2 వేల మంది గర్భిణులపై 'జికా' ప్రభావం
బోగొటా: గత ఏడాది బ్రెజిల్ వాసులను గజగజలాడించిన జికా వైరస్ ప్రస్తుతం కొలంబియాలో వ్యాపించింది. ఈ వైరస్ లాటిన్ అమెరికాలో వేగంగా విస్తరించి అక్కడి ప్రజలను వణికిస్తోంది. దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో జికా ప్రభావం చాలా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం కొలంబియాలోనే 2000 మందికి పైగా గర్భిణిలకు జికా వైరస్ బారిన పడ్డారని స్థానిక అధికారులు శనివారం వెల్లడించారు. అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందన్నది అర్థమవుతోంది. గతేడాది 15 లక్షల మంది బ్రెజిల్ వాసులు జికా బారిన పడ్డ విషయం విదితమే.
పుట్టబోయే పిల్లలపై జికా ప్రభావం ఉండటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లులపై జికా ప్రభావం చూపితే పుట్టే పిల్లల్లో బ్రెయిన్ సంబంధ వ్యాధులు వస్తాయి. తల చిన్న పరిమాణంలో ఉన్న పిల్లలు పుడతారు. మొత్తంగా 20, 297 జికా వైరస్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 1,050 మందికి జికా ఉన్నట్లు నిర్ధారించగా, మరో 17,115 మంది శాంపిల్స్ ఇంకా ల్యాబోరేటరీలలో ఉన్నాయని వాటిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తారు. బ్రెజిల్ తర్వాత జికా ప్రభావం ఎక్కువగా దేశం కొలంబియా అని అధికారులు చెబుతున్నారు.