'జికా' ఉచ్చులో 3వేల గర్భిణులు | Over 3,000 Pregnant Women In Colombia Have Zika Virus | Sakshi
Sakshi News home page

'జికా' ఉచ్చులో 3వేల గర్భిణులు

Published Sun, Feb 7 2016 9:33 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM

'జికా' ఉచ్చులో 3వేల గర్భిణులు

'జికా' ఉచ్చులో 3వేల గర్భిణులు

బొగోటా: గతేడాది బ్రెజిల్ ను వణికించిన ప్రమాదకర జికా వైరస్ ఇప్పుడు కొలంబియా వాసులను హడలెత్తిస్తోంది. 3వేల మందికి పైగా గర్భిణులకు జికా వైరస్ వ్యాపించిందని కొలంబియా ప్రభుత్వ అధికారులు శనివారం అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 25,645 జికా కేసులు నమోదైనట్లు అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్  వెల్లడించారు. అమెరికాలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వైద్యులకు జికా నిర్మూలనపై ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా అక్కడ ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే.

గర్భిణులకు ఈ వైరస్ సోకితే పుట్టే పిల్లలు చిన్న తలతో పుట్టడం జికా లక్షణాల్లో మరొకటి. దీనిపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం స్పందిస్తూ.. జికా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న లాటిన్ అమెరికా దేశాల్లో గర్భిణులకు అబార్షన్, గర్భనిరోధక విధానాలను పాటించాలని అధికారులకు సూచించింది. జికాను అరికట్టడానికి ఎలాంటి వ్యాక్సిన్ గాని, నిర్మూలనకు మందులు గానీ ఇప్పటికీ కనిపెట్టలేదు. దీంతో ప్రత్యామ్నాయ విధానాలవైపు దృష్టిసారించాలని కొలంబియా భావిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement