంబియా హెల్త్ ఇనిస్టిట్యూట్ జరిపిన పరిశీలనలో దాదాపు 2000 మంది కొలంబియన్ గర్భిణులకు జికా సోకినట్లు ధ్రువీకరణ అయింది. ఈ వైరస్‌తో సంభవించే మైక్రో సెఫలీ అనే వ్యాధి.. పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తల చిన్నదిగా పిల్లలు పుడతారు. జికా వైరస్‌ను నివారించడానికి ఎలాంటి మెడిసిన్ లేదని..గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. -
2 వేల మంది గర్భిణులపై 'జికా' ప్రభావం
బోగొటా: గత ఏడాది బ్రెజిల్ వాసులను గజగజలాడించిన జికా వైరస్ ప్రస్తుతం కొలంబియాలో వ్యాపించింది. ఈ వైరస్ లాటిన్ అమెరికాలో వేగంగా విస్తరించి అక్కడి ప్రజలను వణికిస్తోంది. దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో జికా ప్రభావం చాలా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం కొలంబియాలోనే 2000 మందికి పైగా గర్భిణిలకు జికా వైరస్ బారిన పడ్డారని స్థానిక అధికారులు శనివారం వెల్లడించారు. అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందన్నది అర్థమవుతోంది. గతేడాది 15 లక్షల మంది బ్రెజిల్ వాసులు జికా బారిన పడ్డ విషయం విదితమే. పుట్టబోయే పిల్లలపై జికా ప్రభావం ఉండటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లులపై జికా ప్రభావం చూపితే పుట్టే పిల్లల్లో బ్రెయిన్ సంబంధ వ్యాధులు వస్తాయి. తల చిన్న పరిమాణంలో ఉన్న పిల్లలు పుడతారు. మొత్తంగా 20, 297 జికా వైరస్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 1,050 మందికి జికా ఉన్నట్లు నిర్ధారించగా, మరో 17,115 మంది శాంపిల్స్ ఇంకా ల్యాబోరేటరీలలో ఉన్నాయని వాటిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తారు. బ్రెజిల్ తర్వాత జికా ప్రభావం ఎక్కువగా దేశం కొలంబియా అని అధికారులు చెబుతున్నారు. -
అబార్షన్లకు అనుమతివ్వండి..
రియోడిజెనీరో: జికా వైరస్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్న బ్రెజిల్ వాసులు అబార్షన్లకు అనుమతివ్వాలని కోరుతున్నారు. బ్రెజిల్ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు జికా వైరస్ బారినపడిన వారికి అబార్షన్‌కు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. బ్రెజిల్ చట్టాల ప్రకారం అబార్షన్లు చట్టవిరుద్ధం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో.. రేప్‌కు గురైన బాధితులకు, పిండంలో మెదడు సంబంధింత రుగ్మతలు ఉన్నప్పుడు మాత్రమే అబార్షన్‌కు అనుమతిస్తారు. ఈ సంవత్సరం లాటిన్ అమెరికా దేశాల్లో 40 లక్షల మంది జికా వైరస్ వైరస్ బారినపడే అవకాశాలు ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జికా మహమ్మారిని నిర్మూలించేందుకు అబార్షన్లకు అనుమతివ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. -
మోగుతున్న ‘జికా’ గంటలు
* వేగంగా వ్యాప్తి చెందుతున్న జికా వైరస్ * ఆందోళనలో బ్రెజిల్, అమెరికా ప్రజలు * లోతుగా అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు * గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచన * 23 దేశాల్లో వ్యాప్తి చెందినట్లు డబ్ల్యూహెచ్ఓ స్పష్టీకరణ రియో డీ జెనిరో: ప్రమాదకరమైన జికా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈడిస్ ఈజిప్టీ జాతికి చెందిన దోమల కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. చిన్న తలతో పుట్టడం, మెదడు ఎదగకపోవడం ఈ వ్యాధి లక్షణాలు. ఇప్పటి వరకు దీని నివారణకు వ్యాక్సిన్‌గానీ చికిత్సగానీ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని హెల్త్ అధికారులు సూచిస్తున్నారు. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. తొందర్లోనే దాదాపు నలభై లక్షల మందికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ మార్గరేట్ చాన్ తెలిపారు. ఫిబ్రవరి 1న అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అమెరికాతో పాటు 23 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు వెల్లడించారు. అయితే అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలా వద్దా అనే దానిపై ఫిబ్రవరి 1న నిర్ణయిస్తామని పేర్కొన్నారు. తొలిసారిగా 1947లో ఉగాండాలోని ఓ కోతిలో ఈ వైరస్‌ను కనుగొన్నారని వివరించారు. బ్రెజిల్లో భిన్న గణాంకాలు.. బ్రెజిల్లో తొలుత ఊహించిన దాని కన్నా చిన్న తలతో పుట్టిన కేసులు తక్కువ ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. పరిశోధనల్లో ఏదైనా లోపం ఉండటం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ వ్యాధికి, జికా వైరస్ వ్యాప్తికి మధ్య ఉన్న సంబంధాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు చిన్న తలతో పుట్టిన దాదాపు 4,180 మంది జికా వైరస్ అనుమానితులను ఆరోగ్య అధికారులు పరీక్షించారు. ఈ లోపానికి జికా వైరస్ కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. జికా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న ఈడిస్ ఈజిప్టీ అనే జాతి దోమల నిర్మూలనకు దాదాపు 2.2 లక్షల మంది సైనికులను రంగంలోకి దింపినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 700 కేసులను అధ్యయనం చేయగా 270 మంది జికా వైరస్ బారిన పడ్డారని నిర్ధారించినట్లు బుధవారం బ్రెజిల్ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. అయితే దీన్ని కొందరు నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ఈ జికా వైరస్ వల్లే పిల్లలు చిన్న తలతో పుడుతున్నారనే విషయం ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదని, దీన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ కో డెరైక్టర్ పాల్ రోప్ పేర్కొన్నారు. జికాను పూర్తిగా నిర్మూలించే వరకు గర్భిణులు వైరస్ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో పర్యటించకూడదని బ్రెజిల్ అధికారులు సూచించారు. కాగా, జికా వైరస్‌ను పారదోలేందుకు కలసికట్టుగా పోరాడుదామని పొరుగు దేశాలను బ్రెజిల్ అభ్యర్థించింది. అటు ఫ్రాన్స్ కూడా గర్భిణులు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. వైరస్‌పై యుద్ధం ప్రకటించిన యూఎస్.. జికా వైరస్ నిర్మూలనకు వ్యాక్సిన్ రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చిన నేపథ్యంలో యూఎస్.. ప్రయోగాలు ముమ్మరం చేసింది. వ్యాక్సిన్, చికిత్స విధానాలను కనుగొనేందుకు యూఎస్ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా వర్జీనియాలో ఒకరు, అర్కన్సాస్‌లో మరొకరు జికా వైరస్ బారిన పడినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. ఇప్పటివరకు అమెరికాలో ఈ వ్యాధి బారినపడినవారి సంఖ్య 21కి చేరింది. -
అమెరికాను వణికిస్తున్న వైరస్..
న్యూయార్క్: గత ఏడాది బ్రెజిల్ వాసులను గజగజలాడించిన జికా వైరస్ ప్రస్తుతం అమెరికాలో వ్యాపించింది. ఈ వైరస్ లాటిన్ అమెరికాలో వేగంగా విస్తరించి అక్కడి ప్రజలను వణికిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్‌లోనూ పలు చోట్ల జికా వైరస్ కేసులు నమోదైనట్లు అధికారులు శనివారం వెల్లడించారు. వైరస్ వ్యాప్తితో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. న్యూయార్క్‌లో నమోదైన మూడు జికా వైరస్ కేసులలో బాధితులు వైరస్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి వచ్చినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ముగ్గురిలో ఒకరికి నయంకాగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. లాటిన్ అమెరికా, కరేబియన్లలో 22 జికా వైరస్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా అధికారులు గర్భిణీ స్త్రీలను హెచ్చరించారు. జికా వైరస్ ఎడిస్ ఈజిప్టీ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకితే చిన్నారులు అసాధారణంగా చిన్న తలతో జన్మిస్తారు. ఇది చిన్నారుల మెదడుపై ప్రభావం చూపుతుంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ కారణంగా మెదడులో లోపాలతో పిల్లలు పుడతారు. ఈ వ్యాధిని అరికట్టేంత వరకు తమ దేశ మహిళలు గర్భం దాల్చకుండా ఉండడమే ఉత్తమమని అధికారులు పేర్కొన్నారు. కొలంబియాలో దాదాపు13,500 కేసులు, బ్రెజిల్లో 3,800కు పైగా జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. దోమల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించడంతప్ప, ఈ వైరస్ వ్యాప్తిని ఏవిధంగా అరికట్టాలన్న దానిపై ఇప్పటివరకు వైద్యులకు స్పష్టత లేదు. జికా వైరస్ గా పిలవబడుతున్న వెస్ట్ నిలే వ్యాధి కారకాన్ని 70 ఏళ్ల క్రితం ఆఫ్రికా అడవి కోతుల్లో తొలిసారిగా గుర్తించారు. దీని కారణంగా నాడీ సంబంధ రుగ్మతలు సంభవిస్తాయని, కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశముందని అధికారులు వివరించారు. -
బ్రెజిల్ ను వణికిస్తున్న జికా వైరస్
పెర్నాంబుకొ: బ్రెజిల్ వాసులను జికా వైరస్ వణికిస్తోంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ కారణంగా మెదడులో లోపాలతో పుడుతున్న శిశువుల సంఖ్య పెరుగుతుండడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జికా వైరస్ గా పిలవబడుతున్న వెస్ట్ నిలే వ్యాధికారకాన్ని 70 ఏళ్ల క్రితం ఆఫ్రికా అడవి కోతుల్లో తొలిసారి గుర్తించారు. దీని కారణంగా నాడీ సంబంధ రుగ్మతలు సంభవిస్తాయని, కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశముందని బ్రెజిల్ ఆరోగ్య శాఖ తెలిపింది. శుష్కించిన శిరస్సు(మైక్రోసెఫలే)తో జన్మించిన శిశువుల్లో జికా వైరస్ ను గుర్తించినట్టు వెల్లడించింది. ఇలాంటి శిశువులకు జన్మనిచ్చిన తల్లుల అపరాయు ద్రవంలోనూ ఈ వైరస్ ను కనుగొన్నట్టు తెలిపింది. జికా వైరస్ కారణంగా ప్రపంచ సైన్స్ పరిశోధనా రంగం మునుపెన్నడూ లేని క్లిష్గట పరిస్థితిని ఎదుర్కొంటోందని పేర్కొంది. బ్రెజిల్ లో ఈ ఏడాది ఇప్పటివరకు 2400 మందిపైగా మైక్రోసెఫలే బారిన పడ్డారు. 29 మంది చనిపోయారు. గతేడాది 147 మైక్రోసెఫలే కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పెర్నాంబుకొ రాష్ట్రంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. అయితే జికా వైరస్ వ్యాప్తిని ఏవిధంగా నిరోధించాలనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే దోమల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జికా వైరస్ ను వ్యాప్తి చేసే ఎడిస్ ఏజిప్టి దోమలను నియత్రించేందుకు ఇంటింటికీ దోమ నిర్మూలన బృందాలను పంపుతోంది.