
జికా భయంతో గర్భస్రావాలు
లండన్: జికా వైరస్ భయంతో లాటిన్ అమెరికా దేశాల్లో అనేక మంది గర్భిణులు గర్భస్రావాలు చేయించుకుంటున్నారు. అయితే అక్కడి చాలా దేశాల్లో ఇది చట్టవిరుద్ధమైనందున వారు ఇందుకోసం సురక్షితం కాని మార్గాలను ఎంచుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండానే గర్భస్రావానికి కారణమయ్యే మందులను వాడుతున్నారు. ఆనక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. జికా వైరస్ ప్రభావం మనుషులపైన కన్నా, గర్భంలో ఉన్న శిశువుపై అధికంగా ఉంటుందని అమెరికా ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.